
Harshaneeyam
530 episodes — Page 8 of 11

S2 Ep 515Sri.D.V.Girish on forest - 1 (వనవాసి ధారావాహికలో భాగంగా )
A resident of Chikmagalur, Sri.D.V. Girish has been a staunch wildlife conservationist for over two decades. His most significant contribution to conservation was the catalytic role he played in facilitating the government sponsored voluntary relocation of more than 450 families from Bhadra in 2001-2002. Significantly, he continues to maintain an excellent rapport with the resettled families and is involved in ensuring their well being to this day. The Bhadra resettlement is widely regarded as one of India’s best and most equitable resettlement projects.Additional Information - https://wildcat-c.org/*Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Speakers, Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees / speakers are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 513Himalayan Ecology - Ms.Manshi Asher - 3 (English)
వనవాసి ధారావాహికలో భాగంగా , ఈ ఎపిసోడ్ లో హిమాలయ పర్యావరణ వ్యవస్థ ప్రత్యేకత , మానవ కట్టడాల వల్ల అక్కడ ఏర్పడుతున్న ప్రమాదకర పరిస్థితులపై మానసి అషేర్ గారు (Ms.Manshi Asher) మనతో సంభాషిస్తారు.For more information : https://www.indiawaterportal.org/articles/dams-and-distress-himalayasDisclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 512Himalayan Ecology - Ms.Manshi Asher - 2 (English)
వనవాసి ధారావాహికలో భాగంగా , ఈ ఎపిసోడ్ లో హిమాలయ పర్యావరణ వ్యవస్థ ప్రత్యేకత , మానవ కట్టడాల వల్ల అక్కడ ఏర్పడుతున్న ప్రమాదకర పరిస్థితులపై మానసి అషేర్ గారు (Ms.Manshi Asher) మనతో సంభాషిస్తారు.For more information : https://www.indiawaterportal.org/articles/dams-and-distress-himalayasDisclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 511Himalayan Ecology - Ms.Manshi Asher - 1 (English)
వనవాసి ధారావాహికలో భాగంగా , ఈ ఎపిసోడ్ లో హిమాలయ పర్యావరణ వ్యవస్థ ప్రత్యేకత , మానవ కట్టడాల వల్ల అక్కడ ఏర్పడుతున్న ప్రమాదకర పరిస్థితులపై మానసి అషేర్ గారు (Ms.Manshi Asher) మనతో సంభాషిస్తారు.For more information : https://www.indiawaterportal.org/articles/dams-and-distress-himalayasDisclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 510Teesta Hydro Power Project - Indigenous Lepcha Tribe : Activist Mayalmit Lepcha
వనవాసి ధారావాహికలో భాగంగా ఈ ఎపిసోడ్లో సిక్కింలో అనాదిగా నివసిస్తున్న ‘లేప్చా’ తెగ కు చెందిన ప్రజల కు తీస్తా నదితో వున్న సంబంధం , తీస్తా హైడ్రో డాం నిర్మాణం వల్ల వారు పడుతున్న ఇబ్బందుల గురించి మయాల్మిత్ లేప్చా గారు (Ms.Mayalmit Lepche) మనతో సంభాషిస్తారు. Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 247'వనవాసి' శబ్దరూపకం - సమీక్ష
వనవాసి ఆడియో ధారావాహిక ఇప్పటికి 15 భాగాలు ప్రసారం చెయ్యడం జరిగింది.ఇంకొక 45 భాగాలు పూర్తి చెయ్యవలసి వుంది.దాదాపు వందేళ్ల క్రితం ప్రచురింపబడ్డ ' వనవాసి' నవల, మానవుడికి ప్రకృతికి మధ్య , మారుతున్న సంబంధం గురించి, ఒక రచయిత స్పందన.ఇందులో భాగంగా, దేశ వ్యాప్తంగా , పర్యావరణ సంరక్షణ కై కృషి చేస్తున్న కార్యకర్తలు , సామాజిక సంస్థల ప్రతినిధులు, వివిధ పర్యావరణ వ్యవస్థలపై పని చేస్తున్న నిపుణులు, ఇలా అనేకమందితో హర్షణీయం జరిపిన సంభాషణలు (నలభైకి పైగా ) ఈ శబ్ద రూపకం ద్వారా మీకు అందించడం జరుగుతుంది.హర్షణీయంలో ఇప్పటిదాకా, ఛత్తీస్‌గఢ్ లో హస్దేవ్ అరణ్యంలో జరుగుతున్న కోల్ మైనింగ్ వాటి దుష్ప్రభావాలూ , దానిని ఆపడానికి తమ సంస్థద్వారా చేస్తున్న ప్రయత్నం గురించి , శ్రీ ఆలోక్ శుక్లా గారూ, నదుల పునరుజ్జీవనం పై మౌలిక్ సిసోడియా గారు , వనవాసి నవలపై తనదైన విశ్లేషణ తో సత్య శ్రీనివాస్ గారు, తెలుగు రాష్ట్రాలలో ఆదివాసీ హక్కుల గురించి ఈ ఏ ఎస్ శర్మ గారు, శక్తీ ఫౌండేషన్ శివరామకృష్ణ గారు, ఆదివాసీ జీవితాలపై శ్రీ పతంజలి శాస్త్రి గారు, మడ అడవుల పరిరక్షణ పై కృషి చేసిన తూపల్లి రవిశంకర్ గారు మనతో మాట్లాడటం జరిగింది.ఈ విడత ప్రసారం చెయ్యబోయే భాగాలలో , హిమాలయ పర్యావరణ వ్యవస్థ ప్రత్యేకత , మానవ కట్టడాల వల్ల అక్కడ ఏర్పడుతున్న ప్రమాదకర పరిస్థితులపై మానసి అషేర్ గారు (Ms.Manshi Asher) , సిక్కింలో అనాదిగా నివసిస్తున్న 'లేప్చే' తెగ కు చెందిన ప్రజల కు తీస్తా నదితో వున్న సంబంధం , తీస్తా హైడ్రో డాం నిర్మాణం వల్ల వారు పడుతున్న ఇబ్బందుల గురించి మయాల్మిత్ లేప్చే గారు (Ms.Mayalmit Lepche), అలానే అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న కోల్ మైనింగ్ పై పోరాడుతూ కాల్పులకు గురైన ఆగ్నేస్ ఖార్షింగ్ గారు (Ms.Agnes Kharshiing) మనతో సంభాషిస్తారు.ఈ సంభాషణలన్నిటిలో ప్రతిధ్వనిస్తున్న ముఖ్య అంశాలు :అటవీ కొండ ప్రాంతాల్లో భూమిని నీటిని హస్తగతం చేసుకుని, గాలిని కలుషితం చేస్తూ, అక్కడి నివసించే వారి చట్టపరమైన హక్కులను కాలదన్ని వారి జీవితాలను ఛిద్రం చేస్తూ నాగరిక ప్రపంచం కడుతున్న హైడ్రో పవర్ డాంలూ , మైనింగ్ కోసం జరుపుతున్న తవ్వకాలూ, దీనివల్ల జరుగుతున్న పర్యావరణ విధ్వంసం, తద్వారా వాతావరణంలో వస్తున్న, రాబోయే పెను మార్పులూ.మనదేశంలోనే కాక ప్రపంచ దేశాలన్నిటిలో, అభివృద్ధి పేరుతో ఇదే రకంగా పర్యావరణ వ్యవస్థ నాశనం కావటం , ప్రకృతి ఆలంబనగా జీవించే వారు తీవ్రమైన ఇబ్బందులకు గురికావటం అనేది చాలా ఆందోళన చెందవలసిన విషయం. వనవాసి నవలలో ప్రస్తావించిన పర్యావరణ , సామాజిక అంశాలను , ఇప్పుడున్న పరిస్థితులకు అన్వయించడం, ఈ శబ్దరూపకం ద్వారా హర్షణీయం చేస్తున్న ఒక ప్రయత్నం.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 508Protecting our Rivers - Tarun Bharat Sangh Moulik Sisodia part II
వనవాసి ధారావాహిక లో భాగంగా పర్యావరణ సమస్యలపై 25 మంది పర్యావరణ వేత్తలతో సంభాషించి శ్రోతలకు అందించాలని హర్షణీయం సంకల్పించింది. శ్రీ. మౌలిక్ సిసోదియా గారు ఈ ఎపిసోడ్లో పర్యావరణంలో వస్తున్న మార్పులు , నీటి కొరతను ఎదుర్కొనడం గురించి వివరించడం జరిగింది.https://tarunbharatsangh.in/contact-us/This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 507Protecting our Rivers - Tarun Bharat Sangh's Moulik Sisodia Part I
వనవాసి ధారావాహిక లో భాగంగా పర్యావరణ సమస్యలపై 25 మంది పర్యావరణ వేత్తలతో సంభాషించి శ్రోతలకు అందించాలని హర్షణీయం సంకల్పించింది. శ్రీ. మౌలిక్ సిసోదియా గారు ఈ ఎపిసోడ్లో రాజస్థాన్ తూర్పు ప్రాంత గ్రామాలలో నీటి కొరత తీర్చడానికి, శ్రీ రాజేంద్ర సింగ్ గారు (The water Man of India )స్థాపించిన 'తరుణ్ భారత్ సంఘ్' గురించి , సరిస్కా టైగర్ రిసర్వ్ లో మైనింగ్ నిలిపివేయడానికి చేసిన కృషి గురించి వివరించారు.నదీజలాల పరిరక్షణకై , ‘ తరుణ్ భారత్ సంఘ్’ సభ్యులను సంప్రదించాలంటే – https://tarunbharatsangh.in/contact-us/This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 506పర్యావరణ వేత్త , కవి , శ్రీ సత్య శ్రీనివాస్ గారి విశ్లేషణ - వనవాసి నవలపై -2 వ భాగం
ఈ ఎపిసోడ్ లో అతిధి, ముప్ఫయి ఏళ్ల పైబడి అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలకు పర్యావరణ విషయాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీ. జి.సత్య శ్రీనివాస్ గారు. వనవాసి నవలను సామాజిక, చారిత్రక, సాహిత్య, పర్యావరణ కోణాల్లో విశ్లేషిస్తూ అనేక ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు శ్రీనివాస్ గారు. పర్యావరణ కవిత్వం , చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, పుస్తక పఠనం ఆయన ఇతర అభిరుచులు. శ్రీనివాస్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 504పర్యావరణ వేత్త , కవి , శ్రీ సత్య శ్రీనివాస్ గారి విశ్లేషణ - వనవాసి నవలపై -1 వ భాగం
ఈ ఎపిసోడ్ లో అతిధి, ముప్ఫయి ఏళ్ల పైబడి అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలకు పర్యావరణ విషయాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీ. జి.సత్య శ్రీనివాస్ గారు. వనవాసి నవలను సామాజిక, చారిత్రక, సాహిత్య, పర్యావరణ కోణాల్లో విశ్లేషిస్తూ అనేక ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు శ్రీనివాస్ గారు. పర్యావరణ కవిత్వం , చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, పుస్తక పఠనం ఆయన ఇతర అభిరుచులు. శ్రీనివాస్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 501Janabhigyan Alok Shukla on Hasdeo Deforestation and Coal Mining
వనవాసి ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకై, వివిధ రకాల సమస్యలపై కృషి చేస్తున్న వ్యక్తులను 25 మందిని ఇంటర్వ్యూ చేసి , తెలుగులోకి అనువదించి ప్రసారం చెయ్యాలని హర్షణీయం సంకల్పించింది. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ రాష్త్రం లోని హస్దేవ్ అరణ్యం పరిరక్షణ కై , జనాభిగ్యాన్ అనే సంస్థను స్థాపించి, పోరాడుతున్న శ్రీ.ఆలోక్ శుక్లా ని ఇంటర్వ్యూ చెయ్యడం జరిగింది. అరణ్యంపై ఆధారపడిన గోండు ఆదివాసీ జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న ' కోల్ మైనింగ్ ' , దాని వల్ల పర్యావరణం పై పడుతున్న దుష్ప్రభావం - వీటిపై పోరాడుతున్నారు గత రెండు దశాబ్దాలుగా శ్రీ.శుక్లా. ఈ ఇంటర్వ్యూలో ఆయన , హస్దేవ్ అరణ్యం ప్రత్యేకత గురించి , ఆదివాసీల జీవితం గురించి, చట్టంలో ఆదివాసీల హక్కుల గురించి, ఆదివాసీల చట్టపరమైన, శాంతియుత పోరాటాన్ని గురించి వివరించడం జరిగింది.ప్రస్తుతం ఇంటర్వ్యూ హిందీ లో ప్రసారం చెయ్యడం జరుగుతోంది. తొందరలో తెలుగు అనువాద పాఠం ఆడియో ద్వారా ప్రసారం చెయ్యడం జరుగుతుంది. Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 222ఛాయా రిసోర్సెస్ సెంటర్ - రచయితల , మిత్రుల సమావేశం.
రండి ఛాయ కుటుంబంతో కాసేపు మాట్లాడదాం.నచ్చిన పుస్తకాలు కొనుక్కుందాం.Venue : 11th September from 3PM to 8PM at Ravindra Bharathi This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 221'ఎండమావుల్లో తిమింగలాల వేట'
కె.సభా (జూలై 1, 1923 – నవంబరు 4, 1980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా , నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు.కథను మీకందించడానికి సహకరించిన శ్రీమతి రమణ గారికి కృతజ్ఞతలు. ముక్కంటి సీమలో పెద్ద కాటకం వచ్చింది. క్షామ దేవత విలయతాండవంలో జన పదాలన్నీ అల్లల్లాడి పోయినవి. దప్పిక చల్లార్చుకోవడానికి చుక్కనీరు కూడా లభించని అసహాయ స్థితిలో కొంపాగోడూ వదలి దేశం ఎల్లలు దాటిపోతున్న కూలీల గోడు అవర్ణనీయమై పోయింది.రోజూ పత్రికల్లో ఈ వార్తలే అచ్చు కావడం వల్లా మంత్రి వర్గం, అత్యవసర సమావేశంలో కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకొన్నది. మండలానికొక మంత్రి వెళ్లి అప్పటికప్పుడే కరువు నివారణ కార్యక్రమాలను ప్రారంభించాలని ఎన్ని కోట్లనైనా వెచ్చించి ప్రజలను కాపాడి తీరాలని అమాత్యులందరూ కంకణం కట్టు కొన్నారు.మత్స్య శాఖామాత్యులు రాజాసుందర ప్రకాశ గోవర్ధన శతపధిగారు, కనకాచలం జిల్లా పర్యటనకు బయలుదేరారు. మంత్రిగారి పర్యటన కార్యక్రమాన్నంతా స్థానిక పత్రికలు ప్రముఖంగానే ప్రచురించాలనుకొన్నందున ఆ జిల్లా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అవసరమైన ముందు జాగ్రత్తలన్నీ తీసు కొన్నాడు. దిన వార పత్రికల విలేఖరులనే కాక మాసపత్రికల విలేఖరులను కూడా పిలిపించి కనకాచలంలో ప్రెస్సు కాన్ఫరెన్సును యేర్పాటు చేశాడు.ఆరోజు కనకాచలం ట్రావెలర్సు బంగళాలో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో మత్స్యశాఖామాత్యులు రాజా సుందర ప్రకాశ గోవర్థన శతపధి గారనేక కొత్త విషయాలను వెల్లడించారు.డైనమెట్ పత్రిక విలేఖరి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ మత్స్య శాఖామాత్యులు యిలా అన్నారు. –‘మనం సామ్యవాద యుగంలో ఉన్నాము. రుచిలో బేడిసెలే బాగుంటాయి. నీ బుడ్డపక్కెలు బాగుండవనీ భేదాలుంచుకోరాదు. మనకు కొరదైనా ఒకటే కొరమేనైనా ఒకటే. పూజేపను పెంచుతూ మావురాయిని మరచిపోరాదు. మన నేతల వలె పీతలను కూడా సంరక్షించుకోవాలి. జపానులో నేను గమనించాను. వాళ్లు సీఫుడ్ ను బాగా ఉపయోగించుకొంటారు. ఈ కరువులో ప్రతి చెరువులో జెల్ల లనో ఇసుక దొందులనో పెంచుకోకుంటే దేశం దెబ్బతింటుంది,“మన చెరువుల్లో నీళ్లుంటే గదసార్?” మధ్యలో ప్రశ్నించాడు, సౌదామిని విలేఖరి.“ డోన్ట్ డిస్టర్బ్ మి, దటీజ్ అనదర్ ప్రాబ్లం” అంటూ అమాత్యులు సిగరెట్ ముట్టించి –‘యుసీ … ఈ నత్తలున్నాయే వీటిని పుష్కలంగా పెంచాలి. వాటిలో కొవ్వు పదార్థం యెక్కువ. ప్రతి గుంటలోనూ పెంచే వీలుంది. అన్నట్టు మరచాను. నేను ఇండో చైనా వెళ్లినపుడు అక్కడొక మ్యూజి యంలో నాయెత్తు తాబేలును చూశాను. కాదూ కూడదంటే కొంత మసాలా ఎక్కు వవుతుంది. కాని అది బలే రుచిగా కూడా ఉంటుందని నా నాన్ వెజిటేరియన్ ఫ్రండొ కాయన చెప్పాడు. అతడిపుడు చికాగోలో ఉన్నాడనుకోండి. ఇక్కడ చెరువు లెక్కువేగా?’ ప్రశ్నించాడు గౌరవనీయులైన మత్స్య శాఖామాత్యులు.అందరూ కాకున్నా ఇంచుమించు సగం మంది ఎక్కువనే చెప్పారు. కాని జాజిమల్లె పత్రిక కరస్పాండెంటు మాత్రం ‘అర్థం చెరువులకు పైగా కట్టలు తెగిపోయినవే’ అన్నాడు.“ డజన్ట్ మేటర్. ఆ పని మనది కాదనుకోండి. ఇరిగేషన్ మినిస్టర్ చూస్తారు. మన చెరువుల్లోనే కాదు. ప్రతి బావిలోనూ చేపల్ని పెంచాలి. కరువులో చేపల్ని పెంచే కార్యక్రమం క్రింద కనీసం పది కోట్ల రూపాయలసైనా ప్రత్యేకించమని నేను సి.యం. తో గట్టిగా చెప్పాను. కానీ మా ఫైనాన్స్ మినిస్టర్ ఒప్పుకొంటేగా. చివరికి యాభై లక్ష లిచ్చాడు. కడకు నేను మొండిగా పేచీ పెడితే రెండుకోట్లు చేపలు పట్టే వలల్ని కొనడానికి అలాట్ చేశారు.” “ పెంచకనే పడే పశ్న ఎక్కడుంటుందండీ ?” చిన్నగా నసిగాడు సిగ్నల్ పత్రిక విలేఖరి.“మీ కదే అర్థం కాదు. ఒక్కసారిగా వలల్ని కొంటే, పెంచే చేపలనంతా పదుతూ ఉండవచ్చు. జాలర్లు వీకర్ సెక్షన్ కు చెందిన నాళ్ళు. అసలు మైనారిటీ కమ్యూనిటీస్ ని డెవలప్ చెయ్యడమే మన ధ్యేయం. సోషలిజం ముఖ్య సూత్రం ఒకటుంది. చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగివేసినట్లు మెజారిటీ కమ్యూనిటీస్ మైనారిటీ కమ్యూనిటీస్ ను మింగివేయడాన్ని చూస్తూ ఊరుకోరాదు. అందుకే మా డిపార్టు మెంటకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సులో పెద్ద చేపలు చిన్న చేపల్ని మ్రింగి వెయ్యకుండా చూడాలి’ అన్నాము. ఒకే సైజా చేపల్ని పెంచమన్నాము. బొమ్మిడాయిలు వుండే బావిలో మావురాయిల్ని వదిల్తే ఏమవుతాయి చెప్పండి ? తాటాకు చేపలు పాము చేపల్ని పక్కెల్లో విడిస్తే, బతకవు! … “ అంటూ టైం చూచుకొని “వేర్ ఈస్ అవర్ ఇన్స్పెక్టర్” అన్నారు అమాత్యులు. ఏడుకొండలవాడికంటే వెడల్పైన నామాలు పెట్టుకొన్న బంట్రోతు వచ్చి “వారు పరిగిలగుట్ట లో తమ రాకకు యేర్పాట్లు చెయ్యడానికి వెళ్లారు, దేవరా” అన్నాడు.పరిగిలగుట్ట అక్కడికి పాతికమైళ్లుంది. కార్యక్రమం ప్రకారం చెన్నారాయుడి చెరువు చేపల పెంపకం కేంద్రానికి మంత్రి ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే ఉత్సవానికి కనకాచలం జిల్లా పరిషత్ అధ్యక్షులు, మచ్చా జీవానందంగారు అధ్యక్షత వహిస్తారు. అదే సభలోనే బెస్తలకు కొత్త వలలు పంచబడతాయి. జిల్లా కలెక్టర్ కారు ముందు దారి తీసింది. వెనుక మత్స శాఖామాత్యుల కారు ఆ వెనుక పబ్లిక్ రిలేషన్సు డిపార్టుమెంటు వారి వ్యాను నిండుకూ పతికా విలేఖరులు, పరిగిలి గుట్ట సమితి అధ్యక్షుల జీపు ఇంకో యేవో కొన్ని వాహనాలు తుర్రు మంటూ దూసుకపోయాయి.పరిగిలి గుట్టలో పెద్ద పందిరి వేశారు. భగ భగ నుండే ఎండను లెక్క చెయ్యకుండా ఆ పరిసరాలనుండి పంచాయతీ సర్పంచులు, మునసబులు, కరణాలు, కాంట్రాక్టర్లు, సమితి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వందల సంఖ్యలో సమావేశమయ్యారు. బాగా అలంకరించిన బండిపై పెద్ద గాజు తొట్టెలో లో రకరకాల చేపలు విలాసంగా విహరిస్తున్నాయి. వాటిలో బంగారు వన్నెల మీనులూ,

S1 Ep 219'మనిషి లోపలి విధ్వంసం' - అల్లం రాజయ్య గారు
గత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అల్లం రాజయ్య గారు తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరు. ఆయన రాసిన ‘మనిషి లోపలి విధ్వంసం’ ఇప్పుడు మీరు వినబోయే కథ. ఈ కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అల్లం రాజయ్య గారికి కృతజ్ఞతలు.ఈ కథ వారి కథా సంపుటి, ‘ అతడు’ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి. https://bit.ly/3scvsxPగత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అల్లం రాజయ్య గారు తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరు. ఆయన రాసిన ‘మనిషి లోని విధ్వంసం’ ఇప్పుడు మీరు వినబోయే కథ. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అల్లం రాజయ్య గారికి కృతజ్ఞతలు.ఈ కథ వారి కథా సంపుటి, ‘ అతడు’ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి. https://bit.ly/3scvsxPఅదొక చిన్నరైల్వే స్టేషన్. ఆ స్టేషన్ భవనాలు నైజాం కాలంలో కట్టినవి. ఈ ఏడు వానాకాలంలో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలవల్ల స్టేషన్ భవనం, గోడలు పెచ్చులూడిపోయాయి. భవనం పైనుండి కారిననీటి ధారల మూలంగా గోడల మీద చారికలు ఏర్పడినాయి. రైల్వే స్టేషను కుడిఎడమల పాతిన సిమెంట్ పోల్స్, కట్టిన ఫెన్సింగు వైరు అక్కడక్కడ విరిగి పోయాయి. ఆ స్టేషన్లోకి వచ్చే ప్రయాణీకులు పోయే ప్రయాణీకులు సాధారణంగా స్టేషన్ ద్వారం నుండి కాక విరిగిన సిమెంట్ పోల్స్ ఫెన్సింగు నుంచే నడుస్తారు.రైల్వే స్టేషన్ వెనుకవైపు, స్టేషన్ కట్టినప్పుడే కట్టిన క్వార్టర్లలో నాలుగు కూలిపోయి ఉన్నాయి. మిగతా క్వార్టర్లలో రైల్వేగ్యాంగు వాళ్లు తప్ప బుక్కింగు క్లర్కుగాని స్టేషన్మస్టరు గాని ఉండటం లేదు. వాళ్ళు దాదాపు అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో గల ఓ మాదిరి పట్నం నుంచీ రోజూ వస్తారు.రైల్వే స్టేషను దక్షిణాన నీలగిరి చెట్లు పెరిగి ఉన్నాయి. నీలగిరి చెట్ల కింద ఆకులుపడి ఆ స్థలమంతా తెల్లగా మెరుస్తున్నది. స్టేషన్‌కు ఎదురుగా పసిరిక చెట్లు, వేపచెట్లు, తుమ్మచెట్లు పెరిగి ఉన్నాయి. ఆ చెట్లకింద రైలు పట్టాలకు ఆవలి వైపున ‘తాటికల్లు’ కుండల్లో నురుగు వస్తుండగా నలుగురు గౌండ్ల వాళ్ళు గిరాకి లేక దిగాలు పడి కూర్చున్నారు. వాళ్ళకు కొంచెం దూరంలో పసుపుపచ్చ ప్లాస్టిక్ ట్రేలో సారా ప్యాకెట్లు పెట్టుకొని పేడి మూతి ఉపేంద్ర కూర్చున్నాడు.పొద్దున తయారుచేసిన ‘మిరపకాయ బజ్జీలు’ చల్లారిపోగా షేక్ దావూద్ గొణుగుతున్నాడు.వేపచెట్టు కింద కాల్చిన మొక్కజొన్న కంకులు పెట్టుకొని ముగ్గురు పల్లెటూరి ఆడవాళ్ళు ఒకరినొకరుతిట్టుకుంటున్నారు.పరికి పండ్లు అమ్మే ముసలవ్వ ఎందుకో విచారంగా కూర్చున్నది.ఆ చెట్ల కింద దుమ్ములో కూర్చుండలేక, అలాగని ఎంతో సేపు నిలబడలేక ఒక కుటుంబం దిక్కులు చూస్తున్నది.“అట్ల పోయి రైలెప్పుడు కాలవడ్తదో తెలుసక రాపోరాదు!” భార్య భర్త మీద విసుక్కున్నది. భార్య పేరు గంగమ్మ. ఆమె గులాబిరంగు పాలిస్టర్ చీర కట్టుకున్నది. చెవులకు బంగారు జూకాలున్నాయి. కాళ్ళకు పట్ట గొలుసులు, వెండి మట్టెలున్నాయి. భర్త రాయేశం తన అంగీజేబులో చెయ్యి పెట్టి, భార్యకేసి చూసి వంకర నవ్వు నవ్వాడు.రాయేశం తెల్లటి పాలిస్టర్ కమీజు తొడిగి ధోవతి కట్టుకొన్నాడు. కాళ్ళకు సింగరేణి బొగ్గుగని బూట్లు వేసుకున్నాడు. మెడకు మఫ్లర్, ఎడమచేతికి గడియారమున్నది. .“అమ్మా పరికి పండ్లే!” వారిద్దరి పదేండ్ల కొడుకు అడిగాడు. “మీ బాపు నడుగుపో” గంగమ్మ పిల్లవాడ్ని కసిరింది. రాయేశం వంకర నవ్వుకు గంగమ్మ ఎలాంటి అడ్డంకి చెప్పకపోయేసరికి ఉపేంద్రం దగ్గరికి నడిచి “ఎంతకోబత్త (సారా ప్యాకెటు) పిలడా?” అడిగాడు.“మీ కాలేరు (కాలరీ) లెంత?” ఉపేంద్రం. “మా బొగ్గుబాయిల కాడ అమ్మినట్టే అమ్ముతానవా?” “ఈడ అంతరేటు కమ్ముతె బొక్కలిరువరా?” ఒక గౌండ్లాయన కోపంగా అన్నాడు. “ఎవలు?” రాయేశం. “ఇంకెవలు పాముకోరలిరిసినోళ్ళే” ఇంకో గౌండ్లాయన. పాము కోరలిరిసినోల్లెవరో రాయేశం అడుగలేదు. వాళ్లు చెప్పలేదు. “రెండున్నర” ఉపేంద్రం.“లావు సస్తనే ఉన్నది. మా వూల్లే సార మావులా పట్టిన కొత్తల నాలుగు రూపాయలన్నరు. లొల్లయి నంక గిప్పుడు గిదేధర”.“మీ వూల్లేంది ఈ సుట్టు పక్క అన్ని ఊళ్ళల్లగిదే ధర – ఈసారి మావుల (కంట్రాక్ట్) పట్టినోడు మన్నై పోయిండనుకో.”“మా కాలేరుమీద దోసుకుంటండ్లు – ఆడ బత్తకు అయిదు రూపాయలు” రాయేశం. రెండు సారా ప్యాకెట్లు తీసుకొని ఒకటి కట్టుక్కున కొరికి నోట్లో పోసుకొని ఇంకొకటి జేబులో వేసుకున్నాడు. అయిదు రూపాయల నోటు తీసి ఇచ్చాడు.ఆ వాసన తనకే వచ్చినట్లుగా ఒక అంగన్వాడి టీచరమ్మ అటేపు జరిగింది.ఒక ముసలమ్మ చెవుల గంటీలు ఊగుతుండగా “రైలెప్పుడత్తది పిలడా! సిటక్కున సీకటైనంకనా?” అన్నది. “ఆ ముసలమ్మ మనవడు “ప్యాసెంజర్ రైలు గంట కొట్టేదనుక తెలువదే” బియ్యం సంచి మీద కూర్చుండి జవాబు చెప్పాడు. అతను ప్యాంటు వేసుకొని ఉన్నాడు.కొంచెం దూరంలో అదివరకే తాగి ఉన్న ఒక బతికి చెడ్డ రైతు ఎవరినో అంతూ పొంతూ లేకుండా తిడుతున్నాడు.రైలు కిందబడి కాలు ఎప్పుడో తెగిపోయిన కుంటి ముసలి బిచ్చపాయన“నిన్ను సిలువకు గట్టిరిబిడ్డా నా యేశయ్యా!కీలుకీలున మొలలు గొట్టిరి తండ్రీ యేశయ్యా!” అంటూ యేసుక్రీస్తు మరణఘట్టాన్ని తను ‘నిజంగా’ చూసినట్లుగానే వర్ణించి పాడుతున్నాడు. ఆ గొంతులో విచిత్రమైన “వణుకు” అక్కడి వాళ్ళకు దుఃఖాన్ని కలిగిస్తోంది. ఆ పాటలోని నాదం వారికి అనుభవంలో ఉన్నట్టే ఉంది. అందరికీ చేయిచాపుతూ కర్రకాలు పొడుచుకుంటూ తిరుగుతున్నాడు.రైలు టైం కనుక్కోవడానికి బయలుదేరిన రాయేశం ఇరువై అయిదు పైసల బిళ్ళ తీసి కుంటాయన చిపులోవేసి “ఏసయ్యను కాదు గరీబోని” అని పాటకు అర్థం చెప్పి కదలబోయాడు.ఇంతలోనే పెనుకేక వేస్తూ ఏదో ఎక్స్ ప్రెస్ రైలు దూసుకపోయింది.రైలు వెళ్లేదాకా ఆగి రాయేశం పట్టాలు దాటాడు. అతని వెనుకనే రాబోయిన కొడుకు భయపడి తల్లి దగ్గరికి పరుగెత్తాడు.రాయేశం స్టేషన్లోకి అడుగుపెట్టాడు. టికెట్లిచ్చే కిటికీ మూసున్నది. స్టేషన్ మాస్టర్ గదిలోకి తొంగిచూశాడు.ఒక పాతటేబుల్ ముందు అంతకన్నా పాతగీలిన స్టేషన్ మాస్టర్ విచారంగా కూర్చున్నాడు.ఇంతలోనే స్టేషన్ ద్వారం నుంచీ ఆదరబాదరగా వచ్చిన రైల్వే పోలీసు స్టేషన్ మాస్టర్ రూంలోకి నడిచాడు. టోపి తీసి ఉఫ్మనుకున్నాడు.“వాని వివరాలు తెలుసుకునేసరికి తాతలు దిగొచ్చిండ్లు సార్” ఆ కష్టమంతా ముఖంలో

S1 Ep 218త్రిపుర గారి 'పాము'
‘త్రిపుర’ పేరు తో కథలు కవిత్వం రాసిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు గారు, తన విలక్షణమైన కథా శైలి తో ఎందరో అభిమానుల్ని సంపాదించుకోవటమే గాకుండా, అనేక మంది రచయితలకు ఆదర్శంగా నిలిచారు. కథను మీకు పరిచయం చేయడానికి అనుమతినిచ్చిన త్రిపుర గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. కథను అనల్ప పబ్లిషర్స్ ప్రచురించిన ‘త్రిపుర కథలు ‘ నించి తీసుకోవటం జరిగింది. పుస్తకం కొనాలంటే – https://bit.ly/3mAwFhNశేషాచలపతిరావ్ అద్దంలో చూస్తూ దువ్వుకుంటూ “ఇవాళ నీ పేరు అలఖ్ నిరంజన్” అని చెప్పేడు అద్దంలోని శేషాచలపతిరావ్ తో. అద్దం లోని శేషా….నవ్వి “గొప్ప మజా, స్కౌండ్రల్ , నీసంగతేం చెప్పను. అవును కానీ, నీకు ఎడం పాపిడేమీ బాగులేదు ఇవాళ. కుడి పాపిడిలాగు. టై నాట్ కింద డింపుల్ బాగులేదు. షోల్డర్స్ ఇంకా స్క్వేర్ చెయ్యి” అన్నాడు.విండ్సర్ నాట్ కింద డింపుల్ దిద్ది, పాపిడి కుడిచేసి, మళ్ళీ బ్రష్ చేసి, బుగ్గల్లోని డింపుల్స్ ప్రాక్టీస్ చేసి, అద్దం పక్కని పిన్ చేసి ఉంచిన క్లాస్ రొటీన్ చూశాడు.“మొదటి రెండు పీరియడ్సూ ఉండాలి. మూడు, నాలుగూ స్కిప్ చెయ్యొచ్చు.”హాస్టల్ గేటు దాటుతూ “పవర్, ట్రెచరీ, ఎడ్వంచర్. నేను నేతాజీని, హిట్లర్ ని. వినండి, బుద్దిలేని, బలంలేని బాస్టర్డ్స్……… మిమ్మల్ని హత మార్చేస్తాను. పారా హుషార్…….. లక్షలు లక్షలుగా క్రిముల్లాగ బ్రతుకుతున్న మిమ్మల్ని రూపురేఖలు లేకుండా చేస్తాను……” పిడికిలి బిగపట్టి, హాస్టల్ వేపు కాలేజీవైపు చూపించి గట్టిగా చెయ్యి ఊపేడు.జోరుగా వచ్చే రిక్షాని తప్పించుకుని హిందీలో బూతులు తిట్టేడు.‘మొదటి రెండు పీరియడ్స్ స్కిప్ చెయ్యొచ్చు. దశాశ్వమేథ్ ఘాట్ కి వెళ్తాను’ అని అనుకుంటూనే లైబ్రరీ వేపు తిరిగి, ‘అలఖ్ నిరంజన్! నిన్ను….నన్నే…..నేను డిసీవ్ చెయ్యగలను తెలుసా’ అని లైబ్రరీ వేపు నడవటం మొదలు పెట్టేడు.సెక్షన్ లైబ్రేరియన్ టేబుల్ మీద గుట్టలు గుట్టలుగా రీబైండు చేసిన పుస్తకాల పేర్లు రెజిస్టెర్ లో రాసుకుంటున్నాడు. నేరుగా లోపలికి పోయి బీరువాల్లో పుస్తకాల టైటిల్స్ చూడటం మొదలు పెట్టేడు అలఖ్ నిరంజన్.చీర రెపరెపలు. సున్నితంగా మాటలు.కంటి చివరినుంచి చూస్తే, సెక్షన్ లైబ్రేరియన్ టేబుల్ మీద వేళ్ళు. లేడి…….. జింక…… డీర్.ముఖం తిప్పి చూసేడు. తనవేపే చూస్తూంది ఉమాడే.అప్రయత్నంగా కళ్ళతో నవ్వేడు అలఖ్, అప్రయత్నంగా కళ్ళతో నవ్వడం అలవాటు చేసుకున్న నిరంజన్.హిందీలో అంది : “నా కార్డ్ మర్చిపోయాను. శనివారం త్రివేదీ సెమినార్ లో ఎస్సే సబ్మిట్ చెయ్యాలి. మీకార్డ్ మీద ఛాసర్ మీద బుక్స్ ఏమేనా ఇప్పిస్తారా?”ఆ క్షణంలో చిరునవ్వు మాయమయి పోయింది నిరంజన్ కళ్ళల్లో, క్షణంలో కళ్ళల్లోని నవ్వుని మాయం చెయ్యడం అలవాటు చేసుకున్న అలఖ్ కళ్ళల్లో. ఇంగ్లీషులో అన్నాడు : “కారిడార్ లోకి రండి.”గాజు అద్దాల కిటికీ దగ్గరగా వెళ్ళి, వెనక్కి తిరిగి కోపంగా అన్నాడు, “నా కార్డ్ ఎప్పుడూ జేబులో పెట్టుకుని తిరగను, మీరెవరో నాకింకా బాగా తెలియదు. తెలియని ఆడవాళ్ళందరికీ సహాయం చేసే షివల్రస్ మనిషిని కాను.”ఉమా కళ్ళలో మెరుపులాగా కోపం………“ఇవ్వకపోతే యివ్వనని మృదువుగా చెప్పొచ్చు. గొంతుకలో అంత థండర్ అవసరం లేదు.”విసురుగా చీర మెరుపు మాయమయింది.మళ్ళీ తెర ఎత్తబడింది. తను అనుకోకుండానే అకస్మాత్తుగా. అయితే, తన భవిష్యత్తుకి ఆకారం తానే యిస్తాడు. ఇప్పుడు జరుగుతున్నది తను ఎప్పుడో ఊహించి మనస్సు మారుమూలల్లో తొక్కి పడేసి ఉంచిన నాటకంలోని ఒక భాగం.తెర ఎత్తేసింది కాలం, కాస్త ముందుగానే. అయితే తను ఎప్పుడూ సిద్ధమే. “జగదేవ్…..జగదేవ్…..” “ఈ అల్మైరా తాళాలియ్యి.”తాళాలు తీసుకుని బీరువా తెరిచి రెండు పుస్తకాలు తిరగేశాడు. జగదేవ్ అక్కడే నిలబడ్డాడు.ఒక చివరన ఇషరవుడ్ నావల్ ఒకటి కనిపించింది.“ఇదిగో! నువ్వు అన్నిరకాల మనుషులకి తాళాలిచ్చేస్తావ్. ఎలా అడ్డదిడ్డంగా పెట్టేశారో చూడు. ఈ పుస్తకం యిక్కడేమిటి చేస్తూంది. తీసుకువెళ్ళి ఫిక్షన్లో పెట్టు. మీకు బుద్ధిరాదు. ఎన్నిసార్లు లైబ్రేరియన్ చేత తిట్లు తిన్నా.” జగదేవ్ గొణుక్కుంటూ పుస్తకం తీసుకుపోయేడు.అల్మైరాలోంచి ఛాసర్ మీద లెగూయీ రాసిన పుస్తకం పైకి తీసేడు. కోట్ ప్రక్కకిలాగి, షర్ట్ కి, బెల్ట్ కి మధ్య పుస్తకాన్ని తోసి, మళ్ళీ కోటు గుండీలు పెట్టాడు. ఎడం చెయ్యి అడ్డంగా పెట్టుకుని జగదేవ్ ని పిలిచి తాళాలు యిచ్చేశాడు.కౌంటర్ దగ్గర: “పండిట్జీ, ఇంకా కాస్త విజిలెంట్ గా ఉండాలి. పుస్తకాల దొంగలు ఎక్కువయి పోయారు. ఇవాళ నాకు కావలసినవి ఒకటి కనిపించలేదు. ఇష్యూకూడా అవలేదు. మీరింత ఇనెఫిషెన్ట్ గా ఉంటే మేము కంప్లెయిన్ చెయ్యవలసొస్తుంది.” కోపంగా వికెట్ తోసుకుని విసురుగా పైకి వచ్చేశాడు అలఖ్ నిరంజన్.లైబ్రరీ దగ్గర చెట్టుకింద కేంటీన్.చెట్టుకింద బల్లమీద కూర్చుని నాలుగు సమోసాలు తిని, టీ తాగుతూ చుట్టూ ముసిరే ఎర్ర కందిరీగల్ని ఛాసర్ తో అప్పటికే ఆరు చంపేడు.‘ఇంకో అయిదు నిమిషాల్లోపల ఉమ పైకి రావాలి….వచ్చి తీరాలి’ అనుకున్నాడు. రిస్ట్ వాచ్ విప్పి చేత్తో పట్టుకున్నాడు. సాసర్ బల్లమీద ఉంచి, కప్ మాత్రం చేత్తో పట్టుకుని లైబ్రరీ వేపు తిరిగి నిలబడ్డాడు….. నాలుగు నిముషాల నలభయి సెకండ్లు…..నలభయిఐదు….ఏభయి…. ఏభయి ఎనిమిది….అయిదు నిముషాలు.ఉమ లైబ్రరీ మెట్లు దిగి వస్తుంది. దగ్గరగా వచ్చింది.“హలో! మీరు రెండు సెకండ్లు ఆలస్యం. చూశారా స్టాప్ వాచ్ లాగ పట్టుకుని ఎలా లెఖ్క పెడ్తున్నానో. ఈసారికి క్షమించేను….రండి, మేనర్సు గురించి బాధపడితే మీకు కావాల్సిన బుక్ దొరకదు. మీ హృదయంలోని మిక్సెడ్ ఫీలింగ్స్ నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా……”ముందుకు, దగ్గరగా అడుగు వేసింది ఉమ.“……. అయినా, మీరు వప్పుకుంటారు…..రండి.” ఉమ నవ్వింది. బెంచ్ మీద కూర్చుంది.“గులాబ్ జామున్ కూడా చేశాడు శర్మాజీ. స్వీట్స్ అంటే అసహ్యం నాకు. స్వీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళని మెషిన గాన్ తో షూట్ చేద్దామనిపిస్తుంది. కాబట్టి సమోసాలు. ఏమంటారు. అండ్ టీ…..ఇదిగో మీకు కావలసిన పుస్తకం. మన ఫ్యూచర్ అసోసియేషన్ కి చిహ్నంగా యీ ఆరు కందిరీగల కళేబరాల్ని ఛాసర్ తో చంపి సిద్ధంగా ఉంచేను…..వద్దు. మీరు మాట్లాడటానికి ప్రయత్నించకండి. నేనే అంతా మాట్లాడేసిన తరువాత మీకు అవకాశం యిస్తాను……మీరు నాకు జూనియర్

S1 Ep 217'సమాంతరాలు' - పతంజలి శాస్త్రి గారి కొత్త కథా సంపుటం
ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో .ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో .పుస్తకం కొనడానికి ఈ లింక్ ఉపయోగించండి. (https://bit.ly/samantharaalu) .ఆడియో వినడానికి మై ఆడియో బైట్స్ ఆప్ ని ఉపయోగించండి. (https://web.myaudiobits.com/#/audio-bits)తెలుగులో మొదటిసారిగా, ఆడియో , ప్రింటెడ్ వెర్షన్స్ ఒకే సారి లభ్యం అవ్వడం, ‘సమాంతరాలు’ సంపుటం ప్రత్యేకత. శాస్త్రి గారి రచనా శైలి, ఈ సంపుటంలో కథలు, ఆడియో బుక్స్ ప్రాచుర్యం,- వీటిపై ఈ ఎపిసోడ్లో చర్చించడం జరిగింది.ఇంటర్వ్యూ:సమాంతరాలు కథా సంకలనం వెలువడిన సందర్భంగా రచయిత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారితో హర్షణీయం సంభాషణహర్షణీయం : ఈ పుస్తకంలో ప్రత్యేకత ఏంటంటే బహుశా మొట్ట మొదటి సారి తెలుగులో ఛాయా రిసోర్సెస్ సెంటర్ నుంచి ప్రింట్ వర్షన్, ఆడియో బైట్స్ నుంచి ఆడియో స్టోరీ వర్షన్ రెండూ ఒకే సారి రిలీజ్ అవుతున్నాయి. మోహన్ గారు, ఆడియో వర్షన్ పై మీ అంచనాలేంటి? ఎందుకంటే, ఇప్పుడిప్పుడే ఆడియో వర్షన్ పాపులర్ అవుతోంది కదా?ఛాయా మోహన్ : మనకు ఇప్పుడు వచ్చే తరాలు, ముప్పై ఏళ్లలోపు పిల్లలెవరికీ కూడా చదవడం రాదు. కనుక, ఖచ్చితంగా ఆడియో ఈజ్ గోయింగ్ టు ది ఫ్యూచర్. దాన్ని మొట్ట మొదట మనం మొదలుబెట్టడం అనేది ఆశ్చర్యం, బావుంది. ఆశ్చర్యం ఎందుకంటే, అది అనుకోకుండా జరిగింది. అది కూడా మా కండిషన్ ఏంటంటే ప్రింట్ వర్షన్ తో పాటు, ఆడియో కూడా రావాలని గట్టిగా చెప్పడంతోని వాళ్లు సరే అన్నారు. అది ఒక కండిషన్. చూద్దాం………, This is going to be a good beginning. It is going to be a Landmark Thing అని చెప్పగలను.హర్షణీయం : శాస్త్రిగారు, మీరు ఈ పుస్తకంలో ఐదు కథలు రాశారు. ఇంతకు ముందు కూడా రామేశ్వరం కాకులు, పతంజలి శాస్త్రి కథలు, నలుపు ఎరుపు అని మూడు సంపుటాలు వచ్చాయి. ఆ కథలకి, ఇప్పుడు ఈ పుస్తకంలో మీరు రాసిన కథలకీ స్వరూప స్వభావాల్లో ఏమైనా తేడాలున్నాయా?పతంజలి శాస్త్రి : There is a thematic undercurrent. ఒక రకమైన ఏక సూత్రత ఉంటుంది. అందువల్ల బహుశా మోహన్ గారు, మిగతా కథలు ఇందులోంచి తీసి వేరే సంకలనం వేద్దాం అన్నారు. ఇవి ఇట్లా ఉన్నాయి కనుక బావుంటుంది అని నిర్ణయించారు. మొదట్లో నేను ఒప్పుకోలేదు. తరువాత ఆయన చెప్పినదాంట్లో నిజం ఉందనిపించింది. ఇప్పుడు, గతంలో నేను రాసిన కథల్లో కూడా ఈ రకమైన ఆలోచన, దృక్పథం కనిపిస్తుంది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మనవాళ్లు ఫిలాసఫీ లేదా తాత్విక దృక్పథం అంటుంటారు. తెలుగుదేశంలో ఒక ప్రత్యేకమైన అవ్యవస్థ ఉంది. ఫిలాసఫీ అన్నా, లేదా ఈ రచనకి ఒక తాత్విక దృక్పథం ఉందని అన్నా వాళ్లు ఏమనుకుంటారంటే ఇదేదో నేల విడిచి సాము చేసే వ్యవహారం ఏదో చేస్తున్నాడని, నిజ జీవితంతో మనకి తెలిసినటువంటి వాస్తవమైన పరిస్థితులతో సంబంధంలేని ఒక మాయ ఏదో చేస్తున్నాడని అనుకుంటారు. మిగతా చోట్ల అట్లా అనుకోరనుకుంటా. ఈ జీవితాన్ని మనం ఎట్లా చూడాలి? ఏరకంగా చూడాలి? ఏ పరిస్థితిలో ఈ జీవితాన్ని మామూలుగా మనం చూసే పద్ధతిలో కాకుండా వేరే రకంగా చూడడం జరుగుతుంది? ఇట్లా అనేక ప్రశ్నలు మనకి అప్పుడప్పుడూ ఎదురవుతూ ఉంటాయి. అట్లా జరిగినటువంటి నాలుగో ఐదో భిన్నమైనటువంటి సందర్భాలు ఈ కథలు. ఈ పుస్తకానికి ముందుమాట కాదు కానీ, కేవలం ఒక అరడజను వాక్యాలు రాశాను. ‘‘మీ కథలు అర్థం కావని ’’ బహుశా తరుచుగా వినడం వల్ల నేనలా రాశానేమో తెలీదు. అయితే, నిజం చెప్పాలంటే నేను తరువాత చదువుకున్నాను మోహన్ గారు ప్రింట్ పంపించిన తరువాత. నా కథలెలా ఉన్నాయో ఈ ముందు మాట కూడా అలాగే ఉంది. you know what I mean (నవ్వుతూ)… అంటే, ఏమవుతుందో తెలీదు కానీ ఏదో చెప్పాలనుకుంటున్నాను. ఈ కథల్లో నేనేమన్నానంటే ‘‘ఓర వాకిలిగా వేసిఉన్న గది లాంటివి నా కథలు చాలా భాగం. మనం తలుపు తోసి లోపలికి వెళ్తే, ముఖ్యంగా వాటి ఆంతరిక ప్రపంచం కనిపిస్తుంది’’ అని రాశాను. నా కథలు మీరు జాగ్రత్తగా గమనిస్తే అందులో ఉండే నిర్మాణ సంబంధమైన ప్రత్యేకతల కంటే కూడా ఇటువంటి ఒక చింతన, ఒక ఆలోచన, ఒక ప్రవాహశీలత, ఒక ప్రవాహ లక్షణం కనిపిస్తుంది. సాధారణ ప్లేన్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే ‘‘ఇట్స్ ఏ ఫ్లోయింగ్ మూడ్.’’ ఆ ఇతివృత్తానికి సంబంధించిన ఒక మూడ్ ఏదైతే ఉందో, మీరు అట్ల లోపలికి వెళ్లి వాళ్లతో రెండు మాటలు మాట్లాడగానే, మీరు అందులోకి ప్రవేశిస్తే మెల్లగా పడవలో ప్రవాహంతో పాటు వెళ్తున్నట్టుగా మీరు కూడా ప్రయాణం చేస్తారు.హర్షణీయం : ఈ మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ మా మధ్య జరిగింది. మా గిరి బాగా కథలు చదువుతాడు. వాడు ‘‘రేమండ్ కార్వర్, టోబయాస్ ఉల్ఫ్ లాంటి మినిమలిస్టిక్ మూమెంట్ రైటర్స్ ఉన్నారు’’ అని చెబుతూ లిటరరీ మినిమలిజం అంటే ఏందనేది నాలుగైదు వాక్యాలు పంపించాడు. నేను ఇప్పుడు దాన్ని చదువుతాను. ‘‘Literary minimalism is often expressed through the use of short or short short stories, that are nearly plotless. They treat isolated moments, or seemingly random in significant events, where the reader is put to some thought in what really happened. The reader has to reflect about the issues presented that lie under need the story just unfolded.’’ పతంజలి శాస్త్రి : నేనైతే ఆ మినిమలిస్ట్ ధోరణి అని ఏదైతే మీరంటున్నారో దాని గురించి నేనేమీ చదవలేదు. కానీ నాకు మొదటి నుంచి కూడా క్లుప్తత నాకు చాలా ఇష్టమైన విషయం. కథలకు సంబంధించినంతవరకు క్లుప్తంగా, గుప్తంగా చెప్పడం. ఊరికే అట్లాగ సజెస్టివ్ గా చెప్తూ, ధ్వని అంటే పాఠకుడికి ఇతనేం చెబుతున్నాడు, ఎలా అని ఆలోచించే అవకాశం కల్పించాలని నాకు మొదటి నుంచీ ఉండేది. దానికి గుప్తత అనేది నాకు సహజంగా అలవడ్డది. వాస్తవానికి అందులో ఇంకో భాగం ఏంటంటే understatement నాకు చాలా ఇష్టం. నేను ఇంగ్లీష్ భాషను భాగా ఇష్టపడడానికి ఒక కారణం వ

S1 Ep 216'షరా' - గోపీచంద్ గారి రచన
‘షరా’ గోపీచంద్ గారు రాసిన కథ . కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు.గోపీచంద్ గారి కథలను మీకు అందించడానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు.ఈ కథ ‘గోపీచంద్ రచనా సర్వస్వం – కథలు – 2 ‘ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి. https://bit.ly/3jTBgsbఆ మనిషిని ఎక్కడో చూశాననిపించింది. కాని ఎంత ఆలోచించినా జ్ఞాపకం రాలేదు. కృష్ణలంకలో నాకు ఎవ్వరితోనూ పరిచయం లేదు. నేను ఎన్నడూ ఆ లంకలో అడుగుపెట్టి కూడా ఎరగను.మా ఊరు బెజవాడ దగ్గరదే అయినా నేను ఏడెనిమిది సంవత్సరాల నుంచీ మద్రాసులోనే వుంటున్నాను. ఈ ప్రాంతాలకు రాలేదు. ఇటీవల వొచ్చిన గాలివానకు పంటలన్నీ పాడైనయ్యని తెలుసుకొని పొలాలు చూచుకు వెళ్ళదామని వొచ్చాను. గాలివానవల్ల నిజంగా అపారమైన నష్టం కలిగింది. నేను ఎరిగినతర్వాత ఇంత నష్టం ఎప్పుడూ జరగలేదు. కవులు వాళ్ళు తమ గింజలుకూడా రావని గోలపెడుతున్నారు. నేను ఏమి చెయ్యగలను! మళ్ళీ మద్రాసు వెళ్తామని బయలుదేరి, ఎలాగూ వచ్చాంగదా అని బెజవాడలో వున్న నా మిత్రుణ్ణి వొకణ్ణి చూచిపోదామని బెజవాడలో దిగాను. అతను గాలివానకు నష్టపడిన వారికి సహాయంచేసే ప్రయత్నంలో వుండి “రేపు వెళ్ళొచ్చులే” అంటే-ఆనాటికి ఆగిపోయాను.ఆ సాయంత్రం బెజవాడ లంకలో నష్టపడ్డ బీద జనానికి వాసాలూ, తాటాకులూ పంచిపెడుతూ నన్ను కూడా రమ్మంటే నేనూ వెళ్ళాను. శరణార్థుల్లో కనుపించాడు ఆ మనిషి. ఆ మనిషి నన్ను చూచి కొంచెం బెరుకుపడ్డట్టు కూడా అనిపించింది నాకు. నిజంగా ఆ మనిషిని నేను ఎక్కడో చూశాను. అందులో సందేహం లేదు. కాని ఏ సందర్భంలో చూశానో ఎంత ఆలోచించినా నాకు జ్ఞాపకం రాలేదు.మేము పని పూర్తి చేసుకొని యింటికి వస్తుంటే ఒక రైతు మా వెంట వొచ్చాడు. అతనివల్ల ఆ మనిషి కోటిరెడ్డి మామ అని తెలుసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. కోటిరెడ్డిని నేను ఎరుగుదును. అతనూ మద్రాసులోనే ఉంటున్నాడు. అతని మామను కూడా నేను ఎరుగుదును. ఒకసారి అతని అత్తవారి ఇంటి దగ్గర ఉండగా అతన్ని చూద్దామని వెళ్ళాను. అప్పుడే ఈయన్ని చూశాను. కాని గుర్తుపట్టకపోవటం నాతప్పు కాదు. మనిషి చాలా మారిపోయాడు.నేను ఏట్లాగూ మద్రాసు వెళుతున్నాను గనక అల్లుడికేమైనా కబురు చెబు, మర్నాడు ప్రొద్దున్నే లేచి కోటిరెడ్డి మామను చూద్దామని లంకకి ప్రయాణ ఆ లంకలో వుంటున్నదంతా అలగా జనం. నాకు తెలిసినంతవరకు కోటిరెడ్డి వున్నవాడే. కాని ఈ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. స్వగ్రామంలో ను వాకిలి వొదులుకొని ఇక్కడ ఎందుకు కాపరం పెట్టాడో కూడా నాకు తెలియదు. కోటి కూడా ఈ విషయం నాతో ఎన్నడూ ప్రస్తావించలేదు. అక్కడ వున్నవన్నీ చిన్న చిన్న హరి గుడి సెలే. ఆ గుడిసెల్లో వొక గుడిసెలో కాపరం వుంటున్నాడు కోటిరెడ్డి మామ. నేను వెళ్ళేటప్పటికి ఆస్థలంలోనే వున్న మరికొన్ని గుడిసెల్ని బాగుచేయిస్తున్నాడు. నన్ను చూచి కొంచెం తబ్బిబ్బుపడ్డాడు. ఇంటిలోకి వెళ్ళి నేను కూర్చోగలందులకు ఒక కుక్కిమంచం తెచ్చాడు. అతన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత హీనస్థితికి ఎందుకు వొచ్చాడా అని ఆలోచించ బుద్ధి ఐంది. మాటల్లోకి దింపాను. అతను ఆకును అందకుండా పోకను పొందకుండా జవాబులు చెప్పాడు. తన అల్లుడి సంగతి అడిగాడు. బాగానే వున్నాడని చెప్పాను. నేను అదీ, ఇదీ అడిగాగాని సరైన జవాబులు చెప్పలేదు. చివరికి; “నేను మద్రాసు వెళ్తున్నాను మీ అల్లుడికి ఏమైనా కబుర్లు చెపుతారా?” అని అడిగాను.“ఇట్లా వుంటున్నామని చెప్పండి” అన్నాడు. నేను ఆయన దగ్గర సెలవు తీసుకొని మిత్రుని ఇంటికి బయలుదేరాను. దారిలో ముందురోజు కలిసిన రైతు కలిశాడు. అతన్ని అడిగాను. కోటిరెడ్డి మామనుగురించి.“ఆయన ఆస్తి ఎందుకు పోయింది?” అని అడిగాను. “ఆస్తి పోవటం ఏమిటండోయ్!” అన్నాడు ఆ రైతు. “ఆస్తిపోకపోతే ఈ గుడిసెలో వుండవలసిన అవుసరం ఏమొచ్చిందీ?” అన్నాను.“అదా అండి… అట్లా అడగండి” అన్నాడు రైతు. అని ఈ విధంగా చెప్పాడు; “ఏమండోయ్ నాదీ ఆయనది వొక ఊరే… తెలుసా అండి… నాకాయన సంగతి బాగా తెలుసు… ఆస్తిపోయి రాలేదు….”“మరెందు కొచ్చాడు?”“సంపాదించటానికి వొచ్చాడు. అక్కడ ఇల్లూ, పొలం అమ్ముకొని వడ్డీకిచ్చి ఈ లంకలో స్థలాలు చౌగ్గా వున్నాయనీ, తొందరలో ధరలు పెరుగుతాయని తెలుసుకొని, ఇక్కడ స్థలం కొన్నాడు… రేపీ స్థలం అమ్ముతాడు… ఇంకొకచోట కొంటాడు… ఆయన కేమండీ… చూశారూ… ఈ స్థలం కొన్నాడా… కొని ఊరికేవుంటి యేమొస్తుందని నాలుగు గుడిసెలు వేయించి అద్దెకిస్తున్నాడు… కాని గాలివాన వొచ్చింరోజే గమ్మత్తంటే గమ్మత్తు…” అని నవ్వటం మొదలు పెట్టాడు.కారణం తెలియకపోయినా, అతను నవ్వుతుంటే నాకూ నవ్వు వొచ్చింది. “ఏం జరిగిందేమిటి?” అని అడిగాను.“అంతకు ముందు మూడు రోజులనుంచీ గాలివాన కొడుతూ వుంది. ఆ రోజు ఎక్కువైంది. లంకలో వుంటానికి వీల్లేక అంతా ఊళ్ళోకి వెళ్ళారు తలదాచుకోటానికి. ఈయన్ని రమ్మంటే రాడే “ఈ ఇళ్ళు నన్ను కాపాడినై… కష్టకాలంలో వాటిని విడిచిపెట్టి రాను” అంటూ కూర్చున్నాడు… ఆయన భార్య కూడా ఆయనకు తగ్గదే దొరికింది. “వొచ్చిన గాలి వాన పోక వుంటుందా… వెళ్ళటం రావటం… ఇదంతా ఎందుకు?” అంటూ కూర్చుంది. …. వొచ్చిన గాలివాన ఎట్టాగూ పోతుందట!” మళ్ళీ నవ్వటం మొదలు పెట్టాడు.“చివరికి ఏమైంది?” అని అడిగాను.“ఏమవుతుంది? వాళ్ళు రానంటే మాత్రం మేము ఊరుకుంటామా? వాళ్ళ సంగతి దేవుడెరుగు వాళ్ళకొక చంటి బిడ్డ వుంది. ఆ చంటి బిడ్డ జోరున తడుస్తుంటే ఎట్లా చూస్తూ వూరుకోవటం… బలవంతంగా తీసుకువెళ్ళాం… అదుగో చూడండి ఆ కట్టెల అడితీ… అది దాటి రానంటాడే… తన ఇళ్ళకు వీలైనంత దగ్గర్లో వుండాలని ఆశ! ఆ రాత్రి ఆ కట్టెల అడితీలో పెట్టాం… మమ్మల్ని నానా మాటలూ అంటూ కూర్చున్నాడు… ఆయన అల్లుడి తరపు బంధువులు వూళ్లో వున్నారు. వాళ్ళు వొచ్చి తమ యింటికి రమ్మని పిలిచారు. ఉహు, ఎంత చెప్పినా వినడు… పైగా “మీరు ఆనాడు అట్లా చేశారు. ఈనాడు యిట్ల చేశారు. నా సంగతి మీకు పట్టిందా, ఈ కష్టంలో నన్ను చూసి నవ్వాలని వచ్చారు” అని మండిపడి పంపించాడు. ఎట్లాగో తెల్లవారేదాకా ప్రాణాలు బిగబట్టుకు కూర్చుని తెల్లవారి మళ్ళీ భార్యా సమేతంగా లంక ప్రవేశించాడు. అప్పటికి గాలివాన కొంచం తగ్గిందిగానీ యింకా యెవ్వరూ బయటకు రావటం

S1 Ep 215అర్నాద్ గారి 'రిక్షా ప్రయాణం'
ప్రముఖ రచయిత అర్నాద్ గారి రచన ‘రిక్షా ప్రయాణం’. 1981 వ సంవత్సరంలో ఆంద్రజ్యోతి సంక్రాంతి కథల పోటీలో ప్రధమ బహుమతి పురస్కారం అందుకున్న కథ. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అర్నాద్ గారికి కృతజ్ఞతలు.“అమ్మా రిక్షా కావాలా” తైల సంస్కారం లేని ఉంగరాల జుట్టు, కోల ముఖంలో చురుకైన కళ్లు, సూది ముక్కు, బండ పెద వులు, మెడలో మురికి పట్టిన తాడు, దానికి వేళాడుతూ ఏడు కొండలవాడి ప్లాస్టిక్ బిళ్ళ, చిన్నచిన్న బొక్కల బనీను, రెండు పెద్ద పేలున్న బిగుతు ఆఫ్ ఫేంటు, బనీన్ని ఫేంటుని కలుపుతూ మురికి పట్టిన నల్లని తోలు బెల్టు, నల్లని ఒళ్ళు. చెప్పులు లేని కాళ్ళు. ముప్పయి మూడేళ్ళ వయసు. పేరు నర్శిమ్మ. నరిసిగాడంటారు అంతా.“రిక్షా తల్లీ రిక్షా”. గోదావరి ఎక్స్ ప్రెస్ చాలా ఆలస్యంగా వచ్చింది. అందులో ఆశ్చర్యం లేదు. అదేం అద్భుతం కాదు. ఎప్పుడూవున్న న్యూసెన్సే గాబట్టి పెద్ద బాధాకరమైన విషయం కూడా కాదు. ఆ మాటకొస్తే సీటూ బెర్తు రిజర్వేషనూ… వీటికన్నా ఇదిగో ఈ వూళ్ళో స్టేషన్నించి ఇంటికి వెళ్ళడమే అసలైన బాధ. సిసలైన గాథ! –“రిక్షా కావాలేటమ్మా”. ఆ ప్లాటుఫారం అవతల వుండాల్సిన రిక్షావాడు ప్లాటుఫారం టికట్ లేనే లేకుండా ప్లాటుఫారం మీదికి ప్రవేశించి – బిలబిలమంటూ రైలు దిగిన జనాన్ని దేవే స్తున్నాడు. పట్టే యత్నంలో, పోటీలో రెండూ, మూడు చిక్కినట్టుచిక్కి చేజారి పోయేయి. నిరాశ ఆ క్షణం! ఆశ మరుక్షణం. మళ్ళీ ప్రయత్నం. పరుగు పట్టు.“అమ్మా రిక్షా”. అమ్మని వదిలేలాలేడు రిక్షా నరిసిగాడు.ఆయమ్మ ‘అమ్మ’ అంటే అమ్మకాదు. అమ్మమ్మ నరిసిగాడికి కాదు. ఆమె చెంగు పట్టుకొని నడుస్తున్న చిన్నారి చిట్టికి. ఏడేళ్ళ బూరిబుగ్గల పెద్దకళ్ళ చిట్టికి,చిట్టి అమ్మమ్మని పట్టుకు నడుస్తుంటే, అమ్మమ్మ ట్రంకు పెట్టిని పట్టుకు నడుస్తోంది.పెట్టిని మోస్తుంటే చేయిలాగేస్తోంది ఆమెకి. పదడుగులు నడిచింది. పెట్టె నేల దించింది. పెట్టిని కుడిచేతి నుంచి ఎడమచేతికీ, చిట్టిని ఎడమ చేతినుండి కుడిచేతికి మార్చుకు నడుస్తోంది. మనిషిని చూస్తే – అలాంటి బరువు పెట్టెలు పది ఒక్కసారే మోసేయగలదు అనిపిస్తుంది. కాని ఆమె తనవొళ్ళు తనే మోయలేక పోతోంది. ఆమె శరీరం యినపరాయిలా గట్టివొళ్ళు కాదు. గాలి నింపిన బెలూన్‌లో నీరుపట్టిన వొళ్ళు. నాలుగడుగులు నడిస్తే చాలు కాళ్ళు పొంగుతాయి. ఆమె వయసు యాభై అయిదేళ్ళు. పేరు సోములమ్మ. కాని అంతా దిబ్బమ్మ అంటారు.“ఎక్కడికమ్మా ఎల్లాల”.వెళ్ళాల్సిన చోటు ఇక్కడా, అక్కడాలేదు. చాలా దూరం. ఆటో అయితే పదో, పన్నెండో అడిగే దూరం. బస్సయితే రూపాయి తీసుకొని పదిపైసలు తిరిగిచ్చే దూరం. –తను వెళ్ళాల్సిన సిటీ బస్సు దొరికే బస్టాండు దిబ్బమ్మకి తెల్సు, ప్లాటుఫారం అంచునుంచి చూస్తే అదిగో, అల్లదిగో కనిపిస్తోంది… పెట్రోలు బంకు పక్కన నడిస్తే అయిదు నిమిషాలు.ఆమె నడిచేయగలదు – కాళ్లు పొంగినా ఖాతరు చేయకుండా. ఈ గుంట పాప, ఆ ట్రంకు పెట్టె లేకుంటే నడిచేసును.తను వెళ్లాల్సిన బస్టాండు చెప్పి, చూపించి ‘ఎంతిమ్మంటావు’ అనడిగింది. “రెండ్రూపాయిలిప్పించండి”.రిక్షావాళ్లు అడిగే రేట్లు చూస్తే సింహాచలం, పెందుర్తి అయినా నడిచి పోవాలనిపిస్తుంది. అది అనిపించడం వర్కే! నసిగో, గుణిసో, ముక్కో, మూలిగో వాహనం ఎక్కకుండా వెళ్ళలేం మనం చివరికి. ఈ నాగరికత ఎలాంటి దూరాన్నయినా నడిచిపోగలమనే సంగతి మనం మర్చిపోయేట్టు చేసింది. మన పూర్వీకులు కాశీకి నడిచి వెళ్లారంటే తెల్లమొగాలు వేయడం వేరే సంగతి. పెదవాల్తేరు నుంచి పూర్ణా మార్కెట్ కి ఏమీ కాకుండా నడిచేసిన వాళ్ళు – సిటీ బస్సుకోసం గంటల కొలదీ వెయిట్ చేసి, నలిగిపోతూ, వేలాడ్డానికే ఇష్టపడుతున్నారిపుడు. కాలం! –“ఏటీ రెండడుగుల దూరానికి రెండు రూపాయలా! అవ్వ! ఏం ఆశరా”! “అదేటి తల్లీ అలాగంటారు. రెండు రూపాయల్కి శేరునూకలు రావడం లేదు.” ఆమె అన్నది వేరు. వాడు చెప్పింది వేరు. కాని రెంటికీ లింకు వుందనేది వాస్తవం.అంచేత రిక్షావాడి రేటుబట్టి ఆ పట్నం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏ స్థాయిలో వుందో ఈజీగా చెప్పేయవచ్చంటారు. ఒకే దూరానికి రిక్షావాడు రాజమండ్రిలో అర్ధరూపాయికి కడ్డాడు. విజయవాడలో ముప్పావలాకి కడ్డాడు. వైజాగులో అర్థలూ, పావలాలు నైజానా! మూడు రూపాయలవుద్ది, యిష్టమైతేరా, కష్టమైతే పో అంటాడు.రెండు రూపాయలివ్వడం దిబ్బమ్మకి తన జరుగుబాటు బట్టి పెద్ద కష్టమేమీ కాదు. కాని కనిపించే ఆ మాత్రం దూరానికే రెండు రూపాయలు అర్పించాలంటే యెవరి మనసైనా ఎలా ఒప్పుతుంది?దిబ్బతనం “సుఖంగా, హాయిగా కష్టబడకుండా బతికేస్తున్నాడు” అనే దానికి సాక్ష్యం, సంకేతం. కాని దిబ్బమ్మ కష్టజీవి. ఆమె కష్టపడి సంపాదించడాన్నే నమ్ముకుంది. ప్రేమిస్తుంది, ఇష్టపడుతుంది. కోరుకుంటుంది. ఏడేళ్ళ కిందట జబ్బు పడి ఒళ్ళు వచ్చింది గాని అంతకుముందు రివటలా లేకపోయినా లావు మాత్రం కాదు.తను కష్టం చేసి తను బతగ్గలిగింది.పిల్లా, పాపని పెంచగల్గింది. కాని ఒక్క పైసా కూడా కూడబెట్టలేక పోయింది. తన శ్రమంతా ఏ గంగలో కలిసిపోయి ఎవరి పూలతోటలు పెంచిందో ఇంకెవరి పళ్ళ తోటలు పెద్దచేసిందో ఆమెకి తెలీదు. దగాలు, దోపిడీలు… వీటి అర్థాలు తనకి ఇప్పటికీ సరిగా తెలీవు. తను చేసే పని – కూలి పని. ఎంతో నిక్కచ్చిగా, నిజాయితీగా చేసేది. వూరికే గోడు గిల్లుకుంటూ వుండడం ఇష్టం వుండేది కాదు. రోడ్డుమీద పేడని కూడా వూరికే పోనిచ్చేది కాదు. పిడకలు పెట్టి అమ్మేది. బొరిగతో చకచకా గడ్డికోసి గంపలకి గంపలెత్తి అమ్మేది. కాని కూతురికి పావుతులం బంగారం కొనలేక పోయింది.అయితే ఇప్పుడు ఆ కూతురు మెడలోనే పది తులాల బంగారం పెట్ట గల్గింది. అది తన కష్టంతోకాదు – అదృష్టం వల్ల. తనకి అదృష్టం, రోగం ఒకేసారి వచ్చేయి. అదృష్టం ఆస్తి తెచ్చింది. రోగం వంటికి నీరు నెక్కించింది. సోములమ్మగా ఎవర్కీ తెలీనితను దిబ్బమ్మగా ఆ వూళ్ళో ప్రసిద్ధి కెక్కింది. తన పెనిమిటి పదిహేనేళ్ళు మిలటరీలో సేవచేసినందుకు ఐదెకరాల బంజరు పొలం బహూకరించింది….. ప్రభుత్వం. ఎందుకూ పనికిరాని ఆ భూమి పక్కనే ఐదు వేల మంది పనిచేసే ఫేక్టరీ లేచింది. దాంతో ఆ భూమికి ఎక్కడలేని గిరాకీ వచ్చింది. ఒక ఉద్యోగి వచ్చాడు. ఆ భూమిని ప్లాట్లు వేసి అధిక లాభానికి అమ్మి పెడతానన్నాడు. అందులో నూటికి 10 రూపాయల కమీషన్ ఇమ్మన్నాడు. ఆ వ్యవహారాలు తెలీక తన పెనిమిటి అందుకు ఒప్పుకున్నాడు. చివరికి ఆ ఉద్యోగి కమీ షన

S1 Ep 214'పేపర్ టైగర్' - ఎన్ ఎస్ ప్రకాశరావు గారి రచన
ఎన్ ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. ‘ఎన్నెస్ కథలు’ వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు. ముందుగా ఈ కథ గురించి ‘ కథా’ నవీన్ గారు మాట్లాడతారు. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి, ముందు మాటనందించిన నవీన్ గారికి కృతజ్ఞతలు. “ఈ వర్షం ఇప్పుడిప్పుడే వదిలేలాగ లేదబ్బాయ్!” అన్నారు నరసింహం గారు, కిటికీలోంచి బయటికి చూస్తూ. ఆయనకి చాలా చిరాగ్గా వుంది.‘నువ్వు ఇప్పుడిప్పుడే నన్ను వదిలేలాగ లేదబ్బాయ్!” అన్నట్టు విన్పించింది ‘అబ్బాయ్’కి. అబ్బాయ్ పేరు వరప్రసాదరావు, అతనా గదిలో ఒక సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్నాడనడం కంటే సోఫాని ఆనుకొని ‘గోడ కుర్చీ’ వేసేడనడం సబవు. తను కూర్చుంటే సోఫాకి ఏం నొప్పెడుతుందో, ఏ కుళ్ళు అంటుకుంటే నరసింహంగారు, ఏం చేసేస్తారో అని భయపడుతున్నవాడిలా వున్నాడతను. .ఆ సాయంకాలం అతను నరసింహం గారింటికి వస్తూ వుంటే, అల్లంత దూరంలో వుండగానే టపటపా చినుకులు పడ్డం ఆరంభించాయి. వాళ్ళింటికి వచ్చేసరికి అతని చొక్కా వొంటికి అతుక్కుపోయింది. ఎత్తుగా దువ్విన జాత్తు అణగారిపోయి బుర్రకి అంటుకుపోయింది. నీళ్ళతో కలిపి, నూనె తలమీంచి కారి మొహమంతా జిడ్డులా తయారయింది. నరసింహంగారి ఇంటికి వచ్చాక మెట్లెక్కి, వరండాలో నుంచుని రుమాలుతో – తల తుడుచుకోవాలో, మొహం తుడుచుకోవాలో తేల్చుకోలేక మోచేతులు తుడుచుకుంటూ కాలింగ్ బెల్ నొక్కేడతను.ఆ సమయంలో నరసింహం గారొక్కరే ఇంట్లో వున్నాడు. ఆయన కొడుకూ, కోడలూ, మనవలూ అంతా ఏదో పార్టీకి వెళ్ళేరు. –కాలింగ్ బెల్ విని ఆయనే తలుపు తీసేడు. తలుపు తియ్యగానే – చామనచాయవాడు, జిడ్డుమోమువాడు, రెండుపదుల వయసువాడు, బక్క పలుచనివాడు – వర ప్రసాదుడు కనిపించాడు. అతని రూపురేఖా విలాసాలు చూసేక, లోపలకు రమ్మనాలో, బైటవుంచి ‘ఏవరికోసవని’ అడగాలో తేల్చుకోలేక డోర్ నాబ్ పట్టుకొని ఒక్క క్షణం ఆలా నిల్చుండిపోయేడాయన..నరసింహంగారిని చూడగానే వరప్రసాదరావు నోరు పెగల్లేదు. పెద్దపులిని చూచినట్టు ఒక్కసారి జడుసుకున్నాడు. కనిపించగానే వినయంగా నమస్కారం చెయ్యమని మరీ మరి చెప్పి పంపించిన తాతగారి మాటే మర్చిపోయేడు. నరసింహంగారి మొహం చూసూనే ఎందుకోగాని గాభరాపడిపోయేడా కుర్రవాడు.నరసింహంగారికి ముఖంలో రంగులు మార్చడంలో ఒక ప్రాక్టీసు వుంది. ఆయన తన చిన్న మనవడితో ఆడుకుంటున్నప్పుడు ఎంతగా బోసి నవ్వులు చిందిస్తాడో, అదే సమయంలో పని కుర్రాడితో మాట్లాడవలసొస్తే అంత కటువుగానూ వుండగలడు. పూర్వంకూడా తన క్లయింట్లతోనూ, జడీలతోనూ ఎంత మృదు మధురంగా మాట్లాడేవాడో తమ వూళ్ళో రైతులతోటి, కూలీలతోటీ అంత కర్కశంగా మాట్లాడేవాడాయన. ఎవరెనా కొత్తవాళ్ళను చూసీ చూడ్డంతోపే, విధిగా ఆయన ముఖంలో రంగులు మారతాయి. అవతలవాణ్ణి చూస్తూనే ఒక అంచనా వేసుకొంటాడు. దాంతో ముఖం ప్రసన్నంగా పెట్టడం ‘గంభీరంగా పెట్టడవా’ ‘ప్రసన్న గంభీరంగా పెట్టడవాఁ’ అన్నది తేల్చుకొంటాడు.కాని వరప్రసాదరావుని చూసి ఎలా ముఖం పెట్టాలో ఆయనకి వెంటనే తెలియక తటపటాయించాడు.ఇంతలో ఆ కుర్రవాడు జేబులోంచి ఓ వుత్తరం తీసి ఇచ్చేడు. అది చూస్తూనే, అయోమయపు రంగులోంచి కొంచెం ప్రసన్నపు రంగులోకి మొహాన్ని మార్చుకొన్నాడు నరసింహంగారు.“రా లోపలికి” అన్నాడాయన.తను వచ్చిన పని సగం అయిపోయినట్టేననిపించి, చిన్న పొంగు పొంగిపోయేడు. వరప్రసాదరావు,కాని,వెంటనే నరసింహంగారు జోళ్ళు ………. అంటూ అర్థాంతరంగా ఆగిపోవడంతో ఒక్కసారి కుంగిపోయాడా అబ్బాయి.ఆ కుర్రవాడి జోళ్ళు చిరు బురదతో వున్నాయి. “ఆయన చెప్పబట్టి సరిపోయింది కాని, అమ్మబాబోయ్! ఆ జోళ్ళతో లోపలికి వచ్చేస్తే ఇంకేదన్నా వుందా?” అనుకొని మనసులోనే ఫెడీ ఫెడీమని లెంపలు వాయించేసుకొన్నాడు వరప్రసాద రావు.జోళ్ళు బైటే వదిలి, లోపలికి వచ్చి సోఫాముందు ‘గోడ కుర్చీ’ వేసేడా కుర్రవాడు. “సరిగా కూర్చో పరవాలేదు’ అందామని నోటిదాకా వచ్చింది కాని మరెంచేతో నరసింహం గారు అనలేదు.ఆ కుర్రవాడి తాతగారూ, నరసింహం గారూ, చిన్నప్పుడు క్లాసుమేట్సు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ – ‘చదువు లేకపోతే మన బతుక్కి మరో దారీ తెన్నూ లేదు. చదువుకోకపోతే మట్టి కొట్టుకు పోతాం సుమా – అనుకొని కష్టపడి చదువుకొన్న వాళ్లే కానీ , పెద్దలు చెప్పినట్టు రోజులు అందరికీ ఒక్కేలా వుండవు కదా!నరసింహంగారికి రోజులు మారేయి. దశ మళ్ళింది. ఆ రోజుల్లో కుర్ర నరసింహాన్ని చూసి – తన బాగుకోసం, అవసరం వస్తే – ‘అమ్మ లేదు, నాన్న లేడు, అన్న, చెలి ఎవరూ లేరు లేరంటే లేరు’ అని ఈ కుర్రవాడు అనుకోగలడని ఎలా పసిగట్టారో గాని, పసిగట్టేరొక పెద్ద ప్లీడరుగారు. అంత చిన్న వయసులోనే ఆ కుర్రవాడికి ‘జ్ఞానోదయం’ కలిగినందుకు తెగ మురిసి పోయేడాయన.ఆ తరువాత నరసింహంగారు – ఆ ప్లీడరు గారింటికి ఇల్లరికపుటల్లుడుగా వెళ్ళేడు; మద్రాసుకీ ‘లా’ స్టూడెంటుగా వెళ్ళేడు. కోర్టుకి మావగారి జూనియర్ గా వెళ్ళేడు. ఆ తరువాత ఎన్నెన్నో చోట్లకి ఎంతో గొప్పగా, గర్వంగా వెళ్ళేడు.నరసింహంగారికి భగవంతుడంటే, చెప్పలేనంత భక్తి. కాని ఆయనకి మావగారంటే అంతకన్న ఒక్క పిసరు ఎక్కువ భక్తి. ఆయన పావుగంట సేపు మాట్లాడేడంటే అందులో అరగంట సేపు మావగారిని గురించి రిఫరెన్సే వుంటుంది.నరసింహంగారికిప్పుడు ముగ్గురంటే ముగ్గురే మగపిల్లలు. ఆయన పెద్ద కొడుకు బొంబాయి దగ్గిర ఏదో ఆయిల్ రిఫెనరీలో జనరల్ మేనేజర్ హోదాకి ఒకే ఒక మెట్టు కింద వున్నాడు. అందుగురించి నరసింహంగారెప్పుడూ చిరాకు పడుతూనే వుంటారు. రెండో కొడుకు ఈ వూళ్ళోనే యూనివర్సిటీలో అసిస్టెంటు ప్రొఫెసరుగా వున్నాడు. అతను ఇప్పట్లో ప్రొఫెసరవాలంటే, ఇప్పుడు ప్రొఫెసరుగా వున్నాయన హఠాత్తుగా హారీమవడం ఒక్కటే మార్గం.అది తల్చుకున్నప్పుడల్లా నరసింహంగారికి ఆ ప్రొఫెసర్ పీక పిసికేద్దాం అన్నంత కోపం వస్తూంటుంది. మరి మూడోవాడు అమెరికాలో రిసెర్చి చేస్తున్నాడు. అమెరికాలో ‘స్టూడెంట్ రివోల్ట్’ గురించి ఎప్పుడయినా పేపర్లో చూసినప్పుడు కించిత్తు గాభరా పడినా, మొత్తంమీద నరసింహంగారికి ఆ చిన్నవాణ్ణి గురించిన చింతేమీ లేదు.ఇక ఆ సమయంలో నరసింహంగారి పుట్టింటివాళ్ళ దశకూడా మారింది. చదువు

S1 Ep 211ది ఫ్రెండ్స్ - ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన
ది ఫ్రెండ్స్ - ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన ఎన్ ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. 'ఎన్నెస్ కథలు' వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు.కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి కృతజ్ఞతలు. పుస్తకం కొనడానికి - *************ఇంకా తెల్లవారలేదు.శీతాకాలం మంచు బాగా కురుస్తోంది. సముద్రపొడ్డునే వున్న ఆ పొడుగురోడ్డు నిర్మానుష్యంగా వుందనే చెప్పాలి. ఒకవేళ ఎవరైనా వున్నారేమో? ఆ మంచుతెరల్లోంచి మాత్రం ఎవరూ కనబడడంలేదు. చలికి జడిసే కాబోలు పక్షులు కూడా ఇంకా గూళ్ళు వదిలి రావడంలేదు. సముద్రపు హోరునికూడా ఆ మంచు మింగేసినట్టుంది; ఆ పక్కని సముద్రమే లేనట్టుంది. స్టీమర్లలో దీపాలు కాబోలు ఏవో ఆకాశదీపాల్లాగా మసక మసకగా కనబడుతున్నాయి. రోడ్డుకి రెండోవైపు ఇళ్లున్నాయి. గాని పొగమంచుతో కప్పడిపోయేయి. తెల్లారగట్ట లేచి చదువుకొనే కుర్రాళ్ళ గదుల్లో దీపాలు కాబోలు అక్కడక్కడా కనబడీ కనబడనట్టు కనబడుతున్నాయి.మంచుని చీల్చుకొంటూ ఎవరో ఇద్దరు మనుషులు వస్తున్నారు. వాళ్ళ ముఖాలు స్పష్టంగా కనబడకపోయినా - వాళ్ళలో ఒకరు లావుగాను, మరొకరు అంతలావుగా లేనట్టూ కనబడుతున్నారు. అంత లావుకాని ఆయనచేతిలో వాకింగ్ స్టిక్ వుంది. దాన్ని మహా జోరుగా ఊపుతూ నడుస్తున్నాడతను. లావుగా వున్నాయన నోట్లో పైపొకటి వుంది. నోట్లో వుంచుకొనే ఏదో మాట్లాడుతున్నాడతను. ఇద్దరూ నెమ్మదిగానే నడుస్తున్నా లావుపాటాయన కొంచెం ఈడుస్తూ నడుస్తున్నట్టూ, రెండో ఆయన ట్రిమ్ గా నడవడానికి ప్రయత్నిస్తున్నట్టూ ఉంది. వాళ్ళిద్దరూ తలలకి మఫ్లర్లు చుట్టుకొన్నారు చలికోట్లు వేసుకున్నారు. కాళ్ళకి బూట్లు తొడుక్కున్నారు.వారిద్దరిలోనూ పైపు పట్టుకొన్నాయన యూనివర్సిటీలో అదేదో శాస్త్రంలో అసిస్టెంటు ప్రొఫెసరు. వాకింగ్ స్టిక్ పట్టుకొన్నాయన అదే యూనివర్శిటీలో మరేదో శాస్త్రంలో ప్రొఫెసరు.“మేష్టారూ!" అన్నాడు అసిస్టెంటు ప్రొఫెసరు “రష్యాలో కూడా చలి విపరీతంగా ఉంటుంది, గానండి, అదంతా అదోరకం బ్యూటీసార్, నేను అక్కడ కూడా అప్పుడప్పుడు మార్నింగ్ వాక్ కి వెళ్ళేవాణ్ణిలెండి... కోటుజేబులో చిన్న వోడ్కా బాటిల్ పడేసుకొని" అంటూ పైపు చేత్తో పట్టుకొని, బడబడ నవ్వేడతను.ప్రొఫెసరు ఏం మాట్లాడలేదు. ఆయన రష్యా వెళ్ళలేదు గాని, అమెరికా వెళ్ళేడు. అతను చిన్నప్పట్నించీ జబ్బు మనిషి. అమెరికాలో వున్నన్నాళ్ళూ హాస్పిటల్లోనే వున్నాడు. మంచుతెరలూ, మోణింగ్ వాకులూ అతనెరుగడు. తన అనారోగ్యం గురించి అతనెప్పుడూ చికాకుపడుతూనే వుంటాడు. అందుకే ఏం మాటాడలేదు.ఆయన మౌనాన్ని అర్థం చేసుకొన్నట్టున్నాడు, టాపిక్ మార్చేడు అసిస్టెంటు ప్రొఫెసరు. అసిస్టెంటు ప్రొఫెసరు పేరు ఎమ్.మారుతీరావు ఎమ్మెమ్ రావంటారు. స్టూడెంట్ సర్కిల్సులో మొద్దు మాస్టారనీ, ఏమేమీ రావనీ' ముద్దు పేర్లున్నాయతనికి.హెల్తుకి యోగాసనాలు మంచివి మేష్టారూ!... ఈ వయసులో యోగాసనాలేం చేస్తాంలెండి కాని, మోడింగ్ వాక్ ఫఱవాలేదు. మీకెందుకు, ఇలాగ నాలుగు రోజులు మీరు నాతో రండి. అయిదోరోజు మీరే వచ్చి నన్ను పిలుస్తారు” అన్నాడు మళ్ళీ దడదడ నవ్వుతూ,ప్రొఫెసరు క్లుప్తంగా “వూc" అని వూరుకొన్నాడు.ఆయన పేరు ప్రొఫెసర్ జె.గోవర్ధన గిరిధారి. ప్రొఫెసర్ జె.జీ.ధార్ అంటారు. జబ్బు గురుడు". ఆయన రహస్య నామం.కొంతసేపు ఏమీ మాట్లాడకుండానే నడవసాగేరు వాళ్ళిద్దరూ. ఈ ఇద్దరి మధ్యా చాలాకాలం నించి మంచి స్నేహం వుంది. వాళ్ళ స్నేహానికి ఒక కారణం - ఇదే ముఖ్యమైన కారణమని కొందరు అంటారనుకోండి - వాళ్ళిద్దరిదీ ఒకటే కులం అవడం - అదీ కాకుండా 'మరో విషయంలో కూడా ఇద్దరిదీ ఒకే "కులం". ఉన్నత విద్యకోసం యూనివర్సిటీ ఖర్చుమీద ' విదేశాలకి వెళ్ళి, ఉన్న విద్యతోనే తిరిగొచ్చేరు. ఇద్దరూ.. |చదువుకొనే రోజుల్లో (అంటే విద్యార్థి దశలో) తనశాస్త్రాన్ని మారుతీరావు ఎన్నడూ (సరిగా) చదువుకోలేదు. ట్యూటరయేకా చదవలేదు. లెక్చరయేక అంతకన్నా లేదు. ప్రొఫెసరయేక అసలులేదు. అతను కొద్దిరోజుల్లోనే ప్రొఫెసరయే అవకాశం వుంది. అవగలనన్న నమ్మకం కూడా అతనికి వుండేది నిన్నమొన్నటి దాకా. కులం ఎంచేతంటే, అతని కులం వాడొకాయన రాష్ట్ర మంత్రివర్గంలో స్టేట్ మంత్రిగా వుంటున్నాడు. అతను కనీసం క్యాబినెట్ మంత్రయినా (కా(లే) నంద్‌కు అతను (అంటే అసిస్టెంటు ప్రొఫెసరు) మహాచిందులు తొక్కేవాడు. అయితే, ఈ మధ్య అతనికి కొత్త సమస్య ఒకటి తగులుకొంది. ఆ సమస్య - కంటిలోనలుసు కన్నా, కాలిలో ముల్లుకన్నా ఎక్కువగా అతన్ని బాధిస్తోంది. “ఈ అసిస్టెంట్ ప్రొఫెసరుకి ఏమీరాదనీ, ఇంగ్లీషు(లో) కూడా సరిగా మాట్లాడలేడనీ” - ఇతన్ని గురించి ఆకాశరామన్న ఉత్తరాలు పై అధికార్లకి అందేయి. (మారుతీరావు ఇంగ్లీషు గురించి విద్యార్థిలోకంలో బోలెడు జోక్సు ప్రచారంలో వున్నాయి)దానికి తోడు ఆ స్టేట్ మంత్రి ఏవో పంతాలకిపోయి, ఉన్న పదవికి కాస్తా రాజీనామా ఇచ్చేస్తానంటున్నాడని వార్త వచ్చింది. వీటన్నింటినీ మించి మరో పెద్ద డేంజరస్ విషయంలో ఇరక్కున్నాడతను. రష్యానించి తిరిగివచ్చిన కొత్తలో, అడగనివాడిదే పాపమన్నట్టు అందరికీ రష్యా గురించి గొప్పగా చెప్పేవాడు. అక్కడ పరిశ్రమల గురించీ, పాడిపంటల గురించి,పాఠశాలల గురించీ, పసిపాల గురించీ, పంతుళ్ళ గురించీ తెగ పొగుడుతూ చెప్పేవాడు. దాంతో అతనికి "కమ్యూనిస్టు” అన్న పేరు వచ్చింది. ఇంత ఆస్తివున్నా, తను "కమ్యూనిస్టు" అని పిలవబడు తున్నందుకు అతను చాలా గర్వించేడు. అయితే, కొన్నాళ్ళకే అతనికి ఒక నగ్న సత్యం తెలిసొచ్చింది. 'సభ్యసమాజంలో కమ్యూనిస్టనిపించుకోవడం ఇంటికి వంటికి మంచిది కాదని అర్థమయింది. అర్థమయిన తరువాత ప్లేటు మార్చి, నుదుట తిలకం దిద్ది ఇంట్లో గోడల్నున్న రష్యాదేశపు ప్రకృతి దృశ్యాల చిత్రపటాలుకూడా తీసిపారేసి - ఎంతగా “మంచిబాలుడు” గా చలామణి అవుదామని ప్రయత్నం చేసినా, చేసిన పాపం ఏడేడు జన్మలదాకా వెంటాడినట్టు అతనికి కమ్యూనిస్టన్న పేరు మాత్రం పోలేదు. రాబోయే ప్రొఫెసరు పదవికి ఇది కూడా అడ్డు తగుల్తుందేమోనని భయంగా వుందతనికి.ప్రొఫెసర్ జెజిధార్ స

S1 Ep 208హర్షణీయంలో స వెం రమేష్ గారి ఇంటర్వ్యూ నించి కొన్ని భాగాలు
స.వెం.రమేశ్ గారు జీవితమంతా తెలుగు భాషా ప్రాచుర్యానికే అంకితం చేసిన అపురూపమైన మనిషి. హర్షణీయంతో ఆయన మనం కోల్పోతున్న భాషా వైభవాన్ని సంస్కృతిని గురించి, మాట్లాడుతూ , ఈ ప్రయాణంలో తాను దాచుకున్న అనేక అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు. ఈ వారాంతం హర్షణీయం ద్వారా ప్రసారం అవబోయే ఆయన ఇంటర్వ్యూ నించి కొన్ని భాగాలను ఇప్పుడు మనం వినొచ్చు.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 206స వెం రమేష్ గారి 'ప్రళయకావేరి కథలు' ఒక పరిచయం
'ప్రళయకావేరి కథలు'రచయిత స.వెం.రమేశ్ ఎం.ఎ. (ఆంత్రొపాలజీ,)ఎం.ఎ. (తెలుగు) చదివారు. తెలుగు భాషకోసం అంకితమై పనిచేస్తున్న కార్యకర్త స.వెం.రమేశ్. తమిళనాడులోని తెలుగుభాషా సంస్కృతుల పరిరక్ష, ణ, అభివృద్ధి ఆయన కార్యక్రమం. తెలుగు భాషోద్యమ స్ఫూర్తితో చెన్నై కేంద్రంగా తమిళనాడులో తెలుగు భాషాపరిశోధన, బోధన, ప్రచారాల కోసం ప్రారంభమైన 'తెలుగువాణి' (ట్రస్టు) సభ్యుడుగా, పూర్తి సమయ కార్యకర్తగా వున్నారు.'ప్రళయకావేరి' అందమైన పేరుగల అందమైన సరస్సు, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఎక్కువగా, తమిళనాడు తిరువళ్ళూరు జిల్లాలో కొద్దిగా పరుచుకున్న ఉప్పునీటి సరస్సు. ప్రళయకావేరి తల తమిళనాడులో, మొండెం ఆంధ్రలో. సరస్సులో నలభై వరకూ దీవులు. మనిషికీ మనిషీకి, దీవికి దీవికి నడుమ కంటికి కనిపించని అనురాగ సేతువులు. ప్రళయకావేటి పల్లెల్లో తిరుగుతూ ఉంటే ఆ పల్లీయులనోట ఎన్నెన్ని కథలో, ఎన్నెన్ని పాటలో...ప్రళయకావేటి పుట్టుక గురించి, ప్రళయకావేటి లోని పెద్దపుణ్యక్షేత్రం 'పంటరంగం' గురించి పల్లె పల్లెలోనూ రకరకాల కథనాలు.ప్రళయకావేరి గుండెకాయ అయిన శ్రీహరికోటలో 1969 లో రాకెట్ కేంద్రం నిర్మాణం కారణంగా దీవిలోని ప్రజలు నిరాశ్రయులైనారు. చంగలపాలెం, కాకరమూల, కిళివేడు, రవణప్ప సత్రం, వంటోరిపాళం, సూళ్లదొరువు వంటి పలుగ్రామాల ప్రజలను, నూరుమైళ్ల దూరంలోని మెట్టపొలాలకు తరిమింది కేంద్రప్రభుత్వం.పల్లెబతుకులతోపాటు అక్కడి ప్రాచీనదేవాలయాలు కూడా శిథిలమై రాకెట్ కేంద్రం స్థాపన మూలంగా నాశనమై పోయాయి. ఆ తరువాత పదేళ్లకు అభివృద్ధి పేరుతో ప్రళయకావేరి దీవుల్లో వేసిన గులకబాటలు, కరెంటుతీగెలు పట్టణనాగరికతను పల్లెలోకి తెచ్చింది. ప్రభుత్వంవేసిన గులకబాటలు, వర్షాధారమైన తమిదల్ని పండించడం మానివేసి, వరి పండించుటకై ప్రజలు వేసుకున్న చెరువుకట్టలు కలిసి, ప్రళయకావేట్లోని సహజమైన ఉప్పునీటిని కదలకుండచేశాయి. ప్రళయకావేట్లో కలిసే ప్రవాళం, కాళంగి, స్వర్ణముఖి, అరుణ కరిపేరు, చిలికేరుల్లో వానలేకా, ఎగువ ఆనకట్టలు కట్టెయడం వలన నీరు పారడం అగిపోయింది. ముఖద్వారాలలో ఇసుకమేటవేసి ఆటుపోట్లద్వారా వచ్చే సముద్రపు నీరు తగ్గిపోయింది. పేటలోని సినిమాలు మరిగి, ప్రళయకావేటి వారు జానపదాలను మరచిపోయినారు. ఇందతా, కళ్లముందే ఒక్క బతుకులోనే, తటాలున, చటుక్కున మాయమైపోవడం, అంతరించిపోతున్న ఆ సరస్సు జీవనాన్ని చూస్తూ తపించిపోయిన రచయిత నాటి వైభవాన్ని సజీవంచేసి, పాఠకులముందుంచిన ప్రయత్నమే ఈ 'ప్రళయకావేరి కథలు'.ఆనాటి ప్రళయ కావేరి సరస్సు ఈనాటి 'పులికాట్' లేక్. ‘ప్రళయ కావేరి కథలు’ పుస్తకం కొనాలంటే - https://bit.ly/2TXhEubహర్షణీయం పాడ్‌కాస్ట్ ని –‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://bit.ly/harshagaanaaస్పాటిఫై (Spotify )యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyamఆపిల్ (apple podcast) ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5వెబ్ సైట్ : https://harshaneeyam.in/allహర్షణీయం ఫేస్ బుక్ లో - https://www.facebook.com/Harsha051271హర్షణీయం ట్విట్టర్ - @harshaneeyamహర్షణీయం యూట్యూబ్ లో - https://bit.ly/harshayoutubeThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 205మా ఊరి నీళ్ల పురాణం:
పైన చెరువు, మధ్యలో వూరు, వూరికింద పొలాలు, పొలాల క్రింద, ఎంత ఎండాకాలం లో అయినా ఒక్క పాయన్నా పారే వాగులతో, అద్భుతమైన గ్రావిటీ నీటి పారుదల వ్యవస్థ వున్న మా వూళ్ళో, తవ్వితే పడేది మాత్రం ఉప్పునీళ్ళే. నీళ్లు పడ్డం అయితే ఇరవై ముప్పై అడుగుల్లోపలే పడతాయి, నోట్లో పోసుకుంటే కానీ తెలీదు ఎంత ఉప్పగా వుంటాయో. రాక రాక వచ్చిన జామ చెట్టు కాయలు, బాదం కాయలు, సపోటా కాయలు కూడా జవ్వ బారిపోయుంటాయి. అందుకు వచ్చిందేమో ‘ఉప్పలపాడు’ అని మా వూరికి పేరు. మా వూళ్ళో మూడు రకాల బావులు. ఊరికి దూరంగా ఉండేది చెరువు అవతల వైపు ఒక మంచెళ్ల బావి. ఆ నీళ్లు కేవలం తాగడానికి మాత్రమే. ఊరి పైభాగాన, చెరువు కింద ఉండేది నడీది బావి. ఆ నీళ్లు అన్నం ఎసుటి మాత్రం వాడే వాళ్ళం. ఇక వుప్పు నీళ్లు స్నానాలకు కాల కృత్యాలకి. ఆబ్బో! ఆ వుప్పు నీళ్లకే పెద్ద డిమాండ్ మా వూర్లో ఎందుకంటే అందరం బావులు తొవ్వించుకోలేము కదా. అలా ఇంట్లోనే బావుండే మా శంకరవ్వ లాటి వాళ్ళ ప్రాపకం కోసం మాలాంటోళ్లం, పడరాని పాట్లు పడేటోళ్ళం. శంకరవ్వ, వాళ్ళ కోడి పక్కింట్లో గుడ్డు పెట్టేసిన రోజో, లేదా శంకరవ్వ దగ్గర పాలుపోయించుకొనే వాళ్ళు, “కలిపితే కలిపావమ్మా కాస్త మంచెళ్ళు అన్నా కలపకూడదా అన్న రోజునో” మనసు పాడుచేసుకునేది.అలా పాడైన రోజున మా నీళ్ల ఆశ మీద నీళ్లు చల్లి, మనసు ఉల్లాస పరుచుకోవటం ఆవిడ సరదా. అలాంటి శుభదినాల్లో , మా అమ్మ పిల్లకాయల్ని అందరినీ తీసుకొని ‘చలో పంటకాల్వ’ అని పొలాల్లో కి పట్టకెళ్లి మా వొళ్ళు తోమేసేది. పంటకాల్వ దగ్గరికి పోవడం ఒక పిక్నిక్ లాంటిది మా పిలకాయలందరికీ,పాపం మా ఊరి ఆడపిల్లకాయలు, ఎప్పుడన్నా నెల్లూరు కో , బుచ్చిరెడ్డి పాలెం కో సినిమాకెళ్లి , అక్కడ ప్రకటనల్లో కన్పడే సినీ తారల సౌందర్య రహస్యాన్ని వాళ్ళ నోళ్ళ ద్వారానే వినేసి, మూకుమ్మడిగా ముచ్చట పడి, కొనుక్కొచ్చుకున్న లక్స్ సబ్బులు, మా ఊరి నీళ్ళకి నురుగు బదులు ఒంటిమీద విరిగిపోయిన పెరుగులయిపోయేవి. ఈ కారణం చేత అందందేముందబ్బా, ఆరోగ్యం ముఖ్యం, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందొ ఆరోగ్యం అక్కడ వుంది అన్చెప్పి, మా వూళ్ళో ఆడపిల్లంతా, లైఫ్ బాయ్ కి బ్రాండ్ అంబాసిడర్లు అయిపోయారు. నిత్యం ఉప్పునీళ్లతో ఒళ్ళు ఉతుక్కున్నా, మా ఊరి ఆడపిల్లకాయల కళే వేరబ్బా. ఇగన, ఊరికి అవతలెక్కడో వున్నా మంచెళ్ల బాయి నుండి నీళ్లు తెచ్చుకోవటం పెద్ద ప్రహసనం. మా ఊరి అబ్బాయిలు బాధ్యత కల వాళ్ళో లేదో అనే విషయం, యీ బాయి నుండి నీళ్లు తేవటం లో తెలిసిపోయేది. పెద్దోళ్ల మాటల్లో తరచూ వినపడేవి, "ఆ శేష మావ కొడుకు వయినమైనోడమ్మా! ఇంటికి సరిపడా నీళ్లు ప్రతీ దినం మోసుకొస్తాడమ్మా అనో లేక ఆ సుందరయ్య కొడుకు చాలా పెడద్రపోడమ్మా, ఏనాడన్న గుక్కెడు నీళ్లు తెచ్చి ఉండడు అనో". నీళ్లు తెచ్చే వాడికే పిల్ల నిచ్చే వాళ్ళు ఆ రోజుల్లో. ఇట్టానే నీళ్ల వాడకం బట్టి, మా ఊరి ఆడోళ్లు కుటుంబాన్ని నడిపే పద్దతిని చెప్పేసే వాళ్ళు, " ఆ ప్రమీలమ్మ కోడలిగా వచ్చిందమ్మా! ఆ ఈదలోళ్లు యీదిన పడ్డారమ్మా! ఆ మహాతల్లి కడవల కడవల నీళ్లు పుసుక్కున పారబోసేదమ్మా అని. నీళ్ళేమన్నా వంటిమీద నిలుస్తాయమ్మా" అంటూ. ఎవరన్నా పిల్లలు తలి తండ్రులని సరిగ్గా చూసుకోకపోతే, “అంతేనయ్యా, నీరు పల్లమెరుగు అనో మానూరి నీళ్ళలో ఉప్పు పోదు మీ పిల్లకాయల్లో వుండే చెడు పోదు” అంటూ ముసలి వాళ్ళ నిర్వేదం లో కూడా నీళ్ల ప్రసక్తే. మావూరి చెరువులోకి నీళ్లొచ్చే రోజుల్లో మటుకు మా పిల్లకాయలకి పండగే పండగ. ఎప్పుడెప్పుడు చెరువు నిండుద్దా అని ఆత్రం గా చూసే వాళ్ళం. మా పెద్దకాయలేమో, ముందు తూములు ఎత్తేసి పొలాలకు పారిచ్చుకునే వాళ్ళు. అలా పొలాలన్నీ ఒక వారం ఒక తడవ తడిశాక, తూములు బిగిచ్చి చెరువు నిండనిచ్చే వాళ్ళు. మాకైతే పెద్ద వాళ్ళు ఈ పని చేయటం నచ్చేది కాదు. ఎప్పుడు చెరువు నిండుతుందా అని రోజూ చెరువు దాకా పరిగెత్తి చూసే వాళ్ళం. అలా నిండిన చెరువు ఎండటం, మళ్ళీ నిండటం మళ్ళీ ఎండటం, అనేది నీళ్లు నేర్పిన పాఠం నాలాంటోడికి. నేనెప్పుడైనా మంచెళ్ల బాయి దగ్గరకు వెళ్ళినప్పుడు, మాఊరోళ్ళే కొంతమంది వచ్చి, ఎవరన్నా జాలి తల్చి, వాళ్ళ బిందెల్లో కొన్ని నీళ్లు పోస్తారా, అని ఎదురుచూస్తూ , ఓ పక్కన నిలబడ్డం, చూసేవాణ్ణి. వాళ్ళను మటుకు నీళ్లు తోడుకొనిచ్చే వాళ్ళు కాదు ఈ బావిలోంచి. “ఇదేంది మందలా” అని మా వాళ్ళని అడిగితే “అదంతే! నీకు తెల్దులే అబ్బయ్యా” అనే వాళ్ళు మా ఇంట్లో పెద్దోళ్ళు. నేనే ఇంకొంచెం పెద్దయ్యాక, నాకు అర్థమైంది, దేవుడు పోసిన నీళ్లు తాగాలన్నా, మనుషుల్లో వుండే ముందూ వెనకల్ని బట్టేనని చెప్పి. ఒక పదేళ్ల క్రితం అనుకుంటా మా వూరికి కుళాయిలొచ్చాయి. అంటే ఇప్పుడూ ముందూ వెనకాల ఏవీ లేవు. ఊరి జామ చెట్టు కాయలు కూడా తియ్యబడ్డాయ్. వూరంతా తాగేది ఒకే నీళ్లు , మంచి నీళ్లు. పేరు మటుకు ఉప్పలపాడే. నేనే ఇంకొంచెం పెద్దయ్యాక, నాకు అర్థమైంది, దేవుడు పోసిన నీళ్లు తాగాలన్నా, మనుషుల్లో వుండే ముందూ వెనకల్ని బట్టేనని చెప్పి. ఒక పదేళ్ల క్రితం అనుకుంటా మా వూరికి కుళాయిలొచ్చాయి. అంటే ఇప్పుడూ ముందూ వెనకాల ఏవీ లేవు. ఊరి జామ చెట్టు కాయలు కూడా తియ్యబడ్డాయ్. వూరంతా తాగేది ఒకే నీళ్లు , మంచి నీళ్లు. పేరు మటుకు ఉప్పలపాడే. కొన్ని కొన్ని మారవు. మారడానికి టైము పడుతుందేమో.కథను –‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://bit.ly/harshagaanaa స్పాటిఫై (Spotify )యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam ఆపిల్ (apple podcast) ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 వెబ్ సైట్ : https://harshaneeyam.in/allహర్షణీయం ఫేస్ బుక్ లో - https://www.facebook.com/Harsha051271హర్షణీయం యూ

S1 Ep 204తడిసిన నేల - అనిల్
తడిసిన నేల:ముందు ఉన్న సీట్లు , ఊతంగా పట్టుకు నడుస్తూ, బస్సులో వెనకనించీ ముందుకెళ్తున్నాడు రెడ్డి.లైట్లన్నీ ఆర్పేసున్నాయి బస్సులో. బస్సులో కూర్చున్న పది పన్నెండు మందీ, రక రకాల భంగిమల్లో, నిద్రలో మునిగున్నారు. రోడ్డు మీద చిందుతున్న వాన చినుకులు హెడ్ లైట్ వెలుగు లో మెరుస్తున్నాయి. గతుకుల్లోంచీ బస్సు తనను తాను ఈడ్చుకుంటూ ముందుకెళ్తోంది. డ్రైవర్ సీట్ దాకా వచ్చి అడిగాడు, “కందుకూరు ఇంకా ఎంతసేపు ”?“ వానలు గదా …. రోడ్డుగూడా, బాగా దెబ్బతినుంది. ఓ మూడుగంటలు వేస్కో.“ అన్నాడు డ్రైవర్ , తల తిప్పకుండా. వెనక్కి సీటు దగ్గరకొచ్చి చూస్తే, చిరంజీవి గాడు అంగుళం స్థలం కూడా మిగల్చకుండా సీట్ అంతా ఆక్రమించి జోగుతున్నాడు. మెల్లగా భుజం మీద తట్టాడు. సగం కళ్ళు తెరిచి పక్కకు జరుగుతూ అడిగాడు చిరంజీవి - “దగ్గరికొచ్చామా ’’ ?“ఇంకా మూడుగంటలంటున్నాడు డ్రైవరు”“ బాగా లేటు అయ్యేట్టుంది.” “చూద్దాం“ “మరీ లేటయితే, రిక్షాలూ అవీ వుంటాయంటావా” “ అదే ఆలోచిస్తున్నాను. ఈ టైములో ఇల్లు వెతకడం కూడా కొంచెం కష్టమే ”“వెతకడమేంది ,అడ్రస్ మన దగ్గర లేదా “ అన్నాడు కళ్ళు తెరిచి, పెద్దవిచేస్తూ చిరంజీవి. “అంటే , ఏదో సాయినగర్ అని చెప్పినట్టు గుర్తు ““ ఇప్పుడెలా? ఇరుక్కుపోతామేమో ?”“ కందుకూరు మరీ పెద్ద వూరేమీ కాదు . చూద్దాం. ” “వానేమో ఆగట్లేదు. తుఫానో ఏందో , అన్నీ చూసుకుని బయల్దేరాల్సింది. “ అటూ ఇటూ ఇబ్బందిగా కదుల్తూ అన్నాడు చిరంజీవి. “ ఇప్పుడు చాలా దూరం వచ్చేసాం కదా ?” “అవును ““ ఈ టైములో వెనక్కెళ్ళడం తేలికా , ముందుకెళ్ళడమా “ఏవీ మాట్లాడలేదు చిరంజీవి. రెడ్డి కిటికీలోంచి బయటికి చూస్తూ అనుకున్నాడు. “ వీడెప్పుడూ ఇంతే. టెన్షన్‌తో పక్కవాణ్ణి చంపేస్తాడు. అసలక్కడ మూర్తి ఎలా వున్నాడో ఏందో ”రామిరెడ్డి , చిరంజీవి , ఇద్దరూ చిన్నపట్నించీ ఒంగోల్లో ఒకే స్కూల్లో చదువుకున్నారు. రామిరెడ్డి వాళ్ళది పెద్ద వ్యవసాయ కుటుంబం. ఉలవపాడు ఆ చుట్టుపక్కల మావిడి తోటలున్నాయి వాళ్ళకి . చిరంజీవి నాన్నగారు ఎల్ ఐ సీ లో సీనియర్ పొసిషన్ లో పనిచేస్తారు. ఒకడే సంతానం. చిరంజీవి, రెడ్డి , మూర్తితో పాటూ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లో వున్నారు. కంబైన్డ్ స్టడీలూ, కాలేజీ ఎగ్గొట్టడాలూ ముగ్గురూ కలిసే చేస్తారు. అదే కాలేజీలో చదువుతున్న, వాళ్ళ పెద్దమ్మ కొడుకుతో కల్సి చిరంజీవి ఒక రూంలో ఉంటే, వెనక పోర్షన్లో వుండే ఇంకో రూంలో రెడ్డి , మూర్తి వుంటారు. పొద్దున్న బాగా వొళ్ళు నెప్పులని చెప్పి, కాలేజీ కి రాలేదు మూర్తి . సాయంత్రం వచ్చేటప్పటికి రూము తాళం వేసుంది. ఇంటిగలాయనకి కీ ఇచ్చి వెళ్ళాడు, ఊరెళ్తున్నా అని చెప్పి. రూమ్ లోకొచ్చి మెళ్ళో వేసుకున్న ఐ డీ కార్డు టేబుల్ మీద పడేస్తూంటే, ఒక చిన్న కాయితం ముక్క పెట్టుంది . “నాన్న పోయారు. టెలిగ్రామ్ వొచ్చింది. బయల్దేరుతున్నా, ఉన్న డబ్బులు ఛార్జీలకు మాత్రం సరిపోతాయి.”మూర్తికి, రామిరెడ్డి చిరంజీవిలతో తప్ప వేరే ఎవరితో పెద్ద పరిచయాల్లేవు. చదువు తప్ప ఏదీ పట్టదు అతనికి. చిన్నప్పుడే వాళ్ళమ్మ పోయారు . ఇంట్లో డబ్బుల ఇబ్బంది ఉన్నట్టుంది. ఏ నెలా టైం కి అందవు, వచ్చే మనీఆర్డర్లు. పర్సులో వున్న మూడు, వంద నోట్లు చూసుకుంటూ అనుకున్నాడు, కొంచెం తొందరగా బయదేరితే, రాత్రి పది కల్లా కందుకూరు చేరొచ్చు. తలుపు తోసుకుంటూ ‘టీకి పోదాం’ అంటూ చిరంజీవి వొచ్చి “మూర్తి గాడేడీ? క్లాసుక్కూడా రాలేదు” అనడిగాడు. విషయం చెప్తే , “ అయ్యో, నేనూ వచ్చేవాణ్ణి గానీ, రేపు ఏటీడీ లాబులో రికార్డు సబ్మిట్ చెయ్యాలి. ” అన్నాడు “ అదంత కొంపలు మునిగే విషయం కాదు గానీ, అసలు విషయం చెప్పు” అని చిరంజీవి మొహంలోకి చూస్తూ అడిగాడు రెడ్డి . “అంటే… నాకు అలాటి చొట్లకెళ్ళడం కంఫర్టబుల్ గా ఉండదు. మా తాతయ్య పొయ్యినప్పుడుకూడా ఎక్కువ సేపు అక్కడ ఉండలేక పోయాను. ” ఎటో చూస్తూ చెప్పాడు చిరంజీవి. “అది సరే. డబ్బులేవన్నా ఉన్నాయా, మూర్తి గాడికి అవసరం పడొచ్చు.” “ ఒక రెండు వందలు వున్నాయి. అన్న నడిగితే, ఇంకో మూడు నాలుగొందల దొరకొచ్చు. ” అని చెప్పి వెళ్లిన చిరంజీవి, ఓ పదిహేను నిమిషాలలో , ఓ చిన్న బాగు భుజానేస్కుని వచ్చాడు. “బ్యాగ్ ఎందుకేసుకొచ్చావు” “అన్నకు విషయం చెప్తే “ఇట్లాంటప్పుడే, మనుషుల అవసరం, బయల్దేరి వెళ్ళు ” అన్నాడు.” భోజనం అయ్యిందనిపించి, ఆదరా బాదరాగా బయల్దేరారిద్దరూ. కుండపోత వర్షం. గూడూరు లో బస్సు ఎక్కేటప్పటికి బాగా లేట్ అయిపొయింది. ***** పైనుంచి పరుచుకున్న వాన తెర లోంచి బస్సు తీరిగ్గా ముందుకు వెళ్తోంది. రెడ్డి అన్నాడు - “వీడెప్పుడూ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాట్టం గానీ , వాళ్ళనించీ లెటర్లు రావడం గానీ చూడలేదు. ఏదన్నా అలాంటి విషయం వొచ్చినా పొడి పొడి మాటలే . వాళ్ళ అక్క కూడా కందుకూర్లో లేదనుకుంటా. “ అన్నాడు …. “ “ ఎవరో ఒకరు వచ్చి వుండరంటావా ఈపాటికి ”“నాకు అయితే డౌటే. అసలు ఈ వర్షం చూస్తూంటే, చాలా టైం పట్టేటట్లుంది.”“ఏదో ఒక టైం

S1 Ep 203'ఒక వైపు సముద్రం' - నవలాపరిచయం
కన్నడ రచయిత వివేక్ శానభాగ రాసిన " ఒందు బది కడలు" నవల, తెలుగు అనువాదంలోని కొన్ని భాగాలు మీరిప్పుడు వింటారు . ఈ నవలను 'ఒక వైపు సముద్రం' పేరుతో తెలుగులోకి రంగనాథ రామచంద్ర రావు గారు అనువదించారు. ఈ పుస్తకం అమెజాన్ లో ఛాయా రిసోర్సెస్ సెంటర్ ద్వారా లభ్యమౌతోంది.(https://bit.ly/okaviaipusamudram). నవల కొన్న మొదటి యాభై మంది పాఠకులకు, 'సంచారి బుర్రకథ ఈరమ్మ' పుస్తకం ఉచితంగా లభిస్తుంది. ఉత్తర కన్నడ జిల్లా తీర ప్రాంతంలో చాలా నదులొచ్చి సముద్రంలో కలుస్తాయి. ఎంతో అందం గా వుండే ఈ ప్రదేశంలో నివసించే మనుషుల జీవితాలూ, వస్తున్న మార్పులూ, మార్పుల వల్ల వచ్చే సంఘర్షణ, వీటిని అద్భుతంగా ఒడిసిపట్టుకున్న, నవల 'ఒక వైపు సముద్రం'This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 202నిర్మల మొగుడు - తిలక్ గారి కథ
నిర్మల మొగుడు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodayaకథను –‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1(Harshaneeyam on Gaana app)స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam(Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5(Harshaneeyam on Apple. Podcast)నిర్మల మొగుడు:ఖంగారు ఖంగారుగా భోజనం చేస్తున్న భర్త మానసిక పరిస్థితినీ, మొహంమీద పడుతున్న నల్లని వంకీల జుట్టునీ, అదో విధమైన ఆనందానీ అందాన్ని సూచించే అతని రూపాన్ని చూసేటప్పటికి జాలివేసింది నిర్మలకు. –– “తాపీగా తినండి. మీకిష్టమని ఈ గోంగూరపచ్చడి కూడా వేశాను. మీరలాగ కంగారుగా తిని వెళ్ళిపోతే నా మనసంతా ఎంతో బాధపడుతుంది.”“ఒళ్ళమ్ముకున్నాక తప్పుతుందా మరి! ఆ రావణాబ్రహ్మ ఈవేళ ఎలాగైనా నన్ను వదలడులే!”ఈ రావణాబ్రహ్మ అన్న బిరుదు ఎవరికి చెందుతుందో నిర్మలకి తెలుసు. ఆ పేరు చెప్పితే తన భర్త హోరని వర్షములో తడిసి వచ్చికూడా గడగడా మరచెంబుడు నీళ్ళు తాగుతాడన్న విషయం కూడా తెలుసును. కాని ఎదురుగా తన భర్త అంత కంగారుగా భోజనం సరిగా చేయకుండా వెళ్ళిపోతుంటే ఆమె భరించలేకపోయింది. అందులోనూ జరిగిన రాత్రి అతనసలు భోజనమే చేయలేదు. దానికి కారణమైన కలహమూ, ఆ కలహములో మొండిపట్టుపట్టిన తనపాత్ర నిర్వహణా, ఆ కోపములోనే యిద్దరూ భోజనం మానేసి, ఒకే పెద్ద మంచంమీద ఒకరికొకరు తగలకుండా, ఒకరివైపొకరు తిరగకుండా పడుకొని జరిపిన అసిధారా వ్రత నిర్వహణమూ ఇవన్నీ నిర్మలని పశ్చాత్తప్తురాలినిగా భర్తయెడ మరీ సుముఖురాలిగా, ప్రేమచేత కరుణచేత ఆర్ద్రహృదయగా చేసివేశాయి. అందులోనూ అందమైనవాడు, జుట్టు ఆ విధంగా మొహంమీద పడేవాడు. అటువంటివాడు తనకి భర్త అయి, తన సర్వస్వమూ అయినప్పుడు. –• “మీరు ఆ కూర మరోసారి కలుపుకుంటే కాని వీలులేదు. నా మీద ఒట్టే! బోడి ఉద్యోగం పోతేపోతుంది – దీని తాతలాంటిది వస్తుంది. ఊ, మరి కలపండి” అంది.ఈసారి విసనకర్ర పుచ్చుకొని విసురుతూ అతని ప్రక్కన కూర్చుంది. నవ్వుతూ పట్టుదల పట్టుతూ లాలిస్తూ అతనిచేత తిరిగి కూర కలిపించింది. “అయిన ఆలస్యం ఎల్లానూ అయిందిగా? ఇంకో పావుగంట లేటయితే పీకలు తీస్తారా ఏమిటి? సంసారాల్లో ఎవళ్ళకి మాత్రం ఏదో అవసరాలు రాకుండా వుంటాయా, ఆలస్యాలవకుండా వుంటాయా?” అంటూ నొక్కులు నొక్కుతూ సన్నగా దీర్ఘం తీసింది. అసలు ఈ ఆర్గ్యుమెంటుని ఏ కోర్టులోనూ ఒప్పుకోరని తెలుసు. కాని కలహానంతరం అందులోనూ ఒక రాత్రి రాత్రి మౌనంగా వుండి, తిరిగి సంధి కలుపుకొన్న తర్వాత భార్యా భర్త లనుభవించే ఆనందం సరిక్రొత్త ప్రేమలనూ ఉద్రేకాన్ని స్వచ్ఛ పరిమళాన్ని కలిగి వుంటుంది. అటువంటి పునర్నవమైన ఆప్యాయతలో భోజనం పెడుతూంటే, భార్య సన్నవి గాజుల చప్పుడుతో విసురుతూ లాలిస్తూ ఉంటే వేరే కాంక్షించే స్వర్గమే లేకపోయింది గంగాధరానికి. ఆఫీసులూ, బాధలూ, సమస్యలూ అన్నీ చప్పున ఫేడౌట్ అయిపోయాయి. ఆ కాస్సేపట్లోను అతనికి నిత్యమూ, సత్యమూనైన బ్రహ్మానందం గోచరించింది.ఈసారి వాళ్ళ కబుర్లు, ఒకసారి మనస్సులోంచి సమస్యా సందేహాలు దూరమైపోయిన తరువాత – ఏ అడ్డంకీలేని నదీ ప్రవాహంలాగా సాగిపోయాయి. వచ్చే సంక్రాంతి పండుగకి మామగారు ఏం బహుమతి యిస్తారో అన్న ప్రశ్ననుండీ, సినిమాలో ఫలానా నటి తాలూకు నటన విశేషమూ, కో – ఆపరేటివ్ స్కీములో తాము కట్టించబోయే చిన్న సైజు యింటికి యెన్ని గదులు ఉండాలి అన్నంతవరకు అనవసర అవసర సమాలోచనలన్నీ సాగిపోయాయి. అతను చెయ్యి కడుక్కొని లేచేటప్పటికి ఆమె వక్కపొడుం తీసుకొచ్చి ఇచ్చింది. అతను బనీను ధరించేటప్పటికి దువ్వెనతో వచ్చి అతని పాపిడితీసింది. అతను అమెరికన్ జాకెట్ వేసుకొనేటప్పటికి జోళ్ళు రడీగా ఎదురుగా పెట్టింది. అతను ఆమెను ముద్దు పెట్టుకొని “వస్తాను నిర్మలా” అని యధాలాపంగా అలవాటు చొప్పున గోడమీద టైము చూచేటప్పటికి అతనికి స్పృహవచ్చినట్టు – లేక తప్పినట్టు అయింది. కఠిన వాస్తవికత కొరడాతో కొట్టినట్లయింది. అతని నీడ అతని వెనకనే వచ్చి వెన్నుల్లో పొడిచినట్లయింది. ఉన్నపళంగా కుప్పగా కుర్చీలో కూలి “పదకొండుంబావు” అన్నాడు. అతని మొహంలో కత్తినాటుకు నెత్తురు చుక్కలేదు. తెల్లబడిన అతని మొహాన్ని, పిచ్చిగా చూస్తోన్న అతని కళ్ళను చూసి అర్ధాంగి కంగారుపడింది.“గంటంపావు లేటు! ఆఫీసుకు వెళ్ళేటప్పటికి యింకో పావుగంటైనా పడుతుంది. ఇంక ఉద్యోగానికి నీళ్ళు వదులుకోవలసిందే. అసలే కోపిష్టిమనిషి, అందులోనూ దొరల పంక్చుయాలిటీ అంటో ఛస్తోంటాడు. అసలు మొన్నమీ వాళ్ళు వచ్చిన రోజున ఆలస్యమైనందుకే మండిపడ్డాడు. తుది హెచ్చరిక అని చెప్పాడు, మీసాలమీద చెయ్యివేసి. నా కొంప తవ్వేశావు. ఏ పావుగంటో, అరగంటో ఆలస్యం అయితే సర్దిచెప్పుకోవచ్చును. ఇప్పుడేమిటి చెయ్యటం?”నిర్మలకి ఏమీ తోచలేదు. ససంభ్రమ సవిషాద సశంకిత అయి అలాగ నించునిపోయింది. అతను కణతల్ని రెండు చేతులతోనూ అదిమి పట్టుకొన్నాడు. ఈవిధంగా ఆలస్యంగా ఆఫీసుకు దయచేసి ఆ తప్పుని మళ్ళీ మళ్ళీచేసి ఉద్యోగం పోగొట్టుకొని, కొత్తది దొరక్క, మాసిన గడ్డంతో, లోతుకుపోయిన కళ్ళతో రోడ్లుకాస్తూ మిత్రుల్ని అణా, బేడా అడిగి బతుకుతున్న శంకరం స్మృతిపథంలో మెలిగేటప్పటికి అతనికి ఒక్క నిమిషం ఊపిరాడలేదు. అతన్ని లాలిస్తూ భోజనం పెడుతూ, అరగంటకన్న ఆలస్యం అవడంలోని వైప్లవ్యాన్నీ, విపత్తునీ చూడలేకపోయానే అని బాధపడుతోంది ఆమె!“చీ చీ-మీ ఆడాళ్ళింతే! వెధవసొద వేసుక్కూర్చున్నావు. ఇప్పుడు చీవాట్లు తినాలి. డిస్మిస్ అంటే గొల్లుమని ఏడుస్తూ రావాలి. రేపటి నుండి మెతుకులు కూడా ఉండవు.”“అయ్యో నాకేం తెలుసండీ” అంది నిర్మల.“ఏం తెలుసు మరీ? నీ మొగుడేమైనా కలెక్టరనుకున్నావా? మినిష్టరనుకున్నావా! గుమాస్తా అంటే. ఏమిటనుకున్నావు? ఎన్నిసార్లు చెప్పాను నీకు తొమ్మిదింటికల్లా వంట అవ్వాలనీ” కోపంతో కేకలు వేస్తున్నాడు గంగాధరం.“మరి మీరు తొమ్మిదింటికిగా బియ్యం పట్టించుకొని వచ్చింది?” అంది నిర్మల భయంగా.మొదట తడితడిగా కనబడి తర్వాత బలం సంతరించుకొని బిందురూపం తాల్చికొన

S1 Ep 201సిక్స్ ప్యాక్ అనబడే నా కౌపీనం : హర్ష
అబ్బా నా చేతిలో సైకిల్ వుంటే, పొట్ట యిలా పెరిగిపోయేనా, రాకుండా ఆగున్న సిక్స్ ప్యాక్ ఈ పాటికి వచ్చి పొడి పొయ్యేనా , అని జోరీగలా పోరగా పోరగా, యిక వీడిని యిలా ఉపేక్షిస్తే కందిరీగలా కుడతాడు అని డిసైడ్ అయ్యి ఓ నెల కిందట మా ఆవిడ నాకు ఓ పదమూడు వేలు పెట్టి ఓ హైబ్రిడ్ సైకిల్ కొనిచ్చింది. అదే చేతితో, ఒక బెల్, గాలి కొట్టుకొనే పంప్, మెత్తగా వుండే సీట్, అలాగే రాత్రిళ్ళు కూడా తొక్కేస్తా అనే ఉత్సాహం చూపి, ఒక నైట్ లాంప్, రెండు రిఫ్లెక్టర్స్ కూడా కొనిపిచ్చేసుకున్నా. మా ఆవిడ తరవాత రోజు ఆ సైకిల్ కి పసుపు పూసి, కుంకుమ బొట్టు పెట్టి, రెండు నిమ్మకాయలు తొక్కించి, తాను ఎదురొచ్చి నా సైకిల్ యాత్ర ప్రారంభించింది. సైకిల్ తొక్కటం మొదలు పెట్టిన నాకు ఆ తర్వాత కానీ వెలగ లేదు, నా యాత్రకి ఓ రూట్ మ్యాప్ తయారు చేసుకోలేదని. సరే ముందు కాలనీ లోనే తొక్కదామని బయలుదేరా! రెండు వీధులు తొక్కినాక గానీ అర్థం కాలేదు మా కాలనీ లో అడుగడునా స్పీడ్ బ్రేకర్స్ అని మేము భ్రమ పడేవి సిమెంట్ కట్టలు అనిచెప్పి . సైకిల్ ఎక్కి దిగుతుంటే కూసాలు కదిలిపోతున్నాయి. ఓ పదినిమిషాలు తొక్కాక లాభం లేదు రేపు కాలనీ బయటకి వెల్దాము అని ఇంటికొచ్చేసా. పాపం మా ఆవిడ ఆ ముందురోజే నాకు తెలియకుండా బూస్ట్ బాటిల్ తెప్పిచ్చి పెట్టింది నేను తొక్కి తొక్కి అలిసిపోతే అవి తాగి, “బూస్ట్ ఈజ్ సీక్రెట్ అఫ్ హర్షాస్ ఎనర్జీ అనడానికి”. పదినిమిషాలకే తిరిగొచ్చిన నన్ను చూసి ముఖం ముడుచుకొని, నా ఎదురుగానే బూస్ట్ కలుపుకొని, ఉస్ ఉస్ అనుకుంటూ తాగేసింది. నా సమస్యంతా ఏకరువు పెట్టి, రేపటి నుండి బయట తొక్కతా అని తనని తీసుకెళ్లి, ఒక హెల్మెట్, సైక్లింగ్ గాగుల్స్ కొనిపిచ్చేసుకున్నా. పాపం పిచ్చిది మా ఆయనకీ ద్వితీయ విఘ్నం కలగ కూడదని నా డిమాండ్స్ అన్నీ తీర్చింది. పక్కన రోజు , కొన్న సరంజామా తో నన్ను అలంకరించుకొని, నా సైకిల్ ని కూడా అలంకరించి, రాజూ వెడలె రభసకు అని పాడుకుంటూ యాత్ర మొదలు పెట్టా. వెనకనుండి మా ఆవిడ అరుస్తూ వుంది ఎక్కు తొక్కు అని. మన కాలనీ దాటిందాకా నడిపిచ్చుకుంటూ వెళ్లి, బయటకు వెళ్ళగానే తొక్కతా అని తనకి అభయం ఇచ్చి బయల్దేరా. వెనక నుండి తాను అరుస్తూనే వుంది, మన కాలనీ లో చాలా శునకాలు వుండాయి, అందులో ఒక నల్ల శునకరాజం కరుస్తుంది, అసలే అంతరిక్షం నుండి ఊడిపడ్డట్టున్నావు నువ్వు అంటూ. భయపడుతూ భయపడ్తూ కాలనీ దాటా.కాలనీ బయటకు వచ్చి మెయిన్ రోడ్ మీద తొక్కటం మొదలెట్టా! నా వెనక నుండి బోయ్ మంటూ హార్న్ కొడ్తూ ఏమీ తోచని వాళ్లంతా వాళ్ళ సరదా అలా తీర్చుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి ఎక్కడి రోడ్ చాలటం లేదు, నన్నేదో వాళ్ళ అర్జెంటు పనులకు అంతరాయం కలిగించే శత్రువులాగా చూస్తూ వెళ్తున్నారు నన్ను దాటాక. ఒకరిద్దరైతే శుద్ధమైన రోడ్ వుండగా మట్టిలో దిగి నా మొహాన ఇంత దుమ్ము కొట్టీ మరీ వెళ్లారు. చూద్దాం ఈ రోజు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్తున్న పట్టు వదలని విక్రమార్కుడిలా. ఆయాసపడుతూ రెండు మూడు కిలోమీటర్స్ వెళ్ళా. ఈ లోపు కొత్తగా కొన్న వాటర్ బాటిల్ లోంచి నాలుగు సార్లు నీళ్లు తాగా. ఈ లోపల నా ముందర ఒక హెవీ లోడ్ తో వెళ్తున్న లారీ ముందు అప్ రావటం తో, డ్రైవర్ గాడు ఒక్క సారి ఆక్సిలేటర్ అంతా అదిమాడెమో, నేను, నా సైకిల్, నా వెనక వచ్చే నాలుగైదు వాహనాలు మాయమయ్యేలా ఒక నల్లని మేఘాన్ని గిఫ్ట్ గా ఇచ్చింది. అప్పుడర్థ మయ్యింది నాకు ఆరోగ్యం గా ఉండాలంటే ముందు మనం బతికుండాలి అని, ఇంక నేను ఎప్పుడు ఇలాటి మెయిన్ రోడ్ లో సైకిల్ తొక్క కూడదని. నా మొహం చూడంగానే, మా ఆవిడక్కూడ అర్థమయ్యింది మనోడు ఎదో సీరియస్ డెసిషన్ తో ఇంటికొచ్చేసాడని. సర్లే పో అని ఒక క్వార్టర్ కప్పు బూస్ట్ ఇచ్చి, ఏంటి కథ అంది. సుప్రీ ఒకటి అర్థమయ్యింది నాకు, సైకిల్ అస్సలు మెయిన్ రోడ్ లో తొక్క కూడదు అని. మరెక్కడ తొక్కాలని డిసైడ్ య్యావు స్వామీ అంది మా ఆవిడ, ఈ టాపిక్ మళ్ళీ తన చేత ఏమి ఖర్చుకు దారి తీస్తుందో అని చాలా క్లుప్తం గా మాట్లాడ దానికి ట్రై చేస్తూ. హాయిగా ప్రశాంతం గా వుండే ప్రదేశాల్లో తొక్కాలి, కానీ అక్కడకు సైకిల్ ఎలా తీసుకెళ్ళాలి, మన కార్ లో పట్టదు గా అని చెప్తున్న నాకు, అడ్డు తగిలి, అనుకున్నా , నువ్వు నిన్న సైకిల్ షాప్ లో కార్ కి పెట్టుకునే స్టాండ్ ని తదేకం గా చూస్తున్నప్పుడే, నా బుజ్జి కార్ వెనకాల దిష్టి బొమ్మలు తగిలించబాక అని వార్నింగ్ కూడా పారేసింది. సరే డియర్ , మన కార్ చిన్నది , సైకిల్ పట్టదు, దానికి స్టాండ్ పెట్టడానికి నువ్వు ఒప్పుకోవు, ఇప్పుడు కారు మార్చలేమో అంటూండగా, మా ఆవిడ ఒక్క సారి ఫిట్స్ వచ్చినట్టు విరుచుకు పడిపోయింది. ఆ సాయంత్రం మా శీను గాడు ఇంటికి వచ్చాడు. “అబ్బో హర్ష సైకిల్ కొన్నట్టున్నాడే, బాగా తగ్గినట్టున్నాడు తొక్కీ తొక్కీ, నేను కూడా పాపకి చాలా రోజుల నుండి చెబుతూ వున్నా సైకిల్ కొనుక్కో అమ్మా, అది తొక్కితే చాలు ఇంకేమీ అవసరం లేదు” ఆ మాటలు వింటున్న మా ఆవిడకి కళ్ళు మెరిసాయి. . కొత్త సైకిల్ కొనటం ఎందుకన్నా, దీన్ని పట్టుకెళ్లండి అంటూ నా సైకిల్, దాని అలంకరణలు మరియు నా అలంకరణలు జాగ్రత్త గా ప్యాక్ చేసి మరీ రెడీ చేసింది. శీను గాడి చేతిలో సైకిల్ పెడుతూంటే, పిల్ల పెళ్లి జరిగిన ఆనందం మా ఆవిడ మొహంలో. మా వాడు ఎలా తొక్కి తొక్కి తగ్గిపోయాడో చూద్దామని క్రితం ఓ రెండు నెల్ల తర్వాత వాడింటికెళ్ళా . ఇంటి గేట్ తీస్తూంటే వాళ్ళావిడ విప్పారిన మొహంతో ఎదురొచ్చింది. ఎప్పుడు మీరు వొస్తారా అని ఎదురు చూస్తున్నా అన్నా, అంది. దేనికమ్మా అన్నా !“అన్నా ఇవిగో మీ దగ్గర లేని యాక్ససరీస్ అంటూ ఒక తాళం చెవి , రెండు ట్యూబులు , నాలుగు సైకిలింగు షార్ట్లూ నా చేతిలో పెడుతూ, దయచేసి తీసుకెళ్ళన్నా ఈ భూతాన్ని . ఇప్పుడు దీన్ని ఎత్తుకొని తిరగడానికి మా ఆయన ఎస్.యు.వీలు బేరం చేస్తున్నాడు అంది స్వరం తగ్గించి , మూలున్న సైకిల్ ని చూపిస్తూ. “ డ్రైవ్ చేస్తూ ఇంటికొస్తూంటే, పక్కనే, ఎవరో ఇద్దరు స్కూలు పిల్లలు బాగుల్తో సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నారు. వెనకొచ్చే ఆటోలో&

S2 Ep 503విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి శ్రీ E.A.S శర్మ గారితో సంభాషణ - రెండో భాగం
హర్షణీయం ‘వనవాసి’ ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా 25 మంది పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న ప్రముఖులను , శ్రోతలకు పరిచయం చెయ్యాలని హర్షణీయం పూనుకుంది.ఈ ఎపిసోడ్లో విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి డాక్టర్ ఈ ఏ ఎస్ శర్మ గారు , మనతో మాట్లాడతారు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న , ఆయన ఎనర్జీ ప్లానింగ్ లో డాక్టరేట్ తీసుకున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో సైంటిస్ట్ గా పని చేశారు. తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఐ ఏ ఎస్ అధికారి గా విశేషమైన సేవలందించిన ఆయన , ఎనర్జీ , ఫైనాన్స్ మంత్రిత్వ శాఖల్లో, ప్లానింగ్ కమిషన్‌కు సలహాదారుడిగా పని చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో నివసిస్తూ , ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.ఈ ప్రసంగం ద్వారా ఆదివాసీ హక్కుల పరిరక్షణలో తనకున్న ఆసక్తికరమైన అనుభవాలు, ఆయన సూచనలు మనతో పంచుకున్నారు.డాక్టర్ ఈ ఏ ఎస్ శర్మ గారికి హర్షణీయం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 502విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి శ్రీ E.A.S శర్మ గారితో సంభాషణ - మొదటి భాగం
హర్షణీయం ‘వనవాసి’ ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా 25 మంది పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న ప్రముఖులను , శ్రోతలకు పరిచయం చెయ్యాలని హర్షణీయం పూనుకుంది.ఈ ఎపిసోడ్లో విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి డాక్టర్ ఈ ఏ ఎస్ శర్మ గారు , మనతో మాట్లాడతారు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న , ఆయన ఎనర్జీ ప్లానింగ్ లో డాక్టరేట్ తీసుకున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో సైంటిస్ట్ గా పని చేశారు. తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఐ ఏ ఎస్ అధికారి గా విశేషమైన సేవలందించిన ఆయన , ఎనర్జీ , ఫైనాన్స్ మంత్రిత్వ శాఖల్లో, ప్లానింగ్ కమిషన్‌కు సలహాదారుడిగా పని చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో నివసిస్తూ , ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.ఈ ప్రసంగం ద్వారా ఆదివాసీ హక్కుల పరిరక్షణలో తనకున్న ఆసక్తికరమైన అనుభవాలు, ఆయన సూచనలు మనతో పంచుకున్నారు.డాక్టర్ ఈ ఏ ఎస్ శర్మ గారికి హర్షణీయం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 198'రెండురెళ్ళు నాలుగు' - చిలుకూరి దేవపుత్ర గారు.
'రెండు రెళ్ళ నాలుగు' చిలుకూరి దేవపుత్ర గారి రచన. అనంతపురం జిల్లాకి చెందిన ఆయన తన జీవిత కాలంలో , నాలుగు నవలలు, ఐదు కథాసంపుటాలను రచించారు. ఆయన నవల 'పంచమం' శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు ఎం.ఏ పాఠ్యాంశం గా చేర్చారు. దేవపుత్ర గారు అందుకున్న అనేక పురస్కారాలలో , చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం , విశాలాంధ్ర వారి స్వర్ణోత్సవ సాహితీ పురస్కారం వున్నాయి.'రెండు రెళ్ళ నాలుగు', ఒక యదార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ. దేవపుత్ర గారి కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన , అన్వేష్ గారికి , దీవెన గారికి కృతజ్ఞతలు. దేవపుత్ర గారి కథల పుస్తకాలు కొనేందుకు - https://bit.ly/3uOdH7Bబస్సు వేగం పుంజుకుంది. వాచీ చూసుకున్నాను. ఒంటి గంట అవుతోంది. ఎండాకాలం అయినందువల్ల సూర్యుడు తన తాపాన్నంతా భూమి మీదే చూపిం చేస్తున్నాడు. షి సాగర్ చేరుకునేటప్పటికి ఎన్ని గంట లవుతుందో? మళ్లీ అక్కణ్ణించి గౌహతికి సాయంత్రం లోగా చేరుకోగలనా? నేను అస్సాం వచ్చాక గౌహతికీ చుట్టుపక్కల ఉన్న పట్టణాలకు మాత్రమే క్యాంపులు వెళ్ళాను. దాదాపు రెండు వందల కిలో మీటర్ల దూరం ఉన్న షబ్నగర్ కి క్యాంపు వెళ్ళటం ఇదే మొదటిసారి.కిటికీ పక్కనే కూచుని ఉన్నందువల్ల అందాన్నంతా హాయిగా గమనిస్తున్నాను. ఒకవైపు లోయలూ, మరో వైపు కొండలూ చూస్తుంటే 'బస్సు నిలిపేసి ఇక్కడే ఉండిపోతే ఏం' అనిపిస్తోంది. ఇది దురాశేనని తెలుసు. గౌహతిలో నళిని రాత్రికల్లా వచ్చేస్తానని ఎదురుచూస్తూ ఉంటుంది.నా సీటు వెనకాల నుంచి గలగలమంటూ అమ్మాయి నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి. నేను తిరిగి చూడలేదు..“ఇక జోకులు వెయ్యకు బాబూ, నా చేత కాదు. నవ్వలేక చస్తున్నా” నవ్వు నాపుకుంటూ అమ్మాయి గొంతు.“అప్పుడే ఏమయింది.. ఇంకా ఎన్ని జోకులున్నా యని" మగ గొంతు.“ఇక్కడ వీళ్ళంతా ఏమనుకుంటారు?" ఆడ గొంతు.“వీళ్ళ మొహం... తెలుగు అర్థమయి ఛస్తేగా వీళ్ళకి” అంటోంది గర్వంగా మగగొంతు.నేను వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేక పోయాను.అమ్మాయి నల్లగా ఉన్నా - అందంగా ఉన్న మొహం, తళతళలాడే పలు వరుస, వెన్నెల చిందే కళ్ళూ ఉన్నాయి. అబ్బాయి మాత్రం వంకీల జుత్తుతో, లావాటి మీసకట్టుతో, ఎర్రగా బుర్రగా ఉన్నాడు చూడగానే కొంటె కుర్రాడు అనిపించేలా ఉన్నాడు.“మన ముందు సీటులో మనిషి చూడూ... వెనక్కి తిరిగి మనల్ని..” అంది అర్దోక్తిగా ఆమె. "“కోతిమొహం కొండముచ్చు వెధవ... ఎలా ఉన్నాడో చూడు" అంటూ నా భుజం తట్టి అస్సామీ భాషలో ఏదో మాట్లాడాడు. నాకా భాష అర్థమయి ఛస్తేగా, పళ్ళికిలించి వెర్రినవ్వు నవ్వాను. ఒకవేళ నేను తెలుగులోనే మాట్లాడేశాననుకోండి, వాడు ఇందాక తిట్టాడే 'కోతి మొహం' అన్న తిట్టు నాకు వర్తించినట్టు వాళ్ళెక్కడ అనుకుంటారోనని నా భయం. ఆ "నేను చెప్పలా ఇక్కడ ఎవ్వరికీ తెలుగురాదని... మనకిష్టమొచ్చినంత సేపు తిట్టినా ఏం ఫర్వాలేదు. “ఒరే! ముందుసీటు ముసంగి వెధవా! మేమిద్దరం ఆలు మగలంరా! ప్రేయసీ ప్రియులు అనుకు న్నావా! అంత అనుమానంగా చూస్తున్నావు” అతడు ఆ పద్ధతిలో వెటకరింపుగా మాట్లాడుతోంటే, ఆ అమ్మాయి పకపక పగలబడి నవ్వుతోంది.వాళ్ళు సరదాగా, హాయిగా ఉండడం బాగానే ఉంది కానీ... వాళ్ళ సరదాకు నన్నే ఉపయో గించుకోవటం నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉంది.నా భుజం మీద మళ్ళీ చేయి పడితే తిరిగి చూశాను. “భోజనం అయ్యిందా?” అన్నట్టు చేత్తో సైగచేస్తూ 'తన్నులు కావాలా?" అని తెలుగులో అడుగుతున్నాడు. ఆ అమ్మాయి గట్టిగా నవ్వుతోంది.అంటే, అతను ఆమెను నవ్వించటానికి నన్ను తమాషా పట్టించే ప్రయత్నంలో చాలా ఫార్వర్డ్ అయిపోతూ ఉన్నాడన్నమాట. నేను గమ్మున చూస్తూ 'ఆఁ' అన్నాను. 2. "కమలా! చూడు వీణ్ణి ఇంకా ఎలా ఆడించేస్తానో!” అంటూనే అతను 'నీళ్ళు కావాలా?! అన్నట్టు సంజ్ఞ చేస్తూ - "కీళ్ళు విరిచేస్తా. ఏమిటలా చూస్తావు గుడ్లగూబలా... బుద్దుందా? పెళ్ళి చేసుకున్నావా? వెధవ నాయాలా... కాలేదూ... పోనీ ఉంచుకున్నావా ఎవర్నయినా?” అని అతడు వాగుతూ ఉంటే, 'ఆఁ ఆఁ జీహాఁ' అన్నాను - వెర్రినవ్వు ఒలక బోస్తూ తల తిప్పేసుకున్నాను. ఆ అమ్మాయి పడీ పడీ నవ్వుతోంది.బస్సులో అందరూ తలలు తిప్పి ఆమె వైపు ఆసక్తిగా చూస్తున్నారు. - "ఏంట్రా కూస్తున్నావ్?" అని నేను తెలుగులో అడిగితే అతని పరిస్థితీ, ఆ అమ్మాయి పరిస్థితీ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాను."నువ్వేమో అతని మీద ఇన్ని జోకులు వేస్తున్నావు. నేను నవ్వుతున్నాను. కొంపదీసి అతను 'ఉల్ఫా' తీవ్రవాది కాదు కదా!" అంది నవ్వు తగ్గించి ఆ అమ్మాయి.. “నీ మొహం. ఉల్పాలు ఎలా ఉంటారో తెలీదా నాకు. వీడి మొహం, వీడు మాత్రం ఉల్ఫా కాదు - అల్ఫా కాదు” అన్నాడతను.ఉల్పా టాపిక్ అతను జోకులు వేయడం కూడా మరచిపోయినట్లున్నాడనిపించింది. అతని కంఠంలో గంభీరత ధ్వనిస్తోంది.“ఉల్పా వాళ్ళంటే మెడలో 'ఉల్ఫా' అని బోర్డు ఏమైనా వేలాడేసుకుని ఉంటారా? అతనే ఎందుకు కాకూడదూ... ప్లీజ్! ఇంకజోకులు వేయకు అతని మీద" ఆ అమ్మాయి అతన్ని మందలింపు ధోరణిలో అంటోంది. నాకు మాత్రం నవ్వొస్తోంది.“ఏమో కమలా. నీ అంచనా కరెక్ట్ కావచ్చు" అంటున్నాడు. రాముడు మంచి బాలుడు' అన్నంతగా ఉన్నాయి అతని మాటలు. ఇలా మాట్లాడే వాడేనా నా మీద ఇందాక జోకులు వేసింది! నిజంగా నాకు వాళ్ళమీద అపారమైనజాలి పుట్టుకొచ్చింది. పైగా, వాళ్లు నన్ను ఉల్ఫా అనుకుంటూంటే నా మనసు విలవిలలాడింది. అంతకంటే ఇందాక నాపైన వేసినజోకులే నయమనిపిస్తోంది. అందుకే వాళ్ళ వేపొకసారి తిరిగి చూసి నవ్వుతూ “ఇదో చూడండి... నేను ఉల్ఫాని అల్ఫానీ కాదు” అన్నాను అచ్చ తెలుగులో.ఆ మాట వింటూనే ఇద్దరూ పక్కలో బాంబు పేలినట్టు అదిరిపడ్డారు. అతనైతే మరీ తత్తరపాటుతో - "సా సా సా... సారీ సర్! క్ష... మీరు నన్ను క్షమించాలి.. ఏ ఏ ఏ... ఏదో కాలక్షేపం చేయాలని... అనవసరంగా మిమ్మల్ని అనరాని మాటలు... నన్ను క్షమించాలి సార్" అంటున్నాడు దొరికిపోయిన దొంగలా మొహంపెట్టి.ఆ అమ్మాయి మొహం కందిపోయింది. మౌనంగా నా వేపు క్షమాపణలు అడుగుతున్నట్టు చూస్తోంది. - “ఫర్వాలేదులేండి... మీరు సరదాని అనుభవిస్తుంటే అభ్యంతర పెట్టలేక పోయాను" అంటూ నవ్వేశాను. ఆ“అలాగా" అంటూ ఇద్దరూ మనసు తేలికపడ్డట్టు నవ్వేశారు. “మీరు ఎక్కడి వారు... అంటే మన ఆంధ్రదేశంలో.." అడిగాను.“మాది బెజవాడ సార్... షిల్లాంగ్ స్టేట్ బ్యాంకులో ఆఫీసరుగా ఉన్నాను. మరి మీరు?" అడిగాడు అతను. నా గురించి చెప్పాను. - “మరి మీరు గౌహతికి వచ్చారేం సార్?" అడ

S1 Ep 197'పేరులోనేమున్నది' - హర్ష
"రేయ్! గిరి బావా! నువ్వూ, మీ తమ్ముడు వంశీ గాడు దేవళం దగ్గరకు రండిరా, ఆడుకుందాం" అని కేక వేశా నేను.మా బ్యాచ్ లో ఏ రోజు ఏ ఆట ఆడాలో డిసైడ్ చేసేది వాడే. ఒక్కో రోజు గుడ్లు ఆట లేక గోళీలాట, లేక బొంగరాలాట, లేక కుందుడు గుమ్మ, పల్లంచి ఇవన్నీ కుదరక పోతే ఒక గదికి అంతా దుప్పట్లు కట్టేసి చీకటి చేసేసి బూతద్దం ఉపయోగించి ఫిలిం గోడమీద ఫోకస్ చేసి చూడటం. ఈ ఆటలకి పిల్లకాయల్ని తోలుకురావటం, పనిలో పనిగా పెద్దోళ్ల చేత అక్షింతలు వేయించుకోవటం మా ఇద్దరికీ అలవాటే. "ఈ రోజు ఉప్పు ఆట ఆడుకుందాం రా కిరణు! నేను రఘు గాడిని వాడి తమ్ముడు రమేష్ గాడిని పిల్చుకొస్తా! నువ్వెళ్లి మురళి, సుధీర్, మధు, శీనడి ని కేకేసుకు రా" అని ఉత్సాహపడిపోయాడు వాడు. నేను లగెత్తా. ముందు మురళిని వాడి తమ్ముడి సుధీర్ గాడి ని దేవళం దగ్గరకు తరిమి, మధూ, శీనళ్ల ను పిలచక రావడానికి వాళ్ళింటికి దౌడు తీశా !వాళ్ళింటి ముందు ఆగి, గస తీర్చుకుంటూ, "ఒరేయ్! శీనా! ఇంట్లో ఉండావా" అని కేకేశా!. మధు గాడు బయటకి వచ్చాడు. నాకు విషయం అర్థమయ్యింది. "ఒరేయ్! మధూ, ఉప్పాట ఆడుకుందాం బయటకురారా!" అని ఇంట్లోకి చూస్తూ మళ్ళీ గట్టిగా అరిచా. వస్తున్నా! వస్తున్నా! అంటూ శీనడు బయటకొచ్చాడు. "వీళ్ళ పాసుగూల! వీళ్ళతో మాకు ఈ రోజు గూడా సావు తప్పదు" అనుకుంటా తోలుకు పోయా వాళ్ళని. ఆటకి కావల్సిన పదిమంది పిల్లకాయలు పోగవ్వటం తో, ఆట మొదలు పెట్టాము. ఆటలో భాగం గా ఒరేయ్ మధు, లగెత్తరా! అంటే శీనడు పరుగెత్తటం, ఒరేయ్ శీనా, ఉప్పు అందుకోరా, అంటే మధూ గాడు దిక్కులు చూడటం జరగిపోతున్నాయి. మా వాళ్ళందరూ, చూశారు, చూశారు, యిక తట్టుకోలేక, అంబాలీస్ అని అరిచారు. ఆట ఆగిపోయింది. నా మీదకి యుద్ధానికి వచ్చారు, "ఒరేయ్! కిరణ్ గా, ఈ రోజు వాళ్ళింటికెళ్లి శీనా అంటే ఎవరొచ్చార్రా! మధు గాడేనా, ఆ సంగతి మాకు ఎందుకు చెప్పలేదురా" అని. నాకు ఉక్రోషం ఎక్కువయ్యింది. ఏమైనా ఈ కన్ఫ్యూషన్ కి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టెయ్యాలిరా, ఈ సంగతేందో వాళ్ళ అమ్మతోనే తేల్చేద్దామ్ అని పిల్లకాయల్ని కూడగట్టి వాళ్ళింటికి తీసుకెళ్లా. ఎంత వేగం గా అక్కడికి వెళ్ళామో, అక్కడ జరిగేది చూసేసరికి మేము అంతే వేగం గా బిక్క చచ్చిపోయాము. మధూ, శీనయ్య వాళ్ళ అమ్మ అయిన జయక్క మరియు మురళి, సుధీర్ వాళ్ళ అమ్మ అయినా సరోజనక్క హోరా హోరీ గా పోట్లాడుకుంటున్నారు. వాళ్ళ చేలో ఉమ్మడి గెనం (కట్ట) మీద గడ్డి ఎవరు కోశారు అనే విషయం మీద. మాకర్థమయిపోయింది ఇది ఇప్పట్లో తేలే విషయం కాదు అని. అయినా వీళ్ళ మొగుళ్ళు అన్నతమ్ముళ్లే కదా, ఈ తోడికోడళ్లు ఎందుకు రోజూ ఎదో విషయం మీద ఇలా పోట్లాడుతూనే వుంటారో మా చిన్న బుర్రలు అర్థమయ్యేది కాదు. ఇక చేసేది ఏమీ లేక ఈసురో మంటూ ఎవరి ఇళ్ల దారి వాళ్ళం పట్టాము ఆ రోజుటి. మా ఆటలకి వాళ్ళు ఇద్దరూ కావాలి. వాళ్ళు వస్తే అంతా కన్ఫ్యూషన్. కన్ఫ్యూషన్ తెలుసుకోవడానికి వాళ్ళ అమ్మలు మాకు సందు ఇవ్వటం లేదు. ఒకరోజు గడ్డి మీద ఇంకో రోజు ఇక్కడ కోడి అక్కడ గుడ్డు పెడితే గుడ్డు మాయం అయ్యిందనో లేక ఒకరి పసరం ఇంకొకరి చేలో పడి మేసేసిందనో మాకు సందు ఇవ్వకూడదని వాళ్ళ మానాన వాళ్ళు బిజీ గా ఉంటుంన్నారు. మా ప్రాబ్లెమ్ వినాయకుడి పెళ్లి లా మారిపోయింది. ఇలా జరుగుతుండగా, ఒకరోజు మా మధు గాడు అలియాస్ శీను గాడు (ఆ రోజు వాడి పేరు శీనయ్య), వాళ్ళ అమ్మ ని మా మూలకడ దగ్గర బస్సు ఎక్కిచ్చి వస్తూ కనపడ్డాడు. "ఏరా! ఎక్కడికిరా" మీ అమ్మ వెళ్తుంది అంటే, "అల్లూరికి! మా అమ్మమ్మ కి బాగా లేదు. నాలుగు రోజులుండి వస్తుందట" అని చెప్పాడు వాడు. "అరే! ఎలాగ రా ఈ నాలుగు రోజులు మీ అమ్మా పెద్దమ్మ ల తగవులుండవు. మనకి కాలక్షేపం వుండదే" అంటూ వాడు కోపం గా చూడటం తో ఆగిపోయా. ఆ మాట సరదాకి అన్నా, మాకు ఆ నాలుగురోజుల కాలక్షేపం నిజం గానే కరువు అయ్యి తెగ విసుగొచ్చేసింది. ఎలాగో ఒకలా గా ఆ నాలుగు రోజులు గడిపేశాము. అలా కాలక్షేపం లేకుండా నిస్సారం గా రోజులు గడవకుండా వున్న మాకు మా జయక్క రాక ఒక్కా సారి తెలిసిపోయింది, దిగటము దిగటమే మా సరోజనక్కతో, వాళ్ళింటి మునక్కాయలు ఆమె లేనప్పుడు ఎందుకు మాయం అయ్యాయి అనే సాకు మీద. ఇక మాకు పండగే పండగ. నాలుగైదు రోజుల తర్వాత ఆ సందడి కి మరలా బ్రేక్ పడింది ఈ సారి సరోజనక్క ఊరెళ్ళటం తో. మా అమ్మనడిగా నేను, " సరోజినక్క ఎక్కడికెళ్లిందమ్మా! అని. "అల్లూరుకి వెళ్ళిందిరా""అల్లూరా""అవునురా! సరోజినక్క వాళ్ళ అమ్మకి బాగా లేదంట"నా బుర్ర కి ఎదో తడుతుంది. జయక్క! అల్లూరు! జయక్క! వాళ్ళ అమ్మ కి బాగాలేక వెళ్ళొచ్చింది. ఇప్పుడు సరోజినక్క! అల్లూరు! వాళ్ళ అమ్మకి బాగాలేదు. ఏమిటీ కనెక్షన్. "అంటే! అంటే! జయక్క, సరోజినక్క ఏమవుతారమ్మా!""ఏమయ్యేదేముందిరా! నీ మొహం! ఎత్తి కుదేస్తే రెండవుతారు" అన్నది మా అమ్మ తన సెన్స్ అఫ్ హ్యూమర్ కి తానే మురిసి పోతూ. "అబ్బా! చెప్పమ్మా! వాళ్లిద్దరు, అక్కా చెల్లెళ్ళా?""అవునురా! నీదుకు తెలీదా ఇంత వరకు, అన్నాతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ల ని పెళ్లి చేసుకున్నారు""ఇదెలా సంభవం, యీ ప్రపంచం లో! ఇంతలా తగవులేసుకొనే, అక్క చెల్లెళ్లు" అని మూలిగా నేను"అయితే పెద్ద అయ్యాక, మీరు అలా వుండకండిరా" అన్నది మా అమ్మ. సరే! సరే ! అంటూ అక్కడనుండి తుర్రుమన్నా నేను యీ రహస్యం నా స్నేహితులతో పంచుకోవాలి అనే తహ తహ తో. ముందు అందరు బోల్డు హాశ్చర్య పోయారు. ఈ సీక్రెట్ కనుక్కున్న నన్ను ఈర్ష్యతో చూసారు. వాళ్ళ కోపమంతా, మురళి, సుధీర్, మధు శీనయ్య ల మీద మళ్లింది. మా పెద్దమ్మ, మా చిన్నమ్మ అని వేళ్ళు చెబుతుంటే వాళ్ళ పెదనాయన, వీళ్ళ చిన్నాయనల పెళ్ళాలు అని అనుకున్నాం కానీ, వాళ్లిద్దరూ అక్క చెల్లెళ్లు అనే రహస్యం దాచి ఇన్నాళ్లు కుట్ర చేసారు అని. విషయం పాత బడి పోయాక, మళ్ళీ మా అసలు సమస్య కి పరిష్కారం ఇంకా దొరక లేదు అని గుర్తు వచ్చింది మా జనాలకి. మాలో ఒకడు, "ఐడియా" అని అరిచాడు. "ఏమిటిరా! అలా పిచ్చి కేక పెట్టావు" అంటే, "సరోజినమ్మ! ఊర్లో లేదు అంటే జయమ్మ కి ఫ్రీ టైం చాలా ఉంటుంది! కాబట్టి మన సమస్య వెంటనే తేల్చేసుకోవచ్చు" అన్నాడు. "అబ్బా! నువ్వు సూపర్ రా"

S1 Ep 196'వార్తాహరులు' - ఉణుదుర్తి సుధాకర్ గారు
'వార్తాహరులు' అనే కథ, రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు. 'తూరుపు గాలులు' అనే సంపుటం లోనిది. మనదేశంలో బ్రిటిష్ వారు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఏర్పరచడానికి దారి తీసిన పరిస్థితులను ఆధారంగా తీసుకొని రాసిన కథ.మెరైన్ ఇంజనీర్ గా పని చేసిన సుధాకర్ గారు రాసిన 'యారాడ కొండ' ఆటా నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నవల. 'హిస్టారికల్ ఫిక్షన్' రాస్తున్న అతి కొద్దిమంది రచయితల్లో సుధాకర్ గారు ముందు వరసలో వుంటారు.కథను మీకందించడానికి అనుమతినిచ్చిన సుధాకర్ గారికి కృతజ్ఞతలు.'తూరుపు గాలులు' పుస్తకం కొనడానికి కావాల్సిన లింక్ - https://amzn.to/3wGaJmX'యారాడ కొండ' కొనడానికి -https://amzn.to/3fwoQW9ఆనాటి వేసవికాలపు ఆదివారం రోజున సూర్యోదయం కాగానే మార్నింగ్ సిక్నెస్ ని తాజా గాలులతో విదిలించుకోవాలని సూజన్ తన హౌస్ కోటులోనే వరండా మీదకి వచ్చి వాలుకుర్చీలో జేరబడింది. దూరంగా చెట్ల వెనుక తళతళా మెరు స్తూన్న గంగానదిపై బద్దకంగా కదులుతోన్న తెరచాప పడవల్ని చూస్తూ మైమరచి పోయింది. అదే అలనాటి అధ్యాయపు ఆఖరి మనోహర ప్రశాంత దశ్యం అని ఆమెకు అప్పుడు తెలియలేదు. ఖాళీ కుండలతో నదివైపు నడుస్తున్న స్త్రీల నవ్వులూ, తనకు అర్థం కాని వారి హిందుస్తానీ మాటలూ గాలివాటాన స్పష్టంగా వినిపించ సాగాయి. వాటిని నెమ్మదిగా, నిర్దాక్షిణ్యంగా చీలుస్తూ దగ్గరవుతున్న గుర్రపుడెక్కల చప్పుడుతోనే తన జీవితం పూర్తిగా తలక్రిందులవుతుందనీ, ఇండియాలో తన కాపురం కుప్పకూలుతుందని ఆమె అప్పుడు ఊహించలేదు.అతడు స్వారీ చేస్తున్న గుర్రంతోబాటు మరో గుర్రాన్ని వెంటబెట్టుకొని వచ్చిన రౌతు రెండింటినీ గేటు ముందున్న వేపచెట్టుకి కట్టి లోపలికి బిరబిరా రావడం ఎందుకో సూజన్కి ఆందోళన కలిగించింది. మళ్లీ కడుపులో వికారంగా అనిపిం చింది. గుబురు మీసాల రౌతు 'కమాండర్ సాబ్ మర్రేసాబ్ ని వెంటనే తీసుకు రమ్మని పంపించారు' అన్నాడు.రెండో గుర్రం ఎందుకో సూజన్ కి అర్థమైంది. అంటే ఈ ఆదివారం కూడా చర్చికి వెళ్లడం కుదరదన్నమాట. ఫాదర్ మార్లిన్ మెత్తగా పెట్టబోయే చివాట్లు తినక తప్పదు. తనకు ఈ నాలుగు నెలల్లో పట్టుబడిన హిందుస్తానీ ముక్కల్ని తడబడ కుండా ప్రయోగిస్తూ'ఠీక్ హై' అని లోపలికి నడిచింది. జాన్ ఇంకా గుర్రుపెడుతూ నిద్రపోతున్నాడు. రాత్రి విస్కీ ఎక్కువైనట్లుంది.ఆదివారం కదా ఆలస్యంగా లేవొచ్చు అనుకున్నాడు పాపం. లేపక తప్పదు. ఉలిక్కిపడి తటాలున లేచి కూర్చున్నాడు.‘సీఓ నిన్ను వెంటనే రమ్మన్నాట్ట. గుర్రం ఇచ్చి సిపాయిని పంపించాడు. ఏమయ్యింది మళ్లీ?' అడిగింది.దోమతెరను తప్పించి తన భారీకాయాన్ని బయటకు తెస్తూ 'ఏముంది? ఈ సిపాయిల గొడవే అయ్యింటుంది' అన్నాడు జాన్.వంటవాడు కాలియా పొద్దున్నే బజారుకి పోయాడు. ఆదివారం కదాని మాంసం తేవడానికి తనే పంపింది. పనమ్మాయి మరియమ్ చేసిన చాయ్ తాగి, గబగబా షేవ్ చేసుకొని డ్రెస్సు వేసుకొని బయటకు పరుగెత్తాడు జాన్. క్రికెట్ మాచ్ ఆడడానికి బయిల్దేరిన బడిపిల్లవాడి ఉత్సాహం జాన్‌లో కనిపించింది సూజన్ కళకి. ఈ సిపాయిల అలజడి కాదుగానీ జాన్ విల్ఫ్రెడ్ మర్రే, సీనియర్ టెలిగ్రఫీ ఆఫీసర్, నార్త్ వెస్టర్న్ ప్రావెన్స్ గారికి మునుపెన్నడూ లేనంత గిరాకీ, ప్రాముఖ్యత ఏర్పడి పోయాయి. కొత్తగా నెత్తిన పడ్డ ఈ కిరీటకాంతుల ధగధగల్ని పూర్తిగా అస్వాదిస్తున్నాడని సూజన్కి అర్థం అవుతూనే ఉంది. భర్తకి సర్వత్రా లభిస్తూన్న గుర్తింపుని చూస్తూంటే తొలిదినాల్లో ఆమెకు ఒకింత గర్వంగా కూడా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం రోజురోజుకీ పరిస్థితి మారిపోతోంది.మొదట్లో అక్కడక్కడ జరుగుతున్న సిపాయీల అల్లర్లు', 'కొంతమంది సిపాయీల ఆగడాలు' అంటూ వచ్చిన కుంఫిణీ అధికారులే ఇప్పుడు ఏకంగా 'సిపాయిల తిరుగుబాటు' అని యథాలాపంగా వాడేస్తున్నారు. 'మొత్తం ఉత్తర హిందూస్తాన్ అంతా అల్లకల్లోలంగా ఉంది' అనేస్తున్నారు. అంతేగాని మిగతా వివరాలేవీ చెప్పడం లేదు. 'ఢిల్లీ తిరుగుబాటుదార్ల స్వాధీనంలో ఉంది' అంటున్నారు. మరో పక్క 'అంతా తమ కంట్రోల్లోనే ఉంది' అంటున్నారు. ఢిల్లీ, కాన్పూర్, మీరట్‌లలో పరిస్థితి పూర్తిగా విషమించినా తాముండే మిర్జాపూర్ పరిసరాలు చాలా వరకూ ప్రశాంతంగానే ఉన్నాయి. గంగానదీ తీరాన తిరుగుబాటుదార్ల కదలికలను గమనిస్తూ వారిని అడ్డుకొనే బాధ్యతను తమ బెటాలియన్ కి అప్పగించారనీ, అందు చేత పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా తిరుగుబాటుదార్లతో తలపడే అవసరం ఉండబో దనీ జాన్ ధైర్యం చెప్పాడు. తను ఇప్పుడున్న స్థితిలో ఎక్కువ చెప్పడం ఇష్టంలేక కాబోలు, జాన్ కూడా అంతగా ఏమీ చెప్పడం లేదు. ఏం దాస్తున్నాడో తెలీదు. దీంతో సూజన్ ఆందోళన మరింత ఎక్కువైంది.'మీ ఆయన టెలిగ్రఫీ ఆఫీసర్ కదా అన్నీ తెలుస్తాయే! నీకేమీ చెప్పడా?' అని సూజన్ మొహం మీదే అన్న ఆఫీసర్ల భార్యలూ ఉన్నారు.ఆఫీసర్ల భార్యల నడుమ, సిపాయీల బారకాసుల్లో, నవుకర్ల సంభాషణల్లో, బజార్లలో, వీధుల వెంటా పుకార్లు రాజుకుంటున్నయి. చెలరేగి వ్యాపిస్తున్నాయి. అయితే సూజన్ చెవులకి తరచూ వినిపించే వ్యాఖ్యలు రెండే: ఆడవాళ్లనీ, పిల్లల్నీ త్వరలోనే కలకత్తా పంపించేస్తారనీ, ఇళ్లల్లో పని చేసే నవుకర్లని ఒక కంట కనిపె డుతూ ఉండాలనీను. ఒక పక్క ఈ ఆందోళనల్లో, అనిశ్చితుల్లో తను మగ్గుతూ ఉండగా మరోపక్క జాన్‌లో ఉబికివస్తోన్న అత్యుత్సాహాన్ని చూస్తూంటే సూజన్ కి కంపరం వస్తోంది. కమాండింగ్ ఆఫీసర్‌తో ఎడతెగని మంతనాలు, తరచూ సాయం త్రాలు మెస్‌లో అతిగా తాగడాలూ, రోజూ ఆలస్యంగా ఇంటికి రావడం, వేళా పాళా లేకుండా బారక్సుకి పరుగులు తీయడం ఇవన్నీ దుర్భరంగా తయారయ్యాయి.'ఈ వేసవిలో కలకత్తాకి బదిలీ కావడం ఖాయం. అక్కడ మంచి డాక్టర్లున్నారు, నీ ప్రసవం అక్కడే' అంటూ ఉండిన జాన్ ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. తను ఇలా మొదటిసారిగా గర్భిణిగా ఉన్నప్పుడు జాన్ తనకు మరింత దగ్గరవుతాడనీ, ధైర్యం చెబుతాడనీ అనుకుంటే ఇలా అయింది. ఈ సిపాయీల తిరుగుబాటేదో జాన్ని తన నుండి దూరం చెయ్యడానికీ, ఇద్దరి మధ్యా అగాధాన్ని సష్టించడానికి వచ్చిన ట్లుంది తప్ప మరోటి కాదు అనుకుంది సూజన్.నిన్న రాత్రి జాన్ ని 'ఈ గొడవలన్నీ ఎప్పటికి ఓ కొలిక్కి వస్తాయి? మునపటి ప్రశాంతత మళ్లీ ఎప్పుడు తిరిగొస్తుంది?' అని అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం ఆమెను మరింత కంగదీసింది.“ఇదిగో సూజన్! నా మాటలు జాగ్రత్తగా విను. ఈ తి

S1 Ep 195'బ్లూ అంబ్రెల్లా'
పిల్లల సినిమాల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఇరవై ఐదు , ఎంపిక చేసి , వాటి కథలను పరిచయం చేస్తూ ' పిల్లల సినిమా కథలు ' అనే ఒక పుస్తకం రాసి ప్రచురించారు రచయిత అనిల్ బత్తుల.ఈ పుస్తకంనించి, 'బ్లూ అంబ్రెల్లా' అనే సినిమా కథా పరిచయాన్ని మీరు ఈ ఎపిసోడ్లో వింటారు.'Blue Umbrella' కథకు రచయిత శ్రీ రస్కిన్ బాండ్.అనిల్ గారు రాసిన పిల్లల సినిమా పుస్తకం కొనాలంటే ఈ లింక్ ని ఉపయోగించండి. : http://bit.ly/anilbattulapillalacinemakathaluభారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ లోని ఒక గ్రామంలో 9 యేళ్ల బినియా అనే అమ్మాయి, వస్తాదు ఐన తన అన్నయ్య, వాళ్ల అమ్మతో కలిసి నివసించేది. వాళ్ల గ్రామం కొండప్రాంతంలో వుండేది. బినియా వాళ్లకి గోరీ, నీలూ అనే రెండు ఆవులు వుండేవి. పాప ఆ ఆవుల్ని కొండ వాలులోని పచ్చ గడ్డితో మేపేది. పాడి వాళ్ల జీవనాధారం. బినియాకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అదే గ్రామంలో నంద కిషోర్ అనే 50 యేళ్ల వ్యాపారి, రహదారి పక్కన 'ఖాత్రి టీ దుకాణం నడిపేవాడు. ఇతను పరమ లోభి. బడికెళ్లే పిల్లలకు చాక్లెట్లు, బిస్కట్లు ఆశ చూపి అప్పు ఇచ్చేవాడు. నెల అవ్వగానే పిల్లలకు తప్పు లెక్కలు చెప్పి వాళ్ల దగ్గర ఏదో ఒక వస్తువు (ఉదాహరణకు బైనాక్యులర్స్ లాంటివి) లాక్కునేవాడు. ఇతని దగ్గర రాంగోపాల్ అనే దొంగ పిల్లవాడు పనిచేసేవాడు.ఒక రోజు బినియా ఆవుల్ని మేపటానికి కొండపైకి వెళ్తుంది.. అక్కడ తనకి ఒక అందమైన పెద్ద నీలంరంగు జపనీస్ గొడుగు దొరుకుతుంది. అది ఒక జపనీస్ టూరిస్ట్ బృందం వాళ్లది. వాళ్లు పాప మెడలోని ఎలుగుబంటి గోరుతో చేసిన దండని తీసుకుని దానికి బదులుగా ఈ అందమైన నీలంరంగు జపనీస్ గొడుగును ఇస్తారు. ఎలుగుబంటి గోరుతో చేసిన దండని అదృష్టచిహ్నంగా భావిస్తారు. అది దుష్ట శక్తులను పారద్రోలుతుందని ప్రజల నమ్మకం. గొడుగు కోసం దండను ఇచ్చినందుకు అమ్మ పాపను మందలిస్తుంది. ఆ నీలంరంగు గొడుగు రాగానే బినియా ఆ వూర్లో ఒక సెలబ్రిటీ అవుతుంది.. ఎందుకంటే ఆ వూర్లో వున్నవన్నీ నల్లని సాధారణ గొడుగులే. ఇంత అందమైన నీలంరంగు జపనీస్ గొడుగుని గ్రామ ప్రజలెప్పుడూ చూడలేదు. ఎండలో, వానలో, మంచులో ఎళ్లవేళలా పాప గొడుగుతోనే వుండేది. నీలంగొడుగు లేని బినియాను మనం వూహించలేము. ఊరివాళ్లు పాప గొడుగుని ఎంతో మెచ్చుకునేవాళ్లు. వ్యాపారి నందూ కన్ను, నీలంరంగు గొడుగుపై పడుతుంది. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. బినియాకు చాక్లెట్లు, బిస్కెట్లు, డబ్బు ఇలా రకరకాల ఆశలు చూపుతాడు. గొడుగు తనకు అమ్మమంటాడు. పాప అస్సలు ఒప్పుకోదు. వ్యాపారి నందూ ఈర్ష్య పడతాడు. వ్యాపారి నందూ సిటిలో ఒక గొడుగుల దుకాణానికి వెళ్లి రంగుల జపనీస్ గొడుగు గురించి వాకబు చేస్తాడు. దాని వెల 2500 రూపాయలని డబ్బు మొత్తం ముందే కడితే ఒక పది రోజుల్లో ఢిల్లీ నుండి తెప్పిస్తారు అని తెలుస్తుంది. లోభి, పిసినారి ఐన నందూకి అంత డబ్బు పెట్టి గొడుగు కొనడం ఇష్టం లేదు.నందూ నిరాశగా బలో తిరిగి వస్తుంటే, గ్రామసమీపంలో వున్న జలపాతం కింద నీలం గొడుగుతో నిలబడివున్న బినియా కనిపిస్తుంది. నందూ బస్ ని ఆపి అక్కడే దిగి పాప వద్దకు పరిగెత్తుకుని వెళ్తాడు. 'బెలూన్ల గుత్తి 50 రూపాయలు ఇస్తాను, నీ గొడుగు నాకు అమ్మేయి' అంటాడు. పాప అందుకు ఒప్పుకోక, అక్కడి నుండి వెళ్లిపోతుంది. కోపంతో నందూ బెలూన్ల గుత్తిని గాలిలో ఒదిలేస్తాడు. తరువాతి రోజు పాప నీలం గొడుగుతో ఒక పాముతో పోరాడి వాళ్ల అన్నయ్యను కాపాడుతుంది.. ఈ విషయం గురించి గ్రామంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇలావుండగా ఒక రోజు పాప కొండపై ఆవులు కాస్తున్నప్పుడు నందూ దుకాణంలో పనిచేసే రాంగోపాల్ అనే పిల్లవాడు నీలం గొడుగుని దొంగిలిస్తాడు. ఈ పని తను యజమాని జీతం పెంచుతానన్నాడని చేస్తాడు. ఈ దొంగతనం గురించి పాపకు కానీ ఊరి ప్రజలకు కానీ తెలియదు. పాప భోరున ఏడుస్తుంది. అన్నం తినదు.ఊర్లో వాళ్లంతా బతిమిలాడతారు. పాపకు నందూ మీద అనుమానం. పోలీస్ అంకుల్ని తీసుకెళ్లి నందూ దుకాణం అంతా వెతుకుతారు కానీ నీలం గొడుగు దొరకదు. తన పరువుని పాప బజారుకీడ్చిందని నందూ కోప్పడతాడు. తను కొత్త రంగుల జపనీస్ గొడుగు కొన్నదాకా పచ్చడి ముట్టనని గ్రామ ప్రజల ముందు శపథం చేస్తాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఊరి పోస్ట్మ న్ నందూకి ఒక పెద్ద అట్ట పెట్టెను తెచ్చిస్తాడు. నందూ గ్రామ ప్రజల మధ్య ఆ అట్టపెట్టెను తెరుస్తాడు.. మిలమిలా మెరిసిపోయే ఎర్రటి జాపనీస్ గొడుగు. నందూ ఆనందం వర్ణనాతీతం. నందూ అందరి ముందూ గర్వంగా పచ్చడి తింటాడు. ఆ ఎర్రటి గొడుగు వేసుకుని వూరంతా తిరుగుతాడు. పాపను వూరిస్తాడు. పాప ఏడుపు మొహంతో వుంటుంది. నందూ పట్నం వెళ్లటానికి బస్ ఎక్కుతుంటే, ఎర్ర గొడుగు బస్ ద్వారం దగ్గర ఇరుక్కుపోతుంది. అందరూ కలిసి అతి కష్టం మీద దాన్ని బయటకు లాగుతారు. నందూ గొడుగుని మూయటానికి ప్రయత్నిస్తాడు కానీ అతనికి చేతకాదు. బినియా సాయం చేస్తుంది. ఈలోగా గ్రామంలో కుస్తీ పోటీలు జరుపుదామని దానికి ముఖ్య అతిథిగా వుండాలని గ్రామ పెద్ద నందూని ఆహ్వానిస్తాడు. కుస్తీ పోటీలో పాల్గొనే వారికి భోజనం సగం ధరకే సరఫరా చేస్తానని నందూ ప్రకటిస్తాడు. అందరూ చప్పట్లు కొడతారు. బినియా పోస్ట్‌మన్ వద్దకు వెళ్లి నందూకి పార్సల్ ఎక్కడి నుండి వచ్చిందని వాకబు చేస్తుంది. ఆ పార్సల్ ఢిల్లీ నుండి రాలేదని ఆ గ్రామానికి దగ్గరలోనే వున్న బనికేట్ అనే గ్రామంలోని రంగులేసే దుకాణం నుండి వచ్చిందని తెలుస్తుంది.పాప పోలీస్ అంకుల్ని వెంట పెట్టుకుని వెళ్లి ఆ రంగుల వ్యాపారిని వీళ్ల వూరికి పట్టుకొస్తుంది. ఈ లోగా కుస్తీ పోటీలు జరుగుతాయి. విజేతలను ప్రకటిస్తూ నందూ ఉపన్యసిస్తుంటాడు. వర్షం కురుస్తుంది.. గొడుగు రంగు వెలిసి ఎర్రరంగు కారిపోయి లోపల వున్న నీలం రంగు బయటపడుతుంది. నందూ 'గొడుగు దొంగ' అని ఊరంతా తెలుస్తుంది. అందరూ నందూని తిడతారు. గొడుగుని బినియాకు తిరిగి ఇస్తారు. నందూ దుకాణంలో ఏదీ కొనకూడదని గ్రామస్తులు నిర్ణయించుకుంటారు. రాంగోపాల్ నందూ దగ్గర పని మానేసి వెళ్లిపోతాడు. నందూని అందరూ వెలివేయడంతో ఒంటరి వాడవుతాడు. ఒక రోజు రాత్రి నందూ దుకాణం పైకప్పుపై ఎలుగుబంటి దాడి చేస్తుంది. తరువాతి రోజు ఉదయం నందూ పైకప్పు బాగు చేసుకుంటుంటే ఎలుగుబంటి గోరు దొరుకుతుంది. దాంతో నందూ ఒక దండ తయారుచేయిస్తాడు.

S1 Ep 189'జెన్' - పతంజలి శాస్త్రి గారు
రిటైరై, కొడుకూ కోడలితో జీవించే నాయుడు గారు. వృత్తి రీత్యా ఒక మెకానిక్. చుట్టూ వుండే ప్రపంచాన్ని ఆశావహ దృక్పధంతో చూస్తూ, ఓపిగ్గా, చుట్టూవుండే పరిస్థితులను కావలసిన విధంగా మలుచుకుంటూ, జీవించడాన్ని ఇష్టపడతారు. ఆయనకు పూర్తిగా విరుద్ధ స్వభావం వుండే ఆయన కొడుకు కృష్ణ , తన జీవితంలో వుండే అసంతృప్తిని వస్తువులపై చూపించడమే కాక , తన భార్యను కూడా వాటి గాటన కట్టేసే మనిషి.కథలోవుండే ఇంకో ముఖ్యపాత్ర ‘అమ్మతల్లి’ - స్నేహితుడు పనికి రాదని పారేస్తూంటే నాయుడుగారు అతన్ని ఆపి తన ఇంటికి తెచ్చుకున్న, పాడుబడ్డ ఒక మెషీను.చెప్పదల్చుకున్న విషయాన్ని పాఠకుడికి చేరవేయడానికి , ఒక శిల్పాన్ని చెక్కినట్టు కథను చెక్కుతూ మెల్లగా పాఠకుణ్ణి తనకు కావలసిన ఆవరణంలోకి తీసుకువెళతారు, శాస్త్రిగారు. నా కథలన్నీ అనుభూతి ప్రధానమైనవి, కథ నుంచి ఏమి తెల్సుకోవాలో, పాఠకుడే అలోచించి అందిపుచ్చుకోవాలి అంటారు ఆయన. పతంజలి శాస్త్రి గారు రాసిన అనేక గొప్ప కథల్లో ఇప్పుడు మీరు వినబోతున్న ‘జెన్’ ఒకటి. హర్షణీయం టీం తరఫున ఆయనకు డెబ్భై ఐదవ జన్మ దిన శుభాకాంక్షలు . Happy Birthday Sir.హర్షణీయం’ పాడ్‌కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)‘జెన్’ :గేటు ముందర స్కూటరు భయంకరంగా పొరబోయి దగ్గుతోంది. కిక్ కొట్టే కొద్దీ పొడి దగ్గే తప్ప ప్రాణం పోసుకుంటున్న జాడలేదు. కృష్ణ మొహం చెమటతో తడిసిపోయింది. తన భార్యని మానభంగం చేసిన దుర్మార్గుడిలా కనిపించింది స్కూటరు. ఆఖరిసారి కసి కొద్దీ కిక్ కొట్టి, దగ్గి ఆగిపోయిన వాహనాన్ని, అదే వేగంతో ఓ తాపు తన్ని నాలుగు బూతులు తిట్టాడతను.“నీడలోకి రండి” గేటు వెనక నిలబడి అంది అతని భార్య, డాబానీడ ఆమె మీద పడుతోంది. మొహం తుడుచుకుంటూ ఆమె పక్కన నించున్నాడు కృష్ణ. స్కూటర్ని చంపేయాలనిపించిందతనికి.“ఛీ ఎదవ స్కూటరు. సరిగ్గా టైముకు పెంట పెట్టింది. పది రూపాయలక్కూడా ఎవడూ తీసుకోడు.” తరువాత స్కూటరు శీలం గురించి అతని అభిప్రాయం వెలిబుచ్చాడు.సరళ కొంచెం సిగ్గుపడి నవ్వుతూ అంది “చీ. మామయ్యగారు వింటారు”"వింటే విన్నీ, మధ్యలో నీకేం? ఆఫీసుకెళ్ళేదినువ్వా? నేనా? దరిద్రం. నా కంటే ఎదవ ఎవడూ దొరక్క నాకమ్మాడు. నాకీ చండాలం పట్టింది""కృష్ణ ఇంకా వెళ్లలేదా?" భుజం మీది తువాలుతో కళ్లజోడు తుడుచుకుంటూ గేటు దగ్గరకొచ్చాడు నాయుడుగారు."స్టార్టవట్లేదండి” పక్కకి తొలుగుతూ చెప్పింది సరళ.కొడుకు వైపు చూశారు నాయుడుగారు. ఆగ్రహంతో స్కూటర్‌నే చూస్తూ మాట్లాడలేదు కృష్ణ. గేటు తోసుకొని బయటికొచ్చి గూడకట్టు చుడుతూ వాహనం దగ్గరికి వెళ్లారాయన.“ఎండ్‌లో మీరెందుకు. మీ వల్లకాదు. నే చూస్తాలేండి.”ఆగమన్నట్టు చెయ్యి చూసింది. స్కూటరు కింద చెయ్యి పెట్టి చూశారు నాయుడుగారు. ట్యూబు సరిచేసి పైకి లేస్తూ కొడుకు వైపు చూసి నవ్వారు.“ఓవర్ ఫ్లో. చూసుకోలేదేవీ?". ఆశ్చర్యపోయాడు కృష్ణ. దగ్గరికొచ్చి నుంచున్నాడతను. “కంగార్లో చూసుకోలేదు.”“కంగారెందుకు? బండి ఆగిపోతే జాగ్రత్తగా చూసుకోవాలి. కాలిరిగేలా కిక్కిస్తే లాభం లేదు. బయలుదేరు.”నీలి ధూపం సమర్పించి బయలుదేరింది, స్కూటరు. ఇద్దరూ నవ్వుకుంటూ వరండాలోకి వచ్చారు."ఆఫీసుకు లేటయిందని కంగారండి" భర్త తరఫున అంది సరళ.“ఆఫీసుల గొడవ స్కూటర్లకి తెలీవు. బయలుదేరే ముందు మనమే చూసుకోవాలి. ఆదివారం పూట ఓ అరగంట బండి దగ్గర కూర్చుని శుభ్రంగా అన్నీ సరిగా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవాలి."సరళ నవ్వింది. అంటే 'మీ అబ్బాయికి అంత ఓపిక ఎక్కడుందని అర్ధం’.“కొంచెం కాఫీ ఇవ్వు. ఓ అరగంట అమ్మతల్లి దగ్గర కూర్చుని తరవాత స్నానం చేస్తాను”తల ఊపి లోపలికి వెళ్లిపోయింది సరళ. చిన్న డాబా ముందు మూడు లుంగీల స్థలం. ఉద్యోగంలో ఉండగానే జాగ్రత్తగా కట్టించుకున్నాడు నాయుడుగారు. డాబా పిట్ట గోడ మీద కుండీలు పెట్టి మొక్కలు వేశారు. గేటు పక్కన అటూ ఇటూ రెండు రోజా మొక్కలు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ నీళ్లు పోస్తూ వాటితో నాయుడుగారు మాట్లాడతారని కృష్ణ గట్టి నమ్మకం. ఎన్ని పువ్వులు పూసినా, కోడలికి రెండూ పక్కింటిపాపకు ఒకటి, దేవుడి దగ్గర ఒకటి, మొత్తం నాలుగు పువ్వులు మొక్కలవి. గోడ బయట తురాయిమొక్క నాటారాయన. చైత్రమాసం నుంచీ కెంపులు పూస్తుందది. ఉదయం సాయంకాలం నాయుడుగారు గోడవతల పెరిగిన ఎర్ర నెమల్ని చూస్తూ కూచుంటారు. ఆయన్నలా చూసి చూసి కోడలు కాసేపట్లో మామగారే ఎర్రగా పూసుకొస్తారను కుంటుంది. ఇంకొంచెం పెద్ద స్థలం లేదని ఆయన బెంగ. మధ్యాహ్నాలు భోజనం చేస్తూ కోడలితో ఆయన చిన్నతనాన్ని, యవ్వనాన్నీ నెమరేస్తుంటారు నాయుడుగారు. సరళ ఓపిగ్గా వింటుంది. మామగారి బాల్య, కౌమార, మౌనవ జీవిత విశేషాలు ఆమెకి కామా చుక్కలతో సహా నోటికి వచ్చేశాయి. గడచిన పది సంవత్సరాల్లో చెప్పినవే చెప్తున్నానని తెలీదాయనకు.కాకినాడ దగ్గర చిన్న పల్లెటూరు. ఊరికి కొంచెం దూరంగా దట్టంగా పచ్చటి ముద్దల్లా పెరిగిన మడచెట్ల అడవుల్ని చీలుస్తూ ఏర్లు సముద్రంలోకి జారుకుంటాయి. నదిలో మెత్తగా ఆయన జ్ఞాపకాల పడవలో ఊగుతూ బయల్దేరతారు నాయుడుగారు. తెల్లటి పెద్ద ఏటి కొంగలు, ఆశ్చర్యపడ్డ నీటి పిల్లి, డైనింగు టేబులు మీద ప్రత్యక్షం అవుతాయి. ఒకసారి సముద్రపు ఆటు సమయంలో మడచెట్ల ఏట్లో పడవలో చిక్కుకుపోయి నీరు తీస్తుండగా పడవ తోసుకుంటూ పడ్డ అవస్థను సరళ అయిదువందల నలభైరెండోసారి వింటూ ఓపిగ్గా నవ్వుకుంటుంది. ఆమె నిజానికి పదహారోసారి నుంచే వినడం మానేసింది కానీ, నాయుడుగారు ఆమెతో మాట్లాడరు. ఆమె వైపు చూస్తూ ములక్కాడ చప్పరిస్తూ మాట్లాడతున్నా ఆయన కళ్లలో సముద్రం, అడవి, కొంగలూ పాత సినిమాలా కనిపిస్తాయి. చిన్నతనం గురించి చెప్తుంటే ఒక్కోసారి ఆయన కళ్లజోడు పెట్టుకున్న కొంగలా కనిపిస్తారు కోడలికి.కాఫీ తీసుకుని వరండాలోకి వచ్చింది సరళ. చేతిలో సిగరెట్ తో పరధ్యానంగా చూస్తూ కాఫీ అందుకున్నారాయన. కాఫీ చప్పరించి సిగరెట్టు పారేసి అమ్మతల్లి వైపు చూశారు.

S1 Ep 188Part - ii : సంపెంగ పువ్వు - గోపీచంద్ గారు.
కొంచెం సేపయిన తర్వాత ఆమె ఒక్క నిట్టూర్పు విడిచి ఇలా అంది. “మీ ఊరు చాలా వెనకబడి ఉందండీ!”నాకేమీ తోచక, “శాస్త్రి కూడా వస్తే బాగుండేది” అన్నాను. ఆమె ఒక క్షణం ఆగి, “చాలా వెనకబడి ఉంది” అతని తనలో తాను అనుకుంటున్నట్లు అన్నది. “లేకపోతే బొంబాయి ఉన్నట్లు ఉండమంటే ఎట్లా ఉంటుంది!” అన్నాను.“ఊరు సంగతి కాదు. మనుషుల సంగతి. నేను వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. మీరు మాంధాత కాలంలో ఉన్నారు. అబ్బా, మీ ఊళ్ళో ఎలా బ్రతుకుతున్నారో. ఒకరితో మాట్లాడితే యింకొకరికి కోపం, అందరితో మాట్లాడితే అందరికీ కోపమే! దీన్నే ఈర్ష్య అంటారు కాబోలు. శాస్త్రి ఇంటో మీ అందరి సంగతి గమనించాను. కాఫీ హోటల్ కి వెళ్ళేటప్పుడు ఊళ్ళో వాళ్ళ సంగతి చూచాను. ఏం అన్యాయం? అన్నీ ప్రిమిటివ్ లక్షణాలే. ఆడవాళ్ళ పని మరీ అన్యాయంగా ఉంది. ప్రతి భార్యా తన భర్తని యితర స్త్రీలనుండి కాపాట్టమే తన ధర్మంగా నటిస్తుంది. తన భర్తతో మాట్లాడే ప్రతి స్త్రీ తన భర్తను కాజెయ్యటానికే ప్రయత్నిస్తూ ఉంది అనుకుంటుంది. ఎంత ప్రిమిటివ్! మీరంతా మాంధాత యుగంలో ఉన్నారు.”నేనేమీ మాట్లాడలేదు. ఆమె మాటలు యదార్థం అని నాకు తెలుసు. ఆమె వచ్చిందగ్గరనుంచి మా జీవితంలో అమానుషత్వం నాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.“మీరు తెలివిగలవాళ్ళు. మీరు అనుకుంటున్న దానికంటే తెలివికలవాళ్ళు. అందుకని మిమ్మల్ని చూస్తూవుంటే నాకు ముచ్చటగా ఉంటుంది. కాని ఏం లాభం? మీ చుట్టూ వున్న సంఘంలో మీరు ఒకరు అవటంవల్ల మీలో కూడా ప్రిమిటివ్ ఇనిస్టింక్స్ చాలా ఉన్నయ్. మొదటినుంచి నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీరిక్కడ ఉండి చెడిపోతున్నారు. మీ కొక్క సలహా చెపుతానుమీరిక్కడ స్త్రీల క్లబ్బు నొకదాన్ని ఆర్గనైజు చెయ్యండి. ఆడవాళ్ళని కొంచెం కలిసి మెలసి తిరిగేటట్టు చేస్తే తప్ప ఈ పశుత్వం పోదు. నామాట వినండి.”ఈ మాటలు మేం బ్రతుకున్న బ్రతుకునంతా ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చినయ్. భార్యల్ని ఇళ్ళల్లో పెట్టటం బజార్ల వెంట తుకిడీ లు తుకిడీలుగా తిరగడం ఏ స్త్రీ అయినా కనిపిస్తే కోతి చేష్టలు చెయ్యటం- ఆడవాళ్ళ సంగతే సదా మాట్లాడుకోవటం – అంతా అసహ్యంగా కనిపించింది. ఈ మధ్య మా ఊళ్ళో ఆడవాళ్ళకోసం జరిగిన హత్యలు జ్ఞాపకం వొచ్చినై. వీటన్నిటికీ కారణం ఆమె చెప్పిందేనా? ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా ఆలోచనలో పడ్డాను. ఆమెకూడా గ్రహించినట్లు ఉంది. మళ్ళీ ఆ సంగతి ఎత్తలేదు..హాల్లో ప్రవేశించిం తర్వాత మొత్తం రెండు మూడుసార్లు మాట్లాడించింది. ఒకసారి “నాకు ఛార్లెస్ బోయర్ అంటే ఇష్టం. కామేశ్వరుడికి గ్రేటాగార్బో అంటే ఇష్టం” అంది.“ఛార్లెస్ బోయర్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో నాకు తెలుసు. కానీ మీకు ఇష్టం అవటం చాలా ఆశ్చర్యంగా వుంది” అన్నాను.“ఎందుకని?”“అతడు చాలా మాస్కులైన్ గా ఉంటాడు. అతడు ముద్దు పెట్టుకుంటూ ఉంటే తెర చిరుగుతుందేమోనని భయం వేస్తుంది నాకు.”ఆమె చిరునవ్వు నవ్వుతూ, “చిరిగితే చిరిగిందిలే అని పిస్తుంది నాకు” అంది. కొంచెం సేపు వుండి, “విరుద్ధ స్వభావాలు ఆకర్షించుకుంటాయి అనుకోవటం పాత సిద్ధాంతం” అని నెమ్మదిగా చెప్పింది.ఇంకా కొంచెం సేపు ఉండి, “మీరన్న మాటకి నాకొక్క విషయం జ్ఞాపకం వస్తూవుంది. మీతో చెప్పక పోవటం ఎందుకు? మా ఊళ్ళో ఒక మహిళా సంఘంలో సభ్యురాలిగా జేర్చుకోమని అప్లికేషన్ పెట్టుకున్నాను. వాళ్ళు నా అప్లికేషన్ తిరగగొడుతూ ఈ సంఘం స్త్రీలకు మాత్రమే’ అని రాసి పంపారు” అని బిగ్గరగా నవ్వటం మొదలు పెట్టింది. నాకు మాత్రం ఆమెను చూస్తే జాలి వేసింది.మళ్ళీ సినిమా చూస్తూ కూర్చున్నాంమొదటిరాత్రి తెల్లవారగానే కథానాయకుడూ, కథానాయకి అత్యుత్సాహంగా చెట్టుకొమ్మ పట్టుకొని ఒకళ్ళు పువ్వు వాసన చూస్తూ, ఒకళ్ళు డూయట్ సాంగ్ పాడుతూ ఉంటే ” ఈ సీను ఎట్లాఉంది?” అని అడిగింది.“బాగోలేదు. ఆమె కాసేపు అభినయిస్తే బాగుండేది!” అన్నాను. “ఎందుకని”“గత రాత్రి అనుభవం ఆమెకు ప్రథమం చూడండి. అందుకని అతని మొహం చూసీ చూట్టంతోనే సిగ్గు జనించటం సహజం” అన్నాను.“ఆమెకు ఆ అనుభవం ప్రథమం అని మీకెట్లా తెలుసు?” అని నవ్వింది. నవ్వుతూ తన చేతుల్లో వున్న సంపెంగపువ్వు నా చేతిలో పెట్టింది. నాకు పువ్వులంటే ఇష్టం లేకపోయినా వాసన చూస్తూ కూచున్నాను.“గ్రేటాగార్బో “క్వీన్ క్రిస్టనా” చూశారా”“ఆ”“ఆ సీను ఎట్లావుంది”ఆమె ఏ సీనుకి రిఫర్ చేస్తూవుందో నాకు తెలిసింది. ఆ సీన్లో గ్రేటాగార్బో పక్కన పడుకునే వరకు ఆమెకుర్రవాడు అనుకుంటాడు హీరో. అకస్మాత్తుగా తెలుస్తుంది ఆమె కుర్రదని.. ఆ సీను ఎట్లా ఉందని ఆమె నన్ను అడుగుతూ ఉంది.“బాగుంది”“ఆ షాటు ఎట్లా వుంది”ఆమె ఏ షాట్‌ని గురించి అడుగుతూ ఉందో నాకు తెలిసింది. కాని ఆమె ఆ షాట్ అడగటం లేదు. ఆ షాట్లో ఉన్న గ్రేటా గార్బో సంగతి అడుగుతూ ఉంది. గార్బో వదులుగా ఉన్న చొక్కాతో నిలబడి వుంది. లోపల మరేమీ లేదు. అది ఎట్లా వుంది? అని అడుగుతూంది నన్ను. “అసలు గార్బో చిత్రాలు చూస్తుంటే నాకు ఊపిరి సలపక ఒక రకంగా ఉంటుంది, అట్లా అవటం నాకు ఇష్టం ఉండదు.”ఆమె మాట్లాడలేదు.సినిమా హాల్లోనుంచి బయటికి రాగానే ఆమె ఇట్లా అన్నది: “ఇక ఈ వూళ్ళో నేను బతక లేను. మీరంతా ప్రిమిటివ్ పీపుల్స్. నాలుగు వందల సంవత్సరాల కిందటి జీవితాన్ని ప్రస్తుతం మీరు గడుపుతున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే బారువా చిత్రాలలోని కోయవాళ్ళు జ్ఞాపకం వస్తున్నారు. బారువా నవనాగరిక కుటుంబాలను చూపించి, చూపించి అకస్మాత్తుగా కోయగూడెంలో ప్రేక్షకుల్ని పడేస్తారు. ఇతర చోట్ల చూచి మీ ఊరు వచ్చిన నాపని ఇప్పుడల్లా ఉంది. ఇక ఇక్కడ నేను బతకలేను. రేపే వెళ్ళిపోతాను.”ఆమె ఇంకా కొన్నాళ్లు ఈ ఊళ్ళో వుండాలని నాకు ఉంది. ఆమె ఉంటే మా జీవితాలు కొద్దిగానైనా మారవొచ్చు అనే ఆశకూడా ఉంది.ఆమెతో చెప్పుకోలేక “రేపు ఒక్కరోజు ఉండమన్నాను.”“నేను నిజంగా చెబుతున్నాను. ఈ వాతావరణంలో ఒక్క క్షణం కూడా బతకలేను. టార్జాన్ చూశారుగా! ఆ మృగాల మధ్య, ఆ మహారణ్యంలో, ఆ టార్జాన్ పక్కన వున్న పిల్లలని చూస్తే నాకు అమిత భయం వేసేది. ఇప్పుడు మీ ఊళ్ళో మీ మధ్య నా పని ఆ పిల్ల పనిలాగే ఉంది. ఎలా ఉండగలను! ఉండను”మర్నాడు పొద్దున్న నేనూ లక్ష్మణశాస్త్రి మరి కొంతమంది స్నేహితులం కలసి ఆమెను బొంబాయి రైలు ఎక్కించి వొచ్చాం. ఎక్కించి వొచ్చాం అంటే ఆమె ఎక్కింది. మేం చూస్తూనుంచున్నాం.ఆమె నా జీవితాన్ని మార్చి

S1 Ep 187Part - I : సంపెంగ పువ్వు - గోపీచంద్ గారు.
‘సంపెంగ పువ్వు’ గోపీచంద్ గారు రాసిన కథ . 1971 వ సంవత్సరం, జనవరి నెల యువ మాస పత్రిక లో ప్రచురింపబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు.ఈ కథను మీకు అందించదానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు.ముందుగా, రజని గారు గోపీచంద్ గారి గురించి , ఈ కథ గురించీ మాట్లాడతారు.హర్షణీయం’ పాడ్‌కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)సంపెంగపువ్వు:సంపెంగ పువ్వు“ఆమె ఈ బండికి వస్తోందని నీకెట్లా తెలిసింది?” అని శాస్త్రిని అడిగాను. అప్పుడు ఆరుగంటలవుతుంది. బొంబాయినుంచి రైలువొచ్చే టైం. నేనూ, శాస్త్రి ప్లాటుఫారం మీద నుంచొని మాట్లాడుకుంటున్నాం.“ఇవ్వాళే వైరిచ్చింది” అన్నాడు శాస్త్రి. ఆమె శాస్త్రి స్నేహితురాలట ఆమె బండికి వస్తోందని చెప్పి నన్ను వెంట పెట్టుకొచ్చాడు శాస్త్రి.శాస్త్రి ఆమెని గురించి చెప్పిన మాటల్ని బట్టి ఆమె విచిత్ర వ్యక్తి అనిపించింది నాకు “బలే మనిషి, బలే మనిషి” అంటాడు శాస్త్రి. ఏమడిగినా “నువ్వే చూస్తావుగా” అంటాడు. “ఏమోనబ్బా, నాకు చెప్పటం చాతగాకుండా ఉంది మన సంఘంలో ఇటువంటి మనిషి ఉండదు. వచ్చే సంఘంలో ఆడవాళ్ళు ఇట్లా వుంటారేమో! ఇప్పుడు రష్యాలో ఏమన్నా ఉన్నారేమో!” అంటాడు.“అయితే ఆమె భర్త ఏం చేస్తుంటాడు?” అని అడిగాను. ఆమె గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తూ ఉంది నాకు.“ఏదో చేస్తూనే ఉంటాడు లాగుంది. ఆమె మాట్లాడితే ‘కామేశ్వరుడు అటువంటివాడు, ఇటువంటివాడు, ఎంత చలాకీగా వుంటాడనుకున్నావ్” అని చెపుతూ ఉంటుంది.“భర్త అంటే చాలా ప్రేమ కాబోలు.”“ఆమెకు మొత్తం నలుగురు పిల్లలు. ఒక మొగపిల్లవాడూ ముగ్గురు ఆడ పిల్లలూ” అన్నాడు శాస్త్రి కొంటెగా.నిజంగా ఆమెకు పిల్లలనేటప్పటికి నా మనస్సు కలుక్కుమంది. మిగిలిన ఆడవాళ్ళకు మల్లే ఈ బలే మనిషిక్కూడా పిల్లలా? ఎందుకనోగాని ఈ భావాన్నే నేను భరించలేక పోయాను.ఇంతలో “అదిగో రైలు వస్తూ ఉంది” అన్నాడు శాస్త్రి. ఆమాటకి నా హృదయం దడదడ కొట్టుకుంది.అకస్మాత్తుగా ప్లాట్ ఫారానికి చలనం కలిగింది. ఇద్దరు ప్రయాణీకులు ప్లాట్ఫారం అంచునుంచి సామాను సర్దుకొని దూరంగా నుంచున్నారు. ఒక ముసలమ్మ మూటనొక చేత్తో, మనవణి పట్టుకొని నిలబడింది. ఒక రైతు నుంచున్నవాడు నుంచున్నట్టుగానే హడావిడి పడుతున్న కర్ర చుట్టా, చుట్టని కర్రా అనుకున్నాడు.రైలు ఆగీ ఆగడంతోనే ‘మూడో తరగతి’ అని జ్ఞాపకం చేశాడు లక్ష్మణ శాస్త్రి. ఆమె ఎప్పుడూ మూడో తరగతిలోనే ప్రయాణం చేస్తుందట. అమెకు ఒంటరితనం గిట్టదు. అందుకని జనసమ్మర్థంగా మూడో తరగతి చూచి అందులో ప్రయాణం చేస్తుంది. ఆమెకు ఎంత ఇరుగ్గా ఉంటే అంత సరదాగా ఉంటుందట! నాకు ఆమెను వెతకాలని వుంది కాని కాళ్లాడక అక్కడే దిక్కులు చూస్తూ నుంచున్నాను.అది చిన్న స్టేషను. ఎక్కువ మంది దిగరు. “అదుగో దిగుతూ ఉంది” అని గార్డు పెట్టె వైపుకి చూపిస్తే చూశాను. కనబడలేదు.“హలో” ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తితో కరస్పర్శ చేస్తూ అన్నాడు లక్ష్మణశాస్త్రి, ఆ వ్యక్తి ఓవర్ కోటులో ఉంది. చేతిలో తోలుసంచి ఉంది.“మీరు రారనుకున్నాను” అన్నాడు. “అదేమిటి? ఎందుకు అలా అనుకోవటం?” అంటున్నది.ఆ ఓవర్ కోటులో ఉన్న వ్యక్తి ఆమె అని అప్పుడు నాకు తెలిసింది. మామూలు స్త్రీ ఆకారం కోసం వెతుకుతున్న నా చూపులు ఓవర్ కోటులో ఉన్న ఆమెను పట్టుకోలేక పోయినయ్. నేను మళయాళంలో ఉన్నప్పుడు ఇటువంటి అవస్థలోనే ఉండేవాణ్ని. గూడకట్టు కట్టుకొని తుండుగుడ్డ భుజాన వేసుకునే ఆ స్త్రీలు నా కంటికి ఎప్పుడూ పొరపాట్నయినా స్త్రీలుగా కనిపించేవాళ్ళు కాదు. ఇప్పుడూ ఆ దుర్గతే పట్టింది.లక్ష్మణ శాస్త్రి “ఆపేక్ష వున్నచోటే భయంకూడా ఉంటుంది. మీరు రావాలనే ఆ పేక్షతో పాటు, మీరు రారనే భయంకూడా ఎక్కువైంది”.ఆమె నవ్వి “కామేశ్వరుడు కూడా ఇట్లాగే మాట్లాడుతాడు” అంది.ఆమె భర్త పేరు ఎత్తేటప్పటికి లక్ష్మణశాస్త్రి కించపడి టాపిక్ మార్చటానికి ప్రయత్నించాడు. నన్ను పరిచయం చేస్తూ, ఇతడు శరచ్చంద్రబాబు. నాకు పరమ స్నేహితుడు. రాస్తూ ఉంటాడు. సినిమాలతో సంబంధం ఉంది.. మంచి….”ఆమె లక్షణశాస్త్రి చేతిని వదలకుండానే నన్ను ఎగాదిగా చూచి, “మీ కథలు కొన్ని చదివాను. మీ కథలు బాగుంటై” అంది. శాస్త్రి యింట్లో దిగింది!ఆ రాత్రి నిద్రపట్టకపోవటం వల్ల తెల్లవారి కొంచెం ఆలస్యంగా లేచాను. త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆమెను చూట్టానికి లక్ష్మణ శాస్త్రి ఇంటికి వెల్దామా వద్దా ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంతలోకి లక్ష్మణశాస్త్రే వొచ్చాడు. “ఒకసారి మా ఇంటికి రావోయ్. ఆమె పిలుచుకురమ్మన్నది” అన్నాడు.“ఎందుకు?” అని అడిగాను. లోపల వెళదామని ఉంది. ఆమె ఊరికేనే పిలుస్తూ ఉందని తెలుసు. అయినప్పటికీ అప్రయత్నంగా అలా అడిగేశాను.లక్ష్మణశాస్త్రి నన్ను విచిత్రంగా చూచి, కాసేపు ఆగి, “సరేలే, రా” అన్నాడు. నేను బయల్దేరాను.మేము వెళ్లేటప్పటికీ లక్ష్మణశాస్త్రి స్నేహితులూ, ఊళ్ళో కుర్రవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ మధ్య కూర్చొని కబుర్లు చెబుతూ ఉంది. నన్ను చూచి, “ఏమండీ, పిలిస్తేగాని రావొద్దను కున్నారా?” అని నవ్వుతూ అడిగింది.“మా వాడికి ఆడవాళ్లని చూస్తే సిగ్గు” అన్నాడు శాస్త్రి,అంతా నవ్వారు. ఆమె మాత్రం చిన్నపుచ్చుకుంది. కారణం నాకు బోధపడలేదు గాని, ఎందుకో బాధపడుతున్నట్టు మాత్రం స్పష్టంగా కనిపించింది. అదైనా కాసేపే! మళ్ళీ యథాప్రకారం అందరితోనూ కులాసాగా కబుర్లు చెప్పటం మొదలు పెట్టింది. తన అనుభవాలు, కథలు కథలుగా వర్ణించి చెప్పింది. చివరికి “మీకు నాకున్న అనుభవంలో పదోవంతు కూడా లేదు” అంది.నిజమే, అందరూ అంగీకరించారు. “కాబట్టి వయస్సు మాట ఎట్లా వున్నా మీ అందరికీ నేను తల్లిని” అంది.ఈ మాట మామధ్య పిడుగుపడినట్లు పడింది. కొందరు సిగ్గుపడి తలవొంచుకున్నారు, కొందరు వెకిలినవ్వు నవ్వారు, కొందరు తెల్లబోయారు.నాకు ఇంకొక లోకంలో ఉన్నట్లు ఉంది. ఆమె మాత్రం వీటిని గమనించనట్లు యథాప్రకారం మాట్లాడుతూనే

S1 Ep 186part ii - ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన
ఆగదిలో యింకోవస్తువేదో ఉన్నట్టు రావుగారికి కనిపించింది. తెరచిన తలుపులోనుంచి లోపలికేదో ప్రవేశించినట్లుగా, చేతిలో దీపం వెలిగించి ఆయన ఆవేపు చూశారు. ముష్టి ఆమె గజగజ వణకుతూ నీరు కారుతూ వొకమూల నిలబడివుంది. ఆమె తడివెంట్రుకలు ముఖాన్నీ చెక్కులనీ అంటుకున్నాయి. వాటివెంట నీరు కారుతోంది.‘బాబుగారు! తలుపు ముయ్యలేదే! కొంచెం వెచ్చగా వుంటుంది’ అంది ఆమె గొంతుక బాగా పెద్దది చేసి. ఆయన ఒక యంత్రంలాగా లేచి తలుపు ముయ్యడానికి ప్రయత్నించి విఫలులయ్యారు. ఆమె సహాయం చేసింది. ఎలాగో తలుపు మూసి లోపల గడియవేశారు. కాని గాలి ఒక్కసారి వూపింది. గడియ వూడిపోయింది. ఇద్దరూ మళ్ళీ తలుపులు మూసి గదిలో వున్న కర్రసామాను అంతా కొన్ని కుర్చీలూ, ఒక బీరువ, బరువైన డ్రాయరూ తలుపుకి అడ్డంగా చేర్చారు. తలుపులు ముయ్యాలని తనకు తోచకపోవడం రావుగారికి వింతగా తోచింది. ఇపుడు కొంత వెచ్చగా వుంది. భయం తగ్గింది. ఎక్కడో పెద్ద చప్పుడైంది. ఏదో పడిపోయింది. స్టేషన్ లోపలే పడిపోయిందేమో? “ఏం గాలి వానండి బాబుగారు నేను పుట్టిన్నాటి నుండి యింత గాలివాన నేను సూడలేదు.” అంది ముష్టి ఆమె గొంతులో ఏమీ బెదురులేకుండా. అంత ప్రశాంతంగా ఆమె ఎట్లా మాట్లాడకలుతుందో ఆయనకు అర్థం కాలేదు. ఆమెవేపు దీపం వేసి చూశారు. మూలగా చలిచేత ముడిచి పెట్టుకుని వొణుకుతూ ఆమె కూచుంది. రావుగారు పెట్టి తీసి తనపంచ ఒకటి తీసి ఆమెవేపు విసిరి ‘తడిబట్ట విడిచి యిది కట్టుకో’ అన్నారు. ఆయనన్న దేమీ ఆమెకు వినిపించలేదు. కానీ పొడిబట్ట యిచ్చినందుకు కృతజ్ఞత చూపిస్తూ బట్టమార్చుకుంది. ఆ మూలే పొడిగా వున్నచోట కూర్చుంది. రావుగారికి తనకు ఆకలి వేస్తున్నట్లు జ్ఞాపకం వచ్చిందితన పెట్టె తీసి అందులో వున్న బిస్కట్ల పొట్లం తీశారు. ఒకటొకటి చొప్పునా నమలడం మొదలు పెట్టారు. |అక్కడే కూర్చున్న ఆమె ముఖం వేపు చూసారు. ఆమెకు కూడా ఆకలి వేస్తున్నదేమోనని ఆయనకు స్ఫురించింది.“బిస్కట్లు తింటావా?” అని అడిగారు. “ఏంటన్నారు?” అన్నదామె గట్టిగా, ఆ గాలి హోరులో ఒకరు మాట్లాడితే ఒకరికి వినిపించలేదు. ఆయన దగ్గరగా వచ్చి కొన్ని బిస్కట్లిచ్చారు. . “ఇవ్వేవున్నాయి, తినడానికి” అన్నారు రావుగారు ఏదో పొరబాటు చేసినట్లుగా. కాని అసలు లేనిదానికంటె నయం కాదూ? తన చోటికి తిరిగి వెళ్ళి పెట్టిమీద కూచున్నారు. కుర్చీలు తలుపులకి అడ్డం పెట్టివున్నాయి. ఆమె గదిలో వుండడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరూ లేకపోవడం కంటె ఆమె వుండడం కొంత నయం. – దేని గురించీ బాధ పడదు. గాలివానను గురించి కూడా. జీవితంలో కష్టనిష్ఠురాలు ఆమెకు అనుభవమై వుంటాయి. అంచేత ఆమె ఏ పరిస్థితినైనా కంగారు పడకుండా ఎదుర్కోగలదు. . రావుగారు గడియారం వంక చూచారు. తొమ్మిది గంటలయింది. అయినా రైలు దిగిన తర్వాత కొన్ని యుగాలు గడిచినట్లు ఆయన కనిపించింది. ఆయన వచ్చే స్టేషను వరకు మిగతా వారితో కూడా ప్రయాణం సాగించివుంటే బాగుండును. పెద్ద గాలివాన చెలరేగుతుందనీ, తను దిగేది ఒక చిన్న స్టేషను అని ఆ కంగారులో ఆయనకు స్పురించలేదు. స్టేషన్ నుంచి వూరు సుమారు రెండుమైళ్ళు ఉంటుంది. వూరికి తర్వాత స్టేషన్ నుంచైనా చేరుకుని వుండవచ్చు. అన్ని విషయాలను కొన్ని సూత్రాలతో బంధించడం అలవాటయిన ఆయన మనస్సు గాలి యొక్క వేగాన్ని గురించి యోచించింది. బహుశా గంటకు 80 లేక 100 మైళ్లు వుండవచ్చు గాలివేగం. పెద్ద భయం ఆయన మనస్సును ఆవరించింది. ఈ గది కూలిపోవచ్చు. బయటికి పోయే ఒక్కదారీ కుర్చీలతోటి, బల్లలతోటి మూసివుంది. ముష్టిమనిషి కూచున్న చోటికి ఆయన కంగారుగా పరిగెత్తారు. “ఈ యిల్లు కూలిపోదుగదా?”అని ఆయన అడిగారు.“ఎవరు చెప్పగలరు? యిల్లు గట్టిగానే వున్నట్టుంది. గాలిబలం ఎక్కువయితే ఏది ఆగుద్ది?”ఆమె మాటల్లో ధైర్యాన్ని కలిగించేది ఏదీ లేకపోయినా, ఆమె గొంతులో ఏదో ఒక చనువూ స్థైర్యం ధ్వనించింది. ఆయన పెట్టి దగ్గరకు పోయి కూర్చున్నారు. ఆయన కూర్చున్న మూలకు నెమ్మదిగా ఆమెకూడా చేరింది. “అక్కడ కూర్చుంటే ఒకరి మాట ఒకరికి వినబడదు” అంది. “గాలివాన యింత ముదిరిపోతుందని నే ననుకోలేదు.”“బాబుగారు ఎందుకలా భయపడతా” రందామె. “ఒక్కరుండే కంటె ఇద్దరమున్నాంగదా! టికెట్టు కలెక్టరు దొంగముండావాడు. రైలు కదులుతూంటే నన్ను దింపేశాడు, ఏం చెయను! యిక్కడుండి పోయాను. అయినా నాకేటి విసారం? బాబుగారు చుట్టమెట్టుకోనాకి ఓ పొడిగుడ్డిచ్చారు. ఏదో కాంత అకలికి మేత పడేశారు. వచ్చే టేసనులో ఈ మాత్రం సుకమయినా వుంటాదని ఎలా అనుకోగలను? వున్నంతలో సుకంగా వుండాలి బాబుగారు! అదిలేదని, యిదిలేదని సీకాకుపడితే ఏం లాబం?”ఆమె గొంతు అలా మోగుతుంటే ఆయన మనస్సు కాస్త స్థిమిత పడింది. ఆమె భౌతిక దేహాన్ని చూస్తే ఆయన కసహ్యం. ఆయన మనస్సుకీ ఆమె మనస్సుకి ఎంతో అంతరం వుంది.అయినా ఆ భయంకరమయిన రాత్రి తనకు తోడుగా ఆమె వున్నందుకు ఆ కృతజ్ఞత ఆయన మనసులో నిండింది.“నీ కెవరూ చుట్టాలు లేరా?” అన్నారాయన, వెంటనే యింత చనువుగా ప్రశ్న వేసినందుకు నొచ్చుకున్నారు. తను రైలులో ఆమెకు ఒక కానీ కూడా యివ్వనందుకు ఆమెకు తనమీద ఏమన్నా కోపముందేమోనని ఆయన అనుమానం. మాటల్లోగానీ చేతల్లోగానీ కోపం కనబడలేదు. గట్టిగా గొంతు ఎత్తి మాట్లాడవలసిన అవసరం లేకుండా ఆమె కొంచెం ఆయన దగ్గరగా జరిగింది.సుట్టాలందరికీ వుంటారు. ఏం లాబం బాబుగారు? మా అయ్య తాగుతాడు. ఆడే మా అమ్మని సంపేశాడంటారు. నాకు మనువు అవలేదు. కానీండి బాబుగారు ఓ దొంగముండావాడితో సేవితం కలిసింది. నాకు ఇద్దరు పిల్లలండి బాబుగారు. ఆడికి జూదం, తాగుడు అలవాటయిపోయాయండి. రోజూ ఏలకి ఏలు నెగ్గుతుంటాడు పోతుంటాయి. ఏం జెయ్యను బాబుగారు? ఇంట్లో తిండికి తిప్పలకీ నా సంపాదనే. పిల్లలింకా చిన్నోళ్లు బిచ్చమెత్తుకోనాకి. మావోడికి రోజుకో పావలా ఇత్తానండి తాగుడికి. అడికి నన్ను సూత్తే అడలు బాబుగారు. తాగుడు లేకపోతే నా ఎదురుగా నిలబడి తట్టుకోలేడండి. అందుకే తాగుతాడు బాబుగారు! అసలు అందరికీ తాగుడు అలాగే అలవాటవుద్దండి.”‘నువ్వు ఏమాత్రం సంపాదిస్తావు.”‘ఒక్కోరోజు ఐదు రూపాయలు దాకా దొరుకుద్ది. ఒకోరోజు కానీ కూడా వుండదు. అయినా బాబుగారు! నేనడిగితే ఎవరూ లేదనరండీ మీరు తప్పితే. కొంతసేపు ఆరితో సరదాగా మాట్లాడితే యిచ్చేత్తారండి.”రావుగారు అన

S1 Ep 185part I - ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘గాలివాన ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన కథల పోటీలో రెండవ బహుమతి పొందింది.పుస్తకం కొనడానికి కావాల్సిన web linkPalagummi Padmaraju Rachanalu -Vol1కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు.ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.హర్షణీయం’ పాడ్‌కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)గాలివాన’మబ్బు మసగ్గా అలుముకుపోయింది. రైలు చాలా ఆలస్యంగా వచ్చింది. రావుగారు రెండో తరగతి పెట్టె ఎక్కుతుంటే, ఆయనకు తన యిల్లు, ఆ యింట్లో అలవాటుపడ్డ సుఖాలు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఆయన చదువుకునే గది అతి శుభ్రంగా తుడిచివుంది. అందులో నల్ల విరుగుడు చేవతో చేసిన రాతిబల్ల, దానిమీద ఒక మూలగా, ఒక ఆకుపచ్చ గొట్టంలో దీపం వెలుగుతూ వుంటుంది. ఆయన కుర్చీ మెత్తలో కూర్చునే చోట అనుకూలమయిన పల్లాలు ఏర్పడ్డాయి. సోఫాలో వున్నట్టు కూడా తెలియకుండా ఆయన భార్య కూర్చుని ఉంటుంది. ఆయనకు నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడ, యిద్దరు మగ.వాళ్ళని చూస్తే ఆయనకు ఎంతో గర్వం.రైలు పెట్టెలో మూడుమెత్తలూ ఎవరో ఆక్రమించుకుని పరుపులు పరుచుకున్నారు. తను ఎక్కినందుకు అందులో వున్న నలుగురు ప్రయాణికులు చిరాకు పడుతున్నట్లు, రావుగారు వాళ్ల ముఖాలు చూడకుండానే గ్రహించారు. ఇంకో పెట్టెలోకి వెడితే బాగుంటుందని ఆయనకు అనిపించింది. కాని కూలివాడు ఆయన బెడ్డింగూ, పెట్టె, గొడుగు పైబల్లమీద పెట్టి వెళ్ళిపోయాడు. రైలు కదిలిపోయింది. ఒక పెద్దమనిషి పరుపు కొంచెం మడిచి రావుగారికి చోటు చేశాడు. రావుగారు కూర్చుని పరిసరాలు వీక్షించడం ప్రారంభించారు.నలుగురూ దూర ప్రయాణీకులని ఆయన గ్రహించారు. బూట్లు మేజోళ్లతో సహా బల్లల క్రిందకు తోసివేయబడి వున్నాయి. కోట్లు, పాంట్లు, చొక్కాలు పై కొంకెలకు తగిలించి వున్నాయి. వదులైన పైజామాలను ముగ్గురు మగప్రయాణికులు తొడుక్కున్నారు. వస్తువులన్నీ యిటూ అటూ తొందరలేనట్టు పరచి ఉన్నాయి. కిటికీల పక్కనివున్న రెండు మెత్తలమీద ఇద్దరు పెద్దవయసువాళ్ళు కూచున్నారు. లోపలగా వుండే నిడుపైన బల్లమీద ఒక యువకుడు, ఒక యువతీ కూర్చుని ఉన్నారు. యువతి ఆయనకు భార్య అయిఉంటుంది. సిగరెట్టు పొగ మెత్తనిఘాటు రావుగారి నాసికారంధ్రాలలోకి తెలియకుండా ప్రవేశించి ఒకక్షణంపాటు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది.రైలు పెట్టెలో సిగరెట్టు పొగను గురించి రావుగారికి తీవ్రమయిన అభిప్రాయాలున్నాయి. అనేక విషయాలను గురించి ఆయనకు తీవ్రమయిన అభిప్రాయా లున్నాయి. అసలు ఆయన వేదాంతి. ఆయనకొక అభిమాన సిద్ధాంతముంది – వేదాంతం జీవితంతోటి, జీవన విధానంతోటీ, వ్యక్తికీ సంఘానికీ మధ్య ఏర్పడే రకరకాల సమస్యల తోటీ, అనుబంధించి వుంటుందని ఆయన వాదము. ఆయన ప్రకారం, వేదాంతానికి, జీవితానికీ, నిశితమైన మానవానుభవాలకి కూడా అతీతమయిన విషయాలతో ఏమీ సంబంధం లేదు. ఆయన జీవితం సుఖంగా మిట్టపల్లాలు లేకుండా గడిచిపోయింది. అసంతృప్తి వల్ల ఆయన జీవితాన్ని గురించి అమితమయిన ఉత్సాహంతోటీ పవిత్రమైన ఉద్రేకంతోటీ మాట్లాడగలరు. ఒక్క వేదాంతిగానే గాకుండా, మంచివక్తగా కూడా ఆయన ప్రఖ్యాతి పొందారు. ఆయన తన వేదాంతాన్ని అనుపమానంగా ఉద్విగ్నుడై వివరిస్తూ వుంటారు. అసలు ఈ ప్రయాణం చేస్తున్నది ఒక ఉపన్యాసం యివ్వడంకోసం. ‘ఆస్తిక మహాసమాజము’ అని పేరు పెట్టుకున్న ఒక సంస్థ ఆహ్వానం మీద ఆయన వెడుతున్నారు. ఉపన్యాసం; సామ్యవాదమూ రమ్య రసామోదము అనే విషయాన్ని గురించి. ఆయన అభిప్రాయం సామ్యవాదంలో ఈ రమ్యరసాత్మ ఉందనో లేక ఆ రెండూ పరసర విరుద్దమయినవి కావడంచేత వాటికి ఒక సమన్వయం కల్పించాలనో అన్నది తెలుసుకోవాలంటే ఆయన ఉపన్యాసం వినవలసిందే.రావుగారు యువదంపతుల వేపు చూశారు. యువతి ముఖం చాలా బరువుగా మంది. ఆమెకు కాస్తవుత్సాహం కలగడానికి కాబోలు యువకుడు నవ్వుతూ ఆమె చెవిలో ఏదో అన్నాడు. బహుశా తన భర్తతో కూడా అతను ఉద్యోగంలో వున్న ఏ దూర దేశానికో మొదటిసారి ఆమె వెడుతున్నట్లుంది. రావుగారికి ఈ మధ్యనే తాను యిచ్చిన ఉపన్యాసం జాపకం వచ్చింది. ‘సత్వము తత్వము’. ఆయన ఉపన్యాసాల శీర్షికలు శబ్దాలంకారాలను బట్టి నిర్ణయమవుతాయిగాని, అర్ధస్ఫురణను బట్టి కాదని ఆయన స్నేహితులు కొందరు ఆయన్ని వేళాకోళం చేస్తుంటారు. అది నిజం కాదని ఆయననలేదు. కాని ధ్వనిని బట్టి అర్థం అనుసరిస్తోందని మాత్రం సమాధానం చెబుతుంటారు. ఆయన ఇచ్చిన ఉపన్యాసాలలో చాలా అందమయినది “ప్రకృతి పరిష్కృతి.”గాలి పెరిగింది. బలంగా కిటికీ తలుపుల మీద మొత్తుతోంది. ఉన్నట్టుండి పెట్టెలో చీకటిగా అయిపోయింది; ఇంకా సాయంత్రం అయివుండదు. రావుగారికి ప్రక్కన కూర్చున్న పెద్దమనిషి కనిపించీ కనిపించని దీపపు వెలుగులో ఒక అపరాధ పరిశోధక నవలను తదైక్యంతో చదువుతున్నాడు. చటుక్కున అతను ముఖం ఎత్తి ‘టైము ఎంత అయివుంటుంది’ అని రావుగారి నడిగాడు. రావుగారు ఒక క్షణం ఆలోచించారు, ఆయన చేతికి గడియారం ఉన్నా కూడా. “మూడు గంటలు అయివుండవచ్చు” అన్నారు. “ఎంత చీకటిగా అయిపోయింది!” అన్నాడు పెద్దమనిషి. రావుగారు సమాధానం చెప్పకుండా ఆ పెద్దమనిషివేపు చూచారు. ఆయనకు రావుగారి వయస్సు ఉంటుంది. ఏభై ఏళ్ల మనిషి. ఒక అపరాధ పరిశోధక నవల చదువుతూ ఆనందించటం రావుగారికి వింతగా కన్పించింది. ఎదురుగా కూచున్న ముసలాయన గంభీరంగా చుట్టకాలుస్తూ దాని రుచి ఆస్వాదిస్తున్నాడు. కొందరు మనుష్యుల స్వభావాలే అంత – అనుకున్నారు రావుగారు. ఎదురుగా కూర్చున్న ముసలాయన రావుగారికంటె పెద్దవాడయి యుంటాడు. కాని ఆయన ముఖంలో కుర్రవాళ్ళకి సహజమైన చురుకుతనం ఉంది. అయినా ఆ ముఖం ఆయన వయసును మాటుపరచడంలేదు. వాలిపోయిన దవడలు, ముడతలు పడ్డ నుదురు, వయస్సును చాటుతూనే ఉన్నాయి. రావుగారికి ఉపన్యాసానికి ఇంకొక విషయం స్ఫురించింది. ‘వయోవిపాకము మనోవివేకము.”తాను చాలా ఆరోగ్యవంతుడన

S1 Ep 184'మంత్రపుష్పం' - మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథ
హర్షణీయంలో ఇప్పుడు వినబోయే కథ - మంత్రపుష్పం, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన. తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. నాట్యకళలో, చిత్రలేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది.కృష్ణాతీరం అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి గడించింది.ఈ కథను మీకందించడానికి అనుమతినిచ్చిన క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ సూరిబాబు గారికి కృతజ్ఞతలు.హర్షణీయం’ పాడ్‌కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)మంత్రపుష్పం :పాపం! - చిట్టి రాలిపోయిందిరా!" అన్నాడు, మొనమొన్ననే జిల్లా కాంగ్రెసు సంఘంలో కృత్యాద్యవస్థమీద సభ్యుడుగా జొరబడ్డ మా పంతులు."ఎప్పుడు?" అని మేం నలుగురం అడిగాము, గొంతులు బిగిసి. “వారం రోజులయింది!" అని జవాబు ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టు!"బ్రతికి ఎందర్నో సుఖ పెట్టింది! పోయి తాను సుఖపడుతుంది" అంటూ మాలో ఒకడి నిట్టూర్పు!"ఆ బ్రతుక్కి చచ్చిపోవడంకన్న సుఖమేముంది? తెరిపి ఏముంది?- అదృష్టవంతురాలు!" అని మరొకడి సాకారం.“అవును, దాని బ్రతుకంతా చచ్చినచావే! అది కాగా నెట్టుకొచ్చింది కాని, మరో ఆడదైతే-"“మరో ఆడదానికి అంత దమ్ముంటుందా?- గట్టిగా చెడిపోయేందుకన్నా నిష్ఠంటూ ఒకటి ఉండాలి!"చిట్టి బ్రతికి ఉన్నప్పుడు, ఎవరన్నా ఇలా నోరెత్తగలిగారా? - ఎవడికి గుండెలున్నాయ్-ఎవరెల్లా మాట్లాడినా, మొత్తానికి అందరమూ చిట్టి స్వర్గానికి చేరుకున్నందుకు - సాదా స్వర్గం కాదు, పచ్చి వీరస్వర్గం - ఎంతో వాపోయినాము. మా విచారం చిట్టి పోయిందని కాదు. సరిగ్గా ఆ వేళకే - ఎప్పుడూ ఊళ్ళోనే ఉట్టి కట్టుకుని ఊరేగే బడుద్దాయిలం యావన్మందీ - ఏదో మునిగిపోయినట్లు - ఎవరమూ ఊళ్ళో లేకుండా పోయినందుకు, ఆ వైభవం కళ్ళారా చూసే భాగ్యం లేకపోయినందుకు..చిట్టి భౌతిక శరీర లేశానికి వీరాధి వీరోచిత మర్యాదలు జరిగినవి. త్రివర్ణ పతాకాన్ని కప్పి, కాంగ్రెసు వాలంటీర్లు, రెండోరకం నాయకులూ జయజయ నినాదాలతో బారులు తీరి ముందు నడవగా, చిట్టి పితృవనానికి పయనించింది. మంచిగంధపు ధూళిలో మలిగిపోయింది.ఈ మర్యాదలో మర్మం - మా ఊరి వారికి - అందులోనూ ఇంగితమున్న కొందరికి - కాని అర్థంకాదు. విన్నవాళ్ళూ - పత్రికలో చదివిన వాళ్ళూ - "ఇదేం విడ్డూరం? ఈ ఊళో కాంగ్రెసువారు కేమన్నా పిచ్చి ఎక్కిందా? లేకపోతే, పెద్దలను వెక్కిరించడానికా, ఈ తతంగమంతా. లేకపోతే.. సామాన్యపు బజారీ పడుపుగత్తె కనుమూస్తే బ్రహ్మరథం పడతారా? " అనుకుంటూ విసుపోవచును అందులో అబ్బురం ఏమీలేదు. చిట్టి బ్రతుకు మా సీమదాటి ఎందరికి తెలుసు? - ఆ మనిషి మనసు ఎవరికి తెలుసును .పోనీ - ఇప్పుడన్నా, లోకం కనువిప్పడం మేలు.చిట్టి - ఏ తల్లి కడుపునో పుట్టింది. ఏ చెట్టునీడనో తినో మానో ఎలాగో పెరిగింది. పదేళ్లు వయసులో బొద్దుగా గున్నలాగా ఉండేది. సినీమాకు, ఆడవాళ్ళ గేటు దగ్గిర సమ్మరం చూచుకుని దూసుకుపోయేది. సినీమాలో విన్న పాటలూ - చూసిన ఆటలూ - కునికిపాట్లు పడుతూండే జట్కాబండి వాళ్ళ దగ్గిరపాడేది - ఆడేది. వాళ్ళు విసిరేసిన కానీ డబ్బులు పరికిణీ రొండిన దోపుకునేది. ఎవడి చెవిసందునుంచో ఓ బీడీ ఎగేసుకుపోయి, కమ్మగా దమ్ముకొట్టి ఎక్కడ నిద్రవస్తే అక్కడే పడుకునేది. చెట్టుమీద వాలే గువ్వపిల్లంత గోముగా, ఈ చెట్టుకింద పక్షి పెరిగింది.చిట్టికి ఎవరా పేరు ఎప్పుడు పెట్టారో, ఎవరా పేరుతో మునుముందుగా పిలిచారో తెలిసే దాఖలా ఏమీలేదు. కాని, ఓ రకంగా ఊహించడానికి కొంతవరకు వీలున్నది. అసహాయోద్యమ యోధులలో కొన్ని వర్గాలు కేవలం శాంతి సమరంమీద విసుగుపుట్టి - రైలు పట్టాలు లేవనెత్తడం, తంతితీగెలు తెంచడం ఇత్యాది సర్కస్ ప్రదర్శనానికి నడుంకట్టి దుమికిన రోజుల్లో - మా వూళ్ళో, ఉత్తరాదినుంచి వచ్చిన గారడివాడి ఆటలో, తొలుదొల్తగా చిట్టి సాక్షాత్కరించింది. వాడు, ఏదో లాగవం చేయడానికి - ఎవరన్నా ఓ కూన అవసరమై, చుట్టూ మూగిన మూకలో ఏ పోరగాణ్ణి రమ్మన్నా రాకపోవడంతో - "పోనీ నీవు రా చిట్టి, నిన్నేం కొరుక్కు తిననులే!" అని, జనం మధ్య కుమ్మిసలాడుకుంటూ ఆట చూడటానికి ముందుకు నెట్టుకువస్తున్న ఈ ఏబ్రాసిని, వాడు వెక్కిరింతగా పిలవడంతో, చిట్టి ఆ సుముహూర్తాన రంగంలోకి నిర్భయంగా దూకి - వాడితోబాటు ఆడి, వాడిని ఆడించి ఆ పూటనుంచీ - చిట్టి మాదైపోయింది. అదే పేరైపోయింది.చిట్టి ఎవరు పిలిచినా పలికేది. అందరినీ కవ్వించి మాట్లాడేది. దాని మాటలో అదో పొంకం ఉంది. మాటకు మాటకూ మధ్య మౌనంగా పెదవి విరుపులో - ఆ కంటి చూపులో - ఏదో చెప్పరానంత నిండు ఉంది. చిట్టి అలవోకగా బూతులు మాట్లాడేస్తున్నా, ఎంత శోత్రియుడికైనా వినడానికి ఏమీ ఎబ్బెట్టు ఉండేది కాదు.చిట్టి అధిక చక్కంది. అదంతా అర్థంకాని అందం. ఎండా వానా అనకుండా, అహర్నిశలూ ఆగమ్మ కాకిలాగా తిరుగుతూ, అందిందల్లా తింటూ, ఏ జన్మానా, జుట్టుకు చమురూ, ఒంటికి నలుగూ లేని ఏబ్రాసి - లక్సు పరిమళ సబ్బుతో చర్మ సౌందర్యాన్ని రక్షించుకునే తారల గ్లేజు బొమ్మలకన్న పోణెం గా ఉండేది. పిల్లదాని పోషణ యావత్తు పంచప్రాణభూతాలు చేసేవి, అని మా కందరికీ గట్టి నమ్మకం! వచ్చిన ఏడాది లోపలే చిట్టికి నిండుగా వయసు వచ్చేసింది. వచ్చిన మరుక్షణంలోనే - ఎవరో , పొరుగూరు నుంచి బడి చదువుకోసం వచ్చిన ఓ కుర్రవాడి చెంప - నడి బజారులో నాలుగు రోడ్లు కలిపే రద్దీలో మెరుపు దీపం క్రింద చెళ్ళుమంది. అది ఎలా జరిగిందంటే -చిట్టి అప్పటి నుంచి, కొన్ని రోజులుగా, సంజపడిన తరువాత సరిగా అదే వేళకు, ఆ దీపం దగ్గరకు వచ్చి, ప్రొద్దుపోయేదాకా ఉండి కడుపు పట్టినంత, ముంత క్రింద పప్పు కొనుక్కు తినేది. అంటే, తిన్నదంతా కొనుక్కునేది అనకూడదు. కొన్నప్పుడల్లా కొన్నంత కొసరేయించుకునేది. చనువైనవాడు కొంటూంటే కలియబడి ఓ పట్టెడు కముచుకునేది - బేరం సాగినంత స

S1 Ep 183వాకాటి పాండురంగరావు గారి 'మందీ - మరొక్కడు'
హర్షణీయంలో వినబోయే కథ పేరు 'మందీ - మరొక్కడు' వాకాటి పాండురంగరావు గారి రచన. ఈ కథను అందించడానికి అనుమతినిచ్చిన అపరాజిత గారికి కృతజ్ఞతలు.సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో జన్మించారు. ఆయన ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు. విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు.పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిది, దిక్చూచి లు ఆయన ప్రసిద్ధ రచనలు."కథ చెయ్యాల్సిన పని వర్తమానం నించి భవిష్యత్తు గా మారే, పరిణామ క్షణాన్ని (that fleeting moment) , పట్టుకునేందుకు ప్రయత్నించడం. దానికుండే పరికరాలు , similes, metaphors, images, magic realism మొదలైనవి.. అనుకూలమయిన వాటిని ఎన్నుకుని వాడడం లో రచయిత ప్రత్యేకత ప్రతిభ వెల్లడవుతుంది" - శ్రీ. మధురాంతకం నరేంద్ర 'మందీ - మరొక్కడు' వాకాటి పాండురంగరావు గారి 'అపరాజిత' అనే కథాసంపుటిలోనిది.ఈ కథ రాసింది, 1964-65 మధ్య కాలంలో. అవి, మధ్యతరగతి కుటుంబాలు , వ్యవసాయాధారిత జీవనాన్ని వదిలేసి, ఉద్యోగాల కోసం పట్టణాలకు తరలి వెళ్లడం అనే మార్పు మొదలైన రోజులు. కథలో ముఖ్య పాత్రధారి వేణుగోపాల్. అతని 'ఐడెంటిటీ క్రైసిస్' ఈ కథలో ముఖ్యాంశం. అతను ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో చిన్న ఉద్యోగి. వేణుగోపాల్ ఇబ్బందులు , ఆఫీస్ కు వెళ్ళడానికి బస్సు కోసం క్యూ లో నిలబడ్డప్పుడు మొదలౌతాయి. బస్సుల నిండా జనాలే. రెండు బస్సులు అసలు స్టాప్ లో ఆగకుండా వెళ్లిపోతాయి. మూడో బస్సు ఆగినా అతను ఎక్కేలోపల, బస్సు నిండిపోయి వెళ్ళిపోతుంది. ఈ గోలలో సగం చచ్చి ఆఫీసు కు వెడితే, అక్కడ ఆఫీసులో తోటి ఉద్యోగుల ప్రవర్తన విసుగు పుట్టిస్తుంది. బాస్ రూంలోకి వెళ్తే , ఆయన మాటల్తో తను ఒక మనిషిని కాదేమో అన్న అనుమానం కలగచేస్తాడు వేణుగోపాల్ కి.సాయంత్రం ఇంటికి వెళ్లబోయే ముందర అవసరార్థం ఏదో ఒక షాపు లో అడుగుపెడితే, అక్కడి అనుభవం అతని ఇబ్బందిని తీవ్ర తరం చేస్తుంది.అక్కడ్నించీ ఇంటికి వెళ్లే లోపల , అతనికి సాంత్వన ఎలా లభిస్తుంది అని వివరిస్తూ కథను చక్కగా ముగిస్తారు రచయిత.ఒక సాధారణమైన జీవితం గడిపే మనిషి రోజూ వారీ అనుభవం నించి కథను సృష్టించారు రచయిత. ఈ క్రమంలో తను చెప్పదలుచుకున్న విషయాన్ని మనకు స్పష్టంగా అవగతం అయ్యేలా చేస్తారు.కథలో ముఖ్య పాత్రధారి మానసిక స్థితిని క్రమంగా గట్టిపడే బంకమన్ను తో పోలుస్తారు రచయిత.పాండురంగరావు గారు ఈ కథగురించి మాట్లాడుతూ -"మన నాగరికత విస్తరించిన కొద్దీ వ్య క్తిగా మానవుడు సంకుచించుకు పోతున్నాడు. ఇంకా మన దేశంలో ఈ “మంది” తనం అన్న భూతం నూటికి నూరుపాళ్ళూ విస్తరించలేదు గాని, దాని లక్షణాలు మాత్రం స్పష్టంగా అగుపడుతూనే ఉన్నాయి." అన్నారు. అరవై ఐదు ఏళ్ల క్రితం ఈ కథ రాస్తూ , రాబోయే కాలంలో సమాజంలో వచ్చే మార్పు ను గురించి ముందుగానే సూచించారు పాండురంగరావు గారు. కథ: “తీరప్ప రం రం , తీరప్ప రం రం “అన్న స్వీయ కృతిలోని ఒక్కొక్క చరణాన్నీ ఒక్కో స్థాయిలో పాడుతూ తలదువ్వుకుంటున్నాడు వేణుగోపాలం.హఠాత్తుగా పాట ఆపి వంటింట్లోకి పరుగెత్తాడు. “లలితా !" పూజ చేసుకుంటున్న లలిత ఇటు తిరిగింది. “ఇటురా : ఒక నిమిషం.... అర్జెంటు...."'అయిదు నిముషాలయింది. ఆమె వచ్చింది.అతడి కళ్ళల్లోని వెలుగు చూచింది. ఇందాకటి సంగీతం కూడా విన్నది మరి. “ఏవిఁటి” అని అడిగింది నోరు తెరవక నే.“సువార్త. సుందరీ | సువార్త! ఇవాళ నీ నాధుడి చేతికి రెండు వందలా నలభై రూపాయ లొస్తాయి."“ఎక్కడి నుండి !"“మహా ఘనత వహించిన సర్కారు వారినుండి ! వారు మన ఇంక్రిమెంటు ఇవ్వకుండా రెండేళ్ళు నిద్దరోయి, ఈ మధ్య మేలు కున్నారు.""ఓహో!"“అంచేత ఈ సుమూహూర్తాన నేను నీకు ఏదయినా కొని పెట్టదలచుకున్నాను. ఏం కావాలి కోరుకో !" అని గర్వంగా, భక్తుడి ఎదుట ప్రత్యక్షమయిన మహావిష్ణువులా అడిగాడు వేణు. ఆవిధంగా అతడు అడగగలిగిన అవకాశాలు వాళ్ళ జీవితాలలో ఎన్నో రాలేదు.తన భర్తమీద జీవితం చల్లని చూపు చూడలేదని - ఎందరో భార్యల్లాగే లలిత కూడా నమ్మేది.ఇప్పు డతడి చూపులో, మాటలో చిందుతున్న సంతోషం ఆమె గమనించింది. నచ్చిన బొమ్మతో ఆడుకుంటున్న బిడ్డను చూచిన తల్లిలా నిండిపోయింది ఆమె మనసు.““ఊ • కోరుకో ! ఒక జత బంగారు గాజులు • ధర్మవరం పట్టుచీర • మహాబలిపురం యాత్ర - ఏది కావాలో కోరుకో."“నా కేమీ వద్దండీ • చింతా చికాకూ లేకుండా, హాయిగా నవ్వుతున్న మీరే నాకు అన్ని బహుమతులూను.""వ్రత రత్నాకరం చదవడం మానేయి." “నిజంగానే నాకేమీ వద్దు ““అట్లా కాదు.. నేను ఏదో ఒకటి కొన దలచుకున్నాను నీకు." “అయితే మీ ఇష్టం - మీకేది నచ్చితే అది తీసుకురండి."“అదుగో ఆ మాటంటేనే నాకు మండుకొస్తుంది. నిన్నొక మనిషిగా పిలిచి ఏమికావాలని అడుగుతున్నానా ! నీ ఇష్టానిష్టాలు తెలుపకుండా నా ఇష్ట ప్రకారం కొనమంటా వేం ? నీకు మనసు లేదూ!నీ కొక అభిప్రాయం ఉండదూ ? నువ్వొక వ్యక్తివి కావూ ! అన్నీ నాకు వదిలేస్తే ఏమిటని నీ అర్ధం ..... నువ్వు ఒక మనిషివి. నా నీడవు కావు. అది తెలుసుకో." అని గబ గబా బట్టలు మార్చుకో సాగాడు వేణుగోపాలం.“ఏమిటో బాబూ . నాకేమీ తెలియదు." అంటూ వడ్డనకుపక్రమించింది లలిత.భోజనం ముగించి బయటపడి తొమ్మిదిన్నరకు బస్టాండ్ లో విల్చుని ఉన్నాడు. వేణుగోపాలం, డెబ్బై తొమ్మిదిమంది గల 'క్యూ'లో డెబ్బయిఆరవ వాడుగా.పది అయింది. మూడు బస్సులు రావడం, వాటిలో రెండు ఆగక పోవడం, ఆగిన ఒకదానికోసం 'క్యూ' చచ్చి బ్రతకడం - అన్నీ జరిగాయి.నాలుగవ బస్సు వచ్చి సగం జనం తగ్గేసరికి పదీ పది అయింది. వేణు ఆఫీసు పదింబావుకు మొదలవుతుంది.ఆఫీసుకు వెళ్ళి చెక్కు అందుకుని బ్యాంకికి పంపాలి. ఆ వేళ శనివారం. పన్నెండు దాటితే బ్యాంకు వాళ్ళు డబ్బులివ్వరు. ఇవాళ ఆ డబ్బు లందకపోతే చాలా ఘోరంగా ఉంటుంది. నిప్పులమీద నిల్చున్న వాడిలా చిందులు తొక్కాడు వేణుగోపాలం. తన ప్రక్క నున్న, సూటు వేసుకున్న బట్టతలాయనతో అంతవరకూ సైప్రసు వ్యవహారమూ అదీ మాట్లాడిన వాడల్లా ఢామ్మని విషయ

S1 Ep 179'హెడ్ మాస్టారు ' పాలగుమ్మి పద్మరాజు గారి రచన!
న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘హెడ్ మాస్టారు ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . పుస్తకం కొనడానికి కావాల్సిన web linkPalagummi Padmaraju Rachanalu -Vol1కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు.ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.హర్షణీయం’ పాడ్‌కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)హెడ్ మాస్టారు“హెడ్ మాస్టారు పోయారు -”తంతి చదువుకున్నాడు. కెప్టెన్ రావు. క్షణం సేపు అలాగే నిలబడిపోయాడు, పరధ్యానంగా. జేబురుమాలు, పర్సు అందించడానికి వచ్చిన భార్య, బొమలు ముడివేసి అతని వంక చూసింది. వంగి తంతి చదివింది.“ఎవరీ హెడ్ మాస్టరు?” “మా హెడ్ మాస్టారు.”ఆమె భుజాలు అక్కళించి జేబు రుమాలు, పర్సు బల్లమీద పెట్టి లోపలికి వెళ్ళడానికి తిరిగింది. రావు పరధ్యానంగా అలాగే నిలబడ్డాడు. అతని కళ్లలో వెనకటి స్మృతులు తడిగా మెరిశాయి.ఇసుకతిన్నెలు గోదావరిని దూరంగా జరిపేశాయి. గట్టుమీదినించి చూస్తే గోదావరి కొనఊపిరితో మెల్లగా అంతిమయాత్ర చేస్తున్నట్టు, నీరసంగా ఏదో గమ్యం చేరుకోడానికి పాకలేక పాకలేక పాకుతున్నట్టు అనిపించేది. కానీ ఇసుక తిన్నెలు దాటి నీటి అంచుకి చేరుకునేసరికి గోదావరి నిండు ప్రాణంతో ఉత్సాహంగా సాగుతున్నట్టు అనిపించేది. హెడ్ మాస్తారు. అదే రేవులో మొలలోతు నీళ్ళలో నిలబడి ప్రతి ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవాడు. రావు – అప్పుడతని పేరు సుబ్బారావు – కృష్ణయ్య, రామనాధం, సాంబు, రవి ఫర్లాంగు వెడల్పు నదిని ఈది, అవతలి తిప్పమీదికి పోయేవారు. అక్కడ దోసపాదుల మధ్య వాళ్లు దాచుకున్న ఉప్పూకారం పొట్లాలుండేవి. దోసకాయలు చేతులతోటే చిదిపి, ఉప్పుకారం అద్దుకు తినేవారు. వాళ్ళు పారేసిన దోసగింజల్లోంచి ఎన్నో కొత్త పాదులు మొలిచేవి. నీటి అంచుదాకా అల్లుకుపోయేవి దోసపాదులు. తిరిగి ఈదుకు వచ్చేసరికి హెడ్ మాస్టారి సంధ్యావందనం పూర్తయేది.“ఏరా? కిష్కింధాపురి అగ్రహారికులు ఏ తోటలు తగలబెట్టొచ్చారు? దోసకాయలా? పుచ్చకాయలా?” అని అడిగారొకనాడు. కుర్రాళ్లంతా బిత్తరపోయారు. తమ దొంగతనం ఆయన కనిపెట్టారని వాళ్లనుకోలేదు.“లేదండి – ఈత ప్రాక్టీసు…” అంటూ నసిగాడు రామనాథం.“ఒరే సత్యహరిశ్చంద్రా! ఈత ప్రాక్టీసు మంచిదేగాని, ఆ తోటగలాయన వెంటబడ్డాడంటే కాళ్లు విరగొడతాడు. అప్పుడు ఈత దెబ్బతింటుంది.”మెతని హాస్యం మాస్టారిది. పొడిచి బాధ పెట్టడు. అతి తాపీగా ప్రతి అక్షరం మెత్తగా ఉచ్చరిస్తూ మాట్టాడేవారాయన.“ఏవిటోయ్? కెప్టెన్ రావేనా? అంతమెత్తగా ప్రతి అక్షరం ఉచ్చరిస్తున్నావేమిటి?” అని అడిగాడు ఫోన్ లో కెప్టెన్ రెడ్డి. రావు తనలో తను నవ్వుకున్నాడు, హెడ్ మాస్టారి లాగ అనుకోకుండా మాట్లాడినందుకు. హెడ్ మాస్టారిని అనుకరించాడు. నాటకంలో ఒకసారి రావు ధర్మరాజు పాత్ర ధరించి అచ్చంగాఅనుకరించాడు. నాటకమయాక టీచర్లూ, స్నేహితులు అంతా ఎంతో. కాని హెడ్ మాస్టారు మాత్రం కళ్లతోటే నవ్వుతూ, “ఒరే సుబ్బులూ! (ఆయనొక్కడే సుబ్బులూ అనేవారు అతన్ని) నన్ను ధర్మరాజుని చేసేశావేవిఁట్రా? అతను వారి దొంగముండాకొడుకు” అన్నారు.“రెడ్డీ ! ఏర్ పోర్ట్ కి వెళ్ళేప్పుడు ఇలారా. నేనూ వొస్తా.” “ఏవిటి విశేషం?” “చెప్తా” ఫోన్ పెట్టేసి లేచాడు రావు. డైనింగ్ రూంలోకి వెళ్ళేసరికి అతని భార్య కమల అన్నీ సిద్ధంగా పెట్టింది. కూర్చున్నాడు. బత్తాయిరసం మెల్లగా చప్పరించడం మొదలెట్టాడు, పరధ్యానంగా. కమల అతని వంక అనుమానంగా చూసింది. ఇద్దరి మధ్యా నెల్లాళ్ళుగా మాటామంతీ లేదు. స్పష్టంగా నేరారోపణలు కూడా జరగలేదు. కాని కమలకు ఎందుకు కోపం వచ్చిందో, ఆమె ఎందుకు ఆనాడు పడకగది తలుపు మూసేసిందో, అతనికి తెలుసు. ఆ రోజుని కమల ఏర్పోర్ట్ కి వచ్చింది, అతన్ని ఇంటికి తీసుకుపోడానికి. అంతవరకు, ప్రతిసారీ అతను డ్యూటీ ముగించి ప్లేన్ దిగే సమయానికి నిచ్చెనకింద చిరునవ్వు నవ్వుతూ నిలబడి ఉండేది. ఆ రోజు తరవాత ఆమె ఏర్పోర్ట్ కి రాలేదు. రాదని అతనికి తెలుసు.ఆరోజు, సన్నజల్లు, ఈదరగాలి. కమల ఆ పెనుచీకట్లో అతనికి కనబడలేదు. ఆమె వస్తుందని అతను అనుకోలేదు. అసలు ఆమె సంగతి మరిచిపోయాడు. మిస్ ఉషా వణికిపోతూ అతని భుజం పట్టుకు వేళ్లాడుతోంది. సన్నని మెట్ల మీద ఆమె, అతను సుఖంగా దిగడానికి చోటులేదు. అంచేత ఆమెను ముందు ఒక మెట్టు దింపి, వెనకనుంచి పడిపోకుండా పట్టుకున్నాడు. ఆమె అతని మెడచుట్టూ చెయ్యివేసి, గట్టిగా పట్టుకుంది. ఎక్కడ పడిపోతాడో అన్నభయం, ఎక్కడ జారిపోతదో అన్న ఆత్రం. కింద-సమతలం మీద అడుగు పెట్టగానే ఉషకు మైకం కమ్మేసింది (నిజం మైకమే). అతను పడిపోకుండా పట్టుకున్నాడు. ఆమెను వాన్లోకి ఎక్కించి తను ఎక్కాడు. తన రొమ్ముమీద, వదులుగా నరాలు పట్టులేనట్టు వాలింది ఉష. అప్పుడు చూశాడు కమలని. చూడకుండా చూశాడు. విమానం రెక్కపక్కకి, గొడుగుకింద, సన్నని జల్లుతెరలోంచి, ఉషని ఆస్పత్రిలో చేర్చి ఇంటికి చేరేసరికి ఒంటిగంట దాటింది.పడకగది తలుపులు తియ్యలేదు కమల.పెద్ద ప్రమాదం తప్పి ఇంచుమించు మృత్యుముఖంలోంచి బయటపడి, శరీరం, మనస్సు అలిసిపోయి, ఇంటికి తిరిగివస్తే తన శ్రీమతి ఇచ్చిన స్వాగతం అది. అదే ఆమె శ్రీముఖం. కింద హాల్లో సోఫాలో నిద్రపట్టలేదు. దొర్లాడు. తన ఆత్మ ఎంత పవిత్రమైనదో, మనస్సులో విమానం అంత ఎత్తులేచి, తలచుకుని బాధపడ్డాడు. కేవలం సోదరీభావంతో, ఆనాడు ఉషని – పెనుతుఫానులో చిగురాకులా అల్లల్లాడిపోతూ స్పృహ తప్పి పడివున్న ఉషని – తను పట్టుకున్నంత మాత్రాన తన భార్య ఎందుకు తప్పు తలవాలి? (హ.హ.తప్పు. నువ్వు ఆమె సన్నని నడుంచుట్టు చెయ్యి వేసి పట్టుకున్నావు. అవసరమైనదానికన్న కాస్త ఎక్కువ బలంతో దగ్గరగా ఒత్తిపట్టుకున్నావు. ఆమె నీ మెడచుట్టూ చెయ్యి వెయ్యడానికి సగం నీవంక తిరిగినప్పుడు ఆమె ఎడం రొమ్ము మెత్తగా నీ గుండెకు తగిలి పిట్టలా కొట

S1 Ep 177వాకాటి పాండురంగరావు గారి పై శ్రీరమణ గారు , మధురాంతకం నరేంద్ర గారు!
సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో జన్మించారు. ఆయన ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు. విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు.పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిది, దిక్చూచి లు ఆయన ప్రసిద్ధ రచనలు.ఈ ఎపిసోడ్ లో పాండురంగరావు గారి గురించి ప్రముఖ కథా రచయితలు శ్రీ రమణ గారు , మధురాంతకం నరేంద్ర గారు మాట్లాడతారు.వారివురికీ హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.హర్షణీయం’ పాడ్‌కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 176పార్ట్ 2 - 'చిట్టి తల్లి' - పాలగుమ్మి పద్మరాజు గారి రచన
అతనికి మెలకువ వచ్చేసరికి పెట్టి తలుపు తెరిచుంది. అవతల పొద్దుటి కనుచీకటిలో కంటి కలవాటుపడ్డ పట్నం దృశ్యాలు మసగ్గా కనబడ్డాయి. గుమ్మంలో సందేహిస్తూ నిలబడ్డాడు ఇంటి నౌకరు, దొర. ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు దక్షిణామూర్తి. దొర పక్క చుట్టేస్తూ అన్నాడు. “చిన్న శెట్టియా రొచ్చారు సార్.” “ఎక్కడికీ?” “ప్లాట్ఫారం మీదున్నారు సార్.”ఒకసారి బాత్ రూములోకి వెళ్ళి ముఖం చన్నీళ్ళతో కడిగి తుడుచుకున్నాడు. తల దువ్వుకున్నాడు. దొర తెచ్చిన కాఫీ తాగాడు. ఈలోగా దొర, సామానంతా కూలీచేత మోయించుకుపోయాడు. ఆ తరువాత అతను పెట్టెలోంచి దిగాడు. దిగగానే చిన్న శెట్టి కాళ్ళమీద పడ్డాడు. ఇంత జన సమూహంలో ఈ దృశ్యం జరిగినందుకు దక్షిణామూర్తికి కోపం చిరాకు పుట్టుకొచ్చాయి.చెట్టియార్, పదిమందిలో ఈ పని చేశావంటే నిన్ను దుంపనాశనం చేస్తాను. లే ముందు.” చెట్టియార్ లేచాడు. దక్షిణామూర్తి అతి తొందరగా బయటికి నడుస్తుంటే చెట్టియార్ కూడా పడ్డాడు.“పొరబాటయింది సామీ! మీ సొమ్ము నయా పైసాతో ఇస్తును. ఏదో మా తమ్ముడుండాడే, వాడి బుద్ధి మంచిది కాదు. నాక్కూడా తెలియదు, సిమెంటని సెప్పి వట్టి బూడిద బస్తాల్లో నింపి మీకిచ్చినాడని. మీ తోడు. మీరు ఊరిలో లేరు. మీ వకీల్ నా మీద అరస్టు వారంటు తీసినాడు. పదిమంది బిడ్డలవాండ్లము. ఈ తూరి దయ చూపించారంటే…”“పదకొండు గంటలకు పోయి మా వకీలును చూడండి.” “నిన్నసూస్తిని. అతను నిండా కోపంగా…” “ఈవేళ పదకొండు గంటలకు వెళ్లి చూడండి.” “తమరుదా దయ తలిస్తే….”“చెపుతుంటే మీక్కాదూ, పదకొండు గంటలకి వెళ్ళి చూడమని. ఇంకొక్కడుగు నా వెనకాల వేశారంటే, ఈ రైల్వే పోలీసులచేతే మిమ్మల్ని అరస్టు చేయిస్తాను…. ఇక వెళ్ళండి.”తన్నులు తిన్న కుక్కలాగా వెళ్ళిపోయాడు చెట్టియార్. తన్ను మోసగించిన వాళ్ళమీద తన కెల్లాంటి అధికార మొస్తుందో దక్షిణామూర్తికి బాగా తెలుసు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా నాశనం చెయ్యగలడతను. వాళ్లు తన చేతి కీలుబొమ్మలు. వాళ్లని శిక్షించడంలో అతని కేమి పెద్ద సంతృప్తి ఉండి కాదు. వాళ్ళు సంపూర్ణంగా తన దయమీద ఆధారపడి ఉండేటంతవరకూ తీసుకొస్తే, అతని కొక సంతృప్తి. దానివల్ల అతని సమర్థత అతనికే రుజువవుతుంది. వాళ్ళు వచ్చి తన కాళ్ళు పట్టుకోవడం అతనికి చాలా ఇష్టం. అయితే పదిమందిలో కాదు.చెట్టియార్ ఆడిన నాటకం, అతని తమ్ముణ్ణి విడదీసి, లంచం ఇచ్చి, అతనిచేత కోర్టులో అన్నగారికి వ్యతిరేకంగా సాక్ష్యమిప్పించడం, చెట్టియార్ దగాకోరని కోర్టువారికి రుజువు కావడం, అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ అతను కారుదగ్గరకు వచ్చాడు. వెనక తలుపు డ్రైవరు తెరిచాడు. అతను ఎక్కి కూచున్నాడు. డ్రైవరు తలుపు ముయ్యబోతుంటే అడ్డొచ్చింది చిట్టితల్లి . నిద్రలేవగానే ఏదో మరిచిపోయినట్టనిపించిందతనికి. ఇంతలో చెట్టియార్ సంఘటనవల్ల అది పూర్తిగా మరిచిపోయాడు. కాని చిట్టితల్లి కనబడగానే తను మరిచిపోయింది ఆమేనని గుర్తుకొచ్చింది…అయితే, రాత్రి రైలు పెట్టిలో ఏకాంతంగా ఆమెతో ఎంత ఆంతర్యం ఏర్పడ్డా, తన పగటి జీవితంలో ఆమె ప్రవేశించడం మాత్రం అతని కిష్టం లేదు. కొంచెం చిరాగ్గానే అడిగాడు.“ఏం చిట్టీ?”“మా అమ్మ దగ్గరకి తీసుకెళ్లవా!” అంది దీనంగా చిట్టితల్లి. “ఫో,ఫో” అంటూ లాగెయ్యబోయాడు దొర.. “ఉండు దొరా!” అన్నాడు దక్షిణామూర్తి. “మీ అమ్మెక్కడుంది?” “ఏమో!” “ఎప్పుడొచ్చింది పట్నానికి?” “నిన్న పొద్దున్న.”“ఏ రైలుమీద?” “రైలుమీద కాదు. రెండు గడలు పోడుగ్గా ఏసి, మద్దినేమో సిన్న సిన్న ముక్కలేసి, ఓ మంచం కింద కట్టి దానిమీద మోసుకొచ్చారు. మా నాన్నని పోలీసులు పట్టుకుపోయారుగా! అందుకని సీతయ్యబాబు ముంతలో నిప్పు పట్టుకుని ముందెళ్ళాడు.” దక్షిణామూర్తి గుండె గతుక్కుమంది.. “పట్నం వొచ్చిందని ఎందు కనుకున్నావు.”“రంగత్త సెప్పిందిగా. నేను మా యమ్మతో కూడా పోతానని ఏడితే సెప్పింది. పట్నం ఆస్పత్రికి తీసుకుపోతున్నారు. బాగవగానే తిరిగొత్తాదిలే అంది. తనింటికి తీసుకుపోయి కూడెట్టింది. తినేసి నేను జారుకున్నాను. పట్టం పోడ మెట్టా గంటే సోడా సాయిబ్బన్నాడు – ఆ రైలెక్కితే సీదా పట్టం పోతాదని. ఎక్కేశా.”ఒక క్షణంపాటు దక్షిణామూర్తికి నోటమాట రాలేదు. కళ్ళలో చెమ్మ కనబడకుండా తుడుచుకుని అన్నాడు.“ఎక్కు కారెక్కు” ఆమె కారెక్కింది. కారు కదిలింది.షినాయి నగర్లో పెద్ద బంగళా అతనిది. దారిపొడుగునా చిట్టితల్లి ఏదో అడుగుతూనే ఉంది. దక్షిణామూర్తి పరధ్యానంగా సమాధానాలు చెపుతున్నాడు. ఆఖరుకి కారు పెద్ద ఇనుప తలుపులను దాటి గుండ్రటి రోడ్డు వెంట తన ఇంటి ముందు పోర్టికోలో అగేవరకూ అతనొక నిశ్చయానికి రాలేకపోయాడు.చిట్టితల్లి నేం చేయాలి?ఆమె కెలాగో సహాయం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. తెరచిన కారు తలుపు పక్క నిలబడి, అమాయకంగా ఆమె చెప్పిన కథ విన్నప్పుడు అతని వ్యక్తిత్వం ఆపాద మస్తకమూ నీరయిపోయింది. ఆ ముహూర్తంలో ఆమెను కారెక్కమనడం తప్ప మరో ఆలోచన అతని మనస్సులోకి రాలేదు. కాని జరిగినకథ వింటే అనసూయ అతడు చేసినపని హర్షించదు. అనసూయే కాదు, అతని స్నేహితులూ, ఆప్తులూ ఎవరూ హర్షించరు. ఆమెను చూసి జాలిపడ్డం, పదో పదిహేనో చేతిలో పెట్టడం – అంతవరకూ మాత్రం అతని కర్తవ్యమూ, విధీ అని అంతా ఒప్పుకుంటారు. కాని ముక్కూ మెగం ఎరగని ఒక అనాధ బాలికను కార్లో ఎక్కించి ఇంటికి తీసుకురావడం – అదిమట్టుకు అందరికీ వింతగా తోస్తుంది. అందులో తనలాంటి ఆరితేరిన వ్యాపారస్తుడు చెయ్యవలసిన పనికాదు. ఇది వింటే సాటివాళ్ళు అతని అతని మతి భ్రమించిదనుకుంటారు. అతని వ్యాపారానికే కాదు, అతని పేరు ప్రతిష్ఠలకే దెబ్బ. అయితే ఆ పసిపాపను వీధిపాలు చెయ్యడానికి అతనికి మనసొప్పలేదు. పోర్టికోలో ఆగిన కారులోంచి అతను దిగకుండానే తోటమాలి గుడిసె దగ్గరకు నడపమన్నాడు డ్రైవరుని. తీరా తను దిగాక తనకోసం ఎవరన్నా డ్రాయింగు రూములో వేచి ఉంటే వాళ్ళకీ పిల్లను గురించిన సముజాయిసీ అంతా చెప్పుకోవాలి.తన ఇంట్లో తనే ఏదో దొంగతనం చేస్తున్నట్టనిపించిం దతనికి. ఒక వంక అనసూయనీ, మరోవంక చిట్టితల్లినీ కూడా ఏదో మోసగిస్తున్నట్టు అతని మనస్సు పీకింది. కాని గుండె నిబ్బర పరుచుకుని, తోటమాలిని పిలిచాడు.“ఆర్ముగం! ఈ పిల్లని నీ ఇంట్లో పెట్టుకుని, పెట్టూ పోతా చూస్తుండు.” “ఎత్తనినాళ్ళు సార్” అని అడిగాడు ఆర్

S1 Ep 175పార్ట్ 1 - 'చిట్టి తల్లి' - పాలగుమ్మి పద్మరాజు గారి రచన
న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘చిట్టి తల్లి’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . పుస్తకం కొనడానికి కావాల్సిన web linkPalagummi Padmaraju Rachanalu -Vol1కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. కథను రెండు భాగాలుగా ఆడియో చెయ్యడం జరిగింది, నిడివి ఎక్కువ కావడం వల్ల .ఎపిసోడ్లో ముందుగా వారి తండ్రి గారి గురించీ , కథ గురించీ పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.చిట్టి తల్లి:దక్షిణామూర్తి గాలి పీల్చుకోడానికి నిడదవోలు ప్లాట్ఫారం మీదికి దిగాడు. కుపే ఒక రకంగా సుఖంగానే ఉంటుందిగాని, మిగతా పెట్టెలాగ రైలు కదులుతున్నా గాలి రాదు. అయితే – కుపేలోకి బొగ్గు నెరుసులు, అనవసరమైన ప్రయాణీకులు అట్టే రారు. లాభనష్టాలు ప్రతిదానికీ ఉంటాయనుకుని తృప్తి పడ్డాడు దక్షిణామూర్తి…ప్లాట్ఫారం మహా రద్దీగా ఉంది. ఈ పెట్టెలో కాళీ లేదంటే, ప్రయాణీకులు మరో పెట్టి దగ్గరకు పరుగెత్తుతున్నారు. వాళ్ళ ఆత్రంలో జంతు సహజమైనదేదో ఉంది. అసలు దక్షిణామూర్తి ఎన్నికలో సామాన్య ప్రజలు జంతువులే, అయితే అప్పడప్పుడు ఆ జంతువులతో రాసుకు తిరగడం కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటప్పుడు, బొత్తిగా ఒంటరిగా కొన్ని గంటల సేపు కుపేలో ప్రయాణం చేశాక, జీవ చైతన్యం ఉన్న వస్తువులతో తాత్కాలిక సంపర్కం కాస్త అవసరం. అయితే ఆ సంపర్కం అతనికి విసుగు పుట్టిస్తే, మళ్ళీ తన ఏకాంతంలోకి తను పోవడానికి అవకాశముండాలి. ఆ కుపేలోకి పోతే, ఈ జనం తన్ను తాకలేదన్న ధీమాతోనే, దక్షిణామూర్తి జనసముద్రంలోకి అడుగుపెట్టాడు. సోడాలూ, తినుబండారాలూ, పుస్తకాలూ అమ్మేవాళ్ళు పెట్టెలను తోసుకుంటూ, అతన్ని రాసుకుంటూ పోతున్నారు. పక్కపెట్టెలో మనిషి అరిటిపండు తినేసి విసిరిన తొక్క అతన్ని తలవెంట్రుక వాసిలో దూసుకుపోయింది. జనప్రవాహాన్నించి కొంచెం దూరం తొలిగి నిలబడ్డాడు దక్షిణామూర్తి. ప్లాట్ ఫారం మీదికి దిగడంలోనూ లాభనష్టాలున్నాయి.“ఏండోయి దక్షిణామూర్తిగారూ? హ! హ!హ!” అంటూ ఒక విగ్రహం అతని రెండుచేతులూ పట్టుకుని ఊపింది.“ఏమిటి విశేషాలు? పట్నమేనా? ఏవండీ! అక్కడెక్కడో అచ్చు ఇటికల ఫాక్టరీ పెడుతున్నారంట, కాస్త వివరాలు మాక్కూడా ఇవ్వండి.దానమ్మా మోసిరి ఉన్న లాభాలన్నీ మీరే ఏసుకోవాలేంటండీ? అవునుగాని, కలప మా దగ్గిర కొనడం బొత్తిగా మానేశారేంటి?”దక్షిణామూర్తికి వ్యాపారమంటే పిచ్చి మోజు. లాభ నష్టాల మాట అటుంచి, అసలు వ్యాపారంలో ఏదో ఒక విధంగా తనది పైచెయ్యి అనిపించుకోవాలి. అయితే ఒక్కొక్కప్పుడు – ముఖ్యంగా ఇలాగ విశ్రాంతి కోసం ప్రయాణాలు చేస్తున్నప్పుడు – వ్యాపార వాతావరణం నించి దూరంగా ఉండాలనిపిస్తుంది. కాని పెద్ద వ్యాపారస్థుడుగా పేరు ప్రఖ్యాతులు గడించాక, ప్రతి ఊళ్ళోనూ పదిమందితో వ్యాపార రీత్యా పరిచయం ఏర్పడ్డాక, అలా దూరంగా తొలిగిపోయి ఉండడం అసాధ్యమని అతనికి అనుభవంవల్ల తెలుసు. అదీగాక తనకు లోపల ఎంత చిరాకుగా ఉన్నా వాళ్ళతో ఆప్యాయంగా, చిరునవ్వు చెదరకుండా మాట్టాడ్డం వ్యాపారానికి ముఖ్యావసరం – ఒక్కరికి మనస్సు నొచ్చుకునీ మాట అతడు మాట్లాడాడా, అతను ఇన్నాళ్ళూ నిర్మించుకుంటూ వచ్చిన పలుకుబడి, ఔన్నత్యం పేకమేడలాగ కూలిపోతుందని అతనికి తెలుసు. పలకరించడం కోసమే దగ్గరగా వచ్చారు. మరికొందరు అతని సహాయం అర్థించడానికొచ్చారు. . అతడు అందరిని సమంగా మాటలతో గౌరవించి, రైలు కదలబోతుండగా తన కుపే ఎక్కేశాడు. ఎక్కుతూ రైలులో ప్రయాణం చేస్తున్న ఉద్యోగిని సంజ్ఞచేశాడు“చూడప్పలసామీ, ఆ పెద్దమనుషులంతా ఈ కుపేలో పై బర్తుకోసం నిన్ను వేధించుకు కతింటారు. నా స్నేహితులెవరో బెజవాడలో ఎక్కుతారు, అంచేత రెండూ నేనే రిజర్వు చేయించానని చెప్పు.”“నాకు మీరు చెప్పక్కర్లేదు సార్. అప్పుడే కొందరు నన్నడగడం, నేను కాళీ లేదని చెప్పడం అయింది.”ఉద్యోగి కదులుతున్న రైలు కమ్మీ పట్టుకుని పక్క కంపార్టుమెంటులోకి వెళ్ళిపోయాడు. దక్షిణామూర్తి తన కుపే తలుపులు గట్టిగా మూసుకున్నాడు. ఇంక పట్నం వెళ్ళేవరకూ వాటిని తెరవకూడదనుకున్నాడు. పాపం రైల్వే ఉద్యోగులు అతనెంత చెపితే అంత. అతను కావాలంటే రైలంతా కాళీ చేయించి అతనికిస్తారు.కొంచెం బొగ్గురజను పడిందేమోనన్న అనుమానం కొద్దీ పక్క బాగా దులిపి మళ్లీ వేశాడు. దక్షిణామూర్తి. తలగడకింద లోపలికున్న పిస్తోలు తీసి చేతితో ఒక్కసారి దాని బరువు చూసి, పక్కని పెట్టుకున్నాడు. ఆ పిస్తోలు దగ్గరుంటే తనకింక ఏ అపాయం రాదని అతని నమ్మకం. అప్పుడే కనుచీకటి పడుతోంది. బర్తుమీద మూలగా ఉన్న దీపం వెలిగించాడు. పైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ విప్పి చదవడం మొదలు పెట్టాడు.బ్రతుకొక బజారు. అందులో ప్రతివ్యక్తి విలువను పెంచుకోడానికి ప్రయత్నిస్తాడు. నిత్యం పైకో కిందకో పోతుంటాడు. ధర పెరిగినప్పుడు ధనంగా మార్చుకో గలవాడు సమర్థుడు. ఇంకా పెరుగుతుందన్న ఆశకొద్దీ బిగుసుక్కూచున్నవాడు ఆఖరికి పడిపోక తప్పదు. ధర తగ్గుతున్నప్పుడు ఆదుర్దాగా అమ్మడానికి ప్రయత్నిస్తే, ధర మరీ పడిపోతుంది. ప్రతిదినం ఈ పత్రికలో ఇదే కథ తను చదువుతున్నాడు. ఈవేళ కూడా ఎందుకీ తాపత్రయం ! ఈవేళ హాయిగా అన్నీ మరిచిపోవాలి! రేపెలాగా తప్పదు.మూసిన గాజు కిటికీ అవతల అస్పష్టంగా కదిలిపోతోంది. ప్రకృతి – చెట్లు, చేమలు, ఇల్లు, దీపాలు, దగ్గర స్తంభాలు, దూరపు కొండలు. కాని ద్విజ మండల రేఖ మాత్రం అతనితో సాగుతూ వస్తుంది. మధ్య మాయమైనా, మళ్ళీ వస్తోంది. పరధ్యానంగా చూస్తున్నాడు దాని వేపే. ఆ రేఖమీద – అవతరించింది అనసూయ ముఖం. అందంగా, తీక్షణంగా, ఆడతనం, అహంకారం అన్నీ కలుసుకున్నాయి ఆ ముఖంలో. అనసూయా షుగర్ మిల్స్ తనతో అరణంగా తెస్తుంది. ముప్పయి లక్షలు విలువగల ఫ్యాక్టరీకి ఆమె ఏకైక వారసురాలు. ఇంకా పెళ్ళికాకముందే అతని ఇంటికి యజమానురాలులా ప్రవర్తిస్తోంది. ఇంటికే కాదు అతనికిన్ని – తాంబూలాలు పుచ్చుకుని రెండేళ్ళయింది. ఎప్పటికైనా పెళ్ళిచేసుకోక తప్పదు. అయితే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న స్వేచ్చను వీలయినంతకాలం పొడిగిస్తున్నాడు దక్షిణామూర్తి.అనసూయ అందమైనదీ, హోదాగలదీ. అతనికి చాలా ఇష్టం. పక్కని కూచుంది ఆమె చెయ్యి పట్టుకుని నలపకండా ఉండలేడు. పళ్లుబిగించి

S1 Ep 174'అంటు కొమ్మ' - అక్కిరాజు భట్టిప్రోలు గారి రచన
‘అంటుకొమ్మ’ కథ శ్రీ అక్కిరాజు భట్టిప్రోలు గారు రాసిన ‘మూడు బీర్ల తర్వాత’ అనే పుస్తకం లోనిది. తన మూలాలను వెతుక్కుంటూ, ఒక మహిళ చేసే ప్రయాణమే ఈ కథ. కథను చాలా వాస్తవికంగా, ముగింపును హృద్యంగా చిత్రీకరించారు రచయిత. విభిన్న అంశాలను స్పృశిస్తూ అక్కిరాజు గారు రాసిన ‘ మూడు బీర్ల తర్వాత’ ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన అతి చక్కని కథాసంపుటాల్లో ఒకటి. పుస్తకం కొనడానికి కావాల్సిన web link …. https://bit.ly/3d4M0lv కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అక్కిరాజు గారికి కృతజ్ఞతలు.అంటుకొమ్మ“అంటు కట్టడం” అంటే? ఈ చెట్టు కొమ్మని నరికి, కొంతమేర పై చెక్కు తీసి మరో చెట్టు కొమ్మకి అతికించి, పైన మట్టి కప్పి గట్టిగా కట్టెయ్యడం. ఈ కొమ్మ ఇమడ గలిగితే ఆ చెట్టు కొమ్మే అయి పూలూ పండ్లు కాస్తుంది. లేదా మాడి చస్తుంది. అప్పుడు మరో కొమ్మని తెచ్చి అతికించుకోవచ్చు. విషయ మేమంటే, అతుకుకొమ్మకు కాసే పండ్లని కూడా కొత్త చెట్టు పండ్లనే పిలుస్తారు. అదీ తమాషా! అతుకు కొమ్మలు బతికినా చచ్చినా ఒకటే… లెక్కలోకి రావు.నల్లటి రోడ్డు మీద పరిగెడుతోంది కువాలిస్. “సంధ్యా! కాస్తా వాటర్ బాటిల్ అందుకోవే…. మీ నాన్నకి” మధ్య సీట్లో కూర్చున్న అనసూయమ్మ వెనక సీట్లో ఉన్న కూతుర్ని అడిగారు. బయటికి చూస్తున్న సంధ్య కాళ్ళ దగ్గరున్న బాటిల్ తీసి తల్లికిచ్చింది.బాటిల్లో నీళ్ళు, తన దగ్గరున్న డిస్పోజబుల్ గ్లాసులో పోసి భర్త కందించారు అనసూయమ్మ. ఆ మంచి నీళ్ళు రెండు గుక్కల్లో తాగేసి మళ్ళీ ఖాళీ గ్లాసు భార్య కందించారు సదాశివరావు. ఆవిడ ఆ గ్లాసుని ముందున్న డ్రైవర్ కిచ్చి “కాస్త బయట పడెయ్యి నాయనా” అంది.ఏ.సి. కారు పుణ్యమా అని అన్ని డోర్లూ బిగదీసుకు కూర్చున్నారేమో, పెద్దావిడకి అద్దం ఎలా దించి గ్లాసు బయట పడేయాలో తెలీదు. తదేక దీక్షతో డ్రైవ్ చేస్తున్న రాముడు ఒకచేతిని స్టీరింగు మీదే ఉంచి, అలవోకగా మరో చేత్తో గ్లాసందుకుని, అదే చేత్తో అద్దాన్ని కూడా దింపేసి, గ్లాసు బయట పడేసి మళ్ళీ అద్దాన్ని మూసేశాడు.తను మంచినీళ్ళు తాగడం అనే కార్యక్రమంలో మొత్తం ముగ్గురు పాలు పంచుకుని అంకిత భావంతో నిర్వర్తించడాన్ని తృప్తిగా గమనించి, గమనించకుండా అన్నారు సదాశివరావు…“ఈ ఊళ్ళెంత మారిపోయాయో…”“మనం రావట్లేదని ఊళ్ళు మారకుండా ఉంటాయేమిటి” అన్నారు అనసూయమ్మ.ఆవిడ మాట పూర్తవకుండానే అరచినట్టుగా అన్నాడు ముందు సీట్లో కూర్చున్న పన్నెండేళ్ళ శశి. “దిసీజ్ సో ఫన్నీ”అంటూనే తన చేతిలో ఉన్న కాంకాక్టర్ని ముందుకు ఫోకస్ చేశాడు. అంత ఆశ్చర్యం కలిగించే విషయమేమిటా అని అందరూ చూశారు.కువాలీస్ కి అడ్డంగా రోడ్డు మీద మేకల దండు. ఆ మందకి అటువైపు ఓ లారీ ఆగి ఉంది. ఈ మధ్యలో ఓ ఆసామి ఆ మేకలన్నింటినీ ఓ వరసలో అమర్చి ట్రాఫిక్ ని పంపించే ప్రయత్నంలో ఉన్నాడు. అతి సహజంగా ఉన్న ఈ సంఘటన శశికి మాత్రం ఆశ్చర్యమే. వెనక సీట్లోంచి సంధ్య అందుకుంది.“రోడ్డు మీద గొడ్డూ గోదా అడ్డం రావడం వీడెప్పుడు చూశాడు…”అమెరికాలో పెరుగుతున్న తన కొడుకు శశిని మిగతా వాళ్ళందరికీ అర్థం చేసే ప్రయత్నం చేసింది.“ఏవిట్రా మీ దేశంలో గొడ్డూ గొదా ఉండదేవిరా? ఏం తింటారూ ఏం తాగుతారూ?” తాత గారు మధ్య సీట్లోంచి.“అక్కడ గొడ్డూ గోదా లేక పోవట మేంటి నాన్నా… పాలూ పెరుగూ చీజ్ సుబ్బరంగా తింటారు. పాలూ పెరుగూ మాత్రమేనా… ఆ గొడ్డూ గోదానే ఏకంగా తినేస్తారు. కాకపోతే అవిలా రోడ్డు మీదకి రావు. పొరపాటున వచ్చినా ఏ ట్రక్కు కిందో పడి పోవాల్సిందే తప్ప, ఇలా తీరిగ్గా తోలుతూ కూచోరు” అంది సంధ్య.అడ్డు తొలగటంతో మళ్ళీ బయల్దేరింది వాహనం.మొత్తం అందులో ఇద్దరు పిల్లలూ, ఐదుగురు పెద్దవాళ్ళూ ఉన్నారు, రాముడు కాక. డ్రైవర్ సీటు పక్కన ఇద్దరు పిల్లలు సంధ్య కొడుకు శశి, శంకరం కూతురు భార్గవి కూర్చున్నారు.మధ్యసీట్లో పెద్దవాళ్ళిద్దరూ అనసూయమ్మ, సదాశివరావు గారు.చివరి సీట్లో ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవచ్చని శంకరం, శంకరం భార్య లత, శంకరం చెల్లెలు సంధ్య కూర్చున్నారు.“అన్నయ్య గారు కూడా వస్తే బాగుండేది” అంది లత, సంధ్య ని ఉద్దేశించి.“వస్తాననే అన్నారు వదినా. బెజవాడలో వాళ్ళ ఫ్రెండ్స్ వదల్లేదు. మనతో రావాలో వాళ్ళతో వెళ్ళాలో తికమక పడుతుంటే నేనే అన్నా, మన వాళ్ళని ఎప్పుడో ఒకప్పుడు కలుస్తూనే ఉంటాం, మీ ఫ్రెండ్‌తోనే వెళ్ళండి అని” భర్త రాక పోవడాన్ని తన మీదే వేసుకుంది సంధ్య.“అయినా మనం తిరిగి ఇంటికి చేరేటప్పటికి ఆయన కూడా వచ్చేసే ఉంటార్లే” అని ముక్తాయించింది.ఎంత ఎ.సి. కారు అయినా, నిండుగా ఉన్న మనుషులు, వేసవి కాక పోయినా కాస్తున్న బయటి ఎర్రటి ఎండ కలిసి లోపల ఉక్కగానే ఉంది.ఏదన్నా కూల్ డ్రింక్ తాగుదాం. ఇక్కడ ఏవన్నా చల్లగా దొరుకుతాయేమో చూడు” అన్న శంకరాన్ని ఉద్దేశించి సంధ్య.ఇక్కడేం చల్లగా దొరుకుతాయే. ఏదో ఓ చిన్న ఫ్రిజ్ పెట్టుకుని కూర్చుంటారు. వచ్చీ పోయే కరెంటుతో నీకు కావాల్సినంత చల్లగా ఏమీ దొరకవు. ఆ బాటిల్ లో ఉన్న నీళ్ళే నయం” తేల్చి చెప్పాడు శంకరం.తనలా అంటుండగానే అందరి తలలు అప్రయత్నంగా కారు బయటకి, రోడ్డు వెంబడి చూట్టం మొదలు పెట్టాయి, కూల్ డ్రింక్ షాప్ కోసం.“రెండేళ్ళనించీ సరయిన వానల్లేవు. కాలవల్లో నీళ్ళు రావటం మానేశాయి. నాట్లు కూడా పళ్ళేదు ఇంకా. అదంతా పిచ్చి గడ్డి. ఇక్కడే ఇలా ఉంటే మెట్ట ప్రాంతాల పరిస్థితి ఏమిటో. జనాలు పురుగుల మందులు తాగేస్తున్నారంటే తాగరూ?” వరి పొలాల్లో మొలిచిన పిచ్చిగడ్డిని చూపిస్తూ బయట దృశ్యాన్ని స్వగతంలా వివరించాడు శంకరం.“మరే! ఏమిట్రా నాయనా ఆ వార్తలు. తెలుగు పేపర్ చదవాలంటేనే భయమేస్తోంది. మొదటి పేజీలో ఆత్మహత్యల స్కోరూ, చివరి పేజీలో క్రికెట్ స్కోరు” విరక్తిగా అంది సంధ్య.“ఆ రెండు పేజీల మధ్య చూడాలి స్టాకు మార్కెట్, హైటెక్ వైభోగం” కసిగా అన్నాడు శంకరం.“సర్లేరా! నువ్వు మరీ అతి, వానలు పడక పోవటానికి రైలు లేగా రావటనికి కూడా హైటెక్కే కారణమనగల సమర్థుడివి” తేల్చేసింది సంధ్య.“వాట్స్ దట్ మాం?” అన్నా చెల్లెళ్ళ సంభాషణని తుంచేస్తూ అడిగాడు శశి.రోడ్డు పక్క నల్లటి కుండల్లోంచి తెల్లటి నురగతో తొంగి చూస్తూ అమ్మాకానికి దంగా కల్లు. కనీసం కిలో మీటరుకు ఒక చోటన్నా కుండల్లో కల్లు పెట్టుకుని కూర్చున్నారు.“అదా! కల్లు… ఆ

S1 Ep 173'ఎందుకు పారేస్తాను నాన్నా!' చాగంటి సోమయాజులు గారి రచన
చాగంటి సోమయాజులు గారు 'చాసో' గా తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. ఆధునిక తెలుగు కథను ప్రగతి శీల భావాలతో సుసంపన్నం చేసిన చాసో ఎన్నో గొప్ప కథలను రచించారు. 1945 వ సంవత్సరంలో 'భారతి' మాస పత్రికలో ప్రచురితమైన ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చింది చాగంటి తులసి గారికి , కథకు ఆడియో ని అందించిన చాగంటి కృష్ణ కుమారి గారికి కృతజ్ఞతలు. ఇదే పేజీలో ఈ కథపై, సారంగ వెబ్ మ్యాగజైన్ లో ప్రముఖ రచయిత శ్రీ అరిపిరాల సత్య ప్రసాద్ గారు చేసిన చక్కని సమీక్షను కూడ వెబ్ లింక్ ద్వారా మీరు చదవొచ్చు. కథ :చెల్లిని వొళ్ళో కూచో పెట్టుకుని కృష్ణుడు వంటింట్లో కబుర్లు చెప్పుతున్నాడు. వాళ్ళనాన్న పిలిచి చుట్టలు తెమ్మని డబ్బులిచ్చేడు. కృష్ణుడు వీధిముఖం చూడకుండా, మొగుడు చచ్చిన విధవలాగ ఇంట్లో దూరి కూచుంటున్నాడు. నాన్న చుట్టలు తెమ్మని పురమాయించేడు. హైస్కూలుదాటి -చుట్టల దుకాణానికెళ్ళాలి. మేష్టర్లు, తోటి విద్యార్థులు అక్కడుంటారు. కృష్ణుడికి రోడ్డెక్కటమే నామోషిగా ఉంది. బడిపక్క నుంచి ఎలాగ వెళ్ళడమని గింజుకుంటూ బయలుదేరేడు.ఉదయం ఎనిమిది గంటలు కావొస్తున్నది. బడి పెట్టేవేళ. వీధి చివరనుంచే బడిగోల సముద్రపు ఘోషలాగ వినబడుతున్నాది. బడిపక్క నుంచి వెళ్ళక తప్పదు; రాక తప్పదు.బడి కనబడగానే కృష్ణుడికి బెంగపట్టుకుంది. హైస్కూలు పిల్లల గందరగోళంతో కలకల్లాడుతున్నాది. వరండాలు, గదులు, చుట్టూ రోడ్లూ, విద్యార్థులతో, విద్యార్థినులతో చూడ సొంపుగా ఉంది. రోడ్డు వారగా కృష్ణుడు తలొంచుకుని పరిగెట్టాడు. "కృష్ణా!" అని స్కూలు వరండాలోంచి కేకొచ్చింది. కృష్ణుడు తిరిగి చూడక తప్పింది కాదు. నరిశింహం పరి గెట్టుకొచ్చి వాడి భుజంమీద చెయ్యేసి “ఏంరా, నువ్వు బళ్ళోకి రావడం లేదు.” అనడిగేడు. “సోమవారం చేరుతాను” అని కృష్ణుడు చెప్పేడు. “పుస్తకాలు కొన్నావా?" “ఇంకా లేదు.”“ వేగిరం కొనుక్కో. మళ్ళా అయిపోతాయి. ఎక్సరు సైజు పుస్తకాలు షాపుల్లో కొనకేం స్టోర్సులో చవగ్గా వున్నాయి. ధరలన్నీ దారుణంగా పెరిగిపోయాయిరా!" - నరశింహం డబుల్ కప్పు చొక్కా, జనావా పేంటూ, జోళ్ళూ తొడుక్కుని నీటుగా ఉన్నాడు. కృష్ణుడికి ఉన్న బట్టలన్నీ రెండు నిక్కర్లు, రెండు చొక్కాలు; ఉన్నాయంటే ఉన్నాయి. ఒక నిక్కరుకి పోస్టాఫీసుంది. ఒక చొక్కా భుజం చిరిగి జారిపోతే, వాళ్ళమ్మ ఎత్తి కుట్టింది. చెయ్యి బుట్టలాగ లేచిపోయింది. రేవుకో జత. కృష్ణుడు పేంట్లు కుట్టించమని ఎప్పుడూ ఏడవ లేదు. పేంటుకైతే బట్ట ఎక్కువ పడుతుంది. బట్ట ఎక్కువైతే డబ్బు ఎక్కువవుతుందని వాడికి తెలుసు. మరి రెండు జతలు కుట్టించమని బతిమాలుకున్నాడు. కాళ్ళా వేళ్లా పడ్డాడు. ఏడ్చుకొన్నాడు. ప్రయోజనం లేకపోయింది.నరశింహం చంకలో కృష్ణుడికి కొత్త పుస్తకం కనబడ్డాది. “ఏం పుస్తకంరా అదీ?" అనడి గేడు.“ఇంగ్లీషు పుస్తకం. నేనన్ని పుస్తకాలూ కొనేశాను. జాగ్రఫీ పుస్తకమే కొనలేదు. జాగ్రఫీ పుస్తకాలింకా స్టోర్సువాళ్ళకి రాలేదు. చూడు పుస్తకం" అని ఇచ్చేడు.కృష్ణుడు పేజీలు తిరగేశాడు. కొత్త పుస్తకంలోంచి ఒక విధమైన పరిమళం పైకి వచ్చింది. కృష్ణుడు పుస్తకంలోకి మొహం పెట్టి వాసన చూశాడు.“కొత్తపుస్తకం వాసన బాగుంటుందికదరా?” అన్నాడు నరశింహం. "కమ్మగా ఉంటుంది. నా కెంతో యిష్టం" అన్నాడు కృష్ణుడు. “నీ కింగ్లీషులో ఫస్టుమార్కు రాలేదు, కదరా?” “నాలుగు మార్కుల్లో పోయింది." “ఎవరి కొచ్చిందిరా?" . “శకుంతల కొట్టేసింది.” “నిజమే! నేన్నమ్మ లేదు; దాని కెన్నొచ్చాయి.” “నా కరవై నాలుగు, దాని కరవై ఎనిమిది," “ఆడపిల్లని మేష్టరు వేసేసుంటాడు." “నీ మొహం! అది తెలివైంది.” “తస్సాచెక్కా! ఆడపిల్లలు చదివేస్తున్నారురా!"కృష్ణుడు మార్కుల గొడవ తేగానే గొప్పవాడయిపోయాడు. తెలివైనవాడు కాబట్టే నలుగురూ గౌరవిస్తున్నారు. లేకపోతే వాడి కుళ్ళుగుడ్డలని చూసి అంతా దూరంగా ఉండేవాళ్ళే. వాడికి బడిపక్కని నిలబడడం, బడి కెళుతున్న నరశింహాన్ని చూడడం చాలా కష్టంగా ఉంది. ఎంచేతంటే, కృష్ణుడు బడి కెళ్ళి చదువుకొనే అవకాశాలు తప్పిపోయాయి. వాళ్ళ నాన్న ఈ ఏడాది కృష్ణుడికి చదువు చెప్పించనని నిశ్చయంగా చెప్పేశాడు.“ఎక్కడేనా చదువు మాన్పించుతారండి? ఋణమో పణమో చేసి ముక్క చెప్పించకపోతే కుర్రా డెందుకేనా పనికొస్తాడా? చదువుకునే ఈడులో బడి మానిపించి, ఇంట్లో కూచోబెడితే తరవాత గాడిదలని కాయడానికేనా పనికిరాకుండా పోతాడు. ఏదో చూసి బడిలో వెయ్యండి" అని వాళ్ళమ్మ శతపోరి చెప్పుకొస్తున్నాది.“బళ్ళో వెయ్యగనే సంబరమా? వాడు చదివేది ఫోర్తు ఫారమ్. జీతమెక్కువ. నెల నెలా ఎంత కట్టాలో తెలుసా? తూగ్గలనా? ప్రవేశ పెట్టడానికి, పుస్తకాలకే డౌతుంది ఏభై రూపాయలు. దస్తాకాగితాలు రూపాయి, అర్ధగా పెనసలు ఆరణాలు! ఎక్కణ్ణుంచి తేవడం. మొహాన్ని వాడికి లేందే! వాడి ప్రారబ్ధం, మన ప్రారబ్దం! వారం వారం ఎక్కడ లేని డబ్బూ బియ్యానికి ముడుపు చెల్లించడానికే తలప్రాణం తోక్కొస్తున్నాది. మాటలా?" అని వాళ్ళ నాన్న చెప్పుకొస్తున్నాడు.తల్లి మాటే నెగ్గుతుందో, తండ్రిమాటే నెగ్గుతుందో ఇంకా తేల లేదు. కృష్ణుడికి మాత్రం సందిగ్ధం లేదు. వాడు తలిదండ్రులని బాగా ఎరుగు. తల్లి ప్రతీ విషయంలోనూ బడబడలాడడమేకాని ఆఖరికి తండ్రి చెప్పినట్టే జరుగుతూ ఉంటుంది. అంచేత చదువుకి స్వస్తి చెప్పడమే ఖాయమని నిర్ధారణ చేసుకొని నామార్దాతో కృష్ణుడు కుళ్ళిపోతున్నాడు.శ్రీ కృష్ణుడికి కొత్త ఇంగ్లీషు పుస్తకం పేజీలు తిరగేసినకొద్దీ గుండెల్లో గాభరా పుట్టింది. చదువుతున్న కుర్రాళ్ళమీద ఈర్ష్యా, తనకి చదువు లేకుండా పోయిందన్న దుఃఖము - రెండూ రెండు లేడిక పాములై అతని బుర్రని కరకర లాడిస్తున్నాయి.“కృష్ణా, వేగం చేరరా! డివిజన్లు పెట్టేశారు. నేను 'జే' డివిజనులో పడ్డాను . మన బేచివాళ్ళంతా 'జే' జీవిజనులోనే పడ్డారు” అన్నాడు. నరశింహం. “అమ్మబాబో! 'జై' డివిజనుదాకా పిల్లలున్నారా?" అని ఆశ్చర్యపడ్డాడు. కృష్ణుడు. - 'జే' తో ఐపోలేదు. 'కే' డివిజను కూడా ఉన్నాది." ఏ, బి, సి, డి, అని లెక్కబెట్టి - "పదకొండు డివిజన్లో!" అన్నాడు కృష్ణుడు. ఒక్క ఫోర్తు ఫారములో సుమారు ఐదు వందలమంది విద్యార్థులున్నారు. కృష్ణుడు అక్కడ నిలబడ లేక పుస్తకాన్ని చ్చేసి “నేను చుట్టల కెళ్ళాలి, పోతా”

S1 Ep 170'సీతా.....రాముడొస్తున్నాడోయ్ ' - యండమూరి గారి రచన !
నవలా రచయితగా, లక్షల కొద్దీ అభిమానుల ఆదరం చూరగొన్న యండమూరి వీరేంద్రనాథ్ గారు, గొప్ప నాటికలను రచించారు, అలాగే అతి చక్కటి కథలను కూడా . ఆయన రచించిన కథలలోనించి ఎంపిక చేసిన 25 కథలతో వచ్చిన పుస్తకం ' ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్' . ఆ పుస్తకంలోని చివరి కథ ఇప్పుడు మీరు వినబోయే, 'సీతా... రాముడొస్తున్నాడోయ్'.ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన వీరేంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు.ఈ పుస్తకం కొనడానికి ఈ లింకుని ఉపయోగించండిhttps://www.telugubooks.in/products/the-best-of-yandamoori-veerendranathహర్షణీయం’ పాడ్‌కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1ఆ రాత్రి - అయోధ్య నిశ్శబ్దంతో సయోధ్య చేసినట్టుంది.శ్రీహితుడికి కన్ను మూత పడటంలేదు. మెత్తటి పాన్సు అంపశయ్యలా తోచింది. కొంచెం సేపు నిదురించే ప్రయత్నం చేస్తున్నాడు. లేచి కూర్చుంటున్నాడు. అంతకు మునుపే, దూరంగా రోదన వినిపించింది. వినిపించిన వైపు వెళ్ళాడు.సరయూ నది ఒడ్డున ఒకామె రోదిస్తూ కనబడింది. “ఎవరు తల్లీ నీవు? ఎందుకు రోదిస్తున్నావు?” అని అడిగాడు. "నాయనా! నేను నిద్రాదేవిని. నిన్ను సమీపించుటకు చేతకాని అవమాన భారంతో రోదిస్తున్నాను” అన్నది.ఆమె రోదనకు సరయూనది గలగలలు ఉపశృతులు అవుతున్నవి. ఏమి చేయాలో తోచనట్టు నిలబడినాడు.అంతలోనే అతడికి మెలకువ వచ్చింది. అంతా కల అని తెలిసింది. మళ్ళీ అనుమానం నిదుర రాకపోతే కల వుండదుకదా. మరి అది కలా? లేక తన భావావేశమా? అంతా అయోమయమే! ఈ అయోమయం వేకువ నుంచీ వున్నది. ఏ పనీ చేయబుద్ధి కాదు. ఊరికే ఉండబుద్దికాదు. కాలు ఒక చోట నిలువదు. అది నిలుచున్నా మనసు నిలవదు. అవును మరి అతడికి అలజడికి కారణమున్నది.రాముడు బయల్దేరినాడట. పుష్పక విమానంపై సీతా సమేతుడై వస్తున్నాడట. రావణ సంహారానంతరం అయోధ్యలో అడుగిడుతున్నాడట.- శ్రీహితుడికి ప్రస్తుతం ఇరవయ్యేళ్ళ ప్రాయం. అతడి తల్లి కైకేయి వద్ద ముఖ్య పరిచారిక. తండ్రి దశరధ రథ చోదకుడు.అతడికి గతము బాగా గుర్తున్నది. అప్పుడతడికి ఆరో వసంతము. ఆడవారితో వామన గుంటలు, ఈడు వారితో కోతి కొమ్మచ్చులు ఆడుకునేవాడు. ఆరోజు ఎవరూ అతనితో ఆడేటందుకు రాలేదు. పలకరించనయినా లేదు. అంతా దుఃఖ సాగరంలో మునిగి వున్నారు. ఆటకెవరూ తోడు లేనందున అతడికి కోపము వచ్చింది. కసి పెరిగింది. బిక్కు - బిక్కు మంటూ ఒక్కడే కూర్చున్నాడు. గదిలో ఒక మూల తల్లి రోదిస్తున్నది. - అంతలో పుర వీధిలో కలకలం వినిపించింది. పరుగు పరుగున బయటకొచ్చాడు. ఆ దృశ్యాన్ని అతడు, తరువాత జీవితంలో ఎన్నడూ మర్చిపోలేదు.నార బట్టలతో రాముడు, సీతతో కలిసి నడుస్తున్నాడు. లక్ష్మణుడు వారిని అనుసరిస్తున్నాడు. వెనుక అయోధ్య నడుస్తున్నది. శ్రీహితుడు కనులు పెద్దవి చేసుకుని చూసాడు. అతడి పసి మనసుకి అర్థం కాలేదు. పరుగెత్తుకుపోయి, “అమ్మా! అందరూ వూరొదిలి పోతున్నారే” అన్నాడు. తల్లి అతడి పొదివి పట్టుకొని ఎలుగెత్తి ఏడ్చింది. ఆమె దుఃఖమునకు మరొక కారణము కూడా వున్నది.కైకను తిట్టనివారు లేరు. ముఖ్య పరిచారక కాబట్టి ఆమెది కూడా తప్పన్నటు తూలనాడారు. ఆ తల్లి దుఃఖం అందుకే. శ్రీహితుడికి తల్లి దుఃఖం అర్థం కాలేదు. తనూ ఏడ్చినాడు.ఎప్పటిమాట అది! పధ్నాలుగు వసంతాల క్రిందటి మాట!ఆ తరువాత రాముని కథలు ఒకటి తరవాత ఒకటి విని పులకించి పోయినాడు. వాస్తవముకంటే ఊహ గొప్పది కదా! శ్రీహితుడి మనసులో శ్రీరాముడట్లే పెరిగిపోయినాడు. కథలన్నీ తల్లే చెప్పినది.రాతిని నాతిగ చేసినాడని చెప్పగ నోటిని తెరుచుకు విన్నాడు. దండిగ నసురుల చెండిన రాముని, కంటికి నిండుగ వూహించుకున్నాడు. ధనస్సు వంచిన దనుజభిరాముని మనస్సునందే నింపుకొన్నాడు.ఆ విధంగా రాముడు, శ్రీహితుడి మనసులో వయసుతో పాటే ఎదిగినాడు. అటువంటి రాముడు ఈ రోజు.... ఇన్నాళ్ళకి వస్తున్నాడంటే నిద్ర ఎలా పడుతుంది?లేచి బయటకు వచ్చాడు.శ్రీహితుడికి అయోధ్య మీద చాలా కోపంగా వుంది. దానికి కారణం కూడా వున్నది. రాముడొస్తున్న రాత్రి, ఇంత హాయిగా అందరూ ఎలా నిద్ర పోతున్నారన్నదే ఆ కారణం.అంతకు ముందు రోజే భరతుడు అగ్ని ప్రవేశం చేయబోయాడు. పదునాలుగు సంవత్సరములు దాటినా రాముడు రాకపోయే సరికి ప్రాణాలు తీసుకోబోయాడు. అంతలో హనుమంతుడొచ్చి రామాగమన సందేశాన్ని వినిపించాడు. -అంతే! ఆ క్షణము నుంచీ అయోధ్యలో ఎవరికీ నిద్రాహారాలు లేవు. నగరాన్ని అలంకరించటము ప్రారంభించారు.కౌసల్య కళ్ళలో తెలి మంచుముత్యాలూ, సుమిత్ర కళ్ళల్లో మణిదీపాలు వెలిగితే, కైకకి వళ్ళంతా కళ్ళే అయినవి. ముగ్గురు తల్లులూ, కళ్ళని దీపాలు చేసి, రాముడొచ్చే దారిని వెలిగించారు.భవంతులకి రంగులు వేసారు. దారులని నీటిలో కడిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే, రాముని అవతార మెత్తిన విష్ణువుని వదిలి వుండలేని ఆదిశేషువు అయోధ్య కొచ్చి, తన శరీరాన్ని కోటగానూ, పడగలను సౌధాలుగానూ చేసినట్లున్నాడు. ఇంతాజేస్తే రాముడేమో అన్నీ వదిలి అడివికి పోయినాడు. నిస్తేజుడైన ఆదిశేషుడికి కూడా ఆ రోజు రామాగమన వార్త తెలిసినట్టుంది. ఒక్క సారిగా పడగ విప్పాడు. సౌధాగ్రాల్లో వెలిగించిన మాణిక్యపు దివ్వెలు ఆ శేషువు పడగలపై మణుల వలె భాసిస్తున్నాయి. ఎక్కడ చూసినా మకర తోరణాలు, పరిమళ గంధాలు... కస్తూరి కలిపిన కన్నీటి కలయంపి ఊరు వూరంతా కలాపి జల్లి, రత్నాల రంగవల్లులూ, ముత్యాల ముగ్గులు తీర్చిదిద్దారు ముదితలు.పనికి అడ్డు వస్తున్నారని పిల్లల్ని తొందరగా నిద్రపుచ్చబోయారు తల్లులు. స్తన్యమిచ్చి జోకొడుతూ, “లాలీ... లాలీ.. మేఘశ్యామా లాలీ.... తామ రస నయన ...... దశరథ తనయ లాలీ ... రామ లాలీ...”. అని పాడసాగారు. నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్న పసివాళ్ళు, పాటలో రాముని శబ్దం వినగానే తత్తరపడి మళ్ళీ మేల్కొంటున్నారు.ఎప్పుడెప్పుడు రాముని చూద్దామా అని తల్లుల పవిటలు పిల్లలు అడ్డు తీస్తున్నారు. ఆ విధంగా రెండు రోజులనుంచీ సాగుతోంది.రాముని రాక కోసం అయోధ్య నలంకరించిన నగర వాసులందరూ ప్రస్తుతం గాఢనిద్రలో మునిగి వున్నట్టున్నారు. పుర వీధులన్నీ నిశ్శబ్దంగా వున్నాయి. పిల్లగాలి హితుడిని పరామర్శగా తాకింది. దక్షిణం వైపునుంచి వస్తోంది అది. ఎక్కడో యోజనాల గరంలో వున్న రామచంద్రుని తాకి పునీత మైనట్టుంది. ఆ ఆలోచనతోనే అతడి శరీరం పులక

S1 Ep 169మందలపర్తి కిశోర్ గారి సమీక్ష - 'తోటి వేటగాళ్లు' కథపై
తోటి వేటగాళ్లపై మందలపర్తి కిషోర్ గారి సమీక్ష This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 168'తోటి వేటగాళ్లు' కేఎన్‌వై పతంజలి గారి కథ!
'తోటి వేటగాళ్లు' కే ఎన్ వై పతంజలి గారు రాసిన , వేట కథలు అనే కథాసంపుటం లోనిది.ఈ పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి.https://www.telugubooks.in/products/patanjali-sahityam-1తోటి వేటగాళ్లు కథపై శ్రీ మండలపర్తి కిషోర్ గారి సమీక్ష కూడా ఆడియోలో మీరు వినవచ్చు.తోటి వేటగాళ్ళు !బండివేగిసచెట్టు చేతులెత్తి, జుత్తు విరబోసుకు నిల్చుని రాక్షసుడిలాగుంది ఆ చీకటిలో. దానినీ , దానితో కొమ్మలు కలిపి నిల్చున్న పచ్చగాత చెట్టునీ అల్లుకుని పాకిన అడ్డతీగ పాదు కొసలు కొన్ని ఉరిత్రాళ్ళలాగ వేలాడు తున్నాయి. బండి వేగిసచెట్టు మీద ఇరవయి అడుగుల ఎత్తున కట్టిన మాటులో (మంచెమీద) మందసా రాజు కూర్చున్నాడు. అతని దగిర అతి శక్తిమంతమైన రైఫిల్ వుంది. మంచె కింద, రెండు చెట్టు కొమ్మల మీద ఇద్దరు తోటి వేటగాళ్ళు కూర్చున్నారు. వాళ్ళిద్దరి దగ్గరా రెండు తుపాకులున్నాయి. అంత దూరాన జువ్వి చెట్టుకు కట్టిన ఆవుదూడ బేలగా అరుస్తున్నాది. గుంజి పిట్టలు 'కరకరకర' మని అరుస్తున్నాయి.అడవి నిద్రతో తూలుతూంది. పులి అలికిడి లేదు. ముందురోజు, అంతకు ముందు రోజూ ఆ ప్రాంతంలో అది రెండు ఆవుల్ని ఎత్తేసింది. అడుగుల్ని బట్టి చూస్తే భారీ పులి. ఎరను బెట్టి, మాటు కట్టించి కూర్చున్నాడు రాజు. అర్ధరాత్రి దాటి చాలా సేపయింది. ఆ ప్రాంతంలో పులి ఎక్కడున్నా దానికి ఆవుదూడ అరుపు వినిపించే తీరాలి. అయినా రాలేదంటే రాజుకి ఆశ్చర్యంగా వుంది. ఇంకో అడివికి వెళ్ళిపోయిందా?తెలీడం లేదు. గాలి చల్లగా వేస్తోంది. తెల్లారగట్ట గాలి అలాగే వుంటుంది. శ్రీనివాసదేవ్ తలెత్తి చూశాడు. చుక్కల కదలిక తెలుసునతనికి. ఒకటి రెండు గంటల్లో తెల్లారిపోతుంది.మరి, అదిరాదు, మొన్ననే తెలిసినందుకు నిన్న మాటు కట్టేస్తే ఖచ్చితంగా దొరికిపోను. అవకాశం జారిపోయింది. నొచ్చుకున్నాడతను. నడుంకట్టు బిగువుగా, ఇబ్బందిగా వుంది. దానికి తోడు పిడిబాకు ఒర ఒరుసుకుంటోంది. చేయి పెట్టి నడుంకట్టుని కాస్త కదిపాడు. చప్పుడు కాకుండా వంగి మాటు అంచుమీద నుంచి కిందికి చూశాడు. తోటి వేటగాళ్ళిద్దరూ, ఒకేసారి తలెత్తి రాజుగారికేసి చూశారు. ఆ చీకటిలో వాళ్ళిద్దరి కళ్ళు జాలిగా, భయంగా కనిపించాయి. తల వెనక్కి లాక్కొని మళ్ళీ మామూలుగా కూర్చున్నాడు మాటులో. రాదల్చుకుంటే దానికి ఎంత సేపు. మెరుపులాగ రావచ్చు. మళ్ళీ ఆశ. ఒక్క షాట్ చాలు. మంచి నీళ్ళయినా అడక్కుండా చచ్చిపోతుంది. పులిని కొట్టి చాలా కాలం అయిపోయింది. ఈ సైజు పులి తిరగడం తక్కువే. అలాగ కూర్చున్నాడు. కారుకోడి కూసింది. తెల్లవారుజామున విచ్చుకునే ఏ కొండ పువ్వులు కళ్ళు తెరిచాయో గానీ చక్కని సువాసన నిండిన గాలితెర ఒకటి చెట్లని పలకరించుకుంటూ పోయింది. పిట్టలు లేచిపోతున్నాయి. కొండగొర్రె వేసిన వెలుతురు రెప్పలు ఆర్చుతోంది.కేక లీలగా వినిపిస్తోంది. అడివంతా నిద్ర లేచిపోతోంది. వెలుతురు రెప్పలు ఆర్చుతోంది.ఇంకరాదు! నిరాశతో నిట్టూర్చాడు. శ్రీనివాస్ దేవ్. నిద్ర దండగ. కారు దండుగ. ఎంతో సుఖంగా నిద్రపోవలసిన వాడికి కొండ చెట్ల మీద పడిగాపుల ఖర్మమేమి? వేట సరదా.ఎరగా చెట్టుకు కట్టి వుంచిన ఆవు దూడ ఇంకా అరుస్తోంది. అడివిని చూస్తే దానికి భయం వేసింది. చూస్తూ వుండగానే వెల్తురు ఎక్కువైంది. చెట్ల మధ్య నుంచి రేవులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి రాదులే అను కుని మంచె మీద నిల్చున్నాడు శ్రీనివాస్ దేవ్. ఒళ్ళు విరుచుకున్నాడు.“దిగుదాం” అన్నాడు శ్రీనివాసదేవ్. చిత్తం! అన్నారు తోటి వేటగాళ్ళు. శ్రీనివాసదేవ్ తుపాకీ మంచె మీదే వుంది.జాగ్రత్తగా మంచె దిగి చెట్ల కొమ్మలు పట్టుకుని దిగుతున్నాడు. “జాగర్తండీ... ఆ కొమ్మ పట్టుకుని కుడి కాలు ఆ తొర్ర ఒడ్డున పెట్టండి..” అన్నాడో తోటి వేటగాడు. “రైఫిల్ మంచె మీద నుంచి... జాగ్రత్తగా దించండి. లోడ్ చేసి వుంచేను సుమా... కొంపలు అంటుకుపోతాయి” అన్నాడు శ్రీనివాసదేవ్ చెట్టు దిగుతూ.'చిత్తం'. శ్రీనివాసదేవ్ కుడికాలు ముందు నేలని తాకింది. తరువాత ఎడమకాలు. చేతులు రెండు ఇంకా చెట్టుమానుని అంటి పెట్టుకుని వుండగానే 'గాండ్రు' మనే అరుపు వినబడింది. అంతసేపు ఎక్కడ ఉన్నదో గాని ఉరమని, కురవని పిడుగులాగ అతని మీదకి దూకింది. పెద్దపులి. తెల్లవారి వెలుగులో అది భయంకరమైన అందంతో మెరిసిపోతోంది. దాని కళ్ళూ కోరలూ మరీని. శ్రీనివాసదేవ్ చటాలున నిల్చున్న చోటునించి కొంచెం తప్పుకున్నాడు. పులి విసిరిన పంజా అతని భుజాన్ని రాసుకుంటూ చెట్టు మానుకి తగిలింది. శ్రీనివాసదేవ్ చటాలున ఆ పంజా అందుకున్నాడు. చెట్టు మొదటిని సందిట్లో పెట్టుకుని రెండో చేత్తో రెండో పంజా అందీసేడు. బలమంతా కేంద్రీకరించి, కాళ్ళు రెండో చెట్టు మొదటికి ఆన్చి తన్ని పెట్టి వెనక్కి లాగేడు. ఆ బలానికి ఆ ఊపుకి పులి తల వేగిస చెట్టు మొదటికి కొట్టుకుంది. అది ప్రళయ భీకరంగా గర్జించి గింజుకుంది. శ్రీనివాసదేవ్ బలమైన మనిషి పులి పంజాలు రెండూ అతని ఉక్కు పిడికిటిలో చిక్కుకుపోయాయి. ఆ పైన పులికీ, అతనికీ మధ్య బండివేగిస మానుంది. పంజాలు తన చేతిలోంచి జారిపోకుండా చూపుడు వేల్తో బొటన వేలు మరింత బిగించి పట్టుకున్నాడు. పులి చెట్ల ఆకులు కంపించి పోయేలాగ అరుస్తోంది.“... ఎవడో ఒకడు దిగండి... నా బొడ్లో బాకు దీసి దీన్ని పొడిచేయండి.. లేదా తుపాకీతో దాన్ని కాల్చేండి..." అని కేక వేశాడు శ్రీనివాసదేవ్ అరుస్తూనే తలెత్తి చూశాడు. తోటి వేటగాళ్ళిద్దరూ చెట్టుమీద కొమ్మల్ని అంటి పెట్టుకున్న కర్రిబల్లుల్లాగా పించారతని కంటికి. వాళ్ళిద్దరూ తుపాకులు ఎప్పుడో కిందపడేసి కొమ్మల్ని గట్టిగా వాటేసుకుని కళ్ళు మూసుకుని గజగజ వణికి పోతున్నారు.పులి వేస్తున్న కేకలకి హడలిపోయిన ఆవుదూడ కాలికి కట్టిన మోకు తెంపుకుని పుటాయించి పారిపోవడానికి యమయాతన పడుతోంది. అది తోక లేపి చెట్టు చుట్టూ పరిగెడుతోంది.పులి వెనుక కాళ్ళ మీద నిల్చుని నేలంతా తవ్వి పారేస్తోంది. ముందుకాళ్ళు విడిపించుకోవాలని అది తెగ ప్రయత్నిస్తోంది. శ్రీనివాసదేవ్ పళ్లు గట్టిగా బిగించి, చెయ్యి పట్టు తప్పిపోకుండా గట్టిగా దాని ముంగాళ్ళు పట్టుకునే వున్నాడు.“రేయ్.. వెధవల్లారా రండర్రా... వచ్చి దీన్ని చంపేయండి... నేను దీని ముందు కాళ్పు కదలకుండా పట్టేసుకున్నాను. మీకొచ్చిన భయం

S1 Ep 166'సచ్చి సాదించడం' - ఎండపల్లి భారతి గారు
'సచ్చిసాదించడం ' ఎండపల్లి భారతి గారు రాసిన ' ఎదారి బతుకులు' లోని కథ . ఈ కథలో వాళ్ళ పల్లెలో వుండే ఒక మూఢ ఆచారాన్ని గురించీ, దానివల్ల వాళ్ళ కుటుంబం పడిన ఇబ్బంది గురించి రాసారు భారతి గారు. ...............................................................................................................................................................................మాయత్తకు, మొగుడు ఉండి గూడా అందరి ముందరా ముండమోపి బతుకు బతకాల్సి వచ్చింది.మాది పెద్ద సంసారం. నాకు కొత్తగా పెండ్లయినబ్బుడు అందరం కూడా ఉండేవాళ్లం. మా ఇంట్లో మాయత్త, మా మామ, నేను, నా మొగుడు, మా తోడు కోడలు, మా బావ ఉండేవాళ్లం.నాకు ఒక కూతురు. మా బావకి గూడా ఒక కూతురు. బిడ్డలకి ఒక ఏడాది వయసు ఉంటాది....దినమ్మూ అట్లానే ఆపొద్దు గూడా నా మొగుడు, మా బావ ఇద్దరూ సేద్యంకాడికి పోయిరి. మా మామ ముసిలోడు. పనిచేయలేడు. ఆయప్ప ఒక మూల కుచ్చోని బిడ్డల్ని ఆడిచ్చుకుంటా ఉండాడు. నేను, మా తోడుకోడాలు తలా ఒకపని చేసి కూలికి పోయేదానికి పొద్దయిందని, అదరాబదరాగా మొగాలు కడిగేదానికి పొయిలో బొగెత్తి నోట్లో వేసుకుని దుద్దుకుంటా ఉంటిమి. మాకాడికి ముందే, మాయత్త మొగం కడిగి, అద్ది, గోడకు అతికిచ్చిన అద్దంలో మొగం చూసుకుంటా దాసరోళ్ల దగ్గర తీసుకున్న సునో డబ్బాలో పట్టెడు సునోను చూపుడేలుతో లోడుకుని గోరుమందం మొగానికి రుద్దుకునింది. నొస్టన వేలితో మైనం మెల్లించుకుని, అరచేతిలో వేసుకున్న ఎర్రకుంకాన్ని నడిమేలుతో ఎత్తుకుని అనపగింజంత ఎడం బొట్టు పెట్టుకుంటా ఉండాది. ఈ ముసిలిది ఏమి సొగసు పడతా ఉండాది. వయసులో ఇంకెట్ల ఉండిందో అనుకుంటా నేను నా పండ్లను పరపరా దుద్దు కుంటుండా.ఈలోపల మొగంపని చూసుకుని, మాయత్త తలకాయ నున్నంగా దువ్వి కొప్పేసింది. దానికితోడు మా ముసిలోడు ఇంటి ముందర దాసాని పువ్వు పూసుంటే పెరుక్కొచ్చి, ఇందే తలకాయలో పెట్టుకో అని ఇచ్చె. మాయత్త, దేవునికి పువ్వన్నా ఏమారతాది కాని తలకాయలో పువ్వు ఏమారదు. ఆయమ్మ మరిచిపోయినా మామామ గుర్తుచేసేవాడు, పువ్వు పెట్టుకోమని. ఆయమ్మ సొగసు ఉండేదే కదా అని నేను, మా తోడుకోడలు సంగటి తిని, పనికి పోయేదానికి దండెంమింద ఉండే పై గుడ్డల్ని బుజానేసుకుని, బిడ్డలకి పాలిచ్చి, వాళ్లరినీ ముసిలోళ్ల దగ్గర వదిలితిమి.నా కూతురు పాలు మానలేదు. చిన్న కలబందని రొమ్ములకి పూసుకున్నా గూడా అట్లే పాలు తాగే సేది. ఇంక నాకు వల్లకాక పాలిచ్చేసి బిడ్డల్ని బద్రంగా చూసుకోమని మా మామకి చెప్పేసి వాకిట్లోకి ఒక అడుగు పెడితిని.అంతలోకే చుట్టం వచ్చె, చెంబుతో నీళ్లిచ్చి నట్టింట చాపేసి కుచ్చోమంటిమి. ఆ చుట్టాన్ని మేమెరగం. ఆయప్ప “ఏమొద్దు, పలానాయన కాలమైపొయినాడు” అని మాయత్తకు చెప్పె. కాలం అయిపొయినాయప్ప మాయత్తకు తెలిసినట్లుంది. మాకు తెలీదు.అంతవరకు సంతోసంగా ఉండిన మాయత్తా మామా మొగాల్లో మబ్బు కమ్మేసింది. ఇద్దరూ నిరుజీవులై పోయిరి. వాళ్లను చూసి మేము గమ్మున అయితిమి. ఇంతకూ సచ్చిపొయినాయప్ప వీళ్లకి బాగా కావల్సినాయప్పో ఏమో అందుకే వీళ్లు వెతపడతుండారు అని అనుకుంటిని.కబురు తెచ్చినాయన మాయత్తతో మాట్లాడతా “సరేక్కా నేను ఊర్లో చానామందికి చెప్పల్ల, మన్నుపొద్దుకి చేరుకోవల్ల. వెనుకాముందు అయితే శవాన్ని ఎత్తరు" అని ఆయప్ప పోయె. కబురు చెప్పను వచ్చినోడు ఎంతదూరమన్నా పోనీ, వేళకి గుంటకాడకి చేరుకోవల్ల.ఆయప్ప అట్ల పోతానే మా ఇంట్లో చిన్నబిడ్డ అరుపులు తప్ప సద్దే లేదు. అంతా గమ్మునే వుండారు. ఇంతలో మా పక్కింటి పెద్దమ్మ వచ్చె. “ఏమ్మేవాడు కాలం అయిపొయినాడంట, ఏం చేద్దాము, పదే పోదాము, వాడు కట్టిన తాళి వాడికే తెంపల” అనింది మాయత్తతో.నేనుండుకుని అర్దంకాక, “ఏందమ్మా ఏం జరిగింది, ఎవరికి ఆయమ్మ తాళి తెంచేది" అని అడిగితి. ఒక పక్క మా మామ నెత్తిన చేతులు పెట్టుకుని కుచ్చో నుండాడు. నేను బలే నసుగుదాన్ని మా పెద్దమ్మ నడిగితి "కాదు పెద్దమా చచ్చిపోయినాయప్పనాకేమవుతాడు" అని.కాదే నా బట్ట ముండా, మీకేంగాడే వాడు. మీయత్తకు తొలీత బొట్టు కట్టినోడు. మీయత్తకు ఏడేండ్లబుడు వాళ్లమ్మ తమ్మునికిచ్చి పెండ్లి చేసి. వాడు మీయత్తని ఈదాబాదా పెడతా ఉంటే, ఆయన దగ్గిర ఇమడలేక వదిలేసి వచ్చేసింది. మల్లా మీ తాతను తగలాటం చేసుకునింది. లెక్క పకారం తొలీత బొట్టు కట్టినోడికి ముండమొయ్యల్ల" అనింది.నేను "అయ్యో ఇదెక్కడ న్యాయమమ్మ, ఎబుడో చిన్నబుడు నెరవాది కాకముందు పెండ్లైతే ఇబుడేందమ్మా ముండమోసేది. మా మామని పెండ్లి చేసుకుని ఇబ్బుటికి ఏ ఏబైయేండ్లో కావస్తా ఉండాది. అబుడు నింటి బిడ్డా పాపలను కని సంసారం చేసి, ఇబుడు ఆయప్ప ప్రాణంతో ఉంటే ఎట్లమ్మా వదిలేసి ముండ మోసేది" అంటిని.దానికి మా పెద్దమ్మ “అయ్యో కాదమ్మా, అట్ల ఒప్పుకోరు. ఎవరు తొలిత బొట్టు కడితే వాడు కట్టిన తాళి వానికే తెంపల్ల, లేదంటే మీ కుటుంబానికి మంచిదికాదు" అనింది.మామామ ఏమి జరగతాదో అని కుమిలిపోతా ఉండాడు. నిజమే కదా ఆయప్ప ప్రాణంతో ఉన్నెబుడే ముండ మోయల్లంటే ఆయప్పకి ఎంత బాదయితుంది.ఇంక అయిందెట్లా అయింది అని, ఇంట్లో వాళ్లు బాదపడుకుంటా ఆయమ్మని పిలుసుకుని పోతిమి. ఆడికి పొయినంక నాకు ఇంకా కొత్త కతలు తెల్సినాయి. ఆ సచ్చినోనికి, మాయత్త వచ్చేసినంక మాయత్తకి చెల్లిలివరసైన ఆమెను ఇచ్చి పెండ్లి చేసిరంట.తొలిది తోలు తెగదు, మలిది మాను తెగతాదా అన్నెట్లు ఆయమ్మ గూడా ఆయప్ప దగ్గిర సంసారం చేయకుండా యెల్లిపోయి వేరే ఆయనను పెండ్లి చేసుకుని నలుగురు బిడ్లకు | తల్లయింది. ఇబుడు బిడ్లకు పెండ్లిండ్లు అయినాయి. పెండ్లి చేసుకున్నాయన బతికే ఉండాడు.ఆయమ్మని గూడా ఇట్లనే తొలీత బొట్టు కట్టినోడికి ముండమొయ్యల్లని చెప్పినట్లుండారు. ఆయమ్మ వచ్చి నట్టింట కుచ్చోని ఉండాది. సచ్చిపోయినాయన, ఇద్దరు పెండ్లాలూ వదిలేసినంక ఇంకొకరి ఆలిని తోడుకొచ్చుకున్నాడు. ఈయప్పకు ఆయమ్మ కుదిరి నిలబడిపోయింది. ఆయమ్మా ఉండాది. ఆయమ్మ ఒగని ఆలి కాబట్టి, ఈయప్పకు ముండమోసే పనిలేదంట.మాయత్తని, రెండో ఆయమ్మని నట్టింట కుచ్చోబెట్టి, వచ్చిన అమ్మలక్కలు ఊరికే ఉంటారా, వాళ్లకు పసుపుకుంకుమ పూసి, గంగమ్మ బొట్టు పెట్టి, తల నిండా పూలు పెటి. ఆయప్పకు తెచ్చిన పూలారాలు వీళ్లకూ ఒకొకటి వేసి తలకాడ ఒకరిని, కాళ్లకాడ ఒకరిని కుచ్చోబెట్టిరి.ఆ ఊరు చిన్నూరు కాదు. సుమారు మున్నూరు పైన ఇండ్లుండాయి. వీళ్లకు పెండ్లిండ్లు అయ