
Harshaneeyam
530 episodes — Page 11 of 11

S1 Ep 2మా అమ్మ తప్పిపోయింది, నా చిన్నప్పుడు!
అమ్మమ్మ వాళ్ళది దగదర్తి మండలం లోని ఉప్పలపాడు గ్రామం. నాన్నమ్మ వాళ్ళది కావలి దగ్గర్లోని ఉలవపాళ్ళ గ్రామం . మాకు మాతృస్వామ్యము ఇష్టం కాబట్టి అమ్మమ్మ నాన్నమ్మ అని మొదలెట్టా. ఇటు నుండి అటు వెళ్లాలన్న, అటు నుండి ఇటు వెళ్లాలన్న రాజు పాళెం లో దిగి బస్సులు మారాలి. నాకు ఈ పాళెం ఏందిరా బాబూ అని చిన్ననాటి నుండి డౌట్ కానీ అరవ దేశానికెళ్లాక అర్థమయ్యింది పాళ్యం రూపాంతరం అయ్యి పాళెం అయ్యిందని. ఎలా అయినా మనం మన ఎన్ .టి.ఆర్ రాక ముందు మదరాసీలము కదా. ఈ గోల వదిలెయ్యిహే! చెప్పాల్సింది చెప్పు , ఈ మధ్య అసలు కంటే కొసరేక్కువయ్యింది నీకు అని పొడస్తావుంది సుప్రియ పక్కంజేరి. సరే అసలు కథ చెప్తా. నాకు ఐదేళ్లు వయస్సనుకుంటా, కాక పోతే మా అమ్మ దగ్గర తెలుగు నాలుగాకులే ఎక్కువ చదివా. మన గోపిగాడి లాగ కాకుండా బస్సుల మీద ఊర్ల పేర్లు చదివెయ్య గలుగుతున్న అప్పటికే. మా అమ్మ అత్తారిళ్ల మీద అలక తీరి అమ్మగారింటి నుండి నన్ను తీసుకొని ప్రయాణం కట్టింది. మనమూ ఊరెళ్తున్నామని దోస్తులందరికీ టామ్ టామ్ వేసి కొత్త చొక్కాయ వేసి బయలుదేరాము. బస్సు రాజు పాళెం రాగానే మా అమ్మ ముందు నన్ను దింపి ఆ తర్వాత వాళ్ళ పుట్టిల్లోళ్లు ముచ్చట పడి కట్టిచ్చిన చీపురు కట్టలు బస్సులోంచి కిందకిసిరి ఆమె దిగబోయేంతలో ఆ బస్సు' నాకొడుక్కేమొచ్చిందో రోగం సక్కా నూక్కొని పొయ్యాడు బస్సుని. కిందకు దిగిన నాకు అర్థం కాలా నా కర్థమయ్యింది మా అమ్మ బస్సులోంచి దిగలా . ఆ బస్సు నెల్లూరెళ్ళి పోయింది, నేనేంజెయ్యాల చుట్టూ చూసా రోడ్ కి ఎదురుగుండా నెల్లూరు నుండి మా ఊరెళ్ళే బస్సు వుంది. ఒకటికి రెండు సార్లు చదివా, నెల్లూరు, కోవూరు, రాజుపాలెం, గండవరం, కొత్తవంగల్లు, గొట్లపాలెం, పెదపుత్తేడు, ఉప్పలపాడు అని బస్సు పక్క వైపున చక్కగా కనపడ్డాయి. అబ్బా చదవటం సూపర్ గా వచ్చేసింది , మా గోపిగాడు గాడిదెద్దులా పెరిగాడు ఆడికి ఇప్పటికీ రాదు అనుకుంటూ, ఒక్క తాటిన రోడ్ దాటినా. బస్సెక్కి ఇద్దరు పెద్దోళ్ల మధ్య సీట్ లో ఇరుక్కున్న. మనకి అప్పటికి ఇంకా అరటిక్కట్టు వయస్సు కూడా కాదు. ఎవరూ అడగాలా. మా వూరు చేరా. ఎలా అబ్బా మా అమ్మమ్మకి చెప్పటం మా అమ్మ తప్పి పోయిందని ఒకటే ఆలోచన బస్సంతా. బస్సు దిగగానే నన్ను బస్సు ఎక్కిచ్చి ఆడే బడి ఆడుతున్న దోస్తులకేమీ అర్థం కాలా నన్ను చూసి. ఏమిటిరా మీ ఎదవ కన్ఫ్యూషన్ ముందే నేను మా అమ్మ తప్పి పోయి యాడస్తా ఉంటే అంటూ ఇంటికి బయల్దేరా. ఈళ్ళు గమ్మునుంటారా నాకంటే ముందు లగెత్తారు మా అమ్మమ్మ కాడికి . ఓ ఈసిరమ్మా నీకూతురు తప్పి పోయిందమ్మా అంటా. మా అమ్మమ్మ భలే హుషారయిన మడిసిలే అచ్చు నాలాగా వెంటనే మా సీనన్ని అదే బస్సు ఎక్కిచ్చింది రాజుపాళేనికి. ఈ లోపి మా అమ్మ, మా అమ్మ తో పాటు రాజుపాలెం లో దిగిన మా ఊరోళ్లంతా నాకోసం రాజుపాలెం అంతా వెతికి వెతికి, ఏడ్చుకొని ఏడ్చుకొని మల్లా అదే బస్సు నెల్లూరెళ్లి తిరిగొస్తుంటే దాన్ని రాజుపాలెం లో ఎక్కి మా వూరికి బయల్దేరారు. ఈ రెండు బస్సులు గండవరం లో కలుసుకున్నాయి. మా శీనన్న వెంటనే మా అమ్మ కాడికెళ్ళి మనోడు సూపర్ గున్నాడు నువ్వేమి ఏడవమాక అని మన క్షేమ సమాచారాలు చెప్పి మా అమ్మని ఉప్పలపాటి కి తీసుకొచ్చాడు. ఎట్లా ఐన మా అమ్మ సూపర్ వీపు విమానం మోత మోగేలా కొట్టలా. నేను అనుక్కున్నట్టు మా అమ్మే తప్పి పోయిందని నమ్మేసింది. దగ్గరకి తీసుకొని తవుడుకొని పొట్టనిండా బువ్వ పెట్టి పొట్ట మీద వేసుకొని నిద్ర పుచ్చింది. నేను నిద్ర లేచేసరికి ఎదో పుస్తకం చదువుతా కనపడింది. అప్పుడు తొలిచింది ఎదో పురుగు నా బుర్రని. ఓ అమ్మ అమ్మ నేనొకటి అడగతా సెప్తావా అని. అడగర అంది మా అమ్మ తేటంగా . “అవునే నేను చిన్న పిల్లోడిని కదా రాజు పాళెం లో తప్పి పోయాను కదా నేను దొరికే వరకూ నువ్వు రాజు పాళెం వదలకూడదు కదా అక్కడే వుంటాను అనుకోకుండా మరి మన ఊరి బస్సు” ఎలా ఎక్కావు? ' అని.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

మా లాటి ఎర్ర బస్సు జంటను, ఎక్కడన్నా కాంచారా!
నేను నాలుగు చక్రాల వాహనం తోలటాన్ని దక్షిణాఫ్రికాలో నేర్చుకున్నా. చాలా పద్దతి గా నేర్పించారు. తోలేటప్పుడు సైడ్ వ్యూ మిర్రర్ లు, రియర్ వ్యూ మిర్రర్ లు పదే పదే చూడటం ఆ శిక్షణలో ఎక్కువ భాగం. సరే తోలడానికి అన్నీ అనుమతులు రావటంతో సుప్రియాని వాహనంలో ఎక్కించుకొని హుషారుగా, షికారుకు బయలుదేరాను. ట్రాఫిక్ వున్నా స్మూత్ గా కదులుతుంది ప్రయాణం, వెనక, ముందూ, పక్కల చూసుకుంటూ వెళ్తున్నా, ఎంతైనా కొత్త కదా. ఇంతలో సుప్రియ రియర్ వ్యూ మిర్రర్ ని సర్రుమంటూ తన వైపుకు తిప్పుకొని, తన చేతి సంచిలోంచి తన పెదవుల సౌందర్యాన్ని ఇనుమడింప చేసే సాధనాన్ని తీసి సౌందర్యాలంకరణ లో మునిగి పోయింది. నాకు వెనకేమి వస్తున్నాయో తెలియక కెవ్వు కెవ్వుమని అరుస్తున్నా. తాను చాలా ప్రశాంతంగా అబ్బాయా! అద్దముండేది ఎందుకు ముఖం చూసుకోవడానికి కాకపోతే. ఇందాకటి నుండి నువ్వా అద్దంలో నీ సోకు చూసుకుంటా ఉండావనుకుంటూ వున్నా అని తన సునిశిత దృష్టిని బయటపెట్టింది. ఈ విషయం నేను ఈ మధ్య మా స్నేహితులందరి మధ్యలో ఉండగా బయట పెట్టా.. తాను ఎర్రబడ్డ మొహంతో, ఈడు మరీ అతిశయాలు కలిపి చెబుతున్నాడు, నేను ఆ అద్దం లాగింది పార్కింగ్ లాట్ లో ఉండగా అని కవర్ చేసేసింది. ఏది ఏమైనా ఈ ప్రాబ్లెమ్ నాలాటి అభాగ్యులు చాలామందికి జరిగిందేమో ఇంతకు ముందు, అందుకే పాసెంజర్ సైడ్ ఇంత లావు అక్షరాలతో వానిటీ మిర్రర్ ఏర్పాటు చేశారేమో. మీరెప్పుడైనా మాలాటి ఎర్ర బస్సు జంటలను చూసారా. చూసుంటే ఆ కథలు రాసెయ్యండి. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

మా వూరి మైలురాయి కమ్యూనిస్టులు!
అనీల్ గాడు నాకు వున్నాయి, పొలమారింది జ్ఞాపకాలు కథ చదివి అది హర్ష గాడి కార్ల్ మార్క్స్ పోకడ కథ అని వ్యాఖ్యానించాడు. నేను కూడా మా ఊర్లలో వుండే కొన్ని కమ్యూనిస్ట్ గాధలని చెప్పాలని అప్పుడే అనుకున్న. ఎవరో ఒక పేరుమోసిన కమ్యూనిస్ట్ గారిని అడిగారట, మీరు పక్కా కమ్యూనిస్ట్ లు కదా, మరి ఖరీదైన మధ్యంసేవిస్తారు, రెండవ వివాహంకూడా ఆడేశారు, కొంచెం విలాసవంతమైన జీవనం గడుపుతారు, ఇది ఏవిధమైన కమ్యూనిజం అని. దానికి ఆయన నవ్వేసి మేము మైలు రాళ్ల వంటివారము, అవి ఎప్పడు ఫలానా ఊరికి ఇక్కడనుండి ఎంత దూరమో చెప్తాయి, కానీ దగ్గరుండి దిగబెట్టి రావు, అలాగే మేము కమ్యూనిజం అంటే ఏమిటో చెప్తాము అంతేనని ముక్తాయించాడట. అలాగే మా తాత, అనగా మా నాన్నకి నాన్న కూడా ఓ కమ్యూనిస్ట్. ఆయన మావూరికి దగ్గరలో వున్న బిట్రగుంట లోకో షెడ్ లో ఓ ఫిట్టర్. ప్రజాశక్తి దినపత్రికని నిత్యం తన తోటి వాళ్లకు బిగ్గర చదివి వినిపించటం ఆయనకీ మహా సరదా. ఏమాటకామాటే చెప్పుకోవాలి, స్పష్టమైన ఉచ్చారణ, కంచుకంఠం తో, చక్కని హెచ్చు తగ్గులతో ఆయన పేపర్ చదువుతుంటే చుట్టూ పక్కల వాళ్ళు వహ్వా అనాల్సిందే. ఈయన పేపర్ చదివి అందరి పని చెడగొట్టటంతో, రైల్వే అధికారులకు కోపం వచ్చి ఓ మూడేళ్లు రాజమండ్రికి కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఆగండాగండి ఇవన్నీ విని, ఆయన్ని ఓ ఆరడుగుల ఆజానుబాహుడు అని మీరూహించుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆయన ఎత్తు భూమికి జానెడు. కానీ మా నాయనమ్మ బహు పొడగరి. ఈ వ్యత్యాసాన్ని ఆయనలోని కమ్యూనిస్ట్ అస్సలకి పట్టించుకోలేదని నా నమ్మకం. అలాగే మా నాన్నమ్మ ఇంటిని మరియు పరివార జనులని ఏలటంలో నాయకురాలు నాగమ్మే. ఇంటి పెత్తనమంతా మా నాన్నమ్మదే, మా తాత జోక్యం ఇందులో అసలకి ఉండేది కాదు, అలాగే ఆయన మా నాన్నమ్మని పల్లెత్తు మాట అనటం నేను చూడలేదు. ఇక్కడ మాత్రం ఆయన ఒక నిజ కమ్యూనిస్ట్. మాకు మా నాన్న వాళ్ళ ఊరిలో పొలాలు మరియు ఓ ఐదు ఎకరాల తోట ఉండేది. ఆ తోటలో వేరుశెనగ, మిరప లాటి పంటలు వేసే వాళ్లము. మా తోట మా ఊరికి చాలా దగ్గరలో ఉండటం వలన మేము అందరం తోటలో ఎక్కువ సమయం గడిపే వాళ్లము, నాకైతే మా పొలాలకు వెళ్ళినట్టే గుర్తు లేదు, ఎందుకంటే అవి మావూరికి చాలా దూరం, పక్కన ఊరికి చాలా దగ్గర. మా తాత గారు మా తోటలో వచ్చే పని వారి పని విషయం లో మహా కరుకు. వాళ్ళు ఉదయం పనిలోకి వొంగితే మధ్యాహ్నం భోజనానికి మాత్రమే లేవాలి; భోజనాలు ఐన వెంటనే మళ్ళి పనిలోకో దిగాలి - విరామం లేకుండా పని చేయాలి. వాళ్ళు మా అమ్మ దగ్గరకు వచ్చి మొర పెట్టుకొనే వాళ్ళు, అమ్మ మీ మామగారు పేరుకే కమ్యూనిస్ట్, హక్కులు సాధించుకోవటం అంతా ఆయన వుద్యోగం లోనే ఇక్కడ మాత్రం కాదు అనే వాళ్ళు. అమ్మ తోటలో ఉంటే వాళ్ళకి పండగే పండగ. వెల్తూ వెల్తూ తోటలో వేసిన వంకాయలో, బెండకాయలో, గోంగూరో, పచ్చి మిరపకాయలో గిల్లుకొని వెళ్లే వారు స్వతంత్రం గా. మా తాత ఉంటే ఇవన్నీ కుదరవు మరి. ఎంతైనా మైలురాయి కమ్యూనిస్ట్ కదా ఆయన. అలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అమ్మకి ఓ ఐదు ఎకరాల పొలం ఉండేది. అది పాలికి అంటే కౌలుకి చేసే వాడు మా కొండన్న. ఆయనకీ మా అమ్మ చిన్న బుజ్జమ్మ. చిన్నప్పటి నుండి మా అమ్మనాయన పొలాల్లో కొన్ని ఆయన పాలికి చేసే వాడు. అమ్మ పెళ్లి అయ్యాక అమ్మకి వచ్చిన ఐదు ఎకరాలు తీసుకొని అవి మాత్రమే పాలికి చేయటం మొదలెట్టాడు. మేము నెల్లూరుకి వచ్చేసినా ఆయనే వాటికి సంరక్షకుడు. అప్పుడప్పుడు అమ్మ ఊరికి వెళ్లి చూసుకొని వచ్చేది - విత్తనాలకు, కూలీలకు, ట్రాక్టర్ కి, మందులకు డబులు సర్దటం అన్నీ అమ్మే చూసుకొనేది. ఏమన్నా అమ్మ ఇవ్వటం ఆలస్యమతే ఆయనే నెల్లూరు వొచ్చి ఒక రోజు అయినా వుండి తీసుకెళ్లే వాడు. మాకు కూడా ఆయన కొండన్న. ఆయన పెద్ద కొడుకు నా ఈడువాడు, కానీ చదువుకోలా, పొలం పనులు లేక మేకల్ని మేపుకోవటం. ఉప్పలపాటిలో కూడా కొంత కమ్యూనిస్టుల ప్రభావం వుంది. రఘురామయ్య అని ఒకాయన రైతు కూలీలా తరపున, ఇలా పాలికి చేసుకొనే వాళ్ళ తరపున హక్కుల పోరాటం చేసే వాడు. ఆయన మా కొండన్న బోటి వాళ్ళందరి కీ లీడర్. చిన్న చిన్నగా వాళ్ళ పోరాటం కొంచెం దున్నే వాడిదే భూమి కోణం లో మారటం మొదలెట్టింది. మా కొండన్న ఎప్పుడూ మా దగ్గర ఆ ప్రభావమున్నట్టు కనిపించేవాడు కాదు. ఆయన మా పట్ల తన సహజసిద్ద ఆపేక్షనే వ్యక్తపరిచే వాడు. కానీ మేము మా పొలాలు అమ్మేశాము, మా అక్క పెళ్లి దగ్గర పడటంతో మరియూ జాగ్రత్త పడాలన్నతహ తహతో. ఉన్నదానితో సహాయం చేసే గుణమున్న మా అమ్మ ఒక కమ్యూనిస్ట్, చుట్టుపక్కల పిల్లలందరికీ మాతో సమానం గా చదువు చెప్పటం లో కమ్యూనిస్ట్. కానీ ఉన్న కొంత ఆస్తిని కాపాడుకోవడంలో పక్క క్యాపిటలిస్ట్ అయిపొయింది. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

క్షమించండి, ఇది మగ పాఠకులకు మాత్రమే!
నాకు రాయటం వ్యసనంగా మారిందనుకుంటా . ఏదో ఒకటి రాయకుండా ఉండలేక పోతున్నా. నా కథా వస్తువులకు బాల్యం, బంధాలు మొదలగునవి ముడిసరుకులు. కానీ వ్యసనంగా మారాక ఫీల్ గుడ్ కథలు మాత్రమే కాదు, అన్నీ కథలు రాయాలి, రాసి మీలాటి విజ్ఞులచే, హర్షా! నీ దగ్గరనుండి ఇలాటి కథ ఊహించలేదు అని దాడి చేయించుకోవాలి. మీ ఎదురుదాడికి తయారయిపోతూ, ఈ కింద కథను ప్రచురిస్తున్నా, కొంచెం గుండె గాభారాతో మరికొంచెం నా ఏభై కథల గమ్యానికి చేరాలన్న ఆతృతతో. ఒక కస్టమర్ ఎగ్జిక్యూటివ్ తో ఈ నెల ఒక వర్క్ షాప్ వుంది. ఇప్పటి వరకు ఏమి చేసాము, ఈ ఇయర్ ఫోకస్ ఏరియాస్ ఏంటి, మొదలగు విషయాల మీద. ప్రిపేర్ అవుతున్నాము, మా బాస్ తో రివ్యూ కి. నాకేమో మా ప్రిపరేషన్ తృప్తి గా లేదు. కొంచెం గాభరాగా వుంది. నా గాభరా చూసి నా కొలీగ్, రామ్ సార్ మీరు ఏమీ అనుకోనంటే నేను ఒక కథ చెప్తా, మీరు వినాలి అన్నాడు. సరే చెప్పమన్న, కొంచెమ్ రిలాక్స్ అవుదామని. హర్షా! ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది రోజూ పక్కన వుండే ఊరి మీద పడి కంటికి నదురుగా వుండే మగవాళ్ళని ఎక్కేది అన్నాడు. ఎక్కడం అంటే, మీరే అర్థం చేసుకోండి అన్నాడు, ఒక చిన్న గ్యాప్ ఇచ్చి. మగ వాళ్ళు సిగ్గుతో చచ్చి పోతున్నారు, దీనెమ్మా! ఇది పడి సంపిపార నూకున్నా బాగుండేది, మరీ ఎక్కి వొదలటమేంటి అని. సరే వాళ్ళందరూ ఒక మేటి వేటగాడిని బాడుగకు మాటలాడుకున్నారు, ఎలాగైనా ఈ సింహం బాధ వొదిలిచ్చుకుందామని. వాడు వచ్చాడు, మంచె అన్నాడు కంచె అన్నాడు, ప్రిపరేషన్ అన్నాడు అచ్చు మనలాగే. అసలు రోజు రానే వచ్చింది, వాడి గురి తప్పింది, సింహం బాగా సంతోష పడి వాడిని ఎక్కింది, వాడు సిగ్గుతో చావనే చచ్చాడు. సరే మనలాగే రికవర్ అయ్యాడు, ఈ అనుభవంతో మనలాగే లెసన్స్ లెర్న్ట్ అని మొదలెట్టాడు, మనలాగే బెస్ట్ ప్రాక్టీసెస్ సమీకరించాడు. మరలా ఆ డి-డే రానే వొచ్చింది, అదొచ్చింది వీడి గురి షరా మాములుగా తప్పింది, అందర్నీ ఒక్కసారే ఎక్కే సింహం వీడు ఛాలెంజ్ చేసాడు కనుక రెండోసారి కూడా ఎక్కింది. వీడు ఇక అవమానం తట్టు కోలేక, వాడి తుపాకీ సన్యాసం చేసేసాడు. ఇక ఆ గ్రామస్తులందరూ వాడిని బ్రతిమాలుకున్నారు, నువ్వు తప్ప మాకు ఇంకో గతి లేదు. అందులోను నీకు రెండుమార్ల అనుభవం వుంది, నువ్వీసారి ఖచ్చితంగామా అవమానానికి ప్రతీకారం చేయగలవని. వాడు కూడా సరే అన్నాడు. అనుకున్న ప్రకారం సింహం రానే వచ్చింది, వీడు గురి మూడోసారీ తప్పింది, సింహం రెట్టించిన సంతోషంతో మరలా ఎక్కింది. వెళ్లి పోతూ పోతూ దానికో డౌట్ వచ్చింది, ఎరా! నువ్వు నిజంగానే గురి తప్పుతున్నావా!, లేక నాతో నచ్చి కావాలని గురి తప్పుతున్నావా అని. ఈ కథ చెప్పి నావంక చూసి నవ్వి కంటిన్యూ చేసాడు. హర్షా! మన ప్రిపరేషన్ ఎంత వున్నా, మనం గురి తప్పుతాము, మన కస్టమర్ ఎక్కుతాడు, ఎక్కడమే కాదు ఇలా ఎక్కించుకోవటం మనకిష్టమేనని కూడా నిరూపిస్తాడు. దానికి ముందు రెడీ అవుదాము అంటూ. ఉసురో మంటూ వచ్చా ఇంటికి , దేవుడా కొంచెం మంచి కస్టమర్ ని అంత కంటే కొంచెం మంచి కొలీగ్స్ ని ఎందుకివ్వవు అనుకుంటూ. ఆ రాతిరోకల, ఆ కల లో ఒక పక్క సింహం, ఒక పక్క మా కస్టమర్ వస్తున్నారు నా వైపు. నేను సింహానికే దొరికిపోయా ఉద్దేశ్యపూర్వకంగా. ఉదయం లేచి, చూసావా రామ్, నేను ఎంత తెలివి కలవాడినో అంటూ నా కల చెప్పా. నిజమే సార్ సింహాన్ని ఎంపిక చేసుకున్నారు కాబట్టే, బతికి మాకు కల గురుంచి చెప్పగలుగుతున్నారు, లేక పోతే గుండె ఆగి చచ్చి వుండే వాళ్ళు నిద్రలోనే అని ముక్తాయించాడు మా రామ్. నా లాగే రివ్యూల పేరుతో రేప్ కు గురయ్యే ప్రతీ ఐ.టి మిత్రులకు నా సానుభూతి తో.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

చిన్నప్పుడే చితికిపోయిన నా చిన్నమెదటి, భేతాళ ప్రశ్న
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, ఎప్పటిలా చెట్టుపైనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, "ఓ! రాజా ఇంత అర్థరాత్రివేళ, భీతిగొలిపే ఈ స్మశాన వాతావరణం లో, ఎదో సాధించాలన్న నీ పట్టుదల కారణంగా, నీవు చేస్తున్న ఈ పని నీకు అత్యంత సహజంగా కనపడుతున్నట్టు నా కనిపిస్తుంది. నాకెందుకలా అనిపిస్తుందో, ఉదాహరణగా నీకు అచ్చు నీలాటి పట్టుదల చూపిన భగీరథుని కథ చెపుతాను శ్రమ తెలీయకుండా విను", అంటూ ఇలా చెప్పసాగాడు. "భగీరధుడు మహాజ్ఞాని, పరోపకారానికి పెట్టింది పేరు, దీక్షకు, సహనానికి ప్రతిరూపం. ఎంతటి కష్టాన్నైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించే వారిని భగీరథునితో పోలుస్తారు . భగీరథుడు, తన తల్లి ద్వారా తన పూర్వీకులైన, సగరుని కుమారుల శాపాన్ని విని, వారి చితా భస్మాల మీద పవిత్ర ఆకాశ గంగను ప్రవహింప చేసి, వారికి సత్గతులు ప్రసాదించాడు", అని భగీరథ కథ పూర్తిగా చెప్పాడు. అలా చెప్పి, "రాజా నాకు ఈ కథలో కొన్ని సందేహాలున్నాయి, ఆ సందేహాలకు నువ్వు సమాధానం తెలిసి చెప్పకపోతే, నీ తల వేయి వ్రక్కలవుతుంది", అని హెచ్చరించాడు. దానికి విక్రమార్కుడు చిన్నగా నవ్వి , "బేతాళా ! ముందు మీ ప్రశ్నని అడగండి" అన్నాడు. ' విక్రమార్కా, మహోధృతంగా భూమికి దుమికిన ఆకాశగంగను భూమి తట్టుకోలేదని , పరమ శివుఁడు, తన జటాజటంలో బంధించి , గంగాధరుడయ్యాడు కదా ! మన పండిత పామరులు కూడా ఆ విధంగా గంగాదేవిని ఆయనకు భార్యను మరియు మహాదేవికి సవతని చేశారు కదా! మరి అదే పండితులు మహాభారత కాలమానంలో గంగాదేవిని శాంతన మహారాజు భార్యని చేసి , ఆయన ద్వారా అష్ట వసువులకు తల్లిని కూడా చేశారు ! ఆ వసువులలో చివరివాడే భీష్ముడని కూడా మీకు తెలుసు కదా! అంతటి మహాదేవుని సఖిని ఒక మానవ మాత్రునికి భార్యనెలా చేశారు ఈ పండిత పామరులు? సమాధానం తెలిసీ చెప్పక పోయావో నీ తల వేయి వ్రక్కలగుగాక " అని తన బేతాళ ప్రశ్నను విక్రమార్కుని ముందుంచాడు. తరువాత విక్రమార్కుడేమయ్యాడో భేతాళుడిమయ్యాడో నాకు తెలీదు . ఈ ప్రశ్న నన్ను భేతాళ ప్రశ్నలా చితికి పోయిన నా చిన్న మెదడుని చిన్న నాటి నుండీ వెంటాడుతూనే వుంది. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

మా నెల్లూరోళ్లు, ఎంతైనా ప్రత్యేకమబ్బా!
మా నెల్లూరోళ్లు చాల ప్రత్యేకమబ్బా. ఓర్నీ పాసు గూలా, ఏందిరా! అబ్బయ్యా అంటూ భోళాగా పలకరిచ్చేస్తారు. ఆటో గాని రిక్షా అతను కానీ ఎక్కండి అనరు, బేరం కుదరగానే ఎక్కు అంటారు అలాగే ఎవర్నైనా నువ్వు అంటారే గాని మీరు అనరు. కొంచెం బయట ఊర్ల నుండి వచ్చినోళ్ళకి మా ఏకవచన సంబోధన కొంచెం కష్టమే. మా వాళ్ళకి నచ్చేది సినిమాలు, భోజనాలు మరియు పాలిటిక్స్. ఒకప్పుడు మాకు అదిరే హాల్స్ ఉండేవి. మూడు హాళ్లు, నర్తకి, అర్చన మొదటి శ్రేణి అయితే, సుందర్ డీలక్స్, రాధామాధవ్, శ్రీనివాస, అనిత, లీలమహల్ లాటి ద్వితీయ శ్రేణి, వినాయక, న్యూటాకీస్, విజయ మహల్, మనీటాకీస్ లాటి తృతీయ శ్రేణి హాల్స్. పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడాలంటే వినాయక హాల్ మాత్రమే. పేరుకు న్యూ టాకీస్ గాని ఆడేదంతా రెండో రిలీసో లేక మూడో రెలీసో లేక ఎన్ని రిలీస్ లయ్యాయో తెలీని అరిగిపోయిన సినిమాలు. ఇక భోజనానికి వస్తే, మా ప్రత్యేకాలు చాలానే వున్నాయి. నెల్లూరు చేపల పులుసు అంటే వరల్డు ఫేమస్. మేము పులుసును, గండి, బొచ్చె, బొమ్మిడాయిలు, మట్ట గిడసలు, జెల్లలు మొదలగునవి వాడతాం. అలాగే పులుసులో ఓ మామిడి ముక్క, ఓ వంకాయ ముక్క వేస్తే నా సామిరంగా ఆ రుచే వేరబ్బా. వంకాయ మామిడికాయ బజ్జి, మునక్కాడలులో పాలుపోసి చేసే కూర, పులి బొంగరాలు, మిరపబజ్జీలు, కారందోశలు మా ప్రత్యేకాలు. చిన్నప్పుడు స్వతంత్ర పార్క్ లో ఆడి, సండే మార్కెట్ దగ్గర బజ్జీలు తినటం, ఆ తర్వాత కొంచెం పెద్దయ్యాక రాధా మాధవ్ దగ్గర కారం దోశెలు రుచి చూడటంలో ఆ మజానే వేరు. సంతపేట లో మునిసిపల్ మార్కెట్ కి ఎదురుగా వుండే పరంధామయ్య హోటల్ లో దోశె మరియు పాయా కూర రుచో చూడాల్సిందే. మంచి గులాబ్ జామూన్ కావాలంటే జై హింద్ స్వీట్స్, మలై కాజాకి మురళి కృష్ణ స్వీట్స్, అరటి బజ్జీలకి రాజా కేఫ్, చాయ్ పే చర్చలకు సీమ కేఫ్ , టెస్ట్ బుక్స్ కి శ్రీరామ్ స్టోర్స్, హోమియోపతి మెడిసిన్కి సదాశివ మెడికల్స్, మంచి ఫొటోస్ దిగాలనుకుంటే ట్రంక్ రోడ్ లో రాజా స్టూడియోస్, అప్పట్లో హీరో పెన్ కావాలంటే పెన్ కార్నర్, కంటి అద్దాలు కావాలంటే డాక్టర్ కృష్ణ , ఐస్క్రీం కి బాబు లేక ఎస్.జి.ఎం, అన్నీ టిఫిన్స్ అల్ టైం ఫేవరెట్ చంద్రభవన్స్ (మూసేసారు), వెజ్ మీల్స్ కి కోమల విలాస్ కి వెళ్లాల్సిందే నబ్బ. అలాగే చీప్ గా రఫ్ నోట్ బుక్స్ కావాలంటే టౌన్ హాల్ ఎదురు సందులో వికాస్ బుక్స్, సెకండ్ హ్యాండ్ బుక్స్ కి సంతానం అండ్ కో,ఎమన్నా వెనెరియల్ ప్రాబ్లెమ్ లకు ఉమా నర్సింగ్ హోమ్ పక్కన డాక్టర్ మాతుల్లా గారి దగ్గర కు వెళ్లాల్సిందే. నాన్ వెజ్ కి బోసోటా, నర్తకి పక్కన నిర్మల కేఫ్, కిళ్లీ సామానులకి గూండా అంజనేయశెట్టి గారి షాప్, సరుకులకు స్టోన్ హౌస్ పేటలో నాత వారి షాప్ అలాగే పెద్ద బజారులో నాగరాజం స్టోర్స్, మెటల్ సామానులకు కాంతి స్టోర్స్, పండ్లకు నారపనేని వీరాస్వామి అండ్ సన్స్ ఫేమస్ అబ్బా. ఇక పాలిటిక్స్ కి వద్దాం. అసలు రాజకీయాలు మా బ్లడ్ లోనే వున్నాయబ్బా. కానీ మన నెల్లూరు అన్న వివేకా చని పోయాక ఎంటర్టైన్మెంట్ తెగ మిస్ అవుతున్నాం. నీ పాసుగూల ఏందయ్యా జాఫ్ఫారా! అంటూ తను చేసిన హడావుడి, షాప్ ఓపెనింగ్స్ వెళ్లి చీరలు పైన వేసుకొని చేసే ఆర్బాటం బాగా మిస్సింగ్. ఇక సీమా కేఫ్ దగ్గర పావుగంట నిలబడితే అసలు ఇరాక్, కువైట్ ని ఎందుకక్రమించిందో, అమెరికాకి ఇరాన్ మీద కోపమెందుకో, మైక్ గాటింగ్ ని అవుట్ చేసిన అద్భుతమైన బంతిని షేన్ వార్న్ ఎక్కడ, ఎలా ప్రాక్టీస్ చేసాడో లాటి ప్రశ్నలకు నాకు అక్కడ సమాధానాలు అప్పట్లో దొరికేసాయి. ఈ మధ్య కాలం లో అక్కడ నిలబడలేదు, కాబట్టి ప్రస్తుత అంతర్జాతీయ సమస్యలకు మా నెల్లూరొళ్ల పరిష్కారాలు గురుంచి నాకు తెలియదు. అసలు మా సీమా కేఫ్ ని యూ.ఎన్.ఓ యొక్క రెండో బ్రాంచ్ గా ఎందుకు డిక్లేర్ చేయలేదో నాకైతే అర్థం కాదు. ఆ ప్రపోసల్ ని పాకిస్థాన్, చైనా సహాయంతో తిప్పి కొట్టటంలో సఫలమయ్యిందని మా వాళ్ళ ఉవాచ. నాకు ఇప్పటికీ నెల్లూరు రైల్వే-ఫీడెర్స్ రోడ్డులో వెళ్తూ అమెరికన్ హాస్పిటల్ ని చూస్తుంటే డాక్టర్ బేరమ్మ ఇంకా అక్కడే ఉందేమో అనిపిస్తుంది. అరవైయ్యవ లేక డెబ్భైయ్యవ శకం లో పుట్టిన నా బోటోళ్లందరూ అక్కడే ఈ లోకాన్ని చూసుంటారు. ఎంత మందికి ఆవిడ, ఈ నాటి శస్త్ర చికిత్సలు అవసరం లేకుండానే పురుడులు పోసుంటారో. ధన్యురాలు ఆ తల్లి. అలాగే పల్లెలనుండి కాన్పులకు వచ్చిన వారందరికీ వసతి కల్పించిన ఆ రేబాల వారి సత్రం, ఆ సత్రం లో గడిపిన అడపా దడపా రోజులు. ఉన్న కొన్ని రోజుల్లోనే ఐకమత్యంగా మెలిగి అక్కడనుండి బాగైపోయి కూడా కళ్ళనీళ్ళతో వెళ్లే వాళ్ళు రోగులు (రోగులనకూడదు వాళ్ళని ఆరోగ్యవంతులనాలి). అట్టి సత్రాలు కట్టి వాటిని నామThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

ఆఫీసు పని ఇంట్లో చేస్తున్నారంటే!
మిస్ వైజ్ మా పెద్ద పాప అమృత క్లాస్ టీచర్, సీటెల్ లో వున్నప్పుడు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో కలిసాము ఆవిడని, అకడమిక్ ఇయర్ మొదటలో . "నేను కావాలనే ఒక క్లాస్ పీరియడ్ కి, ఇంకో పీరియడ్ కి మధ్యలో పదిహేను నుండి ఇరవై నిముషాలు గ్యాప్ ఇచ్చాను. స్టూడెంట్స్ ఆ గ్యాప్ లో నేను ఇచ్చిన వర్క్ చేసుకోవచ్చు లేక పోతే వాళ్ళు వేరే ఆక్టివిటీస్ చేసుకోవచ్చు. నేను వాళ్ళను కంపెల్ చెయ్యను. కానీ వాళ్ళు ఇంటికొచ్చాక ఎక్కువ క్లాస్ వర్క్ చేస్తుంటే, వాళ్ళు నేను ఇచ్చిన గ్యాప్ లో వర్క్ చేయటం లేదు అని అర్థం. సో అమృతని కొంత కాలం మానిటర్ చేయండి. తనకి ఈ విషయం చెప్పకుండా", అని చెప్పారు ఆవిడ. నేను అమృతని మానిటర్ చేయటం మొదలెట్టాను. ఆశించినట్టే మా అమృత వర్క్ నంతా ఇంటికి తెచ్చుకోవటం, నన్ను డౌట్స్ అడగటం మొదలెట్టింది. ఆలా చాలా రోజులు గడిచాయి, మా అమృత లో ఏమి మార్పు లేదు. ఒక రోజు తనకి చెప్పా, ఇలా నువ్వు ఇంట్లో స్కూల్ వర్క్ చేస్తున్నావంటే నువ్వు స్కూల్ లో అస్సలకే ఏమీ చేయకుండా టైం పాస్ చేస్తున్నావని అర్థం అని . మా చిన్నది వాళ్ళ అక్క చుట్టూ తిరుగుతుంటుంది, వాళ్ళక్క ఇంట్లో ఉన్నంత వరకు. మా సంభాషణ అంత వింటూ వుంది. దానికి నాలుగు ఏళ్ళు నిండుతున్నాయనుకుంటా అప్పటికి. అది వెంటనే నా దగ్గర కు వచ్చి, నడుము మీద చేతులు వేసుకొని చెప్పింది, "ఓ, అయితే నాకు ఇప్పుడు అర్థమయ్యింది నువ్వు ఎందుకు ఆఫీస్ పని ఎప్పుడు ఇంట్లో చేస్తుంటావో" అని. నాకు అది పెద్ద షాక్. ఆ తర్వాత నేను ఆఫీస్ పని ఇంటికి తేలేదు . దానికి రోజూ చెప్పే వాడిని ఈ రోజు ఆఫీస్ పని ఆఫీస్ లోనే చేసేసా . This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

అమ్మలందరు అంతే ! మా అమ్మ కూడా !
ఒరే హర్షాగా! "మీ అమ్మకి నేను ఇక ఏమీ చెప్పానురా", అంటూ కణ కణ లాడి పోయాడు మా నారాయణ రెడ్డి వాళ్ళ షడ్డకుడి కొడుకు రిసెప్షన్ అయ్యాక. ఎదో అయ్యింది ఆ రిసెప్షన్ కి మా అమ్మ అటెండ్ అయ్యాక అని నవ్వుకున్నా. మంచి నీళ్ల గ్లాస్ ఇచ్చి, "చెప్పరా ఏమయ్యిందో అన్నా", వినటానికి సిద్దపడుతూ. పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు మీ అమ్మ అడిగార్రా, అమ్మాయి ఏమి చదివింది, ఎలా ఉంటుంది అని. "పర్వాలేదమ్మా బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం బొద్దుగా ఉంటుంది, అని చెప్పా!. నిన్న రిసెప్షన్ లో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నల ముందు, అదేమిటి మా నారాయణ అల్లా చెప్పాడు , అమ్మాయి ఇంత బాగుంటే అని చెప్పేసింది మీ అమ్మ", అంటూ లబ లబ లాడాడు వాడు. మొన్నటికి మొన్న మా ఆవిడ నాకు వార్నింగ్ ఇచ్చింది ఇక మననింటికి ఎవరినన్నా భోజనానికి పిలిచావో చంపేస్తా నిన్ను అని. "ఏమి జరిగిందో చెప్పు", అంటూ మా ఆవిడ వలిచే చిక్కుడు కాయలు వలవటం లో సహాయం చేసే వంకతో అడిగా, ఎదో అయ్యింది అనుకుంటూ. "మీ మేనత్త కొడుకు గోపాలన్న వాళ్ళ కుటుంబాన్ని భోజనానికి పిలిచాము కదా. ఆయన భోజనాల దగ్గర నన్ను పొగుడుతూ నీకు చాలా ఓపికమ్మా ఇన్ని రకాలు ఎలా చేసావు, అన్నీ చాలా బాగున్నాయి అనగానే, మీ మమ్మీ (కోపమొచ్చినప్పుడు మా మమ్మీ లేక పోతే వాళ్ళ అత్త) గోపాలయ్యా! ఆ చికెన్ బిర్యానీ, జింజర్ చికెన్ ఇప్పుడే అంగార హోటల్ నుండి, ఈ కొబ్బరి పచ్చడి, ఆ టమేటా చిక్కుడు కూర నిన్నటివి, ఇప్పుడు వేడి చేసినవి అంటూ, మా ఆవిడ మొహంలో కోపం చూసి, ఏంటే ఆ కోపం వీళ్ళెవరూ! మన వాళ్ళే కదా", అంటూ ఒక నవ్వు నవ్విందట. "నాన్న! నాన్నమ్మతో ఇక మా గురుంచి ఏమీ చెప్పకు", అంటూ ఒకరోజు నా కూతుర్లు నా మీద యుద్ధానికి వచ్చారు. ఏంటమ్మా అంటే అత్తమ్మోళ్లతో మాట్లాడుతూ, ఆ చిన్నది ఎప్పుడూ బలహీనమే ఎప్పుడూ దానికి ఆయాసమే అని చెప్తుంది. అదేమిటి నాన్నమ్మ, అంటే వాళ్ళు మీ అత్తలే మీరంటే వాటికి ప్రాణమే అంటుంది అని కంప్లైంట్.. మొన్నటికి మొన్న మీ నాన్న అమెరికా నుండి జాబ్ పోతే వచ్చేసాడా, నాకోసమే వచ్చేసాడా అని అడిగింది నువ్వు ఆమె కోసమే కదా పరిగెత్తావ్ అంటూ కయ్ మన్నారు. కానీ పిల్ల కాకులకేమి తెలుసు మా అమ్మకి అందరూ తన వాళ్ళే, స్వపర బేధం లేదు తెలియదు అని. వాళ్లకేం తెలుసు నేను తన కోసమే వచ్చేసాను అని పదే పదే తెలుసుకొని ఆమె పడే సంతోషం. నేనూ డిసైడ్ అయిపోయా మా అమ్మగురుంచి నాకు తెలుసు, ఆమె మనసు ఎంత మంచో, మాట దాయలేనంత మంచి. కాబట్టి ఆవేశపడే వాళ్ళకి మంచి నీళ్లు ఇచ్చి, ఇక చెప్పండ్రా మీరు అంటూ హాయిగా నవ్వటమే. ఏమంటారు. ఈ వయస్సులో చిన్నపిల్లలు అయిపోయి అందరూ మన వాళ్ళే, వాళ్ళతో మనకు రహస్యాలు ఏమిటి అనుకొని అప్పుడపుడు మనకు షాక్ లు ఇచ్చే అమ్మలందరికి, నా నమస్సులు. కొసమెరుపేటంటే ఈ కథ చదివి మా మేనకోడలు మామయ్య నువ్వు ఇంకోటి మరిచిపోయావు అన్నది. అది కూడా యాడ్ చేస్తున్న. సుప్రియ కస్టర్డ్ లోకి అరటిపళ్ళు లేవు అని హైరానా పడుతుంటే, ఆ గోపాలయ్య వాళ్ళు భోజనాలకి వస్తూ ఎలానూ తెస్తార్లేవే అని. వాళ్ళు తెచ్చారు చూడు అని వాళ్ళ ముందరే ప్రకటించేసింది మా అమ్మ. మా ఆవిడ పళ్ళు పట పట ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

మా లక్ష్మీ పెద్దమ్మ పెద్ద అదృష్టవంతురాలు!
మా అమ్మమ్మకి వాళ్ళ నాన్నగారు తన చెల్లెలి కొడుకు తో పెళ్లి నిశ్చయించాడు. ఆ వరుడు తనకన్నా వయస్సులో చాలా పెద్దవాడు అవటం తో, ఛీ ! నాకు వద్దు అని తన ఈడు వాడైనా మా తాతని వివాహమాడేసింది. ఆ రోజుల్లో నాయన మాట ఎదిరించి వివాహం చేసుకోవటం మహా సంచలనం. వాళ్ళ నాన్న గారు తన మాట ఎక్కడ పోతుందో అని, మరీ చిన్నపిల్ల, లక్క పిడతలతో ఆడుకుంటున్న మా అమ్మమ్మ చెల్లెల్ని తీసుకెళ్లి తన అక్క కొడుక్కిచ్చి పెళ్లి చేసేసాడు. ఆయన అప్పటిలోనే బెనారస్ హిందూ యూనివర్సిటీ లో మెట్రిక్యూలేషన్ చదివాడు, హిందీ ప్రచారసభ వారి విశారద కూడ ఫ్యాన్ అయ్యాడు. అప్పటిలో నెల్లూరు లో ఓ చిరుద్యోగి ఆయన. వాళ్ళ కూతురే మా లక్ష్మి పెద్దమ్మ. తాను ఇంటర్మీడియట్ లో ఉండగా వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మా చిన్నమ్మమ్మ నెల్లూరులోనే ఉంటూ, మా ఉప్పలపాడు కి వచ్చి వ్యవసాయం చేయించుకునేది. మా వూరిలో ఆవిడకి ఓ చిన్న ఇల్లు కూడా వుంది, మా దేవాలయానికి ఎదురుగ. మా చిన్న అమ్మమ్మకి మా అమ్మమ్మంటే కోపం, మా అమ్మమ్మవల్లే తాను చిన్నతనంలోనే విధవరాలు అయ్యిందని. భర్త చనిపోయాక తాను విపరీతమైన పురుషద్వేషిణి అయ్యింది. వేలెడంత బుడ్డోడిని నేను కూడా తాకరాదు ఆవిడని. ఆవిడ నెల్లూరులో బస్సు ఎక్కి ఉప్పలపాటిలో దిగేసరికి కనీసం ఓ పదిమంది పురుష పుంగవులైనా ఆమె నోటి బారిన పడి పారిపోవాల్సిందే. ఇంటికి రాగానే సబ్బు పెట్టి వొళ్ళంతా కడగాల్సిందే. అటువంటి ఆవిడకి మూగ జీవాలంటే చాలా ప్రేమ. కుక్క పిల్లలకి, పిల్లి పిల్లలకి ఓపికగా వెతుక్కొని వెళ్లి మరీ ఎదో ఒకటి పెట్టి రావాల్సిందే. ఆవిడ బస్సు దిగుతుందని వాటికి ఎలా తెలుస్తుందో, అవి అన్నీ వెళ్లి ఆవిడని ఇంటి వరకూ దిగపెట్టి, ఆవిడ ఉన్నన్నాళ్ళు ఆవిడ ముందు వెనకా ఒక సైన్యం లా కవాతు చేసేవి. వాటికి మా ఉప్పలపాటిలో వాటికి మా చిన్నమ్మమ్మ ఆర్మీ అని ముద్దు పేరు. అలాటి పురుషద్వేషిణి అయిన మా చిన్నమ్మ వాళ్ళ నెల్లూరులోని ఇంటిపైన చేరాడు షోకిల్లా రమణయ్య. చదువు పేరుతో ఇంట్లో డబ్బు దస్కం తెప్పించుకొని స్నేహితులతో జల్సా చేయటమే జీవిత ధ్యేయం ఆయనకీ. పురుషద్వేషిణి అయిన మా చిన్నమ్మకి , విలాసపురుషుడైన రమణయ్యకి క్షణం పడదు. ఆయన మిద్దె మీదకు వెళ్లే సమయంలో, దిగి బయటకు వెళ్లే సమయం లో ఈవిడ ఆయన నెత్తి మీద నీళ్లు కుమ్మరిచ్చేది కూడా అట. ఈ పిల్లీ ఎలుకా చెలగాటం లోనే మా పెద్దమ్మ, ఆయన నిండా ప్రేమలో మునిగిపోవటం మా పిచ్చి చిన్నమ్మ కి తెలీయనే లేదు. కొంత కాలానికి ఆవిడకి తెలిసినది, కూతురి గర్భవతి అయ్యాక. అందరికీ తెలిసి గొడవ అయ్యాక, రమణయ్య పారిపోయాడు. వాళ్ళ వూరికెళ్ళిన మా వాళ్లకు తెలిసింది అప్పటికే ఆయన గారికి పెళ్లి కూడా జరిగి ఉందని. ఆయన నిజస్వరూపం తెలిసిన మా లక్ష్మి పెద్దమ్మ ఇక ఆయన్ని దగ్గరకు రానివ్వలేదు. మా పెద్దమ్మ ధైర్యం గా నిలబడింది, ఒక కొడుకుకి జన్మ నిచ్చింది. చదువు పూర్తి చేసుకొని, కాలేజీ లో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో లెక్చరర్ గా చేరిపోయింది. ఆ రోజుల్లోనే మా పెద్దమ్మని మా వాళ్ళు ఎవరూ తప్పు పట్టలేదు, పైపెచ్చు అండగా నిలబడ్డారు, మా అమ్మ, పెద్దమ్మ లు అందరూ. పిచ్చి అమ్మమ్మ అనుకునే మా చిన్న అమ్మమ్మ కూతురిని రెప్పలాగా కాపాడుకుంది. ఒంటరి అమ్మ, అమ్మమ్మేమో అలా, ఈ వాతావరణం లో పెరిగిన మా పెద్దమ్మ కొడుకు కూడా వింత గానే పెరిగాడు. వాళ్ళమ్మమ్మ క్రమశిక్షణ మీద కోపంతో ఆవిడ పెంచే పిల్లుల్ని ఆగిన సీలింగ్ ఫ్యాన్ రెక్కల మీద ఉంచి స్విచ్ ఆన్ చేసేవాడు, వాటిల్ని బకెట్ లో ఉంచి బావిలో దించే వాడు, రబ్బర్ బ్యాండ్ లకు గుండు సూదులు గుచ్చి దాన్ని స్ట్రెచ్ చేసి దార్లో వెళ్లే బట్టఫుర్రి వున్న వ్యక్తుల మీదకు సంధించేవాడు. చదువులన్నీ అసంపూర్ణాలే, కానీ ఆయన అంత తెలివి కలవాడు మరియు మంచివాడు లేడని మా వాళ్లలో పెద్ద పేరు, కానీ ఆ తెలివి ఆయనకే కాదు ఎవరికీ ఉపయోగ పడేది కాదు. ఆ రోజుల్లోనే ఎన్నో వెరైటీ బైక్ లు, వాడిన బైక్ వాడకుండా. మహారాష్ట్ర లో ఇంజనీరింగ్ డొనేషన్ కట్టి చేరి మధ్యలోనే మానేసిన చరిత్రతో మా పెద్దమ్మ డబ్బులంతా మంచి నీళ్లు తగిన ప్రాయం లా ఖర్చుపెట్టేవాడు . కాలక్రమేణా ఆయనకీ పెళ్లయ్యింది, ఆయనకీ ఇద్దరు పిల్లలు. ఏమన్నా ఆయన అనుకున్నది జరగక పోతే అమ్మ మీద దౌర్జన్యమే. అయినా ఆ అమ్మకి ఆయనంటే పంచ ప్రాణాలు. కనుల ముందర ఉంటే చాలు, సిగరెట్ కి , ముందుకి తగలేసినా పరవాలేదు. అమ్మా వాళ్ళు కలిసినప్పుడు కుమిలి పోయేది. ఏమి బతుకు నాది, భర్త వలన సుఖం లేదు, కొడుకు వలన నరకం అని. అలాటి మా పెద్దమ్మ, ఓ ఐదేళ్ల క్రితం, ఓ వరలక్ష్మి వ్రతం నాడు తిరుగుతూ తిరుగుతూThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

నా మొదటి అమెరికా యాత్ర, అచ్చు ఆచారికి మల్లె!
ఆచారి! అమెరికా యాత్రలా, నా మొదటి అమెరికా యాత్ర గురుంచి, తప్పకుండా రాయాలి. నేను, సుప్రియ, ఇద్దరు పిల్లలతో క్రీస్తు శకం 2000, మార్చ్ 31 వ తేదీ ముంబై నుండి కొలరాడో లోని డెన్వర్ కి బయలుదేరాము. అమ్రుకి రెండు నిండి మూడేళ్లు, ఆముకి మూడు నెలలు. ఇంతకు ముందు దక్షిణాఫ్రికాలో మూడేళ్లు ఉండటంతో ఈ ప్రయాణాన్ని చాలా ఆత్మవిశ్వాసం తో మొదలుపెట్టాము, మాకేంటి అనే ధీమా తో. జె .ఎఫ్ .కే లో మార్చ్ 31 వ తేదీ సాయంత్రం ఐదున్నరకి దిగేసాము. డెన్వర్ కి మా కనెక్టింగ్ విమానం, తర్వాత రోజు ఉదయం ఏడు గంటలకు, పక్కనే ఉన్న లాగార్డియా విమానాశ్రయం నుండి. మా కంపెనీ వాళ్ళు 31వ తేదీ రాత్రికి, మాకు జె.ఎఫ్.కె కి దగ్గర వున్న రమడా ఇన్ లో బస ఇచ్చారు. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఐన శ్రీధర్, మరియు నాకు జూనియర్ ఐన కమల న్యూజెర్సీ లో చాల సంవత్సరాల క్రితమే స్థిరపడి యున్నారు. మా రాక తెలిసి, ఆ ఇద్దరూ విమానాశ్రయానికి వచ్చారు, మమ్మల్ని చూడను. పిచ్చాపాటి అయ్యాక రాత్రికి ఇక్కడెందుకు, మనం ఇంటి కెళదాం అన్నారు. మేము ఉత్సాహంగా ఇంకొంచెం కబుర్లు చెప్పుకోవచ్చు అనుకొని, సరే అన్నాము. అలా కమల వాళ్ళింట్లో బస చేద్దామని, వాళ్ళింటికి వెళ్ళాము. శ్రీధర్ భార్య కవిత మరియు వాళ్ళ బాబు అనిరుధ్ అప్పటికే కమల వాళ్ళింటి కి చేరుకొని వున్నారు. ఆ రాత్రి, మా మూడు కుటుంబాలు కలిసి, పిచ్చా పాటి మాటలాడుకొని, డిన్నర్ చేసి, మరల బాగా పొద్దు పోయిందాకా కబుర్లు చెప్పుకొని కొన్ని గంటలే నిద్ర పోయాము. తర్వాత రోజు ఆరుగంటలకు, అనగా ఒక గంట ముందు విమానాశ్రయానికి చేరుకున్నాం. అక్కడకి వెళ్ళాక ఎయిర్ లైన్స్ వాళ్ళు బాంబు పేల్చారు, విమాన తలుపులు అప్పటికే మూసివేయబడ్డాయని. ఏంటబ్బా! అని తలలు గోక్కున్నాక, శ్రీధర్ మరియు కమల చెప్పారు, క్షమించు అబ్బాయి! ఈ రోజు ఏప్రిల్ ఒకటి, మాకు అమెరికాలో ఒక గంట సమయం ముందుకు జరుపుతారు. ఇప్పుడు సమయం ఆరు పది కాదు, ఏడు పది, అందుకే మీ విమాన తలుపులు మూసివేయబడ్డాయి అని. ఇన్నేళ్లు మేము ఇక్కడున్నా, మేము కూడా మరిచితిమి, తాళం వేసితిమి గొళ్ళెం వేయుట మరచితి అన్నట్టు. హతవిధీ! ఏమి ఈ వైపరీత్యం అనుకుంటూ, ఆ విమానపోళ్ళని బతిమాలుకుంటే వాళ్ళు దయదలచి డెట్రాయిట్ ద్వారా వెళ్లే విమానానికి సర్దుబాటు చేశారు, కాక పోతే ఒక షరతు తో. అదేమిటంటే, ఆ రోజు ఆదివారం కనుక, డెట్రాయిట్ నుండి డెన్వర్ కి ఏ విమానంలో ఖాళి ఉంటుందో, ఆ విమానం మాత్రమే ఎక్కాలని, బిచ్చగాడికి ఎంపిక చేసుకొనే అధికారం లేదు అని చెప్పకనే చెప్పారు. వాళ్ళిచ్చిన విమానం పట్టుకొని పదకొండుకి డెట్రాయిట్ లో దిగాము. డెట్రాయిట్ నుండి డెన్వర్ కి అన్నీ విమానాలు కిటకిటలాడిపోయాయి. మా ఇద్దరు పిల్లలు చిన్న వాళ్ళు. కాకపోతే మా కేబిన్ బాగ్స్ అన్నిట్లోనూ పిల్ల సామగ్రీయే పెట్టుకున్నాం, కాబట్టి ఇబ్బంది లేదు. విమానాశ్రయం లోనే మధ్యాహ్న భోజనంగా, సుప్రీ! పెప్పరోని అంటే ఎర్రని పచ్చి మిర్చి (బెల్ పెప్పెర్స్ ) అని చెప్పి, పిజ్జా ఆర్డర్ చేసి, యమ్మీ యమ్మీ! అంటూ ఒక్క మా చిన్నది తప్ప, అందరమూ తినేశాం. అలా సాయంత్రం ఆరు దాకా విమానాశ్రయం లోనే ప్రతీ విమానంలో ఖాళీ ఉందా అని విమానపోళ్ళని అడుక్కుంటూ గడిపేసాము. ఏ విమానమూ దొరకలేదు మాకు ఆ రోజు. మరలా విమానపోళ్ళని బతిమాలుకుంటే, ఆ రోజు రాత్రికి బస మరియు డిన్నర్ కి కూపన్స్ ఇచ్చారు. హోటల్ కి వాళ్ళు ఏర్పాటు చేసిన షటిల్ లో ప్రయాణం. బయటకొద్దుము కదా చలి ఇరగ తీస్తుంది, వొళ్ళంతా గడ్డకట్టుకు పోయేలా. మా బట్టలన్నీ చెక్ ఇన్ బ్యాగేజీ లోనే వున్నాయి. బతుకు జీవుడా అనుకుంటూ, హోటల్ కి వెళ్ళాం. పిల్లల వరకూ అన్నీ వున్నాయి మా దగ్గరే, పాలపొడులు పొడులు, బిస్కట్స్, డైపర్స్ వగైరా వగైరా. తెల్లవారి లేచి డెన్వర్ ఫ్లైట్ పట్టుకున్నాము. కానీ డెన్వర్ లో ముందు రోజు రాత్రి పెద్ద మంచు తుఫాను. దాదాపు రెండు అడుగుల వరకూ మంచు, ఎక్కడ చూసినా కుప్పలుగా. మమ్మల్ని పిక్ అప్ చేసుకున్న అబ్బాయి దాదాపు మూడు గంటలు డ్రైవ్ చేసుకొని వచ్చాడు విమానాశ్రయానికి , ఆ మంచులో పడి. ఇంటికి చేరే సరికి మాకు లోకల్ టైం ఏ మూడో నాలుగో అయ్యింది. ఆ అబ్బాయి వండిన అన్నం మరియు పప్పు, అమృతం లా గా తిని పడి నిద్ర పోయాం. చాలా ఆలస్యంగా లేచి విక్రమ్ విక్రమ్ పెప్పరోని అంటే ఏమిటి అంటే, అది బాగా గుండ్రంగా కోసిన పంది మాంసం ముక్కలు అని చెప్పాడు. అప్పుడు మొదలయ్యింది సుప్రియాకి, కడుపులో అసలు సిసలు యమ్మీ యాక్షన్ . కాబట్టి జనులారా అమెరికాలో, ఈ సమయ మార్పుతో జాగ్రత్తగా వుండండి. మొదటి సారి వెళ్లే టప్పుడు ప్రయోగాలు చేయకండి. బుద్దిగా ఇచ్చిన ముందస్తు సూచనలు పాటించండి. ఆ కమలాని మరియు శ్రీధర్ గాడిని అసలు నమ్మకండి. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

స్పర్ధయ వర్ధతే విద్య!
ఉప్పలపాటి ప్రాధమిక పాఠశాలలో మా అక్క సుమతి, రవణమ్మ, హైమావతి, దొరసాని మొదలగు వారు నాకు ఒకసంవత్సరం సీనియర్స్. నిజముగా నాకు గుర్తు లేదు సీనియర్స్ అయిన అబ్బాయిల పేర్లు. కావాలంటే నా క్లాస్ అమ్మాయిల మరియు అబ్బాయిల పేర్లు చెప్పగలను, కరుణాకర్, మురళి, ప్రభాకర్, ఉష, హిమ మరియు జయమ్మ వగైరా వగైరా అని. మా సీనియర్ అయిన రవణమ్మకి చాల మంచి పేరు, చక్కని అమ్మాయి అని, బాగా చదువుకుంటుందనియు, మరియు ఆటల్లో కూడా చురుకుగా ఉంటుందని. తాను అవడానికి మా అక్క వాళ్ళ సహాధ్యాయిని అయినా వాళ్ళ తరగతి వాళ్ళకంటే వయస్సులో ఓ సంవత్సరమో లేక ఓ అరో పెద్దదవటం వలన మరియు తరగతిలో చదువుల్లో ప్రధమురాలైనందున సహజంగా తానే వాళ్ళ తరగతి లీడర్. మా అయ్యవారమ్మ ఎప్పుడన్నా మా పిల్ల పీచుల తరగతులకు లెక్కలు చెప్పమంటే ఆ బాధ్యతను నెత్తిన వేసుకొని సమర్థవంతముగా నిర్వర్తించెడిది. మా అక్క తరగతి వారంతా బుద్ధిగా ఐదవ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులై, ఆరవ తరగతి మా ఊరికి రెండూర్ల అవతల వున్న పెదపుత్తేడులోని ఉన్నత పాఠశాలలో చేరిపోయారు. వాళ్లకు జూనియర్స్ మయిన నేను, హిమ ఓ రోజు మనం నాలుగో తరగతిలోనే ప్రపంచాన్నంతా చదివేసాము అని నిశ్చయించుకుని, ఓ ప్రవేశ పరీక్ష రాసేసి, ఐదవ తరగతి ఎగ్గొట్టేసి ఆరవ తరగతిలో చేరిపోయాము. అప్పటి వరకు నా చదువులకు పోటీ మా హిమే. కానీ ఇప్పుడు ఆరవ తరగతిలో చేరగానే ఇక నేను పోటీ పడాల్సింది చదువులో కాకలు తీరిపోయిన మా భీష్మి రవణమ్మ తోనే. కానీ తాను మాత్రం మా తరగతి పరీక్షలు, యూనిట్ పరీక్షలు, త్రైమాసికాలు, అర్థ సంవత్సర పరీక్షలు మరియు సంవత్సరాంతపు పరీక్షలు అని వచ్చే లెక్కలేనన్ని పరీక్షల్లో తొణకకుండా బెణకకుండా ప్రధమురాలై నిలిచేది. మేమందరము మాకు ఆంగ్లము మరియు లెక్కలు బోధించటంలో అపర ద్రోణాచార్యులైన సుబ్రహ్మణ్యం అయ్యవారి వద్ద రెండు పూటలా ట్యూషన్ కి కూడా వెళ్లే వారము. కానీ తాను మాత్రం ఇవేవీ అవసరం లేకుండానే అన్నీ సబ్జక్ట్స్ లో ప్రధమరాలుగానే నిలబడి వార్ ని ఎప్పుడు వన్ సైడ్ చేసి పారేసేది. నా ఏడవ తరగతిలో అనుకుంటా, "రవణమ్మ! నువ్వు రాత పుస్తకాలు ఇంకా కొనలేదు ఎందుకు" అని అడిగిన మా అయ్యోరి ప్రశ్నకు సమాధానంగా ఏమాత్రం భేషజాలకు పోకుండా, జంకు బొంకు లేకుండా, సూటిగా , "హర్ష! వాళ్ళ పొలానికి పనికి వెళ్లిన కూలి డబ్బులు యింకా రాలేదు సార్, అవి రాగానే కొనుక్కుంటాను" అని అని చెప్పింది రవణమ్మ, తాను మాకు బడి లేని సమయాల్లో వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి మా వూరి పొలాల్లో కూలికి వెళ్ళేది అని తెలిసి కూడా నేను మా అయ్యోర్లు ఎప్పుడు చెప్పే, స్పర్దయా వర్ధతే విద్య అనే సూక్తిని వెంబడించి తనతో పోటీకి దిగేవాడను. కానీ ఆ రోజు నాకు మా రవణమ్మలో ఒక నాయకురాలు కనిపించింది. కళ్ళనీళ్ళతో దగ్గరకు వెళ్లిన నాకు, నేను ఆంగ్ల భాష నీలాగా చదవాలనుకుంటాను అబ్బాయీ!, నాకు నేర్పవూ! అని చెప్పింది తాను. నేను నీతో పోటీ పడి చదువులో నీ దరిదాపుల్లో వుండగలనేమో కానీ రవణమ్మ, నేను ఎప్పటికీ నీవు కాలేను అని చెప్పాను సిగ్గుపడుతూ. ఇంత చెప్పాక మీకు చెప్పనక్కర్లేదు అనుకుంటా, ఆ సంవత్సరం జరిగిన పబ్లిక్ పరీక్షలలో మా బడికి ప్రధమ స్థానం లో నిలబడినది ఎవరో. నేను ఎనిమిదవ తరగతిలో నెల్లూరుకు వెళ్ళిపోయి అక్కడ మా గుంట బడిలో చేరినా, మనస్సులో నా పోటీ రవణమ్మతోనే, తనకెన్ని మార్కులు వచ్చాయి మరి నాకెన్ని వచ్చాయి అని. అంటే గుంట బడిలో పోటీ దారులు లేరని కాదు, అక్కడ మహా మహులున్నారు. ఉప్పలపాటికి వచ్చినప్పుడల్లా మా రవణమ్మని కలిసే వాడిని. జీవితంలో ఎంతో ఉజ్జ్వల భవిష్యత్తు ఉండవలసిన మా రవణమ్మకి నేను తొమ్మిదో తరగతిలో ఉండగానే మద్రాసు సంబంధం వచ్చిందని పెళ్లి చేసి పంపించేశారు. నేను వాళ్ళ అమ్మతో తగువు పెట్టుకున్నా ఉక్రోషంతో కళ్ళ నీళ్లు తిరుగుతూ ఉండగా, అంత బాగా చదివే ఒక్కగానొక్క కూతురుని చదివించలేక పోయారా అని. దానికి ఆమె, మా ఇళ్లల్లో ఆడ పిల్లని ఒక అయ్య చేతిలో పెట్టాల్సిందే నాయనా అని నిట్టూర్చారు. నా ఆ ఉక్రోషానికి కారణం కల్మషాలు లేని వయస్సు అని, ఆ వయస్సులో మనం మన పోటీ దారులను మనకి తెలియకుండానే ఎంతో గౌరవిస్తామని.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

స్నేహనాథుడు మా రఘునాథుడు!
మీరెప్పుడన్నా విన్నారా, "కొత్త బిచ్చగాడు పొద్దెరగడు", "పాడిందే పాడరా పాచి పళ్ళ దాసరి", "పిచ్చోడికి పింగే లోకం" లాటి సామెతలు. వినలేదా అయితే సుప్రియని అడగండి, ఇంకా నాలుగు చెప్పి వాటికీ ఉదాహరణ గా నన్ను చూపిస్తుంది. నేను అదే పనిగా మా పెదపుత్తేడు జిల్లా పరిషత్ పాఠశాల స్నేహితుల, ప్రభుత్వ ఆదర్శ పాఠశాల స్నేహితుల, మా వాకాటి ఇంజనీరింగ్ స్నేహితుల గూర్చి రాస్తుంటే తాను నా రాతల్లోని యాంత్రికతను తట్టుకోలేక పై సామెతలు నేను వినేలా పాటల రూపంలో పాడుతుంది యీ మధ్య. "నా స్నేహితుల గూర్చి రాయాలంటే పెట్టి పుట్టాలి సుప్రియా!", అని చెబుతూ, వాళ్ళ గురించి నాలుగు ముక్కలు రాసుకుందామని యీ కథ రాస్తున్నా. నాకు ప్రతీ సారి ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల అని పదే పదే రాసెడి ఓపిక వున్నా మీకు చదివే సమయము ఉండదు కాబట్టి ఇక మీదటి మనం ఈ బడిని గుంట బడి అని పిలుచుకుందాము. మా నెల్లూరు సంతపేట గుండా పోయే పాత బైపాస్ రోడ్ కన్నా ఒక ఆరడుగులు లోతులో ఉంటుంది కాబట్టి, మా నెల్లూరు వాసులు ముచ్చటగా దీనికా పేరు పెట్టుకున్నారు. ఈ బడిలో నాకు దొరికిన నాకు దొరికిన ఇంకో స్నేహ నాథుడు మద్దిన రఘునాథుడు. నా దృష్టిలో అస్సలకి మా గుంట బడికే అందగాడు వీడు. వీడి పక పక నవ్వు చాలు స్నేహం చేసేదానికి. మేము ఎనిమిదో తరగతికి వచ్చేసరికే ఎదిగిపోయాడు, ఆపైన వేసేది పొట్టి నిక్కర్లూ. మహా స్టైల్ గ నాలుగు నోట్ బుక్స్ తెచ్చేవాడు బడికి, నో టెక్స్ట్ బుక్స్, నో గాడిద మోత. నేను కూడా ఫాలో అయిపోయా ఆ స్టైల్. కలిసే వెళ్లే వాళ్ళము స్కూల్ కి. వాళ్ళ ఇంట్లోనే మా గుంట బడి ప్రధానోపాధ్యాయులు శ్రీ సుబ్బారావు గారు అద్దెకి వుండే వారు. వాడు ఆయన దగ్గరే సాయంత్రాల పూట చదువులు వెలగబెట్టే వాడు. వీడితో స్నేహమయ్యాక వీడి సిఫారసుతో నేను కూడా ఆయన విద్యాదానం చేసే శిష్య పరమాణువులో చేరిపోయా, నాతో పాటు మా సహాధ్యాయునిలైన ముని మరియు అంజనీ కూడా. ఆయన మాకు లెక్కలు, సైన్స్ మరియు ఆంగ్లము బోధించేవారు, కానీ తెలుగు జోలికి వచ్చేవారు కాదు. రఘు వాళ్ళ నాన్నగారు వాళ్ళు మొత్తం నలుగురు అన్నదమ్ములు మరియు ముగ్గురు అక్క చెల్లెళ్లు. వాళ్ళను అందరిని పోషించడానికి మరియు ఒకదారి చూపించడానికి రఘు వాళ్ళ పెద్ద నాన్నగారు అయిన పరంధామయ్య గారు, తనకు వచ్చిన ఒక చిన్న పభుత్వ ఉద్యోగాన్ని కాదనుకొని మా సంత పేట లోనే ఒక హోటల్ ప్రారంభించారట చాలా ఏళ్ల క్రితము. ఈ హోటల్ ని ఆ నలుగురు అన్నదమ్ములు మరియు భర్త చనిపోవటంతో అన్నదమ్ముల వద్దకే వచ్చేసిన రఘు వాళ్ళ పెద్ద అత్త నడిపేవారు. ఆ హోటల్ మా సంతపేట లోని మునిసిపల్ కూరగాయల మార్కెట్ కి ఎదురుగా వుండే పరంధామయ్య హోటల్. అక్కడ దొరికే దోశె మరియు పాయా కూర కలిపి తింటే స్వర్గానికి బెత్తెడు దూరం లో ఆగిపోవొచ్చు అని మా నెల్లూరు వాసులు చెప్పుకుంటారు. మా స్నేహితుడు, గుంటబడి బడి విద్యార్ధి, మా సంతపేట నివాసి అయిన ప్రతాప్ గాడికి రోజుకి ఒక రూపాయ ఇచ్చేవారు ఇంట్లో టిఫిన్ కి. అది తీసుకెళ్లి అక్కడ దోశె పాయ తిని నాకు వర్ణించి వర్ణించి చెప్పేవాడు. నాకేమో నోరు ఉరిపోయేది, కానీ రూపాయ ఎత్తుకు వెళ్లి టిఫిన్ తినే బడ్జెట్ నాకు లేదు. మా ప్రతాప్ గాడు నాకు చెప్పే వాడు, వాడు తినే టిఫిన్ విలువ రూపాయున్నర అని, రఘు వాళ్ళ నాన్న గారు కౌంటర్ లో వుంటారు కాబట్టి వాడికి అర్థ రూపాయ కన్సెషన్ అని. ఒక రోజు నాకు ప్రతాప్ గాడికి గొడవ జరగటం, నేను ఇది మా రఘు గాడికి కుట్టెయ్యటం, వాడు నాకు ప్రామిస్ చేయటం జరిగిపోయాయి, "రేయ్ హర్షాగా! ఇక చూసుకుంటారా వాడి సంగతి. నేను కౌంటర్ లో ఉంటే వాడి చేత రూపాయిన్నర కక్కిస్తానురా" అని. రఘు గాడు ప్రతాప్ గాడు చాలా దగ్గర బంధువులు, అందుకే మా ప్రతాప్ గాడికి వాళ్ళ హోటల్ లో కన్సెషన్. అయినా మా వాడి ప్రేమ నా పట్లే. మేము తొమ్మిదవ తరగతిలో వున్నప్పుడు అనుకుంటా, రఘు వాళ్ళ చిన్న మేనత్త వాళ్లకు చెందినThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

ట్రాఫిక్ తో ఆత్మ సాక్షాత్కారం!
మొన్ననగా వెళ్లారు సుప్రియ మరియు పిల్లకాయలు, జూబిలీ హిల్స్ లో వాళ్ళ అక్క వాళ్ళింటికి. నేనెళ్ళి నసపెట్టి తీసుకురాక పోతే, వాళ్లకు నేనొకడ్ని వుండానని గుర్తుకే రాదు. టాకీ టౌన్ దగ్గర హైవే 65 మీదకి ఎక్కా, ట్రాఫిక్ స్మూత్ గానే ఉండడంతో కొంచెం స్పీడ్ పెంచా, అంతలోనే మియాపూర్ బస్సు స్టాండ్ దగ్గర, ఒక గుంపు రోడ్ ని అడ్డంగా దాటుతూ, అందులోనూ ఒకడు చెయ్యెత్తి మరీ, మీ వెహికల్స్ అన్నీ ఆపండెహె అన్నట్టు. నాలుగడుగులు ముందుకేస్తే, మియాపూర్ సర్కిల్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జి వుంది, లిఫ్ట్ కూడా ఉందిగా, ఏమి మాయ రోగం వీళ్ళకి రోడ్ కి అడ్డం గా దాటక పోతే అనుకుంటూ, విసుగ్గా వెహికల్ స్లో చేసి వాళ్ళు దాటాక ముందుకు కదిలా. జె.ఎన్.టి.యూ సిగ్నల్ దాటాక ఎర్రగడ్డ మీద కాకుండా అయ్యప్ప సొసైటీ మీద వెళదామని, విశ్వనాథ సినిమా దాటాక వచ్చే యూ-టర్న్ తీసుకుందామని రైట్ ఇండికేటర్ వేసి యూ-టర్న్ తీసుకుంటున్నా, ఇంతలో ఓ బండోడు స్కూటర్ లో నా వెహికల్ కి, మెట్రో పిల్లర్ కి, వుండే గ్యాప్ లో నాతో పాటు పార్లల్ టర్న్ తీసుకోవాలని దూరుతున్నాడు, ఆడిని దూరనివ్వకూదని ఆ గ్యాప్ ని ఇంకొంచెం నారో చేస్తూ టర్న్ తీసుకున్న. ఎప్పుడు నేర్చుకుంటారో ఈ వెధవలు ఒక వెహికల్ టర్న్ తీసుకునేటప్పుడు పార్లల్ గా టర్న్ తీసుకోకూడదు అని తిట్టుకుంటూ ముందుకెళ్లా. జె.ఎన్.టి.యూ దగ్గర, రైతు బజార్ దగ్గర, మంజీరామాల్ కి ముందు, ట్రాఫిక్ బాగానే వుంది కానీ, ఒక్క సారి ఫ్లై ఓవర్ ఎక్కగానే కాస్త తగ్గింది ట్రాఫిక్. ఎలాగూ ఆ ఫ్లై ఓవర్ దిగాక ఆ ఎదవ మలేషియన్ టౌన్ షిప్ దగ్గర ట్రాఫిక్ తప్పదు అనుకుంటూ ఫ్లై ఓవర్ మీద వెళ్తున్న, అంతలో నా ముందు ఒక డొక్కు ఆర్.టి.సి బస్, ఎడమ లేన్ నుండి నా లేన్ లోకి ఏమాత్రము ఇండికేషన్ లేకుండా వచ్చేస్తున్నాడు. ఒరే నేనున్నాను రా! ఈ లేన్ లో ఆల్రెడీ, నన్ను వెళ్లనివ్వరా, నేనెందుకు ఆగాలిరా నీకొసం, అనుకుంటూ వాదుగా ముందు కెళ్లాలని చూశా . వాడిదేం బోయా! సగం బస్ నా లేన్ లోకి తెచ్చేసాడు. ఎంజేద్దాం! బస్సుతో పెట్టుకుంటే పడేది మనకే బొక్క అనుకుంటూ ఆగక తప్పలా నాకు. జూబిలీ హిల్స్ కి చేరేసరికి ఇటువంటివే మరల మరల పునరావృత్తమవుతూ నా ఓపిక తినేసాయి. ఉసూరుమంటూ సుప్రియా అక్క వాళ్ళింటికి చేరేసరికి, అక్కడ నాకు వాళ్ళు మేము సెకండ్ షో కి వెళ్తున్నాము , నీతో ఇంటికి రాము అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నీకీ మాత్రం చెప్పటమే గొప్ప అన్న విధంగా. కావాలంటే భోజనం పెడతాం తిని ఇక్కడన్నా తొంగో లేక ఉదయాన్నే నీ ఆఫీసుని ఉద్ధరిద్దామని అనుకుంటే ఇప్పుడే కొంపకు పో అని ఆఫర్ ఇచ్చారు. చూడు నాకు మా అక్క చాలా మూటా ముల్లె ఇచ్చింది, అది మన ఇంటికి రావాలంటే నీ వెహికల్ వొదిలేసి వెళ్ళు, నేను రేపు ఆ మూటా ముల్లె వేసుకొని వస్తా అని అల్టిమేటం ఇచ్చింది సుప్రియా,. సరే నా కొంపకు పోయి, నే హాయిగా ఉంటా అని అనుకోని, వాళ్ళ అక్కకొడుకుని అడిగా, నన్ను మెయిన్ రోడ్ దాకా డ్రాప్ చేయరా బాబు అని. వాడికి సినిమా టైం అవుతుంది , స్కూటర్ లో అయితే తొందరగా డ్రాప్ చెయ్యొచ్చు అని స్కూటర్ తీసాడు. తెలివిగల్లోడు వాడు నా నస తప్పించుకోవొచ్చు అని నన్నే డ్రైవ్ చేయమంటారు ఎప్పడూ. సరే బయలు దేరాం యూ-టర్న్ ని సర్రుమని కార్ కి పిల్లర్ కి మధ్య గాప్ లో పార్లల్ గా తిప్పేసా. మా వోడు బాబాయ్, అలా తిప్ప కూడదు అంటూ మొదలెట్టాడు ,సర్లే రా ఆ బండ కారోడు వాడిదే పెద్ద కారు అనుకుంటూ ,అంత పెద్ద టర్నింగ్ రేడియస్ తీసుకుంటూ ఉంటే, మనకి టైం అయిపోవటంలా అంటూ దూసుకెళ్లిపోయా. వాడు వాడి తలకొట్టుకోవటం మిర్రర్ లో కనిపించింది. మెయిన్ రోడ్ లో దింపి వాడు సక్కా బోయాడు ఎనక్కి తిరగకుండా. ఇంతలో లింగంపల్లి బోయే బస్సు వచ్చింది, ఎక్కేసా. విండో సీట్ దొరికింది, ఏసీ బస్సు కావటంతో సౌలభ్యంగా వుంది. ఆహా! హాయిగా వుంది ప్రయాణం. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ జిందాబాద్, ఒక్క బస్సు నలభై మందిని తీసుకెళ్తుంది అంటే పది కార్లకి సమానమబ్బా, దీనికి రోడ్ మీద మహారాజ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎవడైనా , ముందు బస్సు తర్వాతే ఏదైనా, కార్లైనా గీరైనా అని ఆలోకాహ్నాలలో మునిగిపోయా. ఇంతలో మా వోడు పక్క లైన్ లోకి తిరుగుతున్నాడు, ఎనక నుండి కారోడు భయ్ మంటూ హార్న్ కొడుతున్నాడు. బుద్దిలేనోడా! నీ కారేంత బే, అందులోను అన్నీ బస్సులకు ఇండికేటర్స్ వుండవు, బస్సుల బ్లైండ్ స్పాట్ చాలా పెద్దది, అస్సలకి నువ్వు వెనకున్నవని ఎవడికి ఎరుక బే , ఐన ఈ జనాలెప్పటికీThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

లక్ష్మి, లేకపోవటం చాలా చేదు నిజం!
నాన్న వాళ్ళది ఉలవపాళ్ళ. నేషనల్ హైవే లో నెల్లూరు నుండి కావలికి వెళ్తుంటే సున్నబ్బట్టి , అల్లూరు గేట్ దాటిన తర్వాత హైవే నుండి ఒక కిలో మీటర్ లోపలి కెళ్ళాలి. ఒకప్పుడు బిట్రగుంట లోకో ఇంజిన్ మైంటెనెన్సు కి ఫేమస్. ఆ చుట్టు పక్కల ఊర్లలో సగం మంది రైల్వే ఎంప్లాయిస్. డ్రైవర్స్, ఫిట్టర్స్, గ్యాంగ్ మెన్ ఎవరి అర్హతల్ని బట్టి వారు ఆ చుట్టుపక్కల గ్రామాలనుండి బాగా సర్వీసెస్ లో వుండే వారు. మా తాత గారు కూడా అక్కడ ఫిట్టర్ . పక్కా కమ్యూనిస్ట్. ప్రజాశక్తి న్యూస్ పేపర్ చదవటమే కాక పది మందికి రోజూ చదివి వినిపించనిదే ఆయనకు నిద్ర రాదు. పుచ్చలపల్లి సుందరయ్య కి అనుంగు శిష్యుడు. ఆయనంత పెద్ద లీడర్ కావాలని మా నాన్న పేరు కూడా సుందర రామయ్య అని పెట్టారు. మా ఊర్లో పిల్లకాయలకి పేర్లు కూడా కొంత వింతగా పెట్టేవారు. రాజమ్మ హాస్పిటల్ లో పుట్టాడని మా తమ్ముడి పేరు రాజా రామయ్య , మా మా మేనత్త కొడుకుల పేర్లు భాస్కరయ్య , గోపాలయ్య. ఎందుకంటే వాళ్ళు మా మేనత్త కడుపు తో వున్నప్పుడు చూసిన వైద్యులు . ఆలా ఉండేవి వాళ్ళ కృతజ్ఞతలు అలాగే వైద్యులను దేవుళ్ళలాగా చూసే విధానం. మా వూరు లో చాలా మంది రైల్వే ఉద్యోగులు, రైతులు అలాగే బిట్రగుంటలో వ్యాపారాలు చేసుకొనే వారు. చాలా మటుకు బొంతరాయి గోడలమీద పెంకులతో ఇళ్ళు కళ కళ లాడుతూ ఉండేవి. మా ఊరి చెరువు రామన్న చెరువు , చేపలకి చాల ప్రసిద్ధి . ఊరులో బలిజ వీధి, రెడ్ల వీధి , గొల్ల వీధి , సాలె వీధి. వూరికి కొంత దూరంగా మాలాడ, మాదిగ వాడ. ఒకప్పటి టిపికల్ విలేజ్ స్ట్రక్చర్. ఎవరి వృత్తులు వారివే. మా తాత కమ్యూనిస్ట్ అన్నాను కదా అందుకే మా నివాసం రెడ్ల వీధిలో కాదు, బలిజలందరి మధ్య. ఇక్కడ నేను కాస్ట్ డివిజన్ గురుంచి మాటలాడటం లేదు. వాళ్ళ మధ్య వున్న యూనిటీ గురించి చెప్తున్నా. మా అమ్మ పిల్లలందరికీ చదువు చెప్పేది మాతో పాటు. పిల్లలకు మా గేదె పాలు ఒక గ్లాస్ ఫ్రీ. మాకు ఒక ఐదు ఎకరాల తోట ఉండేది. వేరుసెనగ మరియు మిరప ఎక్కువగా పండించేవాళ్ళము. ఇతర పంటలుగా గోంగూర, వంగ, బెండ మొదలగునవి వేసే వాళ్ళము. ఈ ఇతర పంటలు అమ్మకానికి కాదు. కోసి ఇంటికి తీసుకొస్తే ఎవరైనా తీసుకెళ్లొచ్చు. అమ్మ ఎవరికీ అడ్డు చెప్పేది కాదు. అందుకే చుట్టుపక్కల వాళ్లందరికీ మా అమ్మ అంటే చదువుకున్నది, పిల్లలకి నాలుగు చదువు ముక్కలొస్తున్నాయని, తన దగ్గర ఉంటే సహాయం అడగ కుండానే వస్తుందని వాళ్ళ ఇంట్లో మనిషిగానే వుండే వారు. మా ఇంటి పక్కలంతా మామిడాల వాళ్ళు, కేశాని వాళ్ళు, అక్కిశెట్టి గారు, పూలశెట్టి వాళ్ళు. మా వూర్లో ముందు ఇంటిపేర్లే చెప్పాలి. ఎవరబ్బాయివిరా అంటే మామిడాల వాళ్ళ అబ్బాయిననో, అక్కిశెట్టి గార్ల పిల్లోడిననో చెప్పాలి దాన్ని బట్టి ఏ కులమో కనిపెట్టేస్తారు. నేను ఆదిరెడ్డి మనవడిని అంతే. ఎవరన్నా ఎవర్రా నువ్వు అంటే నా దోస్తులు ఆదిరెడ్డి మనవడు అని చెప్పేవారు. మా వూర్లో గుడులకు కూడా కొదవ లేదు. ఒక రామాలయం , ఒక కామాక్షమ్మ గుడి, ఒక ఆంజనేయస్వామి గుడి. వూరికి ముందు ఒక వాగు వూరికి వెనుక రామన్న చెరువు. ఆ వూర్లో మా పిల్లకాయలు ఆడిందే ఆట పాడిందే పాత. ఎక్కడ నీళ్లుంటే అక్కడే మా ముడ్లు కడగటం, ఆడటం. వాగులో నీళ్లుంటే వాగు పక్క, చెరువులో నీళ్లుంటే చెరువు పక్క. ఛాయస్ మాదే. నాకు ముగ్గురు దోస్తులు. మామిడేలా కిష్ట, అక్కిశెట్టి శేషగిరి, గుడిపూజారి కొడుకు స్వామి. కిష్టకి అమ్మ లేదు చనిపోయింది. నాన్న వెళ్ళిపోయాడు ముగ్గురు పిల్లల్ని వాళ్ళ తాత కి వదిలేసి. తాతేమో అమ్మమ్మ చనిపోతే ఇంకో ఆవిడని చేసుకున్నాడు. ఆవిడ పేరు పద్మావతమ్మ . ఆవిడే వీళ్ళ ముగ్గురుని చూసుకొనే వారు. ఆవిడకి కిష్ట వాళ్ళ తాత వలన లక్ష్మి అని ఒక పాప . మాకన్నా రెండేళ్లు చిన్న. మాకు ఆరేళ్ళు ఉంటే ఆ పాపకి నాలుగేళ్లు. లక్ష్మి , మా తమ్ముడు రాజా ఐకే వయస్సు. ఆటలు పాటలు వాళ్లొక బ్యాచ్. ఒక రోజు కిష్ట, స్వామి సాయంత్రం మూడు అప్పుడు వచ్చారు తోపులోకి వెళదామని అంటే చెరువు వైపు. నాకెందుకు తోపులో చింత చెట్లు దెయ్యాల్లా ఉంటాయి, అందుకని నేను వాగుకి వెళ్ళడానికి ఇష్టపడతా. నేను రాను అన్నా, కానీ వాళ్ళు ఇద్దరు నేను ఒకడిని. అందులో చెరువు లోకి నీళ్లు అప్పుడే వస్తున్నాయి. నీళ్ళల్లో ఆడొచ్చు అని. ఎప్పుడూ మాతో రాని లక్ష్మి ఆ రోజు వెంటబడింది నేను వస్తా అని. వొద్దని రానివ్వలేదు. ఐనా వెంటబడితే వాళ్ళింట్లో దింపొచ్చాము. కానీ ఇంట్లో కళ్లుకప్పి మా వెంట వచ్చేసింది. తీసుకెళ్ళాం. అక్కడ నీళ్లను చూస్తే మాకు పూనకం వచ్చేసింది. అక్కడ అప్పటికే ఓ పది నుండి పదిహేను వరకూ చిన్న చితక పిల్లలున్నారు. వాళ్ళల్లో కలిసిపోయాం. అసలు లక్ష్మి మా వెంట వచ్చిందనే స్పృహే లేదు మాకు. ఆడాం ఆడాం అలిసిపోయే వరకు. వచ్చేసThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

నా స్నేహితుల కథా క్రమం లో మా సుబ్బూ గురించి!
నేను కథలు రాయాలనుకున్నప్పుడు, మొదట స్నేహితుల గురుంచి రాద్దామనుకున్నాను. కానీ ఇలా రాయటం లో తెలియని ప్రమాదముంది. మొదట యీ రాయటం సరదాగా మొదలయినా, పోను పోను అవి నా అభిప్రాయ వ్యక్తీకరణ సాధనాలుగా మారుతాయేమో అన్నది నా భయం. అప్పటికీ నేను నా స్నేహితులతో వాదించవచ్చు ఈ కథ నేను నా కోణంలోనుంచి మాత్రమే రాస్తున్నాను అని. అలా వాదించటం నన్ను నేను మోసం చేసుకున్నట్టే అవుతుందేమో. కాబట్టి నాకు తెలిసినంత వరకూ తటస్థం గానే రాస్తాను. మా శ్రీధర గాడు మాత్రం దీనికి మినహాయింపని మీకిది వరకే బోధపడిందను కుంటా. వాడో మంచి స్నేహితుడు మరి. ఈ కథ నా ఇంకో స్నేహితుడు సుబ్రహ్మణ్యం గురుంచి. నేను, సుబ్రహ్మణ్యం మరియు చంద్రశేఖర్ మా వాకాటి కాలేజీ వుండే విద్యానగర్ అనే పల్లెకి ఎక్కువ, పంచాయితీకి తక్కువ లాటి ఊర్లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరపు కాలంలో రూమ్ మేట్స్ మి. ఆ వూర్లో పేరుమోసిన ఆర్ట్స్ కాలేజీ మరియు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటంతో రూమ్స్ కి డిమాండ్ ఎక్కువే. ఆ ఊరి మోడల్ హై స్కూల్ లో పని చేసే గరటయ్య అనే లెక్కల మాస్టారు, కోటలో పని చేసే మా బావకి స్నేహితుడు కావటం మూలాన, మా బావ కోరికతో, ఆ మాస్టారు మాకు రూమ్ అని ఏకోశానా గుర్తింప మనస్కరించని ఓ సగం కూలి వంగిపోయిన కప్పుగల ఒక పూరి గుడిసె చూపించి పుణ్యం మూటకట్టుకున్నారు. మరి మేము ముగ్గురము ఎలా రూమ్ మేట్స్ మి అయ్యామంటే, చంద్రశేఖర్ గరటయ్య మాస్టారి ప్రియ శిష్యుడు మరియు మా సుబ్రహ్మణ్యం యొక్క చెడ్డీ మిత్రుడు, నన్ను గరటయ్య మాస్టారు వీళ్ళతో కలిపాడు. మా చంద్రశేఖరుడు ఇంజనీరింగ్ విద్యార్థి కాదు, ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి. మేము ఆ గుడెసెనే దేవాలయంగా ఆ ఓనరమ్మనే దేవత గా కొలిచాము. మరలా అప్పుడప్పుడూ ఆవిడ రూమ్ ని నీట్ గా పెట్టామా లేదా అని ఇన్స్పెక్షన్ కి వచ్చేది. ఆవిడకి మా సుబ్బూ మాట అంటే తెగ గురి, చదుకొని బాగుపడే లక్షణాలు ఉన్నాయని. కానీ మా సుబ్రమణ్యాన్ని చూసాక అసలు ఒక వ్యక్తి ఇంతలా చదువుతాడా అన్న ప్రశ్నకి సమాధానం ఇప్పటికీ దొరకలా. స్వయం పాకం చేసుకునేవాడు. ఉదయం లేచి స్టవ్ మీద అన్నం పెట్టి, అది అయ్యేలోపల చదువుతూ, చదివినది పలక మీద పర పరా రాస్తూ మొదలెట్టి, మరలా కాలేజీ నుండి వచ్చాక అన్నీ సబ్జెక్టులు, అన్నీ టెక్స్ట్ బుక్కులు, ఆ బుక్కుల్లో అన్నీ పేజీలు చదివేసే వాడు, చదివింది మరలా యధావిధిగా పలక మీద పర పరా రాసేసేవాడు. మా గుడిసెలో ఒకే బల్బ్ హోల్డర్ వుండేది కాబట్టి మా చదువులన్నీ ఒక దగ్గరే. చాలా శ్రద్దగా చదివే సుబ్రహ్మణ్యం అవతలి వాడు చీమని చిటుక్కుమనిపించినా చిరాకు పడిపోయేవాడు. నాకది చాలా వింతగా వుండేది మరియు వాడిని ఇరిటేట్ చేయడానికి సాధనంగానూ కూడా. నేను కూడా అప్పుడప్పుడు కొంచెం పెద్దగా చదువుతూ వాడిని గీరే వాడిని తగువుకి. సుబ్రహ్మణ్యం నాయుడుపేట మండలంలో ఓజిలి దగ్గరైన అన్నమేడు గ్రామస్థుడు. మొదటి నుండీ అన్నీ తరగతుల్లో ప్రధముడే. వాళ్ళ నాన్నగారు వాడికి ఊహ రాక ముందే గతించడంతో, తన ఇద్దరి పిల్లల్ని వాళ్ళ అమ్మగారు తన రెక్కల కష్టంతో చదివించుకుంటున్నారు. వీడు మూడు వారాలకో లేక నెలకొకసారో సైకిల్ మీదనే వాళ్ళ ఊరెళ్ళి తనకి కావాల్సిన సామగ్రి తెచ్చుకొనే వాడు. వాడి ధ్యాస అంతా చదువే. నాకు మొదటి నుండీ ప్రశ్న-అర్ధకమే, వీడు మా వాకాటి కాలేజీలో ఎలా పడ్డాడురా నాయన శాపవశాత్తూ, ఎక్కడో ఐ.ఐ.టి లో ఉండాల్సినోడు అని. అలా చదవటమే తిండీ నిద్రలాగా భావించే మా సుబ్రహ్మణ్యం మొదటి సంవత్సరంలో మా కాలేజీకి ప్రధముడిగా నిలిచాడు. మా కాలేజీ మా యూనివర్సిటీలో చదువుల్లో మేటి కాబట్టి, మా యూనివర్సిటీకి ప్రథముడు వాడు. మాకూ ఎదో గుర్తింపు యూనివర్సిటీ ప్రధముడి రూమ్ మేట్ గా. కొందరు చదువుల ఔత్సాహికులు వాడితో పాటూ నాతో మాట మంతీ కలిపేవారు, మా సుబ్రహ్మణ్యం రాంక్ యొక్క రహస్యం చెప్పమని. అక్కడ రహస్యమేమీ కనపడలా నాకు అస్సలు సాధ్యం కానీ కఠోర శ్రమ తప్ప. సుబ్బూ చదువు చూసి ఉత్తేజితుడైన మా చంద్రశేఖరుడు కూడా నా మడత కూడా పడని మరియు కొత్త కరుకులా మిగిలిపోయిన ఇంజనీరింగ్ మెటీరియల్ నాచేతనే తెప్పించుకొని, మా చేత సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఎంసెట్ లో రాంక్ తెచ్చుకొని తదుపరి సంవత్సరం ఇంజినీరింగ్ లో చేరటం మాకు మిగిలిన గొప్ప అనుభూతి. కానీ ఇలా చదివే సుబ్బుని నేను రెండవ సంవత్సరంలో భరించలేక మా శ్రీధరగాడితో కలిసి వేరే రూమ్ కి మారిపోయి ఊపిరిపీల్చుకున్న. నాకు మా సుబ్బూ మీద మొదటి నుండి చివరి వరకూ ఓ ఫిర్యాదు లేక ఓ మనస్తాపం ఉండేది. మా బోటి వాళ్ళము మాకొచ్చిన అరాకొరా విజ్ఞానంతోనే, ఎవరైనా స్నేహితులొచ్చి ఏమన్నా సందేహాలు అడిగితే, పరీక్షా సమయంలో కూడా, మేము చదివేది పక్కన పెట్టి వాళ్ళ సందేహాల్ని నివృత్తి చేయ ప్రయత్నించే వాళ్లThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

మా పల్లెటూరోళ్ల, గత కాలపు వినోదాలు!
నేను చాల రోజుల నుండి మన మధ్య నుండి మాయమై పోయిన ఒకప్పటి వినోదాల గురుంచి రాయాలనుకుంటున్న. కాక పోతే గత పల్లెవాసిగా నావన్నీ ఒకప్పటి గ్రామాల్లో కనిపించి ఇప్పుడు మాయమయ్యినవి అయ్యుంటాయి. మొదట మనందరికీ ఇష్టమైన ఆసక్తికర మైన రికార్డింగ్ డాన్స్ లతో మొదలెడుతా. మా వూరిలో శ్రీరామనవమి నాలుగు రోజులో ఐదు రోజులో జరిగేది. ఒక్కో రోజు ఒక్కొక్కరి ఉభయం. ఒక రోజు బలిజ వాళ్ళది , ఒక రోజు గొల్ల వాళ్ళది , ఒక రోజు సాలె వాళ్ళది , కళ్యాణం రెడ్లది ఇలా అన్న మాట. ఉభయం ఎవరిదైతే ఆ రోజు దేవుడి అలంకరణ , అన్న ప్రసాదాలు , వినోదాల ఏర్పాట్లు వాళ్లవే. మా వూరు అంటే ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ వూరు. అమ్మమ్మ వూరు అంటే ఆత్మ బంధువుల వూరు అంటారుగా. ఈ ఉభయాల సందర్భం గా జరిగే వినోద సమర్పణలో మేము ఎదురు చూసేది రికార్డింగ్ డాన్స్, కీలు గుర్రాలు, నెమలి వేషాలు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రము ఎప్పుడవుతుందా అని ఎదురు చూడటం, ఈ లోపల డాన్స్ పాపలు వచ్చారా అని ఎంక్వయిరీ లు చేయటం, కుతూహలం చంపుకోలేక జట్లు జట్లు గ పిల్ల కాయలం వెళ్లి వాళ్ళు బస చేసిన ఇంటి చుట్టూ గిరికీలు కొట్టటం . ఈ లోపల ఎవడో పిల్లకాయ చెప్తాడు, నేను చుశానురా డాన్స్ పాపని కిటికీ తొర్రలోంచి అని. వాడు కన్ఫర్మ్ చేయగానే హమ్మయ్య అని తృప్తి పడటం. చీకటి పడగానే మొదలయ్యేది వాళ్ళ ఊరేగింపు, బస దగ్గర నుండి గుడికి. కీలు గుర్రాలు , నెమలి వేషాల వాళ్ళు, రికార్డిండ్ డాన్స్ ట్రూప్ లు, దారి పొడవునా వాళ్ళతో పెట్రోమాక్ లైట్స్ వెలుగులో మేము. మొదట కీలు గుర్రాల ఆట, తర్వాత నెమలి వేషాలు, ఆ తర్వాత అసలు సిసలు రికార్డింగ్ డాన్స్ లు. ఈ రికార్డింగ్ డాన్స్ లకు నార్మల్ గా స్టేజి, ట్రాక్టర్ తొట్టి. మొదట డాన్స్ లన్నీ క్లాసికల్ పాటలకి. కుర్రాళ్ళు మాత్రం అసహనంతో ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉండేవారు. తర్వాత ఏమి జరగబోతుందో తెలిసినట్టు కొందరు ఊరు పెద్దలు మర్యాదగా తప్పుకొనే వారు. అప్పుడు మొదలయ్యేవి నా సామీ రంగా! పుట్టింటోడు తరిమేశాడు డాన్స్ లు. వాళ్ళు రెచ్చిపోవటం కుర్రకారు రెచ్చిపోవటం. డాన్స్ వేసే ట్రూప్ లో మొగ వాళ్ళని నెట్టేసి మా ఉరి మొగ జనాలే, ఆ డాన్స్ పాపలతో డాన్స్ లు. మిగతా రోజుల్లో ఉండేవి హరి కథ కాలక్షేపాలు, బుర్ర కథ లు. కానీ మాకు అవి ఎక్కవే. మాది అంత డాన్స్ పాపల పార్టీ అయ్యే. ఇక కళ్యాణం అయినా మరునాడు వసంతోత్సవాలు, మాకు గుర్తుండే రోజు. ఊరు ఊరంతా వసంతాలు (హోళీ లాగ) పోసుకొనే వాళ్ళు. వరసైన వాళ్ళుంటే, కుర్ర కారుకి ఆ మజానే వేరు. ఇక మాకు పిల్లల కి పంటలు వచ్చే కాలం లో వచ్చే వినోదాలు చాలా వున్నాయి. ఎలుగు బంటిని తీసుకొని ఊరూరా తిరుగుతూ, వాటితో విన్యాసాలు చేయిస్తూ వచ్చే వారు కొందరు. కొందరు కాటి పాపలు అంటూ వచ్చేవారు, చిన్న చిన్న మేజిక్ ట్రిక్స్ చేస్తూ, వాళ్ళ చేతుల్లో గోలీలను మాయం చేసి మా ముక్కుల్లోంచి తీస్తూ బాగా వినోదం పంచేవారు. వాళ్ళ వెంట వీధులన్నీ తిరుగుతూ మేము. తర్వాత ఏమాల స్వాములని వచ్చేవారు గుర్రమెక్కి. సాయంత్ర మైతే పసుపు బట్టలతో తయారయ్యి స్వామిలా గుర్రమెక్కి ఊరి వీధుల్లో వూరేగేవారు. వాళ్లకి హారతులు ఇస్తూ ఇళ్ల ముందు, వాళ్ళ వాళ్ళ శక్తికి తగ్గట్టుగా ధాన్యం ఇచ్చేవారు ఊరి జనాలు. అలాగే హరి దాసులు. వీళ్ళు చూసేదానికి చాలా చక్కని వారు. మెడలొ హారాలతో నెత్తి మీద బంగారు రంగు పాత్రతో, హరిలో రంగ హరి అంటూ వీధి వీధికీ తిరుగుతూ వీళ్ళ వెంట మేము. అలాగే శంఖం ఊదుతూ వెట్టి వాళ్ళు వచ్చే వారు. అంత బార్టర్ సిస్టమే. ఇచ్చేది డబ్బులు కాదు, ధాన్యమే. వరినాట్లుకి వరికోతలకు ఉత్తరాది వారు అంటూ పనికి వచ్చి అవి అయ్యేవరకు మా గ్రామము లోనే బస చేసే వారు. వాళ్ళని డబ్బుల కూలీలు అనే వాళ్ళం. మాకు విశాలమైన కొట్టాలు ఉండటం తో ఎక్కువమంది మా కొట్టాలలో వుండే వారు. వాళ్ళ భాషలు, వాళ్ళ వంటకాలు, వాళ్ళ పాటలు ,మా పిల్లలకి ఎప్పుడు వింత, ఎప్పుడు మహా ఆసక్తి. పంటలు కోసేసాక పొలాల్లో రాలిపోయిన గింజల్ని మేపుకోవడానికి బాతుల వాళ్ళు వచ్చే వారు. వాళ్ళ నివాసాలు పొలాల్లోనే. వాటి వెంట పడి ఆడటం మాకు సరదా. అలాగే మా చుట్టూ పక్కల ఊర్లకంతా మా ఊరికి ఒక నాలుగైదు మైళ్ళ దూరం గొట్లపాళెం లో గౌతమి టాకీస్ అనే టూరింగ్ టాకీస్. సినిమాకి ఎద్దుల బండి కట్టించుకొని వెళ్ళటం లో హాయి అనుభవిస్తే కానీ అర్థం కాదు. దగ్గర దగ్గర కెళ్ళి నప్పుడు ఇంకా నమో వెంకటేశా! నమో తిరుమలేశా! అనే పాట ఇంకా వస్తుంటే ఆట ఇంకా మొదలు కానట్టు. లవకుశలు, పాండవ వనవాసాలు, నర్తన శాలలు, మాయా బజారులు వThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

ఉజ్జ్వల మైత్రి అనుబంధం కి నాంది!
మా సూరిని తీసుకు రావటం, వాడిని రీహాబిలిటేషన్ సెంటర్ లో చేర్చటం మరియు వాడు కూడా బుద్ధిగా చికిత్సకు సహకరిస్తూ వుండడటంతో మా మిత్రబృందపు ఆత్మ విశ్వాసం ఇనుమడించింది, మనము కూడా అనుకున్నపనులు అనుకున్నట్టుగా సాధించగలం అని. ఈ లోపల మాతో వాకాటిలో చదివిన ఇంకో మిత్రుని అమ్మగారికి శస్త్ర చికిత్స అవసరం అయ్యింది, మా వాడు కూడా ఉద్యోగం మారే సంధికాలంలో ఉండటంతో ఇన్సూరెన్స్ ద్వారా అందవలసిన సహాయం అందక పోవటముతో ఇబ్బందుల్లో పడిపోయాడు. ఈ విషయం తెలిసిన మా ప్రశాంత్ గాడు స్పందించి మా అనీల్గాడిని కార్యరంగంలోకి దిగమని ఆజ్ఞాపించటం, మరియు మా వాడు మా వాళ్ళందరినీ కదిలించటంతో ఒక వారం లోపే చికిత్సకు కావలసిన రమారమి ఓ పది లక్షలు, ఇంక వొద్దురా నాయనా చాలు ప్రస్తుతానికి అనే దాకా మా వాళ్ళు చక చక సర్దేసారు. ఇటువంటి అసంకల్పిత ప్రతీకార చర్యలాగా అందిన సహాయం మా వాళ్ళ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసింది, అవును అవసరాలలో వున్న మన స్నేహితులనందరినీ ఆదుకోవోచ్చు అని. దానితో పాటు ఎన్నో ఆలోచనలు, వనరులు ఎలా సమకూర్చుకోవాలి, ఏమేమి ప్రాధమిక అవసరాలు పరిగణలోకి తీసుకోవాలి, కేవలం స్నేహితుల ఆరోగ్య సమస్యలేనా, లేక కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు కూడానా, లేక పిల్లల చదువులు కూడా పరిగణించాలా, బదులు తీర్చే నిబంధన తోనా లేక గ్రాంట్ రూపం లోనా, ఇటువంటివి అన్నిటికీ ఒక రూపం రావాలంటే ఒక కార్యనిర్వాహక బృందం ఏర్పడాలి అని నిశ్చయించారు. ఈ లోపల మా కాలేజీతో సంబంధ బాంధవ్యాలు నెరుపుతున్న మిత్రులకి మా కాలేజీ తరపున మా బృందం కాలేజీని వొదలి ఇరవై ఐదేళ్లు అయిన సందర్భముగా జరపబోయే రజతోత్సవానికి రమ్మని ఆహ్వానము అందినది. ఈ ఆహ్వానాన్ని అందిపుచ్చు కొని వీలు అయినంత మందిమి కలవాలని నిశ్చయించారు. మా ముందు బ్యాచ్ వాళ్ళు ఒక ఎనభై మంది వరకు అట్టి సమ్మేళనంలో కలిసారని మా సీనియర్ అయిన బాలాజీ ద్వారా తెలియటం తో మేము కనీసం ఒక నూట ఏభై మందిమైనా కలిసి మా బ్యాచ్ యొక్క ప్రత్యేకతని నిలబెట్టుకోవాలని తీర్మానం చేసేశాము. వీటి ఏర్పాట్లు పర్యవేక్షించడానికి అందరం ఒక మూడు నెలల ముందే మా నారాయణగాడి నిర్మాణ సంస్థలో వాడి కార్యాలయం లో ప్రతి రెండు ఆదివారాలొకొక సారి సమావేశాలు నడపాలని నిశ్చయించారు. అలా సమావేశానికి వచ్చిన వారికి మా నారాయణుడు ఇడ్లీలు, పొంగలి, వడలు, అటుపిమ్మట ఓ మంచి కాఫీ తో సత్కరించాలని హుకుం జారీ అయిపోయాయి. అలా మొదలైన మా సమావేశాలకి మా ఎన్.ఆర్.ఐ మిత్రులు వీడియో కాల్ లో కలిసేవారు. రజతోత్సవం రోజున మా కాలేజీ లో కలిసి, సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొని, అటు పిమ్మట ఆ సాయంత్రానికి తిరుపతి చేరుకొని, ఆ రాతిరి మరియు మరుసటి రోజంతా మా సంబురాలు జరుపుకొని అటుపిమ్మట మరలా ఎవరి మానాన వాళ్ళం వాళ్ళ వాళ్ళ ఊర్లకు చేరుకునేలా పథకం వేసేశాము. ఈ పథకాన్ని చిన్న చిన్న పనులుగా విభజించి, ఒక్కో పనికి ఒక్కొరిని బాధ్యుల్ని చేసి ఆ పనులు ఎలా సాగుతున్నాయి చూడడానికి రెండువారాలకొకసారి సమావేశం అయ్యేవాళ్ళము. వీలైనంత మంది స్నేహితులను ఈ సమ్మేళన సందర్భంగా వచ్చేలా చూసే బాధ్యత మా అనీల్గాడు నెత్తికెత్తుకున్నాడు. ఆ కార్యక్రం అయ్యేదాకా నిద్రాహారాలు మాని ఒక పూనకం వచ్చిన వాడిలా పని చేశాడు. వాడు ఒక్కో స్నేహితుడిని ఎలా కనుగొన్నాడో రాయాలంటే ఓ పెద్ద గ్రంథమే అవుతుంది కానీ మచ్చుకు కొన్ని రాసి వాడి పరిశోధనా భరితమైన బుర్రని గురించి తెలియజేయాలి అని అనుకుంటున్నా. అసిఫ్ అహ్మద్ మా సహాధ్యాయి మరియు మా అనీల్గాడికి ల్యాబ్ మేట్. అట్టి ఆసిఫ్ ని మావాడు చివరిసారిగా కలిసింది 1994 లో మరియు హైదరాబాదు నగరంలో. అటు పిమ్మట వారిద్దరి మధ్య సమాచార వారధి తెగిపోయింది. మావాడు ముందుగా ఆసిఫ్ ని వెతకటం లో పడ్డాడు, ముందుగా మా కాలేజీలో లోనే ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మా స్నేహితుడైన మోహనయ్య ద్వారా అసిఫ్ అడThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

గడ్డు కాలంలో నాతో నేను!
ఈ రోజు తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తుంటే మా ఇంజనీరింగ్ అయ్యాక మాకు లభించిన ఒక సంవత్సరం ఖాళీ మనకు చాలా జీవుతానుభవాలనే నేర్పించి ఉంటుందని అనిపించింది. ఈ మధ్య ఒక సినిమాలో చూశా డిగ్రీ అయ్యి బయటకి రాగానే నెక్స్ట్ ఏంటి అని ప్రతీ వాడూ అడిగేవాడే అని కథానాయకుడు బాధగా పాడుకొనే పాటని. మేము బయటకు రావటం అందరిలా కూడా రాలేదు కదా, మీరు మర్చిపోయారా, పరీక్షలు ఎగ్గొట్టి ఒక్క సంవత్సరం కాజేసుకొని వచ్చిన బ్యాచ్ మాది అని. అసలు మాకీ పరిస్థితిఎందుకు వచ్చిందబ్బా అని కొంచెం వెనక్కి వెళ్లి ఆలోచిస్తే, ఎక్కడో మేము మా నాలుగవ సంవత్సరపు చదువుని నిర్లక్ష్యం చేసి తీరా పరీక్షలు దగ్గర పడటంతో ఎక్కువ ప్రిపరేషన్ కావాలని, అలా కావాలంటే యూనివర్సిటీ వాళ్ళు ముందుగా షెడ్యూల్ చేసిన ప్రకారం ల్యాబ్ ఎగ్జామ్స్ థియరీ ఎగ్జామ్స్ కన్నా ముందు వద్దు, వెనకకి జరపమన్నామని నాకు గుర్తు. అలా చెయ్యటం వలన మాకు కొంచెం ఎక్కువ రోజులొస్తాయి థియరీ ఎగ్జామ్స్ రాయడానికి అని మా వాదన. కానీ మేము మిస్ అయిన లాజిక్ ఏమిటంటే మాలో తొంబై శాతం మందిమి వన్ డే బాటింగ్ చేసేవాళ్ళమే, అలాటి మాకు ఎక్కువ రోజులుంటే ఏమి తక్కువ రోజులుంటే ఏమి. ఎందుకంటే మేము చదవ బోయేది సరిగ్గా పరీక్షకు ముందు రోజే కదా. వెళ్లి రాసి పడేసి వుండాల్సింది, స్ట్రైక్ అని మా తద్దినం మేమే పెట్టుకోకుండా. పరీక్షలు రాయకుండా ఇంటికి వచ్చిన నన్ను చూసి ఇంటా బయటా హేళనలే, ఎవరూ జాలిపడలా, పిల్లకాయలేదో తప్పు చేసి వచ్చారు అని. ఆ తర్వాత పరీక్షలు రాసి వచ్చినా, మా అన్న హైద్రాబాదులో చూపిన వుద్యోగం చేయకుండా రెండవ రోజే పారిపోయి రావటం తో వీడు దేనికీ పనికి రాడు అనే ముద్ర పడిపోయింది మా వాళ్లకు. అది నా మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసింది. మీకు తెలుసనుకుంటా నాకిటువంటి అనుభవమే ఇంటర్మీడియట్ లో జరిగింది, రెండవ సంవత్సరం లెక్కల పరీక్ష తప్పటంతో. అక్కడో సంవత్సరం ఖాళీ మరలా ఇంజనీరింగ్ అయ్యాక ఇంకో సంవత్సరం ఖాళీ. ఈ దెబ్బతో మనకి అన్ని సంవత్సరాలు ఎగిరెగిరిపడి తీరా అసలు సమయమొచ్చాక చతికిల పడ్డ చందాన పేరు వచ్చింది. అందులోను మనల్ని మన తలితండ్రులు చూసే విధానం మనం చదువుల్లో ఎలా రాణిస్తాము అనే దాని బట్టి ఉంటుంది, దీనికి మినహాయింపు ఇవ్వ దగ్గ తలితండ్రులను వేళ్ళ మీద లెక్కించ వచ్చు. మా కుటుంబం ఇందుకు అసలుకే మినహాయింపు కాదు, మా కుటుంబ ఆర్ధిక పరిస్థుల దృష్ట్యా. ఏమీ చేత కానీ వాడు అనే ముద్రనుండి బయట పడాలని, నేను నెల్లూరు లో ఒక ఏ.ఎం.ఐ.ఈ కి శిక్షణను ఇచ్చే సంస్థ వెనక పడ్డా, ఉద్యోగమివ్వండి నేను స్ట్రెంగ్త్ అఫ్ మెటీరియల్స్, థెర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ల వంటి సబ్జక్ట్స్ ని బాగా చెప్పగలను అని. నాకింకా గుర్తు మనకి సర్టిఫికెట్స్ కూడా రాలేదప్పటికీ, నేను నా గేట్ స్కోర్ కార్డు పట్టుకు తిరిగే వాడిని నన్ను నమ్మండి మహా ప్రభో అని. వాళ్లేమో రేపురా లేక ఎల్లుండిరా అంటూ రెండు నెలల పుణ్యకాలం అరగ దీశారు. ఈ లోపు నేను అప్పట్లో మా నెల్లూరులో పుట్ట గొడుగులా వుండే ఇంటర్మీడియట్ కోచింగ్ సెంటర్ల చుట్టూ కూడా తిరిగా, లెక్కలు మరియు భౌతిక శాస్త్రం చెప్పగలనని. పేరు మోసిన సంస్థలు ఎలాగూ గేట్ లోపలక్కూడా రానివ్వవని తెలిసి, టెన్త్ పాస్ అయితే చాలు మీ వాడికి ఇంజనీరింగ్ గ్యారంటీ అని బోర్డు లు పెట్టి వుండే సంస్థలు లక్ష్యంగా. సాధనా సంస్థ అని ఎక్కడో ఊరి బయట వున్న ఒక సంస్థలో అవకాశం వచ్చింది మా ఇంటి పక్కనుండే ఒక ఉపాధ్యాయుడి సిఫారసుతో, రోజుకు రెండు గంటలు చెబితే నెలకు ఐదొందలు ఇస్తామని. వెళ్లి చేరిపోయా, పిల్లలు ఇష్టపడటంతో రెండు గంటలు బదులు నాలుగు గంటలు చెప్పటం మొదలెట్టా ఫానులు కూడా లేని రేకుల షెడ్డుల్లో, ఎగుడు దిగుడు గోడలకు నల్ల రంగు వేసి బోర్డులుగా మార్చిన తరగతుల్లో. ఇంట్లో ఖాళీ అనే మాట బదులు అక్కడ అలా పడివుండటమే స్వర్గంలా అనిపించేది. ఈ లోపల ఏ.ఎం.ఐ.ఈ శిక్షణా సంస్థ వాళ్ళు కూడా రోజుకు రెండు గంటలు చెప్పమని అవకాశం ఇచ్చారు నెలకు ఒక వెయ్యి రూపాయల వేతనంతో. చేరిన ఒక నెలలోనే, మాకు స్ట్రెంగ్త్ అఫ్ మెటీరియల్స్ చెబితే ఆ హర్షా సర్ చెప్పాలని అన్నీ బ్యాచ్ లు నా దగ్గరకే రావటం నాకు మరచిపోలేని అనుభవం. వాళ్లకు నేనే రామామృతాన్ని మరియు సురేంద్ర సింగ్ ని. వీళ్లిద్దరు ఎవరబ్బా అంటారా ఆ సబ్జెక్టు మీద పేరు మోసిన రచయితలు. కొన్నాళ్ళకి ఆ కోచింగ్ సెంటర్ ఓనర్ వాళ్ళ కుటుంబాన్ని వరకట్న కేసుతో వాళ్ళ వదిన గారు అరెసThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

మా పంచింగ్ ఫలక్ నామ!
నాకు రామ్ అని ఒక సహోద్యోగి ఉండేవారు చెన్నైలో. ఆయన సందర్భోచితంగా వేసే పంచ్ లు అంటే నాకు చాలా సరదా, కానీ ఎప్పుడు నా మీద ప్రయోగిస్తారేమో అని జాగ్రత్తతో ఉంటా. వాళ్ళ టీంలో ఒక నిష్ టెక్నాలజీల నైపుణ్యముండే పిల్లకాయలున్నారు. అదే నిపుణత వేరే కస్టమర్కి కూడా అవసరమయ్యింది. బయట ఎక్కడా దొరకటంలా. కావాల్సిన కస్టమర్ ఏమో ఎక్కేస్తున్నాడు. అలా రోజూ ఎక్కిచ్చుకోలేక ఆ కస్టమర్ కి పని చేసే ఇంకో మా మేనేజర్ నా దగ్గర కొచ్చి, హర్ష, ఆ రామ్ తో మాటలాడి కొంచెం ఆ పిల్లకాయలు హెల్ప్ తీసుకుందాము అన్నాడు. నేను సరే అని, ముందే రామ్ కి యీ విషయం చెప్పి, పంచ్ లు వెయ్యొద్దని బతిమాలి మరీ ఫోన్ లో కలిపాను యిద్దరినీ. రామ్ ఫోన్ లో రావటమే తరువాయి మొదలెట్టాడు, 'రవీ! నాకు తెలుసు నువ్వు బట్టల్లేకుండా రోడ్ మీద నిలబడున్నావని, హర్ష చెప్పాడు. కానీ నన్నివ్వమంటే ఒక సారి షర్ట్ ఇవ్వగలను, పోనీ లే అనుకుంటే ఇంకో సారి ప్యాంటు కూడా ఇస్తాను, అలా ఇస్తున్నాను కదా అని నువ్వు అండర్ వేర్ కూడా ఇస్తానని ఆశించమాకు' అంటూ మొదలెట్టాడు. నాకైతే అవతల రవీ, మొహం ఎలా ఉందొ ఉహించు కోడానికి భయం వేసింది. ఆయన అసలే సింహం లాటోడు. అలాగే ఒక రోజు మా చెన్నైకి వేరే వూరు నుండి ఒక విభాగాధిపతి , రివ్యూ చేయడానికి వస్తున్నాడు, రామ్ ప్రాజెక్ట్స్ లను. ఆ వచ్చే మనిషి చాలా నసగాడు, రామ్ కి చెప్పా! చాలా జాగ్రత్తగా వుండు, తనసలే తేడా అని. రామ్ తన ట్రేడ్ మార్క్ నవ్వుతో, హర్షా!, మనింట్లో కుక్క పిల్ల భౌభౌ అందనుకో ఏమి చేస్తాం, ముద్దు చేస్తాం, అదే దార్లో కుక్క పిల్ల భౌభౌ అంటే మూతి మీద కొడతాం. అతను విభాగాధిపతి అయితే పక్క ఊర్లో కదా మనకి కాదు కదా అంటూ ముక్తాయించాడు. ఆ తర్వాత రివ్యూ ఎలా జరిగిందో అడగడానికి నాకు ప్యాంటు తడిచింది. అలాగే మాకు ఒక హారిజాంటల్ గ్రూప్ వుంది. హారిజాంటల్ అంటే వాళ్ళు మా వర్టికల్ కి మాత్రమే కాక అన్నీ వెర్టికల్స్ కి సపోర్ట్ చేస్తారు. మీకర్థం కాక పోతే మీరు మా ఐ.టి వాళ్ళు కాదని అర్థం. వాళ్ళు అసలే పేరు తగ్గ అడ్డంగాళ్ళు. అన్నిటికి మా హారిజాంటల్లో ఇంతే అంటూ చావ కొడతారు. మేము ఆకాశంలో నుంచి ఊడి పడ్డాం అంటారు. ఈ రామ్ వీళ్ళని ఎలా డీల్ చేస్తాడబ్బా అని చూడాలని వెళ్ళా ఒక రోజు. సరే, అందరం కలుద్దామని ఫ్లోర్ వాక్ కి పిలిచాడు, ఆ హారిజాంటల్ వాళ్ళని కూడా ఆహ్వానించాడు. వాళ్ళు రాగానే మొదలెట్టాడు, మీరు అన్నీ అకౌంట్లలో వున్నారు, అన్ని దగ్గర్లా కావు కావే, మీరు అన్నీ దగ్గర్లా ఎగరరండి బాగా, కావు కావు అని కూడా ఆనండి, కానీ ఇక్కడికొచ్చి రెట్ట మాత్రం వేయకండి అంటూ. నేను అయితే ఆయన మాటలకి ఫ్రీజ్ అయ్యా. ఆయన వాళ్ళ ప్రాజెక్ట్స్ ని ఒక హెడ్ మాస్టర్ స్కూల్ ని ఎలా నడుపుతాడో అలా, ఒక పక్క బెత్తం, ఒక పక్క పంచ్ లతో నడుపుతాడు. ఒకసారి ఈ పంచ్ లు తట్టు కోలేక ఆయన టీమ్ వాళ్లంతా ఆయన్ని ఆయన ఆఫీస్ లో కలిశారు. ఏంటీ ట్రాన్సిషన్ మేనేజర్, అప్లికేషన్ మేనేజర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ అందరూ కట్టకట్టుకొచ్చారు, అబ్బబ్బ ఆల్సేషన్ , డాల్మేషన్ , డాబర్ మాన్ అని ఎన్ని పేర్లున్న కుక్క పిల్లలు కుక్క పిల్లలేనబ్బా, మీకు ఎన్ని డిసిగ్నషన్స్ వున్నా మీరు నాకు పనిచేసి పెట్టేవాళ్ళేనబ్బా అంటూ మొదలెట్టాడట, ఇక వాళ్ళు ఈయన పంచ్ లకు అలవాటు పడటమే బెటర్ అని డిసైడ్ అయిపోయారు. ఆ తర్వాత వాళ్లకూ నాకు రామ్ పంచ్ లు వినకపోతే వెల్తి. అలాగే అందరూ సరిగా కలిసి తనకి ప్రాజెక్ట్ డెలివరీ చేయక పోతే, అల్లం ముక్క , మామిడి ముక్క వెల్లుల్లి పాయ తెచ్చి నేను ఎందుక్కలుపు కోవాలి అబ్బాయిలు, దాని బదులు రెడీ మేడ్ గా నేను ప్రియా పికిల్ కొనుక్కుంటా అని బెదిరిస్తాడు. ఇలా వుంటాయి ఆయన పంచ్ లు. మీకూ ఇలాటి ఫలక్ నామ తో పరిచయం ఉంటే మీరు కూడా రాయండి. నేను చాలా తక్కువ రాశా.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Ep 87మా గిరిజక్క పిచ్చి చిట్టాలు!
"మా నాయన పేరు మీ పేరు ఒకటే, సుందర రామయ్య, అందుకే నిన్ను ఇక నుండి నాయనా అనే పిలుస్తాను" అంది మా పక్కింటి గిరిజక్క , మా నాన్నతో. " సరేనమ్మా నువ్వు ఆర్డర్ వేసింతర్వాత , కాదనే ధైర్యం ఎవరికీ ఉందమ్మా" అన్నారు నాన్న. మా నాన్న, కాట్రాక్టింగ్ పార్టనర్ అయిన గోవింద రెడ్డి అంకుల్ భార్య గిరిజక్క. ‘చండశాసన గండర గండి’ మాటల్లో మటుకు. "ఏమే! మాధవీ, వాసవీ, ఇకనుంచీ, మా నాయిన్ని మీరు తాత అనే పిలవాలి, అర్థ మయ్యిందా" అంది తన కూతుళ్ళ వైపు. వాళ్లిద్దరూ అయోమయంగా మొహం పెట్టారు, ఈయన్ని తాతా అని పిలవడం ఏంది? అనిచెప్పి. ఈ సంభాషణంతా మేము నెల్లూరు సంత పేటలో వాళ్ళ ఇంటి పక్కన చేరిన కొత్తల్లో. మాధవక్క , వాసవక్క మా గిరిజక్క సంతానం. ముగ్గుర్నీ అక్కా! అనే పిలిచే వాణ్ని.నేను ఎనిమిదో క్లాసు లో ఉంటే, వాసవక్క బీ.ఎస్.సి ఫస్ట్ ఇయర్ , మాధవక్క బీ.జెడ్.సి ఫైనల్ ఇయర్ లో వుండే వారు. మా గిరిజక్క వాళ్ళ నాన్న గారు డీ.ఎస్.పీ గా పనిచేశారు. పైకి డీస్పీ గారి వారసత్వ వేషం గంభీరం గా వేసినా , లోపలంతా పసిపిల్ల మనస్తత్వం మా గిరిజక్కది. గోవిందరెడ్డి అంకుల్ వుద్యోగం విజయవాడ,రెండు వారాలకోసారి ఆయన దర్శనం. ఇంట్లో వున్నా ఆయన వాయిస్, పెద్ద బయటికి వినిపించేది కాదు. ఒక వేళ వినిపించినా ఎదో ఆయన ముచ్చటపడి తీసుకెళ్లిన "36 ఛాంబర్ అఫ్ షావోలిన్" లాటి ఇంగ్లీష్ సినిమాలు, మాకు తెలుగులో తర్జుమా చేసి చెప్పినప్పుడే. మా గిరిజక్క కి సినిమాలు అంటే చాలా పిచ్చి. కొత్త సినిమా వచ్చిందంటే, మా గిరిజక్క తన అనుంగు స్నేహితురాలు మాయాదేవి తో కలిసి, పట్టు చీరలు కట్టి మరీ నేల లేక బెంచీ టిక్కెట్టులో తేలేవారు. తనకున్న ఏకైక స్నేహితురాలు మాయాదేవి. మీరు ‘కుర్చీ’ టిక్కెట్టు కొనుక్కుని అక్కడ కూర్చోవచ్చుగా అని గిరిజక్కని అడిగితే, , " మాయ, అంత డబ్బులు దగ్గర పెట్టుకొని రాలేదురా " అనేది మా గిరిజక్క. ఆ మాయా దేవి ఎక్కడ్నుంచి సృష్టించేదో గానీ, పెద్ద పెద్ద రోల్స్ లో పాలిథీన్ షీట్స్ పట్టుకొచ్చేది. వాటిల్ని కవర్లు గా మారిస్తే, షాపులకిస్తే, వంద బాగుల కు ఒక రూపాయ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ స్నేహితురాలికి సహాయంగా ఉంటుంది అని చెప్పి, ఆ షీట్లు కవర్లుగా మార్చే హోమ్ వర్క్, మా పిల్లలందరికీ ఇచ్చేది గిరిజక్క. ఆ యాతన తప్పిచ్చుకోడానికి, నానా కష్టాలు పడే వాళ్ళం మేమంతా. ఇప్పుడు అసలు విషయం లోకి వద్దాం !మా గిరిజక్కకి , రోజువారీ పనులు ఏ క్రమం లో జరగాలో, తన చేత్తో , లిస్ట్ రాయనిదే నిద్ర పట్టేది కాదు. ఆ పనులు అదే క్రమంలో జరగాలి. ఎవ్వరూ నోరెత్తకూడదు ఈ విషయంలో. వాళ్ళ పనాయనకి, నీళ్లు చల్లి ఇస్త్రీ చేయాలి అనే బదులు, ఇస్త్రీ చేసి నీళ్లు చల్లాలి అని రాసిందంటే, అది అట్టా జరగాల్సిందే. మా గిరిజక్క చేతిరాత డీకోడ్ చెయ్యగలిగింది , వాళ్ళ పని వాళ్ళు తప్పితే , ఈ భూ ప్రపంచం లో ఇంకెవ్వరూ ఉండరని నా నమ్మకం. నేను డీకోడ్ చేయబోయి చాలా సార్లు ఫెయిల్ అయ్యా. గిరిజక్క చిన్న కూతురు, వాసవక్క మా గ్యాంగ్ లీడర్. ఆమె చదువులో బ్రిలియంట్. లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ లలో ఆవిడ దిట్ట. ఏ డౌట్లు వచ్చినా వాసవక్కే దిక్కు మా పిల్లలందరికీ. మమ్మల్ని వెంటేసుకొని , సినిమాలకీ షికార్లకీ ఒక పిల్లల కోడి లా బయలుదేరేది వాసవక్క. అసలు రేపు పరీక్ష అనగా ఈ రోజు ఫస్ట్ షో చూడటం కూడా ఆమె అలవాటు చేసిందే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆమెను చూసి మేము అనుకరించి బొక్క బోర్లా పడ్డ సందర్భాలు ఎన్నో. మా గిరిజక్క నిరంకుశత్వాన్ని ఎదిరించి ఎదిరించీ, మా వాసవక్క ఒక రెబెల్ స్టార్ అయిపోయిందని నా నమ్మకం. అలాంటి వాసవక్క గూడ, వాళ్ళమ్మ దగ్గరుండే ఒక చిట్టాకి మటుకు భయపడేది. ఆరు నెలలకి ఒక సారి గిరిజక్కా వాళ్ళ ఇంట్లో, వెండి బంగారు వస్తువుల ఆడిట్ జరిగేది. ఈ వస్తువుల చెకింగుకి ఒక పెద్ద లిస్ట్ ఉండేది గిరిజక్క దగ్గర. ఆ ఆడిట్ కి మా వాసవక్క ఒక నెల రోజుల ముందే ప్రిపేర్ అయ్యేది, తను గానీ, మాధవక్కగానీ ఏవన్నా వస్తువులు పోంగొట్టుంటే.మిస్ అయిన ఐటెం, నెల్లూళ్లో వున్న అన్ని బంగారు వెండి అంగళ్ళకు తిరిగి తిరిగీ, అక్కడ తెచ్చి పెట్టేసేది వాసవక్క. మా మాధవక్క మెడిసిను చదివే, రోజుల్లో ఒక డైమండ్ రింగు పోంగొట్టింది. ఇక చూడాల మావాసవక్క తిప్పలు. ఎదో చిన్న రింగో , గింగో అయితే మేనేజ్ చెయ్యొచ్చు. పొయ్యింది డైమండు రింగు. ఎట్టాగైతేనేమి, అలాగేవుండే అమెరికన్ డైమండ్రింగు ఒకటి పట్టుకొని వచ్చింది వాసవక్క.ఆడిట్ రోజు రానే వచ్చింది. మా గిరిజక్క పక్కనే ఆమె చెల్లెలు గారు గూడ ఆడిట్లో.అన్నీఅయింతర్వాత , ఇంట్లో వుండే ఉంగరాల లెక్క మొదలయ్యింది. చిట్టా ప్రకారం మొత్తం పన్నెండు ఉండాలి.ఒకటి , రెండు…. చిన్నగా పన్నెండు , అమెరికన్ డైమండ్ ఉంగరం పన్నెండోది అనిచెప్పి లెక్క పెట్టేసింది వాసవక్క. పక్కనుండే , గిరిజక్క చెల్లెలు ఏమో , “ అది డైమండు రింగు లాగ లేదే గిరిజా” అంటుంది. నీ మొహం మా ఇంట్లో వస్తువులు ఎట్టా మారి పోతాయ్ . సరిగ్గా చూడవే అంటుంది గిరిజక్క. ఆ విధంగా ఆ నెల ఆడిట్ సుఖాంతం అవడంతో ఊపిరి పీల్చుకుంది వాసవక్క. అలాగే మా గిరిజక్క దగ్గర రోజువారీ ఉపవాసాలగ్గూడా , ఒక లిస్ట్ ఉండేది. సోమవారం శివుడు, మంగళ వారం ఆంజనేయుడు, గురువారం సాయిబాబా, శుక్ర వారం లక్ష్మి దేవి, శని వారం వెంకన్న. ఒక్క ఆదివారం అనుకుంటా పోనీలే దేవుళ్ళకు ఆ రోజు సెలవిద్దాం అనుకునేది. ఉపవాసం అంటే గిరిజక్క ఏం తినకుండా ఉంటుంది, అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. హాయిగా, దర్జాగా మా వాసవక్క, దోసెలో, వ

ఆరుముగం దెబ్బ మా నెల్లూరు అంతా అబ్బా!
నేను ఎనభైయ్యవ దశకంలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అనుకుంటా మా సంతపేటలోని తూకుమానుమిట్టలో రాత్రికి రాత్రే ఆరుముగం & కో అనే కుంపిణి అదిరిపోయే వ్యాపార ప్రణాళికతో వెలిసింది. "ఇందు మూలముగా అందరికి తెలియ చేయటమేమనగా మీరు గాని మా దగ్గరకు వచ్చి మా వస్తు పట్టికలో కనపడ్డ వస్తువును కనపడినట్టు ఆత్రముగా మూడవ వంతు ధర పెట్టి టిక్కు పెట్టుకుంటే మీకు ఆ వస్తువు రెండు నెలల్లో పువ్వుల్లో పెట్టి అప్పచెప్పబడును" అనే వాళ్ళ ప్రకటన సారాంశం నాకైతే అర్థం కాలా నాకు లెక్కలు రావు కాబట్టి. మా నెల్లూరోళ్లు, లెక్కల్లో మహా ఘటికులు, లెక్కలేసేసి, మూడు రూపాయల వడ్డీ గిట్టుబాటు అవతుళ్లా మనకి అనుకొని, తరవాత రోజునుండి అమెరికాలో గాని థాంక్స్ గివింగ్ ముందు రోజు రాత్రి జంపఖానా పరిచి పడుకున్నట్టు పండుకొని పోయారు, ఎక్కడ మిగతా వాళ్ళు ఆ వస్తువులు తన్నుకు పోతారేమో అని. సమయం గడిచే కొద్దీ అల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ కాదురా నాయనా తూకుమానుమిట్టకిరా అన్నట్టు ఒకటే తిరునాళ్ల, కట్టే వాళ్లు కట్టి పోతుంటే, పట్టకెళ్లే వాళ్ళు పట్టకెళ్లి పోతున్నారు. అప్పట్లో మా నెల్లూరోళ్లకి పండగలొస్తే ఇంట్లో వుండే స్టీల్ సామానులని బయట తీసి, విమ్మో లేక సబీనాతో తోమి, వీధిలో వెళ్లే వాళ్ళకి, డిస్ప్లే పెట్టందే నిద్రబట్టేది కాదు. ఈ బలహీనతని మా ఆరుముగం బాగా పట్టేసేడు. రాబోయే పండగ సీజన్కి ఆరు నెలలు ముందుగానే దేశంలో వుండే స్టీల్ సామానులు తయారుచేసే ఫ్యాక్టరీల నన్నిటిని గంపగుత్తగా లీజ్ కి తీసేసుకొని మూడు షిఫ్టులలో తయారు చేయించి నెల్లూరులో దించేసేశాడు. దానికి వాడు ఆ రోజుల్లోనే BI /BW వాడాడని నాకు అనుమానం. స్టీల్ సామానులు తర్వాత మా నెల్లూరోళ్లకి ఆరోజుల్లో వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద బీరువా ఉంటే అంత గొప్ప. ఏ బీరువా అయినా గాడ్రేజీ బీరువానే మా వాళ్లకి. స్టీల్ సామానులు తర్వాత ఎక్కువ మా వాళ్ళు పట్టుకెళ్ళినవి ఈ బీరువాలు, బి.ఎస్.ఏ సైకిళ్ళు, ఆ తర్వాత ఎప్పడు బొమ్మ రాదుకాని బహు భద్రంగా షట్టర్లు తో సహా వచ్చే క్రౌన్ టీ.వీ లు, ఎన్ని టీ.వీలో వాటికి నాలుగు రెట్లు సంఖ్యలో ఆంటెన్నాలు. మీకు సందేహం రాలా నాలుగు రెట్లు ఆంటెన్నాలు ఏందబ్బా అని? నాకు వచ్చింది, వెళ్లి ఆరా తీస్తే ఒకాయన ఎవరికీ చెప్పనని ఒట్టేస్తే తన గోడు వెళ్లబోశాడు, "మా ఆడమడిసి నువ్వు ఇంట్లో టీ.వీ అన్నా పెట్టకపోతే పెట్టక మాయినావు, ఇంటి మీద ఆంటెన్నా అన్నా పెట్టబ్బా, యింటికొచ్చిన చుట్టాలకి మా టీ.వీ రిపేర్ కి వెళ్లిందని చెప్పుకొని బతికేస్తా అని ఒకటే సతాయిస్తా వుందబ్బయ్యా" అని. అలా వుంటాయబ్బా మా నెల్లూరోళ్ల యవ్వారాలు. మా చుట్ట పక్కల వాళ్లంతా డబ్బులు కట్టేశారు, కొని తెచ్చేశారు. మా ఇంట్లో మా దగ్గర డబ్బులు అసలే లేవు. నేను ఏదో ఒకటి కొందాము అని రోజు అన్నం కూడా తినకుండా అలిగి అలిగి ఇక ఏమీ జరగదని నిస్పృహ లోకి వెళ్ళిపోయా. మా దోస్తులేమో రంగు రంగుల బి.ఎస్.ఏ సైకిళ్ళు తొక్కేస్తున్నారు, కొన్న బీరువాలో ఏమి పెట్టాలో తెలియక ఇంకా చెక్కు చెదరకుండా వుంటాయని వాళ్ళ తరగతి పుస్తకాలని పెట్టుకుంటున్నారు. కొందరైతే ఇంట్లో టీ.వీ లేదని తెలిసినా పక్కనోళ్లు చూసేలా ఆంటెన్నాలు తెగ అడ్జస్ట్ చేసేస్తున్నారు, సిగ్నల్ అందటం లేదు అని చెప్పుకుంటూ. మా నెల్లూరులో అప్పుడు మా టీ.వీ సిగ్నల్ అందటం లేదు అని చెప్పుకోవటం పెద్ద ఫాషన్, అంతర్లీనంగా మా ఇంట్లో టీ.వీ వుంది అని తెలిసేలా. ఇక లాభం లేదని నేను సరాసరి రామలింగాపురం లోని మా చిన్నక్క దగ్గరకి వెళ్ళిపోయా. మా ఆరుముగం దగ్గర నువ్వన్నా కొని బాగుపడవే, నాకు ఎలాగూ బాగుపడే అదృష్టం లేదు అని. మా అక్క కోళ్ళని పెంచి, పొట్టేళ్లని పెంచి తెగ వెనకేసుకుందని నా నమ్మకం. నువ్వు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, వేలి పొడువునా తీసుకొని మొహానికి రాసుకొనే ఫెయిర్ అండ్ లవ్లీ మూడు నెలలు మానేస్తే మీ ఇల్లంతా స్టీల్ సామానులతో నింపెయ్య వచ్చు అని సాయంత్రం దాకా ఊదరకొట్టి, లాస్ట్ బస్సుకు బయలుదేరతీసి నెల్లూరుకు తీసుకొచ్చా. మరునాడు వెళ్లి నాలుగు స్టీల్ బిందెలు, మూడు గంగాళాలు, ఓ ఐదు చిల్లుల గరిటెలకు డబ్బులు కట్టేసి వచ్చాము. అప్పటికి గాని నా కడుపు ఉబ్బరం తగ్గలా. మా అక్క వెళ్ళిపోయాక నేను గోడమీద బొగ్గుతో గీతలు గీయటం మొదలుపెట్టా, ఎన్ని రోజులు మిగులున్నాయో మా అక్క ఖజానా మా ఇంటికి రావటానికి అని. రోజులు గడవటం నాకు చాలా కష్టం గా వుంది. మా చుThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

మా వాకాటి కథల్లో, సూరి గాడు!
సూర్య ప్రసాద్ మా మెకానికల్ ఇంజనీరింగ్ తరగతి సల్మాన్ ఖాన్. కానీ ఆ ఖాన్ కన్నా మంచి పొడగరి, ఎప్పడూ ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కళ కళ లాడుతూ ఉండేవాడు. వాడి ఆ పిచ్చిని ఎక్కువ చేస్తూ మా భార్గవ్ గాడు, ప్రశాంత గాడు మరియు మా అనీల్గాడులు తరగతిలో వాడి వెనక వరుసలో కూర్చొని, ఏ ఇండియా టుడే మ్యాగజిన్ లాటి వాటిని తెరిచి, వీడు వినేలా అబ్బా! ఈ మోడల్ చూడరా! అచ్చు వీడు మన సూరిగాడిలా వున్నాడురా అని వాళ్లలో వాళ్లే వీడికి కితాబులిచ్చేలా మాటలాడుకోవటం, వాడు ఆ మ్యాగజిన్ లో మోడల్స్ వుండే పేజీలను కత్తిరించుకొని, వాళ్ళలా తయారయ్యి రావటం, మా అందరికీ కడు కాలక్షేపంగాను ఉండేది. రావటం కొడిగినహళ్లి పాఠశాల నుండి రావటంతో చదువుల విషయంలో తెలివితేటలతో పాటు క్రమశిక్షణ కలిగివుండే వాడు. నాకు తెలుసు వాడు ప్రతీ పరీక్షకి కనీసం అరడజను మార్కర్ పెన్స్ తో వచ్చేవాడు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్సామినర్స్ కి హత్తుకునేలా అండర్ లైన్ చేస్తూ, ముత్యాల్లాంటి చేతి రాతతో, అబ్బా! పేపర్ రాయటం అంటే ఇలా వుండాలిరా అనిపించేలా రాసేవాడు. నిత్యం శరీర ధారుడ్యాన్ని పెంచే కసరత్తులతోను మరియు బాస్కెట్ బాల్ ఆటతోను చురుగ్గా ఉండేవాడు. ఉండటం హాస్టల్ లో అయినా అందరు హాస్టల్ వాసుల్లాగే, మా రూమ్ ని తరచూ పావనం చేసేవాడు. నేను మరియు మా శ్రీధర గాడు అందరి వాళ్ళమవటంతో అటు డే స్కాలర్స్ తోను ఇటు హాస్టల్ వాళ్ళ దర్శనాలతో మా రూమ్ నిత్య కళ్ల్యాణం పచ్చ తోరణం లాగ ఉండేది. మీ సాఫ్ట్ వేర్ పరిభాషలో చెప్పాలంటే మా రూమ్ చాలా స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉన్నట్టు మా కాలేజీ మిత్రులకు. అన్నట్టు మా సూరికి ఒక ఏకదారి (వన్ వే కి నా తెనిగింపు ) ప్రేమ కథ ఉండేది. మాకు రెండు సంవత్సరాలు జూనియర్ ఆ అమ్మాయి. చూడ చక్కనిది. మా కళాశాల అందరు విద్యార్థులు లాగే మా సూరి గాడు ఆ అమ్మాయి ప్రేమలో నిండా పడిపోయాడు. ప్రతి గురువారం ఒక తెల్లటి లాల్చీ పైజామా ధరించి మా వాకాటి సాయి బాబా గుడికెళ్ళి, ఓ కొబ్బరికాయ కొట్టి, ఓ ముక్క అమ్మాయికోసం పట్టుకెళ్లి ఒక ముక్కతో మా రూమ్ కి వచ్చే వాడు. మేము తన ప్రేమని ఆటపట్టిస్తూనో లేక తెగ ఎంకరేజ్ చేస్తూనో పరోక్షంగా వాడిలో వాడి ప్రేమ పట్ల చాలా ఘాడమైన భావన కల్పించే వాళ్ళము. ఆ అమ్మాయి మాత్రం ఎవరినీ తన దరిదాపుల్లోకి రానీయటం మేము చూడలా. అలా మా సూరికి మరియు మాకు తెలియని విషయం ఏమిటంటే ఆ అమ్మాయికి అప్పటికే పెళ్లి అయిపోయిందని, తనకి ఆ విషయం అందరికీ చెప్పుకోవటం ఇష్టం లేక దాచిందని. కానీ ఈ విషయం తెలియక మా సూరి గాడు, ఆ అమ్మాయి తిరస్కారం తో దేవదాసు అయిపోయాడు. వాడు అలా కావడానికి మేము కూడా కారణమే పరోక్షంగా అనే బాధ మాలో ఇప్పటికే వుంది. అయినా మావాడు తన చదువుని ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. ప్రతీ సంవత్సరం డిస్టింక్షన్ తోనే ఉత్తీర్ణుడయ్యాడు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా, మేము కళాశాల నుండి బయటపడిన తర్వాత కొందరం కొద్దిమందితోనే సంబంధ బాంధవ్యాలను కలిగి వున్నాము, అప్పటిలో కొందరికే ల్యాండ్ లైన్ సౌకర్యాలు ఉండటం మూలాన, ఇప్పటిలా చరవాణులు మరియు వాట్సాప్ సమూహాలు లేనందున. అలా సూరిగాడితో మాకు సంబంధాలు తెగిపోయాయి. మా స్నేహితులతో ఎవరికి వాడితో అటుపిమ్మట మాటలు ఉన్నాయో నాకు తెలియదు. మా అనీల్గాడో లేక మా ఈశ్వరుడో చెప్పాలి, ఎందుకంటే మా బ్యాచ్ లో చాలా మంది మధ్య వీళ్లిద్దరి అనుసంధాన కర్తలు. మా కళాశాల ప్రథముడైన మా సుబ్బూ గాడు వాడి రీసెర్చ్ నిమిత్తం ఢిల్లీ వచ్చి అక్కడే వున్న నన్ను కలిసినప్పుడు, సూరి అన్నా యూనివర్సిటీ లో సుబ్బూ ఉండగా, వాడి రూమ్ కి ఎదో ప్రవేశ పరీక్ష నిమిత్తం వచ్చాడని, వచ్చిన వాడు ఏ పరీక్షలకు వెళ్ళక ఊరంతా బలాదూర్ తిరుగుడు తిరిగి సాయంత్రానికి వచ్చే వాడని, మా సుబ్బూ అది చూసి ఓ నాలుగు రోజుల తర్వాత నిలదీయటంతో, "నన్ను సి.బి.ఐ వాళ్ళు వెంట పడి తరుముతున్నారు, వాళ్ళని తప్పించుకు తిరుగుతున్నాను", అని అర్థం పర్థం లేకుండా మాట్లాడాడని, సుబ్బూ మరీ ఎక్కువ ఇబ్బంది పెడితే సుబ్బూ రూమ్ లోనే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని, అందుకే సుబ్బు వాడిని మంచి మాటలు చెప్పి ఇంటికి పంపించాడని నాకు చెప్పాడు. అప్పుడు నాకు కలిగింది మా సూరి మానసిక పరిస్థితి మీద సందThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 80అప్పుడప్పుడూ 'ఉదయించే' మా సుడిగాడు
“బాస్, ఏ బ్రాంచ్ నీది”, అడి గాడు రామారావు, నన్ను, నేను మా హాస్టల్ మెస్సు లోకి ఎంటర్ కాంగానే.“ఫౌండ్రి ఇంజనీరింగ్”“అదేంటి బాస్, పోయి పోయి, ఆ బూజు పట్టిన బ్రాంచ్ తీసుకున్నావా?, ఇక్కడ మెకానికల్ వాళ్లకి మెషీన్ టూల్స్ బ్రాంచి అన్నిటికంటే బెస్టు. నేనదే తీసుకున్నా!”నేను ఖరగ్పూర్లో పీజీ చేరిన ఐదు రోజుల్లోనే, నాకీ ఉపదేశం చేసిన పదో కృష్ణుడు – రామారావు.ప్రొడక్షన్ ఇంజనీరింగ్, థర్మల్ ఇంజనీరింగ్, మెషిన్ డిజైన్లల్లో చేరిన ప్రతీ వాడూ నాకెదురైతే చెప్పేవాడు – “ఫౌండ్రి ఇంజనీరింగ్ ఓ బూజు పట్టిన కోర్స్” అని.అసలే నాకు తిక్క తిక్క గా వుంది, మంచి స్కోర్ వచ్చి కూడా ఆప్షన్స్ సరైన క్రమంలో పెట్టకుండా ఫౌండ్రి ఇంజనీరింగ్ లో పడ్డందుకు.ఈలోపల ఓ ఆజానుబాహుడొచ్చి వాడికి వాడే , “మామ, నా పేరు ఉదయ్, కడప దగ్గరున్న కమలాపురం నుంచి వచ్చా, బ్యాచలర్స్ మెకానికల్, ఎస్.వీ.యు లో చదివా, ఇక్కడ ఏరో నాటికల్ లో చేరా”, అంటూ మా టేబుల్ లో పైన కూర్చొని నన్ను పలకరించేసాడు.ఎందుకో వాణ్ని, వాడి వాలకాన్ని, చూస్తే నాలో ఏదో ఒక కొత్త ఉత్సాహం వొచ్చేసింది –రామారావులో మటుకు వీణ్ణి చూస్తే, ఏదో బెరుకు కన్పడతా వుంది.ఎత్తుకున్నాడు ఉదయ్ , రామారావు కళ్ళలోకి చూస్తూ సూటిగా,“ఏరా రామారావ్, అప్పుడే నీ బ్రాంచ్ మహత్తరమైందనిచెప్పి, సావ కొట్టేశావా! ఈ శాల్తీని. మనిషిలో వుండాలిరా మొగతనం, మడిచి ఆ మెషీన్ టూల్స్ ని తీస్కెళ్ళి జేబులో పెట్టుకో ! అంతకంటే ముందు, పప్పో సాంబారో అర్థం కాని ఆ సంకరజాతి సాధకాన్ని, నా ముందుకు నెట్టు” అంటూ రామారావుని తోమి పారేసాడు.ఆ రెండు నిమిషాల “గ్రాండ్ ఇంట్రో” తో ఉదయ్ గాడి తో, పెర్మనెంట్ గా కనెక్ట్ అయిపొయ్యా! నేను.క్యాంపస్ అంతా చెడ తిరిగేవాళ్ళం ఇద్దరం.కనపడ్డ క్లాస్ మేట్ లని, వాళ్ళ పేర్లకి ముందు ఒక బీప్ పదం, వెనక ఒక బీప్ పదం తో వీడు పలకరించడం,వాళ్ళు “వీడితో పెట్టుకోగూడదురా” నాయనా! అంటూ సణుక్కుంటూ పక్కకెళ్లి పోవడం, నాకైతే చాలా నచ్చేసేది.నన్ను కూడా అలాగే బీపులతో పలకరించే వాడుదేశం కానీ దేశంలో, నా పేరుకు ముందు వెనకా, ఆ అచ్చ తెలుగు బీపులు వింటుంటే, ఒళ్ళంతా పులకరించిపొయ్యేది నాకు.ఇది గాక మా ఉదయ్ గాడు అభిమాన ధనుడు, సుయోధనుడు. మాట పడే వాడు కాదు.మాటకి మాట ఉండాల్సిందే – అవతల వాడు ఎవడైనా సరే.ఎందుకురా ఈ మొండి వాగుడంటే –దానికి వాడి సమాధానం –“అమ్మా, నాన్నలు బడిలో స్కూల్ మాస్టార్లు రా హర్షా! మా నాయన నేను పుట్టంగానే, నా ఫేసు చూసి, “ఈ నా యొక్క కొడుకు ఒక మొండి నా పుత్రుడు, నా పేరు విషయంలో, నీ జోక్యం ఏందీ? అని రేపొద్దున, నన్ను నిలదీసే లక్షణాలు వీడి మొహం లో బాగా కన్పడుతున్నాయి అనుకోని ఏం జేసాడో తెలుసా ” ?“చెప్పరా ! బాబూ , చాలా ఇంటరెస్టింగ్ గా వుంది” అన్నా !“నాకు ఐదో ఏడు వచ్చి, స్కూల్ లో వేసే ముందు దాకా అసలు పేరే పెట్టలా. స్కూల్లో వెయ్యబోయ్యే ముందు, నా ముందు ఓ పది పేర్లు పెట్టి, నువ్వే చెప్పరా! ఈ పేర్లల్లో నీకేది నచ్చిందో, రేపొద్దున చెత్త పేరు పెట్టావు అంటూ నన్ను సతాయించ కుండా” అన్నాడు మా బాబు.“అప్పుడు ఉదయ్ భాస్కర్ అని నాకు నేనే పేరు పెట్టేసుకున్నా ! కానీ నా ఫ్రెండ్సంతా, ఎందుకో ఉదయ్ లో, వై తీసేసి ఎక్స్ పెట్టేసి ఉడాక్స్ అంటార్రా, కావాలంటే నువ్వు కూడా పిలుచుకో”.“వద్దు లేరా, అంత మంచి పేరు నేను ఖూనీ చేయను, నాకు ఉదయ్ బాగుందిరా” అన్నా నేను.వాడెప్పుడూ మిగతా మా అందరిలాగ ఉద్యోగం కోసమే పీజీ చదివే వాడిలా కనపళ్ళా .ఎవరయినా ఏరోనాటిక్స్ చాలా నారో కోర్స్ కదా, ప్లేస్ మెంట్స్ వుండవు అంటే, తెలిసే కదా నేను, చేరింది. ఇక నువ్వు దొబ్బేయ్యొచ్చు అనే వాడు.“ఏరా నీకు ఉద్యోగం గురించి ధ్యాస లేదా!” అంటే.“ఎందుకు లేదురా!. బాచిలర్స్ అయితే కోటా మీద సీట్ తీసుకున్నా, ఆ తర్వాత కాంపిటీటివ్ గా చదివా. ఒక్క సారి వాడుకున్నాక ఇక కోటా వాడుకోకూడదు అనిచెప్పి, మెషీన్ టూల్స్ కి, జేజెమ్మ లాంటి, బ్రాంచ్ వచ్చే అవకాశం వున్నా, ఓపెన్ లో ఏరోనాటిక్స్ వచ్చింది చేరిపోయా! ప్రైవేట్ సెక్టార్ లోనే నాకు తగ్గ ఉద్యోగమే చేస్తా!”.అలా ఇంకా దగ్గరయ్యాడు వాడు నాకు.జనాలంతా వాడి రూమ్ కి వెళ్లాలని తెగ ఉబలాట పడే వాళ్ళు. కానీ పైకి మాత్రం, అదోలాగా మొహం పెట్టి, వాడి రూమ్ ని ట్రిపుల్ ఎక్స్ రూమ్ అని పిల్చుకునే వాళ్ళు. ఎందుకంటే వాడి రూము గోడలంతా డెబోనైర్ సెంటర్ స్ప్రెడ్ లతో అలంకరించి ఉండేవి. వాడి రూము కెళ్ళి పరిస్థితి చూస్తే, అప్పుడర్థమైంది, నాకు వాడి పేరు చివర ‘ఎక్స్’ ఎందుకు తగిలిచ్చారో వాడి ఫ్రెండ్సు.“ఎందుకురా నీ రూంలో గోడలమీదంతా, ఈ ఎదవ ఎక్సిబిషన్, ఏదో తేడా గాడిలా ” అన్నా , ఓ సారి.“సెమిస్టెర్ ఎగ్జామ్స్ వస్తున్నాయిగా. నా రూమ్ లో కొచ్చి చదువుకో – ఆ పరమార్థం గ్రహించుకో” అన్నాడు వాడు.వాడి ఛాలెంజ్ స్వీకరించి, వాడి రూంలోనే ఆ సెమిస్టర్ ప్రిపరేషన్ మొదలు పెట్టా.ఓ పది రోజుల తర్వాత నా ముందర ఓ బార్ గ్రాఫ్ పెట్టాడు. డే వన్ నుంచి డే టెన్ వరకు.“ఏందిరా, నాయనా ఈ గ్రాఫ్ లు అంటే, – మాస్టర్స్ చదువుతున్నావు, నా పుత్రుడా!, బొత్తి గా డేటా ఇంటర్ప్రిటేషన్ తెలీదురా నీకు”, అని వాడి వ్యంగ్యోక్తి.“అర్థ మయ్యిందిరా నాయనా. గోడ మీదున్న డెబోనైర్ అమ్మళ్లను మొదటి రోజు దొంగతనం గా 400 సార్లు చూసా, ఆపైన రోజులు గడిచే కొద్దీ, అవి 200, 100, 50 లెక్కన తగ్గుతూ వచ్చి, గత రెండు రోజులుగా, సంఖ్యలు అంకెల్లోకి వచ్చాయి”“అదేరా హర్షాగా, నేను పాటించింది. మూస్తే ఆసక్తి, తెరిస్తే విరక్తి. ఏదైనా అంతే”, అన్నాడు చిదానంద స్వామి లా.“ఓహ్! అయితే తమరి రూమ్ లో వుండే ఫుల్లు మందు బాటిల్స్, కూడా, ఆలా తమరి షో ఆఫ్ యేనా”“అంతేగా మరి!”ఒక సారి నాకు విపరీతమైన జ్వరం జ్వరం తోబాటు నీరసం గా ఉండటం తో, మా కాలేజీ డిస్పెన్సరీ కి వెళ్ళా, వాడికి చెప్పకుండా.ఆ డాక్టర్ వూళ్ళో వైరల్ జ్వరాలున్నాయి, దిక్కు దివాణం లేకుండా హాస్టల్ రూమ్ లో పడి వుండే కన్నా, వెళ్లి కాలేజీ హాస్పిటల్ లో అడ్మిట్ అయిపో అని సలహా ఇచ్చాడు.నేను సక్కా వెళ్లి చేరిపోయా.చేరటమే తెల్సు నాకు.మళ్ళీ మెలుకువ వచ్చేసరికి చేతికి సెలైన్,అంత పెద్ద రూమ్ లో నాలుగ్గోడల మధ్య, అది పగలో రాత్రో కూడా అర్థం కాలా.నేను తప్ప ఎవరూ లేరు.మళ్ళీ ఎప్పటికో నాకు కళ్ళు తెరిచి చూస్తే, ఎదురుగ్గా ఉదయ్ గాడు, నా మంచం పక్కనే కూర్చ

మా బడిలో వుండే వాడు ఓ మల్లిగాడు!
నేను ఏడవ తరగతి ఉత్తీర్ణుడను అయ్యాక, మా కుటుంబము ఉప్పలపాటి నుండి నెల్లూరికి వలస వచ్చేసింది. నెల్లూరిలో మా మకాం సంతపేటలో అని ముందే నిశ్చయించబడింది మా నాన్నగారి వ్యాపార భాగస్వాములు అప్పటికే అక్కడ నివసించే వారు అవటంతో. సంతపేట లోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల అప్పుడు బాగా పేరుగాంచినది కావటంతో నన్ను అక్కడ మరియు మా అక్కను అమ్మగార్ల బడి అనబడే సెయింట్ జోసెఫ్ బడిలో వేయాలని మా వాళ్ళు నిర్ణయం చేసేసారు. మా అక్కకి ప్రవేశం సులువుగానే దొరికింది, అమ్మగార్ల బడి కేవలం అమ్మాయిల బడి కావటంతో. నా ప్రవేశం అంత సులువుగా జరగలా. శ్రీ సుబ్బారావు గారు ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు. నా ఏడవ తరగతి మార్కులు ఆ బడిలో చదివి ప్రధమ స్థానం సంపాదించిన మల్లికార్జున వర ప్రసాద్ కంటే మూడు మార్కులు ఎక్కువ అవటం ఆయనకీ నచ్చలా. అందులోను నేను వచ్చినది మారు మూల పల్లెలో వున్నజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అవటంతో ఆయనకు గట్టినమ్మకం అక్కడ మాస్ కాపీయింగ్ జరిగి ఉంటుంది అందుకే నాకు అన్ని మార్కులు వచ్చి ఉంటాయి అని. ఆయన నాకు ప్రవేశం ఇవ్వడానికి సుముఖంగా లేరు. నాకు ఆయన నన్ను తిప్పించుకోవటం చాలా ఉక్రోషంగా వున్నది. ఆయనేమో చాలా చిన్న వయస్సులోనే గెజెటెడ్ ర్యాంకు కల ప్రధానోపాధ్యాయ పదవిని అధిరోహించిన సింహ స్వరూపుడు. అయినా ధైర్యం చేసి చెప్పేశా మీరు ఏ పరీక్ష పెట్టుకోవాలంటే ఆ పరీక్ష పెట్టుకోండి, నేను మాత్రం ఈ బడిలోనే చదువుతాను అని. బహుశా ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కోసం మరల పరీక్ష రాసిన కొద్ది మంది లో నేను ఒకడినేమో, అలా పరీక్ష పెట్టిన మహా చాదస్తపు ప్రధానోపాధ్యాయుల వారు ఆయనేమో. ఆయన ఏర్పరిచిన ఉపాధ్యాయులు పెట్టిన ప్రవేశ పరీక్షను విజయవంతముగా గట్టెక్కిన నన్ను ఆయన లెక్కలు బోధించే బి-సెక్షన్ లోనే వేయించుకున్నారు పట్టుబట్టి మరీ నీ సత్తా మేమిటో చూస్తా సంవత్సరమంతా అని. అలా బి-సెక్షన్ లో ప్రవేశించిన నన్ను ఏడవ తరగతిలో ఆ బడికి ప్రధమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన మల్లిగాడు మరియు రమణుడు త్వరగానే నన్ను వారి వారి మిత్ర బృందాల్లో కలిపేసుకున్నారు. వారి వారి బృందాలు అని ఎందుకు అన్నాను అంటే మా మల్లిగాడు మరియు రమణుడు అచ్చు టామ్ మరియు జెర్రీ లాటి వారు. ఈ ఇద్దరే కాకుండ మా తరగతిలో ఇంకో పాపులర్ ఫిగర్ సయ్యద్ ఆన్సర్ బాషా. అప్పటి దాకా వీళ్లిద్దరి రాజకీయాలకు బలి అయ్యి, ఒక్కోసారి మల్లిగాడి పార్టీ లో ఉండాలా లేక రమణుడి పార్టీ లో ఉండాలా అని సతతమయ్యే వీడికి నాది మరియు మా ఇంకో మిత్రుడు లక్ష్మిపతి రాక ఒక వసంతం. ఎందుకంటే మేము ముగ్గురం ఒక బలమైన తృతీయ ఫ్రంట్ ని స్థాపించాము అటు పిమ్మట కాబట్టి. ప్రస్తుతానికి ఈ కథ జెర్రీ లాటి వాడైన మా మాయదారి మల్లిగాడు గురించే. వీడు అసలు ఏమాత్రం ఆవేశ పడకుండా అవతల వాళ్ళని గిల్లేస్తాడు. అందులోను నన్ను, మా రమణుడిని గిల్లటమంటే వీడికి మహా సరదా. నేను ఎనిమిదవ తరగతిలో చేరే సరికి వీడు మహా పాపులర్ ఫెలో. ఏడవ తరగతిలో పాఠశాల కల్లా ప్రథముడు కావటం, వాళ్ళ అమ్మ నాన్న గార్లు మా బడికి అనుబంధమైన బి.ఎడ్ కాలేజీ లో లెక్చరర్స్ కావటంతో టీచర్స్ కి వీడంటే ఒకవిధమైన ప్రేమ. రాజు మరియు వరప్రసాద్ వీడి ముద్దు పేర్లు. నేను చేరిన వెంటనే నన్ను వీడి బ్యాచ్ లో కలుపుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టాడు. ఈ ప్రయత్నాలలో భాగంగానే నాకు ఒక్కో రహస్యాలు చెప్పేవాడు. అందులో భాగంగా మా ఆన్సర్ గాడి గురించి చెప్తూ, "ఆ ఆన్సర్ గాడితో ఎప్పుడైనా గొడవపడు, కానీ రంజాన్ మాసానికి కనీసం ఒక వారం ముందు అయినా వాడి దగ్గర తెల్ల జెండా ఎత్తెయ్యి, ఎందుకంటే వాడు రంజాన్ విందుకి వాడి స్నేహితులను అందరిని పిలుస్తాడు. ఆహా ఆ బిర్యాని, ఆ సేమియా పాయసం తినటానికి ఎన్ని జన్మలైనా ఎత్తొచ్చురా అని". ఈ ప్రబోధాన్ని నేను ఇప్పటికీ ఫాలో అయిపోతుంటా. మనకి లెక్కలంటే మహా భయం, అసలు అవి రావని గట్టి నమ్మకం. వీడు నాకు లెక్కలు చూపితే నేను వీడికి ఇంగ్లీష్ లో హెల్ప్ చేయాలనేది మా ఒప్పందం. ఇంగ్లీష్ లో హెల్ప్ చేయించుకొని లెక్కలకి నాకు హ్యాండ్ ఇచ్చేవాడు. అలా హ్యాండ్ ఇచ్చినప్పుడల్లా నేను వాడిని ఒకThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

మా దేవళపు ఇసిత్రాలు!
నాకు ఈ మధ్యన మా ఉప్పలపాడు చాలా గుర్తుకొస్తోంది. నాకు దిగులేసినప్పుడల్లా అలా గుర్తుకొస్తోంది, ఎందుకో! నేను చిన్న చిన్న కథలు రాయడం మొదలు పెట్టినప్పుడు నాకు తెలుసు నా ప్రెపంచం చాలా చిన్నదని. నాకు తెల్సు, నేను, నా కుటుంబం, నా స్నేహితాలు లేక జీవితంలో నాతో పాటూ పరిగెట్టినోళ్లు, నన్నొదిలేసి ఎల్లిపొయ్యినోళ్లు, ఈళ్ల గురించే రాయగలనని. అదేగాదు, నేను చూడలేని వాటి గురించి, చూడనోళ్ళ గురించి రాయలేనని. అట్టా అనుకున్నప్పుడు, ఇవన్నీ గబా గబా రాసేస్తే, ఇంక రాయడానికి యింకేం మిగులుద్ది, అని అనిపిస్తే, ఆ దిగులింకా పెరిగిపోతావుంది. ఆ దిగులుతోనే నేను ఇప్పుడు మిమ్మల్నీ, మా ఉప్పలపాడుకి తీసుకోబోతా! అక్కడికెందుకురా ఇప్పుడు మనం, అంటే ఏమో! మా అమ్మమ్మోళ్ల ఇల్లు మా రాములోరి దేవళం కి ఎడం పక్కన. నా చిన్నప్పుడు ఆరుబయట ఓ నవారు మంచమో నులక మంచమో ఏస్కొని, వళ్లు మర్చిపొయ్యి, కలల్లోకి బొయ్యి, మళ్ళీ ఉదయాన్నే లేవంగానే, ఎదురుంగా, దేవళం మీద ఓ రెక్క విరిగిన గరుత్మంతుడు, అట్టా నిల్చోనుండేవాడు. నాకెందుకో, రాములోరుతో, దేశాలన్నీ తిరిగే ఆయన కంటే, సీతమ్మోరిని, రావణాసురుడు పట్టకపొయ్యేటప్పుడు, అడ్డం పడి , రెక్కలు విరగొట్టుకున్న జటాయువు, అక్కడ కనపడే వాడు. ఎందుకంటారా ఏమో. అలా ఉదయాన్నే సీతమ్మోరిని, రాముల వారిని తలచుకోవటం అదృష్టమేమో. మా గుడికి ఓ మూగ పూజారి పక్కన ఊరినించొచ్చి, మా నడీది బాయి నుండి నీళ్లు తెచ్చి అభిషేకం చేసి అలంకరించి పొయ్యేవాడు. అగుపడని దేవుడికి, కనపడని మనసుతో, వినపడని పూజ చేసే ఆ పూజారిని మా ఊరిజనాలు గుళ్లోకెందుకు రానిచ్చారో. ఏమో! అట్టానే ఆ నడీది బాయిని, ఎసుటి నీళ్ల బాయి అనే వాళ్ళం. ఆ నీళ్లు అన్నం వొండటానికి పనికొస్తాయే గానీ తాగడానిగ్గాదు. తాగడానికి మళ్ళీ, మాకు ఇంకో మంచెళ్ల బాయి ఉండేది. పనికి రాని నీళ్లు ఎసుటి కెందుకు, అభిషేకానికెందుకు అని, అడగబాకండి . ఏమో! సాయంత్రాల పూట మాత్రం మా మునవ్వో, లేక మా రామాంజవ్వో లేక ఎవరో ఒక ముసలవ్వలు, దీపాలు పెట్టేవోళ్ళు గుళ్లో. మా అమ్మమ్మ ఎప్పుడు ఈ దీపాలు పెట్టే అవ్వలతో గుళ్లో దీపాలు పెట్టేది కాదు. . నాకయితే మా అమ్మమ్మ కూడా ఆ అవ్వల మాదిరే దీపాలు పెడితే చూడాలనుండేది. ఎందుకు పెట్టేది కాదో . తనతోనే ఎప్పుడూ వుండే రాముణ్ణీ, గుడి దాకా పొయ్యి చూసే పనేముందనేమో! ఆ అవ్వలందరూ గుడిలో దీపం పెట్టి గుడి వరండాలో ఊసులాడుకోని , చివరగా అక్కడే ఆడుకుంటున్న మా పిలకాయల్ని పిల్చి, లెక్క ప్రకారం ఒక్కొక్కరికి, ఒక్కొక్క నలుసంత కలకండ ముక్క పెట్టేటోళ్లు. మా స్నేహితులు అప్పుడప్పుడు, వాళ్ళు పెట్టే ఆ నలుసంత కలకండ కోసం, సిగ్గు లేకుండా ఆమైన మన ఆటలు గూడా మానేసి వెళ్లాలా అనే వాళ్ళు. నేను మాత్రం అలా సిగ్గు పడేటోణ్ణి గాదు. పైపెచ్చు మా మురళి గాడు వొంతో లేక మా వంశీ గాడి వొంతో గూడా , అడిగి తెచ్చుకొనేటోణ్ణి . నేను ఎందుకంత ఆశ పడేటోణ్ణో నన్ను అడగబాకండి. అట్టాగే , ప్రతీ శనివారం సాతంత్రం పూటా మా మునెవ్వ , రామాంజవ్వ ఇంకా చాలా అవ్వలు కలిసి, హరే రామ హరే రామ! రామ రామ హరే హరే! హరే కృష్ణ హరే కృష్ణ! కృష్ణ కృష్ణ హరే హరే! అని భజన చేసేటోళ్లు. ఆ భజనకు మా మునెవ్వ కొడుకయిన వెంకన్న డోలు వాయించే వాడు. మా అమ్మమ్మ ఇంట్లో వుండే నాకు, ఈ భజన వింటూ వాళ్ళ మీద ఒక జాలి కలిగేది. వీళ్ళకి ఈ నాలుగు వాక్యాలకన్నా ఎక్కువవరావేమో అందుకనే అవే తిప్పి తిప్పి పThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

నా మొదటి ప్రవాస జీవనానుభవం!
నా మొదటి ప్రవాస జీవితం దక్షిణాఫ్రికా లోని జోహనెస్బర్గ్ లో మొదలయ్యింది. ఆనాడు దక్షిణాఫ్రికా లో రెండు ప్రధాన బ్యాంకు సమూహాలుండెడివి, ఒకటి ఏ.బి.ఎస్.ఏ మరియు రెండవది నెడ్కోర్. నేను ఏ.బి.ఎస్.ఏ బ్యాంకు వాళ్ళ అసెట్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ లో పని చేసే వాడిని. మా బస మరియు రవాణా అంత మా కంపెనీ నే ఏర్పాటు చేసింది. జోహనెస్బర్గ్ కంతటికీ అందమైన సాండ్ టన్ అనే ప్రదేశంలో సాన్మారియో అనే గృహ సముదాయం లో. చాలా అందమైన దేశం దక్షిణాఫ్రికా, విశాలమైన రహదారులు, రహదారుల మీద ఖరీదైన బి.ఎం.డబ్ల్యూ లు బెంజులూ, ఫోల్క్స్ వాగెన్ లు, ఎక్కడ బట్టినా సహజ సిద్దమైన అడవులు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఆహా ఏమి అభివృద్ధి అనేలా. ఆఫీస్ లో సహోద్యోగులంతా డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లీష్ మరియు మిగతా యూరోప్ దేశస్థులే. మా ఆఫీస్ మాత్రమే ఏమిటి అన్నీ తెల్లకాలర్ పనుల్లో అంతా తెల్లవారే. ఆహా ఏమి ఈ దేశం ఏమి ఈ ప్రగతి ఇలాటి దేశానికి వచ్చిన నా భాగ్యమే భాగ్యమంటూ మురిసాను. కానీ ఆ కమ్మిన పొరలు కరగడానికి అట్టే సమయం పట్టలేదు. పెట్రోల్ పంప్స్, బిల్డింగ్ మైంటెనెన్సు, రోడ్స్ క్లీనింగ్, డొమెస్టిక్ మెయిడ్స్ లాటి పనుల్లో అంతా అక్కడి నల్లవారే వారే. చిన్న చితకా పనులు, కష్టమెక్కువ డబ్బులు తక్కువ పనులన్నీ వారివే. వాళ్ళ నివాసాలన్నీ ఊర్లకు దూరంగా వుండే మురికి వాడల్లో. టిన్ షీట్స్ తో వేసిన తాత్కాలిక నివాసాలు, కచ్చా రోడ్స్, అక్కడికి వెళ్లాలంటే అందరు భయపడేలా కథనాలు. వాళ్ళు అక్కడనుండి సిటీ లోకి రావాలంటే మనకిక్కడి రన్నింగ్ ఆటోల్లాగా రన్నింగ్ వ్యాన్లు వాటిల్ని కాంబిలు అనే వారు. వాళ్ళు అంటే చెప్పలేని సృష్టించిన భయాలు. ఆరుగంటలు దాటితే అన్నీ రహదారులు నిర్మానుష్యం అయిపోతాయి. కాలి నడక అయితే అస్సలకే బంద్. అన్నీ నివాస సముదాయాలు విద్యుత్ కంచెలతోనే దర్శనమిస్తాయి. మాకు మా కంపెనీ మెయిడ్ ని కూడా ఏర్పాటు చేసింది. వారానికి రెండు రోజులు వచ్చి ఇల్లు మొత్తం అద్దంలా తుడిచి, బట్టలన్నీ కామన్ వాష్ మెషీన్ లలో ఉతికి, ఇస్త్రీ చేసి వెళ్లేవారు. మా మెయిడ్ పేరు సిల్వియా. ఎంత భీకరాకారో అంతే భీకరమైన గొంతుతో వుండే ఈమె అంటే మా వాళ్లందరికీ టెర్రర్. ఎక్కువ బట్టలున్నా వాషింగ్ కి, ఇల్లు ఎక్కువ గందర గోళంగా వున్నా క్లీనింగ్కి, రుస రుస లాడి పోయేది. అలాటి గడ గడ లాడించే సిల్వియా సుప్రియా దగ్గర కొచ్చేసరికి ఒక స్నేహితురాలైపోయేది. సుప్రియ తను ఆకలి మీద వస్తుందని ఎమన్నా తినడానికి పెట్టేది, తనకి మన బిర్యాని ని బాగా అలవాటు చేసేసింది. తాను కూడా బాగా కబుర్లు చెబుతూ పని చేసేది. అంత రుస రుస లాడే సిల్వియా ఇక్కడ మాత్రం, ఈ హర్షా! విప్పినన్ని గుడ్డలు ఈ వోల్ సాన్ మారినోలో వుండే మగాళ్లు కలిపి విప్పరు అని నవ్వేసేది. అలాటి సిల్వియా ఒక రోజు మా ఇంట్లోనే కుప్పకూలి పోయింది. బోరు బోరు మంటూ ఒకటే ఏడుపుతో. తనతో సహజీవనం చేసే వాడు పారిపోయాడు తాను ప్రెగ్నెంట్ అని తెలిసాక. వాడుత్త తాగుబోతని, వాడిని ఆమె పోషించేది అని, ఆఖరుకు వాడి తాగుడుకి కూడా ఆమె ఇచ్చేది. వాడి పని తాగటం, వచ్చి కొట్టటం. ఇది విన్నాక ఏ దేశ మేగినా , ఎందు కాలిడినా, కథలన్నీ ఒకటే, మనుషుల వ్యధలన్నీ ఒక్కటే అని. ఇది తెలిసాక సుప్రియా సిల్వియా కి ఒక మదర్ అయిపోయింది. తాను ఏదైతే తినేదో అదే సిల్వియా కి పెట్టేది. కొన్నాళ్ళకు మేము కూడా, మా చిన్నది సుప్రియా కడుపులో పడటంతో మా ఊరికొచ్చేసాం. ఇప్పటికీ మా చిన్నది ఎప్పుడన్నా పెద్ద పెద్ద గొంతుతో అరిచినప్పుడల్లా, నేను కానీ సుప్రియా కానీ ఏమ్మా! నీకు సిల్వియా పూనిందా అంటూ ఉంటాము. ఆలా సిల్వియా మా జ్ఞాపకాలలో సజీవంగానే వుంది . నా సౌతాఫ్రికా అనుభవాలతో ఎవరన్నా బ్రిటిషర్లు మనదేశాన్ని ఏకీకృతం చేశారు , రోడ్లు వేశారు , పొగ బండ్లు ఏర్పాటు చేశారు , చాలా అభివృద్ధి చేశారు అంటే అసలే నల్లగా వుండే నా మొహం ఇంకా వివర్ణమవుతుంది.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Ep 95బెల్లంకొండ వెంకటేశ్వర్లు!
ఆరవ తరగతి మొదలయ్యి మూడు నెలలు అయ్యింది. ఆరు ఊర్ల కు కలిపి ఒక జెడ్.పి ఉన్నత పాఠశాల మా బడి. వేరు వేరు ఊర్ల నుండి వచ్చిన పిల్లకాయలందరమీ ఒకరికొకరు అప్పుడప్పుడే అలవాటు పడుతున్నాముఒక రోజు బడికి వచ్చేసరికి, మా తరగతిలోనే ఓ కొత్తమొహం కనిపించింది నాకు. మధ్యాహ్నమయ్యేసరికి ఆ వచ్చిన అబ్బాయి వివరాలు తెలిసి పోయాయి.పేరు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు. అప్పటిదాకా బుచ్చి లో చదువులు వెలగబెట్టి,యీ రోజే మా బడిలో చేరాడు. వూరు మాత్రం మా వూరే, ఉప్పలపాడు.వారం లోపులే సావాసం గాడు అయ్యాడు, వాడి కి తెలియని విద్యే లేదు. వాడి పుస్తకాల సంచి మాకో వింత ప్రపంచం. దాన్లో ఓ కేటర్బాల్ (స్లింగ్ షాట్) దార్లో కనపడ్డ చింత కాయలో లేక సీమ చింత కాయలో కొట్టడానికి, రాలిన తాటి పళ్ళు కాల్చడానికి ఓ అగ్గిపెట్టె, దారి మధ్యలో ఆగి ఆడడాని కో అరడజను గోళీలు, యూనో లాగ ఆడదానికి సిగరెట్ బాక్స్ కార్డ్స్.ఇవన్నీ కాక వాడి కి అమోఘమైన మిమిక్రి కళ వుంది. వచ్చిన వారం పది రోజుల్లోనే అందరి అయ్యవార్లను అనుకరించడం నేర్చేసాడు. వాడే మాకు సెంటర్ అఫ్ అట్రాక్షన్. ఇంత టాలెంట్ సొంతమైన మా వాడిని అన్యాయంగా పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు అని తేల్చేశారు మా అయ్యోర్లు. మాకు మా అయ్యోర్ల అభిప్రాయం తో అస్సలకి పనిలేదు కదా, మా హీరో వాడే.నేను వాడు ఓ ఒప్పందానికి వచ్చేసాము. పరీక్షల్లో వాడూ నేను పక్క పక్కన లేక పోతే నా వెనక వాడో కూర్చోవాలని. నాకు వచ్చినవన్నీ వాడు చూసి రాసేసుకోవాలి, వాడికి వచ్చిన విద్యలన్నీ నాకు నేర్పించేయాలి. ఆరోతరగతి యూనిట్ పరీక్షలు, క్వార్టర్లీ మరియు హాఫ్ యియర్లీ అన్నీ మేనేజ్ చేసేసాము.క్లాస్కెళ్ళింతర్వాత అంతా షరా మామూలే. ఒక్కో అయ్యోరు రావటం వాడినేదో ప్రశ్నలడగటం, వీడేమో వాళ్ళు అడక్క ముందే బెంచీ ఎక్కటం. వాళ్లేమో తా జెడ్డ కోతి వనమెల్ల చెరిచింది అంట అంటూ ఇంకా చీవాట్లు పెట్టటం.రోజులు గడుస్తూనే వున్నాయి, మా అయ్యోర్లలో మార్పేమీ లేదు. మేము మాత్రం బుద్ధిగా వుండే పిలకాయల్ని కూడా కోతులుగా మార్చేస్తున్నాము. మా అయ్యోర్లేమో మళ్ళీ యూనిట్ పరీక్షలు వస్తున్నాయి, బాగా చదవండి అంటూ, అవేవో పబ్లిక్ పరీక్షలు అయినట్టు హెచ్చరికలు జారీ చేయటం మొదలు పెట్టారు. బెల్లంకొండోడి మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు, ఏమీ చదవని వీడికి వీడికి ఇప్పటి వరకూ వచ్చిన మార్కులకి బాలన్స్ కుదరటం లేదు అంటూ, మొదటి సారిగా నన్నో మూల, వాడినో మూలా కుర్చోపెడతామని ముందే వార్నింగ్ ఇచ్చారు.అయినా మా వాడి మొహం లో టెన్షన్ కనపడలా, దానిక్కూడా వాడి దగ్గరేదో సొల్యూషన్ ఉన్నట్టు. ఓ రోజు ఉన్నట్టుండి, యురేకా అనుకుంటూ వచ్చాడు నా దగ్గరకి."నాకు నువ్వు అన్నీ ప్రశ్నలకి జవాబులు రాసివ్వు ముందరే" అన్నాడు."చిట్టాలు పెడతావా. ఎక్కడ దాచుకొని పోతావురా వాటిల్ని, జోబీలోనా, లేక నీ తలకాయ జుట్టులోనా" అని నవ్వా నేను."కాదురా! మనవేమో నేల బల్లలు, ఫ్లోరింగ్ అంతా మట్టి. ముందే వెళ్లి నేను నా ప్లేస్ లో చిన్న గుంత లోడి, నువ్విచ్చే పేపర్స్ అన్నీ అక్కడే కప్పెడతా" అన్నాడు పెద్ద హీరో లాగా."దొర్కవుగా" అన్న."లేదేహే! నువ్వొట్టి పిరిగ్గొడ్డు వి"నిజమే మా బెల్లంకొండోడి ఐడియా నే ఐడియా. విజయవంతం గా రాసేసాడు తెలుగు, ఇంగ్లీష్.కానీ మూడో రోజు లెక్కల పరీక్షలో పట్టుబట్టాడు వాడు మరీ ఓవర్ గా సంభాషణలతో పాటు నడకని కూడా మిమిక్రి చేసే మా సోషల్ అయ్యవారికి.మరు నిమిషం వాడి వీపు మరియు నా వీపు బద్దలయ్యాయి. చిట్టాలు పెట్టింది వాడే, కానీ రాత నాది కదా. ప్రతీ అయ్యోరు రావటం, తీయండి రా గుంజీలు అనటం, తీసి తీసి మేము పడిపోయేదాకా తీయించటం. కాస్త ఓపిక రాగేనే ఇంకో అయ్యోరు తగులుకోవటం.మా ఘన కార్యం తెలిసిన మా హెడ్ మాస్టర్ బహు ముచ్చట పడి వీళ్ళ సమయం మధ్యాహ్నం నుండి నాకు బహూకరించండి అని మా అయ్యోర్లను వేడుకొని, ఆయన రూమ్ ముందర ఆయనకు కనపడేలా మోకాళ్ళ దండన కార్యక్రమం మొదలెట్టారు. ఇదే మేలురా హర్షా అయ్యోర్ల బెత్తం దెబ్బలు , గుంజీళ్లు కంటే , ప్రాణం హాయిగా ఉందబ్బా అంటూ పళ్ళికిలిచ్చాడు వాడు.ఆ రోజు నేనైతే ఇల్లెలా చేరానో నాకే తెలియదు, ఆ రోజే కాదు ఒక వారమంతా కదిలితే వొళ్ళంతా ఒకటే సలుపు, గుంజీళ్ల మహిమ.అలా జరిగిపోయేదేమో కాలమంతా, ఆ రోజు ఆ అవ్వ మా అమ్మ కాళ్ళ బడకుండా వుండి ఉంటే.మా ఊరి పొలాలకు పోవాలన్నా, పొలాలనుండి ఇళ్ల కు పోవాలన్నా అందరు మా వీధి గుండా, మా ఇంటి ముందర నుండే వెళ్ళాలి.ఓ రోజు సాయంకాలం, ఓ ముసలవ్వ, వొంట్లో శక్తీ అంతా వొడిగి పోయినట్లుగా పొలం నుండి ఇంటికి వెళ్తూ కనిపించింది మా అమ్మకి."నర్సమ్మ బాగుండావా!" అంది అమ్మ."ఏమి బాగు సుజాతమ్మ, ఎదో ఇలాగా" అంటూ ఆగింది అవ్వ, బుట్టని ఇంకో సంకలోకి మార్చుకుంటూ."మనవడు ఎలా వున్నాడు నర్సమ్మ""బాగానే వున్నాడమ్మా! మొన్నటి దాకా బుచ్చిలో చదువుకొనే వాడు, గవర్నమెంటోళ్ళ హాస్టల్ లో వుండి. అక్కడుంటే చదువు అబ్బటం లేదు, సావాస గాళ్ళతో కలిసి ఒకటే ఆటలు, తిరుగుళ్ళు. నాకాడే పెట్టుకుందామని తీసుకొచ్చాను అమ్మా. ఇక్కడ చదువులు బాగుంటాయని""ఏమి చదువుతున్నాడు నీ మనవడు""ఆరో తరగతి అమ్మా. ఆ ఏడుకొండల స్వామి పేరు పెట్టుకున్నా, వెంకటేశ్వర్లు అని""అయితే మా వాడు రోజూ జపం చేసేది నీ మనవడి గురుంచే అన్న మాట" అంటూ, అమ్మ గబ గబా వెళ్లి ఒక చేట నిండా బియ్యం తెచ్చి అవ్వ గంపలో పోసింది, వాటిల్తో పాటు కాస్త గోకాకు కొన్ని పచ్చి మిరపకాయలు కూడా గంపలో చేరాయి"సల్ల గుండు తల్లా!, కనపడి నప్పుడల్లా ఎదో ఒకటి ఇస్తావుంటావు" అంటూ బయల్దేరింది అవ్వ.అవ్వ వెళ్ళగానే, "చిన్న! నువ్వు పలవరించే బెల్లంకొండా వెంకటేశ్వర్లు ఈ అవ్వ కూతురి బిడ్డే. వాడి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోతే, ఈ అవ్వ ఈ వయస్సులో కూడా కూలీ పని చేసి వాడిని పెంచుతుంది""వెంకటేశ్వర్లు వాళ్ళ, నాన్న ఏమయ్యాడమ్మా!""ఏమయ్యాడా! వాడిని వాళ్ళ ముసలి అమ్మమ్మ ఎదాన పడేసి మాయమయ్యాడు. వీడన్నా సక్రమంగా చదువు కుంటే ఆ ముసలామెకి ఈ దిగులెందుకు చెప్పు" అన్నది కోపం గా.అసలే ఆ అవ్వని చూసి దిగులుగా వున్న నాకు, మా అమ్మ కోపంతో ఇంకా ఎక్కువయ్యింది. రాత్రంతా కలలో ఆ అవ్వే, ఇంకా ఏమిటేమిటో కలలు. బెల్లంకొండ ముందు దేవుడు ప్రత్యక్షమయినట్టు, వాడినేదో కోరుకోమన్నట్టు, వాడు నాకు చదువు కావాలి అన్నట్టు, దేవుడు తధాస్తు అన్నట్టు. ఇంకా చాలా కలలు.తెల్లారింది. యధావి

స్కై ల్యాబ్, మా గడ్డివాములో పడింది!
నా చిన్నతనపు ఇంకో కథ. మేము ఎక్కువ మా అమ్మమ్మా వాళ్ళ ఊరిలోనే గడిపేశాం చిన్న తనమంతా. మా ఇల్లు పెద్ద స్థలం లో ఆస్బెస్టాస్ రేకులు కప్పిన ఒకే ఒక్క పెద్ద గది, ముందు పంచ, పక్కన ఒక తాటి ఆకులు కప్పిన వంటగది. ఇంటికి కుడి పక్క పెద్ద బాదం చెట్టు వెనక ఒక ఉసిరిగి చెట్టు, ఎడమ పక్క పెద్ద స్థలం లో గడ్డి వాము, ఆ వాముకి ఆవల పెద్ద ఎరువు దిబ్బ. ఆ దిబ్బ నానుకొని ప్రహరీ, ప్రహరీకి ఆవల పంట పొలాలు. మా ప్రహరీకి పంట పొలాల మధ్య ఒక పంట కాలువ. ఒక రోజు మేము గడ్డి వామి మీద కెక్కి దిబ్బలోకి దూకుతూ ఆడుతున్నాం. అలా ఆడటంలో నాకు ఆ దిబ్బలో ఒక పారేసిన అగ్గి పెట్టె దొరికింది. ఓపెన్ చేస్తే దాన్లో ఒకే ఒక అగ్గిపుల్ల. ఆహా ఇంకేముంది కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అన్నట్టు మనం ఆ పుల్ల గీసేశాం. బస్సు మని వెలిగి ఆరి పోయింది. ఆ వెలిగిచ్చామన్న తృప్తితో మరియు ఆరికూడా పోయింది అనే నిర్లక్ష్యంతో ఆ పుల్లని ఆ దిబ్బ లో విసిరేసి అగ్గిపెట్టె మాత్రం అగ్గిచెక్కులాట కోసం జోబీలో వేసు కొని సైలెంట్ గా వచ్చేశాం. ఒక అరగంట తర్వాత ఒక్కసారి గా అక్కడనుండి మంటలు మొదలయ్యాయి. పక్కనే గడ్డి వాము. మా అమ్మమ్మ చూసేసింది, వామ్మో మన దిబ్బలో స్కై లాబ్ పడిపోయిందిరా నాయనా అంటూ. అందరూ పరిగెత్తారు. మా శీనన్న హడావుడిగా బిందెలెత్తుకొని తొట్టిలో నీళ్లతో, దిబ్బలో దూరేసి, నీళ్లు చల్లటం మొదలెట్టాడు. అలా అందరూ ఆ మంటల్ని రంగంలోకి దూకి ఆర్పేశారు. ఆ ఆర్పటంలో మా శీనన్న అరిపాదాలు కూడా కాలాయి . అందరూ స్కై ల్యాబ్ శకలాల కోసం దిబ్బలో వెతికారు. అవి లేవు. ముసలోళ్ళు అమెరికానీ శాపనార్థాలు పెట్టేశారు, తిని కూర్చోక, ప్రయోగాలు అంటూ మా ఊర్ల మీదకు ఎందుకు తెస్తారు అని. మీకు గుర్తుందో లేదో, స్కై ల్యాబ్ భీతి ఆఖరుకు పల్లెల్లో కూడా, యిప్పటిలా నిరంతర వార్తా ప్రసార మాధ్యమాలు, చరవాణులు లేని రోజుల్లో కూడా చొచ్చుకుపోయిందంటే, ఏ ఇద్దరు కలిసిన అది కూలితే, ఒక వూరే నాశనమని, కాదు ఒక జిల్లానే పోతుందని, కాదు కాదు ఒక రాష్ట్రమే కాలి పోతుందని ఒకటే చర్చ. నేను కూడా మా శీనన్న కాలు కాలేసరికి అది నావల్లే అని నోరు విప్పే ధైర్యం చేయలా. కుక్కిన పేనులా గుడ్ల నిండా నీరు నింపుకొనివున్నా. స్కై ల్యాబ్ ఎప్పుడైన పడొచ్చు ఇది శాంపిల్ మాత్రమే అని, మా వూరు ఊరంతా కోళ్ళని పొట్టేళ్లని కోసేశారు, అవెక్కడ కాలి బూడిద అవుతాయో అన్న భూతదయతో. భుక్తాయాసంతో పడుకున్న నా పొట్ట మీద వాతాపీ జీర్ణం వాతాపీ జీర్ణం అంటూ పొట్ట తమిడింది మా అమ్మమ్మ. ఆ దిబ్బ లో అగ్గి పెట్టె గీసింది నేనేను, కానీ శీనన్న కాలు కాలటంతో చెప్పలేక పోయాను. భయమేసింది అన్నా బెక్కుతూ. నేను చూశాలేరా నువ్వా దిబ్బలోకి వెళ్ళటం, ఎదో చేసిన మొహంతో బయటకి రావటం అన్నది మా అమ్మమ్మ. మరి నువ్వు ఆ స్కై ల్యాబ్ అంటూ అమెరికా వాడిని తిట్టటం అంతా, అంటే పడుకోరా పిచ్చి సన్నాసి, నువ్వూ నీ బుజ్జి బుర్రలో ప్రశ్నలూ అంటూ నవ్వేసింది మా అమ్మమ్మ . ఈ సీక్రెట్ నాకూ మా అమ్మమ్మకు మధ్యలోనే 1983 వరకూ.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

నేను పగలకొట్టిన పిచ్చుకను నాకు ఇవ్వండి తెచ్చి!
నాకు నా చిన్నప్పటి రోజులు ఇప్పటికీ జ్ఞాపకమే. నాలుగేళ్లు వుంటాయనుకుంటా నాకు అప్పుడు. మా పెద్దమ్మతో నెల్లూరు వెళ్ళినప్పుడు, సతాయించి సతాయించి ఒక కారు బొమ్మ కొనిపిచ్చుకున్నా. కాస్త అదిమి పెట్టి వెనక్కి లాగితే స్ప్రింగ్ ముడుచుకొని, వదలగానే రయ్యిమంటూ ముందు కెళ్లే ఎర్ర కారు అది. కొన్ని రోజులైతే దానితోనే నా లోకం. ఉన్నట్టుండి ఒకసారి దాని ముందు చక్రం ఊడి పోయింది. సరి చేసి పెడితే కొంచెం దూరం వరకు చక్రం ఉండటం, తర్వాత ఊడి, కుంటి గుర్రం లాగా ఒక పక్కకి పడి పోవటం. అలా చక్రం ఊడిన కారు నాకు నచ్చలా. ఒక రాయి తీసుకున్నా, మా దేవళం పంచలో కూర్చున్నా, కారుని పచ్చడి పచ్చడి చేసిపారేశా!. మా మూగ పూజారి నేను చేసే పని చూసి, లబ లబ లాడాడు. ఎత్తుకెళ్ళి దాన్ని మా సుబ్బరామ్ తాత వాళ్ళ స్నానాల నీళ్లు వెళ్లే తూము కింద పారేసా!. అలా మా వాళ్లంతా నీ కారేదిరా అని అనటం, నేను పోయుందని చెప్పటం. మా వాళ్ళు నిజమే కాబోలు వీడికి ఊరంతా పెత్తనాలే కదా, ఎక్కడో పారేసుకుని ఉంటాడని సరిపెట్టుకున్నారు. మా శీనన్న కొన్నాళ్ళకు గండవరం తిరునాళ్ల కెళ్ళి, మళ్ళీ నాకోసం ఓ బొమ్మ కారు పట్టకొచ్చాడు, వాడు జార్చుకుంటే జార్చుకున్నాడులే, ఉన్నన్నాళ్ళు ఆడుకుంటాడు అని. ఈ లోపల నాకు మా ఊరి వీధిబడిలో చదువుకొనే మహదావకాశం వచ్చింది. పెద్ద పండగలాగా, మా ఉషాకి , మా జయమ్మకి , మా మురళికి , మా కరుణాకి , ఇంకా అందరు పిల్లకాయలకు, పలకలు బలపాలు పంచేసి బడిలో చేరిపోయా. మా అయ్యోరొక పలక మీద, అ! ఆ! రాసిచ్చి, కొంత సేపు రుద్దిచ్చి, ఇంకా రుద్దు కొని రారా అని తరిమిపడ నూకినాడు, ఆయన పోయి కొడవంలో పడ్డ చేపలు తెచ్చుకోడానికి . నేను మా ఇంటికి లగెత్తినా, ఈ లగెత్తడంలో పలక, కిందబడి ఒక చిన్న పెచ్చు ఊడింది. పెచ్చు ఊడిన పలక నాకు నచ్చలా. దారిలో కాశీ రాయొకటి తీసుకొని, పలకను ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టినా!. నాలుగు కర్రముక్కలు కలిపిన ఫ్రేమ్ మాత్రం మిగిలింది. మా ఉషాకి ఆ ఫ్రేమ్ ఇచ్చి, మే ! మీ అమ్మని పొయ్యిలో పెట్టుకోమని చెప్పు అని, ఆ పిల్ల మొహాన పడేసి వచ్చా. ఏమిటో మనకి మొదట నుండి అన్నీ సక్రమంగా ఉండాల, తేడా వస్తే పగల కొట్టేయాల్సిందే. షరా మాములే, ఏదిరా నీ పలక అనటం, మనం పగిలి పోయిందనటం. మరలా మనకో కొత్త పలక, దాంతో పాటు మనం అరగ దీయటానికో బలపం కట్ట బోనస్ గా వచ్చేది. ఒక రోజు నేను, మా పెద్దమ్మ వాళ్ళ కొట్టాం పక్కగా నడుచుకుంటూ వస్తున్నా. చొక్కా గుండీకి దారం పోగు బయటకు వేలాడుతుంది, దాన్ని చూడగానే నాకు చిరాగ్గా వుంది. ఉంటే సక్రమంగా ఉండాలా లేక పోతే ఊడాల ఆ గుండీ. దాన్ని పీకుతూ తలెత్తే సరికి, కొట్టంకి వేసున్న కర్ర తుమ్మ కర మీద, పిచ్చుకలు వాలున్నాయి గుంపుగా. అబ్బా! ఇప్పుడు గాని వాటి మీద ఒక్క రాయి వేస్తే నా సామి రంగా, ఒక్కటన్నా నేలమీద పడదా అని, పక్కకి వొంగి ఓ కంకర రాయి తీసి విసిరా వాటి మీదకి. వెంటనే అవన్నీ చిల్లా పల్లాగా ఎగిరిపోయాయి. కంచె దగ్గరకెళ్ళి చూస్తే ఒక రెక్క తేడాగా ఎగరలేని పిచ్చుక ఒకటి అక్కడ పడుంది. అది ఎగరడానికి ప్రయత్నిస్తూ, ఎగరలేక నేలమీద, దాని చుట్టూ అదే గిరికీలు కొడుతుంది. అలా సక్రమంగా ఎగరలేని పిచ్చుక నాకు నచ్చలా. కొంత సేపటికి ఎగిరి పోతుందిలే అని అక్కడ నుండి కదిలా. కానీ మనసు లాగింది, ఎక్కడో సన్నని బాధ, వెనక్కి మరలా. వెళ్లి పిచ్చుకని చేతిలో తీసుకున్నా. ఇంటికి పట్టుకొచ్చా, ఇంట్లో ఒక మూల ఉంచా. కొంత సేపయ్యాక కొన్ని బియ్యం నూకలు వేసా దాని ముందు, ఒక చిన్న మట్టి మూతలో నీళ్లు తెచ్చిపెట్టా. దాన్నే చూస్తూ కూర్చున్నా. ఎవరో చెప్పారు దాని గాయం దగ్గర మట్టి రాస్తే తగ్గుతుందని, వెంటనే మట్టి తెచ్చి రాసా. ఆ సాయంత్రమంతా దానితోనే. పొద్దుబోయింది నిద్ర వస్తుంది మధ్యలో లేవటం, దాన్ని చూసుకోవటం, ఇలా తెలియకుండానే నిద్ర పోయా. తెల్లారగానే అది కోలుకొని ఉంటుందని అది ఉన్నవైపు కెళ్ళా, అక్కడ నాకది కనిపించలా, దాని కొన్ని ఈకలు మాత్రం వున్నాయి. అప్పుడు నాకర్థమయ్యింది ఆ మధ్య మా ఇంట్లో ఓ పిల్లి తిరుగుతుందని. అప్పుడొచ్చింది నాకు ఏడుపు. నేను కారు పగలకొడితే ఇంకో కారు తెచ్చారు, పలక పగలకొడితే ఇంకో పలక తెచ్చారు, మరి నాకు ఇంకో పిచ్చుక వద్దు, నేను పగల కొట్టిన పిచ్చుకే కావాలి. తెచ్చి ఇయ్యండి మీరైనా, ఇప్పటికైనా.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

కథా సరిత్సాగరం!
మా అమ్మమ్మ చెప్పే కథల గురించి ఇంతకుముందు చెప్పా కదా! మాకు కథలు చెప్పటం అనేది, తన రోజూ వారీ దినచర్యలో ఆవిడకి అన్నిటికంటే ఇష్టమైన ప్రక్రియ. కానీ మేము అడిగిన ప్రతీసారీ ఆవిడ, తన దగ్గరినించీ ఈ కథలు, అంత తేలిగ్గా బయటకి తీసేది కాదు. ఒక్కోసారి ముందుగా పొడుపు కథలు చెప్పేది. అంటే, పొడుపు కథ మేము విప్పితే గానీ అసలు కథ బయటకి రాదన్నమాట. ఇదంతా అయ్యిన తర్వాత, ఆమె కథ చెప్పడానికి రెడీ అయితే బోనస్, లేక పోతే ఆవిడ, ఆ పొడుపు కథనే ఆరోజుకి పొదుపుగా వాడేసుకుంది , అని మేము అర్థం చేసుకోవాలి. అలా ఆవిడ తన అమ్ముల పొదిలో వున్న కథలను, విరివిగా వాడకుండా, విడతల వారీగా మాత్రమే, బయటకి తీసేది. మేము కూడా ఆవిడ చేత కథ చెప్పిచ్చుకోవడానికి, వంకర టింకర శొ…వాని తమ్ముడు అ…నల్ల గుడ్ల మి…నాలుగు కాళ్ళ మే… తోకలేని పిట్ట తొంబై మైళ్ళు…తొడిమలేని పండు, ఎన్నటికీ వుండు… లాటి పొడుపు కథలు రాగయుక్తంగా పాడుకుంటూ సమాధానాలకు తెగ ఆలోచించేసి, మా చిన్న బుర్రల్ని సాన పెట్టేసి, నానా కష్టాలూ పడే వాళ్ళం. కథల కోసమని చెప్పి, పగలంతా ఆవిడ పనుల్లో సహాయం చేస్తూనో, ఆవిడకి కావాల్సి వస్తువులు అంగడికి వెళ్లి వెంటనే తెచ్చి పెట్టడమో ……… ఇట్టా పొద్దస్తమానం ఆవిడ చుట్టూనే తిరిగేవాళ్ళం. 'లలిత' గుండాయన చెప్పినట్టు జీవితంలో ఏదీ వూరికే రాదనీ, మాకప్పుడే అర్థమయ్యేట్టు చేసింది మా అమ్మమ్మ. ఆఖరికి, సాయంకాలం ఆటలకి వెళ్లిన మేము, మేతకెళ్లిన పశువులు ఊర్లో అడుగెట్టక ముందే, వెన్కక్కొచ్చేసి, తద్వారా ఆవిడని సంతోషపెట్టి, కథలు సాధించుకునేవాళ్ళం. ఈ సందర్భంగా చెప్పాలంటే, ఆవిడ కి మా గురించి చాలా భయాలు ఉండేవి, పశువులు తిరిగి ఇళ్లకు వచ్చే వేళ, మేము వాటి మధ్యలో పడి నలిగి పోతామనో, మేము ఆటల్లో పడి, పశువుల కోసం ఉంచిన కుడితి తొట్లల్లో పడి పోతామనో ఇలా రక రకాలుగా. మేము ఆటల్నించి రావడం ఒక పది నిముషాలు లేట్ అయినా, మమ్మల్ని, వెతుక్కుంటూ ఆవిడే ఊర్లోకి వచ్చేసేది. అలా వచ్చినప్పుడు మేము కానీ కనపడక పోతే వెళ్లి అమాంతం గా అన్నీ కుడితి తొట్లల్లో చేతులు పెట్టి దేవేసేది. ఆవిడ మా ఊర్లో జనాల్ని అయ్యా, మా చిన్నోడిని ఎక్కడన్నా చూశారా, మా బేబమ్మ (మా అక్క ముద్దు పేరు) ఎక్కడన్నా కనపడిందా అని అడుగుతూ వెతుక్కుంటూ రావటం ………. ఎక్కడి పోతాం అమ్మమ్మా! మేము ఏమన్నా చిన్నపిల్లలమా , అని మేము ఆవిణ్ణి విసుక్కోవటం నాకు యింకా గుర్తే. మా దోస్తులు కూడా, ఇంకా మీ అమ్మమ్మ రాలేదేమిటా అనుకుంటా వున్నాము, అనుకోంగానే దిగిపోయిందావిడ, ఇంక ఆటలు ఆపెయ్యాలి అని, మా మొహం మీదే, నిరాశతో కలిపిన వెట - కారాలు చల్లేవాళ్ళు . మా అమ్మమ్మ చెప్పే కథలు చాలక, ఒక్కోసారి మేము మా చిన్నమ్మమ్మ దగ్గర చేరేవాళ్ళం. మాకు కథలు చెప్పడానికి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక తెలియని పోటీ ఉండేది. మేము మా చిన్నమ్మమ్మ చేత చెప్పించు కోవాలంటే, ప్రీ కండీషనూ, ఆవిడ కుండే తెల్లని వెంట్రుకలు మేం లాగి తీసేయటం. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి మా చిన్న అమ్మమ్మ, కథలు చెప్పటంలో మా అమ్మమ్మకి ఏమాత్రం తీసిపొయ్యేది కాదు. రామాయణ, భారత కథలతో పాటు, కాశీ మజిలీ, భోజరాజు-సాలభంజికలు, బట్టి విక్రమార్కులు, మిత్ర లాభాలు, మిత్ర బేధాలు, అక్బర్ బీర్బల్, ముల్లా నసీరుద్దీన్, అలీబాబా నలభై దొంగల వంటి - కథలన్నీ, సంభాషణల తో సహా అన్నీ రకాల కథలూ - మా చిన్నమ్మమ్మ కి కొట్టిన పిండి. ఆ కథలన్నీ వినడానికి, మాకు ఆవిడకి వుండే తెల్ల జుట్టుతో పాటు అప్పుడే నెరవడం మొదలు పెట్టిన వాటిల్ని కూడా అనవసరంగా లాగేసే వాళ్ళం. మా చిన్నమ్మమ్మ, కథలు, వాటిలోని సంభాషణలు, చేతులు తిప్పుతూ, కళ్ళతో హావభావThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp