PLAY PODCASTS
Harshaneeyam

Harshaneeyam

530 episodes — Page 10 of 11

పెద్దంతరం - చిన్నంతరం

"కొంచెం అన్నం పక్కన పెట్టుకొని అందులో పప్పు కలుపుకోండి!""ఆ! ఆ ! అంతా పప్పే కలిపేసుకున్నావ్, నేను కొంత అన్నము లోకే కలుపుకోమన్నానా!""కొంచెం అన్నం మిగుల్చుకుంటే అరటికాయ కూర వేద్దామనుకున్నా!""ఇంక ఇక రసం వేసుకొని, అరటికాయ కూర నంజుకో, ఆ తర్వాత కొంచెం పెరుగు వేసుకుందురు కానీ!"నాకర్థమయ్యింది మా అమ్మ మా నాన్న కి భోజనం వడ్డిస్తుందని, కాదు, కాదు, ఏమి తినాలో ఎంత తినాలో ఓ బొమ్మరిల్లు భార్యలా ఆయన చేయి పట్టుకునే ఉందని."అమ్మా! ఆయన ఏమి తినాలో కూడా నువ్వే శాసిస్తే ఎలా? ఆయన అడగ గలరు గా ఏమి కావాలో అప్పుడు అడిగింది, వడ్డించ వచ్చుగా""పోరా! గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందట! నువ్వు కూడా నాకు చెప్పే వాడివే"మరి కొన్ని రోజుల తర్వాత - "అవునే! పిల్ల బాగుందా!""మరి ఎత్తు?""ఐదడుగుల ఐదంగుళాలా! అబ్బో మంచి ఎత్తే, మనోడు ఐదు పది ఉంటాడా! పిల్ల మంచి రంగు కూడానా""ఉద్యోగం కూడా చేస్తుందా! గవర్నమెంట్ జాబ్ నా! ఇంకేందయితే జాబ్ గురుంచి విచారించేది""నా మాట విని పద్మజ కి చెప్పు కట్నాలతో పెట్టుకోకుండా చేసేసుకోమని"నా కర్థమయ్యింది, మా అమ్మ తన స్నేహితురాలితో, ఫోన్ సంభాషణ లో ఉందని.ఫోన్ అయ్యాక, "అవునే అమ్మ! నా పెళ్ళికి మా నాయన, అంటే మీ ఆయన కట్నం తీసుకోకుండా ఎంత మాత్రం ఆప గలిగావ్"మొహం ఎర్ర బడుతుండగా, "ఆఖరికి నీతో కూడా చెప్పించు కోవాల్సి వచ్చింది", అనేసి అలిగేసింది మా అమ్మ.మా అమ్మ అలిగితే, "ఆమె అన్నం తిన్నదాకా నాకు చుక్కలే!"ఇదంతా చూసి మా దగ్గరే ఉంటూ, ఉద్యోగం చేసుకొనే మా అక్క కూతురు, కయ్య్ మని, "అమ్మమ్మ! మొన్న పెద్ద మామయ్య అంతలేసి మాటలంటున్న, నీకు చీమ చిటుక్కుమన్నా లేదు, చిన్న మామయ్య ఒక్క మాట అనగానే నీకు అంత రోషం వచ్చేసింది అని"మరల షరా మాములే, దానిక్కూడా, తలంట్లే! "గుడ్డొచ్చి పిల్లనెక్కిరిస్తుందా అంటూ."అమ్మ, కోపం ఇంకా తగ్గలా!"నేను నీ దగ్గర హాయిగా లేను, మీ అన్న దగ్గర హాయిగా లేను, మీ నాన్న దగ్గర అస్సలకే లేను""మరి ఎవరి దగ్గర హాయిగా వున్నావే! అమ్మా", నువ్వు అన్నా ఇంకా రెచ్చకొడుతూ."మా నాన్న దగ్గఱ రా"డెబ్భై రెండేళ్ల మా అమ్మ! తన నాన్న దగ్గర వున్న కాలాన్ని, ఇన్నేళ్లకి మరువలేదు.మా అమ్మని నేను బాగా చూసు కుంటున్నాను అనే నా అహానికి ఓ చెంప పెట్టు.టేబుళ్ల మీద పదార్థాలు పెట్టి వెళ్లి పోతే మన పాటికి మన వడ్డించుకు తినటం అలవాటు అయినమన తరానికి, అలా కొసరి కొసరి ఏమి తినాలో, ఎంత తినాలో చెప్పు కుంటూ అన్నం వడ్డించే ఆ తరం -పక్కనోడు ఏమి చేసుకున్నా మనకెందుకు అని మనలా అనుకోకుండా, పాటించరని తెలిసినా వాళ్లకు ఉబుసు పోక సలహా అయినా మంచిదే ఇచ్చే ఆ తరం -మన కళ్ళకి మన లేక ఇతరుల వ్యక్తి గత స్వేచ్ఛను హరించే శకం!ఇలా అయితే మనకి మాటలు చెప్పే తరమే ఉండదేమో ఇక. తలా ఒక స్మార్ట్ డివైస్ పట్టుకొని, ముంగిల్లా ఓ మూల పడి ఉండవచ్చు, ఎవరన్నా ఏదన్న మాట చెప్ప బోతే, "మైండ్ యువర్ ఓన్ బిజినెస్" అనే ఎక్స్ప్రెషన్ మొహానికి తగిలించేసుకొని. ఇప్పటి తరానికి సలహా అనేది ఇప్పటికే చాలా ఇర్రిటేటింగ్ గా వుంది. అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటా వెళితే ఇద్దరి మధ్య మాటలు ఎలా సాగుతాయిభయం వేసింది నా ఆలోచనలకు. నాకు మాటలు కావాలి. వింటారో లేదో కూడా పట్టించుకోకుండా మా అమ్మ స్వపర బేధం లేకుండా అందరికీ చెప్పే మాటలు నాకు వినపడాలి, నిత్యం.తటాలున వెళ్లి హత్తుకున్నా అమ్మని."పోరా! ఈ వేషాలకి తక్కువ లేదు! వదులు నన్ను""వదలను నేను! అస్సలకి, నువ్వు తోసినా! తిట్టినా""పిచ్చోడా!!""అవును, నేను అమ్మ పిచ్చోడినే! ఇంకెప్పుడూ అనకు, మీ నాయనే, పెద్ద ఇది అని""అంటానురా! ఒక సారి కాదు! వెయ్యి సార్లు!""నేను మీ నాయన, శంకరయ్యను అయితే!""అవటానికి ట్రై చెయ్యి రా అప్పుడు చూద్దాం!"హత! విధీ, ఈ నాయన లని కట్ట కట్టి ఎక్కడన్నా పడెయ్యాలి.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jul 26, 20203 min

అర్థాంతర ప్రయాణాలు.

అమ్మ పొట్టలోనే ఇంకొన్ని రోజులు హాయిగా వుందామనుకున్న నన్ను, అలా ఉండటం కుదరదు అంటూ ఫోర్సెప్స్ లాటి పరికరాలు వాడి మరీ ఈ లోకం లోకి తీసుకొచ్చారు అమ్మ తో పని చేసే సహ డాక్టర్లు.కళ్ళముందు, హాస్పిటల్ లో వాడే టూల్స్ కనిపించీ కనిపించక, శబ్దాలు వినిపించీ వినిపించక నా అయోమయంలో నేను ఉంటే, ఏవో మాటలు కూడా, "వీడు తెల్లగా బొద్దుగా భలేగున్నాడు అంటూ".అలా ఓ నాలుగు చేతులు మారాక, "ఇంకా ఎన్ని చేతులు మారాలి రా నాయనా అనుకుంటూ, ఉన్న పళాన నాలుగు ఆవులింతలు అరువు తెచ్చేసుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నా".ముప్పావు వంతు నిద్ర, పావు వంతు మెలుకువ, మెలకువలో అమ్మ స్పర్శ, అమ్మ గొంతు కోసం వెతుక్కునే నన్ను, పెద్దైయ్యాక ఏమైతాడో వీడు అని అమ్మా నాన్నతో పాటు అందరూ అనుకుని అన్నప్రాసన మొదలెట్టేసి, ఏవో బుక్కు, పెన్ను, బంగారు గొలుసు లాంటివి ముందర పెట్టారు ఆ రోజున,కానీ చూసేవాళ్ళని సంభ్రమాశ్చర్యాలలో ముంచుతూ, వాటిలోంచి ఓ చిన్ని కత్తిని పట్టుకుని అప్పటికప్పుడే వీరులమైపోయాం. కానీ బహుశా అక్కడే నా ఫ్యూచర్ కు నాంది పడిందేమో, పనిముట్ల తో ముడిపడి వుండే వృత్తి తో! రాజ్యాలు, వాటినేలే రాజులు అప్పటికే అంతరించి పోవటం తో.అందుకు తగ్గట్టే, చిన్నప్పుటి నుండి ఇంట్లో ఉండే స్పాన్సర్, హ్యామర్, టెస్టర్ లాంటివి నన్ను తెగ ఆకర్షించి వాటితో ఆడుకోవాలనిపించేది. అవన్నీ మా నాన్న చిన్న చిన్న పనులకోసం వాడేవారు. అవి ఎలా వాడాలి అని మా నాన్నను విసిగిస్తూ గమనిస్తూ, ఛాన్స్ దొరికితే అవి ఎలా వాడాలో కాస్త తెలుసుకున్నా.ఇక ఆ విజ్ఞాన రస గుళిక, మన బుర్రలో పనిచేయడం మొదలెట్టి, మా నాన్న ప్రేమతో కొనిచ్చిన సైకిల్ మొత్తం విప్పేసి, తిరిగి ఎన్ని సార్లు బిగించినా బోల్డెన్ని నట్లు, బోల్టులు మిగిలిపోతూ ఉండటంతో, మెకానిక్ వచ్చి బిగించేవాడు. ఒక విషయం తెలుసుకోడానికి, అది నాన్న నాకు ఫ్రీడంతో ఇచ్చిన అవకాశం అనుకుంటా!! అదే ఇంకాస్త ముందుకెళ్ళి మెకానికల్ ఇంజనీరింగ్ చేసే అవకాశం కూడా కలిగించిందేమో!అమ్మ డాక్టరుగా, నాన్న ఇంజినీరుగా పని చేస్తూ, నేను, చెల్లెలుస్కూలుకు వెళ్ళొస్తూ మా ఇల్లంతా తెగ హడావిడిగా ఉండేది. ఇంత జరుగుతున్నా మద్యలో మధ్యలో మన ప్రయోగాలు మనవే కదా!!ఓసారి అమ్మ అడిగింది, "పెద్దయ్యాక ఏమౌతావురా" అని.ఠక్కున మన సమాధానం, "డ్రైవర్ అవుతా"!!కాసేపు ఓ భయంకరమైన నిశబ్దం. అమ్మకు మన రుచులు, అభిరుచుల సంగతి తెలియదు కదా పాపం. నన్నదోలా చూస్తూ ఏదో అనుకుంటూ వెళ్ళిపోయింది.నాకు అత్యంత ఇష్టమైన బస్సు ప్రయాణంలో ఎప్పుడూ ఓ స్పెషల్ సీటు రెడీ. అదే డ్రైవర్ పక్కనే ఉన్న ఇంజిన్ బానెట్. అది ఎలా ఉన్నా సరే, డ్రైవింగ్ గమనిస్తూ కాస్త ఆయన బుర్ర తింటూ మనక్కావలసిన విషయాలు రాబడుతూంటే కొన్న టిక్కెట్టుకు పూర్తి న్యాయం చేసినట్లే. అలా బోనెట్ మీద కూర్చొని అద్దం లోంచి సుదూరాన తారు రోడ్ మీద ఏర్పడే ఎండమావులను చూడటం గొప్ప అనుభూతి.నాన్నలో కాస్త నిశబ్దత, గంభీరత ఎక్కువ. అది పని ఒత్తిడి వల్ల అని తాతయ్య చెప్పేవాడు. నాన్నకు మంచి మూడ్ ఉంది అనే గుడ్డి గుర్తు , ఇంట్లో ఘంటసాల గారి పాట వినిపిస్తే , నాన్న చక్కటి గొంతుతో పాడుతుంటే, ఆ టైమ్ లో ఎవరూ ఆయన్ని డిస్ట్రబ్ చేసే వాళ్ళం కాదు. అది అమ్మ పెట్టిన రూల్.స్కూల్లో నా చదువులు టాప్ క్లాస్ కాక పోయినా, ఇంట్లో ఏ రోజూ ఇబ్బంది రాలేదు. స్కూల్లో మేం ఓ ముగ్గురం బాగా ఫ్రెండ్స్. మమ్మల్ని అమర్ అక్బర్ ఆంటోని అనేవారు తక్కిన వాళ్ళు. పేర్లకు తగ్గట్టుగా మాది ఓ సర్వమతసమ్మేళణం. ఒకరి లంచ్ బాక్స్ ఇంకోడిది. మాలోని ఆంటోని గాడు ఇప్పుడెక్కడికెళ్ళిపొయ్యాడో!!చిన్నప్పుడు నన్ను బాగా వేధించిన విషయం అంటే మా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే ఇంట్లో లేకపోవడం. గవర్నమెంట్ ఉద్యోగులుగా అమ్మా నాన్న చాలా ఊళ్ళు తిరుగుతూ మా ఇద్దర్ని, చెరీ ఒకరు పంచుకుని చదివించేవారు.తాతయ్యను అడిగితే నిజాయితీకి శిక్ష అనే వాడు. అర్థం అయ్యేది కాదు. నా ప్రయాణ పదనిసలు ఇంకొంచెం ముదిరి, హాస్టల్ లో ఉండాల్సొచ్చో , లేక టౌన్ పక్క పల్లెలో బంధువులతో ఉంటూ, రోజూ బస్సులో వచ్చి , స్కూల్ బస్సు పట్టుకుని తిరిగి, మళ్ళీ పల్లె బస్సులో ఇల్లు చేరాల్సొచ్చేది.కానీ ఆ తిరిగే శిక్ష , మెల్లగా నన్ను బస్సు మీద ప్రేమకు దూరం చేయడం మొదలెట్టింది.నేను పదో తరగతిలో ఉన్నప్పుడు తాతయ్య అన్న మాటలు అర్ధమైన రోజు రానే వచ్చింది. నాన్న పనిచేసే కరెంటు సబ్ స్టేషన్, క్వార్టర్స్ అన్నీ కలిపి కాలనీలోనే ఉండేవి. ఆఫీసు ఇల్లు పక్కపక్కనే ఉండేవి. పనుల కోసం చాలా మంది రాకపోకలు సాగేవి. అలా రాజకీయ నాయకులు కూడా వచ్చి కాస్త కఠినంగా మాట్లాడితే నాన్న వాళ్ళను గెటౌట్ అనడం, తోటి ఆఫీసర్లు నాన్నకు సపోర్టు చేయడం, జీపు డ్రైవర్ వాళ్ళకి సర్దిచెప్పడం ఇలా రభస అయ్యింది.రికమెండేషన్ పద్దతిలో వాళ్ళ పని కావాలనడం, నాన్న రూల్స్ మాట్లాడటంతో గొడవ. ఇక మళ్ళీ ట్రాన్స్ఫర్ మామూలే. ఇవే విషయాల మీద అమ్మ కూడా నాన్నకు వత్తాసు పలకడం జరిగేది. నాన్న ఎందుకు గంభీరంగా నిశ్శబ్దంగా ఉండేవాడో అర్థమైంది. తన నిజాయితీ తన మనస్సు విరిచేసిందేమో అనేంత.అమ్మకు మా ఇద్దరిలో ఎవరినైనా డాక్టరుగా చూడాలన్న కోరిక బలంగా ఉండేది. చాలాసార్లు ఈ మాట బయటపెట్టింది కానీ మన లోకం వేరాయె. నాన్న చదివిన కాలేజీలోనే తాను కాలుపెట్టాలన్న చెల్లెలి కోరిక, అమ్మను తన ఇష్టాన్ని వదులుకునేలా చేసింది.నేననుకున్న మెకానికల్ బ్రాంచ్ చేరాక అత్యంత బోరు కొట్టిన సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ . ఇదే విషయంపై ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన నాన్నతో మంచి డిబేట్ కూడా నడిచేది. నా లాజిక్ ఒకటే! కనపడని దాని గురించి ఊహించి ఎలా చదవడం అని!! "ప్లగ్ లో వేలెట్టి చూడు, అండ పిండ బ్రహ్మాండాలు కనిపిస్తాయి" అని నాన్న అనడం ఇంకా గుర్తు. మా చర్చ చాలా ఆసక్తికరంగా ఉంటూ నాన్న దగ్గర విలువైన విషయాలు నేర్చుకునే అవకాశం కలిగించింది.నా చిన్నప్పటి నాన్నకు, ఇప్పటి నాన్నకు మధ్య ఈ చర్చల ద్వారా వచ్చిన కొత్త మార్పు నేనూ అమ్మ గమనించాం, చాలా ఆనందపడ్డాం. అలా సాగుతున్న నా కాలేజీ లైఫ్ లో ఒక పెద్ద షాక్ మా నాన్న చనిపోవడం. సడన్ గా గుండెపోటు. డాక్టర్ గా పక్కనే ఉండి అమ్మ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ బాధలోంచి అమ్మ ఒక బదిలీ రూపంలో తేరుకుంది.ఎందుకో అమ్మ ఆ తర్వాత తీరిక లేనంతగా బిజీ బిజీగా జీవితాన్ని గడుపుతూ ఉద్యోగంతో

Jul 25, 20207 min

ఈ కథకి టైటిల్ పెట్టటం నా వల్ల కాదు!

  నా అమెరికా ప్రయాణం మరియు డెన్వర్ కి చేరటంలో పడ్డ అష్టకష్టాలు నేను ఇదివరకే మీకు నా అమెరికా యాత్రలో వివరించాను. నా డెన్వర్ కష్టాలు అంతటితో ఆగలేదు. నేను మరియు మన నాయుడుపేట వాసి అయిన బుడ్డ రాజేషు ఒక సంక్లిష్టమైన ప్రాజెక్ట్ ని చేపట్టాము. అదేమియనగా మా ఖాతాదారుని యొక్క ఖాతాదారుల వివరాలను ఒక పాత డేటాబేస్ నుండి కొత్త డేటా బేస్ కి వలస యొనర్చటం. ఈ క్రమంలో మేమిద్దరం కలిసి ఒక ఇరవై లక్షల ఖాతాదారుల వివరాలలో దాదాపు ఒక లక్ష (అక్కడ లక్ష అనకూడదు, ఓ వంద వేలు అనాలి) ఖాతాదారుల వివరాలని కృష్ణార్పణం చేసేసాము. ఒక లక్షే కదా అని ఊరుకోవొచ్చుగా మా ఖాతాదారుడు, ఊరుకోకుండా మా చేత ఆ తప్పిపోయిన వివరాలను వెతికించి, వలస చేయించి మాకు ఉద్వాసన పలికాడు. ఈ ఉద్వాసన పర్వం గురించి రాస్తే ఓ భారతమంత అవుతుంది ఈ కథ. ఆ విధంగ నా డెన్వర్ కొలువు మూన్నాళ్ళ ముచ్చట అయ్యింది.   మా రెసిడెంట్ మేనేజర్ పెద్దాయన మంచివాడు కాబట్టి, నన్ను డెన్వర్ కి ఓ ముప్పై మైళ్ళ దూరం లో వున్నబౌల్డర్ అనే వూరిలో వున్న జి.ఈ కంపెనీలో పడేసాడు. అందరూ చల్ల కదలకుండా డెన్వర్లో కొలువు చేసుకుంటూ వుంటుంటే నేను మాత్రం, ఓ సంవత్సరం పాటు డెన్వర్ కి బౌల్డర్ కి మధ్య బంతిలాగ దొర్లా. అట్టి ఆ జి.ఈ లో మా మేనేజర్ ఉమేష్ నారాయణస్వామి. చాలా సదాచార సంపన్నుడు మరియు కొంచెం చాదస్తుడు. ఏడు గంటలకల్లా ఆఫీసులో ఉండేవాడు, కొంపలేదో మునిగేటట్టు. నేను పడుతూ లేస్తూ డెన్వర్ నుండి ఎప్పుడన్నా, ఎనిమిది కన్నా ఓ పదినిమిషాలు మాత్రమే, ఆలస్యంగా వెళితే నా కుర్చీ వరకు వచ్చి శుభమధ్యాహ్నం అని చెప్పి వెళ్లేవాడా దుర్మార్గుడు. ఏమాటకామాట చెప్పుకోవాలి పనిమాత్రం బాగా నేర్పాడు నాకు దగ్గరుండి మరి. మా పనిలో ఎమన్నా పొరపాటు వుంటే ఉగ్రనరసింహావతారమెత్తే వాడు.   ఆయన పోరగా పోరగా సంవత్సరం తర్వాత నేను డెన్వర్ కి మరియు బౌల్డర్ కి మధ్యనున్న లూయిస్విల్ కి మకాం మార్చేసాను. అక్కడ మన భారతీయ సమూహం అస్సలుండే వారు కాదు. మేమైతే అక్కడ నివసించటమొక శిక్షగా భావించే వారము. ఎప్పుడెప్పుడు తిరిగి డెన్వర్ లో పడుదామా అని ఎదురుచూసే వారము. మా ఉమేష్ ఆ సంవత్సరము తనకు తానుగా కల్పించుకొని అందరు ప్రోడక్ట్ వెండార్స్ తో బేరాలు ఆడి ఒక మిలియన్ డాలర్స్ మిగిల్చాడు, జి.ఈ కి, లైసెన్సుల ఖరీదు మీద. అవన్నీ పూర్తి అయ్యాక వచ్చి చెప్పాడు, "హర్ష తట్ట బుట్ట సర్దుకో నువ్వు కూడా, నేను కూడా సర్దుకుంటున్నా", అని. అదేమిటి ఉమేష్, నువ్వు జి.ఈ కి ఒక మిలియన్ మిగిల్చావు నిన్నెందుకు సాగనంపుతారు అంటే, "లేదు హర్ష ! నీకు తెలియదు ఈ జి.ఈ నాయకత్వపు జనాల ఆలోచన, నేను ! ఈ సంవత్సరానికి ఒక మిలియన్, మిగల్చటంతో ఇక ఈ సంవత్సరమంతా నా దగ్గర నుండి ఇక కొత్త ఉత్పాదకత ఏమి ఉండదు, నేను కూడా ఈ ఘనకార్యాన్ని గురుంచే డప్పుకొట్టుకుంటానని వాళ్లకు తెలుసు", అని చెప్పాడు. నిజమే, ఆయన అన్నట్టే ఆయన్ని మేనేజర్ పదవి నుండి జి.ఈ తొలిగించింది. నాకొక ఆర్నెల్ల పొడిగింపు వచ్చింది. కానీ నాకు మా ఉమేష్ లేని అక్కడ పని చేయాలని అనిపించలేదు. అదియును కాక, ఎప్పుడెప్పుడు డెన్వర్ లో పడదామా అన్న కోరిక మాకు.   సరే ఆ ప్రయత్నాలు మొదలు పెట్టాము. ముందు మా పెద్దదానికి డెన్వర్ లో ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం కింద నాలుగు ఏళ్ళు నిండితే సీట్ ఇచ్చే స్కూల్ లో ప్రవేశం కోసం ప్రయత్నిద్దామని అనుకున్నాము. అందుకని ఓ రోజు మంచి ముహూర్తాన డెన్వర్ కి మా ఇంజనీరింగ్లో సీనియర్ అయినా శివకోటన్నఇంటికి వచ్చాము. పిల్లలు కాస్త తేరుకున్నాక, స్కూల్ కి పోదామని కార్ దగ్గరకొచ్చాము. పిల్లలిద్దర్నీ వెనక కార్ సీట్స్ లో కూర్చోపెట్టే క్రమంలో నేను తెచ్చిన ఫైల్ ని కార్ మీద పెట్టి, వాళ్ళని కుర్చోపెట్టాక, ఆ ఫైల్ తీసుకొని లోపలపెట్టుకోవటం మరచి అలాగే బర్రుమని స్కూల్ కి వెళ్లిపోయాం. అక్కడికెళ్లి చూసుకుంటే ఫైల్ కనపడలేదు. మా సర్వ సమస్తం ఆ ఫైల్ లోనే, మా పాస్పోర్ట్స్, నా సర్టిఫికెట్స్, పిల్లల బర్త్ మరియు వాక్సినేషన్ రికార్డ్స్, ఒకటేమిటి సమస్తం అందులోనే. మా గుండెలు జారిపోయాయి, వెంటనే పరుగు పరుగున శివకోటన్న అపార్ట్మెంట్ కి వచ్చాము. అక్కడ మాకు మా ఫైల్ కనపడలేదు, ఒక్క సారి కుప్పకూలిపోయాము. దేశంగాని దేశంలో సంబంధిత కాగితాలన్నీ పోగొట్టుకొని, ఏమిరా ఈ శిక్ష అనుకుంటూ. సరే ధైర్యం తెచ్చుకొని శివకోటన్న వాళ్ళ అపార్ట్మెంట్ లోని అన్నీ కామన్ పరిసరాల్లో ఒక నోటీసు పెట్టాము, ఎవరికన్నా మెరూన్ కలర్ ఫైల్ దొరికితే మాకు ఫోన్ చేయండి అని. ఎవరూ చేయలా, ఆ రోజు సాయంత్రం దాకా ఎదురు చూసి, మా వూరెళ్ళిపోయాము.   శివకోటన్న మరునాడు ఫోన్ చేసి, ఫైల్ తెచ్చి ఇచ్చినవాళ్లకు 5This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jul 23, 20205 min

చిన్నీ వాళ్ళ చంద్రత్త!

"చిన్నీ ! నీ పెళ్ళికి చంద్రత్త వాళ్ళు రావట్లేదు, ఇందాక నువ్వు షాపింగ్ కి వెళ్ళినప్పుడు, మావ ఫోన్ చేశారు, చంద్రత్త కి ఒంట్లో బాగాలేదు అనిచెప్పి" అన్నారు నాన్న. "నా పెళ్ళికి చంద్రత్త లేకపోతే, ఎలా ! అయినా క్రితం వారమే కదా, మీరు ఢిల్లీ కి ఎదో పని మీద వెళ్లి , అత్తా వాళ్ళను చూసొచ్చింది. అప్పుడు బాగానే వుంది కదా అత్తకి ?" అడిగాను నేను నాన్నని. నా ప్రశ్న కు ఏమీ సమాధానం చెప్పకుండా, నాన్న అమ్మ వైపు చూసారు. అమ్మ చెప్పింది, "అత్తకి, నెక్ పెయిన్ వల్ల, బాగా ఇబ్బందిగా ఉంది, చిన్నీ! మాట్లాడితే ఇంకా ఎక్కువ అవుతుందని, రెండు మూడు వారాలు రెస్ట్ అవసరం అని అక్కడ వాళ్ళ డాక్టర్ చెప్తున్నారు. నీ పెళ్లి అయ్యిన, నెల లోపల అందరం కలిసి కొండకి వెళదామనుకున్నాం కదా! ఆ ట్రిప్ కి జాయిన్ అవుతాం! అని అత్త నీకు చెప్పమంది " అని. " అది వేరు, పెళ్లికి అత్త నా పక్కనే ఉండటం వేరు" అన్నాను నేను . మా చంద్రత్త అంటే నాకు చాలా ఇష్టం. మొన్న మొన్నటి దాకా, మా చంద్రత్త వాళ్ళు, మా ఇంటికి ఓ అరగంట దూరంలోనే, సీతమ్మధారలో వుండేవాళ్ళు. మావకి ప్రమోషన్ వచ్చి, ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఢిల్లీ షిఫ్ట్ అయిపోయారు, ఓ ఆర్నెల్ల క్రితం. విశాఖపట్నం లో వున్నా, భూప్రపంచంలో ఎక్కడున్నా సరే, రెండ్నెల్లకోసారి, తను, మా ఇంటికి రావాల్సిందే. మావ సర్వీస్ ఎక్కువ శాతం విశాఖపట్టణం లోనే జరిగింది, కాబట్టి నేను మా అత్తను పెద్ద మిస్ అయ్యింది లేదు. వాళ్ళ ఇంటికెళ్తే, బాపు గారి సినిమా లో హీరోయిన్ ఇంటికెళ్ళిన ఫీలింగ్ వచ్చేది నాకు. అంత అద్భుతం గా ఉంటుంది తన ఇల్లంతా. ప్రతీ వస్తువూ, నాకు నచ్చిన పేస్టెల్ షేడ్స్ లో. ఇది గాక, మాట్లాడేటప్పుడు, మా అత్త, మంచి జోవియల్ గా ఉంటుంది, చుట్టూ వున్న వాళ్ళ మీద జోకులేసేస్తూ. నాకు తెలుసు, చంద్రత్త పెళ్ళికి రాకపోవటం, మా అమ్మను గూడా ఎక్కువ బాధ పెడుతుంది. మా అమ్మా , చంద్రత్త గూడా చాలా మంచి ఫ్రెండ్సు. బయటికి షాపింగులు, గుళ్ళూ గట్రా అన్నీ ఇద్దరూ కలిసే చేసేవాళ్ళు. ఎక్కడున్నా ప్రతీ రోజూ టంచను గా ఫోన్ చేసి మరీ మాట్లాడుతుంది , మా అమ్మతో చంద్రత్త. తమాషా ఏందంటే, అలాంటి చంద్రత్త, మా నాన్న ఒకరితో ఒకరు, ప్రశాంతంగా మాట్లాడుకోవడం, చాలా తక్కువ సార్లు చూసాన్నేను. ఆవిడ, నాన్న కంటే రెండేళ్లు చిన్నదయినా, తనకో పెద్దక్క ఫీలింగ్ ఉంటుందనుకుంటా. మా ఇంటి కొచ్చినప్పుడల్లా, అన్నాచెల్లెళ్ళిద్దరూ, ఎదో ఒక విషయం మీద, నాలుగు విరుద్ధమైన అభిప్రాయాలతో వాదించుకుంటూ వుండే వాళ్ళు. మధ్యలో మా అమ్మ జోక్యం చేసుకునేది కాదు. నవ్వుతూ చూస్తూ వుండిపొయ్యేది. ఇలా ఆలోచనల్లో ఉంటే, అమ్మ పిలవడంతో ఈ లోకంలోకొచ్చాను. అమ్మ చెప్పింది " రేపు సాయత్రం కల్లా అన్నీ సర్దేయ్యాలి. ఎల్లుండి పొద్దున్నే, కల్యాణ మంటపం కి బయలు దేరాలి . నిన్న కొన్న చీరలన్నీ, కవర్లలోంచి తీసిపెట్టు, సూట్ కేసు లో సర్దుతాను" అని. ఆ తర్వాత మూడు రోజులకి నా పెళ్లి జరిగి పొయ్యింది. రెండు వారాల్లోనే, ఎంవీపీ కాలనీ లో మా అత్త గారింటికి, కాపురానికి వెళ్లి పొయ్యాను, మా ఆయన అమెరికా లో ఉద్యోగస్తుడవ్వడం తో, వీసాలు లాంటి గొడవలుండడం తో. వెళ్లిన ఒక వారానికి, వాళ్ళ ఇండియన్ ఆఫీస్ లో ఎదో పని ఉందని, మా ఆయన మద్రాసు వెళ్లడంతో, నాన్న, మా అత్తగారింటి కొచ్చారు, నన్ను ఇంటికి ఓ మూడు రోజులు, తీసుకెళదామని. అప్పుడు నాన్న మాటల్లో తెల్సింది అత్త ఢిల్లీ నించి ఆ ముందు రోజు సాయంత్రమే, మా ఇంట్లో దిగిందని. అడిగాన్నేను, " ఉంటుందా అత్త ఓ మూడు నాలుగు రోజులు? " అని ఆత్రుత గా. " ఉంటుందేమో, ఒక వారం పది రోజులు", అన్నారాయన. ఉత్సాహంగా ఇంటికెళ్ళాను, నాన్నతో బాటూ. ఇంటికెళ్తే, వరండాలో వాలు కుర్చీలో పడుకోనుంది అత్త, ఎదో పుస్తకం చదువుకుంటా. నన్ను చూడంగానే ఆమె కళ్ళలో ఓ చిన్న మెరుపు. మనిషి బాగా వీక్ గా కనపడుతోంది. నన్ను దగ్గరకి తీస్కొని చెప్పింది. "రావాలని చాలా ప్రయత్నించానే చిన్నీ, కనీసం పెళ్లి రోజుకైనా." అంటూ, తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూంటే. చెప్పాను నేను, " మా ఆయన పని మీద మద్రాసు వెళ్ళారత్తా ! వీసా డాక్యుమెంట్లు అనిచెప్పి, సాయంత్రం ఎటూ ఫోన్ చేస్తారు నాకు . అప్పుడు చెప్పేస్తా, నువ్వున్న వారం రోజులు ఇక్కడే ఉండThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jul 19, 202010 min

దేశం కానీ దేశంలో , బ్రతుకు చక్రమాగితే!

నిజామాబాద్ కి చెందిన నర్సింలూ కన్నా, నా సహోద్యోగి సీటెల్ లో ఒకప్పుడు. మనిషి చాల చలాకీగా, ఆరోగ్యంగా మరియు క్రీడాకారుల కుండే దేహదారుఢ్యంతో వుండే వాడు. కమా వాళ్ళు ఆడే సరదా క్రికెట్ కి, నాయకుడు కూడా. తనకి ఇద్దరు పిల్లలు - ఒక అమ్మాయీ మరియు ఒక అబ్బాయి. వాళ్ళ అమ్మాయి మా చిన్నదానికన్నా వయస్సులో రెండు నెలలు చిన్న మరియు మా పెద్దదానికంటే పొడవులో రెండు అంగుళాలు మిన్న. మేము సహోద్యోగులము మరియు మా చిన్నది, వాళ్ళ పాప సహాధ్యాయులు అవటం మూలాన మేము క్రమం తప్పకుండా వారాంతరాలలో కలిసే వాళ్ళము. అట్టి నర్సింలు చెప్పా పెట్ట కుండా మా కంపెనీ కొలువు వదిలేసి, ఒక దేశీయ గుత్తేదారుని ద్వారా టి-మొబైల్ లో చేరిపోయాడు. అలా ఓ నాలుగు నెలలు గడిచాక, ఒక వారాంతరం రోజున తన స్నేహితుడు ఇండియానుండి వస్తుండటంతో, విమానాశ్రయానికి వెళ్లి, వాళ్ళను తీసుకొని వాళ్ళ ఇంటివద్ద దింపి వచ్చి, తన ఇంటికి వచ్చి పరుండి , ఇక లేవలేదు. మాసివ్ కార్డియాక్ అరెస్ట్ అని తర్వాత తెలిసింది మాకు. ఇద్దరు పిలల్లు మరియు నర్సింలూ పార్థీవ శరీరంతో మిగిలిపోయింది తన భార్య. మంచి చెడులు చూసుకోవాల్సిన గుత్తేదారుడు పత్తా లేదు. తనకుండే స్నేహితులంతా మా కంపెనీ వారే, నాలాటి వారు. ముందు వాళ్ళ తలిదండ్రులతో నేనే మాటలాడినా, తన పార్థీవ శరీరాన్ని ఇండియా కి పంపిస్తాము అన్న వాళ్ళ ఆశల మీద నీళ్లు చిలకరించా, చాలా ఖర్చు మరియు మాకు అంత పలుకుబడి లేదు అన్న నెపం తో. అది వాళ్లకు చాలా ఘాతం లాగా తగిలింది. కష్టమైన అర్థం చేసుకొని సరే అన్నారు కొన్ని గంటల తరువాత. తప్పు అన్ని తెలిసినా, కట్టటం ఉండదు అని తెలిసినా, తన క్రెడిట్ కార్డుతో, ప్రయాణానికి కావాల్సిన టికెట్స్ కొనేశాము. మా కొలీగ్స్ అందరం కూడబలుక్కుని ఓ ఇరవై ఆరువేల డాలర్స్ కూడవేసాము. ఎవరు ఎంత చిన్న మొత్తమిచ్చినా స్వీకరించాము. ఈ మనీ కలెక్షన్ అంతా మా ఇంకో సహోద్యోగి అయిన శశీ సుంకు చూసుకున్నాడు. తరువాత చాలా కష్టమైనది తన దహనం. చాలా మంది, ప్రతిరోజు పండగే చిత్రం చూసి, తండ్రి సమాధి ఎలా వుండబోతుందో చూపటం చూసి, చాల అతి అన్నారు. కానీ నేను వెళ్ళినప్పుడు ఆ దహనవాటిక వాళ్ళు, నా ముందర చాలా ప్యాకేజీలు పెట్టి ఒక్కో ప్యాకేజీ ఆవశ్యకతని వివరించారు. ఇరువది మంది దర్శనార్థం వస్తే ఇంత, ఏభై మందికైతే ఇంత, డ్రెస్సింగ్ చేస్తే ఇంత, రాళ్లు పెడితే ఇంత పెట్టకపోతే అంత అంటూ ఓ గంట. గీచి గీచి బేరాలాడి అతి తక్కువ డబ్బుకు ఒప్పించి వచ్చా. ఈ లోపు మా నర్సింలూ కూతురు, హర్ష మామా! నాన్న నన్ను ఈతకు తీసుకెళ్తానన్నారు, నువ్వన్నా తీసుకెళ్ళు, నాన్నని చూడనిస్తారటగా నేను ఏ డ్రెస్ వేసుకోను అంటూ చాలా అమాయకంగా అడిగేది, పిల్లలు ఎలా అడుగుతారో మరియు ఎలా వుంటారో అలా. ఆ పక్కరోజు నేను మరియు ఇంకో సహోద్యోగి అయిన ప్రదీపు, నర్సింలూ ఒకటిన్నర సంవత్సరాల కొడుకుని తీసుకెళ్లి, శరీరాన్ని దహనపు గదిలోకి తీసుకెళ్లే స్విచ్ ని నొక్కించాము. బ్యాంకు అకౌంట్ ని మూసివేయించి, తన కారుని నేను తన తరుపున అమ్మి, అన్నీ డబ్బులు ఆ అమ్మాయి చేతిలో పెట్టి విమానమెక్కించాము. వాళ్ళ గుత్తేదారుని ఒక నక్షత్రకునిలా విసిగించి, వేధించి వాడి చేత నర్సింలూ కి రావాల్సిన డబ్బులన్నీ ఇండియా లోనే కక్కించాము. కానీ ఆ వెధవ, ఎచ్ 1 -బి ప్రాసెసింగ్ కింద మూడు వేల డాలర్లు పట్టుకొని మిగతా డబ్బులు ఇచ్చాడు. మాకు అర్థమైనది, అన్నీ బాగుంటేనే దేశం కానీ దేశం లో బతుకు బాగుంటుంది, ఎమన్నా తేడా వస్తే దిక్కులేని వాళ్లమవుతామని. కొలువు చేస్తే కనీసం కొంత పెద్ద కంపెనీలకన్నా చేయాలి కానీ చిన్న చిన్న దేశీయ గుత్తేదారుల దగ్గర చేయరాదని. అప్పుడు నాన్న చనిపోయినప్పుడు అసలు బాధ కూడా తెలియని అమాయకురాలైన మా నర్సింలూ కూతురి, ఇప్పుడు, రాష్ట్రం లోనే 160 రాంక్ తెచ్చుకొని, మన గాంధీ మెడికల్ కాలేజీ లో రెండవ సంవత్సరం చదువుతున్నది, వాళ్ళ అమ్మకి, పైనున్న వాళ్ళ నాన్నకి గర్వకారణమై. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jul 16, 20201 min

పిన్ని అనబడే వరలక్ష్మి గారు, అనే పిచ్చి రాముడి కథ!

మన పిచ్చి రాముడు గారు రాసిన, 'అమ్మ గురించి' చదవగానే, ఆయన్ని ఆయన ఒక అమాయకుడి గా చిత్రీకరించు కొని, వాళ్ళ అమ్మ గారు "నా పిచ్చి తండ్రి" అని ఎలా పిలుచుకునేదో, ఎలా కాపాడుకొని కడుపులో దాచుకొనేదో అని రాసిన విధానం నా మనస్సుకు చాలా హత్తుకున్నది. అలాగే ఉమ్మడి కుటుంబం లో పెరిగిన నాకు నా పిన్నమ్మతో అనుబంధం చాలా ఎక్కువ. ఎంత అంటే ఆవిడ జ్ఞాపకాలు అన్నిటా గుది గ్రుచ్చి, "మన జీవితాల్లో కథ నాయికా నాయకులు" అని ముచ్చటలు చెప్పుకునేంత. నాకు ఆయన రాసిన "పిన్ని అనే వరలక్ష్మి గారు" గురించి ఆవిడ కథానాయకుడికి ఏవిధంగా పిన్ని వరస అవుతారో అని ఆవిడ వ్యక్తిత్వం దెబ్బ తినకుండా సున్నితం గా చెప్పిన విధానం ఇంకా నచ్చింది. అందుకే ఆ కథని, మా హర్షాతిథ్యం లో మా ద్వితీయ కథలాగా పరిచయం చేయాలని ఆయన అనుమతితో ప్రయత్నించాము. ఈ ప్రయత్నం లో కొత్త తనము ఆ కథని శ్రవణ రూపం లో తీసుకొని రావటం. బహుశా మా ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము. ఈ ప్రయత్నం వెనక మా స్వార్థం కూడా వుందండోయి, మంచి కథలకు మా హర్షాతిథ్యం ఒక వేదిక కావాలని. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jul 13, 20205 min

నెల్లూరు ట్రంక్ రోడ్డు నందలి నా 'జాతక' కథ!

ఆ రోజు, ఒంగోల్లో ఏదో పెళ్లి ఉందని, వారం రోజులు కని, మా ఆవిడ బయలు దేరుతూంటే, ఆవిణ్ణి, రైలు ఎక్కించి, ట్రంకు రోడ్డుకొచ్చాను. మా రోజు వారీ సమావేశానికి నేను ఓ అరగంట లేటు. అప్పటికే, మా వాళ్ళు, విశ్వనాధం, సుబ్బారాయుడు, వెంకటరామన్ సర్, ట్రంకు రోడ్డు, సదాశివ మెడికల్ హాల్ మెట్ల మీద, చేరి పోయి వున్నారు. మా విశ్వనాధం ఎదో విషయం సీరియస్ గా చెపుతూంటే, వెంకట రామన్ గారు, సుబ్బారాయుడు ఆసక్తిగా వింటున్నారు. నేను రావడం చూసి మా విశ్వనాథం సడన్ గా మాట్లాడ్డం ఆపేసాడు. "ఏవయ్యింది" అడిగాన్నేను విశ్వనాధాన్ని. సమాధానం లేదు మనిషి దగ్గర్నుంచి. సుబ్బారాయుడి, వైపు చూసాడు విశ్వనాధం . సుబ్బారాయుడు అన్నాడు, " ఏం లేదు గురూ, ఇప్పుడు విశ్వనాథం, జాతకాలు చూడ్డం నేర్చుకున్నాట్ట. దాని మీద ఒక చిన్న ఇంటరెస్టింగ్ డిస్కషన్." "జాతకాలు నమ్మొచ్చేమో అన్న అనుమానం వుంది గానీ, జాతకం చెప్పే వాళ్ళను చూస్తే, అంత తొందరగా నమ్మాలనిపించదు నాకు, అన్నాను నేను, విశ్వనాధాన్ని చూస్తూ. ఇంతలో వెంకటరామన్ గారు అందుకొని అన్నారు, "సుందరబాబు రాంగానే, చెప్పాలని, తహతహ లాడిపొయ్యావు గదా. చెప్పెయ్యరాదా !" అని విశ్వనాథం తో. ఇంక లాభం లేదనుకున్నట్టున్నాడు, విశ్వనాధం చెప్పడం మొదలు పెట్టాడు. " మొన్న మీ జాతకం వేసి స్టడీ చేసా సార్. దాని ప్రకారం, కొద్ది రోజుల్లో, ఎదో గొడవలో, మీరు కొంత సమయం జైలు లో ఉండాల్సి వస్తుందని, అనిపిస్తోంది. కాబట్టి, మీరు కొంచెం జాగర్తగా ఉంటే మంచిది ." ఎటూ మీరు తేలిగ్గా తీసేస్తారు అని తెలుసు గాబట్టి, చెప్పినా ప్రయోజనం లేదని నేను, ఇలాంటి విషయాలు, అనిపిస్తే , చెప్పకుండా ఉండగూడదని, సుబ్బారాయుడు, తర్జన భర్జనలు పడుతున్నాం అరగంట నించి " విశ్వనాథం చెప్పిందంతా విని, అడిగాన్నేను, "నువ్వు, ఇట్లా జాతకాలు చూడ్డం అని మొదలు పెట్టి ఎన్ని రోజులయ్యింది ?" "నేర్చుకోడం ఓ సంవత్సరం నించి, ప్రెడిక్షన్స్ మొదలు పెట్టి, ఓ నెల రోజులయింది, మా మేన మావ ఒకాయన బాగా చెప్తాడు. ఆయన దగ్గర నేర్చుకుంటున్నా " అన్నాడు విశ్వనాథం. కంటిన్యూ చేస్తూ చెప్పాడు, "మొన్న మా పక్కింటాయన, ఎప్పుడో చిన్నప్పుడు, జరిగినవన్నీ కూడా, చాల కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేసాను" అని "జరిగినవి, చెప్తే, ప్రెడిక్షన్, అనగూడదేమో, ప్రిపరేషన్ అనాలేమో " అన్నా , నేను అతని మొహంలోకి ఓరగా చూస్తూ. సుబ్బారాయుడు గూడ ఒక కొంటె నవ్వుతో, విశ్వనాధం ఏవంటాడా అని, అతని వైపు చూసాడు. మా వెంకట రామన్ గారు, ఇవన్నీ పట్టించుకోకుండా, మా సాయి కేఫ్, ప్రసాద్ పంపించే టీ కోసం రోడ్డు అవతలి వైపు చూస్తున్నారు. విశ్వనాధం మొహం ఎర్రబడింది, "ఏమోనండి, నాకూ ఆయనకీ పరిచయం అయ్యి వారం రోజులు కూడా కాలేదు. ఆయన చిన్నతనం లో జరిగిన సంఘటనలు నాకు తెలిసే అవకాశం లేదు" అన్నాడతను పక్క రోజు మధ్యాహ్నం, దర్గామిట్ట లో ఎదో పని చూసుకొని, ఇంటి కొచ్చా. ఇంటి తాళం తీసి లోపలికెళ్తుంటే, మా ఎదురింటాయన ఆదుర్దాగా వచ్చి, "సుందరబాబు గారూ, ఓ గంట క్రితం మీ గురించి ఒక పోలీసు వచ్చాడండి, కలుద్దామని" , అన్నాడు. "దేని గురించిట ?' అడిగాన్నేను. "విషయం అడిగినా , ఏం చెప్పలేదండి, మీ ఫోన్ నెంబర్ తీస్కొని వెళ్ళాడు. పేరు విష్ణు అని చెప్పి వెళ్ళాడు. వన్ టౌన్ స్టేషన్ నించి వచ్చాడట ." అన్నాడాయన . "వెళ్లి కలుస్తాలెండి. సాయంకాThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jul 13, 202010 min

నేను, నా ఉషాయణం!

ఈ మధ్య ఒక కథ చదివా, అది అచ్చు నా కథే, నా కథే కాదు మీ అందరి కథే. ఆ కథ ప్రేరణతోనే ఈ కథ చెబుతున్నా. నేను మరియు ఉషా, ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకూ క్లాస్ మేట్స్. బాగా తెల్లగా, చలాగ్గా అచ్చు మన హీరోయిన్ జయప్రదకు నకలుగా ఉంటుంది ఉష. స్కూల్ మరియు ట్యూషన్ లో పక్క పక్కనే కూర్చోవాల్సిందే. హోమ్ వర్క్ సబ్మిట్ చేసినా ఆ పిల్ల పలక మీద మన పలక లేక ఆ పిల్ల నోట్స్ మీద మన నోట్స్ ఉండాల్సిందే, పక్క వాళ్ళవి తోసేసి అయినా. స్కూల్ నుండి రావటం, స్నానం చేయటం, తెల్లగా పౌడర్ కొట్టడం, మా అక్కని మా అమ్మని ఒకటే ఊదరకొట్టటం నేను ఉష అంత తెల్లగా ఉన్నానా అని. మా అన్నలకి అక్కలకి ఒకటే నవ్వు నా ఉష పిచ్చికి. వచ్చిన బంధువులకి కూడా చెప్తారు, మా వాడికి ఒక ఫ్రెండ్ ఉంది, ఆ పిల్ల పేరు ఉష, ఆ పిల్ల కోసమే ఇప్పుడు వీడు టిన్నుల టిన్నులూ పౌడర్ ఖాళీ చేస్తాడు, అది వీడికంటే సంవత్సరం పెద్దది అని. అలా సాగి పోయింది నా ఉషాయణం. ఆ తర్వాత నేను తంతే నెల్లూరులో గుంటబడి ఆ పిల్లేమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ల ఊరిలో. ఆ తర్వాత ఉషాని చూడనే లేదు. కానీ ఆ రూపం అలాగే నిలిచి పోయింది నా మదిలో. ఆఖరుకు పెళ్ళయాక కూడా సుప్రియతో మా ఉష అలాగా మా ఉష ఇలాగ అని ఒకటే ఊదరకొట్టేవాడిని. మా ఆవిడక్కూడా కోరిక అమాంతంగా పెరిగి పోయింది, ఆ ఉషా ఎలా ఉంటుందో చూద్దామని. మా అక్కలు, సుప్రియ మాంచి దోస్తులు. ఆఖరికి వాళ్ళందరూ నా చిన్నప్పటి లవ్ స్టోరీ ని చెప్పుకోవటం పడి పడి నవ్వటం, వాడి మొహంలే అని. ఐదేళ్ల క్రితం అనుకుంటా అందరం మా ఊరోళ్ళ పెళ్ళికి వెళ్ళాము, నేను మా అన్నలు, అక్కలు, సుప్రియ అందరం కలిసి. కొంచెం సేపటికి మా అక్కలు ముగ్గురు కట్టకలిసి వచ్చారు. ఒరే మాతో రా మేము నీకు ఒక్కర్ని చూపాలి అని. నువ్వూరా, సుప్రియా అంటూ తననీ లాక్కొచ్చారు. వాళ్ళ మొహంలో ఎదో అల్లరి నవ్వు. కానీ అది ఏంటో నేను పసికట్టలా. అందరం వెళ్ళాము. అక్కడ గుమ్మడికాయలా ఒక ఆవిడ, మా వాళ్ళు ఇదిగో వీడే మీ కిరణు (మా వూళ్ళో నా పేరు కిరణ్ లే ఐదో క్లాస్ దాకా). ఆవిడేమో కిరణు, కిరణు అంటూ మాట్లాడేస్తూ వుంది. అయోమయంగానే మా బేబీ అక్కనడిగా, ఎవరే ఆవిడా అని. ఆవిడా ఏంట్రా మన ఉషారా అని, సుప్రియా వైపు చూసిఒక్క కిసుక్కు మంటూ నవ్వు నవ్వింది మా అక్క. మా ఆవిడకి నా మొహం చూసి ఒకటే వేళాకోళం. అంతే ఒక్క దెబ్బకి అక్కడ నుండి పారిపోయి నా సీట్ లో పడ్డా. అస్సలకి ఆ రూపం ఎక్కడా, ఇప్పుడు ఎక్కడా. సన్నగా మంట మెదలయ్యింది గుండెల్లో. అస్సలు చూడకుండా వున్నా బాగుండు,  ఆ చిన్నప్పటి ఉష రూపమే మనస్సులో ఉండిపోయేది కదా అని. సో ఫ్రెండ్స్ ! ప్రతి వాళ్ళకి ఇష్టమైన స్టోరీస్ ఉంటాయి. అవి మనస్సులో వరకే ఉండాలి. అప్పటి వాళ్ళని కలుసు కొని, ఎలా వుంటారో చూద్దామనుకుంటే కొన్ని సార్లు నిరాశ తప్పదు. మార్పు తప్పదు, మనమూ మారలా? This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jul 9, 20202 min

పాపం, మా సీన మావ!

నేను ఆ రోజు బడి నుండి వచ్చేసరికి ముసునూరి నుండి మా సీన మామ వచ్చున్నాడు. ఈ సీన మామ వస్తే ఆయన వెంట పడి వూరు మీద లేక పోతే గుంజి పళ్లకోసమో లేక టేకు పళ్ళ కోసమో మా ఊరి హై వే కి ఆనుకొని వున్న చిట్టడవుల వెంట పడి బలాదూర్ తిరగటం నాకు చాలా ఇష్టం. అలా వూరి మీద పడి తిరిగే మా సీన మామని కనపడ్డోళ్లంతా ఆపి, అబ్బయ్య నువ్వు మా బాబయ్య కొడుకువి కదా, ఎప్పుడొచ్చినావు అంటూ తెగ పలకరిచ్చే వాళ్ళు. ఊర్లో పడి తిరిగే నాకు యింత గుర్తింపు ఎప్పుడొస్తాడబ్బా అని నాకు భలే దిగులేసి పోతావుండేది. కానీ ఈ సీన మామని బాబ మామ కొడుగ్గానే పలకరిస్తా ఉంటే, అబ్బో యీ గొప్ప యీయనది కాదులే వాళ్ళ నాన్నదిలే అని సర్ది చెప్పుకొని, మా బాబ మామ ముసునూరులో ఎదో గొప్ప పని చేస్తా ఉంటాడు అందుకే ఆయన ఫాలోయింగ్ ఈ ఊరి దాకా పాకిపోతా వుంది అనుకొనే వాడిని. అలా ఆయనంటే పెద్ద హీరో వర్షిప్ వున్న నాకు అప్పటిలోనే హతాశుడనయ్యె వార్త. మా పెద్ద వాళ్ళు పెద్దగానూ, మా ఊర్లో వాళ్ళు గుస గుస గాను చెప్పుకుంటుండంగా తెలిసిందేమిటంటే మా బాబ మామ తన మస్తానమ్మని , పిల్లకాయల్ని వదిలేసి స్వాములోళ్ళ వెంట పడి ఎక్కడికో వెళ్లి పోయాడని. అయితే మా బాబ మామ హీరో కాదా, జనాలెందుకు మా సీన మామని చూసి మా బాబయ్య కొడుకువా అని తెగ పలకరిచ్చే వాళ్ళు అని మా అమ్మ నడిగా, ఆవిడ నవ్వి చెప్పింది, పల్లెటూరోళ్ల పలకరింపులు అంతేరా, దానికి నువ్వో లేక మీ అబ్బో హీరోలు కానక్కర్లా అని. పాపం ఆ మస్తానక్క కి ఎన్ని కష్టాలో అని నిట్టూర్చేనోళ్లే ఎక్కువ,, సాయం చేసేటోళ్ళకన్నా. ఆవిడ కి మా సీన మామ కాక ఇద్దరు ఆడ పిల్లలు, మా బాబ మామ మాయం చేయకుండా మిగిల్చిన రెండెకరాల తోట ఉండేది. చదువాపేశాడు మా సీన మామ. ఆ తోటలో వేసిన తమల పాకులు, అరిటాకులు, నాలుగు గేదెల పాలు కావలికి వేయటం మొదలు పెట్టాడు. ఆయన తోట లో వేసినవే కాకుండా ఆ ఊరి తోటల్లోవి కూడా టోకున కొని అంగళ్ళకి, హోటళ్ల కి వేయటం మొదలెట్టాడు. నాలుగు డబ్బులు వెనశాడు, ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లిళ్లు చేసేసాడు. యిదంతా సినిమాలో చూపినట్టు ఓ మాంటేజ్ సాంగ్ అయ్యోలోపల జరిగిపోలా. కాలం కూడా దానికి దగ్గ కాలం తీసుకున్నది. ఇప్పుడు నాకు మా సీన మామ అసలు సిసలు హీరో. ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇంతలో మా ముసునూరు కావలి లో కలిసిపోవడం తో ఆయనకున్న రెండెకరాలు, ఆయన కూడ బెట్టుకొని కొనుక్కున్న చుట్టు పక్కల వూర్ల పొలాలు బంగారమయ్యాయి. మా సీన మామ దశ మరియు దిశ లు మారి పోయినాయి. పిల్లకాయలు చదువులు కావలిలో, ఎక్కడికన్నా రావడానికి పోవడానికి ఒక కారు, మంచి యిల్లు కూడా కట్టుకున్నాడు ముసునూరు లోనే. అబ్బా ఇక మా సీన మామ కు తిరుగు లేదు, ఎదురు లేదు అని నే సంబర పడిపోయా. ఆ సంబరం ఆయన కూడా కాస్త ఎక్కువే పడినట్టున్నాడు. కాస్త సరదా పడదామని కాస్త పేకాట, ఆ పేకాట ఆడేటప్పుడు బోర్ కొట్టకుండా కాస్త మందు మొదలెట్టాడు. మా సీన మామ మొదట నుండి మొదలెట్టాక అంతు చూసే అలవాటు ఉందిగా, ఆ మందు అంతు చూసే పనిలో పడిపోయాడు, ప్రతీ రోజు. ఎంత పురోగమనం లో వెళ్ళాడో అంతకు రెట్టింపు తిరోగమనం మొదలయ్యింది. పులి మీద పుట్రలా ఈ ఆస్తి నాదంటూ మా బాబ మామ కూడా దిగి పోయాడు, తిరిగి తిరిగి వయస్సయ్యిపోయింది గా ఇల్లు గుర్తుకొచ్చిందాయనకు. ఇక రామ రావణ యుద్ధమే ఇంట్లో ప్రతిరోజు; గొడవలు మధ్యస్థాలు మూడు పూవులు ఆరుకాయలుగా. ఈ గొడవల మధ్య మనఃశాంతి కరువయ్యి ఆ మస్తానక్క,, ఆవిడ పోయిన కొంత కాలానికి మా బాబ మామ ఇద్దరూ , పొయ్యారు. .చివరకు మేము విన్నది ఏమిటంటే ఓ రోజు మా సీన మామకి కావాల్సిన మందు తెచ్చి పెట్టి భార్య మరియు ఇద్దరు కూతుర్లు ఆయన ఆ మత్తులో ఉండగానే ఆస్తి కాగితాల మీద సంతకాలో లేక వేలి ముద్రలో తీసు కొని వెళ్లిపోయారని. మా సీన మామ మరలా ముసునూరు లో ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడకే వచ్చాడు.ఎదగటం కష్టం రా అబ్బయ్య, ఎదిగాక అక్కడే నిలబడటం ఇంకా కష్టం రా అబ్బయ్య అని పలవరించు కుంటూ. దీనికి కొసమెరుపు ఏందంటే, ఈ కథంతా చెప్పి మా సుప్రియాను అడిగా, అయన భార్య పిల్లలు చేసింది తప్పు గదా అని. "తప్పేమి తప్పు, తమరి బొంద , అసలు గవర్నమెంటు వాళ్ళే ఒక చట్టం తీసుక రావాలి, ఇట్టా మొగుడు తాగి తందనాలాడితే, ఆస్తి అంతా వూడబెరికి, పెళ్ళాం పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేటేటట్టుగా " అంది మా సుప్రియ. నవ భారత నారీ జయహో. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jul 7, 20204 min

మా ఉలవపాళ్ళ స్వామి!

నాకు ఐదేళ్ల వయస్సులో మా ఉలవపాళ్ళలో, మామిడేళ్ల కిష్ట, అక్కిశెట్టి శేషగిరి మరియు మా వూరి పూజారి కొడుకైన స్వామి అనే ముగ్గురు స్నేహితులు వుండేవాళ్ళు. మా ఆటలు, పాటలు మరియు తిరుగుళ్ళు అన్నీ కలిసే ఉండేవి. వీటిల్తో పాటు మాకు ఇంకో ముఖ్యమైన రోజువారీ, లేక రోజుకు పలుమార్లు వుండే కార్యక్రమం ఉండేది. అదేమిటంటే తిన్నది అరిగాక, వూరికి వెనకాల వుండే చెరువు దగ్గరకో, లేక వూరికి ముందు వుండే వాగు దగ్గరకో వెళ్లి అరగక మిగిలినదాన్ని దించుకొని రావటం. మా నలుగురి మధ్య వుండే ఒప్పందమేమిటంటే, మాలో ఎవరికీ ఆ అవసరముంటే, మిగతా ముగ్గురుకి అవసరమున్న లేకున్నా చచ్చినట్టు తోడు రావాల్సిందే. అలా అవసరం లేకుండా తోడుగా వచ్చినప్పుడు, ఆ కూర్చొనుండే వాడిని, అయ్యిందా లేదా, లేక ఇంకా ఎంత సేపురా అంటూ విసిగిస్తూ, మధ్య మధ్యలో, మా వూరి రాజకీయాల గురుంచో లేక మా వూరి సమస్యలకి పరిషారాలేమున్నాయబ్బా అనే చర్చలతో కాలక్షేపం చేసే వాళ్ళము. నాకైతే ఎక్కువగా మా వాగువైపుకి వెళ్ళటమే ఇష్టం ఈ కార్యక్రమానికి, ఎందుకంటే అక్కడ ఎక్కువగా పిచ్చి తులసి మొక్కలు పెరిగేవి, వాటి వాసనల మధ్య మా సువాసనలు మర్చిపోవొచ్చు, ఎంతైనా మనం నీటు గాళ్ళమే మొదటనుండి.  అబ్బా! స్నేహితుల మధ్య ఎన్నో మంచి జ్ఞాపకాలుంటే, ఈ హర్షా గాడేందిరా నాయనా, ఎంత సేపు ఇలాటి విషయాలే రాస్తాడు అని తిట్టుకుంటున్నారా, మంచి వాటికందరూ వస్తారు, ఇటువంటి వాటికి తోడు వచ్చేవారే అసలు స్నేహితులు అని చెప్పటం నా ఉద్దేశ్యం. మా యీ ఒప్పందం చాలా సౌలభ్యం గా ఉండేది మా ముగ్గురుకీ, ఒక్క స్వామి గాడితో తప్ప. ఎందుకంటే వాళ్ళ నాన్న గారు, మా వూరి మూడు గుళ్ళల్లో ఒక్కటైన మాలక్ష్మమ్మ గుడిని, ఆ వయస్సులోనే వాడికి రాసిచ్చేశారు, మిగతా రెండు గుళ్ళని, ఒకటి ఆయనకోసం మరియు ఇంకొకటి ఇంకా చేతికి అందిరాని స్వామీ గాడి తమ్ముడికోసం అట్టిపెట్టుకొని. ఈ మూడు గుళ్ళకి పూజ, పునస్కారాలు చూసుకుంటూనే ఆయన మా వూరికి దగ్గరలోని, చెక్ పోస్ట్ లో కూడా పని చేసేవారు. మా స్వామి సాయంత్రాలపూట మాలక్ష్మమ్మ గుడి తెరిచి, వాడి నోటికి తిరిగిన మంత్రాలు చదువుతూ దీపారాధన చేసి, వచ్చినోళ్లకు పెట్టీ పెట్టనట్టుగా కాస్త చక్కెర వాళ్ళ చేతులకు రాసి, కొంత సేపయ్యాక గుడి మూసి వచ్చేవాడు. ఇవే కాక మళ్ళీ మిగతా గుడులలో వాళ్ళ నాన్న దగ్గర అప్పుడప్పుడూ అప్రెంటిస్ గా కూడా పనిచేసేవాడు. ఈ కార్యక్రమాలతో తీరిక లేకా మాకు చాలా సార్లు అందుబాటులో ఉండేవాడు కాదు వాడు. మాకు వాడి మీద ఈ విషయం లోనే ఫిర్యాదు. మా పల్లెల్లో రెండు మూడు కుటుంబాలకు కలిపి ఉమ్మడి బావులుండేవి. ఈ కుటుంబాల చావిడీలు మధ్య వుండే గోడలు, ఈ బావుల దగ్గర మాత్రమే ఓపెన్ గా ఉండేవి. అటుపక్కనుండి ఆవల కుటుంబాలు, ఇటుపక్కనుండి ఈవల  కుటుంబాలు, కావలసిన నీళ్లను తోడుకొనే వారు. ఒక్కోసారి ఆవల కుటుంబాలకి సన్నిహితమైన మరికొన్ని కుటుంబాలు, ఈవల కుటుంబాలకి సన్నిహితమైన కొని కుటుంబాలు కలిపి ఇటువంటి బావులని వాడుకొనే వారు. అలాగే ఒక వీధిలోంచి ఇంకో వీధిలోకి, వెళ్ళటం ప్రమాదకరమైనా, దగ్గరి దారి అవటం తో ఈ బావులని దాటి వెళ్లే వారు కొందరు. అలా మా స్వామీ గాడికి, వాళ్ళ చావిడీలో వుండే బావిని దాటి వెళ్ళటం, మాలక్ష్మమ్మ గుడికి చాలా దగ్గర దారి అవటం తో వాడు వాళ్ళ అమ్మగారు గమనించనప్పుడల్లా, బావిని దాటి వెళ్ళేవాడు. ఒకరోజు సాయంత్రం అలా వాడు దీపం పెట్టాలని, బావి దాటుతూ, కాలు జారి ఆ బావిలో పడిపోయాడు. బావి కూడా సగం నీళ్లతో అయినా లోతుగానే వుంది. పడ్డవాడు సాయం కోసం అరుస్తూనే వున్నాడు. చాలా సేపటికి వాడి అరుపులు విని అక్కడ జనం పోగయ్యారు. వెంటనే ఈత వచ్చిన వాళ్ళు బావిలో దిగి వాడికి తాడు కట్టి బయటకి లాగారు. బయటకొచ్చిన వాళ్ళు ఆశ్చర్యంగా అడిగారు వాడిని, అలా ఎలా ఒక ఈత వచ్చిన వాడిలా, బావి మధ్యలో చేతులాడిస్తూ తేలి వున్నావురా నువ్వు అని. దానికి మావాడు, నన్ను మాలక్షవ్వ కిందనుండి పైకి నెడుతూనే వుంది నేను బావిలో పడ్డప్పటి నుండి అని చెప్పాడు. అదే మాలక్షవ్వ అప్పటికి కొన్ని నెలల క్రితం, మా వెంటపడి చెరువుకి వచ్చి, మేము మా ఆటల్లో పడి, తనని గమనించుకోక పోవటం వలన, చనిపోయిన మా లక్ష్మిని ఎందుకు పైకి నెట్టలేదో. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jul 6, 20204 min

నవ్వితే నవ్వండి

హర్షణీయం మొదలు పెట్టి 3 మాసాలు అయ్యింది. ఈ కొద్దికాలంలోనే ఐదు వేల మంది పాఠకులు మా బ్లాగ్ ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా 'హర్షాతిధ్యం' అనే కొత్త శీర్షిక మేము మొదలుపెడ్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశ్యం, తెలుగు బ్లాగ్ ప్రపంచంలో వుండే చక్కటి కథల్ని, హర్షణీయం పాఠకులకు ప్రతి నెలా మొదటి వారంలో పరిచయం చెయ్యడం. ఈ శీర్షికన, మా ప్రథమ అతిధి గా విచ్చేసిన , శ్రీయుతులు బులుసు సుబ్రహ్మణ్యం గారి మా హార్దిక స్వాగతం. ఆయన రాసిన ' వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి' అనే హాస్య రచన తెలుగు బ్లాగ్ ప్రపంచపు అభిమానులకు సుపరిచితం. ఆ రచనతో, మా 'హర్షాతిధ్యం' ను మొదలు పెట్టడం జరుగుతోంది. పైకి ఒక చక్కటి హాస్య రచన అనిపించినా , కథ లోపలి పొరల్లో, ప్రతి మనిషి తన జీవితంలోని వేర్వేరు దశల్లో, తనకొక ప్రత్యేకమైన గుర్తింపు కోసం పడే సంఘర్షణను దాచివుంచడంలో రచయిత అత్యుత్తమ ప్రతిభ పాటవాలు మనకు దర్శితం అవుతాయి. రచయిత పరిచయం : పేరు: డాక్టర్ బులుసు సుబ్రహ్మణ్యం విద్య : డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీ స్వస్థలం : భీమవరం , పశ్చిమ గోదావరి జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ నివాసం: హైదరాబాద్ , తెలంగాణ. ఉద్యోగం: Rtd. Sr. సైంటిస్ట్ శైలి : హ్యూమనిజం తో కూడిన హ్యూమరిజం బ్లాగ్ యుఆర్ఎల్ : https://bulususubrahmanyam.blogspot.com పుస్తక ప్రచురణ : 'బులుసు సుబ్రహ్మణ్యం కథలు' : https://kinige.com/book/Bulusu+Subrahmanyam+Kathalu శ్రీ సుబ్రహ్మణ్యం గారు తెలుగు బ్లాగ్ ప్రపంచంలో సుప్రసిద్ధులు. దాదాపు పదేళ్లుగా ఆయన రచనా వ్యాసంగం కొనసాగుతోంది. ఆరోగ్యకరమైన హాస్యాన్ని, దైనందిన జీవితంలో జరిగే సంఘటనల్లోనుంచి, పుట్టించడం లో వీరిది అందెవేసిన చెయ్యి. మా హర్షణీయం లో , 'హర్షాతిధ్యం' శీర్షిక పై వచ్చే మొదటి రచన, వీరిదవ్వడం మాకెంతో హర్షణీయం, గర్వకారణం. మేము మా బ్లాగ్ లో ఆయన రచనను ప్రచురిస్తామని అడగడమే తరువాయి, వారు మా అభ్యర్ధన ను మన్నించడం జరిగింది. వారి రచనలన్నీ మాకు ప్రియాలైనా, వారు వారి పేరు మీద వేసుకున్న వ్యంగాస్త్రం, 'వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి' అనే రచన మా ఉద్దేశ్యంలో వారి కథా శిల్ప చాతుర్యానికి అత్యుత్తమ ఉదాహరణ. మరోసారి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ , వారికి సదా ఆ వేంకటేశుని అనుగ్రహ ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తున్నాం. ఆయన చేసిన చేస్తున్న, రచనల సమాహారం, ఆయన బ్లాగ్ యుఆర్ఎల్ లో ( https://bulususubrahmanyam.blogspot.com/) పొందుపరచడం జరిగింది. ప్రతి తెలుగు హాస్య ప్రియుడికి, ఆ బ్లాగ్ సందర్శన ఒక గొప్ప అనుభూతి మిగులుస్తుందనడం లో సందేహం లేదు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jul 3, 202018 min

మనసున్న మారాజు!

నాకు మా నెల్లూరులోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి లోనే దొరికిన మరో స్నేహ సుమనుడు లక్ష్మిపతి రాజు. సూటిగా సుత్తిలేకుండా మాటలాడటం వీడి నైజం. అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని ఆశించి భంగపడతాడు. అలా భంగపడినప్పుడు ఒక అపరిచితుడిలా వీడికి తెలియకుండానే గోదావరి జిల్లా వెటకారపు రాజు బయటకొచ్చేస్తాడు వీడి నుండి. అందుకే వీడు మా బడి యొక్క యాంగ్రీ బాయ్. మా బడికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో వుండే  నవాబ్ పేట నుండి సైకిల్ తొక్కు కుంటూ వచ్చే అలసట వలన కలిగే చిరాకుతో కోపమే లక్షణంగా వుండే వాడు. కానీ వాడి మనసు వెన్న. మల్లిగాడు, రమణగాడుల రాజకీయ చదరంగంలో దొర్లుడు పుచ్చకాయనయ్యే నాకు పతీ స్నేహం ఒక ఒయాసిస్సు మరియు రక్షణ. వీడు అంత దూరంలో వుండే బడిలోనే చేరటం ఎందుకు అనేగా మీ ప్రశ్న, దానికి ఒకటో కారణం వాళ్ళ నాన్నగారు మా బడికి పక్కనే వున్న పాత పెద్ద ఆసుపత్రిలో సంచాలకుడి గా పని చేసేవారు, రెండో కారణం మా బడి యొక్క ప్రాశస్త్యం. వీడు మా లంచ్ బ్రేక్ లో వాళ్ళ నాన్న గారి దగ్గరకు వెళ్లే వాడు భోజనానికి. నోట్స్ మర్చిపోయాయనురా పతీ! సైకిల్ ఇవ్వు అంటే పంక్చర్ చేయను అనే కండిషన్ మీద సైకిల్ నాకు మాత్రమే ఇచ్చేవాడు, ఇంకెవ్వరు అరిచి గగ్గోలు పెట్టిన మన వాడి సమాధానం నో వే అనే.  ఇక మా రమణ ఎల్.ఏ పీరియడ్ లో అసాధారణ దంచుడుకి నేను పతి వెనక  వరసలో కూర్చొని తెగ ఎంజాయ్ చేసే వాళ్ళము. మన ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గారున్నారు చూడండి అని రమణ మా కళ్ళముందర ఆవిడని ఆవిష్కరించడానికి ప్రయత్నము చేయగానే,  పెద్ద ఈడు వెళ్లి చూసొచ్చాడురా అని పతీ గాడి కామెంట్స్ కి నాకు నవ్వు ఆగేది కాదు. ఏ మాటకామాట ఉపన్యాసాలు మా రమణుడు దంచేసే వాడు మా టీచర్ బొద్దింకల్లో శ్వాసకోశాలు వుండవు, వాటికి బదులు మాల్ఫీజియన్ నాళాలు వుండును అని చెబుతుంటే, పక్క పక్కన  నేల  మీద కూర్చున్న నేను మా పతీ, బొద్దింకల్లో మాల్ఫీజియన్ మా సైన్స్ టీచర్ మెజీషియన్ లాటి మీమ్స్ వేసుకొని మా ఇద్దరికే సాధ్యమైన వెధవ నవ్వులు నవ్వుకొని వాళ్ళం. నిజంగానే మా సైన్స్ టీచర్ మమ్మల్ని తన బోధనాపటిమతో మంత్ర ముగ్ధులను కావించెడిది. ఒక రోజు బాడుగ సైకిల్ తీసుకొని మా సంతపేట నుండి నవాబ్ పేటలో వాళ్ళింటికి  వెళ్ళిపోయా. వాడికో ప్రొజెక్టర్ ఉండేది. నాకు ఆ ప్రొజెక్టర్ తో వాడి దగ్గర వుండే రీల్ ప్లే చేసి చూడాలని కోరిక. వాడికి ఆ రీల్స్ సార్ట్ చేయాటానికి ఓపిక లేదు. అయినా బతిమలాడి ఒక రీల్ ని ఓపిగ్గా చుట్టి ప్లే చేసాము. అలా స్క్రీన్ మీద మేము ప్రాజెక్ట్ చేసిన బొమ్మలు లైవ్ లాగ కదులుతుంటే ఆ ఆనందమే వేరు. వాడికి వాళ్ళ ఇంట్లో చాలా మంచి గ్రంధాలయం ఉండటం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. చదవటం అంటే తరగతి పుస్తకాలని కాదు, వాటికి ఆవల మంచి పుస్తకాలను చదివే అభిరుచి మరియు వాళ్ళకోసం ఒక లైబరీ ని ఏర్పాటుచేసిన తలితండ్రులను కలిగిన పతి ధన్యుడు. మార్కులను చూసి స్నేహం చేసే మాలాటి వారికి వాడో కనువిప్పు. తర్వాత వాళ్ళ అమ్మగారు ప్రేమతో పెట్టిన భోజనం నేను మరవలేనిది. అసలు గోదావరి వాళ్ళ ఆతిథ్యమే వేరబ్బా. మాగాయ గురించి పుస్తకాలలో చదవటమే కానీ రుచి చూసింది ప్రధమంగా అక్కడే.  అటుపిమ్మట ఆ భుక్తాయాసాన్ని తీర్చుకోవడానికి అర్జెంటు గా సైకిల్ తొక్కేయాలిని అని నిర్ణయించుకొని, వాళ్ళ నాన్న గారి సలహాతో, మా  లీలమహల్ లో బడ్ స్పెన్సర్ మరియు ఇంకో బక్కాయన నటించిన,  "హూ ఫైన్డ్స్ ఏ ఫ్రెండ్ ఫైన్డ్స్ ఏ ట్రెషర్" అనే సినిమాకి వెళ్ళాము. నేను చూసిన మొదటి ఆంగ్ల సినిమా. మా పతీగాడు ఆరోజు ఆ సినిమాలో నాకు అనువాదకుడిగా మారిపోయాడు. చాలా నచ్చింది నాకు ఆ  సినిమా. వాడిని ఆ రోజు చాలా దగ్గరగా చూసాక పతి దొరికాడు నాకు ఇక నిధి దొరికింది అనే భావన మరియు నిశ్చింత కలిగింది. అప్పటి వరకు ఎంతో అద్భుతముగా జరిThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jun 30, 20205 min

మా విజయ్ - "అన్న"

చేతి లో ఒక చిన్న బాగు తో, నా రూం బయట, కుర్చీలో కూర్చుని వెయిట్ చేస్తున్నాడాయన. అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి. ఆయన్ని చివరి సారి నేను చూసింది నేను 10th క్లాస్ లో వున్నప్పుడు, ఇదే వూర్లో . నా ముందున్న ఫైల్ మీద రాసుంది ఆయన పేరు, సంజీవరావు అని. కావాలని ఒక రెండు గంటలనించి ఆయనని, నా గురించి వెయిట్ చేయిస్తున్నా. నవంబర్ నెల కావడంతో, పెన్షన్ తీసుకొనే సీనియర్ సిటిజన్స్, "లైఫ్ సర్టిఫికెట్' కోసం మా ఆఫీస్ కి వస్తారు, ఫిసికల్ వెరిఫికేషన్ గురించి. వాళ్ళ ఐడెంటిటీ వెరిఫై చేసి మేం సర్టిఫై చేస్తేనే, పెన్షన్ కంటిన్యూ అవుతుంది. నేను కూడా, అంతకు ముందు నెలలోనే, ట్రాన్స్ఫర్ అయ్యి వరంగల్ ఆఫీస్ లో జాయిన్ అయ్యాను. మా ఫాదర్ కూడా ఇదే వూర్లో నా స్కూల్ డేస్ లో ఓ ఐదేళ్లు పని చేయడంతో, నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి ఈ వూర్లో. ఇంతలో, మా ఫ్రంట్ ఆఫీస్ క్లర్కు, గఫార్ లోపలికొచ్చాడు , "సార్ చాలా సేపటినించి వెయిట్ చేస్తున్నాడు సార్, ఆ పెద్దాయన మీకోసం, లోపలికి పిలవమంటారా ?" అన్నాడు, కొంచెం ఆదుర్దాగా. "సరే రమ్మను," అన్నాన్నేను. ఓ రెండు నిమిషాల తర్వాత, సంజీవరావు వచ్చి, నా ఎదురుగా వున్న, కుర్చీలో కూర్చున్నాడు. ఓ ఐదు నిమిషాలు ఆయన ఫైలు అటూ ఇటూ తిప్పి, అక్కడే నిలబడి వున్న మా గఫార్ మొహం లోకి చూస్తూ చెప్పాను. "మా రికార్డ్స్ లో వుండే మీ పేరు, మీ అప్లికేషన్ లో మీరు రాసిన మీ పేరు, స్పెల్లింగ్ మ్యాచ్ కావట్లేదు." సంజీవరావు ఆందోళనగా అన్నాడు, "అదే విషయం నాకూ అర్థం కావట్లేదండి, పదేళ్లనించి ప్రతీ సంవత్సరం ఇదే ఆఫీస్ లో సర్టిఫై చేయిచుకుంటున్నాను. ఇప్పుడు మీరే ఎదో ఒక పద్ధతి ఆలోచించండి, ఇప్పుడు పెన్షన్ ఆగిపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. వేరే ఆధారం ఏం లేదు ." "ఆలోచిస్తాను, కానీ, రెండు వారాలు పడ్తుంది. వర్క్ చాలా హెవీ గా వుంది " అన్నాన్నేను, ఫర్మ్ గా. "మీరు అలా అంటే నేనేమీ చెప్పలేనండి. కానీ, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, నా ప్రాబ్లెమ్ సాల్వ్ కాకపోతే, మీ ఆఫీస్ నించి కదిలి వెళ్లే పరిస్థితి మటుకు ఉండదు నాకు" అంటూ కుర్చీ లోంచి లేచి డోర్ వైపు అడుగులేసాడు సంజీవ రావు . డోర్ దాకా వెళ్లి, ఒక్క క్షణం ఆగి, వెనక్కి తిరిగి అన్నాడు సంజీవ రావు నన్ను పరిశీలనగా చూస్తూ, " మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది" అని. "ఆ అవకాశం లేదు. నాకు ఇక్కడి ట్రాన్స్ఫర్ అయ్యి నెల మాత్రమే అయ్యింది" అన్నాను నేను పొడి పొడి గా. తన బెల్టు సరి చేసుకుంటూ, రూమ్ బయటకి వెళ్ళిపోయాడు సంజీవ రావు. గఫార్ కూడా, నా మొహంలోకి అదోలా చూసి, రూమ్ నించి బయటకు వెళ్ళిపోయాడు, తన సీటు దగ్గరికి. సంజీవరావు ఫైల్ వైపే చూస్తూ ఓ ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను. సంజీవరావు, మా పక్కింట్లోనే ఉండేవాడు, మా ఫామిలీ ఇరవై ఏళ్ళక్రితం ఇదే వరంగల్ లో ఉండేటప్పుడు. ఆజన్మ బ్రహ్మచారి. మా కాలనీ లో ఆయనికి ఓ పెద్ద చాదస్తుడు అనే పేరు ఉండేది. ఆయన తమ్ముడే విజయ్. మా స్నేహితులందరం ప్రేమగా పిల్చుకునే విజ్జన్న, సంజీవ రావు కంటే విజ్జన్న ఓ పదిహేనేళ్లు చిన్న. హైదరాబాద్ లో నిజాం కాలేజీ లో చదివే వాడు విజ్జన్న. సెలవలకి విజ్జన్న వరంగల్ వొస్తే, మా పిల్లలందరికి పండగే పండగ. మా పిల్లలందరికీ విజ్జన్న అంటే ఒక పెద్ద హీరో. ఇది గాక, మా విజ్జన్న కి ఎందుకో నేనంటే విపరీతమైన ఇష్టం. నన్నూ, నా ఫ్రెండ్స్ నీ, తెగ సినిమాలకి, షికార్లకి తిప్పేవాడు వూర్లో వున్నన్ని రోజులూ. కానీ ఇంత సరదాగా వుండే మా విజ్జన్నకీ, సంజీవరావు కీ ఎప్పుడు పడేది కాదు. ఆ రోజు నాకు బాగా గుర్తు. మా నాన్న కి విజయవాడ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చిన రోజు. మా విజ్జన్న, హైదరాబాద్ నించి పూలదండలతో సహా, ఒక అమ్మాయి తో సంజీవ రావు గారింట్లో దిగి పొయ్యేడు. ఇంక రామ రావణ యుద్ధం, ఫైనల్ గా, పక్క రోజు పొద్దున్నే, విజ్జన్నను కొత్త పెళ్ళాం తో సహా, ఇంట్లో నించి బయటకి పంపించాడు వాళ్లన్న, సంజీవ రావు గారు, కాలనీ లో ఎవ్వరు చెప్పినా వినిపించుకోThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jun 28, 202015 min

మా స్నేహ రమణీయం!

మా ప్రభుత్వ ఉన్నత ఆదర్శ పాఠశాల యిచ్చిన సన్నిహిత మిత్రులలో మా రమణుడు ముందు వరుసలో ఉంటాడు. బిక్కు బిక్కు మంటూ ఎనిమిదవ తరగతి బి-సెక్షన్ లో చేరిన నన్ను వీడు వెంటనే ఆదరించాడు. ఆ రోజుల్లో మా స్నేహాలు మొదట మనిషి గుణ గణాలని బట్టి కాక వారికొచ్చిన మార్కులను బట్టి మొదలయ్యేవి, అటు పిమ్మట కొంత కాలానికి స్నేహాలు స్థిర మవ్వటమో లేక ఒడిదుడుకులకు లోనవ్వటమో జరిగేవి. వీడు ఏడవ తరగతిలో ద్వితీయ స్థానంలో వచ్చినా, ప్రధమ స్థానములో వున్న మల్లిగాడికి వీడికి మార్కుల లో తేడా ఓ వంద మార్కులకు పైనే. అప్పటి వరకు మా మల్లిగాడు ఎదురులేని మనిషి అన్న మాట. ఆ మార్కుల తేడా వీడి మనస్సులో చాలా బలం గా నాటుకు పోయినది. నేను ఎనిమిదవ తరగతి లో చేరగానే మొదట నాకు వీడు చెప్పినది ఏమిటంటే వాడికి మూడేళ్ళ సమయం ఉందని, ఈ మూడేళ్ళలో కష్ట పడి చదివి పడవ తరగతిలో ప్రథముడిగా నిలుస్తానని.  దానికి తగ్గట్టే ప్రణాళికలు వేసాడు వీడు, ఎనిమిదిలో నాతో చాలా పోరాడాడు, నన్ను తెలుగు బదులు సంస్కృతము తీసుకోమని, అలా తీసుకుంటే పదవ తరగతి లో మంచిగా మార్కులు సాధించ వచ్చు అని. కాలం జరిగే కొద్ది ఒక మనిషిలో వచ్చే అద్భుతమైన మార్పుని దగ్గర నుండి వీక్షించటం ఒక అదృష్టమైతే నేను అట్టి వాళ్లలో ఒకడిని, ఎందుకంటే వాడి మార్పుకి ప్రత్యక్ష సాక్షిని నేనే. పాఠ్య అంశాల మీద ఏమన్నా సందేహాలు ఉంటే వాటిని ఉపాధ్యాయుల వెంటపడి వెంటనే తీర్చుకోవటం, అంశాలమీద వేరు వేరు పుస్తకాలు చదవటం వీధిలో వికాసాన్ని బాగా పెంచాయి. ఆ వికాసము  వలన వీడు మా లిటరసీ అసెంబ్లీకి సెక్రటరీ అయ్యాడు మరియు అద్భుతమైన వక్తగా మారాడు. అందులోను వీడు కథలు చెప్పటంలో నా కన్నా దిట్ట. మీకేమో సురేష్ కృష్ణ రాసిన బాషా స్క్రిప్ట్ (బైబిల్ అఫ్ అల్ మోడరన్ స్క్రిప్ట్స్ అట) యీ మధ్య తెలుసు. కానీ నాకు మన రమణుడు ఎప్పుడో పరిచయం చేసేసాడు నారపనేని వీరాస్వామి అండ్ సన్స్ ని. నారపనేని వీరాస్వామి గారు వీళ్ళ తాత గారు. ఆయనది నెల్లూరులో కెల్లా పేరుగాంచిన పండ్ల వ్యాపారము.    నేను నోరు విప్పార్చుకుని వినే వాడిని మా రమణుడు చెప్పే సంగతులు,  ఎలా వాళ్ళ నాన్నగారు లక్షలాది ఆస్తులు వదిలేసుకొని, కుటుంబం నుండి బయటకు వచ్చేసి సింపుల్ గా బతికేస్తున్నారో అని. నెల్లూరిలో  పెద్ద బజార్ నుండి కామాటి వీధికెళ్లే మొదల్లో వాళ్ళకొక పండ్ల కొట్టు ఉండేది, అది నడుపుతూ వాళ్ళ నాన్న గారు వీళ్ళ ముగ్గురు అన్న తమ్ములను చదివించుకునే వారు. ఆయన్ని చూడాలనే కోరిక వెంటనే కలిగేది కూడా నాకు. ఆయన నన్ను చాల ప్రేమగా పలకరించే వారు. మా స్నేహితుల్లో చాల మందికి తెలుసు నేను ఆయన్ని నాయనా అనే పిలుస్తానని. ఇప్పటికీ నెల్లూరు వెళ్తే నేను కలిసే వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఇక పువ్వు పుట్టగానే పరిమళించినట్టు వీడు పుట్టుకతోనే పెదరాయుడు, ఇంటికి పెద్ద కొడుకు మరియు వాళ్ళ అమ్మగారికి కుమారి అయ్యాడు ఆడపిల్లలు లేక. వీళ్ళ అమ్మ గారు మహా స్ట్రిక్టు . నేను అంత దూరం నుండి వచ్చి వీడి చదువు కాజేస్తున్నానని ఆవిడ నమ్మకం. అది నిజం కూడా. వాళ్ళ ఇంటి కెళ్లిన నాకు వాళ్ళ కాంపౌండ్ వాల్ గేట్ దగ్గరే వాళ్ళ అమ్మగారు, కుమార్ ఇంట్లో లేడురా అని చెప్పేవారు,  ఈలోపలే మావాడు బాల్కనీ లో నుండి చేయి ఊపేవాడు. నేను కూడా సిగ్గులేకుండా మీరు చూడలేదేమో అమ్మా వాడు ఇంట్లోనే వున్నాడు అని చెప్పి దూరిపోయేవాడిని చాలా సమయాల్లో. అప్పుడప్పుడు ఆవిడ అలా చెప్పటంతో కొంచెం అంతర్మధనం చెంది యింటికెళ్లి కాసేపు మాత్రం పుస్తకం పట్టేవాడిని, కానీ మన బుద్ధి షరా మామూలే. మా అమ్మ ఎప్పుడు చెప్పినట్టు దాలిగుంటలో వెచ్చగా ఉన్నంత సేపే నంట కుక్కపిల్ల రేపటి నుండి ఎవరి ఇళ్లలోనూ కుండలు ముట్టకూడదు అని అనుకొనేది బయటకు రాగానే దాని బుద్ధి షరా మామూలేనట. ఎనిమిదవ తరగతిలో సైన్స్ ఫెయిర్ కి మల్లి, ప్రతాప్ వెళ్లారు స్కూల్ తరపున కావలికి. మేము ఇద్దరం టికెట్ పెట్టుకొని వెళ్లి చూసొచ్చాము. చూస్తూ ఉండరా నెక్స్ట్ ఇయర్ నేను ఖచ్చితంగా స్కూల్ తరపున వెళ్తాన్రా అన్నాడు,  అన్నమాట ప్రకారం  తదుపరి సంవత్సరం  గూడూరు లో జరిగిన సైన్స్ ఫెయిర్ కి  వెళ్ళాడు. కల కనటం సాధించుThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jun 23, 20208 min

తరలి రాద తనే వసంతం

'తరలి రాద తనే వసంతం' అనే నా పాట తోనే ఆ రోజు ఇళయరాజా లైవ్ కన్సెర్ట్ మొదలయ్యింది. నేను పాడుతుంటే ఇళయరాజా చేతులూపడం మానేసి నా వైపే తన్మయత్వంతో చూస్తున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ముందు వరసలో కూర్చుని తల తెగ ఊపేస్తున్నారు. ఇంతలో ఎక్కడో కోరస్ మధ్య లోంచి, మా ఆవిడ గొంతు, ఇంక పాడింది చాలు నిద్ర లోంచి లెమ్మని. కళ్ళు తెరిచి చూస్తే, అప్పుడే పూజ గదిలోంచి వచ్చిన మా ఆవిడ , ఆ పక్కనే ఆ రింగ్ టోన్ తో మొబైల్ లోంచి నన్ను దీనం గా చూస్తున్న మా వెంకటరమణ మొహం కనపడ్డాయి. ఇంత పొద్దున్నే వీడు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడో అని అనుకుంటూ ఫోన్ ఎత్తాను. చిరాగ్గా మా వాడి గొంతు ఫోన్ లో, ఎన్ని సార్లు రింగ్ చెయ్యాలి రా. ఫోన్ ఎత్తి చావొచ్చు గా అని. ఎత్తాను గా! విషయం చెప్పండి రవణ గారు, అన్నాను, తెచ్చిపెట్టుకున్న వినయంతో. ఇప్పుడు దుబాయ్ లో ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కుతున్నాను పది గంటలకల్లా హైదరాబాద్ లో వుంటాను. ఎయిర్ పోర్ట్ కొచ్చి, పిక్ అప్ చేసుకో. అట్టానే రెండు జతల బట్టలు సర్దు కొని, ట్యాంక్ ఫిల్ చేస్కొని తగలడు, అన్నాడు వాడు, వాడి యూజువల్ స్టైల్ లో. విషయం ఏందీ అడిగాను నేను. ఏం! చెప్తేగానీ రావా అన్నాడు వాడు. వెంటనే 'వస్తున్నా లే' అని చెప్పి ఫోన్ పెట్టేసాను. మొగుడి తిట్ల కంటే, పెళ్ళాం గోల తో రోజు మొదలు పెడతామని డిసైడ్ అయిపొయ్యి. స్నానం చేస్తూ వాడి గురించే ఆలోచిస్తున్నా!, నాది వాడిది చిన్నప్పటి స్నేహం. హైదరాబాద్ లోనే కల్సి చదువుకున్నాం, ఇంటర్ దాకా. ఇది కాక వాళ్ళ తాత గారి వూరు, మా తాత గారి ఊరి పక్క పక్క నే ఉండడంతో, స్కూల్ సమ్మర్ హాలిడేస్ గూడా, మేము ఇద్దరం, ఒకే వూళ్ళో గడిపేవాళ్ళం . ఇది గాక మా నాన్న, వాళ్ళ నాన్న కొలీగ్స్. ఇప్పుడు వాడి సంసారం అమెరికా లో. వాళ్ళ నాన్న గార్ని, అమ్మగార్ని కూడా అక్కడికే తీసుకెళ్ళిపొయ్యాడు పదేళ్ల క్రితం . చిన్నప్పట్నుంచి. వాడు అదో టైపు. మా వూరు మా ముసునూరు అని తెగ ఫీల్ అయ్యేవాడు. మేము కాలేజీలో వున్నప్పుడు, వాళ్ళ తాత గారు పోతే, రవణ వాళ్ళ నాన్న గారు వూళ్ళో ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తుంటే చాలా ఇబ్బంది పడ్డాడు మా వాడు. ముసునూరులో ఏవన్నా సెటిల్ అవుతావా నువ్వు! అని వెటకారంగా అడిగితే, అది కాదు మావా! ఎదో ఒక కనెక్షన్ అంటూ ఉండాలి గదా మన ఊరితో, అంటూ బాధ పడి పొయ్యాడు. మా ఆవిడ బాత్రూం తలుపు బాదుతుంటే ఈ లోకంలోకి వచ్చాను. బ్రేక్ ఫాస్ట్ చేసి బయట పడ్డా. ఫ్లైట్ ఒక గంట లేటు. మా వాడు కార్లో కూర్చుని, వాడే వీల్ తీస్కొని చెప్పాడు, ముసునూరు వెళుతున్నాం మనం అని. ORR దిగంగానే , వాడి ఫోన్ రింగ్ అవ్వడం మొదలయ్యింది. స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తే , వాళ్ళ అమ్మగారు. స్పీకర్ లో వున్నావే నువ్వు! చెప్పాడు మా వాడు. సుబ్బు గానీ వచ్చాడా ఎయిర్ పోర్ట్ కి అడిగింది ఆవిడ నన్ను గురించి, ఉభయ కుశలోపర్లు అయ్యాక చెప్పింది ఆవిడ నాతో, ఊరి రామాలయం లో ఇవ్వడానికి కొత్త బట్టలు తీసుకెళ్లడం మర్చి పోవద్దని. పెట్టేసే ముందర రమణ తో చెప్పింది, వూర్లో జాగర్త! గొడవలకెళ్లొద్దు! అని. గొడవలేంది! అడిగాన్నేను రమణని . చెప్పడం మొదలు పెట్టాడు వాడు , వూళ్ళో పొలాలన్నీ అమ్మేసాం గానీ, ఈ మధ్యే తెల్సింది, ఒక రెండు ఎకరాలు మిగిలి పొయ్యాయి అని. ఈ మధ్య, పక్కూరి రంగా రావు గారు, కొత్త గా ఫ్యాక్టరీ పెడదామని, మన వూర్లో పొలాలు సర్వే చేయిస్తూంటే, ఈ రెండెకరాలు మన పేరు మీద ఉన్నాయని బయట పడింది. కానీ పేపర్లు మా పాలేరు 'దేవయ్య' గుర్తున్నాడు కదా. అతని దగ్గరే ఉన్నాయని తెల్సింది. అమ్మడానికి వీల్లేదు అని దేవయ్య గొడవ చేస్తున్నాడట. అతను ఇప్పుడు వూర్లో కొత్తగా కట్టిన చర్చి కి పాస్టర్ గూడ అయ్యాడట. ఒక్కో ఎకరం ఇప్పుడు యాభై లక్షలు ఉందట రేటు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jun 21, 202011 min

కలడు కలం డనెడు వాడు?

తారీఖు నవంబర్ 7 , సంవత్సరం 1990 . నెల్లూళ్ళో మా టౌన్ హాల్ అంతా నిండిపోయింది . రెండువేల కి మించి ప్రజానీకం. వాళ్లలో ఎక్కువమంది నెల్లూరు జిల్లా లో పని చేసిన , చేస్తున్న ఉపాధ్యాయులు. హాల్లో అంతా పండగ వాతావరణం. ఇంతమంది ఉపాధ్యాయులు ఒక ప్రజా నాయకుడి సన్మానానికి రావడం బహుశా జిల్లా చరిత్ర లోనే మొదటి సారి అయివుండవచ్చు. ఆ రోజు, మేమంతా 'మా రెడ్డి గారు' అని, ప్రేమగా పిల్చుకునే భక్త వత్సల రెడ్డి గారి షష్టి పూర్తి మహోత్సవం. ఇంకా సమావేశం ప్రారంభం కావడానికి ఇరవై నిముషాలుంది. నేను స్టేజి కిందనే నిల్చుని వున్నాను. ఈ లోపల మా రాజయ్య హడావుడి గా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి, సారూ! , సారూ! అంటూ వచ్చాడు. రాజయ్య వెనక ఒక ముప్ఫయి ఏళ్ల వ్యక్తి నిలబడి వున్నాడు. ఎక్కడో చూసిన మొహమే, కానీ ఎవరో జ్ఞాపకం రాలేదు . ఈయనా, అన్నాను ప్రశ్నార్థకంగా! మా రాజయ్య అందుకోని, గుర్తుకు రాలేదా మీకింకా ! ఈ అబ్బాయి మన రాతల అయ్యోరి కొడుకు.నిన్న మా వాళ్ళ పెళ్ళిలో కనపడి, మీరెక్కడున్నారని అడుగుతుంటే చెప్పాను, ఇక్కడొచ్చి కలవొచ్చని అని. అతన్ని కొంచెం పరిశీలనగా చూస్తే , అనిపించింది నిజమే ఇరవై ఏళ్ల క్రితం చివరి సారి చూసాను అతన్ని. చాలా మారిపోయావు. అమ్మ ఎలావుందీ ! అడిగాన్నేను. నాకు చేతులు జోడించి చెప్పాడతను, హైదరాబాద్ - DRDO లో పని చేస్తున్నానండి. ఇన్ని రోజులూ మిమ్మల్ని కలవడం కుదర్లేదు. రాజయ్య సారు చెప్తే, ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని కలిసి పోదామని.అమ్మ కూడా అక్కడే, నా దగ్గర వుంది. కంటిన్యూ చేస్తూ చెప్పాడు, మీరు అప్పట్లో మమ్మల్ని ఆదుకున్నది, నేను జీవితంలో మర్చిపోలేను అని. ముందు వరసలో కూర్చుని వున్న మా రెడ్డి గారి వైపు చూస్తూ అనుకున్నా, గుర్తు పెట్టుకోవలసింది నన్ను కాదు అని. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం విషయం, నేను చింతారెడ్డి పాలెం స్కూల్ హెడ్ మాస్టర్ గా చేరి అప్పటికి ఓ రెండేళ్లు అయ్యుంటుందేమో. ఒక రోజు, మా జీతాల చెక్ తీసుకుందామని, మా పంచాయతీ సమితి ఆఫీస్ కి వెళ్ళాను. అక్కడ పెద్ద గుమస్తా వచ్చి చెప్పాడు ప్రెసిడెంటు గారు మిమ్మల్ని కలవాలంటున్నారని చెప్పి. ప్రెసిడెంటు గారు అంటే మా భక్తవత్సల రెడ్డి గారు. ఇందుకూరి పేట పంచాయతి సమితి ప్రెసిడెంటు. మా స్కూల్ , ఆ పంచాయతీ సమితి కింద వచ్చే ముప్ఫయి స్కూళ్లలో ఒకటి. మేము ఏదన్నా పనులు ఉంటే ఆయన్ని కలవడమే కానీ. మమ్మల్ని ఆయన రూమ్ లోకి రమ్మని పిలిపించడం చాలా అరుదు. ఎవయ్యుంటుందా అని ఆలోచిస్తూనే లోపలి వెళ్ళాను. ఏం అయ్యోరా ! ఎట్టుంది మన స్కూలు ? అడిగారాయన. అంతా బానే వుంది, సార్ చెప్పాన్నేను. నువ్వు వున్నావ్ గా ఆడ! అంతా బానే ఉంటది లే, అడగబల్లే అన్నారాయన. విషయానికి వస్తూ, చెప్పారు. రేపు మన బడికి ఓ కొత్త అయ్యోరు వస్తాడు . నువ్వు జాగర్త గా చూస్కోవాలి. నేనే ఆలోచించి నీ దగ్గర అయితే బావుంటాడని ఆర్డర్ ఇప్పిచ్చా మా అయ్యోరికి, అన్నారాయన. ఆయన రూమ్ లోకి తనే పిలవడం ఓ వింత అయితే , ఇట్టా టీచర్ల గురించి జాగర్తలు చెప్పడం ఇంకో వింత. టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యిపొయ్యి కొత్త టీచర్లు జాయిన్ కావడమనేది చాలా సాధారణ విషయం. నేను హెడ్ మాస్టర్ గా వచ్చిన ఆ రెండేళ్లలో, మా స్టాఫ్ గురించి ఆయన కలగజేసుకోడం ఇదే మొదటి సారి. ఆ ఆశ్చర్యాన్ని పైకి ప్రకటించకుండా తలూపాను, అట్టానే సార్ అంటూ. చెప్పారు మా రెడ్డి గారు , ఏదన్నా ఆయన గురించి ఇబ్బంది వొస్తే నాతో చెప్పు. పరిషత్తు ఆఫీస్ లో మీటింగ్ కి పోవాలా అంటూ కుర్చీ లోంచి లేస్తూ. పక్కరోజు పొద్దున్న ఆఫీస్ రూంలో కూర్చుని కిటికీ లోంచి బయటకి చూస్తుంటే,ఓ పన్నెండు పదమూడేళ్ళు వుంటాయేమో. ఒక పిల్లవాడు, ఓ యాభై ఏళ్ల మనిషిని, సైకిల్ వెనకాల కూర్చో పెట్టుకుని తోసుకుంటూ , మా స్కూల్ ఆవరణ లోకి ప్రవేశించాడు. నేను రూమ్ నించి బయటకొచ్చాను. ఆ పెద్దాయన చిన్నగా సైకిల్ దిగి , ఆ పిల్లవాడి దగ్గరున్న చేతి కర్ర, తన చేతిలోకి తీస్కొని, నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు. నా దగ్గరకొచ్చి ఆయన ఏదో చెప్పాలని ప్రయత్నించాడు కానీ, మాట స్పష్టం గా రావట్లేదు. ఆయన నోరు ఒక పక్కకి తిరిగి పొయ్యి వుంది. ఎడమ చెయ్యి, ఎడం కాలు కూడా, పూర్తిగా స్వాధీనం లో ఉన్నట్టు లేదు.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jun 16, 202010 min

ఆధునిక తెలుగు సాహిత్యంలో ట్రావెలాగ్!

ఆధునిక తెలుగు సాహిత్యం లో అన్ని ప్రక్రియలకంటే ముందు వచ్చినది యాత్రా సాహిత్యమే. ఆత్మకథ లేక స్వీయ చరిత్రను ఆంగ్లములో మొదటగా వ్రాసిన తెలుగువారు శ్రీ వెన్నెలకంటి సుబ్బారావు గారు. వారి జీవ యాత్రా చరిత్రలో భాగం గానే వారి కాశీ యాత్రను గురించి వ్రాశారు. దాదాపు అదే దశాబ్దం లోనే వారి బంధువైన, శ్రీ ఏనుగుల వీరాస్వామి గారు తన కాశీ యాత్ర చరిత్రను లేఖలు రూపంలో తన చెన్నపట్నం స్నేహితులైన శ్రీ కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై కు తెలిపారు. ఇరవయ్యవ శతాబ్దపు మొదటి పాతికేళ్లలో, తెలుగునాట అక్షరాస్యత చాలా తక్కువైనప్పటికీ, సామాన్య ప్రజానీకాన్ని కూడా ఆనంద డోలికలలో ఊగించిన పుస్తకములుగా ప్రముఖమైనవి ---- చిలకమర్తివారి "గణపతి", ముని మాణిక్యం వారి "కాంతం", మొక్కపాటివారి "బారిష్టర్ పార్వతీశం" మరియు మధిర సుబ్బన్న దీక్షితుల గారి "కాశీమజిలీ కథలు". "గణపతి", "కాంతం" కేవలం హాస్యరస స్ఫోరకములు. హాస్యముతోపాటు యాత్ర విశేషాల వివరణాత్మక చిత్రీకరణలకు, జనప్రియమూ అయిన ట్రావెలాగ్ గా మన మొక్కపాటివారి బారిష్టర్ పార్వతీశం ప్రసిద్ధి కెక్కింది. (మొక్కపాటి వారి అబ్బాయి కూడా త్వరలో శతాయుష్కుడు కాబోతున్నాడు) ఒక వ్యక్తి ఆహార్యం, ఆంగికము (చేతులూపటము, కనుబొమ్మలు ఎగర వెయ్యటం వగైరా) వాచ్యము ద్వారానో, సన్నివేశపరంగా - చర్య, ప్రతి చర్య వలనో హాస్యం సృష్టింప బడుతుంది. పొరపాటు, మరో పొరపాటు, ఆపైన మరోదానికి మూలమై, ఒకదాని తర్వాత ఇంకొకటి సంభవిస్తుంది. పార్వతీశం పాత్ర, సంభవతః మూర్ఖుడు కాదు, పరిస్థితులచే వెక్కిరింపబడుతాడు. ఆ పాత్ర ఎదుర్కున్న సంఘటనల్ని మనము కూడా మన జీవితాలలో ఎప్పుడో ఎదుర్కొని ఉన్నట్టు అనిపిస్తుంది. అట్టి సందర్భాల సమాహారం ఈ మన "బారిష్టర్ పార్వతీశం". అయితే ఈ పుస్తకము హాస్యానికే పరిమితమైనది అని అనుకుంటే పొరపాటు . ఇది ఒక యాత్రా చరిత్ర కూడానూ. అది ఎలా అంటే, గోదావరి, సముద్రంలో కలిసే ప్రదేశానికి పడమటి దిక్కున వున్న మొగల్తూరు గ్రామవాసి మన నాయకుడు పార్వతీశం. అతడక్కడే టేలర్ ఉన్నత పాఠశాలలో ఒక సంవత్సరమే చదవ వలసిన అయిదవ ఫారం రెండు సంవత్సరములు చదివి, ఇక చాలు అనుకోని, అప్పటి పాలితుల రాజధాని అయిన లండన్ వెళ్లి బారిష్టర్ కావాలి అనుకొని, అక్కడికి బయలుదేరటంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ రోజులలో భారత దేశంలో న్యాయశాస్త్రం చదివితే వకీలు అనేవారు, అదే బ్రిటన్ లోని లండన్ లేక ఎడింబరో లో న్యాయశాస్త్రం చదివితే బారిష్టర్ అనేవారు. బారిష్టర్ కి హోదా మరియు రాబడి ఎక్కువ కూడాను. అతని అసందర్భపు ప్రలాపాలు, చర్యలు, ప్రతి చర్యలు, సంకల్పితాలు, అసంకల్పితాలు నవ్వు పుట్టిస్తాయి. మనల్ని ఆనందింపజేస్తూ, తాను ఆనందిస్తూ భారత దేశము నుండి ఆంగ్లదేశానికి తీసుకెడతాడు మన హీరో పార్వతీశం. పార్వతీశం ఒక కల్పిత పాత్ర అయినప్పటికీ, ఆ పాత్ర మూలాలు సృష్టికర్త మొక్కపాటి వారివి. మొక్కపాటివారు కూడా మొగల్తూరు నుండి ఎడింబరో వెళ్లి వ్యవసాయ శాస్త్రం చదివి వచ్చారు. వారి మీద, వారి స్నేహితుల ప్రోత్సాహం మీద పార్వతీశం పుట్టుక, ఎదుగుదల వగైరాల మీద మొత్తము మూడు భాగాలుగా ప్రస్తుతం అందుబాటులోకి తీసుకు వచ్చారు. 1924 సంవత్సరములో ఆయన మొదటి భాగం మాత్రమే వ్రాశారు. అదే పునః ప్రచురణ 1937 మరియు 1952 లలో అచ్చు అయినది. కానీ నలభై ఆరు సంవత్సరముల తర్వాత 1970 -71 సంవత్సరములో మొక్కపాటివారు రెండవ, మూడవ భాగములు వ్రాసి "తన పార్వతీశం" మీద ఆయనకున్న వున్న ఎనలేని మక్కువను మనకి చూపించారు. కానీ బహుజనాభిప్రాయం ఏమిటంటే - మొదట భాగపు స్పిరిట్ రెండవ మరియు మూడవ భాగాలలో లేదు. కానీ ఆ అభిప్రాయంతThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jun 13, 20204 min

సన్నిధానం!

ఇన్ని రకాల జనాలు, వీళ్ళందరూ ఎందుకొచ్చారో అనుకున్నా చుట్టూ చూస్తూ. లాల్చీ పైజామాలు, పంచెలు, చీరలు, పంజాబీ డ్రెస్సులలో రక రకాల వయస్సుల వాళ్ళు. ముందు వరుసలో అప్పుడే పెళ్లి అయిన ఓ జంట పసుపు బట్టలలో కూర్చోనున్నారు. క్యూ కాంప్లెక్స్ నుండి మసక మసకగా కనపడుతుంది బంగారు గోపురం. వేకువ ఝాము ఐదున్నర అవుతుంది. డిసెంబర్ నెల, మంచు కురుస్తుంది బయట. అప్పుడు నేను బెంగుళూరు లో ఉండేవాడిని. ముందురోజు తిరుపతొచ్చి ఫ్రెండ్ ని కల్సి దర్శనం చేసుకుందామని కొండకి వచ్చాను. ఆ ముందు వారం రాసిన సెమిస్టరు ఎండ్ ఎగ్జామ్స్ లో ఓ పేపర్ అంత గొప్పగా రాయలేదు . ఆ పేపర్ లో గ్రేడ్ బెటర్ గా రావాలని కోరుకోడం నా యాత్ర ఉద్దేశ్యం. "బాగా చలిగా వుంది కదా" అన్నాడతను. పక్క కుర్చీలో కూర్చోనున్నాడు, ఓ నలభై ఏళ్ళు ఉండవచ్చు. "జనవరిలో ఇంకా ఎక్కువవుతుంది" అని షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పాను నేను, "నా పేరు వెంకట రమణ. బెంగుళూరు నుంచి వచ్చాను అనిచెప్పి. మాది రామనాధ పురం, తమిళనాడులో, ఎల్&టి ప్రాజెక్ట్స్ లో పని చేస్తూ వుంటాను. "నాలుగేళ్ల నుండి రాజమండ్రి దగ్గర ఓ డైరీ ప్రాసెసింగ్ యూనిట్ కమిషనింగ్ చేస్తున్నాను" అన్నాడు అతను. నేనేమీ అడక్కుండానే అతనే వివరాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ గుల్బర్గా దగ్గర, "చాలా మారుమూల ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుంది ప్రాజెక్ట్స్ లో పనిచేయటం అంటే. అట్లాంటి చోట్లకి ఫ్యామిలీ ని తీసుకెళ్ళలేము.అందుకే వాళ్లను చెన్నై లో వుంచి నేను తిరుగుతూ వుంటాను. ఒంటరిగా వుండటం వలన అన్ని రకాల అలవాటులతో చెలరేగి పోతూ వుంటాము. డబ్బులు బాగానే వస్తాయి. జీతం కాకుండా రోజుకి అవుట్ స్టేషన్ అలవెన్సు అని ఓ అయిదు వేలు ఇస్తారు కూడా. రోజు మందు ముక్క లేనిదే బండి నడవదు" అని. ఇలాటి సకల గుణ సంపన్నుడికి ఇక్కడ ఏమి పనబ్బా అని మనసులో అనుకున్నా. కొనసాగిస్తూ చెప్పాడతను, "రాజమండ్రి వెళ్లిన రెండు నెలలలోనే చంద్రకళతో పరిచయం అయ్యింది. వారానికి మూడు రోజులు భోజనం తన యింటిలోనే. నేను పరిచయం అయ్యాక వేరే వాళ్ళని దగ్గరకు రానిచ్చేది కాదు. తనలాటి వాళ్ళతో పరిచయాలు నాకు కొత్తేమి కాదు. కానీ తను ప్రత్యేకం. ఒకపక్క యీ పనులు చేస్తూనే రెండవ పక్క పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు. ఉన్నఒక్కగానొక్క కూతురుని వైజాగ్లో ఉంచి చదివిస్తూ, తనే అప్పుడప్పడూ వెళ్లి చూసి వస్తుండేది. ఎప్పుడైనా తన పూజల గురించి నేను ఎగతాళిగా మాట్లాడితే, తను నవ్వుతూ చెప్పేది, మీరు ఉద్యోగం చేస్తూ సమయం దొరికితే ఇటువంటి పనులు చేస్తున్నారు, మరి నేను నా ఉద్యోగం చేస్తూ, సమయం దొరికితే పూజలు చేసుకుంటున్నాను అని." మరిప్పుడు మీకు బదిలీ అయ్యింది కదా, ఆవిడ సంగతి ఏమిటి అని అడిగా. "నా పాటికి నేను, ఆవిడ పాటికి ఆవిడ". అన్నాడతను ఆర్థోక్తి గా. నేను బదిలీఈ అయి వస్తుంటే చంద్రకళ చెప్పింది, "నేను కూడా యీపని మానేస్తున్నాను. పిల్లకి చదువు అయ్యిపోయింది. నేను దాని తల్లిననే విషయం అమ్మాయి కి తెలీదు. తనో అనాధను అని అనుకుంటుంది. మీరే ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే తన జీవితం సెటిల్ అయిపోతుంది. నేను కోయంబత్తూరు లోని మా గురువు గారి ఆశ్రమం లో చేరి నా మిగిలిన జీవితాన్ని గడిపేస్తాను" అని. మరి మీరేమి చెప్పారు అని అడిగా ఆసక్తిగా. "మన ముందు వరుసలో పెళ్లి బట్టల్లో ఉన్న అమ్మాయే చంద్రకళ కూతురు. విజయవాడ లో ఓ స్కూల్ టీచర్ గా పని చేసే అబ్బాయిని చూసి, కొండ మీద నిన్ననే పెళ్లి జరిపించాను, వాళ్ళ వివాహ జీవితం బాగుండాలని కోరుకుందామని దర్శనానికి తీసుకొచ్చాను" అన్నాడతను. మీరేమనుకోకుంటే నాదో ప్రశ్న అన్నాను నేను సందేహం గా. అడగండి అన్నాడతను తాపీగా వెనక్కి వాలుతూ. మీ వ్యక్తి గత విషయాలు నాకెందుకు చెబుతున్నారు మీరు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jun 11, 20204 min

మా నెల్లూరోళ్ల కథలు కంచికి చేరవబ్బా!

ఓడమ్మా భడవా ఐదు నిమిషాల్లో నెల్లూరుని కళ్ళకు కట్టినట్టు విన్పించావు కదరా సామి, అన్నారు మా నెల్లూరోళ్లు వాళ్ళ కథవిని. కొందరైతే నేను ఏమేమి కవర్ చేయలేదో వాటిల్ని అన్నిటిని రాసి పంపించారు, అబ్బయ్య అసలు నీవు ఈటిల్ని ఎట్టా మర్చిపోయినావు అని. సో బాహుబలి పార్ట్ 2 మాదిరి మన నెల్లూరోళ్లు పార్ట్ 2 తయారు చేశా. మొదలుగా గుర్తు చేసుకోవాల్సింది కమ్యూనిజంకి అసలు సిసలు అర్థం చెప్పి జనాల సేవే, జనార్థన సేవ అనుకొని మనకి సేవలు చేసిన రామచంద్రా రెడ్డి ఆసుపత్రి మన నెల్లూరికే కాదు రాష్ట్రానికే గర్వకారణం. అట్టానే జమీన్ రైతు, గురించి గూడ చెప్పాల. ప్రపంచంలో ఎక్కడున్నా వారం వారం ఇంటికి తెప్పిచ్చుకోని జమీన్ రైతు చదివేవాళ్ళు, పోస్ట్ లో ఆ వారం మిస్ అయితే అన్నం మానేసే నెల్లూరోళ్లు నాకు తెల్సు. ఇప్పుడంటే ఆన్లైన్ ఎడిషన్ వచ్చిపారేసిందనుకో. మేము వి.ఆర్ కాలేజీకి వచ్చేపాటికి లాయర్ గూడ బాగా పాపులర్ అయ్యింది. ఇంకా ఈ రెండు పేపరోళ్ళు మన సబ్స్క్రిప్షన్ అయ్యిపోయినా ఆపకుండా ఇంటింకి పంపిస్తారు మన ఊరోళ్ళే కదా అని. వాళ్ళ పేపర్లు నష్టాల్లో వున్నా అట్టా చెయ్యడం వాళ్ళకే చెల్లింది. అట్టా ఉంటాయి మావోళ్ల అభిమానాలు. మదీనా వాచ్ కంపెనీలో దొరికే హెచ్.ఎం.టి వాచ్ ల గురించి, నెల్లూరులో వీధినపడి రిక్షాలో తిరుగుతూ ఆడ మగ గొంతులు రెండు ఆయనే మాట్లడుతూ, ప్రచారం చేసే మనిషి, నాకు మా చిన్నప్పుడు ఓ ప్రపంచ వింత. ఆలాగే నేను పాంటు కుట్టించుకోవటం, నా ఇంటర్మీడియట్ లో సంతపేట లోని సుధా టైలర్స్ తో మొదలుపెట్టా, కొంచెం స్టైల్ పెరిగాక, వెంకట్ రామ అండ్ కో కి - అర్చన రెండో గేట్ కి మజ్జలో వుండే, కాపిటల్ టైలర్స్ కి మార్చా. ఇంకొంచెం కిలాడీ వేషాలు పెరిగాక ట్రంక్ రోడ్ లోన రీగల్ టైలర్స్ కి ఆటుమాయిన ఫిట్ టైలర్స్ కి మారింది. మోడరన్ స్టోర్స్ లో గుడ్డ కొనటం ఆడ్నించి నేరుగా టైలర్ షాప్ కి వెళ్ళటం. ఆస్థాన వైద్యుల మాదిరి ఆస్థాన టైలర్స్ వుండే వాళ్ళు మనకి ఆరోజుల్లో, కానీ ఇప్పుడు అంత రెడీ మేడ్ మేళం, ఆ హ్యూమన్ టచ్ పొయ్యిందబ్బా. గుడ్డలంటే గుర్తుకొచ్చింది మా సమయంలో బొంబాయి పాలస్, రాయవరపు శంకరయ్య అండ్ సన్స్, బెనారస్ హాల్, అమాయిన మా అమ్మ అక్కలు గంటలు గంటలు నన్ను కూర్చోబెట్టి, కొన్న చీరలకి మాచింగ్ బ్లౌజ్ లు కొనే కలర్ కాంప్లెక్స్. మన ఖాదీ అని ఖాదీ భండారుకి కూడా ఎక్కువ వెళ్లే టోల్లం. దానికి ఎదురుంగా వుండే సిటీ మెడికల్స్ అప్పట్లో చాలా ప్రసిద్ధి, అలాగే నాలుగడుగులు వేస్తే వచ్చే బాబా స్పోర్ట్స్, మా బాడ్మింటన్ బ్యాట్స్ గెట్స్ తో అల్లి వచ్చేవి కాదు అప్పట్లో, బాట్ కొని గెట్స్ అల్లించుకొనేవాళ్ళము ఓపికగా. ఇంకా కో-ఆపరేటివ్ బ్యాంకు కి చుట్టూ వుండే మన సండే మార్కెట్ లో అప్పట్లో దొరకని వస్తువు ఉండేది కాదు. మేము ఇంజనీరింగ్ లోకి రాంగానే మొదట కొన్న కాసియో ఎఫ్ ఎక్స్ 100 కాలిక్యులేటర్ మన శ్రీ రామా కి ఎదురు మిద్దె మీద వుండే, అప్పట్లో మేము ముచ్చట గా చెప్పుకొనే, స్మగుల్డ్ గూడ్స్ షాప్ లో. నేను ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ఉండంగా అనుకుంటా, రాజీవ్ గాంధీ పోయాడని కొంత మంది తుంపుల మారోళ్ళు, సండే మార్కెట్ లోని షాప్స్ ని తగల పెట్టటం బాగా బాధ పెట్టె విషయం. అట్టాగే చిన్నప్పుడు మద్రాసులో తెలుగు సినిమాలు తీసే రోజుల్లో , మొదటాటకి మద్రాస్ నించి చూడ్డానికి సినిమా వాళ్లంతా వచ్చేటోళ్లు , మన వూరికి హిట్టా ఫట్టా తేల్చుకోడానికి. అంటే మన నెల్లూరోళ్లే చెప్పాలి, మొదటాట చూసి ఆ సినిమా విషయం ఏందో. ఆకాడికొస్తే అసలు చిరంజీవిని మెగాస్టార్ చేసిందే మనం. ఎవరో గుర్తు చేశారు ఏమబ్బా హర్షా! నువ్వు ఆమె రాత్రులు లాటి మళయాళ సినిమాలు చూడలేదా, మనూర్లో అవెక్కడ ఆడతాయో మర్చిపోయినట్టు రాయకుండా పెద్ద మంచోడిలా పోజ్ కొడుతున్నవే అన్నారు. నేను అసలు సిసలు నెల్లూరోడిని సామీ, ఆ వెంకటేశ్వర హాల్ వైభవాన్ని ఎలా మరిచిపోతాను. మా అనీల్గాడు వాళ్ళకి ఆ హాలోళ్లు తెల్సు గాబట్టి, ఎప్పుడెళ్ళిన, మా ఇద్దరికThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jun 10, 20208 min

మా జి.వి.ఎస్ మాస్టారు గారు!

జి.వి.ఎస్ మాస్టారు గారు ఒంగోలు P.V.R.మునిసిపల్ హై స్కూల్ లో నా టీచర్. పూర్తి పేరు గాలి వెంకట సుబ్బారావు గారు. ఆరడుగుల మనిషి, స్ఫురద్రూపి, లెక్కలు  మరియు సైన్స్ అయన స్పెషాలిటీ. ఇదికాక ఆయన అద్భుతమైన వక్త,  విషయం ఏదైనా తెలుగు లో చాలా అందంగా, అనర్గళంగా మాట్లాడగలరు. నాకున్న తెలుగు తెగులు ఆయన నుంచే తగులుకుంది అని నా అనుమానం. బడిలో విన్నది చాలక ఆయన గొంతు విందామని ఆయన దగ్గరకి ట్యూషన్ కూడా వెళ్ళేవాడిని. మొదటి నుండి ఆయనకు నేనంటే ఎందుకో ప్రత్యేకమైన అభిమానం. ఏరా, అబ్బాయి అంటూ ప్రేమగా పలకరించే వారు. ఒకసారి మా బడిలో వక్తృత్వం పోటీలు జరుగుతున్నాయి. నలుగురు జడ్జీలలో జి.వి.ఎస్ మాష్టారు గారు ఒకరు. నేను గది బయట వేచివుండగా చూసి, "ఏరా, నువ్వు కూడా పోటీ లో ఉన్నావా?" అని అడిగారు, అవునండి అన్నాను నేను. నా వంతు వచ్చేసరికి ఆయన ఆ పోటీలు జరిగే ప్రదేశంలో కనపడలా నాకు.  పోటీ అంతా అయిపోయాక టీచర్ల గదికి వెళ్లిన నాకు, ఆయన కాలు మీద కాలు వేసుకొని, బ్లిట్జ్ పేపర్ చదువుకుంటూ కనపడ్డారు. నేను రావటం గమనించి, ఆయన తల పైకెత్తి, కళ్ళద్దాల్లోంచి చూస్తూ, "ఏరా అబ్బాయీ బాగా చేశావా?" అని అడిగారు. ప్రధమ బహుమతి వచ్చిందండి అని చెప్పా, తల ఎగరేసి కాస్త ఉక్రోషంగా. ఆయన చిన్నగా నవ్వేసి, "నా ప్రశ్నకి సమాధానం అది కాదురా" అని అన్నాడు. కోపంగా వెను తిరిగిన నాకు వెనకనుండి , "చూడరా అబ్బాయీ, నీకు బహుమతి వస్తుందని నాకు తెలుసు. నేను అక్కడ వుండి వుంటే, నువ్వు ఎలా మాటలాడిన, నీకు ఎక్కువ మార్కులు వేసేవాడిని. అది ఇష్టం లేకే వచ్చేసాను" అని చెప్పటం వినిపించింది. ఇక్కడ ముళ్ళపూడి వారు చెప్పినట్టు ఓ చిన్న కోతి కొమ్మొచ్చి. మా ప్రశాంత్ గాడు, ఆ మధ్య ఏదో సందర్భములో మాటలాడుతూ, చాల స్టైల్ గా ఆంగ్లములో, "దేర్ ఈజ్ నో మీనింగ్ అఫ్ ఫ్రెండ్షిప్, ఇఫ్ దేర్ ఈజ్ నో ప్రిజుడిస్" అన్నాడు.  ఇది ఇక్కడ ఎందుకు చెబితున్నాను అంటే నా పట్ల ఆయన ప్రిజుడిస్ కి కారణం ఆయన పెంచుకున్న అభిమానం. పదవ తరగతిలో జరిగిన వార్షికోత్సవంలో నాకు చాల బహుమతులు వచ్చాయి. వాళ్ళ బంధువులలో ఒకాయనకు నన్ను పరిచయం చేస్తూ చెప్పారు ఆయన, "ఈ సారి పదవ తరగతిలో మా బడికి మొదటిస్థానం కూడా మనోడిదే" అంటూ. చిన్నప్పటినుండి తెలుగు అంటే ఎంత ఇష్టమో, హిందీ అంటే అంత చిరాకుగా ఉండేది నాకు. అదేదో సినిమాలో బ్రహ్మానందం, "ఆవిడని  ప్రేమించాల్సి వచ్చింది" అని చెప్పినట్టు, ఇప్పుడు నాకు నార్త్ కి వెళ్ళినప్పుడు తప్పనిసరియై హిందీ మాట్లాడాల్సి వస్తుంది, భాష అంటే ప్రేమ ఎక్కువై కాదు, వాళ్ళు ఆంగ్లము మాటలాడితే భరించలేక. పదవ తరగతి సంవత్సరాంతపు పరీక్షలలో హిందీ పరీక్షకు ముందు, మాకు మూడు రోజులు శెలవులు వచ్చాయి. అన్నీ సబ్జెక్ట్స్ ని ఒకటికి పది సార్లు చదివి, రివిషన్ చేసుకొనే అలవాటు వున్న నేను, హిందీని మాత్రం పూర్తిగా వదిలేశా. ఆ మూడు రోజులలో పరీక్ష మీద ఆందోళన మొదలయ్యింది, సరిగా చదవ లేక పోయా, రాయ లేక పోయా. ఒకటో స్థానం కాదు కదా, రెండు నుండి కూడా జారిపోయి, మూడవ స్థానానికి పడిపోయా నేను. పదిహేను  మార్కుల తేడా నాకు మరియు మొదటి స్థానం వచ్చిన వాడికి. ఈ లోపల మా నాన్నకి నంధ్యాలకి బదిలీ అయ్యింది. వెర్రి మొహమేసుకొని వెళ్ళాను ఆయన్ని కలవడానికి. "ఏరా! ఎందుకిలా అయ్యింది" అన్నారు ఆయన నా భుజం మీద చేయి వేస్తూ. విషయం వివరించాను ఆయనకు. "చూడరా అబ్బాయీ! పని ముఖ్యం అనుకుంటే, ముహుర్తాలు చూడకూడదురా. ముందే పూర్తి చేసేసుకోవాలి" అన్నారు. వచ్చేస్తూ చెప్పాను ఆయనకు, "మరల బాగా పైకి వచ్చాక వచ్చి కనపడతాను అండి" అని. నా పైకో లేక మీదకో రావొద్దురా, బాగా ప్రయోజకుడివై రారా అని దీవించి పంపారు. ఆ తర్వాత కళాశాల, ఉద్యోగం, పెళ్లి అన్నీ జరిగిపోయాయి కొన్ని నా ప్రమేయంతో కొన్ని అప్రమేయంగానే. ప్రయోజకుడయ్యానో లేదో అనే అనుమానం వున్నా, వెళ్లి ఆయన్ని కలిస్తే బాగుండు  అని చాల సార్లు అనిపించేది. పది దేశాలు, పదహారు రాష్ట్రాలు తిరిగినా, ఆయన్ను కలవడానికి సమయం దొరకలేదు నాకు ఎప్పుడు. సంవత్సరం క్రిందట, ఇన్స్టిట్యూట్ పని మీద ఒంగోలు వెళ్ళాను. అక్కడ వాకబు చేయగా, రాత్రి ఎనిమిది లేక ఎనిమిదిన్నర మధ్యలో సాయి బాబా గుడికి వచ్చి మంచి ఉపన్యాసాలు ఇస్తుంటారు అని ఎవరో చెప్పారు. ఆ సThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jun 7, 20206 min

మా ఇంట్లో ప్రజాస్వామ్యం పని చేయలేదు!

చేతిలో ఓ పది రూపాయలు ఆడినప్పుడు, మా అమ్మ అడిగేది మా ముగ్గురిని, ఈ రోజు ఏమన్నా తింటానికి చేసుకుందాం, మీ ఇష్టప్రకారం ఏమి చేయాలో మీరే తేల్చుకోండి అని. వెంటనే మా అన్న, "నాకు గులాబీ జామున్ కావాలి", అనే వాడు.  మా అక్క పాపం కొంచెం తక్కువ ఆశ కలది అయ్యి, "నాకు మినప వడలు మరియు పులుసు అన్నం కావాలి", అనే కోరిక వెలి బుచ్చెడిది. మరి నేను తక్కువ తిన్నానా, "ఊహు! నాకు  ఖచ్చితం గా సుకీ లు కావాలి" అనే వాడిని. మా అమ్మ సర్ది చెప్ప బోయెడిది, పోనీ లేరా వాడు ఇంటికి పెద్ద వాడు ఈసారికి వాడు అడిగినట్టే చేద్దాము అని, దానికి నేను మా అక్క ససేమిరా అంటే ససేమిరా అనే వాళ్ళము మా వాదన మేము కొనసాగించే వారము. మరికొంత సమయమయ్యాక, మా అమ్మ తన సెంటిమెంట్ తో, పోనీలెండిరా ఆడపిల్ల, అది మన ఇంట్లో ఉన్నంత కాలమే బాగుండేది, ఆ తర్వాత దాని కోరికలు తీరుతాయో లేదో అని మా అక్కవైపు మొగ్గు చూపేది. దానికి నేను మా అన్న మేము చస్తే ఒప్పుకోము అనే వాళ్ళము. వాదనలు ప్రతి వాదనలు జరిగిపోయేవి, ఎవరికీ వారమే పోయిన సారి ఇతరుల కోసం మేము ఒక్కొక్కరం ఎంత త్యాగాలు చేసి నష్టపోయేమో చెప్పుకొని వాదించుకునే వారము. మరికొంత సమయమయ్యాక మా అమ్మ నా వైపు మొగ్గేది, పొనీలేరా వాడు చిన్న వాడు మీకందరికంటే, నాకు చేదోడు వాదోడు వాడే, అంగడికి వెళ్ళేది వాడే, రేషన్ షాప్ కి వెళ్ళేది వాడే, మీరు తినే దోశె లకు పిండి మర ఆడించుకొచ్చేది వాడే అని. వాళ్లిద్దరూ నీకు వాడంటేనే ఇష్టం అందుకే వాడికి వత్తాసు అని ఆవిడ మీదకే యుద్ధానికి వెళ్లే వాళ్ళు. ఇలా కొంత సమయమయ్యాక, అప్పటి వరకు నోర్లతోనే సరిపెట్టుకున్న మాకు ఒకరి మీదకు ఒకరి చేతులు ఆడటం మొదలు పెట్టేవి. ఇక ఓపిక నశించిన మా అమ్మ మా ముగ్గురుని తలా ఒకటి బాది, మిమ్మల్ని అడగటం నాదే బుద్ధి తక్కువ. సగ్గు బియ్యం తో పాయసం చేస్తా ఇష్టమున్నోడు తినండి, కష్టమున్నోడు మాడండి అని ఆ పాయసం కాసి  పోసేది. నాకు అప్పుడు ఒక ప్రశ్న ఉదయించేది కుటుంబమనే ప్రజాస్వామ్యంలో ఏకాభిప్రాయం అసలుకే కుదరదా అని, నియంతృత్వమే సమాధానమా అని. లేక మా అమ్మ ముందే సగ్గు బియ్యం తో పాయసం చేయడానికే నిర్ణయించేసి, ఏకాభిప్రాయం పేరుతో మాకు ఎక్సపెక్టషన్ సెట్ చేసిందా అని. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jun 6, 20202 min

ఇసుకే బంగారమాయెనా !

మనకి రామాయణ మహాభారత కథలు చెబుతూ మన పెద్దలు కొన్ని పిట్ట కథలు చెప్పేవారు. ఈ పిట్ట కథలు చాలా వరకు గ్రంధస్తం అవ్వవు మరియు ఇవి చాలా వరకు ప్రాదేశికాలు (లోకలైజ్డ్ అని నా ఉద్దేశ్యం). మా తెలుగు అయ్యవారు చెప్పిన చాలా పిట్ట కథల్లో నాకు చాలా ఇష్టమైన కథ ఇది. యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేసి అనంత మైన సంపదను ప్రోగు చేసుకున్న తర్వాత ఆయనకీ ఒక ఆలోచన వచ్చిందట. వెంటనే బావ శ్రీకృష్ణుడు తో పంచుకున్నాడట, 'కృష్ణా !, నేను మరియు నా తమ్ములం సకల రాజులను జయించాము, ఇంత సంపదను పోగేసాం, మేము ఒక సూతుడు మరియు ఒక సామంత రాజు అయిన, ఆ కర్ణుడి పాటి దానధర్మాలు చేయలేమా' అని. కృష్ణునికి అర్థమయ్యిందట సంపద ధర్మరాజు సహజ గుణాన్ని ఎలా నాశనం చేయబోతుందో అని, దాన్ని మొగ్గలోనే త్రుంచి వెయ్యాలని. "సరే, ధర్మజా!, నువ్వున్నూ మరియు నీ నలువురు తమ్ముళ్ళున్ను తదుపరి రోజు సూర్యోదయమవగానే సముద్రపు ఒడ్డుకు వచ్చేయండి, అక్కడ మీకు ఒక పరీక్ష పెడతాను అని పలికాడు. తదుపరి రోజున సూర్యోదయం అయిన పిదప ఐదుగురన్నదమ్ములు, కృష్ణుడు చెప్పిన సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. శ్రీకృష్ణుడు వెంటనే ఆ సముద్రపు ఒడ్డున వున్న ప్రతి ఇసుక రేణువును బంగారపు రేణువుగా మార్చి, పిదప పాండవులను సూర్యాస్తమయము అయ్యేలోపుల ఆ బంగారాన్నంతటిని దానం చేసెయ్యమని కోరాడు. ఇక ఆ ఐదుగురు అన్నదమ్ములు, తలా ఒక కొలపాత్ర తీసుకొని జనులకు బంగారాన్ని కొలవటం ప్రారంభించారు. కొలుస్తున్నారు, కొలుస్తున్నారు కానీ ఎంతటికీ ఆ బంగారం తరగటం లేదు. సూర్యాస్తమయం కావొస్తుంది. వీళ్ళేమో కొలిచి కొలిచి శోష వచ్చి పడిపోయేలా వున్నారు. కృష్ణుడు చెప్పాడు, ఇక మీవల్ల కాదు కర్ణుడిని పిలవనా అని. అంతటి నీరసం లో కూడా ఆ ఐదుగురు నవ్వారు, చూద్దాం మేము ఐదుగురం కలిసి చేయలేనిది తాను ఒక్కడే అదీ సూర్యాస్తమయం ఇంకొద్ది సమయములో ముగియనుండగా అని. శ్రీకృష్ణుడి పిలుపునందుకొని, "ఏమిటి వాసుదేవా నీ ఆజ్ఞ" అంటూ వచ్చాడు కర్ణుడు. కర్ణా !, ఈ బంగారు రేణువులుగా మార్చబడ్డ ఇసుక రేణువులనంతటినీ నువ్వు దానమివ్వగలవా, ఇవ్వగలను అనుకుంటే వెంటనే పని ప్రారంభించమని ఆజ్ఞాపించాడు. వెంటనే కర్ణుడు అక్కడ గుమిగూడిన జనులను పిలిచి, కను చూపు మేరలో వున్న ప్రదేశాన్నంతా వేరు వేరు భాగాలుగా విభజించి, ఒక్కో భాగాన్ని ఒక్కొక్కడికిచ్చేసాడు. ఇదంతా కళ్ళముందే లిప్తకాలంలో జరిగిపోయింది. అన్నదమ్ములు కొయ్యబారి పోయారు. అప్పుడు కృష్ణుడు నవ్వి , 'ధర్మజా ! దానం చేయటానికి సంపదకూ సంబంధం లేదు అది ఒక కళ. అది సహజంగా అబ్బినవాడే చేయగలడు' అని సెలవిచ్చాడు.కానీ వాళ్లెవరి ఊహకందనిది ఏమిటంటే కలియుగంలో, నిజంగా ఇసకే బంగామవుతుందని, దాన్ని ప్రదేశాల వారీగా విభజించి పంచేసుకోవటం ఎలా అని సోదాహరణంగా అక్కడ వున్న జనులకు చూపించామని, అలా చూసిన జనులే కలియుగంలో ఇసుకాసుర అవతారమెత్తారని. ఈ ఇసుకాసురులు గురించి మా అయ్యోరు కూడా చెప్పలా నాకు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jun 3, 20202 min

ప్రపంచ సాహిత్యంలో ట్రావెలాగ్!

ప్రాచ్య భారత దేశానికి మహా ఇతిహాస జాతీయ కావ్యాలైన రామాయణ, భారత, భాగవతాలు ఎట్లో, ప్రాచీన పాశ్చాత్య సంస్కృతికి మూల స్తంభమైన గ్రీకు నాగరికతకు వారి  చరిత్రలు అయిన ఇలియడ్ మరియు ఒడిస్సీలు అలానే అని చెప్పవచ్చు. మనకు వాల్మీకి, వ్యాసుడు ఎట్లనో వారికి హోమర్ అట్ల. అంతే కాదు ఆయా ఇతిహాస కావ్యాలలో కూడా దేశ, కాలములు వేరు అయినప్పటికీ  కొన్ని పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ వచ్చిన తర్వాత మధ్యధరా సముద్ర ప్రాంతములో హోమర్ మహాకవి కృతమైన కావ్యాల సంఘటనలు జరిగినట్లు గా ఋజువులు లభించాయి. అట్లనే మన దేశము లో కూడా రామాయణ, భారత ఘటనల గూర్చి లెజెండ్స్ (తర తరాల నుండి నమ్మబడు గాధలు) వుండనే వున్నాయి. ఆయా గాధలను తులనాత్మక పరిశీలన చేసినప్పుడు, ఒక రాజు భార్యను మరొకరు అపహరించుకు పోవుట, భార్యను పోగొట్టుకున్న రాజు అటు పిమ్మట తన హిత, సన్నిహిత స్నేహితుల సహాయముతో ఆ అపహరించిన రాజుతో యుద్ధము చేసి, ఓడించి, సంహరించి, తన భార్యను తెచ్చుకొనుట అనేది  ఇతివృత్తముగా వున్నాయి. శ్రీమద్రామాయణంలో శ్రీరామచంద్రుని భార్యను రావణాసురుడు మోసముతో అపహరించి తీసుకొని పోతాడు. రాముడు వానర రాజు అయిన సుగ్రీవునితో స్నేహమొనరించి, అతని సైన్యము సహాయముతో లంకపై దాడి వెడలి, రావణుడిని జయించి, వధించి తన భార్యను వెనుకకు తెచ్చుకుంటాడు. అదే మాదిరిగా హోమర్ చే గానం చేయబడిన గ్రీకు కావ్యమైన ఇలియడ్ నందు, మెనలాస్ అనే రాజు భార్య అయిన హెలెన్ ను పారిస్ అనే రాకుమారుడు అపహరించుకు పోతాడు. కాకపోతే ఇక్కడ తేడా ఏమిటంటే అపహరించుకు పోవుట అన్నది హెలెన్ యిష్ట ప్రకారము జరిగినది. మెనలాస్ తన హిత మరియు సన్నిహిత రాజుల తోడ్పాటుతో ఆ ట్రాయ్ రాకుమారుడి పైన యుద్ధానికి వెళతాడు, జయిస్తాడు, వధిస్తాడు, ఆపై తన భార్య హెలెన్ ను తెచ్చుకుంటాడు. గమనించ దగ్గ విషయం ఏమిటంటే శ్రీమద్రామాయణం లోని యుద్ధ కాండము, మహా భారతములోని యుద్ధ పంచములతో పోల్చి చూసినప్పుడు ఇలియడ్ లోని ట్రోజన్ యుద్ధం ఏమాత్రం తక్కువ కాదు. శ్రీమద్రామాయణం, భారతములను ఇలియడ్ తో పోల్చినప్పుడు, కొన్ని గమనార్హమైన విషయములు మనకు తెలియవచ్చు: 1 . వాల్మీకం లవకుశులచే గానం చేయబడినది. హోమర్ కావ్యాలు అయినా  ఇలియడ్ మరియు "ది ఒడిస్సీ" అంధుడైన అతని చేతనే గానం చేయబడ్డాయి 2 . మహా భారతం లో ధృతరాష్ట్రునికి నూరుగురు పుత్రులు, అలాగే ట్రాయ్ రాజు అయిన ప్రియమ్ కు నూరుగురు పుత్రులు ౩. గాంధారి తన సుతుడైన సుయోధనుని ఆశీర్వదించ తలచి తన వద్దకు రమ్మనగా, శ్రీకృష్ణుని మాయోపాయము మరియు సుయోధనుని గ్రహపాటు వలన ఊరువులు బలహీనము అయినాయి మరియు మరణ కారకము అయినాయి. అలాగే గ్రీకు వీరుడు అయిన అకిలెస్ తల్లి తన కుమారుని మృత్యువు నుండి సంరక్షించుకోవాలనే ప్రయత్నంలో అతని ఎడమ కాలి మడమ మాత్రం తడపనందున అతని ప్రాణములు అక్కడే నిక్షిప్తమయ్యి ఉంటాయి. పారిస్ వేసిన ఈటె అచటనే గ్రుచ్చుకొని అకిలెస్ మరణానికి కారణమవుతుంది. పోలిక సుయోధనుడు గ్రహపాటుతో అయినా, ఈ అకిలెస్ మన మహా భారతం లో కర్ణుడి అంతటి వాడు. ఇక “ది ఒడిస్సీ” కావ్యానికి వస్తే ట్రోజన్ యుద్ధము అయ్యాక మెనలాస్, అతని స్నేహితులైన ఒడిస్సియస్ (ఉలిస్సెస్) మొదలగు వారు విజయోత్సాహముతో వారి వారి దేశాలకు గృహోన్ముఖులవుతారు. హోమేరియం అయిన "ది ఒడిస్సీ" అనబడు  ఉలిస్సెస్ చరిత్ర ప్రపంచ ట్రావెలాగ్ లలో ఒక స్థానం సంపాదించు కోవటమే కాక ఎన్నటికీ ఎంతో మందిని ఉత్సాహపరుస్తూ స్ఫూర్తివంతం చేస్తూ వుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఒడిస్సియస్ ట్రోజన్ యుద్ధానంతరం గృహోన్ముఖుడై తన ఇంటికి చేరుటకు పడ్డ కష్ట నష్ట వ్యయ ప్రయాసలే, ఈ “ది ఒడిస్సీ" అనబడే గొప్ప గ్రీకు ట్రావెలాగ్. ట్రోజన్ యుద్ధానికి వెళ్లిన భర్త ఉలిస్సెస్ ఏళ్ళు గడిచిన రానందున ఆయన భార్య మిగుల అందగత్తె అయిన పెనెలోప్ ఇరుగు పొరుగు రాజుల ఒత్తిడి వలన విసుగు చెంది తన ఎదిగిన కొడుకు అయిన తెలిమాకస్ ను భర్తను వెతుకుటకై పంపుతుంది. తన ద్వితీయ స్వయంవరాన్ని ప్రకటింప చేస్తుంది.   ఇది మన భారతంలోనిThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Jun 2, 20205 min

తెలుగులో ట్రావెలాగ్ సాహిత్యం!

అందరికి నమస్కారము. ఈ వేదిక ద్వారా నేను, తెలుగులో ట్రావెలాగ్ సాహిత్యం అనే శీర్షిక పేరుతో మూడు వ్యాసాలు మీకు అందించ దలచుకున్నాను. ట్రావెలాగ్ అంటే యాత్రావివరణము అని మనము తెనిగీకరించ వచ్చునేమో!. ఓ రచయిత ట్రావెలాగ్  ద్వారా తాను ప్రయాణించిన కొత్త ప్రదేశములు, ఆ ప్రదేశాలలో కొంత కాలము గడపటం వలన ప్రోదిచేసుకున్న అనుభవాలను పాఠకులకు తామే ఆ ప్రదేశాలలో సంచరించినంత అనుభూతిని అందిస్తాడు. ఓ ట్రావెలాగ్ రాసేటప్పుడు రచయిత మిగిలిన విషయాలతో పాటు, అప్పటి దేశ  కాలమాన పరిస్థితులు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కలిసిన వ్యక్తులు, వీటి ద్వారా ఆయన కొత్తగా నేర్చుకున్న విషయాలు కూడా పొందుపరచ గలిగితే అది పాఠకుడికి ఓ గొప్ప అనుభూతిని మిగుల్చుతుంది అనటం లో ఏమాత్రం సందేహం లేదు. ప్రపంచ సాహిత్యంలో మొదట యీ ట్రావెలాగ్ చేపట్టినది ఎవరు అన్న ప్రశ్న ఉదయిస్తే, నాకు మాత్రం ఆదికవి వాల్మీకి అనే స్ఫురిస్తుంది. ఆయన రచించిన మద్రామాయణం ఆది కావ్యం అంటారు మన పెద్దలు, కానీ నేను మాత్రం అది మన మొదటి ట్రావెలాగ్ కూడా అని అంటాను రామాయణం అంటే రాముడు నడిచిన ఒక దారి అని అర్థం. నేనయితే రాముడు చేసిన ప్రయాణాన్ని రామాయణం అంటాను. మనం జాగ్రత్తగా గమనిస్తే బాలకాండలో రాముడు తన తండ్రి ఇవ్వలేక ఇవ్వలేక ఇచ్చిన అనుమతితో విశ్వామిత్రుని వెంట ఆయన ఆశ్రమానికి వెళ్ళటం, అటు పిమ్మట మిథిలకు ప్రయాణించటం, సీతను వివాహమాడి తిరిగి  అయోధ్యలో ప్రవేశించటం, మరలా పితృ వాక్య పరిపాలకుడై దండకారణ్యానికి వెళ్లి అక్కడ జీవనం గడపటం, పిమ్మట సీతాపహరణంతో వానరసేన సహాయం తీసుకొని నిర్మించిన వారధిని దాటి లంకకు పయనమవటం, అక్కడ రావణుడిని సంహరించి సీతాదేవి సమేతంగా అయోధ్యలో పునఃప్రవేశం చేయటంతో రామాయణం ముగుస్తుంది. ఇదంతా రాముడి ట్రావెలాగ్ అంటాను నేను. రామాయణం లో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్న సుందర కాండ కూడా హనుమంతుని సముద్రోల్లంఘనం, లంకలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, రాముని క్షేమ సమాచారాలు చెప్పి సీతమ్మకి ఆయన చెప్పిన సాంత్వన వచనాలు మరియు రాముని చెంతకు ఆయన తిరుగు ప్రయాణం అంతయు హనుమంతుని ట్రావెలాగ్ అని అనుకోకుండా ఉండగలమా. ఆ మాటకొస్తే ప్రతీ బయోగ్రఫీ ఒక మనిషి యీ భూమి మీద తాను చేసిన ప్రయాణం తాలూకు ట్రావెలాగ్ అని చెప్పవచ్చు. మన తెలుగు సాహిత్యం లో ట్రావెలాగ్ అనే అంశం మీద మనం అవలోకనం చేసుకుంటే పంతొమ్మిదవ శతాబ్దం లో శ్రీ ఏనుగుల వీరాస్వామి గారు గ్రంధస్థం చేసిన కాశీయాత్ర చరిత్ర మన మొదట ట్రావెలాగ్ గా చెప్పబడుతుంది. రెండువందల ఏళ్ల క్రితం, కనీస ప్రయాణ సౌకర్యాలు లేని ఆ రోజులలో మద్రాసు నుండి కాశీ దాకా వెళ్లి వచ్చిన ఆయన యాత్రానుభవమే యీ కాశీయాత్ర చరిత్ర. ఈ రోజుకు కూడా తెలుగు ట్రావెలాగ్ సాహిత్యంలో కాశీయాత్ర చరిత్ర ఒక నిర్వచనీయము మరియు ప్రామాణికం. ఇప్పటి ఆధునిక సాహిత్య కాలానికి వస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయపు విశ్రాంత ప్రొఫెసర్ అయిన శ్రీ ఆదినారాయణ గారు రచించిన తెలుగు వారి ప్రయాణాలు నాకు చాలా ఇష్టమైన పుస్తకాలలో ఒకటి. ఆ పుస్తకం గురించి మరిన్ని ఆసక్తికర మాటలు వచ్చే భాగం లో పొందుపరుస్తాను. -- మీ సుందరబాబు This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

May 30, 20203 min

హర్షణీయంలో సాహితీవనం !

హర్షణీయం వయస్సు రెండు మాసాలు. ఈ రెండు మాసాల్లోనే నేను, నా మిత్ర బృందం దాదాపు 1800 మంది అతిథులను, వారిచే 9000  దర్శనాలను మరియు పునర్దర్శనాలను సంపాదించుకున్నాము. మొదట మా గిరిగాడి సలహాకు నవ్వుకున్నాము, మా కథలను ఆడియో రూపంలో కూడా పెట్టమన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆశ్చర్యం గా మా కథలు ఆడియో రూపంలో రమారమి  5000 మార్లు దిగుమతి అయ్యాయి. ఎంతో మంది స్నేహితులు, బంధువులు, సన్నిహితులు వారి సందేశాల ద్వారా ప్రోత్సహిస్తూ మా ఉత్సాహాన్ని ద్విగుణీకృతం కావిస్తున్నారు. మీ ప్రోత్సాహం ద్వారా మా ఉత్సాహాన్ని పెంపొందిస్తున్న మీ అందరికీ మా కృతజ్ఞతలు. నాకు మరియు నా మిత్రులకు చిన్నప్పటినుండి తెలుగు భాష అంటే వల్లమాలిన ప్రేమ. నేను ఇదివరకే మీకు చెప్పినట్టు నా బాల్యం నుండి ఇప్పటివరకు నాతో ప్రయాణం చేసిన వ్యక్తులను గురించి, నా అనుభవాల గురుంచి అందరితో పంచుకుందామనే ఉద్దేశ్యం తో నేను తెలుగులో రాయటం మరియు నా మిత్రులు వాటిని చదివి ప్రోత్సహించి, వాటిని ఈ బ్లాగు రూపంలో ఆవిష్కరించమని ఆదేశించటం, నేను పాటించటం జరిగిపోయింది. ఎప్పటిలాగే మా అనీల్గాడు నా బుర్రలో ఇంకో ఆలోచనకు బీజం వేసాడు. మనం ఈ బ్లాగ్ ద్వారా మనకు తెలిసిన మనలాగే తెలుగు అంటే వల్లమాలిన అభిమానం మరియు భాష మీద మనకు లేని పట్టు వున్న సాహితీ మిత్రులని వారి అనుభవాల ద్వారా లేక కథనాల ద్వారా ఎందుకు పరిచయం చేయ కూడదు అని. ఈ ఆలోచన సమంజసముగా ఉండటం తో మేము మా వాడికి గురుతుల్యులైన శ్రీ సుందర బాబు మాష్టారు గారిని సంప్రదించటం, ఆయనకూడా హర్షణీయానికి మొదట గెస్ట్ బ్లాగ్ రాయడానికి సుముఖతని వ్యక్తం చేయటం వెను వెంటనే జరిగిపోయాయి. ఆయన పరిచయానికి వస్తే, నెల్లూరి వాస్తవ్యులైన శ్రీ సుందర బాబు గారు తన చిన్నతనం నుండి విపరీతమైన సాహితీ అభిలాష వున్న వ్యక్తి. పుస్తక పఠనం అనేది ఆయనకీ వ్యాపకం కాదు వ్యసనం. ఆయన మన వెంకటేశ్వర విశ్వ విద్యాలయము నుండి తెలుగు, చరిత్ర మరియు ఆంగ్ల శాఖలలో విడి విడి గా మాస్టర్ అఫ్ ఆర్ట్స్ ఆపైన మాస్టర్ అఫ్ ఎడ్యుకేషన్ లో పట్టా పుచ్చుకున్నారు. నలభై ఏళ్లకు పైగా ఉపాధ్యాయుడిగా మరియు ప్రధానోపాధ్యాయుడుగా సేవలు అందించిన ఆయన 1999 వ సంవత్సరములో పదవి విరమణ చేసి తన విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఆయనచే విద్యను భిక్షగా పొందిన వారు ఎందరో ఈనాడు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ఉన్నత పదవులను అలంకరించి వున్నారు. ఆయన వ్యక్తిగత గ్రంధాలయం లోనే తెలుగు మరియు ఆంగ్ల భాషలలో దాదాపుగా ఓ మూడు వేల పుస్తకాలు ఉంటాయి అని మా అనీల్గాడు నొక్కి వక్కాణించి చెబుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చదువు చెప్పటం, చదువుకోవటం మరియు చదవటం లాటి వ్యసనాలను ఒక చక్ర భ్రమణం లాగ సాగిస్తూ తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్నారు. ఈ గెస్ట్ బ్లాగ్ ద్వారా ఆయన మనకి తెలుగు సాహిత్యంలో ట్రావెలోగ్స్ అనే అంశం మీద మనకు మూడు వ్యాసాలు మూడు భాగాలుగా అందించబోతున్నారు. నేను ఈ భాగాలను భారతీయ కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి ఏడు గంటలకు ప్రచురించాలని అనుకుంటున్నాను. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

May 28, 20203 min

ఆవూ, దూడా చేలోనే మేస్తున్నాయి, మాలాగా !

చెన్నై లో నివసించే వాళ్ళము మేము 2009 వ సంవత్సరములో. పిల్లలిద్దరూ వెళ్ళాచ్చేరీ లోని నవదిశ మాంటిస్సోరి స్కూల్ లో ఏడూ మరియు ఐదవ తరగతుల్లో చేరారు. ఆరు నెలలు గడిచాకా మా చిన్నది వాళ్ళ తరగతిలో రెండు సమూహాలు ఉన్నాయనీ, ఆ రెండు సమూహాలకి  ఎప్పుడూ పడదని, ఒకరు ఎడ్డెము అంటే ఇంకొకరు  తెడ్డెమని చెప్పటం మొదలెట్టింది. కొన్ని రోజుల తర్వాత యీ రెండు సమూహాల మధ్య తనే సమన్వయ కర్తనని, ఆ మరి కొన్ని రోజుల తర్వాత తాను లేక పోతే ఆ సమూహాలు కొట్టుకొనేస్తారు అని డప్పులు కొట్టుకోవటం మొదలెట్టింది. రోజు వినే వాడిని అడిగి తెలుసు కొనేవాడిని వాళ్ళ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తుందో అని, వీలైతే నాలుగు ఉచిత సలహాలు ఇస్తూ. అప్పటికీ సుప్రియ నన్ను వారిస్తూనే ఉండేది , నీ వెధవ  మానేజ్మెంట్ స్కిల్స్ తో దాన్ని చెడగొట్ట మాక అంటూ. ఐన మనం సుప్రియ మాట ఎప్పుడు వింటాం కనుక. అందులోను నేను నా కూతురి అంతర్జాతీయ విషయాలలో. సరే ఒక సమయం లో మా చిన్నది జ్వరం వల్ల మూడు రోజులు బడికి వెళ్ల లేదు. దానికి, వాళ్ళ రెండు సమూహాలు ఏమయ్యాయో అన్న ఆందోళన, నాకేమో అది బడి నుండి మోసుకొచ్చే కబుర్లు లేక పొద్దుపోవటం లేదు. నాలుగో రోజు అది బడికెళ్తుంటే చెప్పా, “మీ రెండు సమూహాల మధ్య సమస్య తీరిపోయింది, ఆందోళన పడకు” అని. “సమస్యే లేదు, వాళ్ళే మన్నా నువ్వు, మీ స్నేహితుడు అనిల్ మామ అనుకున్నావా, తిట్టుకొని కొట్టుకొని తర్వాత రోజు ఒరే మామ అని పలకరిచ్చుకోవడానికి”, అంటూ వెళ్ళింది బడికి. సాయంత్రం నేను ఆఫీస్ నుండి రాగానే చాలా గంభీరంగా పుస్తకాలు ముందేసుకుని భీకరంగా చదివేస్తుంది. ఏమ్మా! అంటే, ”నాకు ఎఫ్.ఏ పరీక్షలు నేను చదుకుంటుంటే కనపడటంలా”, అంటూ కయ్ అంది. నేనొదలనుగా, ఏరా! ఏమయ్యారు మీ రెండు సమూహాలు అనడిగా. అది నీరసంగా, “నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పావ్ నాన్న వాళ్ళు కలిసిపోతారని, వాళ్ళు కలవటం, నన్నసలే పట్టించుకు పోవటం” అన్నీ జరిగి పోయాయని  గుడ్లనిండా నీరు కుక్కుకుంటూ చెప్పింది. దాన్నెందుకు లే ఇంకా గిల్లటం అని నేను బాగా చదుకో అమ్మ అంటూ ఫ్రెష్ అవుదామని వెళ్ళిపోయా అక్కడ నుండి. దానికి సందేహం వదలా, మా నాన్నకి ఇంత ఖచ్చితంగా ఎలా తెలిసింది అనీ. రాతిరికి బెడ్ టైం స్టోరీస్ అంటూ వచ్చింది, చిన్నగా మళ్ళి అడిగింది, “ఎలా కనుక్కున్నావు నాన్న” అని . "సిన్నీ! ఇన్ని రోజులు వాళ్ళ ని కలవ కుండా ఆపింది నువ్వే నని , నువ్వు మూడు రోజులు బడికి వెళ్ళక  పోతే వాళ్ళు కలిసిపోతారని", నాకు తెలుసు అని చెప్పా!. అంత ఖచ్చితంగా ఎలా ఊహించావ్ నాన్న అంది ఆశ్చర్యపోతూ. ఎలా అంటే నువ్వు నా కూతురువి సిన్నీ!, నా నోట్లోంచి ఊడి పడ్డావ్ రా!. నీ నీవన్నీ నా బుద్ధులే నా పనులే అనగానే అది కూడా నన్ను హగ్ చేసుకొని ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేయదుగా అంది. నీకెలా తెలుసురా యీ సామెత అంటే సాయంత్రమే నాన్నమ్మ నిన్నూ నన్నూ కలిపి తిట్టింది నాన్నా!  అన్నది. తిట్టనీయరా! ఎవరు తిట్టినా మనం చేలోనే మేసేద్దాం అని నిశ్చయించి  హాయిగా గుర్రు కొట్టాం. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

May 25, 20202 min

నా కూతుర్ల, భావప్రకటన!

నా పెద్ద కూతురు అమృత, చిన్ననాటి నుండి తనలోని ఆలోచనలు చాలా స్పష్టంగ వ్యక్త పరిచేది. మా స్నేహితుడు గిరిగాడి భాషలో చెప్పాలంటే భావవ్యక్తీకరణ మరియు భావప్రకటన. తన మూడవ ఏటనే మేము తనని డెన్వర్ కి కొనిపోయాము. దానికి అప్పుడు చేపలు అంటే చాల ఇష్టం,  పెంచటం కాదు సుమా. ఒక రోజు మేము తనని తీసుకొని చైనీస్ మార్కెట్ కి వెళ్ళాము. అక్కడ మంచి మంచి తిలాపియా చేపల బ్రతికున్నవే దొరుకుతాయి. వాటిల్ని పెద్ద పెద్ద గాజు తొట్టెల్లో వేసి ఉంచి, మనం ఎన్నుకున్నవాటిని తీసి ముక్కలుగా కొట్టి ఇస్తారు. అమృత ఆ చేపల్ని తొట్టెల్లో ఈదుతూ ఉండగా దగ్గర నుండి బాగా చూసింది ఆ రోజు. నాన్నా అవి చూడు మూతి ఎలా తెరిచి ఎలా మూస్తున్నాయో అంటూ తన చేతులను వాటి మూతిలా పెట్టి, తెరుస్తూ మూస్తూ చూపిస్తూ వాటితో బాగా ఆడింది. ఆ రోజు రాత్రి మేము మాంచి నిద్రలో ఉండగా పెద్దగా ఏడుస్తూ లేచింది. ఎంతకూ ఏడుపు మానలేదు. కాస్త కుదుట పడ్డాక, ఏమ్మా!  అంటే, ఒక పెద్ద చేప వచ్చింది, నన్ను నువ్వు తిన్నావు కదా ఇప్పుడు నేను నిన్ను తినేస్తా అంటుంది,  అంటూ మళ్ళీ ఏడుపు. నేను తెగ సంతోషపడ్డా ! కల ఎంత బాగా చెప్పింది అని మరియు ఈ దెబ్బ కన్నా తన చేపల పిచ్చి వొదులుతుందని. కానీ నా ఆనందం ఎక్కువ కాలం నిలవలా. దొంగది కల కలే, తినటం తినటమే అని తేల్చింది. అలాగే నిద్ర పోయే సమయంలో తనకి ఆవూ-పులి కథ చెప్పాల్సిందే. మళ్ళీ ఒకరోజు ఏడుస్తూ నిద్ర లేచింది,  కాస్త సముదాయించి, ఏమ్మా అననడిగితే , నాన్నా! బుజ్జి దూడకి బాయి ఇచ్చి పులి దగ్గర కు వెళ్ళింది ఆవు. అప్పుడు, అప్పుడు, అంటూ ఏడుపు మళ్ళీ. బెక్కుతూ! చెప్పింది పులి ఆవుని తినేసిందని. నాకు మళ్ళీ తెగ ఆనంద మేసింది ఆహా నా కూతురు చాలా ప్రాక్టికల్ అమ్మాయని. అలా పెద్ద దాన్ని పెంచుతూ, చిన్నదాన్ని కూడా నాలుగేళ్ల దాన్ని చేసేసరికి, మేము ఇండియా వచ్చెయ్యల్సి వచ్చింది. మా చిన్న దాని భావప్రకటన ఇంకో మెట్టు పైనే. వచ్చిన కొత్తల్లో తానూ, తనకన్నా ఎనిమి నెలల చిన్నదైన మా అన్న కూతురు, ఇంటి బయట ఆడుకుంటూ వున్నారు. అక్కడే మేస్తున్న ఒక కోడిపిల్లని, మా అన్న కూతురికి చూపిస్తూ దీన్నే చికెన్ అంటారు, దాని లెగ్ పీస్ ఉంటుంది చూడు, యమ్మీ యమ్మీ గా అంటూ చెప్పటం మొదలెట్టింది. అది విని, ఆ భావ ప్రకటనకు ఈ సారి నాకు భయం వేసింది . దీన్ని వొదిలేస్తే ఇప్పుడే ఆ కోడి బతికుండగానే, దీనికి ఎక్కడ ఆహార మైపోతుందో అని. చాలా గట్టిగా నిశ్చయించుకున్నా, అసలుకే నా పిల్ల పీచులు ఆడ నలుసులు, వీళ్ళని కాస్త ఈ మాంసాహార హింసకు దూరంగా పెంచాలని. ఒక పధకం ప్రకారం, ఇంట్లోకి  తెచ్చిన కూరగాయల్ని తాకమనే వాడిని, వాళ్ళు హాయిగా తాకే వారు వంకాయలు, బెండకాయలు, సొరకాయ, బీరకాయలు  అంటూ పేరు పేరునా. చికెన్ లేక మటన్ తెచ్చినప్పుడు తాకమనే వాడిని, ఛీ యాక్! అంటూ పారి పోయే వారు. సాయంత్రం నేను ఇంటికొచ్చే సరికి షరా మామూలే, యమ్మీ యమ్మీ !అంటూ, చికెన్ తింటూ. ఏరా! అంటే, మేము కట్ చేయ లేదుగా, మేము తాక లేదుగా, మమ్మీ ఏ కదా నోట్లో పెట్టింది అంటూ. అలా నా ప్రయత్నాలకు సుప్రియానే దగ్గరుండి గండి కొట్టిచ్చింది. ఆ తర్వాత నేను సీటెల్ కి వెళ్లాల్సొచ్చింది ఆరునెలలకు ఒక్కడినే. రోజు ఫోన్ చేసే వాడిని ఇంటికి . ఒక రోజు చిన్నది నాన్నా! నాన్నా! ఇంతకు ముందు నిన్ను అనుకుంటే, నీ మొహం నా కళ్ళ ముందుకొచ్చేది, కానీ ఇప్పుడు రావటం లేదు నాన్నా, అని మళ్ళీ తన భావ ప్రకటనతో భయ పెట్టింది. ఇక లాభం లేదని వెంటనే వాళ్ళని సీటెల్ కి రప్పించుకున్నా. అంతకు ముందు, ఎప్పుడన్నా అమ్మంటే ఆమూకి ఎందుకిష్టం అంటే, ఆమూకి బువ్వ పెడుతుంది కాబట్టి అని చెప్పేది, నాన్నంటే ఎందుకిష్టం అంటే, ఆఫీసుకెళ్లి ఆమూకి డబ్బులు తెస్తాడు కాబట్టి అని చెప్పేది. ఈ సారి మాత్రం అమెరికా కి తీసుకొచ్చాడు అని ప్రకటించటం మెదలెట్టింది నా కూతురు. వాళ్ళచే మాంసాహారం మానిపించాలని ఇప్పటికీ పట్టు వొదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే వున్నా. ఇప్పుడైతే భావ ప్రకటనే కాదు యుద్ధ ప్రకటనే నా మీద అమ్మా కూతుర్లు. నువ్వు బాగా నలభై ఏళ్ళు దేశంలో వున్న అడ్డమైన వన్నీ తిని మమ్మల్ని మానమంటావ్, మాక్కూడా నీలా తిని తిని విసుగొస్తే మానేస్తామని. నా భావప్రకటన వీళ్ళ ముందర బాధాప్రకటనే. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

May 22, 20204 min

మనోభావాలు దెబ్బ తీసిన ఐదేళ్ల అమృత!

మేము డెన్వర్ లో వున్నరోజులు అవి. ఒకరోజు నేను ఆఫీసులో ఉండగా అమృత వాళ్ళ ఉపాధ్యాయురాలి నుండి ఫోన్ వచ్చింది, వచ్చి వెంటనే కలవమని. ఆవిడని అడిగాను నేను మరుసటి రోజు వచ్చి కలవవచ్చా అని, దానికావిడ ఈరోజే వచ్చి కలిస్తే మంచిదని చెప్పటం తో ఆఫీసు నుండి బయలుదేరాను. దారిలో ఎన్నో ఆలోచనలు, అమృతాని ఉదయమేమన్నా అరిచానా?  అదేమన్నా బడికి వెళ్లి మా నాన్న అరిచాడు ఈరోజు అని వాళ్ళ ఉపాధ్యాయురాలికి చెప్పిందా అని? సుప్రియాకి కూడా ఫోన్ చేసి అడిగాను, తనేమన్న అన్నదా అమృతాని ఈరోజు కానీ లేక గత రోజుల క్రితం గాని అని? అసలే ఈ అమెరికాలో తలితండ్రులు 911  దెబ్బ, పిల్లలకి హడిలి పోయేకాలం.  సుప్రియా అటువంటిదేమీ లేదని చెప్పినా మనసేమో పరి విధాలుగా పోతున్నది. అసలే నాకు మరియు మా అమ్మకి ఏమన్నా సమస్య వస్తే పరిష్కారమేమిటి అన్న ఆలోచన కాక, పుట్టు లెత్తమంటే పూర్వోత్తరాలు ఎత్తిన మాయిన, మూల కారణాలు శోధించటం అలవాటు. దేశం కానీ దేశం లో ఏమన్నా విరుద్ధం గా జరగబోతుందా అన్న భయంతోనే, బిక్కు బిక్కుమని అమృతా వాళ్ళ క్లాస్ రూమ్ కి వెళ్ళా. పిల్లలందరూ ఎదో యాక్టీవిటీ లో నిమగ్నమై వున్నారు, మా అమృతా మాత్రం వాళ్ళ క్లాస్ రూమ్ కార్నర్లో వున్న ఒక పార్టిషన్ చేయబడ్డ  ప్రదేశంలో ఒక్కటే కూర్చొని వుంది. నాకర్థమయ్యింది మా అమృతాకి వాళ్ళ ఉపాధ్యాయురాలు టైం అవుట్ ఇచ్చిందని. నాకు చెప్పొద్దూ అదొక్కటే అలా ఐసోలేటెడ్ గా ఎదో ముద్దాయిల కూర్చొని ఉంటే తెగ నవ్వు వచ్చేసింది. వాళ్ళ ఉపాధ్యాయురాలు మాత్రం లేని గాంభీర్యాన్ని మొహంమీదకు తెచ్చుకొని నన్ను ఆసీనుడవ్వమని చెప్పారు. నేనుఆసీనుడను అవ్వగానే చెప్పారు ఆవిడ, మీ అమృత మీద తన సహాధ్యాయిని వాళ్ళ నాన్న గారు వచ్చి ఒక ఫిర్యాదు చేసి వెళ్లారు, ఆ ఫిర్యాదు చాలా గంభీరమైనది అని. ఇంతకీ ఏమిటంటే ఆ ఫిర్యాదు, అమృత తన సహాధ్యాయినితో చాలా వర్ణవిచక్షణ బహిర్గత మయ్యేలా ప్రవర్తించిందని. అసలు అమృత అలా ఎలా ప్రవర్తించిందనేది ఆవిడకి అర్థం కానీ విషయమని, దాని గురుంచే మాటలాడడానికే నన్ను పిలిపించానని చెప్పారావిడ. దేవుడా, ముక్కు పచ్చలారని ఐదేళ్ల అమృత మీద ఈ నింద ఏమిటి అని అనుకుంటూ, వివరాలు అడిగిన నాకు, "అమృత నిన్న ఉదయం బడికి రాగానే, ఆ అమ్మాయి దగ్గరకెళ్ళి  తనని స్నిఫ్ చేసి, యు అర్ స్టింకీ, బెటర్ టేక్ యువర్ బాత్",  అని అన్నదని చెప్పింది. అది ఆ అమ్మాయి, నల్లనయ్య అయిన వాళ్ళ నాన్నగారికి చెప్పటం, ఆయన ఈరోజు అమృత వాళ్ళ ఉపాధ్యాయురాలిని కలవటం మరియు ఫిర్యాదు చేసెయ్యటం జరిగిపోయాయట. నాకర్థమయ్యింది ఈ సమస్యకి మూల కారణం నేనేనని. అవి చలికాలం కావటంతో అమృత స్నానం చేయడానికి ప్రతీ రోజు మమ్మల్ని విసిగించేది. రోజూ ఎదో ఒక విధం గా తన చేత స్నానం చేయించటం మాకు గగనమయ్యేది. తనని స్నానం చేయించడానికి నేను అమృత దగ్గరకెళ్ళి తమాషాగా తన చేతులు లేక ముఖాన్ని స్నిఫ్ చేసినట్టు నటించి, "అబ్బే అమృత స్నానం చేయలేదు, అమృత ఈజ్ స్టింకీ,  అమృత బెటర్ టేక్ హర్ బాత్" అంటూ ఏడిపిస్తే చేయించుకునేది స్నానం. నా ఈ ఎదవ పదజాలం చిన్నదైన అమృత ఆ పిల్ల దగ్గర అనుకరించి సమస్యలో పడిపోయింది. నేను ఈ విషయమంతా వాళ్ళ ఉపాధ్యాయురాలికి వివరించి, తన తప్పేమీ లేదని, కావాలంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారిని కలిసి  నేను క్షమాపణ చెప్తానని చెప్పాక విషయం సద్దుమణిగింది. ఆ తర్వాత రోజు నేను ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారి కలిసి, నా క్షమాపణలు వేడుకున్నా. ఆయనకూడా నవ్వేసి, నాకేమీ అర్థం కాకుండా, "యు బెట్ మాన్, హా హా హా" అంటూ వెళ్ళిపోయాడు. ఇలా మన అనాలోచిత పనులు మన పిల్లల్ని ఎలాటి సమస్యల్లో పడవేస్తాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ తర్వాత మాకు అమెరికాలో ఉన్నంత వరకూ ఎలాటి సమస్యా ఉత్పన్నం కాలేదు. అలా అమెరికాలో ఉండగా అమెరికనుల మనోభావాలు గౌరవించాము.  This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

May 21, 20203 min

మా బడి మిత్రుని కబుర్లు!

నా కథలు ఎక్కువగా నా బాల్యము, స్నేహితులు మరియు కుటుంబము ఇతివృత్తము గా సాగుతుంటాయి. ఈ మధ్య ఎక్కువగా కాలేజీ స్నేహితుల గురించే సాగ దీసి మిమ్మల్ని విసిగించాను. ఈ సారి మార్పుగా నా చిన్న నాటి స్నేహితుడి గురుంచి రాయాలనుకుంటున్నాను. వాడు ప్రస్తుతము అమెరికా సంయుక్త రాష్ట్రము లోని ఉత్తర కరోలినా లో ఉద్యోగపర్వం వెలగపెడుతున్నాడు పేరు దాడి ప్రతాప్. ఏ కొత్త విషయం కనిపించినా నేర్చుకోవడానికి వాటి మీదకి దాడి చేసేస్తాడు. మా అమ్మ, మా పెద్దమ్మ కూతురైన మా బాడుగ అక్క మరియు ప్రతాప్ వాళ్ళ అమ్మ గార్లు కావలిలో పి.యూ.సి చదివారు. వాళ్ళ అమ్మగారిది అల్లూరు. అప్పట్లో కావలి చదువులకు చాలా ప్రసిద్ధి. విశ్వోదయ లాటి బడులతో, జవహరి భారతి లాటి కళాశాలలో చదవడానికి చుట్టుపక్కల వున్న ఊర్ల నుండి కావలి చేరుకొనే వారు. మా అమ్మ వాళ్ళు ఒకప్పుడు సహాధ్యాయులైనా నేను వాడిని తొలిసారి చూసింది మాత్రం, నేను రాజుపాలెంలో బస్సు ఎక్కి ఉలవపాళ్లకు వెళ్తుండగా వాడు అదే బస్సులో నెల్లూరు నుండి కమ్మపాలెం వస్తున్నాడు. ఆ ప్రయాణమప్పటికి మేము చాలా పిల్ల పీసులం అయినా మా అమ్మ వాళ్ళు మమ్మల్ని వాళ్లకు రక్షణగా తీసుకెళ్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఊరిలో దిగుతూ మాకు సీట్ ఇవ్వటం నాకు ఇంకా గుర్తు. ఆ తరువాత మా నాన్న మరియు వాళ్ళ నాన్న కలిసి రైల్వే గుత్తే దారులుగా అవతారమెత్తారు. మా నాన్న చేసే రైల్వే పనులను పర్యవేక్షణ చేసే ఇంజనీర్ ప్రతాప్ వాళ్ళ ఇంట్లో బాడుగకు ఉండే వారు, అలా ఆ ఇంజినీరు, ప్రతాప్ వాళ్ళ నాన్న మరియు మా నాన్న పార్టనర్స్ గా అవతారమెత్తారు. అలా మా అమ్మ వాళ్ళ స్నేహాలు మరలా పునరుజ్జీవనం చెందాయి. ఒక రోజు మా పేద పుత్తేడు జిల్లా పరిషత్ పాఠశాలలో నా మానాన నేను మా లెక్కల అయ్యోరి చేతిలో వొంగో పెట్టిచ్చుకుని గుద్దులు గుద్దిచ్చుకుంటుండగా మా వోడు ఎక్స్-క్యూస్ మీ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. మా అయ్యోరు మహా గట్టివారు, నువ్వు ఎంత పీక్కున్నా నేను వీడిని తప్ప వోల్ తరగతిని వదులుతాను అని వాడిని తరిమేయ్యటం తో మా వోడు బడి వదిలిన దాకా నాకోసం బయట కాసుక్కూర్చోని వున్నాడు. నీ పాసుగూలా ఇలా చెప్పా పెట్టకుండా నెల్లూరి నుండి వచ్చెయ్యటమేనా, ముందే చెబితే మా అయ్యోరి చేతిలో పడకుండా మా ఏర్పాటులేదో చేసుకునే వాడిని కదా అనుకుంటూ ఇంటి దారి పట్టాము. నా కన్నా వాడు రెండేళ్లు పెద్ద, కానీ ఆ కిలోగ్రాములు ఈ కిలోగ్రాములు అని ఆంగ్ల మాధ్యమం లో చదివి నా కోసం ఆగిపోయాడు. ఇద్దరం ఇప్పుడు ఒకటే తరగతి కాకపోతే వాడు ఎల్.సి.ఎం మరియు  జి.సి.డి అంటాడు నేను క.సా.గు మరియు గ.సా.ప్ర అంటా అంతే తేడా. అలా వచ్చిన వాడు ఓ వారం వుండిపోయాడు మా ఉప్పలపాటిలో. మా స్నేహితులకి వాడు చెప్పే నెల్లూరు కథలు చాలా నచ్చేశాయి, మాటి మాటికీ వాడనే మా నెల్లూరులో ఐతేనా అంటూ చెప్పటం. రాత్రి అయితే వాడు కథా, మాటలు, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించి చెప్పే ఎక్సార్సిస్ట్ కథలు, నేను మరియు నా స్నేహితుల మందరిమి ఆరు బయట మంచాలు వేసుకొని కెవ్వు కెవ్వు మంటూ వినటం, మా పెద్దోళ్ల చేత తిట్లు తినటం ఆ దిక్కుమాలిన కథలు వినటం ఎందుకు మమ్మల్ని మీరు ఉత్సలకు పోవడానికి కూడా లేపటం ఎందుకు అని. మా వాడైతే ఆ సినిమాని థియేటర్ లో ఒంటరిగా చూస్తామని పందెం కట్టి గుండె ఆగి చచ్చిపోయినోళ్లు బొచ్చెడు మంది అని చెప్పే వాడు. మా పల్లెలో కేవలం ఆదివారాలు మాత్రమే ఇళ్లల్లో దోసెలు చేసే వారు. మా అమ్మ చేసిన ఎర్ర కారమేసుకొని హా! హా! అంటూ ఓ పది అయినా లాగించేసే వాళ్ళం. మా వాడిది చాలా ఇంజనీరింగ్ బుర్ర లే, మేము ఇటుక రాళ్లనే బస్సులుగా భావించి తోసుకుంటూ ఆడుతుంటే వాడు వాటికి ఇసుకతో రాంపులు మరియు సొరంగాలు తయారు చేసే వాడు.   నేను కూడా వీడి వెంట పడి నెల్లూరు వెళ్లే వాడిని. మాకు ఉప్పలపాటిలో బ్రేక్ ఫాస్ట్ రోజూ  సద్దెన్నం మరియు ఆదివారం మాత్రమే దోసెలు. నెల్లూరులో ఎక్కడ బడితే అక్కడ దోశె అంగడులే, రూపాయికి పది దోసెలు. ఇద్దరం వాళ్ళ ఇంట్లో రూపాయ తీసుకొని అంగడికి వెళ్లే వాళ్ళం, నాకేమో అక్కడ అందరి ముందు తినటం కొత్తగా మరియు సిగ్గుగా ఉండేది, మా వాడేమో ఇక్కడే తింటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ అడగొచ్చు అని అక్కడే తినిపిచ్చే వాడు. ఆపమ్ అనే పేరు విన్నది నేను అక్కడే. వీడికి మేము ఆరు ఏడూ తరగతుల్లో ఉండగానే క్రికెట్ పిచ్చి చాలా ముదిరి ఉండేది. పుర చేయి వాటం. దారిలో నడుస్తూ నడుస్తూ ఎడం చేతిని గిర్రున బౌలింగ్ చేసిన ఆక్షన్ లో, లేక పోతే ముందుకి రెండడుగులు గెంతి చేతThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

May 18, 202012 min

మరవ కూడని వారు!

నేను మన సూరి కథ రాశాక, ఇప్పుడల్లా అనారోగ్యాల మీద రాయకూడదు అని అనుకున్నా, కానీ ఆ నియమం వెంటనే పక్కన పెట్టి ఈ కథ రాస్తున్నా. ఎందుకు రాశానో ఈ కథ చివరలో రెండు మాటలుగా చెప్పాలనుకున్నా. నేను 2012 న ఉద్యోగ నిమిత్తం చెన్నై నుండి హైద్రాబాదుకు బదిలీ అయ్యాను. ఇంకా విద్యాసంవత్సరం పూర్తి కాకపోవటంతో కుటుంబం చెన్నై లోనే ఉండిపోయింది. నా మకాం మా అన్న దగ్గర. ఏవో సెలవులు ఉండటంతో సుప్రియ, పిల్లలు మరియు అమ్మ కూడా హైదరాబాద్ వచ్చి వున్నారు. ఒక శనివారం ఉదయం లేచి, మా అన్నా వాళ్ళ బాల్కనీలో వేప చెట్టు నీడలో కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా, అమ్మ నాకు తేనీరు ఇచ్చి, నన్ను ఒక్కసారి డాక్టర్ కి చూపించరా అని అడిగారు. నాకైతే ఒక్కసారి చాలా సిగ్గుగా అనిపించింది, ఎంత నలతగా వున్నా, డాక్టర్ దగ్గరకి ఎంతో బలవంతం చేస్తే కానీ రాని అమ్మ, తనకై తాను వచ్చి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళరా అని అడిగేదాకా నేను స్పృహలో లేనా అని. తాను కొంత కాలం నుండి మతిమరుపుతో బాధపడుతూ వున్నారు. ఉదాహరణకు అందరం భోజనాలకు కూర్చున్నాక, తనకు పెరుగు కావాలంటే, నాకు అది అందించరా అనే వారు, అది అంటే ఏమిటి దానికి పేరు లేదా అంటే, ఎంతో ఆలోచించి మరలా అది ఇవ్వరా అనే వారు పెరుగు చూపిస్తూ, పెరుగు పేరు స్ఫురించక. అలా తాను మనుషులు మరియు వస్తువుల పేరుల కోసం తడుముకోవటమా చాలా ఎక్కువగా జరిగేది అప్పట్లో. మా అమ్మకి మొదటి నుండి జ్ఞాపశక్తి అమోఘం. అప్పటికప్పుడు కనీసం ఒక శత పద్యాలు చెప్పగలరు, వేమన, భాస్కర, సుమతి శతకాలు నుండి మరియు భర్తృహరి సుభాషితాలు, చాటువులు మొదలగు వాటినుండి. తెలుగు పదహేళిలు, పద వినోదాలు పూర్తి చేయాలంటే నేను మా అమ్మ సహాయం తీసుకోవాల్సిందే. నేను ఎప్పటికప్పుడు నా కథలలో మా అనీల్గాడి ప్రసక్తి తీసుకు రాకూడదు అని అనుకున్నా వాడు నాకు తెలియకుండానే వచ్చేస్తుంటాడు. వెంటనే వాడికి చేశా, ఇలా ఉందిరా అమ్మకి, ఒక మంచి డాక్టర్ పేరు చెప్పు, నేను వెంటనే తీసుకెళ్లాలి అని. వాడు పదినిమిషాలు అయ్యాక చెప్పాడు, అమిత్ అని మా ఇంటి దగ్గర ఒక యూ.కే నుండి తిరుగు ముఖం పట్టిన డాక్టర్ వున్నాడు, చాలా మంచి డాక్టర్, వెళ్లి చూపించు అని. ప్రస్తుతం అదే డాక్టర్ మా వాడికి చాలా చెడ్డ అయి యున్నాడు అది వేరే విషయం. మా వాడికి ఏదొచ్చినా పట్టలేమని మీకిప్పటికే అర్థమయ్యుండాలి. సరే అని మా అమ్మని, వాడు చెప్పిన అప్పటి చాలా మంచి డాక్టర్ అయిన అమిత్ దగ్గరకు హుటా హుటిన తీసుకెళ్లిపోయాను. ఆయన బి.పి వగైరాలు చూసి, ఆవిడ రిఫ్లెక్స్ లు  టెస్ట్ చేసి, పలు ప్రశ్నలు సంధించి, ఇదంతా వయసుతో వచ్చిన మతిమరుపు అని తేల్చేసి, కొన్ని ఆయన పెట్టిన షాపులోనే దొరికే మందులు రాసి, ఎందుకైనా మంచిదని సి.టి స్కాన్ చేయించమని చెప్పి, అది కూకట్పల్లి లోని భద్రం డయాగ్నోస్టిక్స్ లోనే చేయించమని  పదే పదే చెప్పి పంపాడు. అబ్బా ఈరోజు చాలా కష్టపడ్డావురా, ఇప్పటికి ఇంటికెళ్లి నువ్వు రెస్ట్ తీసుకున్నాక రేపు స్కాన్ తీయించుకకుందామని మా అమ్మ స్కాన్ ని ఎగ్గొట్టాలని చూసినా, నేను వినకుండా నేరుగా భద్రానికి తీసుకెళ్లిపోయా మా అమ్మని. స్కాన్ ఫలితం వెంటనే ఇచ్చేసారు. ఫ్రంటల్ టెంపోరల్ రీజియన్ లో ఓ కార్క్ బాల్ సైజు లో ట్యూమర్ కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఆ స్కాన్లో. అటు పిమ్మట తనని కలిసిన మాతో చెప్పారు అమిత్, సర్జరీ వెంటనే చేయించమని, ఎస్.ఆర్ నగర్ లో ఒక న్యూరోసర్జన్ కి కూడా రెఫర్ చేసేశాడు. అప్పుడు మొదలయ్యింది మా అసలు కష్టమైన సంధికాలం. అభిప్రాయం, రెండవ అభిప్రాయం, రెండవ అభిప్రాయం మీద మరల అభిప్రాయాల పేరున ఎక్కని హాస్పిటల్ గుమ్మం లేదు. ఇక్కడ వింత ఏమిటంటే కొందరు డాక్టర్స్, అడ్మిట్ కానిదే అభిప్రాయం కూడా చెప్పము అనటం. మెడ్విన్ లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్ మరునాడే అని చెప్పటం తో మేము సన్నిద్ధంగా లేము అని, మా రిస్క్ మీదే డిశ్చార్జ్ అవుతున్నామని రాసిచ్చి మరీ పారిపోయి వచ్చాము కూడా. యశోదలో పని చేసే ఇద్దరు డాక్టర్ దంపతులు మా  స్నేహితుడైన నరేంద్రుడి అపార్ట్మెంట్ నివాసులవ్వటంతో,This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

May 17, 20208 min

నాలో నేను! ఒక అవలోకనం!

ఆ మధ్య ఒకసారి మా అనీల్గాడు నాతో  సంభాషిస్తూ, రాసే కొద్దీ నీ కథలు మెరుగుపడుతున్నాయి. అలాగే నీ పాత్రలతో సహజీవనం చేస్తూ నువ్వు కూడా వ్యక్తిగా మెరుగు పడాలని ఆశిస్తున్నా అన్నాడు. ఇదే మాట మా సీనియర్ బాలాజీ కూడా అన్నాడు మా వాడంతా కరుగ్గా కాదు, కాస్త  మెతగ్గా, ఈ కథలు నీ వ్యక్తిత్వాన్ని ఇంకాస్త మెరుగు పరుస్తాయని. కానీ వరుసగా ఈ మధ్య నా కథలు చదివిన మా అనీల్గాడు, ఈ మధ్య కథల్లో వినయం పేరుతో నువ్వు పడే  స్వీయ-జాలితో చస్తున్నామురా బాబు,  అంత ఆత్మ విశ్వాసం లోపిస్తూ నువ్వు రాసే కథలు ఒక కంపెనీ లో లీడర్షిప్ పోసిషన్ లో వున్నా నీకున్నూ మరియు నీ చుట్టూ పక్కల వారికిన్ను అంతగా శోభించవు అని మరలా నాకు హిత బోధ చేశాడు. నాకు వాడి హితబోధ చాలా నిజమనిపించి నా ముందు కథ అయిన "గడ్డు కాలం లో నాతో నేను" ను నేను చాలా ధనావేశంగా ముగించా. లక్ష్మి లేకపోవటం నిజం, మన (కాని) సత్యం లేక అందగాడు మరియు ధవళ వర్ణము వాడు మా పెద్దనాన్న లాటి కథలు రాసినప్పుడు లేక నా కథలు నేనే చదివినప్పుడు మనసంతా చాల స్తబ్దుగా అయిపోతుంది, ఇలా జరిగి ఉండకూడదు అనే బలమైన భావన. టైం మెషిన్ లో వెనక్కి ప్రయాణించి అంతా రీసెట్ చేసుకోవాలనే తలంపు. అలా కాలాన్ని వెనక్కి మళ్లించాలి అనే ఆలోచనే నా అపరిపక్వ మనస్తత్వాన్ని తెలియజేస్తుందేమో కదా. కొన్ని నిజ జీవిత పాత్రలగురుంచి రాసేటప్పుడు వాళ్ళ గురించి రాసే హక్కు లేక అర్హత నాకేముంది అనే ప్రశ్న కూడా మనసుని తొలుస్తుంది. నా కథల ద్వారా నేను ఎదో మంచి చెబుదాము లేక సందేశాన్ని ఇద్దామని అనుకోవటం లేదు. నిజ జీవితంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో నా కథలలో పాత్రలు కూడా అలానే వుండాలను కుంటాను. నేను నా జీవితం నూటికి నూరు శాతం కథానాయకుల గుణగణాలతో  బ్రతికిన లేక బ్రతుకుతున్న వారిని, అలాగే నూటికి నూరు శాతం ప్రతినాయకులు గుణగణాలతో బ్రతికిన వారిని చూడ లేదు. నాతో వున్నవారు లేక నా చుట్టూ పక్కల వున్నవారు, తమ తమ సహజ సిద్దమైన మానుష ప్రవర్తన కలిగి వున్న వారే. పరిస్థితుల ప్రభావం తో కొట్టుకు పోతున్నవారే ఎక్కువ మంది, వారిలో చాలా మంది మనం ఊహించిన దానికంటే కరుణాత్మకంగా ప్రవర్తించి ఉండవచ్చు, అదే వారు మనం ఊహించని దానికంటే కఠినాత్మకంగాను కనపడి ఉండవచ్చు మరొక సమయాన. చాలా మంది మాకు యండమూరి వీరేంద్రనాథ్ కథలు చాలా ఇష్టమంటారు. ఆయన రాసిన నవలలో వెన్నెల్లో ఆడపిల్ల కానీ, ఆనందోబ్రహ్మ అనే నవల కానీ ఇష్టమని ఏభై శాతానికి పైనే చెప్పటం మనం వింటాము. ఆయన ఆ పుస్తకాలలో రాసిన ఆ వెన్నెల్లో ఆడపిల్ల, రేవంత్ లేక సోమయాజి, మందాకినీ లాటి పాత్రలులా బలమైన వ్యక్తిత్వమున్న పాత్రలు మనకి నిజ జీవితంలో తారస పడవు, తారస పడాలని కోరుకోవటం అసహజమే అవుతుంది. నాకు మట్టుకు ఆయన రాసిన వెన్నెల్లో గోదావరి అనే పుస్తకనుంటే చాలా ఇష్టం. ఆ పుస్తకాన్ని ఆయన ఆనందరావు, తరళ,  ప్రమథ్వర , గోపిచంద్ మరియు తరళ వాళ్ళ నాన్నగారుల పాత్రలతో జరిగిన ఒకే కథని ఒక్కొక్కరి కోణంలో చెప్పటం అనే ప్రయోగం చేశారు అని గుర్తు. చదివి చాలా రోజులయ్యింది. మరల చదవకుండానే యిక్కడ ఏమాత్రం సందేహం లేనివాడిగా రాసేస్తున్నా. ఒక్కో పాత్ర తన కోణం నుండి అదే కథ చెబుతుంది, వాళ్ళు చేసిందే సత్యం మిగతా వాళ్లంతా అసత్యాలు గా కనపడతారు. ఇంత సుత్తి ఎందుకురా అంటే, నిజ జీవితం కూడా అంతే, మనం ఏ విషయాన్ని అయినా మన కోణం లోనే చూస్తాము, మన కోణమే భలమని నమ్ముతాము. అలా నమ్మలేక పోతే మనం మనలేము. మనకి మనమే అసత్యంగా కనపడటం కన్నా మిక్కిలి బాధాకరం ఈ లోకంలో లేదు. ఒక్కోసారి మనతో మనమే ఓ నలభై  లేక ఏభై  ఏళ్ళు గడిపినా మనకి మనమే అర్థం కాము, ఇక ఇతురులనేమి అర్థం చేసుకోకగలం. ఆలా కాకుండా ప్రతీ విషయాన్ని ఇతరుల కోణం లో చూసే వారిని మనం ఋషులని అనాలేమో, వాళ్ళ మనుగడ పురాణ కాలాలలోనే, నిజ జీవితంలో అలాటివారి మనుగడ ఓ మిధ్య. నాకు ఓ మహా చెడ్డ వ్యక్తిత్వ లోపం వుంది, నేను ఇతరుల మాటలను బట్టి మరియు చేతలను బట్టి, వెంటనే వారి కోణంలో చూడకుండా అపార్థం చేసుకోవటంలో ఘనుడను. పైగా వారు నేను అనుకున్నట్టు గా ప్రవర్తించలేదని గింజుకోవటం. మనమనుకున్నట్టు బతకడానికి వాThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

May 13, 20205 min

మనకీ మందులున్నాయబ్బా!

చాలా పెద్ద కథని ఒక్క మాటలో చెప్పాలంటే నాకు గత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, ఆయుర్వేదము మరియు హోమియో వైద్యాలమీద నమ్మకం సడలింది. అదిగో మీకు వెంటనే కోపం వస్తుంది కదా! అయితే వినండి, నాకూ ఆయుధముంది, ఇది నా అభిప్రాయం మాత్రమే అని బుకాయించే ఆయుధము. సహజంగా నా అభిప్రాయాలు చివరకు తప్పని తేలుతుంటాయి, ఆ చివర ఎప్పుడు అని తెలుసుకోవాలంటే మీకు ఓపిక అనే గొప్ప గుణం ఉండాలి. నేను గత మూడు సంవత్సరాలుగా ఎక్కువ ప్రయాణిస్తూ, మరియు యింటికి అర్థరాత్రి లేక అపరాత్రికి చేరుతూ, అప్పుడు ఏది పడితే అది మెసవుతూ, సరిగా ద్రవ పదార్థాలు మరియు పీచు పదార్థాలు తినక, ఫిస్టులా మరియు ఫిషర్ లని కలిపి తెచ్చుకున్న. గత సెప్టెంబర్ లో రెండవ అభిప్రాయము లేకుండా మరియు తీసుకోకుండా మరియు స్నేహితులెవ్వరికీ చెప్పకుండా కేవలం నా సతి మాత్రమే తోడురాగా శస్త్ర చికిత్సా బల్ల మీద పడుకునేశా. శస్త్ర చికిత్స అనంతరం నా శరీరం లో సెటన్ అనే సైతానుని కూడా మూడు నెలలు భరించా.  ఈ సెటన్ అన్నది ఒక దారపు ఉంగరం, అది ఫిస్టులాని సహజంగా కత్తి  అవసరం లేకుండా కోసుకొని దానికై అదే బయట పడిపోతుంది అని మా వైద్యుడు ధృవీకరించాడు కూడా.  కానీ దానికి నా శరీరమంటే మిక్కిలి ప్రీతీ అయ్యి, ఈ హర్షా గాడిని కోసి నేను బాధించలేను అని నా శరీరం లోనే ఉండి పోయింది. దానికున్న జాలి మా వైద్యులుంగారికి  లేదు కదా మరలా నన్ను డిసెంబర్ మాసంలో  కోసిన దగ్గర మరలా కోసి సెటన్ బయటకి తీసి, ఇలా నూరుమందిలో పదిమందికి జరుగుతుంది, నీ మొహం చూసే అనుకున్న నువ్వు ఆ పదిమందిలో ఒకడివి అని చెప్పి, నొప్పి తగ్గక పోతే అప్పుడప్పుడు వచ్చి కనపడు అని చెప్పాడు. ఆ ముక్క నేను శస్త్ర చికిత్సా బెంచి మీద పడుకోక ముందే చెప్పాలి అని అనుకొని ఆ నొప్పి తగ్గడానికి ఇంకో మూడు వారాలు మంచమెక్కా నేను. కానీ నాకు గత నాలుగు  నెలలుగా హీల్ కావటం లేదు, నేను కూడా శపధం చేశా సుప్రియా దగ్గర లాక్ డౌన్ ఎత్తేసినా నేను నన్ను కోసిన వైద్యుడిని చూడను అని. మా అనీల్గాడు కాల్ చేసి కనుక్కుంటాడు ఎలా ఉందిరా, తగ్గిందా లేదా అని. వాడు చేసినప్పుడల్లా నేను కళ్ళ నీళ్లు పెట్టుకుంటా. ఇక వాడు నా బాధ చూడలేక ఎలాగూ బాధ పడుతున్నావు కదా, నిన్ను కోసినోడిని చూడనంటున్నావు కదా , ఏమీ  మందులు వాడకుండా ఏడ్చే బదులు నాకు తెలిసిన ఒక హోమియో వైద్యుడున్నాడు, ఆయన్ని కలిసి ఆయనిచ్చే ఆ నాలుగు తీపి గోళీలు  నములుతూ కూడా నీ ఇప్పుడేడిచే ఏడుపు ఏడ్చుకోవచ్చు అని సలహా పడేశాడు. సలహాతోనే ఆగకుండా ఆ హోమియో ఆయనతో మాటలాడి ఈ లాక్ డౌన్ లో కూడా నన్ను చూసే ఏర్పాటు చేసాడు. చెప్పొద్దూ మొదట దర్శనం లో ఆయన నన్ను ప్రొఫైలింగ్ చేసి పడేశాడు ఓ గంట కూర్చో పెట్టి. చలి అంటే ఇష్టమా లేక వేడి అంటే ఇష్టమా అన్నదానికి చలి ఉండటం వలన నాకు అమెరికా అంటే ఎంత ఇష్టమో కథలు కథలు గా చెప్పా. చిన్నప్పుడేదన్న నీకు బాధ కలిగే సంఘటన గురుంచి చెప్పమంటే మా లక్ష్మి కథ చెప్పేశా, చురుగ్గా వుండే వాడివా అంటే మా అమ్మ తప్పిపోయిన కథ చెప్పా,. పరీక్షలంటే టెన్షనా అంటే అసలు టెన్షన్ ఎందుకు మొదలయ్యింది అని నాది మరియు అనీల్గాడి ఇంటర్మీడియట్ సోది కథ చెప్పేశా, నీ స్నేహితులు నీ గురుంచి ఏమనుకుంటారు అంటే నీలో నువ్వు అన్నిటికీ పీక్కుంటావెందుకురా అంటారని చెప్పా. ఎవరన్నా బాధ పెడితే గుర్తు పెట్టుకంటావా అని అడిగితే ఎప్పుడో ఇరవై ఏళ్ళక్రితం మన గోపీ గాడు నాకు టైం ఉంటే మా యింటికి ఫోన్ చేసుకోకుండా నీకెందుకు చేస్తానురా అని అన్నాడని గుర్తుపెట్టుకొని వాడి మీద కథ రాసేసాను అని చెప్పా, చిన్నప్పుడు ఇంట్లో నిన్నెవరన్నా అన్నిటికీ సప్రేస్స్ చేశారా అంటే రామలక్ష్మణులేమో అలా సుందోపసుందులేమో ఇలా అనే కథ చెప్పా, పెద్దయ్యాక సప్రెస్ చేశారా అంటే గడ్డు కాలంలో నాతో నేను కథ చెప్పా. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

May 12, 20204 min

మా వాకాటి కథల్లో అశోక్ గాడు!

మాది ఇంజనీరింగ్ లో 1988-1992 బ్యాచ్. మా బ్యాచ్ మొదటినుండి మిగతా బ్యాచ్ ల కన్నా విభిన్నం. మాలో మేము కలివిడిగా వుండేవాళ్ళము, ఆట పాటల్లోనూ, చదువు సంధ్యలలోను మెరుగ్గా రాణిస్తూ. మేము కాలేజీలో వున్నంత  వరకు మేమే  ప్రతీ సంవత్సరం ఓవరాల్ చాంపియన్షిప్ ని కైవసం చేసుకున్నది. మా అయ్యవార్లు కూడా మా బ్యాచ్ చాలా పద్ధతైన బ్యాచ్ అనే వారు మేము చివరి సంవత్సరం పరీక్షలు ఎగ్గొట్టక ముందు దాకా, ఎగ్గొట్టేసాక మీ అంత పనికి మాలిన బ్యాచ్ ని ఇంత వరకూ చూడలేదు, చూడబోము కూడా అని తేల్చేశారు. మా సహాధ్యాయుడైన అశోక్ యెడ్లగాడు మొదటినుండి అందరికీ ఆత్మీయుడే. తన నవ్వుతో, కలివిడి తనంతో, మంచితనంతో అందరితోనూ చాలా ప్రేమపూర్వకంగా మెలిగేవాడు. మాలో చాలా మందికి వాడు సన్నిహిత మిత్రుడు. అందరిలాగే మేము కళాశాల చదువులు అయ్యాక వేళ్ళ మీద ఎంచదగ్గ వారితో తప్ప మిగతా వారితో సంబంధ బాంధవ్యాలు కోల్పోయాము. అప్పటిలో కొద్దిమందికే ల్యాండ్ లైన్ సదుపాయం ఉండెడిది,  ఇప్పటిలా చరవాణులు మరియు వాట్స్ అప్ సమూహాలు లేవు. క్రీ || శ 2000  సంవత్సరమనుకుంటా,  నేను డెన్వర్లో ఉండగా, మామ! అంటూ ఫోన్ చేసాడు వాడు. నా ఫోన్ నెంబర్ ఎలా పట్టాడురా  వీడు అని ఆశ్చర్యపోతూ,  ఏరా! ఎక్కడున్నావు, ఏమిటి విశేషాలు అంటే, నేను గత వారమే డెన్వర్ వచ్చానురా, ఫ్రెంచ్ క్వార్టర్స్ లో వుండే మా కంపెనీ గెస్ట్ హౌస్ లో వున్నా, వచ్చి కలువు అన్నాడు. ఓరి నీ పాసు గూల, వచ్చి వారమయ్యాకరా! నువ్వు నాకు కాల్ చేసేది, వచ్చే ముందు చేయలేక పోయినా, రాగానే అన్నా చేయాలి కదరా అంటూ వాడిని కలవడానికి వెళ్ళిపోయా.  సుప్రియాకి వాడిని పట్టకొస్తా మాకేమన్న ఉడకేసిపెట్టు అని చెప్పి. వాడిని చూడగానే చాలా సంతోషం వేసింది, వాడు కూడా అలాగే వున్నాడు గల గలా మాట్లాడుతూ. వాడితో పాటే ఆ గెస్ట్ హౌస్ లో దిగిన సర్దార్జీని పరిచయం చేశాడు. కొంచెం సేపు మాటాడుకున్నాక అశోక్ గాడిని మా ఇంటికి పట్టకెళ్ళిపోయా నేను. దార్లో చెప్పాడు వాడు, ఇంజనీరింగ్ అయ్యాక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేసాడని, అటుపిమ్మట, అమెరికాలో ఉంటున్న కన్సల్టెంట్ H1 స్పాన్సర్ చేయటంతో,  ఇక్కడ తేలాడు అని. నాకు చెప్పొద్దూ! మనమేమో తెగ సూపర్ అయినట్టు ఆపైన ఇక్కడికి వచ్చి ఎదో సాధించేసినట్టు,  వాడేదో చాలా అమాయకుడు, ఏమీ తెలియని వాడు అయినట్టు, ఎందుకు వచ్చాడురా నాయనా  యీ .కామ్ బూమ్ అంతా ఢమాల్ అయిపోయిన కాలం లో, అదీ జావా మీద, కష్టాల్లో పడిపోతాడు అని దిగులేసిపోయింది. వాడిని తరచి తరచి అడిగా వాడి అనుభవం గురుంచి మరియు వాడి కంపెనీ గురుంచి, వాడు విసుక్కొనే దాకా నువ్వూ నీ ఎదవ అనుమానమని. అలా వచ్చిన అశోక్ గాడు, సుప్రియాని అమ్మాయీ అని పిలుస్తూ, సుప్రియాకి మరియు పిల్లలకి చాలా దగ్గరైపోయాడు. నేను వాడిని తరచుగా కలిసే వాడిని మరియు వాడిని భోజనానికి ఇంటికి పట్టకెళ్లిపోయేవాడిని. ఒక రోజు వాడి రూమ్ కి వెళ్లిన నాకు, వాడి కొత్త రూమ్ మేట్ తలుపు తీశాడు, సర్దార్జీ లేడు రూమ్ లో, నాక్కూడా చాలా సంతోషమేసింది, వాడిక్కూడా వుద్యోగమొచ్చి వెళ్లిపోయాడేమో అని, ఎందుకంటే వాడు చాలా రోజులుగా బెంచ్ లో వున్నాడు కాబట్టి. అదే విషయం అశోక్ గాడిని అడిగా, వాడు నవ్వుతూ, హర్షాగా! వెళ్లి వాడిని ఇంకోమారు చూసి రారా అన్నాడు. ఏందిరా సంగతి అని వెళ్లి చూద్దునుగా ఆ తలుపు తీసింది క్లీన్ షేవ్ లో వున్న మా సర్దార్జీనే. వాడికీ ఉద్యోగమొచ్చేసింది. అశోక్ గాడు తీరిగ్గా నవ్వుతూ చెప్పాడు, వాడసలు అమెరికా వచ్చింది దీనికోసమేరా, ఇప్పటి దాకా భరించాడట వాడు, ఇక వాడి వల్ల కాదని ఇలా అవతరించాడు అని. మా సర్దార్జీకి ఉద్యోగమొచ్చిన సందర్భం గా వాళ్ళ ఫ్రెంచ్ క్వార్టర్స్ కి మాత్రమే గర్వకారణమైన ఇన్డోర్ వార్మ్ వాటర్ పూల్ లో తెగ ఈత కొట్టేశాము ఆరోజు మేము ముగ్గురమూ. అశోక్ గాడికి ప్రతిదీ ప్రశ్నయే, మన ముందు జుట్టు పెంచుకున్న మగవాడు వెళ్తుంటే, ఒరే, హర్షాగా! ఆ వెళ్ళేది అమ్మాయా లేక అబ్బాయా అనడిగే వాడు. నాకు మండి, నీది అమాయకత్వమా లేక ఇంకోటి ఏదన్నానా అని కయ్యి మనేవాడిని. సర్లేరా బాబూ! నీకంత కోపమైతే ఇలాటి ప్రశ్నలు అడగనులేరా అని చెప్పేవాడు వాడు. అశోక్ గాడి దృష్టి యిక వాడి వాహన చోదక కళని అభివృద్ధి చేసుకోవాలనే కోరిక మీద పడింది. నన్ను తెగ నస పెట్టటం మొదలెట్టాడు. నేను తప్పించుకోవాలని చూశా, అక్కడ చోదక నియమాలు చాలా ఎక్కువ అనే సాకు పెట్టి. కానీ వాడసలు వొదల లేదు, నాకసలు తప్ప లేదు. సరే వాడికి తోలడానికి అనుమతి ఉంది, పక్కన తోలటం వచ్చిన వాడు ఉండగా వాడు తోలవచ్చThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

May 10, 20206 min

మన వాకాటి కథల్లో గోపీగాడు!

ఈ మధ్య మా అనీల్గాడు ఓ వెధవ సలహా ఇచ్చేశాడు, వరస బెట్టి మన స్నేహితుల కథలు రాసెయ్యి, అవి ఓ ఇరవై అయిదు అయ్యాక మనం వాటిల్ని మన వాకాటి కథలు పేరున ఒక  సంపుటిగా తీసుకొద్దాము అని.  ఇలా రాయటం మొదలు పెడితే అంతా మన స్నేహితుల గురుంచే రాయాల్సి వస్తుంది, నా రాతలతో ఎక్కడో వాళ్ళ మానాన బతుకుతున్న వాళ్ళని ఎప్పుడో జరిగిన జ్ఞాపకాలతో ఎక్కడ బాధ పెడుతానేమో అన్న భయం వ్యక్తం చేసిన నన్ను చూసి, వాడు నవ్వి, ముండా నీ అభిప్రాయాలకి వాళ్ళు అంత విలువిచ్చి తెగ బాధ పడిపోతారని నువ్వు మరీ అంతలా ఇదైపోకు, ముందు రాసెయ్యి అని వాడికలవాటైన విధంగా చెల రేగిపోయాడు. నువ్వు ఈ కథలన్నీ నీ వైపునుండి వాళ్ళ మీద ఫిర్యాదుల పూర్వకంగా రాస్తే మేము ఇంకా సంతోషిస్తాము అన్నాడు, ఆ మాటల్ని బలపరుస్తూ మా గిరిగాడు, ఇరవై ఏళ్ల తర్వాత వాళ్ళ గతం మీద వాళ్లకు ఏమీ హక్కులుండవు అనే కావియట్ తో కథ మొదలెట్టు అని సలహా ఇచ్చి పారేశాడు. ఆలా సంపుటిగా తీసుకొస్తే దానికి ముందు మాట మన గిరిగాడు రాయాలి, మరి మన శ్రీధరగాడు తన డబ్బులతో ప్రచురించి, ఇళ్ళుల్లు తిరిగి అమ్మాలనే షరతు మీద ముందు మన గోపీగాడితో మొదలెడుతున్నా.   కడప జిల్లా ఎర్రకుంట్లకు చెందిన కొంగని గోపీచంద్  మా వాకాటి ఇంజనీరింగ్ కళాశాలలో మా మైటీ మెకానికల్ బ్రాంచ్ లో మా సహాధ్యాయుడు, నా నాలుగు సంవత్సారాల బెంచ్ మేట్ మరియు నాలుగేళ్లు ప్రాక్టికల్స్ లో ల్యాబ్ మేట్. నాలుగేళ్లలోనూ వాడికి నాకు క్రమం తప్పకుండా నాలుగైదు మార్కులే తేడాగా ఉండేవి. తెలుగు బాగానే మాటలాడుతాడు కానీ, మొదటి నుండి వాళ్ళ నాన్న గారి ఉద్యోగరీత్యా దేశమంతా సంచరిస్తూ  తదనుగుణంగా  సి.బి.ఎస్.యీ సిలబస్ లోనే చదవటం వలన, తెలుగు చదవటం, రాయటం రాదు. గూడూరులో బస్సు దిగి వాళ్ళనీ వీళ్ళనీ ఈ బస్సు వాకాటి వెళ్తుందా లేదా అని అడుగుతుంటే, ఒక ముసలవ్వ వీడికి ఏమయ్యా చూసేదానికి  చదువుకున్న వాడిలాగే కనపడుతున్నావు ఆ మాత్రం ఊర్ల పేర్లు చదువటం రాదా అని క్లాస్ పీకింది అని మా గిరిగాడు వాకాడు కాలేజీలో టామ్ టామ్ చేసేసాడు. మా గిరిగాడు ఏదన్నా చెబితే మేమిక నిజనిర్ధారణ లాటి పనికిమాలిన పనులు పెట్టుకోము. నా కథల్లో చిన్న పిల్లల మొదలు పెద్ద వారి వరకూ తెలుగు చదవటం రాని పాత్ర వుంటే ఆ పాత్ర పేరు గోపి అనే ఉంటుందని మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చెయ్యండి. వీడు, మా గిరిగాడు మరియు మేము ప్రెసిడెంటు అని ముద్దు గా పిలిచుకొనే నరేంద్ర గాడులు రూమ్ మేట్స్. వాళ్లిద్దరూ ఎలా చదివేవారో రూమ్ లో నాకు తెలియదు కానీ, వీడు మాత్రం మొదటి నుండి పద్ధతి గా చదివే వాడు, ఏ రోజు పాఠాలు ఆ రోజు. పరీక్షల రోజుల్లో కూడా ఏ మాత్రం కంగారు పడకుండా వాడి అలవాటు ప్రకారం పదిగంటలకు పడక వేసేసేవాడు ఎందుకంటే మొదట నుండి అన్నీ చదివేసుకొనే వాడు కనుక. మరీ ఇంత పద్ధతైన వాడిని నేను మొదట దూరం పెట్టేసే వాడినే కానీ, భిన్న ధృవాలు స్నేహం చేసినట్టు మా మధ్య స్నేహం అలా కుదురిపోయిందంతే మా ప్రమేయం లేకుండా. ల్యాబ్ లో వీడు పద్ధతిగా  పరిశోధనలు చేసి, పరిశోధనా విలువలు నాకు ఇస్తుంటే నేను కాల్కులేటర్ లో ఆ విలువలని ఎక్కించి ఫలితాన్ని రాబట్టి, ల్యాబ్ నుండి అందరికంటే ముందే బయటపడిపోయే వాళ్ళము. మా రోజుల్లో ల్యాబ్ నుండి ఎంత తొందరగా బయటపడితే అంత గొప్ప, ఈ సూత్రం మా మెషిన్ డ్రాయింగ్ కి వర్తించదు, ఎందుకంటే ఆ సబ్జెక్టు ఉండటం మా మెకానికల్ వాళ్ళు చేసుకున్న ఖర్మ. ఎవరో కొందరుండే వాళ్ళు మా బట్టల సత్తిగాడు లాటి వాళ్ళు డ్రాయింగ్ ని టప టప గీసేసి డ్రాయింగ్ హాల్ నుండి బయటపడిపోయేవాళ్లు. ల్యాబ్ లో గోపీగాడు తీసే రీడింగ్స్ మీద నేను ఎంత ఆధారపడిపోయానంటే మా మూడవ సంవత్సరపు థెర్మోడైనమిక్స్ యూనివర్సిటీ ప్రాక్టికల్ పరీక్షలో, నాకసలు రీడింగ్ తీయటమే రావటంలా, నేను రీడింగ్ తీసి రిజల్ట్స్ చూపితే మరలా వైవాకి అటెండ్ అవ్వాలి. అసలే చండశాసనుడు అయిన మా నాగేశ్వర రెడ్డి అయ్యవారు నా చుట్టూ అయ్యిందా లేదా అంటూ తిరుగుతున్నారు. ఆయనకి మెల్లగా చెప్పా నా ఇబ్బంది, ఓర్నీ నీ పాసుగూలా బాగానే చదివి చస్తావుగా నీకిదేం పోయే రోగం అని నాలుగు తిట్టి, మా ఎక్స్టర్నల్ ఎక్సామినర్ చూడకుండా ఆయనే రీడింగులు తీసిచ్చి పుణ్యం కట్టుకున్నాడు. ఆదాయన నేను ఫైనల్ ఇయర్ ఆయ్యేదాకా మనసులో పెట్టుకున్నాడు. సందర్భThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

May 9, 20207 min

మా వాకాటి కథలకు కొనసాగింపు!

"ఈ రోజు నేను, కమల గూడూరు నుండి వాకాటికి బస్సులో ప్రయాణిస్తూ సరదాగా ఒక జూనియర్ పిల్లగాడిని ర్యాగింగ్  చేశాము", అని ప్రకటించింది, ఒకనాటి సాయంత్రం నేను తనని కలవడానికి వెళ్లిన సందర్భంలో మా ప్రమీల . ప్రమీల మరియు కమల నాకు ఒక సంవత్సరం జూనియర్లు. ఓహో! అని అనుకున్నా. అవి కాలేజీకి కొత్త ప్రవేశాలు జరుగుతున్న తొలి రోజులవ్వటం మూలాన, ర్యాగింగ్ చేయాలన్న అత్యుత్సాహం చాలా మందిలో అప్పుడప్పుడే ఉరకలెత్తుతూవుంది. మేము అప్పటికే నాలుగవ సంవత్సరానికి చేరుకోవటంతో మాకు ఈ ప్రక్రియ పట్ల అంత వ్యామోహం లేదు. నా ఈ ఆలోచనలని భంగపరుస్తూ, "అబ్బబ్బా! ఏమున్నాడు వాడు, ముట్టుకుంటే మాసిపోయేలా అచ్చు అమీర్ ఖాన్ కి మల్లె", అంటూ కొనసాగించింది ప్రమీల. పైగా వాడికి ఎంత ధైయిర్యం మాతో ఏడిపించుకొని, "మాలా డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ ఆడపిల్లలని తాను ఎక్కడా చూడలేదని, ఇలా మీ డైనమిజం అంతా అడవి కాచిన వెన్నెలలా బస్సుల్లో వృధా కాకూడదని, అలా కాకూడదంటే మీరు వచ్చి నన్ను మా తరగతి నుండి బయటకు పిలిచి మరీ ర్యాగింగ్ చేశారంటే అప్పుడు మీరు గొప్ప అని ఒప్పుకుంటాను సవాల్ విసిరాడని" చెప్పింది తను. వీడెయ్యా! వీడెవడో మరీ గుండెలు తీసిన బంటులా వున్నాడే, చేరీ చేరక ముందే ఇన్ని వేషాలు వేస్తున్నాడంటే వీడు ఖచ్చితం గా హైదరాబాదోడే అయ్యుంటాడు అనుకుంటూ అడిగా తనని, అయితే తమరు ఆ సవాలును ప్రతిసవాలు చేయడానికే నిశ్చయించుకున్నారా అని. "అవును రేపు నేను, కమల వాడి తరగతి అయిన MH4  కి వెళ్లి వాడిని బయటకు లాగుతాము. అబ్బబ్బా! వాడున్నాడు చూడు అచ్చు అమీర్ ఖాన్ కి మల్లె", అంటూ తన ధోరణిలోకి వెళ్ళిపోయింది. నాకు ఆ అమ్మాయి వాడిని చూసి ముచ్చట పడటం, ముద్దుగా వుండే ఓ చిన్ని కుంకను చూసి మనమెలా ముద్దు చేస్తామో అచ్చు అలాగే అనిపించింది. "MH4 అంటే మెకానికల్ హాల్ 4  అది మా ఫైనల్ ఇయర్ మెకానికల్ వాళ్ళ తరగతి గది అంటే మా తరగతి, ఏమోలే క్లాస్ రూమ్స్ అప్పుడప్పుడు ఎక్స్చేంజి అవుతుంటాయని సర్ది చెప్పుకున్నా, నాకేదో ఎక్కడో తేడా అనిపిస్తుంది, ఎందుకంటే మా కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు మరియు వసతి గృహాలు, సీనియర్స్ వుండే ప్రదేశాలకు కాస్త దూరం లో ఉంటాయి, జూనియర్స్ ని ర్యాగింగ్ నుండి రక్షింపపడడానికి. మరి ఈ అమ్మాయేమో వాడి తరగతి MH4 అంటుంది", లాటి ఆలోచనలు తిరుగుతున్నాయి, ఆ అమ్మాయి వాడిని వర్ణిస్తున్నంత వరకూ. అయినా మనం చాలా విషయాల్లో మాశ్రీధర్ గాడిలా ఎక్కువ బుర్ర పెట్టము కదా అందుకే ఎక్కువగా ఆలోచించ కుండా వదిలేశా, ఆ విషయాన్ని అంతటితో. మరుసటి రోజు మా అనీల్గాడు హడావిడిగా వచ్చాడు. వచ్చీ రాగానే ఎప్పుడూ ముందు వరుసలో కూర్చొని పాఠాలు తెగ వినేసే  మా శ్రీధర గాడిని మరియు నాలుగో బెంచీలో కూర్చొనే నన్నూ తెగ ప్రేమగా, ఒరే నాకు ఈరోజు మా యింటి  మీద బెంగయ్యింది, నేను ఈ రోజంతా మీతోనే ఉండాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఈరోజు నా నివాస స్థలమైన ఆఖరు బెంచీకి రండిరా అని. అబ్బా ఛా! వీడికి ఈ కళలు కూడా ఉన్నాయా అని అనుకునేలా మా హృదయాలను ద్రవింపచేసేలా బ్రతిమాలుకొని మమ్మల్ని చివర బెంచీకి బదిలీ చేయించుకున్నాడు. ఎప్పుడు వాడి పక్కన పడివుండే ప్రశాంత్ గాడినేమో మా శ్రీధర గాడు ఖాళీ చేసిన మొదటి బెంచీలో కుర్చోపెట్టాడు. నాకు ఇదంతా ఎదో తేడా అనిపిస్తున్నా, మమ్మల్ని అడిగిందెవరు మా అనీల్గాడు కాబట్టి నా సందేహాలు పక్కన పెట్టా. మా శ్రీధర గాడితో ఏమన్నా ముందే చెప్పుంటే వాడెప్పుడో ఈ చుక్కలన్నీ కలిపేసి ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో చెప్పేసేవాడు. అది మా  హెడ్డు అఫ్ ది డిపార్ట్మెంట్ మరియు ఆ సంవత్సరమే ప్రిన్సిపాల్ హోదా లభించిన మా ప్రభాకర రావు గారి క్లాస్. ఆయన ఎప్పటిలాగే ఆయన మానాన బోర్డు మీద ఓ బొమ్మని చెక్కి ఆ చెక్కటం లోని ఆయన ప్రావీణ్యానికి ఆయనే తన్మయులై, ఆ బొమ్మకే పాఠం చెప్పుకుంటున్న వేళ, ఆయనకి తపో భంగం కలిగిస్తూ, తలుపు దగ్గర ఎవరో నిలబడి ఆయన్ని ఎదో అనుమతి అడిగారు, ఆయన మా వైపు తిరగాల్సిన దానికే చిరాకు పడుతూ, "ప్రశాంత్ యు హేవ్ సం విజిటర్స్"  అని చెప్పి మరలా బొమ్మకి తుది మెరుగులు దిద్దటంలో  మునిగిపోయారు. మా హాస్టల్ వెధవలందరూ పళ్ళికిలిస్తూ ఒకళ్ళకొకళ్ళు హై-ఫై  లు ఇచ్చుకోవటం మొదలెట్టారు. వీళ్ళు ఎందుకిలా అని మా సెంటర్ వాళ్లమంతా తెల్ల మొహాలేసుకొని చూస్తున్నాము. కొంత సద్దుమణిగాక మాThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

May 9, 20208 min

మా వాకాటి కథలు

నాకు శైలేంద్ర అని ఇంజనీరింగ్ లో దొరికిన స్నేహితుడున్నాడు. వాడి ఎత్తు అయిన ఐదడుగుల ఆరంగుళాల కన్నా ఎక్కువ వుండి ఉంటే మన చలన చిత్రాలలోని కథానాయకులకేమీ తీసిపోడు. మొదటి సంవత్సరమంతా వాడికి మా వాకాటి కాలేజీని వాడికి తగ్గ కాలేజ్ కాదు అని తిట్టుకోవటంలోనే సరిపోయింది. నాకు తెలిసి వాడు మా గోపీచంద్ గాడు మా కాలేజ్ లో చేరాక కూడా మళ్ళి ఐ.ఐ.టి కి ప్రిపేర్ అయ్యారు అని నా అనుమానం. నేనూ మా శ్రీధర గాడు, పరీక్షలకు ముందర ఒక ఓవర్ చూసి వద్దామని, వన్డే క్రికెట్ మ్యాచ్ అంతా చూసి సాయంత్రమయ్యేసరికి ఆ మర్నాడు జరగబోయే పరీక్షకు తగ్గ ప్రిపరేషన్ చాలలేదని కంగారు పడే వాళ్ళం. ఆ కంగారులో కూడా మనకి మన శైలేంద్ర గాడు తోడున్నాడులే అని ఊరట పడుతూ వాడి రూమ్ కి వెళ్లే వాళ్ళం. మేమెళ్ళేసరికి వాడు మంచిగా తల స్నానం చేసి, నీట్ గా ఒక కుర్చీలో కూర్చొని, పైన ఒక పెద్ద పాడ్ పెట్టుకొని మొదటి చాప్టర్ మొదటి పేజీలోని వుండే వాడు. హమ్మయ్య వీడు మనకన్నా ముందుకెళ్ల లేదు అనుకోని తృప్తిపడి రూమ్ కి వెళ్లే వాళ్ళము. ఆరోజు నైట్ మా తంటాలు మేము పడి, గంట చదివి, ఓ గంట సెంటర్ దాకా వెళ్లి టీ తాగటంలో గడిపి మొత్తానికి ఓ నాలుగైదు చాఫ్టర్లు కంప్లీట్ చేసే వాళ్ళం. పరీక్షలు మధ్యాహ్నం పూట జరిగేవి కాబట్టి, ఉదయం పొట్టకి కాస్త బ్రేక్ ఫాస్ట్ పట్టిచ్చి, మరలా మా శైలేంద్రగాడు ఎక్కడున్నాడబ్బా అని వాడి రూమ్ కి వెళ్లే వాళ్ళం, మేము వెళ్లే సరికి మా వోడు తెగ ఆలోచనా నిమగ్నుడయ్యి  ఆకాశం లోకి చూస్తూ ఉండేవాడు, కాకపోతే పేజీలు మొదట చాప్టర్ మధ్య వరకూ తిప్పబడి. ఏరా ఏమి చేస్తున్నావురా అంటే, ఉదాహరణకి ఈ బ్యాంకింగ్ యాంగిల్ అఫ్ ది కర్వుడ్ సర్ఫేస్ మీద దీర్ఘంగా ఆలోచిస్తున్నానురా, ఆలోచించగా ఆలోచించగా ఈ బుక్ లో రాసింది తప్పురా హర్షాగా అనేవాడు. మా ఇద్దరికైతే బి.పి పెరిగిపోయేది. ఒరే శైలేంద్రగా నువ్వు ఈ రీసెర్చ్ అంత నువ్వు డాక్టరేట్ చేసేటప్పుడు చేద్దువురా, ఇప్పుడంతా మనం  జవాబులు ముక్కున పెట్టుకొని వెళ్లి రాయాలిరా నాయనా, అని మా శ్రీధర గాడిని రూమ్ కి పంపి వాడికి నేను చదివిన అరాకొరా పరిజ్ఞానంతో  ఓ నాలుగైదు ఇంపార్టెంట్ ప్రశ్నలకి జవాబులు వాడి చేత బట్టీ పట్టించి రూమ్ కి వెళ్లి, ఈ లోపల మా శ్రీధర గాడు చదివిపెట్టిన ప్రశ్నలకి జవాబులు వాడితో ఎక్స్ప్లెయిన్ చేయించుకొని, ఎదో విధంగా సిలబస్ అయ్యిందనిపించి పరీక్షకి హడావిడిగా వెళ్ళేవాళ్ళం. పరీక్షా హాల్ కి వెళ్లే దారిలో మాకేమన్న ప్రశ్నలకి జవాబులు తట్టక పోతే మా విశ్వవిద్యాలయ ప్రథముడైన మా సుబ్బూ గాడిని బతిమాకునే వాళ్ళం, జవాబులు చెప్పరా అని. వాడు మాత్రం, అబ్బా హర్షా! శ్రీధరా మీరు టెన్షన్ పడకుండా పరీక్షా హాలుకి వెళ్ళండిరా నాయనా, అక్కడ మీకు వాటికవే గుర్తొచ్చేస్తాయి అనే వాడే కానీ ఒక్క క్లూ అంటే ఒక్క క్లూ కూడా ఇచ్చే వాడు కాదు. మా టెన్షన్ మేము పడుతూ పరీక్షా హాలుకి నడుస్తుంటే మాకు ఇంకో టెన్షన్, మా ఎలక్ట్రానిక్స్ బ్యాచ్ మేట్  అయిన స్నేహలత, వెళ్లే దార్లో పుస్తకం చదువుతూ చదువుతూ అడ్డొచ్చిన తుప్పల మీదకెళ్ళి పోయి ఎక్కడ పడిపోద్దో అనే ఆదుర్దా మాకొకటి. అసలే ఆ అమ్మాయి గెడ కర్రలా ఉండేది, తట్టుకొని కిందపడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అమ్మాయా! మమ్మల్ని చూడు ముందే అన్నీ చదివేసి ఎంత హాయి గా పరీక్షా హాలుకెళ్తున్నామో అని ఒక క్లాస్ పీకాలనే కోరిక మాకు మనసులో. మా శైలేంద్ర గాడు నేను చెప్పిన జవాబులు ముక్కున పట్టి సుద్ధంగా పరీక్షల్లో రాసొస్తే నేను తప్పులు చేసొచ్చేవాడిని. మనకసలే పరీక్షా హాల్లో తింగరి డౌట్స్ వచ్చి జవాబులు చెడకొట్టి వచ్చే వాడిని. మా శైలేంద్ర గాడు ఇప్పటిక్కూడా వాడి  ఇంజనీరింగ్ మార్కుల్లో  నాలుగో వంతు వాటా హర్షా గాడితే అని ప్రకటిస్తాడు, నాకు అమిత సంతోషం కలిగేలా. ఒకసారి కలిసినప్పుడు చెప్పేడు మా శైలేంద్రగాడు, ఒరే! నాకు ఎక్సెలారై లో ఎం.బి.ఏ లో ప్రవేశం వచ్చిందిరా, కానీ నేను చేరలేదురా అని. అదేందిరా శైలేంద్ర అంటే, అడ్మిషన్ కార్డుని మా పోస్ట్ మాన్ ఆరు నెలల తర్వాత తెచ్చిచ్చాడురా అని చెప్పాడు. ఒరే నాతో చెప్పావు కానీ ఎవరితో చెప్పుకోకురా అని చెప్పా నేను, దాని వాడు, ఏరా నాకు అంత తెలివి లేదా అని అడిగాడు నన్ను. నేను నీ తెలివి గురించి సందేహపడటం లేదురా నీ తల రాత గురుంచే నా సందేహం అని చెప్పా నవ్వేస్తూ. అందులోనూ వాడు హస్త సాముద్రికంలో మెరిక లాటి వాడు. వాడి హస్త సాముద్రికం, పెరటి చెట్టు వైద్యానికి పనికి రానట్టు వాడికే పనికిరాలా. వాడు కూడా నవ్వేసాడు కొంచెం బాధగా.  This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

May 8, 20207 min

మా (కానీ) సత్యం!

నేను నా కథలతో మా ఇంట్లో కనిపించిన పుస్తకాన్నంతా నలుపు చేసేస్తున్నానని, ఈ రోజు మా అమ్మ నాకో మందపాటి పాత డైరీ ఇచ్చి, దీంతో రాసుకో, రాసుకొని ఎక్కడంటే అక్కడ పారేసుకోకుండా జాగ్రత్త పెట్టుకో అని చెప్పింది. ఆ పాత డైరీ తీసుకోగానే, ఏదైనా ఓ పాత మధురంతో వెంటనే నలుపు చేసెయ్యాలన్న కోరిక నన్నావహించింది. ఎవరి గురుంచి రాయాలబ్బా అని ఆలోచిస్తుంటే మా సత్యగాడు గుర్తొచ్చాడు. ఇప్పగుంట వెంకట సత్యనారాయణ, మా స్నేహితులకందరికీ ఐ.వి.ఎస్ గా సుపరిచితుడు, కానీ నాకు మాత్రం సత్య గానే, మా ఇంట్లో వాళ్లకు సత్యంగా. జీవితం లో కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళని మనం కథలలో చదువుతూ లేక సినిమాలలో చూస్తూ లేక నిజ జీవితం లో ఎవరి ద్వారా అయినా వింటూ చాలా ఉత్తేజితుల మవుతాము, కానీ అలాటి ఒక వ్యక్తి మన సమకాలీనికుడు అయినప్పుడు మన జీవనక్రమంలో పడి తన  ఎదుగుదలని మనము పెద్దగా గమనించలేము. అలా మా సమకాలీనుకులలో జీవనక్రమాన్ని మొదలుపెట్టిన స్థితితో పోలిస్తే ప్రస్తుత స్థితి ఎంతో అందలేనంత ఎత్తులో నిలుపుకున్న వ్యక్తే మా సత్య. కానీ ఈ క్రమంలో వాడేమి బావుకున్నాడో లేక ఏమి కోల్పోయేడో వాడికే తెలియాలి. మనిషి ఐదడుగుల ఆరంగుళాల ఎత్తుతో, చక్కటి వర్ఛస్సుతో, అప్పటికే ఎన్నో ఆటుపోటులను చవిచూసిన కారణంతోనో లేక బాల నెరుపు వల్లనో అక్కడక్కడా తెలుపు లేక ఎరుపు కానీ జుట్టు ఉండేవాడు సత్య. తన చురుకుతనంతో, తెలివితేటలతో, మహా కలివిడి తనంతో మరియు సహజ సిద్ధంగా అలవడిన వేణుగానంతో వాడు మా కాలేజీ చేరిన కొద్ది దినాల్లోనే బాగా పాపులర్ అయిపోయాడు. నాకు, శ్రీధర గాడికి వాడు ఎప్పుడు స్నేహితుడైపోయాడో కూడా తెలియనే లేదసలు. తెలిసే సరికి వాడు కూడా శ్రీధర గాడిలాగే మా కుటుంబ సభ్యుడైపోయాడు, వాళ్ళని నే పిలిచే వరసలతోనే పిలిచేస్తూ. రోజుల తరబడి తినకపోయినా, నిద్రపోకపోయినా, అలుపెరగని దేహం, చెక్కు చెదరని నవ్వు వాడి సొంతం. కాలేజీ లో పగలంతా లేక చాలా పొద్దుపోయిన దాకా అందరి రూములూ కలియ తిరుగుతూ, సందడి సందడి చేస్తూ, అందరూ పడుకున్నాక, తెలవారు ఝాము వరకూ చదువుకోవటం వాడి అలవాటు. నెల్లూరు జిల్లాలోని కావలి వాడి స్వస్థలం. పుట్టింది పేద బ్రాహ్మణ కుటుంబములో. చదువుకున్నది కావలి బ్రాహ్మణ సంఘము వారి సహకారంతో మరియు వారాలు చేసుకుంటూ. వాడు పదవ తరగతి ఉత్తీర్ణుడయ్యాక, ఆ సంఘము వారు వాడి బతుకేదో బతికేస్తాడని వాడిని ఓ టైపు ఇన్స్టిట్యూట్లో  చేర్చారట, అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ యజమాని వీడి తెలివితేటలు చూసి పైచదువులు చదువుకోమని ప్రోత్సహించాడట. అలా ఎంసెట్ రాసి ఆయన సహకారంతో వీడు మా కాలేజీలో పడ్డాడు. అలాగే వీడు వీడి చదువులతో ఎప్పుడు ఆయన్ని నిరాశ పరచ లేదు. మేము మా రెండవ సంవత్సరంలో ఉండగా వాళ్ళ నాన్నగారు పోయారు. వీడు మాకెవరికీ చెప్పకుండా కావలికి వెళ్ళిపోయాడు. మేము ఒక పదిమంది స్నేహితులం తెలుసుకొని కావలికి చేరే సరికి అర్థరాత్రి అయిపొయింది. మాకు వాడి ఇల్లు ఎక్కడో కూడా తెలియదు. నాకు ఓ చిన్న జ్ఞాపకం, ఎక్కడో జనతా పేటలో వాళ్ళ ఇల్లు అని. మా దురదృష్ట వశాత్తు మేము దిగిన రోజే కావలిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళ రాష్ట్ర మహా సభలు జరుగుతున్నాయి. మేము బస్సు దిగి నాలుగు అడుగులు వేసేమో లేదో, ఒక పోలీసు జీప్ వచ్చి మమ్మలన్దరినీ కట్టగట్టి పోలీస్ స్టేషన్లో పడేసింది. మేము ఇలా స్నేహితుడి నాన్నగారు చనిపోతే వచ్చాము అన్నా నమ్మే నాథుడే లేదు, మాలో కనీసం ఒక్కడి దగ్గర కూడా కాలేజ్ ఐడెంటిటీ కార్డు లేదు. మాతో పాటే జీపులో ఎక్కించుకొచ్చిన ఒక దొంగని మా కళ్ళ ముందరే సెల్ లో నాలుకు పీకుతుంటే బిక్కు బిక్కుమని గడిపాము. మా అదృష్టవశాత్హు ఆ దొంగని బాదిన ఒక కానిస్టేబుల్ మా సత్యకి ఇంటర్లో సహాధ్యాయుడు అవటంతో, ఇన్స్పెక్టర్ కి చెప్పి సత్య వాళ్ళింటికెళ్లి వచ్చి మేము చెప్పింది నిజమే అని నిర్ధారణ చేయటంతో, ఆ కానిస్టేబుల్ సహాయంతోనే మేము సత్య వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. వాళ్ళ ఇంటికెళ్లాకే మాకు తెలిసింది, సత్యాకి ఒక అక్క ఉందని, ఆ అక్క అప్పటికే ఒక ముస్లింని పెళ్లిచేసుకొని ఇంటినుండి వెళ్ళిపోవటంతో వీడు తనతో సంబంధ బాంధవ్యాలు తెంచేసుకున్నాడని. మేము ఉన్నంత వరకు వాళ్ళ బావ గారు మాతో చాలా కలివిడిగా, మా వెంటనే వున్నారు. పోనీలే ఆవిడ వీడి కోపతాపానికి బలయినా ఆవిడకి మంచి భర్తే వచ్చాడని అనుకున్నాము మేము. ఇద్దరు పిల్లలు అనుకుంటా వారికి అప్పటికే. అలా మేము వాళ్ళ నాన్నగారి కర్మకాండలలో పాలుపంచుకొని, ఆ రాతిరికి వాకాడుకి చేరుకున్నాము. వాళ్ళ నాన్నగారు చనిపోవటంతో వాడు వాళ్ళ అమ్మగారిని తీసుకొనిThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

May 3, 202011 min

మన జీవితాల నాయకా నాయకులు! రెండవ భాగం

నేను ఇంతవరకూ రాసిన కథల పాత్రల జీవితంలో ఎదో ఒక సంఘర్షణ ఉండేది. అలా సంఘర్షణ వున్న పాత్రల గురుంచి రాస్తేనే ఓ మంచి కథ అవుతుంది అని నమ్మేవాడిని. కానీ ఆర్ధిక పరమైన కొన్ని సంఘర్షణలు తప్ప వ్యక్తిగతమైన సంఘర్షణలు లేకుండా జీవితాన్ని గడిపి, ప్రేమలను మాత్రమే పంచిన మన పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, మామలు, అత్తలు మొదలగు వారి గురించి కూడా రాయాలి. వీళ్లంతా మనమెక్కడో వెతుక్కోవాల్సిన పనిలేకుండా మనపక్కనే వుంటూ వాళ్ళ జీవితాల్ని ఎంతో కొంత మనకు ధారపోసిన నాయకులూ లేక నాయికలు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇందరి సహాయ సహకారాలు, ప్రేమానురాగాల వల్లనే మనం పెద్దవారి మయ్యామన్న స్పృహ కలుగుతుంది. ఇక నేను ఇటువంటి కథలకు విక్రమాదిత్యుడు-బేతాళుడుల కథలకు మల్లె పైన రాసిన వాక్యాలు పరిచయ వాక్యాలుగా వస్తాయి. మా మేనత్తని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసింది మా నాయనమ్మ. మరలా మా మేనత్త తన కూతురిని తన తమ్ముడు అంటే మా చిన్నాన్న కిచ్చి పెళ్లి చేసింది. అలా మా పిన్నమ్మ మరియు చిన్నాన్నల పెళ్లి రెండవ తరపు మేనరికం. మా పిన్నితో మాకు చాలా మంచి అనుబంధం వుంది. ఆవిడ పని చేయటం లో మహా చురుకు, మాటల్లో మాత్రం మహా నిదానం. మా అమ్మ ముక్కీ మూలిగి ఇంటి వెనక ఉండే చిన్న లోగిలి ఊడ్చే లోపలే మా పిన్ని ముందున్న చాలా పెద్దదైన లోగిలి అంతా చిమ్మేసి, కళ్ళాపి చల్లేసి, ముగ్గులు కూడా పెట్టేసి వచ్చేసేది. మాతో రక రకాల ఆటలు ఆడటం అంటే తనకి చాలా ఇష్టం. చిన్నా చేయి చాపు తాయిలం పెడతా అని, అని నేను చేయి చాపగానే, బతికున్న కప్పనే చేతిలో పెట్టి పారిపోయేది, మా కేకలకు ఎక్కడ మా అమ్మ వచ్చి చీవాట్లు పెడుతుందో అని. అలాగే రబ్బరు బల్లిని అందరూ నడిచే చోట గోడలకి అంటించి అది వాళ్ళు నడిచేటప్పుడు సరిగ్గా వాళ్ళ నెత్తిన పడేలా చేయటం వాళ్ళు భయంతోనో అసహ్యం తోనో కేకలు పెడుతూ దులుపుకుంటుంటే పక పక లాడటం, వాళ్ల మీద బొద్దింకలేయటం లాటి ఆటలతో మా ఇల్లు సందడే సందడి. తాను మమ్మల్ని భయపెట్టడానికి తన కను రెప్పల్ని వెనక్కి ముడుచుకొని, గాలి నోటితో లోపలి పీల్చుకుంటూ బొంగురు గొంతుతో భయపెడితే నాకు దడుపుతో ఆ రాతిరికి జ్వరం కాసేది. దానికి తోడు మా చిన్నాన్న కూడా చాలా సరదా మనిషే. మా ముందు గోళీలను మాయం చేసి మా చెవుల్లోంచి, ముక్కుల్లోంచి తీయటం, మనసులో ఓ అంకెను అనుకొని, దాన్ని రెండుతో పెంచి, ఓ పది కలిపి లాటి కంగాళీ లెక్కలు చేసి మనసులో మేము అనుకున్న అంకెను ఆయన చెప్పటం లాటి సరదా లెక్కలు చేయించటం, మమ్మల్నివీపు మీద ఎక్కించు కొని బావిలో ఈదటం, మా వూరిలో వేసే నాటకాల్లో ఎప్పుడు పంతులు వేషం వేసినా మా చిన్నాన్నే వేశాడు అని మేము ఎప్పటికీ గుర్తుపట్టలేనట్టు మమ్మల్ని మాయ చేయటం, నేను ఒకటి రెండు మూడు అనే లోపల మీరు మంచం దిగుతారు అని పందెం కట్టి మేము పందేనికి ఒప్పుకోగానే, మూడు అని ఎప్పటికీ అనకుండా మమ్మల్ని విసిగించి మేమే దిగేలా చేయటం లాటి పనులతో మా చిన్నాన్న అంటే మేము ప్రాణం ఇచ్చేలా చేసుకున్నాడు ఆయన. అసలు ఆయన మమ్మల్ని ఎప్పుడు సందడిగా, ఉత్సాహం గా ఉంచడానికి చాలా చిట్కాలు, పాటలు మరియు పద్యాలు నేర్చుకున్నాడు అని అనుకుంటే ఆ ఇష్టం ఇంకా ఎక్కువయ్యేది. ఆయన బావిలో మమ్మల్ని వీపునెక్కించుకొని ఈతలు కొట్టే ఆటలకి మా అమ్మ తన అనుమతి ఇచ్చేస్తే మా పిన్ని మాత్రం తన కొడుకుని సంకనేసుకొని తోటలోంచి ఇంటికి పరిగెత్తేసేది వాడిని ఆయనకు దొరకనీయకుండా. వాడు రెండు తరాల మేనరికాల వలన పుట్టటమే కొంచెం బలహీనప్రాణి. వాడంటే మా ఇంటిల్లిపాదికీ గారాభమే. వాడికైతే స్నానం చేయించడం, అన్నం పెట్టడం, కథలు చెప్పడం లాటి అన్నీ పనులకి వాళ్ళ పెద్దమ్మ అంటే మా అమ్మే ఉండాలి. వాడు ఒకరోజు అత్యుత్సాహం తో నన్ను మా దొడ్లో వుండే నీళ్ల తొట్టిలో దించమన్నాడు, నేను ఉత్సాహం గా దించేసా, దిగాక వాడు నాకలివి గాలా, ఎంతకూ రాడు బయటకి, నేను వాడిని నా చేతులతో మునిగిపోకుండా అలాగే పట్టుకొని కేకలు వేస్తూనే వున్నా, ఎప్పటికో మా అమ్మా పిన్ని వాళ్ళు విని పరిగెత్తుకొచ్చారు, ఆ రోజు మా పిన్ని భయపడి ఏడ్చిన విధానం, ఇంక నేను వాడితో ఎప్పటికీ అలాటి ప్రయోగాలు చేయకుండా చేసింది. అలాగే వాడేమన్నా తులిపి పనులు చేసి ఆమె చేతిలో తన్నులు తిని, వాడు ఏడవటం, వాడితో పాటూ ఆమె ఏడవటం, అందరూ తిరిగి ఆమెని తిట్టేవరకు జరిగేది, అంతలా ఏడ్చేదానివి వాడిని కొట్టటం ఎందుకు మొదట అని. మా పిన్ని మా చిన్నప్పుడు తినడానికి వేరుసెనగ ముద్దలో, చలిమిడి ముద్దలో, నువ్వుల చిమ్మిరో చాలా క్రమం తప్పకుండా చేసేది. కానీ ఎప్పుడూ అన్నీ మా దగ్గర పెట్టేది కాదు, చాలా జాగ్రత్తగా దాచి రోజుకొక్కటే ఇచ్చేది. ఏరోజుకారోజు అయిపోయాయి, ఇదే చివరి ముద్ద అని చెప్పేది, ఆమె ఎక్కడ దాచుతుందో అని మేము ఎంత గూఢచర్యం చేసినాThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Apr 28, 202013 min

మన జీవితాల నాయకా నాయకులు! ఒకటవ భాగం

నేను ఇంతవరకూ రాసిన కథల పాత్రల జీవితం లో ఎదో ఒక సంఘర్షణ ఉండేది. అలా సంఘర్షణ వున్న పాత్రల గురుంచి రాస్తేనే ఓ మంచి కథ అవుతుంది అని నమ్మేవాడిని. కానీ ఆర్ధిక పరమైన కొన్ని సంఘర్షణలు తప్ప వ్యక్తిగతమైన సంఘర్షణలు లేకుండా జీవితాన్ని గడిపి, ప్రేమలను మాత్రమే పంచిన మన పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, మామలు, అత్తలు మొదలగు వారి గురించి కూడా రాయాలి. వీళ్లంతా మనమెక్కడో వెతుక్కోవాల్సిన పనిలేకుండా మనపక్కనే వుంటూ వాళ్ళ జీవితాల్ని ఎంతో కొంత మనకు ధారపోసిన నాయకులూ లేక నాయికలు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇందరి సహాయ సహకారాలు, ప్రేమానురాగాల వల్లనే మనం పెద్దవారి మయ్యామన్న స్పృహ కలుగుతుంది. ఈ మధ్య మా అమ్మతో మాట్లాడుతుంటే, తన చిన్ననాటి స్నేహితురాలైన ఈదల పద్దమ్మ గారి గురుంచి చెప్తూ, తన చిన్నతనంలో తనంతటి వయస్సు వుండే ఆవిడ చాలా పెద్దదైన వాళ్ళ పెరడు అంతా ఊడ్చి, కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, ఆ తర్వాత అంట్లు అన్నీ తోమేస్తే మా అమ్మ తనకి సహాయం చేసేది అంట్లు కడగటంలో. మా అమ్మనడిగా నేను, మరి మీ ఇంట్లో ఈ పనంతా ఎవరు చేసేవారు అని. మా చిన్నక్క ఐన సరోజినక్క అని చెప్పింది. చెప్తూ మన పనంతా గోసంగిలా ఊరంతా స్నేహితురాళ్ళతో తిరగటమే, అంత మా అక్కే చూసుకొనేది అని సెలవిచ్చింది. ఈ ఒక్క వాక్యం చాలు మా చిన్న పెద్దమ్మ ఎంత కష్ట జీవో, మరియు తన చెల్లెలైన మా అమ్మ కూడా పని చేయాలి కదా అని వంతుల కోసం ఎదురు చూడకుండా తన పని తాను ఎలా చేసుకొని పోయేదో చెప్పడానికి. మా సరోజన పెద్దమ్మ మరియు మా శేష పెదనాన్నలకి నలుగురు సంతానం. ముగ్గురాడపిల్లలు మరియు ఒక మగ నలుసు. మా పెదనాన్నకి అందర్నీ ప్రేమించటం, వ్యవసాయప్పనులు చూసుకోవటం తప్ప ఏమీ తెలియదు మా పెద్దమ్మే అన్నీ చక్కబెట్టుకోవాలి. వాళ్లిద్దరు వాళ్ళ నలుగురు పిల్లలతో పాటు మాకు, అంటే మా అన్నకి, అక్కకి మరియు నాకు, సమానంగా ప్రేమని పంచారు, ఇంకా ఒక పాళ్ళు ఎక్కువే, మేము చిన్న పిల్లలమవటంతో. మా పెదనాన్న వాళ్ళ నాన్నగారు మా అమ్మమ్మ వాళ్లకి బంధువులు మరియు వాళ్ళకి మొదటినుండి ఉప్పలపాటిలో పొలాలు ఉండటం తో మా పెద్దనాన్న ఉప్పలపాటికే వచ్చేశారు. అలా మా సొంత అక్క ఉప్పలపాటిలో మా పెద్దమ్మ పెద్ద నాన్నల దగ్గరే పెరిగేసింది. మా నాన్నమ్మ వాళ్ళ వూరైన ఉలవపాళ్లలో మా నాన్నకసలు ముగ్గురు పిల్లలని తెలీనే తెలియదు. మా అక్క మా ఉలవపాళ్ళకి అప్పుడప్పుడు వచ్చి పోయే ఇందిరమ్మ. ఎందుకో తెలియదు మా ఉలవపాళ్ళ జనాలు మా అక్క పేరు సుమతి అయినా, ఇందిరమ్మ, లేక ఇందిరా గాంధీ అనే పిలిచే వాళ్ళు. అలాగే నేను ఉప్పలపాటి వచ్చి ఎక్కడికైనా వెళ్లాలంటే మా పెదనాన్న భుజాలమీద ఎక్కి వెళ్లాల్సిందే, నాకు బాగా లేనప్పుడు ఎత్తుకెళ్ళి చీటీలు కట్టించటం, లేక కామెర్లకి పక్కూరికి తీసుకెళ్లి మందు పెట్టించటం, అంత ఎందుకు మా ఊరి పొలాల వెనక పారే వాగులో దొరికే అతి రుచికరమైన అర్జులు అనబడే చేపలు తెచ్చుకోవాలన్న నేను మా పెదనాన్న భుజం ఎక్కాల్సిందే. ఆయనకి ప్రేమ ఎక్కువైతే నా బుగ్గలు కొరికేసేవారు. అదొక్కటే నేను ఆయన మీద చేయగలిగిన ఫిర్యాదు. ఆఖరకు మేము ట్యూషన్లో లేట్ అయినా లాంటర్న్ ఎత్తుకొని వచ్చేవాడు మా పెదనాన్న నన్ను మా అక్కనీ ఇంటికి తీసుకెళ్లడానికి. నాకు తెలీదు అంత ప్రేమ ఆయన ఎలా పంచగలిగాడో అని. మా పెద్దమ్మైతే పొలం పనుల అజమాయిషీలో పడి అలిసి సొలిసి వచ్చినా దాలి గుంత వేసి కాగు నిండా నీళ్లు కాచి ఆ వేడినీళ్ళతో మాకు స్నానాలు చేయించేది. నేను పెద్ద వాడినయ్యా నేనే చేస్తా అని హఠం వేసే వాడిని అప్పుడప్పుడు. ఆమె ఎప్పుడన్నా నెల్లూరు వెళ్తుంటే పనుల మీద కాళ్లకడ్డం పడి ఆమె వెంట వెళ్లే వాడిని. నెల్లూరులో ఆమె ఎన్ని పనులున్నా ఓపికగా నడిచే వెళ్లే వారు, నేను కొంచెం నడిచి రిక్షా ఎక్కుదామని మారాం చేసే వాడిని. ఎన్నిటికని ఎక్కగలం, ఆమె అలాగే నన్ను బతిమాలుతూ నడిపిస్తూ, నడిస్తే షోడాకొని పెడతానని చెబుతూ, తనకి ఓపిక వున్న వరకూ నన్ను మోస్తూ పనులు చక్క బెట్టుకొనేది. ఇక మా పెద్దక్క సి. గాన పెసూనాంబ అయితే మా పిల్లకాయల్ని మాయ చేసి అన్నాలు పెట్టటంలో మహా నేర్పరి. అప్పట్లో మాకు ఇన్ని రకాల కూరగాయలు లభ్యం అయ్యేవి కావు. మహా అయితే పల్లెల్లోనే పండిన సొరకాయో, పొట్లకాయో, పందిరి చిక్కుడ్లో, లేక పోతే తంబకాయలో దొరికేవి. ఇప్పటిలా క్యారట్లు, బీట్ రూట్లు, క్యాబేజీలు లాటివి మేమెరుగం. బంగాళా దుంపలు కూడా ఎప్పుడో పండగలకు పబ్బాలకు కుర్మా రూపంలో. చేపలు మాత్రం చాలా విరివిగా దొరికేవి. కానీ సాయంకాల పూట, సూర్యాస్తమయ్యాక, ఆరుబయట, మినవల పచ్చడి, పొట్టు పెసలతో చేసిన పప్పు, నెయ్యి కలిపి మా అక్క భీముడి కథలు చెప్తూ నా సామిరంగా అన్నం పెడుతుంటే, ఇంకా పెట్టు, ఇంకా This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Apr 26, 20209 min

మా శ్రీధర గాడు! ఓ మంచి స్నేహితుడు!

నేను ఇంతకుముందే చెప్పా, నావి ఎలాటి వానాకాలం చదువులో, ఇంటర్మీడియట్ ఎలా చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా గట్టెక్కానో, ఎంసెట్ లో ఎలా ఓ పెద్ద రాంక్ సాధించుకొని వాకాడు ఇంజనీరింగ్ కాలేజీలో పడ్డానో. ఈ పరిచయ వాక్యాలు చదవగానే మా గిరిగాడు యధావిధిగా విరుచుకు పడతాడు, నీ దొక బయోగ్రఫీ, అది ఇంతకు ముందు అందరూ చదివేసి ఉంటారన్న నీ ఎదవ అభిప్రాయమూ అని. వాడలాగే అంటూ ఉంటాడు, నేనిలాగే రాసి పారేస్తుంటా. ఇక్కడో రహస్యముంది, అబ్బా! నా పేరు వీడు కథలో వాడేసాడు అనే తృప్తితో వాడు ఈ కథని తక్కువ విమర్శిస్తాడు అన్నది నా ఎదవ అభిప్రాయము. కానీ ఈ కథ చదివి వాడు, చాలా భయం భయం గా రాసినట్టున్నావురా అనెక్కడ అనేస్తాడో నని నా భయం. అవి నేను ఇంజనీరింగ్ చేరిన తొలి రోజులు. మా అనీల్గాడు మరియు నేను ఈ నాలుగు సంవత్సరాలు మాతో గడపబోయే మాబోటి దుర్లక్షణాలు మరియు మా తరంగ దైర్గ్యములు జత కలిసే మిత్రుల కోసం వెతుక్కుంటున్నాము. ముందే చెప్పాను కదా, మా వోడు హాస్టల్ మీద నేను ఊరి మీద పడ్డామని. మా వోడు అప్పటికే మావ!, నాకు ప్రశాంత్, భార్గవ్, జగ్గు, కోట మొదలగు వారు తెగ నచ్చేశారు అని అప్పటికే ప్రకటించేశాడు, నేను వెనకబడిపోయా మా వాడితో పోల్చుకుంటే. నాకూ అప్పటికే ఓ రూమ్ మేట్ దొరికాడు సుబ్రహ్మణ్యం అని, కానీ వాడు నాకు ఈ రెండు మూడు వారాల్లోనే అస్సలకి మనిషి అన్నవాడు ఇంతలా చదువుతాడా అనే సందేహం కలిగించేశాడు. వాడి చదువు తీరు మరియు వాడి క్రమశిక్షణా నాకు కడు దుర్లభంగా వున్నాయి. నాకు మిత్రుడయ్యే లక్షణాలు వాడిలో అస్సలకి లేవు అని అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసా. ఆ రోజు మేము మొదటి సారిగా మెకానికల్ వర్క్ షాప్ కి వెళ్ళాము. మమ్మల్ని మూడు బ్యాచ్ లుగా విభజించారు. బ్లాక్ స్మితి, టిన్ స్మీతి మరియు వుడ్ కార్పెంటరీ బ్యాచ్ లుగా. ఇదేందిరా నాయనా నాలుగేళ్ళయ్యాక యీ పనులే చేసుకుంటా బతకాలా అని చతురోక్తులు వేసుకుంటూ ఎవరి స్థానాలకు వాళ్ళం వెళ్ళాము. నాది బ్లాక్ స్మితీ బ్యాచ్. నాతో వచ్చిన పక్కనున్న పిల్లగాడు కొంచెం పల్లెటూరు నుండి వచ్చిన వాడై కనపడటంతో మనకలవాటైన పట్టణపు అతి తెలివితో, నువ్వు కింద కుప్పలా పడున్న బొగ్గుల్ని ఎత్తుకొని కొలిమిలో వేస్తూ వుండు, నేను ఈ పొడవాటి టాంగ్స్ తో వర్క్ పీస్ ని కాలుస్తూ ఉంటా అని చెప్పా. ఆ పిల్లగాడు నన్ను పైనుండి కిందవరకూ ఓ మారు చూసి, పోరా! అదేదో నువ్వే ఆ బొగ్గులేరుకో, నీ చేతులే మసి జేసుకో అని గదమాయించాడు. అప్పుడు ఇంకా గమనించా వాడిని, మనిషి మహా చురుగ్గా వున్నాడు, ముందు రెండు పళ్ళు చివర్ల విరగ్గొట్టుకొని వున్నాడు, మహా తులిపి తనానికి నిదర్శనంగా, నాకర్థమైయింది వీడు ఒకడికి చెప్పే వాడే కానీ వేరే వాడు చెప్తే వినేరకం కాడని, వెంటనే బుద్ధిగా వాడు చెప్పినట్టే చేశా. అలా నన్ను మొదటి రోజే ఏరా, పోరా అని, వాడి పెత్తనం కిందకు తెచ్చేసుకొని నన్ను ఇప్పటికీ ఆడేసుకొనే వాడే మా శ్రీధరగాడు. ర్యాగింగ్ టైం లోనే మహాధైర్యంగా తిరిగేవాడు, ఎందుకంటే వాడు లోకల్. కాలేజీ కి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళ వూరు. వారంలోపలే మనం వాళ్ళ ఊరిని సందర్శించటం, వాళ్ళ కుటుంబ సభ్తులను మరియు బంధువులను వాడు ఏ-ఏ వరుసలతో పిలుస్తాడో మనమూ అలానే పిలిచెయ్యటం, అలాగే వాడు మా నెల్లూరుని సందర్శించటం, నేను మా వాళ్ళను ఏ వరుసలతో పిలుస్తానో వాడూ పిలిచెయ్యటం లాటి చర్యలతో మా స్నేహం బర్తృహరి చెప్పినట్టు సజ్జనుల స్నేహం ఉదయపు ఎండలా ఎలా పెరిగిపోతుందో అలా పెరిగి పోయింది. మొదటి సంవత్సరం వాడు వాళ్ళ వూరునుండి ఒక బుడ్డ బులుగు సైకిల్ లో వచ్చేవాడు, రెండవ సంవత్సరం నుండి వాడు నేను ఒక రూమ్ కి మారిపోయాము. వాడు లోకల్ అవటం నాకు చాలా సౌఖ్యంగా ఉండేది. వారంలో ఒక రోజు వాళ్ళ ఇంటినుండి ఇద్దరికీ పిలుపు వచ్చేసేది, ఏ చేపల కూరో, లేక ఏదైనా స్పెషల్ చేసినప్పుడో. వెళ్ళేసి కుమ్మేసి రావటమే. వారానికోసారి వాడి బట్టలన్నీ వూరికెళ్ళిపోయి నీట్ గా ఉతకబడి, గంజి పెట్టబడి, ఇస్త్రీ చేయబడి పర పరలాడుతూ వచ్చేవి. వాడి చొక్కాలు నేను వేసుకొని పూలరంగడి లా తిరుగుతూ ఉంటే, కుళ్లుకొని మా గోపీ గాడు, ఏరా వాడివి చొక్కాలేనా లేక అండర్ వేర్ లు కూడా వాడేస్తావా అని ఏడిచేసే వాడు. వీడు టెక్స్ట్ బుక్ లు బాగా కొనేవాడు కానీ ఇద్దరం వాటిని ఏమాత్రం నలగనిచ్చే వాళ్ళం కాదు. సంవత్సరమంతా బలాదూర్ తిరుగుళ్ళు తిరిగి పరీక్షల ముందర మాత్రం తెగ నైట్ అవుట్ లు చేసే వాళ్ళము. వచ్చే సంవత్సరం నుండి ఎప్పటి పాఠాలన్నీఅప్పుడే చదివెయ్యాలని ఒట్లు పెట్టుకొనే వాళ్ళం. కానీ షరా మామూలే. ఇక నిశ్చయించుకున్నాం మనదంతా వThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Apr 23, 202011 min

S1 Ep 15నేనూ, నా మైనర్ సర్జరీ!

ఈ రోజు మా పదో తరగతి సహాధ్యాయని వాళ్ళ అమ్మాయి పెళ్ళికి స్నేహితువులమందరిమి హాజరయ్యాము. అలా వచ్చిన వారిలో, ఒక స్నేహితుడు రియాజ్ బాషా. తనకి ఆక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు కొంత కాలం క్రిందట. హాస్పిటల్ అంతా తనని చూడడానికి వచ్చిన జనాలతో నిండిపోతే ఆ డాక్టర్ కి తాను ఒక సమరసింహారెడ్డి ని అనే బిల్డ్ అప్ ఇద్దామనుకున్నాను అని చెప్పటంతో నాకు కూడా నా గతకాలపు ఘటన వలయాలు వలయాలు గా కళ్ళ ముందు కనపడటం మొదలయ్యింది. 2001 లో  నాకొక సర్జరీ అవసర మయ్యింది. దాని గురుంచి ఎంక్వయిరీ చేస్తే మన సీనియర్ బాలాజీ కూడా చేయించు కున్నాడని తెలిసి, ఆయనకీ చేసిన డాక్టర్ ఏ.ఎస్.రెడ్డి గారి దగ్గరే నేను కూడా అప్పోయింట్మెంట్ తీసుకున్నా. నేను భయపడుతుంటే, పాపం బాలాజీ చాలా ధైర్యం చెప్పాడు, ఇది చాలా మైనర్ సర్జరీ, నొప్పేమీ ఉండదు, ఉదయం చేయించుకుంటే మధ్యాన్నానికి ఇంటికెళ్లి పోవొచ్చు అంటూ. ఎంత ధైర్యం చెప్పినా, మొదటిసారి కావటం తో ఎక్కడో ఎందుకో తెలియని ఆందోళన. ఇంట్లో కూడా రెండు గ్రూపులు, ఒక గ్రూపేమో వీడు పిరికోడు వీడేమి చేయించు కుంటాడు అని రెచ్చ కొట్టే గ్రూప్, ఇంకో గ్రూప్ వద్దయ్యా! హర్షయ్య! అని కళ్లనీళ్లు పెట్టుకొనే సోదరీమణుల గ్రూప్. ఈ గ్రూప్ ల మధ్య పందేలు కూడా. ఓ రోజు రెచ్చ కొట్టే గ్రూప్ వెటకారాలు ఎక్కువ అవటం తో మొండిగా ధైర్యం నటిస్తూ వెళ్లిపోయా సుప్రియ తోడు రాగా డాక్టర్ గారి దగ్గరకు. సర్జరీ అయ్యి బయటకి రాగానే మొత్తం సుప్రియ వాళ్ళ బంధువులందరూ హాస్పిటల్ కి వొచ్చి ఒకటే విచారణ. మా బామ్మర్ది గాడైతే ఓ పూల బొకే మరియూ ఓ పెద్ద గెట్ వెల్ సూన్ బోర్డు తో వొచ్చాడు. ఆ డాక్టర్ ఈ సందడంతా చూసాడు , నా దగ్గర కొచ్చాడు. నీ పాసు గూలా నేను నీలాటి వాడినెక్కడా చూడలేదయ్యా. ఎవరన్నా వాసెక్టమీ అంటే మొగుడూ పెళ్ళాలు మాత్రమే వొచ్చి ఎదో గుట్టుగా చేయించుకొని చప్పుడు చేయకుండా వెళ్ళిపోతారు. నువ్వెందయ్యా ఊరంతా డప్పు కొట్టుకొచ్చావ్, నరసింహ నాయుడా! అంటూ ఒకటే నవ్వు. ఆ తర్వాత తెలిసింది బొకే సుప్రియా ఐడియా అని. ఆ ఆపరేషన్ చేయించుకొని నేను పెద్ద హీరో అయిపోయా తనకి అని. కానీ బాలాజీ చెప్పినంత వీజీ కాలా నాకు. ఒక వారం పట్టింది ఆ నొప్పి తగ్గడానికి. నడవడానికి కూడా కష్టపడ్డా. ఆ తర్వాత మన శ్రీధర్ గాడి వొంతు. వాడు కాల్ చేసాడు భయపడుతూ భయపడుతూ, ఏరా!  చేయించుకోవొచ్చా, నొప్పి ఉంటుందా, వున్నా ఎన్ని రోజులూ అంటూ. నేను కూడా, అచ్చు మన బాలాజీ లాగే,  అస్సలకేమీ భయపడకురా, చాలా మైనర్, పదికి చేయించుకున్నావా పదకొండు గంటలకి ఇంట్లో ఉండొచ్చు అంటూ చెప్పా. చేయించుకున్నాక వాడు ఎలాగూ బూతులు తిట్టాడనుకో. ఒక చిన్న మెసేజ్ వాసెక్టమీ చాలా సింపుల్ ప్రొసీజర్ మరియు చాలా సేఫ్, ట్యూబెక్టమీ తో పోలిస్తే. ఐన ఈ కథ మీకు అంటే మన స్నేహితులకి ఒక జీవిత కాలం లేట్ .This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Apr 23, 20202 min

నాది కాదు కానీ, మా అనీల్గాడి సోది!

ఎక్కడో మారు మూల పల్లెలో పుట్టాను. ఏకోపాధ్యాయ లేక ఆ పూటకి ఉపాధ్యాయుని రాక దైవాధీనాలు అనేలా వుండే ప్రాధమిక పాఠశాలలో పలకల మీద అక్షరాలూ దిద్దాను, నోటి లెక్కలు నేర్చాను, నాలుగవ తరగతి లోనో లేక ఆపై తరగతులలోనో ఆంగ్ల అక్షరమాలలు నేర్చుకున్నాను. అన్నీ పలకల మీదే, పుస్తకాల మీద రాయటమన్నదే ఎరుగను ఆరవ తరగతి వరకు. వానా కాలం చదువులంటారు ఎందుకో తెలియదు కానీ మా నావీ అట్టివే అనవచ్చు. అదేదో మేము అప్పటికే పొడిచేసి ఇంకా నవీన చదువులు చదవాలన్నట్టు మా బ్యాచ్ తోనే సిలబస్ మారటం మొదలవ్వటం మూలాన టెక్స్ట్ బుక్స్ అన్నీ ఆరు నెలల తర్వాతే లభ్యమయ్యేవి. కొనే స్తోమతు లేకనో లేక ఇక ఇంకో ఆరునెలలు కోసం కొనటం ఎందుకనో, నేనైతే టెక్స్ట్ బుక్ మొహం చూసి ఎరుగనబ్బా. మా అయ్యోర్లు ఏ నోట్స్ చెబితే అదే నాకు మార్గదర్శనం. అందుకే ఇప్పటికీ ఏదన్న టెక్నికల్ పుస్తకం చదవాలన్న అదేదో బ్రహ్మ విద్య లాగ మనస్సులో ఓ భయం. నా వల్ల కానే కాదబ్బా అనే అంతర్వాణి బలంగా వెనక్కి లాగుతుంది. లెక్కలు కూడా బట్టీయమే నేను. మిగతా సబ్జెక్టులు పరవాలేదు గాని, నాకు బడిలో లెక్కల రావు అని పేరు. రావు అంటే రావనే అర్థం. అలా లెక్కలంటే ఒక మానసిక భయం పెంచుకున్నా నేను. మా ముందు బ్యాచ్ వాళ్లకి ఎనిమిదో తరగతి నుండి లెక్కల్లో రెండు ఆప్షన్స్ ఉండేవి , ఒకటి కంపోజిట్ అని రెండోది జనరల్ అని. లెక్కల్లో మా శ్రీధర్గాడిలా వుండే మేధావులంతా కంపోజిట్ తీసుకొనే వారు, నా బోటి బట్టీయమ్ గాళ్ళంతా జనరల్ తీసుకొనే వాళ్ళు. నేను కూడా ఫిక్స్ అయిపోయా జనరల్ తీసేసుకుందామని. కానీ మన అకాడెమీ వాళ్ళు ఇలా లెక్కల్ని రెండు విధాలుగా డిస్క్రిమినేట్ చేయరాదని నిశ్చయించి రెండిటినీ కలిపి కలగూర గంప చేసి నా లాటి వాళ్లకు లెక్కల్ని ఓ జీవన్మరణ సమస్య చేసిపారేసారు. లెక్కలంటే ఇంత భయపడే నేను సామాన్య శాస్త్రము మరియు భౌతిక శాస్త్రము లాటి విషయాల్లో చురుకుగానే వుండే వాడిని. ఇప్పటికీ మైటోకాండ్రియా, హైడ్రా గమనము లాటివి పటము సహాయముతో వివరించగలను, ఏ మూలకముల ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమిటో ఇప్పటికీ చెప్పగలను అబ్బా. పదవ తరగతి గట్టెక్కగానే వెళ్లి నా అన్నీ లెక్కల పుస్తకాలు కిలోల లెక్కన మా అంగటాయనకి తూకం కింద అమ్మేసి , ఆయన రెండు రూపాయలు తక్కువిచ్చినా గీకి బేరమాడకుండా, ఆ డబ్బుల్తో సినిమాకి కూడా వెళ్ళొచ్చా. అలాగే మన నెల్లూరు వి.ఆర్.కాలేజీ వాళ్ళిచ్చే ప్రవేశ పత్రం తెచ్చుకున్న బై .పి .సి కి. ప్రవేశ పత్రానికి మా నాయన సంతకం పెట్టలా అప్పట్లో. ఎంసెట్ లో 500 లోపలే ర్యాంకు రావాలి ఎం.బి.బి.ఎస్ లో సీట్ కావాలంటే, అదే ఇంజనీరింగ్ అయితే ఏ ఐదు వేలొచ్చినా పర్వాలేదు అనే అవగాహన ప్రతీ నాయనలకుంది ఆ రోజుల్లో. నేను బతిమాలా మా నాయన్ని , ఆయన కరగాలా. వెళ్లి మళ్ళి నాకు మరియు మా అక్కకి ఎం.పీ.సి ప్రవేశ పత్రం తెచ్చుకున్న. అక్కడ దొరికాడు మా అనీల్హాడు నా సహాధ్యాయుడిగా. మా వీ.ఆర్. కాలేజి చాలా ప్రజాతంత్య్ర కళాశాల. తరగతులెప్పుడూ జరగవు. భౌతిక శస్త్ర తరగతులకు హాజరైతే చాలు ప్రాక్టీకల్స్ కి రానిస్తారు, మిగతా క్లాసులన్నీ ఎగ్గొట్టొచ్చు. అప్పుడు నెల్లూరు ఎంసెట్ కోచింగ్ కి చాలా ప్రసిద్ధి. కోరా , నారాయణ , అమీరుద్దీన్ , ఆదిత్య , రత్నం లాటి కోచింగ్ సెంటర్స్ అన్నీ కోచింగ్ తీసుకొనే విద్యార్థులతో కిట కిట లాడుతూ ఉండేది. అలా మేము తంతే వెళ్లి కోరా లో పడ్డాము. బాగా చదువుకొనే వాళ్ళు చదువుకున్నారు , నేను-మా అనీల్గాడు మరికొంత గాంగ్ చదువుని చట్టుబండలు చేసి రోజుకో ముప్పై గంటలు క్రికెట్ ఆడేవాళ్ళము. ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి వాడు పాసయ్యాడు, నేను లెక్కల్లోనే తప్పాను. మొత్తానికి 150 మార్కులకు గాను నాకు 44 వచ్చాయి. మా అనీల్గాడు పాసైపోయాడు. గుడ్డిలో మెల్ల నాకు ఎంసెట్లో 3047 రాంక్ రావటంతో మా వాళ్లంతా బిడ్డ బాగా చదివాడమ్మా!, ఆ పేపర్లు దిద్దినవాడి చెయ్యి పడిపోను, అని వాడిని తిట్టుకున్నారు, నన్ను నమ్మేశారు. మనం కూడా మొహం దీనంగా పెట్టుకొని ప్రపంచమే నన్ను ముంచేసినట్టు కొన్నాళ్ళు జీవించేశాను. మా అనీల్గాడేమో నా వల్లే వాడి ఎంసెట్ రాంక్ దొబ్బిందని, నా దగ్గరుంటే మళ్ళీ దొబ్బద్దని తలచి, నన్ను ఒంటరిని చేసి, వాళ్ళ నంద్యాల వెళ్ళిపోయాడు, ఎంసెట్ కాదు దాని జేజెమ్మ ఐ.ఐ.టి కొడతానని శపధం చేసి మరీ. సరే బాగుపడే వాడినెవరూ చెడగొట్టలేరని వాడినొదిలేసా. నేను కూడా నా సెప్టెంబర్ ప్రిపరేషన్ లో పడిపోయా, మా కాలంలో ఇప్పటిలా ఇన్స్టంట్ ఎగ్జామ్స్ లేవు మరీ. నా సప్లిమెంటరీ పరీక్ష అయ్యింది , పాపం ఈసారి దిడ్డినోడి చెయ్యి మా వాళ్ళ నోట్లో పడి పడిపోకూడదనేమో నాకు 150 కి 144 మార్కులు వచ్చాయి. నేను కూడా మా వాళ్ళ ఇళ్ళకందరికీ వెళ్లి, పోయిన సారి దిద్దినోడు ఎడమ పక్కన ఒకటెయ్యటం మర్చిపోయాడని ప్రకటించThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Apr 13, 20209 min

నా శాసనోల్లంఘనల పర్వం!

వేంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో, కథానాయకుని తండ్రి, ఒక కుటుంబ రాజ్యాంగం రాసిపడేసి, ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారి ఉల్లంఘనలను లెక్కపెడుతుంటాడు. ఇక్కడ కథానాయకుడు అనగానే నీకా లక్షణాలు లేవు అంటారని తెలుసు నాకు, ఇక్కడ కర్త కథానాయకుడు కాదు, కథానాయకుని తండ్రి. అలాగే మా నాన్నగారు (ఇక మీదట ప్రతీ దగ్గర నాన్న అనే వ్రాస్తానని మనవి, నా దగ్గర గారు గారు అని పలుమార్లు వస్తే మీరే అనగలరు, అతి వినయం దూర్తలక్షణమని) రాసిన రాజ్యాంగాన్ని నేనూ ఉల్లంఘించాను పలుమార్లు. ఆయన ఇంటికి వచ్చేసరికి పిల్లలం పుస్తకాలు పట్టుకొని ఉంటే చాలు మహా సంతోష పడిపోయే వారాయన. చదువు లేక ఆయన పడే కష్టాలు, మేము పడకూడదని ఆయన బలమైన కోరిక, అదే విషయం మాకు పదే పదే చెప్పేవారు. మా ఇల్లు వీధికి ఎదురుగా ఉండటంతో ఆయన వీధి మొదలులో ఉండగానే ఆయన రాక మాకు కనపడిపోయేది, ఇక చూడాలి మా హడావుడి, ఎక్కడి ఆటలు అక్కడ బంద్, ఎక్కడి నవలాపఠనం అక్కడ బంద్, పుస్తకాలు పట్టుకొని మహా నటించేవాళ్ళము. నేనైతే అక్క, ఈ లెక్కతో గంట నుండి కుస్తీ పడుతున్న, రావటంలా, కాస్త చెప్పవా అనే అతి నటన కూడా. అలాగే ఏ పరీక్ష అయిన తర్వాత, ఎలా రాశావురా అని అడిగితే తొంబై వస్తాయని చెప్పేవాడిని, మా అక్కైతే ఓ అరవై వస్తాయని చెప్పేది, ఫలితాలు వచ్చాక మార్కులు తయారు మారయ్యేవి. అప్పుడాయన చెప్పేవారు, తక్కువ చెప్పి ఎక్కువ తెచ్చుకోరా అని. ఈ నియమాన్ని నేను ఇప్పటికీ ఉల్లంఘిస్తూనే వున్నా. మా వూర్లో వేరుశెనగ ఎక్కువగా వేసే వాళ్ళము. విత్తనాలకు కాయలు వొలవటం పెద్దపని మాకు. అలా పిల్లలం అందరం కలిసి ఎవరి ఇళ్లల్లో అయితే విత్తనాలు వొలవాలో అక్కడ చేరే వాళ్ళం. ఒక లోటా విత్తనాలు, చచ్చు పప్పులు మినహాయించుకుని, వోలిస్తే పదిపైసలు. ఒకసారి మా స్నేహితులమందరం మా ఇంట్లోనే వొలుస్తున్నాం, నా లోటా పప్పులు అప్పుడే జమచేసి పదిపైసలు తెచ్చుకున్న, నేను కూర్చున్న ప్రదేశానికి రాగానే, నా స్నేహితుడొకడు ఒక లోటాడు ఒలిచి, ఈ లోపల ఉత్సపోసుకొద్దామని బయటకెళ్లినట్టున్నాడు, ఆ పప్పులు నా లోటాలో పోసుకొని మళ్ళీ జమచేద్దామని వెళ్లాను. అక్కడ చిత్రగుప్తుని లా పట్టుకున్నారు మా నాన్న, ఇప్పుడే జమ చేసేవు కదా అంతలోపు ఇంకో లోటాడు ఎలా వలిచావు అని. ఏవో కథలు చెప్పా, నమ్మలా, అంతలో మా వాడు రానే వచ్చాడు, నా పప్పులెవరో మాయం చేసేసారు అని ఏడుస్తూ. మా నాన్న నా జమ వాడికి బదలాయించి, అంతటి తో ఊరుకోకుండా ఎదో మునిగిపోయినట్టూ అక్కడ కూర్చున్న వాళ్ళకందరికీ నా ఘనకార్యం గురుంచి చాటింపు వేయించి, నా చేత బహిరంగ క్షమాపణ చెప్పించాడు. ఆయనకేమో పెద్ద పేరు, అబ్బా! సుందరయ్య చూడు కొడుకుని కూడా క్షమించడు అని. ఆయనకప్పటికీ మన మెగాస్టార్ ఇంకా చెప్పలేదేమో, తప్పులుంటే చెవిలో చెప్పు, మంచి ఉంటే మైక్ లో చెప్పు అని. ఇలా మా నాన్న చెప్పిన మాట, తప్పు చేస్తే వెంటనే ఒప్పుకొని క్షమాపణ అడుగు మరియు ఇతరులది లాక్కోకు అని. ఆ తర్వాత ఇతరుల కష్టాన్ని లాక్కోలేదు కానీ, ఈ తప్పు చేస్తే వెంటనే క్షమాపణ అడుగు అనే నియమాన్ని నేను ఉల్లంఘిస్తూనే వున్నా. సుప్రియా కూడా అంటుంది నాతో వాదించి వాదించి ఇక లాభం లేదనుకొని, "కిందపడ్డా, మూతిపళ్ళు రాలినా, నువ్వే గెలిచానంటావబ్బా!" అని. సుప్రియా వాళ్ళ ఉరు కూడా నెల్లూరు అవటంతో, మేము నెల్లూరు వచ్చినప్పుడల్లా, మా ఇంట్లో కానీ లేక వాళ్ళింట్లో కానీ వరుసగా ఎక్కవ రోజులుండకుండా అక్కడికీ, ఇక్కడికీ గాలి తిరుగుళ్ళు తిరిగేవాళ్ళం. మా నాన్న ఒక నియమం పెట్టారు, వచ్చాక ఎక్కడైనా తిరగండి, కానీ మీరు నెల్లూరుకొస్తే మాత్రం మొదట మన ఇంటికే రావాలి, ఆ తర్వాతే సుప్రియా వాళ్ళ ఇంటికెళ్ళాలి అని. వాళ్ళింటికెళ్ళటం ఒకరోజు తర్వాత కావొచ్చు లేక తిధులు వారాలు బాగా లేక పోతే కొన్నిరోజులు కూడా పట్టవచ్చు. నాకు ఈ నియమం కాస్త అమానుషమనిపించేది. ఎందుకంటే సంవత్సరం తర్వాతో లేక రెండేళ్ల తర్వాతో నెల్లూరుకు వచ్చినప్పుడు, తనకి కూడా తనవాళ్ళని, ముఖ్యంగా తన చుట్టుపక్కల వారిని, తాను పెరిగిన పరిసరాలను ఎప్పుడెప్పుడు చూద్దామన్న కోరిక ఉంటుంది కదా. అయినా ఈ నియమం మా పెళ్లయిన నాలుగైదు ఏళ్ళు పాటించాము. ఈ లోపు నాకు ఇద్దరు కూతుర్లు పుట్టారు, నాకూ కొమ్ములు మొలిచాయి. ఓ రోజు మా నాన్న దగ్గరకెళ్ళి, తలెత్తి సూటిగా కళ్ళల్లోకి చూసి, మీకు తెలుసా నేను కూడా ఇప్పుడు మీ లాగే నాన్న నయ్యా, ఇక మీదట నెల్లూరులో దిగినప్పుడు మనింటికి రావాలనిపిస్తే మన ఇంటికి వస్తాము, లేక పోతే వాళ్ళింటికెళ్తాము. దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు అన్న లెక్కన చెప్పి అక్కడ నుండి పారిపోయా. అలాగే నేను బయట దేశాలు పట్టుకొని తిరిగే రోజుల్లో, మా అమ్మా వాళ్ళు నెల్లూరులో మా అన్న వాళ్ళ దగ్గర వుండేవాళ్ళు. మా అన్న కొడుకు నాలుగేళ్ల పసికుంక. వాడినప్పుThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Apr 11, 20206 min

రామ లక్ష్మణు లాటి వారేమో అలా, సుందోపసుందులేమో ఇలా!

నాకు మేనత్త రవణమ్మకిన్ను మా నాన్న మేనమామ రవణయ్యకిన్నుపెళ్లి చేసేసారు, మా తాత ఆదెయ్య మరియు మా నాన్నమ్మ ఆదెమ్మ లు కలిసి. మా నాయనకి, మా చిన్నాయన కి, నాకు, మా అన్నకీ ఆఖరుకి మా అమ్మ అక్కల పిల్లకాయలకి అందరికీ ఆయన రవణ మావే. ఆయన మాకు ఇల్లరికపుటల్లుడు. మాటల్లోనే కాదు చేతల్లో కూడా మహాదూకుడు. ఆయన నడిస్తే పక్కనోళ్లు పరిగెత్తాలి, ఇద్డుమ్ వడ్ల బస్తా భుజం మీద నుండి విసిరేస్తే ఆరడుగుల దూరంలో పడాల్సిందే. పండగలొస్తే నిప్పట్లు వొత్తాలంటే రవణయ్యే, కట్టెలు పేళ్ళుగా చీల్చాలంటే రవణయ్యే, భోజనంలో సింహభాగం కూడా ఆయనదే. మా మేనత్త ఆయన దూకుడుకి బాగా వ్యతిరేకం, మెత్తనిది , ప్రేమ పాత్రురాలు, మేము గాడిదల్లా పెరిగినా మా ఏడవ తరగతి వరకూ మమ్మల్ని సంకనేసుకొనేది. ఆయనేది మాటలాడిన నువ్వే రైట్ నువ్వే రైట్ అంటూ ఆయన వాక్యం పూర్తిగాక ముందే అనేసేది. ఆ విషయం లో మా మేనత్త లౌక్యం నాకు చాలా ఇష్టం. మా వూర్లో మాకొక అంగడి ఉండేది అది మా మేనత్త మరియు మా మామ నడిపేవాళ్ళు. పండుగ దినాల్లో చేతిలో డబ్బులాడక పండుగ చేసుకోలేరు అన్న ఇళ్ల కల్లా మా మేనత్త బియ్యం, బెల్లం, నూనె లాటివి మా మావకు తెలియకుండా పంపేది. అందుకే ఊరందరకి ఆమె మా రవణమ్మ. వాళ్లకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతుర్ని మరలా మా చిన్నాన్నకిచ్చారు. మా నాన్న, చిన్నాయన, మా మామల వ్యవసాయం భలే ఉండేది. వడ్లు విలువ ఇక పెరుగదు అని కళ్లాల్లో అమ్మేసుకుంటే అవి వెంటనే పెరిగేవి, మిరపకాయలకి రేట్లు వస్తాయనుకుని బొట్టల్లో ఉంచితే తీరా రేట్లు పడిపోయేవి. అమ్మబోయే సరికి రేటు సగం, కాయ తెల్లబడి బరువు సగం అయ్యేవి. ఇలా వ్యవసాయం చేసి ముగ్గురూ మా తాతని కాజేసేసారు. మేము ఎదో బావుకుందామని, మా అమ్మమ్మోళ్ల ఊరు ఉప్పలపాడు చేరి పోయాము. కొన్నేళ్ళకి మా మావ, మా మేనత్త, ఇద్దరి కొడుకులతో, మా చిన్న నాన్నమ్మోళ్లకి హోటల్ మరియు బి.హెచ్.పీ.వి లో కాంట్రాక్టులు ఉంటే అక్కడికి విశాఖకి వలస పోయారు. మా మేనత్త కొడుకులు గోపాలయ్య, భాస్కరయ్య లు చిన్నప్పటి నుండి రామలక్ష్మణుల్లా పెరిగారు. ఇద్దరిదీ ఒకే మాట. నేను మా అన్న ఇద్దరం, సుందోపసుందుల్లా పెరిగాము. ఇద్దరికీ ఎడ్డెమంటే తెడ్డెము. అన్నిటికీ కొట్లాటలే మా మధ్య. ఆయనస్నేహితులతో నేను స్నేహం చేయకూడదు, మాటలాడకూడదు, అంతెందుకు ఆయన ఆయన స్నేహితులు ఆడే చుట్టుపక్కల నేను కనపడకూడదు. ఆయనకి మార్కులు సంకనాకొచ్చు, నాకు తగ్గితే ఆయనకీ ఎక్కడ లేని పెద్దరికం వొచ్చేస్తుంది, నా మీద దౌర్జన్యానికి . అందరూ పోలవటమే వాళ్ళని చూసి నేర్చుకొండిరా అని. వాళ్ళు విశాఖ వెళ్లి చాలా కష్ట పడ్డారు. మామ బి.హెచ్.పీ.వి కాంటీన్ కి సరకులు కొనుగోలు చేసేవాడు, భాస్కరయ్య బి.హెచ్.పి.వీ లో కాంటీన్ మైంటెనెన్సు, గోపాలయ్య హోటల్ మైంటెనెన్సు చేసేవారు. ఈ క్రమం లో వచ్చిన అనుభవం తో శ్రీకాకుళం లో హోటల్ స్వప్న, ఏడు లాంతరుల వీధిలో మొదలు పెట్టారు. ఎదో సినిమా లో చెప్పినట్టు ఉప్పు దొరికే దగ్గర మామిడికాయలు తెచ్చి ఆవకాయ పెట్టి అమ్మడమే వ్యాపార లక్షణమని, అలా శ్రీకాకుళ మోళ్ళకి నెల్లూరు భోజనం రుచి చూపటమే వాళ్ళ వ్యాపార విజయం. వాళ్ళు ఇక వెనక్కి చూసుకోలేదు ఇక. డబ్బుకు డబ్బు పేరు కు పేరు వాళ్ళ హోటల్ కి. గోపాల మామ సమర్ధుడు భాస్కర మామ కష్ట జీవి. అన్న నీడలో నే బతగ్గల సామాన్య జీవి. కలిసే వుండే వారు ఇద్దరి పెళ్లిళ్లు అయ్యాక కూడా. ఆ తర్వాత మొదలయ్యాయి మనఃస్పర్ధలు. మేము అందరం చెప్పాము కనీసం కలిసే వ్యాపారం చేసుకోండి, కలసి ఒకే ఇంట్లో ఉండక పోయినా అని. భాస్కర మామే అడిగాడు హోటల్ నువ్వన్నా తీసుకో లేక నాకన్నా ఇవ్వు అని వాళ్ళ అన్నని. వాళ్ళ అన్నకి తెలుసు మా భాస్కర మామ కి కొత్త హోటల్ నడిపే సమర్థత లేదని. అందుకే బాగా జరిగే హోటల్ ఇచ్చేసి విజయనగరం లో కొత్త స్వప్న హోటల్ పెట్టుకున్నాడు. మొదట బాగా కష్టపడ్డా తర్వాత అది బాగా జరగటం మొదలెట్టింది. కానీ భాస్కర మామే విశాఖలో ఒక హోటల్ ఓపెన్ చేసాడు జరగలేదు, బట్టల కొట్టు పెట్టాడు జరగలేదు. శ్రీకాకుళం హోటల్ మీద ధ్యాస పెట్టలేదు, అప్పులయ్యాడు. బాగా క్రుంగి పోయాడు. ఆస్తులు అమ్మేశాడు. ఒక రోజు ఫోన్ వచ్చింది భాస్కర మామ ఇక లేరు అని. హార్ట్ ఎటాక్ అని. మనిషి ఆరోగ్యం మీద మంచి అవగాహన వున్నవాడు. చెడు అలవాట్లు లేని వాడు. వాళ్ళ అన్న వచ్చాడు కర్మ కాండలు దాకా వున్నాడు. ఆ తర్వాత ఆ వైపు చూడలా. వాళ్ళ పిల్లల పెళ్ళిలకు పిలవలా, తమ్ముడి పిల్లల పెళ్లిళ్లకు రాలా. రామ లక్ష్మణ కుటుంబాలు అలా విడిపోయాయాయి. ఇక సుందోప సుందుల కొస్తే ఇంకా తిట్టుకుంటూనే వున్నారు కొట్టుకుంటూనే వున్నారు. మధ్య మధ్యలో ఏరా నాతో మాట్లాడుతూ మాట్లాThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Apr 8, 20204 min

వినదగు నెవ్వరు చెప్పిన !

మల్లిగాడు కరెక్ట్. మనం ప్రతి రోజు చాలా విషయాలు అందరి దగ్గరా నేర్చుకుంటాం. అవి మన పిల్లల దగ్గర నుండి అయితే ఇంకా బాగుంటాయి. నేను ఈ రోజు నా పిల్లల దగ్గర ఏమి నేర్చుకున్నానో చెప్తా. పెద్దపాప అమృతకి ఐదేళ్లు అనుకుంటా, తనకి చదరంగము  నేర్పించాలని అనుకున్నా, అలాగే మొదలెట్టాను ఒక అయస్కాంతపు చదరంగపు అట్ట  కొని. పరవాలేదు త్వరగానే నేర్చుకున్నది. కానీ గుర్రం (నైట్ ) వేసే అడుగులు మాత్రం బాగా అయోమయ పడుతుంది. చాలా సార్లు చెప్పినా అయోమయమే. ఒక రోజు మరల మరల తప్పు చేస్తుంటే కొంచెం చిరాకు పడ్డాను. కాసేపు అన్నీ ఆపేసి నా వైపే చూస్తుండి పోయింది. నాన్న, నేను ఒకటి అడగొచ్చా అన్నది. అసలు ఈ చెస్ ఎందుకు ఆడుతున్నాం మనం. ఇది ఒక ఆట కదా , సరదా కోసమే కదా అన్నది. అవునమ్మా అన్నా నేను సమాధానం గా. మరి నీ అరుపుల్లో సరదా ఎక్కడుంది నాన్న అన్నది. ఒక్కసారి నాకు అవగతమైనది నేను చేసిన తప్పేమిటో. మనః స్ఫూర్తి గా క్షమాపణ కోరాను. అది ఎప్పటిలాగే తనకలవాటైన తనదైన నవ్వుతో ఫరవాలేదు నాన్న అన్నది. అలాగే చదువుల దగ్గర కూడా. ఒక సారి లెక్కల్లో పదే పదే తప్పులు చేస్తుంటే కోపం వచ్చి ఒక్కటి పీకాను. పెద్దగా తను ఏడవటం, నేను ఛీ!  ఎందుకు ఒకటి తగిలించానా అని బాద పడటం. ఎక్కువసేపు ఆగలేక పోయా, వెంటనే బతిమాలటం మొదలెట్టా (సుప్రియ దీన్నీ నా ఓదార్పు యాత్ర అని ఎగతాళి చేస్తుంది. నేనే ఎక్కువ ఓదార్పులు చేసుంటానని కూడా). అది వెంటనే మరల నువ్వు కొట్టావని కాదు నాన్న, ఆ లెక్కలు నాకెందుకు రావటం లేదు అని ఏడుపు వస్తుంది. అంతే నేను ఆ పాపని కొట్టాను అని అనుకోవడానికే నాకు చిరాకు వేసింది. అదే చివరిసారి. పెద్దది ఇలా అయితే మా చిన్నది వేరే. యూ.ఎస్ లో వున్నప్పుడు అదుండగా ఇంట్లో ఎమన్నా కోపమొచ్చి అరవాలన్న భయమే. అది ముందే రూల్స్ రామనుజం. అసలే వాళ్ళ బడి లో మొదట నేర్పేదే 911 నొక్కమని. కాక పోతే దేవుడి దయవల్ల ఎదెప్పుడు నొక్కలేదు. ఒక రోజు అక్కడ ఒక పెద్ద అంగడికి వెళ్ళాం. పెద్దదాని కేదో ఫ్రాక్ నచ్చింది. అది వాళ్ళమ్మని అడిగింది కావాలని. వాళ్ళమ్మ అక్కడికి దూరం గా వున్న నన్ను చూపించి, మీ నాన్న నడుగు అన్నదట. ఇద్దరు నా దగ్గరకి వచ్చారు, నేను మీ అమ్మనడుగమ్మా అన్నా. మా పెద్దది అమాయకంగా మళ్ళీ వాళ్ళమ్మ దగ్గరకు పరిగెత్తడానికి రెడీ అయ్యింది. మా చిన్నది దాని చెయ్యిపెట్టి ఆపి, అక్కడ అడిగితే ఇక్కడ, ఇక్కడ అడిగితే అక్కడ అని చెప్పినప్పుడే నీకు అర్థం కాలా వాళ్ళు కొనరని, ఇక నీ పరుగు ఆపు అని. అప్పుడర్థమయ్యింది వద్దు అనుకుంటే విడమర్చి చెపితే పిల్లలు అర్థం చేసుకుంటారు, సాకులు చెప్పకూడదని. ఒకసారి వాళ్ళ గది అంత గులాబీ రంగు వస్తువులతో నింపాలి అనుకొని అన్నీగులాబీవే కొనటం మొదలెట్టారు. గులాబీ దుప్పట్లు, గులాబీ బ్లయిండ్స్, గులాబీ వాల్ క్లాక్ మొదలైనవి. ఇక నా ఓపిక నశించి నో అన్నా. దానికి మా చిన్నది మేము పెద్ద వాళ్ళం అయ్యాము, మాకేదీ ఇష్టమో మాకు తెలుస్తున్నాయి అని ఖరాఖండి గా చెప్పింది. ఇంతకీ దాని వయస్సు ఆరేళ్ళు. కాబట్టి వాళ్ళ ఇష్టాల్ని మన్నించడం నేర్చుకున్నాం. కానీ వాళ్ళు కూడా మేము వద్దన్నప్పుడు, సరే వద్దులే అనటం నేర్చుకున్నారు. ఈ పరస్పర గౌరవం మొదలయ్యాక అస్సలు వాళ్ళ నిర్ణయాలకి వాళ్ళను వొదిలేశాము. ఈ మధ్య పెద్దది నాకు ఎం.పీ .సీ వద్దు నాన్న, నేను ఎం.ఈ.సి చదువుతాను అన్నది, మూడు నెలల చదువులు అయ్యాక. అదే ఏ కళాశాల మంచిదో కనుక్కుని ఎం.ఈ.సి లో చేరిపోయింది. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Apr 5, 20203 min

ఎంత వరకూ తిట్టగలదో, చెప్పకనే చెప్పిన మా చిన్నది!

మా చిన్నది ఈ రోజున తన సహాధ్యాయుడైన ఒక అబ్బాయిని, దున్నపోతు, పనికిమాలిన వెధవ అంటూ తిట్టటం మొదలుపెట్టింది. వినీ, వినీ ఇక వినలేక, ఏమయ్యిందమ్మా అనడిగా. మా స్నేహితురాలి చరవాణి నంబరుని మా బస్సు డ్రైవేరొకడు అడిగాడని ఇచ్చేసాడు మరో ఆలోచన లేకుండా. ఇప్పుడా డ్రైవర్, నా మా చిన్నది ఈ రోజున తన సహాధ్యాయుడైన ఒక అబ్బాయిని, దున్నపోతు, పనికిమాలిన వెధవ అంటూ తిట్టటం మొదలుపెట్టింది. వినీ, వినీ ఇక వినలేక, ఏమయ్యిందమ్మా అనడిగా. మా స్నేహితురాలి చరవాణి నంబరుని మా బస్సు డ్రైవేరొకడు అడిగాడని ఇచ్చేసాడు మరో ఆలోచన లేకుండా. ఇప్పుడా డ్రైవర్ నా స్నేహితురాలి నంబరుకి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడు అని చెప్పి. ఆలోచన లేని నెలతక్కువ వెధవ వాడు, మరలా ఎక్కువ తిట్టాలంటే వాడి పేరు కూడా హర్షానే, అందుకే వాడిని ఇంత కన్నా ఎక్కువ తిట్టలేకున్న అంటూ ముక్తాయించింది. తిట్టవలసినదంతా తిట్టి, ఇంకా తిట్టలేను అంటావేమమ్మా అంటే, మీరూరుకోండి నాన్న, వాడినా మాత్రం తిట్టవచ్చులే అంటూ, నాకు చెప్పకనే చెప్పేసింది నన్ను కూడా ఎంత వరకూ తిట్టగలదో. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Apr 5, 20200 min

అంతేగా, అంతేగా అనండి, అటుపై చూడండి!

ఓయ్ వాషింగ్ మెషిన్ లో నా చీరలు వేసున్న వెళ్లి ఆరవెయ్యి అంది మా ఆవిడ. ఇలా అడపా దడపా నాలో ఎమన్నా పురుషాహంకారం లేచి బుసలు కొడుతుందో లేదో అని పరీక్ష పెడుతుంది తను. గుడ్ బాయ్, అని మెచ్చుకుంది ఆరేసి వచ్చాక. ఆరేసుకో పోయి పారేసుకున్నావు హరీ, నీ కోకెత్తికెళ్లింది కొండగాలీ అంటూ ఆరెయ్యటంలో ఆనందం ఎందరికి తెలుసు. మా అన్న అయితే, ఛీ ! నువ్వు మరీ హెన్ను పెక్కుడు హస్బెండువి (పరమ భార్య విధేయుడివి) అని ఈసడిస్తాడు అప్పుడప్పుడు. ఆయనకు పెద్ద ఫీల్ అంతా ఆయన కంట్రోల్ లోనే నడుస్తుందని. వీళ్లకు తెలీదు, అంతేగా అంతేగా అంటే, వాళ్ళు ఎంత సంతోషించి ఎన్ని సేవలు చేసేస్తారో. నాకైతే ఇంట్లో కంప్యూటర్ ముందు పనిచేస్తుంటే టిఫిన్లు భోజనాలు కూడా నోటికే. తిని నా మూతి నేను కూడా కడగనబ్బా. జీతం రాగానే ఇంత అని తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయటమే నా పని. ఇంట్లోకి అన్నీ, అమ్మ నాన్నల మందులు, పిల్లల పికప్ డ్రాప్ ఆఫ్, వాళ్ళ హాస్పిటల్ విజిట్స్ అన్నీ తనే. అబ్బా నువ్వు సూపర్ అంటే, కార్ తోలటం నేర్చేసి అన్నీ తనే వన్ వుమన్ ఆర్మీ లాగా. ఎవరన్నా బంధువులు వచ్చినా పిక్ అప్ డ్రాప్ ఆఫ్ అన్నీ ఆమెనే. మన పని ఆఫీస్ కి వెళ్ళటం, రావటం పిల్లల చదువు చూడటం అంతే. మీరు ఏమంటారు, అంతేగ అంతేగ అని వాళ్ళ చిన్న మాటలను ఓపిగ్గా వింటూ వింటే కలిగే బోలెడు లాభాలు . ఇక మీకు తెలుసు అనుకుంటా మీ ఇంట్లో కూడా మీరు ఎలా ఉండాలో. కాదూ కూడదు నేను పురుష పుంగవుడిని నేనింతే అని మా అన్నలా వున్నారా, దేవుడే కాపాడాలి మిమ్మల్ని. నా మాట విని కనీసం లాక్ అవుట్ అయినదాకా అన్నా నటించండి, ఆ తర్వాత మీకే అలవాటైపోతుంది. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Apr 5, 20201 min

ఈ కథ చదవాలంటే, ఓపిక అనే బతుకు కళ ఖచ్చితంగా కావాలి!

నా సరికొత్త వాహనానికి నెంబర్ ప్లేట్ బిగించుకుందామని రవాణాశాఖ కార్యాలయానికి వెళ్ళా. అక్కడ నా వంతు రావడానికి సమయం పట్టింది కొంత. ఈ లోపల అక్కడ చిన్న చితకా పిల్లకాయలు గాలి పటాలు ఎగరేస్తుంటే వాళ్ళని గమనించటం మొదలెట్టా. వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందం వర్ణనాతీతం అది చరవాణుల్లో కదలక మెదలక ఆటలాడే మన పిల్లలకు బహుదూరం. వాళ్ళలో ఒక పిల్లవాడు బహు నేర్పరి అనుకుంటా, చిన్న పిల్ల లు వాడిని బతిమాలుతున్నారు, అన్నా మా పటానికి డీల్ వేయకన్నా అనో, నా మాంజా బాగా రాలేదన్నా చూడు అనో. వాడు కూడా చాలా కలుపుగోలుగా, సరే లేరా! నేను తెంచనులే నీ పటాన్ని అంటూనో, లేక రారా నా మాంజా ఇస్తాననో అందర్నీ కలిపేసుకుంటున్నారు. నాకనిపించింది ఆహా ఇది కదా పిల్లలు నేర్చుకోవటమంటే అని. అదే పిల్లలు రేపు గొడవ పడొచ్చు ఎల్లుండి ఒకటొవ్వొచ్చు. కానీ ఎంత మంచి బతుకు కళలు నేర్చుకుంటున్నారు. బతుకు కళలు నేర్వటం అంటే నా చిన్న తనానికి వెళ్ళాలి అలాగే మీ చిన్న తనానికి.మా వెంకట్స్పర్లన్న చేతిలో పడిందంటే ఏ గాలి పటమైన రిపేరై సర్రుమనాల్సిందే. అన్నా! నా పటం ఎగరటం లేదు అని మా పిల్లకాయలం వెళ్తే, అబ్బాయిలూ సూత్రం సరిగ్గా లేదురా అంటూ, రెండు-నాలుగు కాకపోతే రెండు-ఐదు పెట్టాలిరా అంటూ సరి చేసిచ్చే వాడు. రెండు-నాలుగు అంటే రెండు బెత్తెల దారం పైన, నాలుగు బెత్తెలు దారం కింద కలిపి కట్టడం. అలాగే మా శీనన్న బొంగరాలు తిప్పటం లో నేర్పరి. ఆయన దగ్గర రకరకాల పరిమాణంలో బొంగరాలుండేవి. వాటికి జాలీలు పేనటం (ఇక్కడ జాలీ అంటే ఏంటి పేనటం అంటే ఏంటి అని మీరే తెలుసు కోవాలి), గుమ్మా కొట్టటం నేర్వటం, ఆయన దగ్గరే మేమంతా. బొంగరంతో గుమ్మా కొడితే పెద్ద ఘాతాలు పడాల్సిందే అవతల వాళ్ళ బొంగరాలకి. గిరి లోంచి బొంగరం బయటకి రావాలంటే దానికి పెద్ద పడగ ఉండాలని నేర్చుకోవటం లాటి చిన్న చిన్న విషయాలు గ్రహించాము. అలాగే సిగరెట్ ప్యాకెట్ లని చించి, వాటితో యూనో లాగ ఆడటం. ఒక్కో సిగరెట్ బ్రాండ్ కి ఒక్కో వేల్యూ. చార్మినార్ బ్రాండ్ లోయెస్ట్ వేల్యూ ఆపైన సిసర్స్ తర్వాత విల్స్. ఈ సిగరెట్ కార్డ్స్ మాకు యూనో ముక్కలు. మళ్ళీ వీటిల్ని ఎక్స్చేంజి చేసుకునే వాళ్ళం, రెండు ఛార్మినార్స్ కి ఒక సిసర్స్, రెండు సిసర్లుకి ఒక విల్స్, అలా అన్నమాట. ఇవి మా ఖజానాలు. మా మల్లికార్జున అన్న వీటికోసం ఒక పెద్ద ఎక్స్చేంజి నే నడిపేవాడు. అలాగే గోళీలు ఆట. రక రకాలు గా ఆడే వాళ్ళం. ఒడి పోయిన వాళ్ళు మోచేతులతో నేలమీద డోకాలి. గోళీలాటలో నేను నేర్పరిని మా వూరికే. అలాగే కర్ర బిళ్ళ లేక గిల్లి దందా, ఉప్పు ఆట, కుందుడు గుమ్మా, పల్లంచి లాటి ఆటల్లో ఒక్కొక్కళ్ళు నేర్పరులు మా ఊర్లో. అలాగే మా పిల్లకాయలం యానాది రెడ్డి చేలో, నేలబాయిలో ఈతకొట్టే వాళ్ళని తొంగి చూస్తావుంటే, మాకన్నా పెద్దోళ్ళు మమ్మల్ని ఎత్తి ఆ బాయిలో తోసేస్తే భయంతో కేకలు పెడుతూనే ఈతకొట్టేసే వాళ్ళం. నాకు అప్పుడే తెలిసింది అందరూ అన్నిట్లో మేటి కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్కొ ఆట లో మేటి అని. వాళ్ళ దగ్గర ఎలా నేర్చుకోవాలి అని చూసే వాళ్ళం, లేకపోతే వాళ్ళని మా జట్లలో చేర్చుకొని వాళ్ళం. అన్నీ నేర్పింది మాకు వయసులో పెద్దయిన మా సీనియర్స్, అలాగే మేము మా జూనియర్స్ కి. అది ఒక పరంపర . సీజన్ మారే సరికి తెలియకుండానే ఆటలు మారిపోయేవి . అప్పటికి ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఎలా తెలియకుండానే ఆటలు అలా మారిపోతాయబ్బ అని. అది నిజం గా పెద్ద సైన్స్. అలాగే ఆరో తరగతి చదవాలంటే మా ఊరి నుండి మూడు కిలోమీటర్ల దూరం లో వుండే పెదపుత్తేడుకి వెళ్ళాలి. మాకు అలవాటు అయ్యేవరకూ మా సీనియర్స్ మమ్మల్ని గమనిస్తూ తీసుకెళ్లేవారు. మా హైస్కూల్ లో చదువుల్లో ఫస్ట్ అంటే మా వూరే ఉండాలి. అది మా సీనియర్స్ నుండి వచ్చిన పరంపర. మన ఊరి పేరు నిలబెట్టాలిరా అంటూ, మాకు మార్కులు తగ్గితే వాళ్ళే ఉక్రోష పడే వాళ్ళు, మాకన్నా. ముందే అన్నా అన్నా అంటూ వాళ్ళ పుస్తకాలు రిజర్వు చేసుకొనే వాళ్ళం. కాస్త పెద్దయ్యాక కొన్ని రోజులు మా సీనియర్ అన్నలు అక్కల మధ్య ఉత్తరాలు చేరవేత కూడా. అన్నా! చెప్పన్నా, ఆ అక్క నీ ప్రేమని ఒప్పుకుందా లేదా అని మేము అడిగితే, రే! ఓపికుండాలి రా, అంత త్వరగా కుదరవురా, అంటూ ఓపిక కూడా నేర్పారు మా అన్నలు. ఇవన్నీ పుస్తకాలు పాఠశాలల ఆవల మేము నేర్చుకున్న బతుకు కళలు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Apr 3, 20204 min

నాకున్నూ, నా పిల్లలకున్నూ, ఓ రోజు జరిగిన సంభాషణ!

నాకున్నూ నా పిల్లల మధ్య జరిగి నొక సంభాషణ నిక్కడ రాస్తున్నా. చిన్నది టెన్త్ లోను పెద్ద దింటర్లో నున్నప్పటి మాట. వాళ్ళు వాళ్ళ స్కూల్ లోను లేక కాలేజీ లో జరిగిన సంఘటనలు మాతో చెబుతూ వుంటారు. ఒక రోజు చిన్నది వచ్చి , 'నాన్నా, నాకీ మధ్య అబ్బాయిలతో మాటలాడటం ఉత్సుకత గాను, అమ్మాయిలతో మాటలాడడం విసుగ్గాను వుంది. అమ్మాయిలు ప్రతి దానికి ముఖం మాడ్చుకుంటూ వున్నారు. అదే అబ్బాయిలైతే ఉత్సాహంగా సరదాగా ఉంటూ, మాట్లాడడానికి చాలా హాయిగా వున్నారు', అని చెప్పింది. సహజంగా నేను కానీ సుప్రియ కానీ వాళ్ళు ఎమన్నా ఇటువంటివి చెబితే వాళ్ళని ఖండించము. వాళ్ళు వాళ్ళ భావాలని బయట పెట్టనిస్తాం. కాబట్టే వాళ్ళు అన్నీ దాయకుండా చెప్పేస్తారు. అదే సమయంలో మా పెద్దది ఓ కథతో వచ్చింది. నాన్నా! మా కాలేజీ లో మా సహాధ్యాయిని వాళ్ళ అమ్మ, మా కాపలాదారుడి కొడుకుని కొట్టింది చూడూ అంటూ! ఏమి జరిగిందిరా! అంటే ఈ విధం గ చెప్పుకొచ్చింది. "మా సహాధ్యాయిని ని వాళ్ళ అమ్మే రోజూ తనను కాలేజీ లో దింపేది. అలా దింపడానికి వచ్చినప్పుడల్లా, మా కాపలాదారుడి కొడుకు ఆమెకి నమస్కారం కూడా చెప్పేవాడట. ఈ మధ్య ఆవిడ రావటం లేదు, ఆ అమ్మాయే ఒంటరిగా వచ్చేస్తుంది, కాలేజీకి రావటం మరియు పోవటం అలవాటు పడిపోయింది కనుక. కొన్ని రోజులకి, అమ్మాయి వాళ్ళ అమ్మకి కాలేజీ నుండి ఫోన్ కాల్ వెళ్ళింది, వాళ్ళ అమ్మాయి క్లాస్ కి సరిగా రావటం లేదని. వాళ్ళ అమ్మగారు, కాదు మా అమ్మాయి క్రమం తప్పకుండా వస్తుంది కాలేజీకి అని చెప్పి, వెంటనే వచ్చేసారు కాలేజీ దగ్గరకు. అమ్మాయి గారు కాలేజీ లో లేరు. అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఒక డి.ఎస్.పి. ఆయన వెంటనే తన బెటాలియన్ తో రంగంలోకి దిగి, కనిపెట్టారు ఆ అమ్మాయీ, మా కాపలాదారుని కొడుకు పక్కనున్న పార్కు లో తేలి వున్నారని. వాళ్ళ నాన్నగారు వాడినేమీ అనలేదు, కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం వాడిని కుమ్మేసింది" అని. పైగా తేలిందేమిటంటే ఆ పిల్ల కూడా వాళ్ళ అమ్మ నెంబర్ మారిందని, బదులుగా తన స్నేహితురాలి నెంబర్ కాలేజీలో ఇచ్చి, ఇన్ని రోజుల గైరు హాజరు మేనేజ్ చేసింది. ఆ పిల్ల ఖర్మకాలి రిసెప్షనిస్ట్ గావేరే ఆమె రావటం, వచ్చినావిడ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారి పాత నెంబర్ కి ట్రై చేయటంతో అసలు భండారం బయట పడింది. మేము మా పిల్లల్ని అడిగాము, పైన కథలో మీరు ఏమి గ్రహించారు అని. వాళ్లు తమకలవాటైన శైలిలోనే చెప్పారు, ఆ అమ్మాయిదే తప్పు అని, అలా వాళ్ళ పేరెంట్స్ నమ్మకాన్ని, ఆశల్ని ఆ అమ్మాయి వమ్ము చేసింది అని. మేము అడిగాము మరి చెల్లి కూడా, అబ్బాయిలతో మాటలాడటం చాలా ఉతసాహంగా వుంది అన్నది కదా, మరి ఆ అమ్మాయి చేసినది తప్పు ఎలా అని. ఆ అమ్మాయికి కూడా వాడు చెప్పిన కబుర్లు ఉత్సాహంగానే వున్నాయి కాక పోతే స్కూల్ బదులు పార్క్ అంతే తేడా అని. నాన్నా, మేము ఇలా ఆ అమ్మాయిదే తప్పు అన్నామని మాకు వ్యతిరేకంగా మీరు చెప్తున్నారు, మేము ఆ అమ్మాయే కరెక్ట్ అంటే మీరు ఇంకోలా చెప్పేవాళ్ళు అంటూ నా మీద విరుచుకు పడ్డారు మా మా అమ్మాయిలు. మాకు అర్థమయ్యింది మేము మా స్టాండ్ చెప్పే సమయం వచ్చిందని. మీలో కొందరికి నచ్చినా నచ్చక పోయిన నేను ఇలా చెప్పా. మొదటిది, మీరు ఒప్పులు చేస్తేనే నేను మీకు అండగా ఉండేదని అనుకోవొద్దు, మీరు తప్పులు చేసి కష్టాల్లో పడ్డా నేను మీకు వున్నా, కాబట్టి నన్ను ఏ సమయం లో నైనా సహాయం కోసం అడగటంలో సంకోచించ వద్దు. నా దృష్టి మీ సమస్యని పరిష్కరించటం మీదనే కానీ మిమ్మల్ని ఎత్తి పొడవటం మీద ఉండదు. ఇంకా సంభాషణను పొడిగిస్తూ, ఈ విధంగా కొంచెం సుత్తి కొట్టాం, ' మీకు ఒకడు నచ్చొచ్చు, వాడు చెప్పే కబుర్లు నచ్చవచ్చు, కానీ కథ అంతటి తో ముగియదు. వాడు కొంత కాలానికి బయటకెళ్దాం అంటాడు. ఒక సినిమా కో, ఒక పార్క్ కో, లేక ఎక్కడైనా ఒంటరి ప్లేస్ కో. మీకు కొన్ని సార్లు వెళ్లాలని అనిపించ వచ్చు. కానీ మీరు అన్నీసార్లు వేళ్ళ లేరు. మీరు వెళ్లలేనప్పుడు వాడు ఎమోషనల్ గా మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తాడు. చచ్చినట్టు వెళ్ళాలి, వాడి మాట వినాలి. ఈ ప్రాసెస్ లో మీరు కోల్పోయేది మీకు నచ్చినట్టుండ గలిగే మీ ఫ్రీడమ్. మీకు అవసరమా ఇదంతా. మీకు ఎక్కడికైనా వెళ్లాలంటే తీసుకు వెళ్లే అమ్మా, నాన్న, నాన్నమ్మ మరియు తాతయ్య లాటి ఇందరం వున్నాము. మీ ఎమోషన్స్ వినడానికి, భరించడానికి, ఏమీ ఆశించకుండా చేయడానికి. మీకు మీ ఫ్రీడమ్ కావాలా, లేక ఆ ఫ్రీడమ్ కీని ఏ గొట్టం గాడి చేతిలో పెడతారా' అని . తర్వాత రోజు వచ్చారు ఇద్దరు, నాన్నా! మాకు మీరు ఇచ్చే ఫ్రీడమ్ కావాలి. మా ఫ్రీడమ్ కీస్ మా చేతుల్లోనే ఉండాలి అంటూ. సరే అమ్మా, ఒక నాన్న! వైపునుండి చూస్తే మీరు నా దగ్గర, రూపం లో గొంగళి పురుగుల్లా, గుణం లో సీతకోక చిలుకల్లా, మీ మీ పెళ్లిళ్లయ్యాక, రూపం లో కూడా సీతాకోక చిలకల్లా This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Apr 3, 20204 min

నేను, నా మనవడూ!

మా పెద్దమ్మ కూతురి మనవడు అభిరాం. వాడి వయస్సప్పుడు మూడేళ్లు. కొన్నాళ్ళు నేను ప్రాజెక్ట్ పని మీద చెన్నైలో వాళ్ళింట్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళదొక డూప్లెక్స్ బాడుగిల్లు. పైన నాకొక బాత్ రూమ్ కూడా కలిసి వుండే పెద్ద రూమ్ ఇచ్చేసారు వాళ్ళు. వాడు ఉదయాన్నే తాతా! కాఫీ తాగుతావా అంటూ వచ్చేసేవాడు. అప్పటి నుండి నేను ఆఫీసుకు వెళ్లే వరకూ నేను వాడితోనే ఆటలు. ఒక రోజు నేను కాఫీ తాగుతుంటే వచ్చి నా బుగ్గ నాకటం మెదలు పెట్టాడు, ఏందిరా !అబ్బీ అంటే నీ బుగ్గకి చక్కెర అంటుకుంది   తాతా అని నవ్వటం మొదలెట్టాడు. ఏందబ్బా వీడు ఇలా అంటున్నాడు అని అద్దంలో  చూసుకుంటే, నిజమే గెడ్డం నెరవటం మొదలెట్టినది, అక్కడక్కడా చక్కెర అద్దినట్టు. ముసలోడు అయ్యే తొలి లక్షణాలు వాడు ఎంత ముచ్చటగా చెప్పాడో. నాకో ఛండాలపు ఐ.డి కార్డు ఉండేది. నా ఫోటో ఎంత దరిద్రంగా ఉండేదంటే, ఆ ఫోటో ని చూసి మా అభిరాం రోజు అడిగేవాడు, తాతా ఈ ఫోటో లో ఉండేది ఎవరూ అని, నేనేరా అంటే, ఓహో నువ్వేనా అనే వాడు. మరలా, రెండు మూడు రోజుల తర్వాత అదే ప్రశ్న, వేసేవాడు, తాతా! ఈ ఫోటో లో ఉండేది ఎవడు అని, నేను మరల నేనేరా అనటం, వాడు ఓహో అనటం నిత్యకృత్యమయ్యింది.  వాడే నిజం ఒక రోజు మా ఆఫీసులో సెక్యూరిటీ గార్డ్ నన్ను లోపలకి రానివ్వలేదు, నా ఐ.డి నాది కాదంటూ. అభిరాం బాగా యాక్టీవ్ గా మరియు ఎనర్జిటిక్ గా వుండే వాడు. వాడిని నేను ఆటలకి బయటకి బాగా తీసుకెళ్లే వాడిని. వాడికిష్టమైన ఆట ఫుట్ బాల్. వాడు బంతిని తంతే, అది  బులెట్ లాగా దూసు కెళ్ళేది. అలాగే వాడి కొక బుజ్జి సైకిల్ ఉండేది. వాడిని తీసుకొని వాకింగ్ వెళ్ళేవాడిని. వాడు నాతో ట్రైనింగ్ వీల్స్ వున్న ఆ సైకిల్ వేసుకొని బుద్ధిగా వచ్చేవాడు. నేను నడుస్తుంటే నా ముందర మరియు దారికి ఎడమ పక్కన. ఒక రోజు వాడికి చెప్పా! నువ్వు పెద్ద వాడివి అయ్యావు రా, నీ సైకిల్ కి ఇక ట్రైనింగ్ వీల్స్ తీసేస్తా అని. అలాగే తీసేసా. మొదట బాగా భయపడినా రెండో రోజే అలవాటు పడిపోయాడు. వేగంగా కూడా తొక్కటం మొదలెట్టాడు. అలా ఇంకో రెండు రోజులు గడిచాయి. అలవాటు ప్రకారం, ఓ రోజు వాడిని తీసుకొని బయల్దేరా. వాడు చాలా వేగం గా రోడ్ కి అడ్డదిడ్డం గా తొక్కటం మొదలెట్టాడు. అభీ ! ఇలా తొక్కితే నేను ఒప్పుకోను, ఇంటికి పద అని కోపంగా చెప్పా. వాడు అంతే కోపంగా తాతా ! ఏమి నేనేనా చూసుకోవాల్సింద , అవతల వచ్చే వాడు కూడా చూసుకోవాలిగా, వాడే చూసుకుంటాడు లే అంటూ వేగంగా అక్కడ నుండి ఇంకా అడ్డదిడ్డం గా వెళ్లి పోయాడు. హత విధీ ! మనకి ఎవరూ నేర్పక్కర్లేదు రూల్స్ బ్రేక్ చేయటం , అది మన రక్తం లోనే వుంది అనుకుంటూ ఇల్లు చేరా. అలాగే కొన్నాళ్ల తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద బెంగుళూరు వెళ్లి పోయారు వాళ్ళు. వాడి కబుర్ల కోసం ఫోన్ చేసే వాడిని నేను రెగ్యులర్ గా వాడికి. ఒక  రోజు తాతా! నాకు స్పెల్లింగ్ టెస్ట్ అని చెప్పాడు. ఏంటిరా డీటెయిల్స్ చెప్పు అంటే, నేను ఏ ఆల్ఫాబెట్ తో మొదలయ్యే పదిపదాలలో మా మిస్ అడిగే పదానికి స్పెల్లింగ్ చెప్పాలి అన్నాడు. సరే ! పదీ పదాలు నేర్చుకున్నావురా అంటే. తాతా ! పిచ్చోడివి నువ్వు నాది క్లాస్ లో మెదటి పేరు, మా మిస్ నాతో నే మొదలెడుతుంది అందుకే నేను మొదటి పదమే నేర్చుకెళ్తున్న అన్నాడు. ఓరి నీ పాసుగులా నీ తెలివి మాకు లేదయ్యె అని నిట్టూర్చా. తర్వాత రోజు వాడు ఫోన్ చేసి చెప్పాడు, తాతా ! మా మిస్ కి బుర్ర లేదు అని. ఏందిరా! అబ్బయ్య అంటే, నన్ను లాస్ట్ పదమడిగింది అని చెప్పాడు. వాళ్ళమ్మ పదికి నాలుగే మార్కులు వచ్చాయి ఎందుకురా, అనడిగితే వాళ్ళమ్మని ఓదారుస్తాడు! మా క్లాసులో మూడు రెండు వచ్చినోళ్ళు ఇంత మంది వున్నారు అంటూ. నేను కుటుంబాన్ని వొదిలి చెన్నైలో ఉండగలిగానంటే వాడి తోడు చాలా దోహద పడింది. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Apr 2, 20203 min