
Harshaneeyam
535 episodes — Page 9 of 11

S1 Ep 173'ఎందుకు పారేస్తాను నాన్నా!' చాగంటి సోమయాజులు గారి రచన
చాగంటి సోమయాజులు గారు 'చాసో' గా తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. ఆధునిక తెలుగు కథను ప్రగతి శీల భావాలతో సుసంపన్నం చేసిన చాసో ఎన్నో గొప్ప కథలను రచించారు. 1945 వ సంవత్సరంలో 'భారతి' మాస పత్రికలో ప్రచురితమైన ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చింది చాగంటి తులసి గారికి , కథకు ఆడియో ని అందించిన చాగంటి కృష్ణ కుమారి గారికి కృతజ్ఞతలు. ఇదే పేజీలో ఈ కథపై, సారంగ వెబ్ మ్యాగజైన్ లో ప్రముఖ రచయిత శ్రీ అరిపిరాల సత్య ప్రసాద్ గారు చేసిన చక్కని సమీక్షను కూడ వెబ్ లింక్ ద్వారా మీరు చదవొచ్చు. కథ :చెల్లిని వొళ్ళో కూచో పెట్టుకుని కృష్ణుడు వంటింట్లో కబుర్లు చెప్పుతున్నాడు. వాళ్ళనాన్న పిలిచి చుట్టలు తెమ్మని డబ్బులిచ్చేడు. కృష్ణుడు వీధిముఖం చూడకుండా, మొగుడు చచ్చిన విధవలాగ ఇంట్లో దూరి కూచుంటున్నాడు. నాన్న చుట్టలు తెమ్మని పురమాయించేడు. హైస్కూలుదాటి -చుట్టల దుకాణానికెళ్ళాలి. మేష్టర్లు, తోటి విద్యార్థులు అక్కడుంటారు. కృష్ణుడికి రోడ్డెక్కటమే నామోషిగా ఉంది. బడిపక్క నుంచి ఎలాగ వెళ్ళడమని గింజుకుంటూ బయలుదేరేడు.ఉదయం ఎనిమిది గంటలు కావొస్తున్నది. బడి పెట్టేవేళ. వీధి చివరనుంచే బడిగోల సముద్రపు ఘోషలాగ వినబడుతున్నాది. బడిపక్క నుంచి వెళ్ళక తప్పదు; రాక తప్పదు.బడి కనబడగానే కృష్ణుడికి బెంగపట్టుకుంది. హైస్కూలు పిల్లల గందరగోళంతో కలకల్లాడుతున్నాది. వరండాలు, గదులు, చుట్టూ రోడ్లూ, విద్యార్థులతో, విద్యార్థినులతో చూడ సొంపుగా ఉంది. రోడ్డు వారగా కృష్ణుడు తలొంచుకుని పరిగెట్టాడు. "కృష్ణా!" అని స్కూలు వరండాలోంచి కేకొచ్చింది. కృష్ణుడు తిరిగి చూడక తప్పింది కాదు. నరిశింహం పరి గెట్టుకొచ్చి వాడి భుజంమీద చెయ్యేసి “ఏంరా, నువ్వు బళ్ళోకి రావడం లేదు.” అనడిగేడు. “సోమవారం చేరుతాను” అని కృష్ణుడు చెప్పేడు. “పుస్తకాలు కొన్నావా?" “ఇంకా లేదు.”“ వేగిరం కొనుక్కో. మళ్ళా అయిపోతాయి. ఎక్సరు సైజు పుస్తకాలు షాపుల్లో కొనకేం స్టోర్సులో చవగ్గా వున్నాయి. ధరలన్నీ దారుణంగా పెరిగిపోయాయిరా!" - నరశింహం డబుల్ కప్పు చొక్కా, జనావా పేంటూ, జోళ్ళూ తొడుక్కుని నీటుగా ఉన్నాడు. కృష్ణుడికి ఉన్న బట్టలన్నీ రెండు నిక్కర్లు, రెండు చొక్కాలు; ఉన్నాయంటే ఉన్నాయి. ఒక నిక్కరుకి పోస్టాఫీసుంది. ఒక చొక్కా భుజం చిరిగి జారిపోతే, వాళ్ళమ్మ ఎత్తి కుట్టింది. చెయ్యి బుట్టలాగ లేచిపోయింది. రేవుకో జత. కృష్ణుడు పేంట్లు కుట్టించమని ఎప్పుడూ ఏడవ లేదు. పేంటుకైతే బట్ట ఎక్కువ పడుతుంది. బట్ట ఎక్కువైతే డబ్బు ఎక్కువవుతుందని వాడికి తెలుసు. మరి రెండు జతలు కుట్టించమని బతిమాలుకున్నాడు. కాళ్ళా వేళ్లా పడ్డాడు. ఏడ్చుకొన్నాడు. ప్రయోజనం లేకపోయింది.నరశింహం చంకలో కృష్ణుడికి కొత్త పుస్తకం కనబడ్డాది. “ఏం పుస్తకంరా అదీ?" అనడి గేడు.“ఇంగ్లీషు పుస్తకం. నేనన్ని పుస్తకాలూ కొనేశాను. జాగ్రఫీ పుస్తకమే కొనలేదు. జాగ్రఫీ పుస్తకాలింకా స్టోర్సువాళ్ళకి రాలేదు. చూడు పుస్తకం" అని ఇచ్చేడు.కృష్ణుడు పేజీలు తిరగేశాడు. కొత్త పుస్తకంలోంచి ఒక విధమైన పరిమళం పైకి వచ్చింది. కృష్ణుడు పుస్తకంలోకి మొహం పెట్టి వాసన చూశాడు.“కొత్తపుస్తకం వాసన బాగుంటుందికదరా?” అన్నాడు నరశింహం. "కమ్మగా ఉంటుంది. నా కెంతో యిష్టం" అన్నాడు కృష్ణుడు. “నీ కింగ్లీషులో ఫస్టుమార్కు రాలేదు, కదరా?” “నాలుగు మార్కుల్లో పోయింది." “ఎవరి కొచ్చిందిరా?" . “శకుంతల కొట్టేసింది.” “నిజమే! నేన్నమ్మ లేదు; దాని కెన్నొచ్చాయి.” “నా కరవై నాలుగు, దాని కరవై ఎనిమిది," “ఆడపిల్లని మేష్టరు వేసేసుంటాడు." “నీ మొహం! అది తెలివైంది.” “తస్సాచెక్కా! ఆడపిల్లలు చదివేస్తున్నారురా!"కృష్ణుడు మార్కుల గొడవ తేగానే గొప్పవాడయిపోయాడు. తెలివైనవాడు కాబట్టే నలుగురూ గౌరవిస్తున్నారు. లేకపోతే వాడి కుళ్ళుగుడ్డలని చూసి అంతా దూరంగా ఉండేవాళ్ళే. వాడికి బడిపక్కని నిలబడడం, బడి కెళుతున్న నరశింహాన్ని చూడడం చాలా కష్టంగా ఉంది. ఎంచేతంటే, కృష్ణుడు బడి కెళ్ళి చదువుకొనే అవకాశాలు తప్పిపోయాయి. వాళ్ళ నాన్న ఈ ఏడాది కృష్ణుడికి చదువు చెప్పించనని నిశ్చయంగా చెప్పేశాడు.“ఎక్కడేనా చదువు మాన్పించుతారండి? ఋణమో పణమో చేసి ముక్క చెప్పించకపోతే కుర్రా డెందుకేనా పనికొస్తాడా? చదువుకునే ఈడులో బడి మానిపించి, ఇంట్లో కూచోబెడితే తరవాత గాడిదలని కాయడానికేనా పనికిరాకుండా పోతాడు. ఏదో చూసి బడిలో వెయ్యండి" అని వాళ్ళమ్మ శతపోరి చెప్పుకొస్తున్నాది.“బళ్ళో వెయ్యగనే సంబరమా? వాడు చదివేది ఫోర్తు ఫారమ్. జీతమెక్కువ. నెల నెలా ఎంత కట్టాలో తెలుసా? తూగ్గలనా? ప్రవేశ పెట్టడానికి, పుస్తకాలకే డౌతుంది ఏభై రూపాయలు. దస్తాకాగితాలు రూపాయి, అర్ధగా పెనసలు ఆరణాలు! ఎక్కణ్ణుంచి తేవడం. మొహాన్ని వాడికి లేందే! వాడి ప్రారబ్ధం, మన ప్రారబ్దం! వారం వారం ఎక్కడ లేని డబ్బూ బియ్యానికి ముడుపు చెల్లించడానికే తలప్రాణం తోక్కొస్తున్నాది. మాటలా?" అని వాళ్ళ నాన్న చెప్పుకొస్తున్నాడు.తల్లి మాటే నెగ్గుతుందో, తండ్రిమాటే నెగ్గుతుందో ఇంకా తేల లేదు. కృష్ణుడికి మాత్రం సందిగ్ధం లేదు. వాడు తలిదండ్రులని బాగా ఎరుగు. తల్లి ప్రతీ విషయంలోనూ బడబడలాడడమేకాని ఆఖరికి తండ్రి చెప్పినట్టే జరుగుతూ ఉంటుంది. అంచేత చదువుకి స్వస్తి చెప్పడమే ఖాయమని నిర్ధారణ చేసుకొని నామార్దాతో కృష్ణుడు కుళ్ళిపోతున్నాడు.శ్రీ కృష్ణుడికి కొత్త ఇంగ్లీషు పుస్తకం పేజీలు తిరగేసినకొద్దీ గుండెల్లో గాభరా పుట్టింది. చదువుతున్న కుర్రాళ్ళమీద ఈర్ష్యా, తనకి చదువు లేకుండా పోయిందన్న దుఃఖము - రెండూ రెండు లేడిక పాములై అతని బుర్రని కరకర లాడిస్తున్నాయి.“కృష్ణా, వేగం చేరరా! డివిజన్లు పెట్టేశారు. నేను 'జే' డివిజనులో పడ్డాను . మన బేచివాళ్ళంతా 'జే' జీవిజనులోనే పడ్డారు” అన్నాడు. నరశింహం. “అమ్మబాబో! 'జై' డివిజనుదాకా పిల్లలున్నారా?" అని ఆశ్చర్యపడ్డాడు. కృష్ణుడు. - 'జే' తో ఐపోలేదు. 'కే' డివిజను కూడా ఉన్నాది." ఏ, బి, సి, డి, అని లెక్కబెట్టి - "పదకొండు డివిజన్లో!" అన్నాడు కృష్ణుడు. ఒక్క ఫోర్తు ఫారములో సుమారు ఐదు వందలమంది విద్యార్థులున్నారు. కృష్ణుడు అక్కడ నిలబడ లేక పుస్తకాన్ని చ్చేసి “నేను చుట్టల కెళ్ళాలి, పోతా”

S1 Ep 170'సీతా.....రాముడొస్తున్నాడోయ్ ' - యండమూరి గారి రచన !
నవలా రచయితగా, లక్షల కొద్దీ అభిమానుల ఆదరం చూరగొన్న యండమూరి వీరేంద్రనాథ్ గారు, గొప్ప నాటికలను రచించారు, అలాగే అతి చక్కటి కథలను కూడా . ఆయన రచించిన కథలలోనించి ఎంపిక చేసిన 25 కథలతో వచ్చిన పుస్తకం ' ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్' . ఆ పుస్తకంలోని చివరి కథ ఇప్పుడు మీరు వినబోయే, 'సీతా... రాముడొస్తున్నాడోయ్'.ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన వీరేంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు.ఈ పుస్తకం కొనడానికి ఈ లింకుని ఉపయోగించండిhttps://www.telugubooks.in/products/the-best-of-yandamoori-veerendranathహర్షణీయం’ పాడ్‌కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1ఆ రాత్రి - అయోధ్య నిశ్శబ్దంతో సయోధ్య చేసినట్టుంది.శ్రీహితుడికి కన్ను మూత పడటంలేదు. మెత్తటి పాన్సు అంపశయ్యలా తోచింది. కొంచెం సేపు నిదురించే ప్రయత్నం చేస్తున్నాడు. లేచి కూర్చుంటున్నాడు. అంతకు మునుపే, దూరంగా రోదన వినిపించింది. వినిపించిన వైపు వెళ్ళాడు.సరయూ నది ఒడ్డున ఒకామె రోదిస్తూ కనబడింది. “ఎవరు తల్లీ నీవు? ఎందుకు రోదిస్తున్నావు?” అని అడిగాడు. "నాయనా! నేను నిద్రాదేవిని. నిన్ను సమీపించుటకు చేతకాని అవమాన భారంతో రోదిస్తున్నాను” అన్నది.ఆమె రోదనకు సరయూనది గలగలలు ఉపశృతులు అవుతున్నవి. ఏమి చేయాలో తోచనట్టు నిలబడినాడు.అంతలోనే అతడికి మెలకువ వచ్చింది. అంతా కల అని తెలిసింది. మళ్ళీ అనుమానం నిదుర రాకపోతే కల వుండదుకదా. మరి అది కలా? లేక తన భావావేశమా? అంతా అయోమయమే! ఈ అయోమయం వేకువ నుంచీ వున్నది. ఏ పనీ చేయబుద్ధి కాదు. ఊరికే ఉండబుద్దికాదు. కాలు ఒక చోట నిలువదు. అది నిలుచున్నా మనసు నిలవదు. అవును మరి అతడికి అలజడికి కారణమున్నది.రాముడు బయల్దేరినాడట. పుష్పక విమానంపై సీతా సమేతుడై వస్తున్నాడట. రావణ సంహారానంతరం అయోధ్యలో అడుగిడుతున్నాడట.- శ్రీహితుడికి ప్రస్తుతం ఇరవయ్యేళ్ళ ప్రాయం. అతడి తల్లి కైకేయి వద్ద ముఖ్య పరిచారిక. తండ్రి దశరధ రథ చోదకుడు.అతడికి గతము బాగా గుర్తున్నది. అప్పుడతడికి ఆరో వసంతము. ఆడవారితో వామన గుంటలు, ఈడు వారితో కోతి కొమ్మచ్చులు ఆడుకునేవాడు. ఆరోజు ఎవరూ అతనితో ఆడేటందుకు రాలేదు. పలకరించనయినా లేదు. అంతా దుఃఖ సాగరంలో మునిగి వున్నారు. ఆటకెవరూ తోడు లేనందున అతడికి కోపము వచ్చింది. కసి పెరిగింది. బిక్కు - బిక్కు మంటూ ఒక్కడే కూర్చున్నాడు. గదిలో ఒక మూల తల్లి రోదిస్తున్నది. - అంతలో పుర వీధిలో కలకలం వినిపించింది. పరుగు పరుగున బయటకొచ్చాడు. ఆ దృశ్యాన్ని అతడు, తరువాత జీవితంలో ఎన్నడూ మర్చిపోలేదు.నార బట్టలతో రాముడు, సీతతో కలిసి నడుస్తున్నాడు. లక్ష్మణుడు వారిని అనుసరిస్తున్నాడు. వెనుక అయోధ్య నడుస్తున్నది. శ్రీహితుడు కనులు పెద్దవి చేసుకుని చూసాడు. అతడి పసి మనసుకి అర్థం కాలేదు. పరుగెత్తుకుపోయి, “అమ్మా! అందరూ వూరొదిలి పోతున్నారే” అన్నాడు. తల్లి అతడి పొదివి పట్టుకొని ఎలుగెత్తి ఏడ్చింది. ఆమె దుఃఖమునకు మరొక కారణము కూడా వున్నది.కైకను తిట్టనివారు లేరు. ముఖ్య పరిచారక కాబట్టి ఆమెది కూడా తప్పన్నటు తూలనాడారు. ఆ తల్లి దుఃఖం అందుకే. శ్రీహితుడికి తల్లి దుఃఖం అర్థం కాలేదు. తనూ ఏడ్చినాడు.ఎప్పటిమాట అది! పధ్నాలుగు వసంతాల క్రిందటి మాట!ఆ తరువాత రాముని కథలు ఒకటి తరవాత ఒకటి విని పులకించి పోయినాడు. వాస్తవముకంటే ఊహ గొప్పది కదా! శ్రీహితుడి మనసులో శ్రీరాముడట్లే పెరిగిపోయినాడు. కథలన్నీ తల్లే చెప్పినది.రాతిని నాతిగ చేసినాడని చెప్పగ నోటిని తెరుచుకు విన్నాడు. దండిగ నసురుల చెండిన రాముని, కంటికి నిండుగ వూహించుకున్నాడు. ధనస్సు వంచిన దనుజభిరాముని మనస్సునందే నింపుకొన్నాడు.ఆ విధంగా రాముడు, శ్రీహితుడి మనసులో వయసుతో పాటే ఎదిగినాడు. అటువంటి రాముడు ఈ రోజు.... ఇన్నాళ్ళకి వస్తున్నాడంటే నిద్ర ఎలా పడుతుంది?లేచి బయటకు వచ్చాడు.శ్రీహితుడికి అయోధ్య మీద చాలా కోపంగా వుంది. దానికి కారణం కూడా వున్నది. రాముడొస్తున్న రాత్రి, ఇంత హాయిగా అందరూ ఎలా నిద్ర పోతున్నారన్నదే ఆ కారణం.అంతకు ముందు రోజే భరతుడు అగ్ని ప్రవేశం చేయబోయాడు. పదునాలుగు సంవత్సరములు దాటినా రాముడు రాకపోయే సరికి ప్రాణాలు తీసుకోబోయాడు. అంతలో హనుమంతుడొచ్చి రామాగమన సందేశాన్ని వినిపించాడు. -అంతే! ఆ క్షణము నుంచీ అయోధ్యలో ఎవరికీ నిద్రాహారాలు లేవు. నగరాన్ని అలంకరించటము ప్రారంభించారు.కౌసల్య కళ్ళలో తెలి మంచుముత్యాలూ, సుమిత్ర కళ్ళల్లో మణిదీపాలు వెలిగితే, కైకకి వళ్ళంతా కళ్ళే అయినవి. ముగ్గురు తల్లులూ, కళ్ళని దీపాలు చేసి, రాముడొచ్చే దారిని వెలిగించారు.భవంతులకి రంగులు వేసారు. దారులని నీటిలో కడిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే, రాముని అవతార మెత్తిన విష్ణువుని వదిలి వుండలేని ఆదిశేషువు అయోధ్య కొచ్చి, తన శరీరాన్ని కోటగానూ, పడగలను సౌధాలుగానూ చేసినట్లున్నాడు. ఇంతాజేస్తే రాముడేమో అన్నీ వదిలి అడివికి పోయినాడు. నిస్తేజుడైన ఆదిశేషుడికి కూడా ఆ రోజు రామాగమన వార్త తెలిసినట్టుంది. ఒక్క సారిగా పడగ విప్పాడు. సౌధాగ్రాల్లో వెలిగించిన మాణిక్యపు దివ్వెలు ఆ శేషువు పడగలపై మణుల వలె భాసిస్తున్నాయి. ఎక్కడ చూసినా మకర తోరణాలు, పరిమళ గంధాలు... కస్తూరి కలిపిన కన్నీటి కలయంపి ఊరు వూరంతా కలాపి జల్లి, రత్నాల రంగవల్లులూ, ముత్యాల ముగ్గులు తీర్చిదిద్దారు ముదితలు.పనికి అడ్డు వస్తున్నారని పిల్లల్ని తొందరగా నిద్రపుచ్చబోయారు తల్లులు. స్తన్యమిచ్చి జోకొడుతూ, “లాలీ... లాలీ.. మేఘశ్యామా లాలీ.... తామ రస నయన ...... దశరథ తనయ లాలీ ... రామ లాలీ...”. అని పాడసాగారు. నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్న పసివాళ్ళు, పాటలో రాముని శబ్దం వినగానే తత్తరపడి మళ్ళీ మేల్కొంటున్నారు.ఎప్పుడెప్పుడు రాముని చూద్దామా అని తల్లుల పవిటలు పిల్లలు అడ్డు తీస్తున్నారు. ఆ విధంగా రెండు రోజులనుంచీ సాగుతోంది.రాముని రాక కోసం అయోధ్య నలంకరించిన నగర వాసులందరూ ప్రస్తుతం గాఢనిద్రలో మునిగి వున్నట్టున్నారు. పుర వీధులన్నీ నిశ్శబ్దంగా వున్నాయి. పిల్లగాలి హితుడిని పరామర్శగా తాకింది. దక్షిణం వైపునుంచి వస్తోంది అది. ఎక్కడో యోజనాల గరంలో వున్న రామచంద్రుని తాకి పునీత మైనట్టుంది. ఆ ఆలోచనతోనే అతడి శరీరం పులక

S1 Ep 169మందలపర్తి కిశోర్ గారి సమీక్ష - 'తోటి వేటగాళ్లు' కథపై
తోటి వేటగాళ్లపై మందలపర్తి కిషోర్ గారి సమీక్ష This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 168'తోటి వేటగాళ్లు' కేఎన్‌వై పతంజలి గారి కథ!
'తోటి వేటగాళ్లు' కే ఎన్ వై పతంజలి గారు రాసిన , వేట కథలు అనే కథాసంపుటం లోనిది.ఈ పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి.https://www.telugubooks.in/products/patanjali-sahityam-1తోటి వేటగాళ్లు కథపై శ్రీ మండలపర్తి కిషోర్ గారి సమీక్ష కూడా ఆడియోలో మీరు వినవచ్చు.తోటి వేటగాళ్ళు !బండివేగిసచెట్టు చేతులెత్తి, జుత్తు విరబోసుకు నిల్చుని రాక్షసుడిలాగుంది ఆ చీకటిలో. దానినీ , దానితో కొమ్మలు కలిపి నిల్చున్న పచ్చగాత చెట్టునీ అల్లుకుని పాకిన అడ్డతీగ పాదు కొసలు కొన్ని ఉరిత్రాళ్ళలాగ వేలాడు తున్నాయి. బండి వేగిసచెట్టు మీద ఇరవయి అడుగుల ఎత్తున కట్టిన మాటులో (మంచెమీద) మందసా రాజు కూర్చున్నాడు. అతని దగిర అతి శక్తిమంతమైన రైఫిల్ వుంది. మంచె కింద, రెండు చెట్టు కొమ్మల మీద ఇద్దరు తోటి వేటగాళ్ళు కూర్చున్నారు. వాళ్ళిద్దరి దగ్గరా రెండు తుపాకులున్నాయి. అంత దూరాన జువ్వి చెట్టుకు కట్టిన ఆవుదూడ బేలగా అరుస్తున్నాది. గుంజి పిట్టలు 'కరకరకర' మని అరుస్తున్నాయి.అడవి నిద్రతో తూలుతూంది. పులి అలికిడి లేదు. ముందురోజు, అంతకు ముందు రోజూ ఆ ప్రాంతంలో అది రెండు ఆవుల్ని ఎత్తేసింది. అడుగుల్ని బట్టి చూస్తే భారీ పులి. ఎరను బెట్టి, మాటు కట్టించి కూర్చున్నాడు రాజు. అర్ధరాత్రి దాటి చాలా సేపయింది. ఆ ప్రాంతంలో పులి ఎక్కడున్నా దానికి ఆవుదూడ అరుపు వినిపించే తీరాలి. అయినా రాలేదంటే రాజుకి ఆశ్చర్యంగా వుంది. ఇంకో అడివికి వెళ్ళిపోయిందా?తెలీడం లేదు. గాలి చల్లగా వేస్తోంది. తెల్లారగట్ట గాలి అలాగే వుంటుంది. శ్రీనివాసదేవ్ తలెత్తి చూశాడు. చుక్కల కదలిక తెలుసునతనికి. ఒకటి రెండు గంటల్లో తెల్లారిపోతుంది.మరి, అదిరాదు, మొన్ననే తెలిసినందుకు నిన్న మాటు కట్టేస్తే ఖచ్చితంగా దొరికిపోను. అవకాశం జారిపోయింది. నొచ్చుకున్నాడతను. నడుంకట్టు బిగువుగా, ఇబ్బందిగా వుంది. దానికి తోడు పిడిబాకు ఒర ఒరుసుకుంటోంది. చేయి పెట్టి నడుంకట్టుని కాస్త కదిపాడు. చప్పుడు కాకుండా వంగి మాటు అంచుమీద నుంచి కిందికి చూశాడు. తోటి వేటగాళ్ళిద్దరూ, ఒకేసారి తలెత్తి రాజుగారికేసి చూశారు. ఆ చీకటిలో వాళ్ళిద్దరి కళ్ళు జాలిగా, భయంగా కనిపించాయి. తల వెనక్కి లాక్కొని మళ్ళీ మామూలుగా కూర్చున్నాడు మాటులో. రాదల్చుకుంటే దానికి ఎంత సేపు. మెరుపులాగ రావచ్చు. మళ్ళీ ఆశ. ఒక్క షాట్ చాలు. మంచి నీళ్ళయినా అడక్కుండా చచ్చిపోతుంది. పులిని కొట్టి చాలా కాలం అయిపోయింది. ఈ సైజు పులి తిరగడం తక్కువే. అలాగ కూర్చున్నాడు. కారుకోడి కూసింది. తెల్లవారుజామున విచ్చుకునే ఏ కొండ పువ్వులు కళ్ళు తెరిచాయో గానీ చక్కని సువాసన నిండిన గాలితెర ఒకటి చెట్లని పలకరించుకుంటూ పోయింది. పిట్టలు లేచిపోతున్నాయి. కొండగొర్రె వేసిన వెలుతురు రెప్పలు ఆర్చుతోంది.కేక లీలగా వినిపిస్తోంది. అడివంతా నిద్ర లేచిపోతోంది. వెలుతురు రెప్పలు ఆర్చుతోంది.ఇంకరాదు! నిరాశతో నిట్టూర్చాడు. శ్రీనివాస్ దేవ్. నిద్ర దండగ. కారు దండుగ. ఎంతో సుఖంగా నిద్రపోవలసిన వాడికి కొండ చెట్ల మీద పడిగాపుల ఖర్మమేమి? వేట సరదా.ఎరగా చెట్టుకు కట్టి వుంచిన ఆవు దూడ ఇంకా అరుస్తోంది. అడివిని చూస్తే దానికి భయం వేసింది. చూస్తూ వుండగానే వెల్తురు ఎక్కువైంది. చెట్ల మధ్య నుంచి రేవులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి రాదులే అను కుని మంచె మీద నిల్చున్నాడు శ్రీనివాస్ దేవ్. ఒళ్ళు విరుచుకున్నాడు.“దిగుదాం” అన్నాడు శ్రీనివాసదేవ్. చిత్తం! అన్నారు తోటి వేటగాళ్ళు. శ్రీనివాసదేవ్ తుపాకీ మంచె మీదే వుంది.జాగ్రత్తగా మంచె దిగి చెట్ల కొమ్మలు పట్టుకుని దిగుతున్నాడు. “జాగర్తండీ... ఆ కొమ్మ పట్టుకుని కుడి కాలు ఆ తొర్ర ఒడ్డున పెట్టండి..” అన్నాడో తోటి వేటగాడు. “రైఫిల్ మంచె మీద నుంచి... జాగ్రత్తగా దించండి. లోడ్ చేసి వుంచేను సుమా... కొంపలు అంటుకుపోతాయి” అన్నాడు శ్రీనివాసదేవ్ చెట్టు దిగుతూ.'చిత్తం'. శ్రీనివాసదేవ్ కుడికాలు ముందు నేలని తాకింది. తరువాత ఎడమకాలు. చేతులు రెండు ఇంకా చెట్టుమానుని అంటి పెట్టుకుని వుండగానే 'గాండ్రు' మనే అరుపు వినబడింది. అంతసేపు ఎక్కడ ఉన్నదో గాని ఉరమని, కురవని పిడుగులాగ అతని మీదకి దూకింది. పెద్దపులి. తెల్లవారి వెలుగులో అది భయంకరమైన అందంతో మెరిసిపోతోంది. దాని కళ్ళూ కోరలూ మరీని. శ్రీనివాసదేవ్ చటాలున నిల్చున్న చోటునించి కొంచెం తప్పుకున్నాడు. పులి విసిరిన పంజా అతని భుజాన్ని రాసుకుంటూ చెట్టు మానుకి తగిలింది. శ్రీనివాసదేవ్ చటాలున ఆ పంజా అందుకున్నాడు. చెట్టు మొదటిని సందిట్లో పెట్టుకుని రెండో చేత్తో రెండో పంజా అందీసేడు. బలమంతా కేంద్రీకరించి, కాళ్ళు రెండో చెట్టు మొదటికి ఆన్చి తన్ని పెట్టి వెనక్కి లాగేడు. ఆ బలానికి ఆ ఊపుకి పులి తల వేగిస చెట్టు మొదటికి కొట్టుకుంది. అది ప్రళయ భీకరంగా గర్జించి గింజుకుంది. శ్రీనివాసదేవ్ బలమైన మనిషి పులి పంజాలు రెండూ అతని ఉక్కు పిడికిటిలో చిక్కుకుపోయాయి. ఆ పైన పులికీ, అతనికీ మధ్య బండివేగిస మానుంది. పంజాలు తన చేతిలోంచి జారిపోకుండా చూపుడు వేల్తో బొటన వేలు మరింత బిగించి పట్టుకున్నాడు. పులి చెట్ల ఆకులు కంపించి పోయేలాగ అరుస్తోంది.“... ఎవడో ఒకడు దిగండి... నా బొడ్లో బాకు దీసి దీన్ని పొడిచేయండి.. లేదా తుపాకీతో దాన్ని కాల్చేండి..." అని కేక వేశాడు శ్రీనివాసదేవ్ అరుస్తూనే తలెత్తి చూశాడు. తోటి వేటగాళ్ళిద్దరూ చెట్టుమీద కొమ్మల్ని అంటి పెట్టుకున్న కర్రిబల్లుల్లాగా పించారతని కంటికి. వాళ్ళిద్దరూ తుపాకులు ఎప్పుడో కిందపడేసి కొమ్మల్ని గట్టిగా వాటేసుకుని కళ్ళు మూసుకుని గజగజ వణికి పోతున్నారు.పులి వేస్తున్న కేకలకి హడలిపోయిన ఆవుదూడ కాలికి కట్టిన మోకు తెంపుకుని పుటాయించి పారిపోవడానికి యమయాతన పడుతోంది. అది తోక లేపి చెట్టు చుట్టూ పరిగెడుతోంది.పులి వెనుక కాళ్ళ మీద నిల్చుని నేలంతా తవ్వి పారేస్తోంది. ముందుకాళ్ళు విడిపించుకోవాలని అది తెగ ప్రయత్నిస్తోంది. శ్రీనివాసదేవ్ పళ్లు గట్టిగా బిగించి, చెయ్యి పట్టు తప్పిపోకుండా గట్టిగా దాని ముంగాళ్ళు పట్టుకునే వున్నాడు.“రేయ్.. వెధవల్లారా రండర్రా... వచ్చి దీన్ని చంపేయండి... నేను దీని ముందు కాళ్పు కదలకుండా పట్టేసుకున్నాను. మీకొచ్చిన భయం

S1 Ep 166'సచ్చి సాదించడం' - ఎండపల్లి భారతి గారు
'సచ్చిసాదించడం ' ఎండపల్లి భారతి గారు రాసిన ' ఎదారి బతుకులు' లోని కథ . ఈ కథలో వాళ్ళ పల్లెలో వుండే ఒక మూఢ ఆచారాన్ని గురించీ, దానివల్ల వాళ్ళ కుటుంబం పడిన ఇబ్బంది గురించి రాసారు భారతి గారు. ...............................................................................................................................................................................మాయత్తకు, మొగుడు ఉండి గూడా అందరి ముందరా ముండమోపి బతుకు బతకాల్సి వచ్చింది.మాది పెద్ద సంసారం. నాకు కొత్తగా పెండ్లయినబ్బుడు అందరం కూడా ఉండేవాళ్లం. మా ఇంట్లో మాయత్త, మా మామ, నేను, నా మొగుడు, మా తోడు కోడలు, మా బావ ఉండేవాళ్లం.నాకు ఒక కూతురు. మా బావకి గూడా ఒక కూతురు. బిడ్డలకి ఒక ఏడాది వయసు ఉంటాది....దినమ్మూ అట్లానే ఆపొద్దు గూడా నా మొగుడు, మా బావ ఇద్దరూ సేద్యంకాడికి పోయిరి. మా మామ ముసిలోడు. పనిచేయలేడు. ఆయప్ప ఒక మూల కుచ్చోని బిడ్డల్ని ఆడిచ్చుకుంటా ఉండాడు. నేను, మా తోడుకోడాలు తలా ఒకపని చేసి కూలికి పోయేదానికి పొద్దయిందని, అదరాబదరాగా మొగాలు కడిగేదానికి పొయిలో బొగెత్తి నోట్లో వేసుకుని దుద్దుకుంటా ఉంటిమి. మాకాడికి ముందే, మాయత్త మొగం కడిగి, అద్ది, గోడకు అతికిచ్చిన అద్దంలో మొగం చూసుకుంటా దాసరోళ్ల దగ్గర తీసుకున్న సునో డబ్బాలో పట్టెడు సునోను చూపుడేలుతో లోడుకుని గోరుమందం మొగానికి రుద్దుకునింది. నొస్టన వేలితో మైనం మెల్లించుకుని, అరచేతిలో వేసుకున్న ఎర్రకుంకాన్ని నడిమేలుతో ఎత్తుకుని అనపగింజంత ఎడం బొట్టు పెట్టుకుంటా ఉండాది. ఈ ముసిలిది ఏమి సొగసు పడతా ఉండాది. వయసులో ఇంకెట్ల ఉండిందో అనుకుంటా నేను నా పండ్లను పరపరా దుద్దు కుంటుండా.ఈలోపల మొగంపని చూసుకుని, మాయత్త తలకాయ నున్నంగా దువ్వి కొప్పేసింది. దానికితోడు మా ముసిలోడు ఇంటి ముందర దాసాని పువ్వు పూసుంటే పెరుక్కొచ్చి, ఇందే తలకాయలో పెట్టుకో అని ఇచ్చె. మాయత్త, దేవునికి పువ్వన్నా ఏమారతాది కాని తలకాయలో పువ్వు ఏమారదు. ఆయమ్మ మరిచిపోయినా మామామ గుర్తుచేసేవాడు, పువ్వు పెట్టుకోమని. ఆయమ్మ సొగసు ఉండేదే కదా అని నేను, మా తోడుకోడలు సంగటి తిని, పనికి పోయేదానికి దండెంమింద ఉండే పై గుడ్డల్ని బుజానేసుకుని, బిడ్డలకి పాలిచ్చి, వాళ్లరినీ ముసిలోళ్ల దగ్గర వదిలితిమి.నా కూతురు పాలు మానలేదు. చిన్న కలబందని రొమ్ములకి పూసుకున్నా గూడా అట్లే పాలు తాగే సేది. ఇంక నాకు వల్లకాక పాలిచ్చేసి బిడ్డల్ని బద్రంగా చూసుకోమని మా మామకి చెప్పేసి వాకిట్లోకి ఒక అడుగు పెడితిని.అంతలోకే చుట్టం వచ్చె, చెంబుతో నీళ్లిచ్చి నట్టింట చాపేసి కుచ్చోమంటిమి. ఆ చుట్టాన్ని మేమెరగం. ఆయప్ప “ఏమొద్దు, పలానాయన కాలమైపొయినాడు” అని మాయత్తకు చెప్పె. కాలం అయిపొయినాయప్ప మాయత్తకు తెలిసినట్లుంది. మాకు తెలీదు.అంతవరకు సంతోసంగా ఉండిన మాయత్తా మామా మొగాల్లో మబ్బు కమ్మేసింది. ఇద్దరూ నిరుజీవులై పోయిరి. వాళ్లను చూసి మేము గమ్మున అయితిమి. ఇంతకూ సచ్చిపొయినాయప్ప వీళ్లకి బాగా కావల్సినాయప్పో ఏమో అందుకే వీళ్లు వెతపడతుండారు అని అనుకుంటిని.కబురు తెచ్చినాయన మాయత్తతో మాట్లాడతా “సరేక్కా నేను ఊర్లో చానామందికి చెప్పల్ల, మన్నుపొద్దుకి చేరుకోవల్ల. వెనుకాముందు అయితే శవాన్ని ఎత్తరు" అని ఆయప్ప పోయె. కబురు చెప్పను వచ్చినోడు ఎంతదూరమన్నా పోనీ, వేళకి గుంటకాడకి చేరుకోవల్ల.ఆయప్ప అట్ల పోతానే మా ఇంట్లో చిన్నబిడ్డ అరుపులు తప్ప సద్దే లేదు. అంతా గమ్మునే వుండారు. ఇంతలో మా పక్కింటి పెద్దమ్మ వచ్చె. “ఏమ్మేవాడు కాలం అయిపొయినాడంట, ఏం చేద్దాము, పదే పోదాము, వాడు కట్టిన తాళి వాడికే తెంపల” అనింది మాయత్తతో.నేనుండుకుని అర్దంకాక, “ఏందమ్మా ఏం జరిగింది, ఎవరికి ఆయమ్మ తాళి తెంచేది" అని అడిగితి. ఒక పక్క మా మామ నెత్తిన చేతులు పెట్టుకుని కుచ్చో నుండాడు. నేను బలే నసుగుదాన్ని మా పెద్దమ్మ నడిగితి "కాదు పెద్దమా చచ్చిపోయినాయప్పనాకేమవుతాడు" అని.కాదే నా బట్ట ముండా, మీకేంగాడే వాడు. మీయత్తకు తొలీత బొట్టు కట్టినోడు. మీయత్తకు ఏడేండ్లబుడు వాళ్లమ్మ తమ్మునికిచ్చి పెండ్లి చేసి. వాడు మీయత్తని ఈదాబాదా పెడతా ఉంటే, ఆయన దగ్గిర ఇమడలేక వదిలేసి వచ్చేసింది. మల్లా మీ తాతను తగలాటం చేసుకునింది. లెక్క పకారం తొలీత బొట్టు కట్టినోడికి ముండమొయ్యల్ల" అనింది.నేను "అయ్యో ఇదెక్కడ న్యాయమమ్మ, ఎబుడో చిన్నబుడు నెరవాది కాకముందు పెండ్లైతే ఇబుడేందమ్మా ముండమోసేది. మా మామని పెండ్లి చేసుకుని ఇబ్బుటికి ఏ ఏబైయేండ్లో కావస్తా ఉండాది. అబుడు నింటి బిడ్డా పాపలను కని సంసారం చేసి, ఇబుడు ఆయప్ప ప్రాణంతో ఉంటే ఎట్లమ్మా వదిలేసి ముండ మోసేది" అంటిని.దానికి మా పెద్దమ్మ “అయ్యో కాదమ్మా, అట్ల ఒప్పుకోరు. ఎవరు తొలిత బొట్టు కడితే వాడు కట్టిన తాళి వానికే తెంపల్ల, లేదంటే మీ కుటుంబానికి మంచిదికాదు" అనింది.మామామ ఏమి జరగతాదో అని కుమిలిపోతా ఉండాడు. నిజమే కదా ఆయప్ప ప్రాణంతో ఉన్నెబుడే ముండ మోయల్లంటే ఆయప్పకి ఎంత బాదయితుంది.ఇంక అయిందెట్లా అయింది అని, ఇంట్లో వాళ్లు బాదపడుకుంటా ఆయమ్మని పిలుసుకుని పోతిమి. ఆడికి పొయినంక నాకు ఇంకా కొత్త కతలు తెల్సినాయి. ఆ సచ్చినోనికి, మాయత్త వచ్చేసినంక మాయత్తకి చెల్లిలివరసైన ఆమెను ఇచ్చి పెండ్లి చేసిరంట.తొలిది తోలు తెగదు, మలిది మాను తెగతాదా అన్నెట్లు ఆయమ్మ గూడా ఆయప్ప దగ్గిర సంసారం చేయకుండా యెల్లిపోయి వేరే ఆయనను పెండ్లి చేసుకుని నలుగురు బిడ్లకు | తల్లయింది. ఇబుడు బిడ్లకు పెండ్లిండ్లు అయినాయి. పెండ్లి చేసుకున్నాయన బతికే ఉండాడు.ఆయమ్మని గూడా ఇట్లనే తొలీత బొట్టు కట్టినోడికి ముండమొయ్యల్లని చెప్పినట్లుండారు. ఆయమ్మ వచ్చి నట్టింట కుచ్చోని ఉండాది. సచ్చిపోయినాయన, ఇద్దరు పెండ్లాలూ వదిలేసినంక ఇంకొకరి ఆలిని తోడుకొచ్చుకున్నాడు. ఈయప్పకు ఆయమ్మ కుదిరి నిలబడిపోయింది. ఆయమ్మా ఉండాది. ఆయమ్మ ఒగని ఆలి కాబట్టి, ఈయప్పకు ముండమోసే పనిలేదంట.మాయత్తని, రెండో ఆయమ్మని నట్టింట కుచ్చోబెట్టి, వచ్చిన అమ్మలక్కలు ఊరికే ఉంటారా, వాళ్లకు పసుపుకుంకుమ పూసి, గంగమ్మ బొట్టు పెట్టి, తల నిండా పూలు పెటి. ఆయప్పకు తెచ్చిన పూలారాలు వీళ్లకూ ఒకొకటి వేసి తలకాడ ఒకరిని, కాళ్లకాడ ఒకరిని కుచ్చోబెట్టిరి.ఆ ఊరు చిన్నూరు కాదు. సుమారు మున్నూరు పైన ఇండ్లుండాయి. వీళ్లకు పెండ్లిండ్లు అయ

S1 Ep 165Part ii - 'జాన్ పాల్ చేసిన బీరువా కథ'
ఈ'జాన్ పాల్ చేసిన బీరువా కథ', తన తండ్రి మరణం ద్వారా జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక గృహిణి గురించి. ఆమెకు సాంత్వన,ఎవరి వల్ల, ఎలా లభించింది అనేదే ఈ కథ. . వసుంధరాదేవి గారు రాసిన కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ కథను అరసం వారు ప్రచురించిన 'ఆర్.వసుంధరాదేవి కథలు' అనే పుస్తకంలో చదవొచ్చు.ఈ పుస్తకం కొనాలంటే - https://www.anandbooks.com/R-Vasundhara-Devi“టేపులో నీ పాట తీసేసి కొత్త పాట, జానీ మేరా నామ్ లోది. మంచిది పెట్టేశాడు. అన్న..." పాప చెప్పింది.గబగబా ముందు హాల్లోకి వెళ్ళాను. రేడియోలో వస్తున్న పాటని చాలా శ్రద్దగా టేప్ రికార్డర్లో రికార్డు చేసుకుంటున్నాడు బాబు.“ఎందుకని నా పాట తీసేశావ్?" అనడిగాను. "ఇష్" అన్నాడు నావేపు చూడకుండానే.రికార్డింగ్ అయ్యాక "మంచిపాట నాశనం చేసేశావమ్మా, రికార్డు చేసుకుంటున్నప్పుడు మాట్లాడేశావ్" అన్నాడు.నాపాట పోగొట్టి ఇంకా పైగాను! “అది పాతపాట. ఎవరిగ్గావాలి?" అన్నాడు.“నాకు కావాలి. అందుకేగదా రికార్డు చేసుకున్నాను. అది తియ్యొద్దని చెప్పానుకదా!" అన్నాను."అమ్మా అది రికార్డు చేసి సంవత్సరం అయింది. ఒక్కనాడు కూడా నీయంతట నీవు దాన్ని పెట్టుకొని వినలేదు. అది టేపులోవుంటే నీకేం, లేకుంటే నీకేం?... మంచిపాట వస్తున్నది. తొందరలో దాని మీద పెట్టేశాను" అన్నాడు. అంతటితో ఆ సంభాషణ అయిపోయిందని తాను కొత్తగా పెట్టుకున్న పాటలు వింటూ కూర్చున్నాడు.ఆ పాట పోయింది. ఇహరాదు. వాదించి లాభమేమిటి?నా పాట పోయినందుకు నాలో నిరాశ, ఎదో విలువైనది పోగొట్టుకున్నానన్న బాధ. ఆ పాట ఉన్నా నేను పెట్టుకోను. ఎప్పుడైనా ఎవరైనా వరుసలో పెడితే వినడమే. అది ఎవరికీ అక్కర్లేని పాతపాట. నాకు కావలసిన పాట. కావలసినదైనా నేను పెట్టుకోని పాట. అది ఆ టేపులోవుంటే నాకేదో తృప్తి. ఇప్పుడు అది పోయినందుకు బాధ.ఎందుకో ఆ పాట నాకు కావాలి. నాకు ఇష్టమైందని కాదు. కాని నాకు కావలిసింది. ఎందుకో అర్థం కాకపోయినా నాకు చాలా ముఖ్యమైనది.'ఆడేపాడే పసివాడ.... అది ఏ సినిమాలోదో, ఎవరు పాడినదో, దానిలో భావమేమిటో నాకు గుర్తులేదు. నాకు అక్కర్లేదు. ఆ పాట వింటూంటే నాలో, సంచలనం రేగుతుంది. ఉధృతంగా ఎగిరిపడుతున్న అలలతో, తుఫానునాటి సముద్రంలాగా అయిపోతుంది మనసు.....ఎంతో ఆశించినదాన్ని పొందలేక విషాదభరితమైన జీవితం కల ఒక అమ్మాయి. ఆనందానికి ప్రతిరూపంగా కనిపించిన పసివాణ్ణి చూచి, ఎంతో ఆనందంతో పాడుతుంది. ఆ పాట. పాట అయిపోయేసరికి పిల్లవాడు దుర్మరణం పాలౌతాడు. మళ్ళీ కటిక చీకటిలాంటి విషాదం ఆవరిస్తుంది...ఆనందానికి విషాదానికీ గల సరిహద్దులో, రెండూ ఒకటయ్యేచోట ఆ పాట. పాట వింటూంటే ఆనందమూ, దాని వెనుకనే పొంచివున్న విషాదమూ రెండూ ఒక్కసారిగా తీవ్రమౌతాయి. ఊపిరి సలుపనివ్వకుండా పెరిగి పెరిగి... ఉక్కిరిబిక్కిరై నలిగిపోతుంది. గుండె.ఆ పాత పాట నాకు యిష్టమని కాదు. నేను నా అంతట ఎప్పుడూ దాన్ని పెట్టుకోను. కాని నాలోనే అందరాని లోతుల్లో ఉండే సత్యానికి ప్రతినిధిగా అది అక్కడ ఉండటం చాలా ముఖ్యం....మనిషి మనసు చిత్రమైనది. ఆ పాట అక్కడ ఉన్నన్నాళ్ళూ నేను దాని గురించి తలచలేదు. కాని అది చెరిగిపోయేసరికి దాని గురించి యింతగా ఆలోచించుకున్నాను. అది మాటల్లేని మూగరాగమై నాలో నిలిచిపోయింది....ఇంట్లో ఇంకో బీరువా ఉంటే నాకు ముఖ్యమైనవి పిల్లల చేతుల్లో పడకుండా భద్రంగా దాచుకోవచ్చును. కావలసినవి జారిపోకుండా, మాసిపోకుండా, చెరిగిపోకుండా, పోకుండా దాచుకోగలను.ఈ యింట్లో నాకు ఓ బీరువా చాలా అవసరం!*********************'జాన్‌పాల్ బలే టక్కరివాడమ్మా"మా యింట్లో పనులు చేసి వెళ్తుండే పనివాళ్లు ముగ్గురూ ఒక్కరకంగానే చెప్పారు, జాన్ గురించి. ఆ విషయం నాకూ కొంచెం అనుభవమే. కాని 'తెలియని దేవతకన్నా తెలిసిన దయ్యం మేలు' అన్న సామెత ననుసరించి నడుస్తుంది నా బుద్ధి.బీరువాను రెడీమేడ్ గా కొనాలంటే పాతిక మైళ్ళవతల ఉన్న పట్నం వెళ్లి కావలసిన సైజులో ఆర్డరిచ్చి రావాలి. షాపువాళ్లు యిప్పుడిస్తాం, అప్పుడిస్తాం అంటుంటే అక్కడకు నాలుగుసార్లు వెళ్ళాలి. తర్వాత జాగ్రత్తగా పాక్ చేయించి దెబ్బ తగలకుండా బస్సుమీదనో లారీ మీదనో తీసుకురావాలి. ఇంతా చేశాక వాళ్లు రెండోరకం కొయ్యవేసిన చక్కగా పాలిష్ చేసి, ఘనంగా వార్నిష్ చేసి మసిపూసి చేసిన మారేడుకాయలాంటిది అంటగడితే ఎలాగా? చెక్క క్వాలిటీ మనం సరిగా కనుక్కోగలమా?అద్దంలా మెరిసే అందమైన బీరువా కావాలి. కాని దానికోసం ఎక్కువ యాతన పడడానికి ఓపికలేదు.అటువంటి సమయంలో జ్ఞాపకం వచ్చాడు జాన్‌పాల్.ఇదివరలో ఒకసారి పుస్తకాల షెల్పులు తయారు చెయ్యడానికి ఒచ్చినప్పుడు ఎన్నాళ్ళ బట్టో మా యింట్లో వుంటున్న బుక్ కేస్‌ను చూసి “ఇది. ఇంగ్లండులో దొరికే, పియానోలు చేసే వాల్నట్ కొయ్యతో చేసింది...అమ్మో! ఇదిక్కడ దొరికేదిగాదు...అమ్మా, ఇది ఫారిన్ చెక్క!' అన్నాడు. ఆ మాటలంటుంటే జాన్ మొహంలో కనిపించిన గాంభీర్యాన్ని, గౌరవభావాన్ని చూచి ఆ బుక్కేస్ గొప్పదనాన్ని ఊహించుకున్నాను. అల్లాగే ఒక పాత. బీరువాను చూడగానే 'ఇది బర్మాటేకులో ఒకటోరకం' అని చెబుతూ టేకుల్లో ఎన్నిరకాలో, వాటి చరిత్రలగురించి ఒక ఉపన్యాసంలాంటిది ఇచ్చాడు. కొయ్యల్లో ఇన్ని రకాలున్నాయని నాకు ఇది వరకు తెలియదు. జాన్ మీద చాలా గౌరవం కలిగింది నాకు. అద్దంలో మెరిసే అందమైన బీరువాను ఒకటోరకం టేకుతో తయారు చెయ్యగల సామర్థ్యం జాన్ కు ఉన్నది అనుకున్నాను.కాని ఈ జాన్ తో ఇతరవిధాలైన చిక్కులు వస్తాయి. ఇదివరలో బుక్ రాక్లు చేసినప్పుడు పట్నంవెళ్ళి సామాన్లు తెస్తానని కొయ్యలు మేకులూ అంటూ, రెట్టింపుధరలు వేసిన దొంగబిల్లులు తెచ్చి డబ్బు తీసుకున్నాడు. అవి ఫ్లయివుడ్ షీట్లు కనుక, వాటి ధరలు వేరుగా కనుక్కోగా, మోసం బయటపడింది. జాన్ అప్పటికే డబ్బు తీసుకున్నాడు. మళ్లీ పిలిపించి అడిగాము. కొట్లవాళ్ళ మోసాలను గురించి చిన్న ఉపన్యాసం చాలా 'ఇన్ఫర్మేటివ్'గా ఉండేది. ఒకటి ఇచ్చాడు. వడ్రంగిపనికి సంబంధించిన ఏ విషయం మీద మాట్లాడవలసి వచ్చినా ఇటువంటి మంచి ఉపన్యాసాలు ఇస్తాడు. అవి విన్న తర్వాత జాన్ మీదా, వడ్రంగి పనిమీదా కలిగిన గౌరవభావంతో నోరు మెదపలేము.పల్లెటూళ్ళలో ఏ పని జరగాలన్నా ఒక భగీరథ ప్రయత్నం కావాలి. ఒక ఇల్లు కట్టించుకోవాలంటే

S1 Ep 164Part I - 'జాన్ పాల్ చేసిన బీరువా కథ'
మనం చాలా ప్రేమించే మనుషులు మనకు దూరం అయితే, అస్తిత్వానికి అర్థం లేకుండా పోయినట్టు అన్పిస్తుంది. చుట్టూ వున్న ప్రపంచం అర్థరహితంగా అనిపిస్తుంది. సుప్రసిద్ధ రచయిత్రి వసుంధరాదేవి రాసిన ఈ'జాన్ పాల్ చేసిన బీరువా కథ', తన తండ్రి మరణం ద్వారా జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక గృహిణి గురించి. ఆమెకు సాంత్వన,ఎవరి వల్ల, ఎలా లభించింది అనేదే ఈ కథ. . వసుంధరాదేవి గారు రాసిన కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ కథను అరసం వారు ప్రచురించిన 'ఆర్.వసుంధరాదేవి కథలు' అనే పుస్తకంలో చదవొచ్చు.ముందుగా ఈ కథ గురించి - మధురాంతకం నరేంద్ర గారి మాటల్లో .ఈ పుస్తకం కొనాలంటే - https://www.anandbooks.com/R-Vasundhara-Devi“టేపులో నీ పాట తీసేసి కొత్త పాట, జానీ మేరా నామ్ లోది. మంచిది పెట్టేశాడు. అన్న..." పాప చెప్పింది.గబగబా ముందు హాల్లోకి వెళ్ళాను. రేడియోలో వస్తున్న పాటని చాలా శ్రద్దగా టేప్ రికార్డర్లో రికార్డు చేసుకుంటున్నాడు బాబు.“ఎందుకని నా పాట తీసేశావ్?" అనడిగాను. "ఇష్" అన్నాడు నావేపు చూడకుండానే.రికార్డింగ్ అయ్యాక "మంచిపాట నాశనం చేసేశావమ్మా, రికార్డు చేసుకుంటున్నప్పుడు మాట్లాడేశావ్" అన్నాడు.నాపాట పోగొట్టి ఇంకా పైగాను! “అది పాతపాట. ఎవరిగ్గావాలి?" అన్నాడు.“నాకు కావాలి. అందుకేగదా రికార్డు చేసుకున్నాను. అది తియ్యొద్దని చెప్పానుకదా!" అన్నాను."అమ్మా అది రికార్డు చేసి సంవత్సరం అయింది. ఒక్కనాడు కూడా నీయంతట నీవు దాన్ని పెట్టుకొని వినలేదు. అది టేపులోవుంటే నీకేం, లేకుంటే నీకేం?... మంచిపాట వస్తున్నది. తొందరలో దాని మీద పెట్టేశాను" అన్నాడు. అంతటితో ఆ సంభాషణ అయిపోయిందని తాను కొత్తగా పెట్టుకున్న పాటలు వింటూ కూర్చున్నాడు.ఆ పాట పోయింది. ఇహరాదు. వాదించి లాభమేమిటి?నా పాట పోయినందుకు నాలో నిరాశ, ఎదో విలువైనది పోగొట్టుకున్నానన్న బాధ. ఆ పాట ఉన్నా నేను పెట్టుకోను. ఎప్పుడైనా ఎవరైనా వరుసలో పెడితే వినడమే. అది ఎవరికీ అక్కర్లేని పాతపాట. నాకు కావలసిన పాట. కావలసినదైనా నేను పెట్టుకోని పాట. అది ఆ టేపులోవుంటే నాకేదో తృప్తి. ఇప్పుడు అది పోయినందుకు బాధ.ఎందుకో ఆ పాట నాకు కావాలి. నాకు ఇష్టమైందని కాదు. కాని నాకు కావలిసింది. ఎందుకో అర్థం కాకపోయినా నాకు చాలా ముఖ్యమైనది.'ఆడేపాడే పసివాడ.... అది ఏ సినిమాలోదో, ఎవరు పాడినదో, దానిలో భావమేమిటో నాకు గుర్తులేదు. నాకు అక్కర్లేదు. ఆ పాట వింటూంటే నాలో, సంచలనం రేగుతుంది. ఉధృతంగా ఎగిరిపడుతున్న అలలతో, తుఫానునాటి సముద్రంలాగా అయిపోతుంది మనసు.....ఎంతో ఆశించినదాన్ని పొందలేక విషాదభరితమైన జీవితం కల ఒక అమ్మాయి. ఆనందానికి ప్రతిరూపంగా కనిపించిన పసివాణ్ణి చూచి, ఎంతో ఆనందంతో పాడుతుంది. ఆ పాట. పాట అయిపోయేసరికి పిల్లవాడు దుర్మరణం పాలౌతాడు. మళ్ళీ కటిక చీకటిలాంటి విషాదం ఆవరిస్తుంది...ఆనందానికి విషాదానికీ గల సరిహద్దులో, రెండూ ఒకటయ్యేచోట ఆ పాట. పాట వింటూంటే ఆనందమూ, దాని వెనుకనే పొంచివున్న విషాదమూ రెండూ ఒక్కసారిగా తీవ్రమౌతాయి. ఊపిరి సలుపనివ్వకుండా పెరిగి పెరిగి... ఉక్కిరిబిక్కిరై నలిగిపోతుంది. గుండె.ఆ పాత పాట నాకు యిష్టమని కాదు. నేను నా అంతట ఎప్పుడూ దాన్ని పెట్టుకోను. కాని నాలోనే అందరాని లోతుల్లో ఉండే సత్యానికి ప్రతినిధిగా అది అక్కడ ఉండటం చాలా ముఖ్యం....మనిషి మనసు చిత్రమైనది. ఆ పాట అక్కడ ఉన్నన్నాళ్ళూ నేను దాని గురించి తలచలేదు. కాని అది చెరిగిపోయేసరికి దాని గురించి యింతగా ఆలోచించుకున్నాను. అది మాటల్లేని మూగరాగమై నాలో నిలిచిపోయింది....ఇంట్లో ఇంకో బీరువా ఉంటే నాకు ముఖ్యమైనవి పిల్లల చేతుల్లో పడకుండా భద్రంగా దాచుకోవచ్చును. కావలసినవి జారిపోకుండా, మాసిపోకుండా, చెరిగిపోకుండా, పోకుండా దాచుకోగలను.ఈ యింట్లో నాకు ఓ బీరువా చాలా అవసరం!*********************'జాన్‌పాల్ బలే టక్కరివాడమ్మా"మా యింట్లో పనులు చేసి వెళ్తుండే పనివాళ్లు ముగ్గురూ ఒక్కరకంగానే చెప్పారు, జాన్ గురించి. ఆ విషయం నాకూ కొంచెం అనుభవమే. కాని 'తెలియని దేవతకన్నా తెలిసిన దయ్యం మేలు' అన్న సామెత ననుసరించి నడుస్తుంది నా బుద్ధి.బీరువాను రెడీమేడ్ గా కొనాలంటే పాతిక మైళ్ళవతల ఉన్న పట్నం వెళ్లి కావలసిన సైజులో ఆర్డరిచ్చి రావాలి. షాపువాళ్లు యిప్పుడిస్తాం, అప్పుడిస్తాం అంటుంటే అక్కడకు నాలుగుసార్లు వెళ్ళాలి. తర్వాత జాగ్రత్తగా పాక్ చేయించి దెబ్బ తగలకుండా బస్సుమీదనో లారీ మీదనో తీసుకురావాలి. ఇంతా చేశాక వాళ్లు రెండోరకం కొయ్యవేసిన చక్కగా పాలిష్ చేసి, ఘనంగా వార్నిష్ చేసి మసిపూసి చేసిన మారేడుకాయలాంటిది అంటగడితే ఎలాగా? చెక్క క్వాలిటీ మనం సరిగా కనుక్కోగలమా?అద్దంలా మెరిసే అందమైన బీరువా కావాలి. కాని దానికోసం ఎక్కువ యాతన పడడానికి ఓపికలేదు.అటువంటి సమయంలో జ్ఞాపకం వచ్చాడు జాన్‌పాల్.ఇదివరలో ఒకసారి పుస్తకాల షెల్పులు తయారు చెయ్యడానికి ఒచ్చినప్పుడు ఎన్నాళ్ళ బట్టో మా యింట్లో వుంటున్న బుక్ కేస్‌ను చూసి “ఇది. ఇంగ్లండులో దొరికే, పియానోలు చేసే వాల్నట్ కొయ్యతో చేసింది...అమ్మో! ఇదిక్కడ దొరికేదిగాదు...అమ్మా, ఇది ఫారిన్ చెక్క!' అన్నాడు. ఆ మాటలంటుంటే జాన్ మొహంలో కనిపించిన గాంభీర్యాన్ని, గౌరవభావాన్ని చూచి ఆ బుక్కేస్ గొప్పదనాన్ని ఊహించుకున్నాను. అల్లాగే ఒక పాత. బీరువాను చూడగానే 'ఇది బర్మాటేకులో ఒకటోరకం' అని చెబుతూ టేకుల్లో ఎన్నిరకాలో, వాటి చరిత్రలగురించి ఒక ఉపన్యాసంలాంటిది ఇచ్చాడు. కొయ్యల్లో ఇన్ని రకాలున్నాయని నాకు ఇది వరకు తెలియదు. జాన్ మీద చాలా గౌరవం కలిగింది నాకు. అద్దంలో మెరిసే అందమైన బీరువాను ఒకటోరకం టేకుతో తయారు చెయ్యగల సామర్థ్యం జాన్ కు ఉన్నది అనుకున్నాను.కాని ఈ జాన్ తో ఇతరవిధాలైన చిక్కులు వస్తాయి. ఇదివరలో బుక్ రాక్లు చేసినప్పుడు పట్నంవెళ్ళి సామాన్లు తెస్తానని కొయ్యలు మేకులూ అంటూ, రెట్టింపుధరలు వేసిన దొంగబిల్లులు తెచ్చి డబ్బు తీసుకున్నాడు. అవి ఫ్లయివుడ్ షీట్లు కనుక, వాటి ధరలు వేరుగా కనుక్కోగా, మోసం బయటపడింది. జాన్ అప్పటికే డబ్బు తీసుకున్నాడు. మళ్లీ పిలిపించి అడిగాము. కొట్లవాళ్ళ మోసాలను గురించి చిన్న ఉపన్యాసం చాలా 'ఇన్ఫర్మేటివ్'గా ఉండేది. ఒకటి ఇచ్చాడు. వడ్రంగిపని

S1 Ep 161'ద్రణేవుడు' పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథ
హర్షణీయంలో మీరు వినబోతున్న కథ పేరు 'ద్రణేవుడు ' . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ' పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ' అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన వేలూరి కౌండిన్య గారికి కృతజ్ఞతలు.ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన సుబ్బరామయ్య గారు , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు కూడా.1938 సంవత్సరంలో గుంటూరు లో జన్మించిన ఆయన తన జీవిత కాలంలో 350కి పైగా కథలు , 8 నవలలు రాసారు. ఆయన రచనలు ఎన్నో ఇంగ్లీష్ , రష్యన్ తదితర భాషల్లోకి అనువదించబడ్డాయి. ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అవార్డు తో బాటు ఆయన రచనలు ఎన్నో పురస్కారాలు అందుకున్నాయి.ఈ పుస్తకం కొనడానికి , లింక్ పై క్లిక్ చెయ్యండి - http://bit.ly/3qJcYCzద్రణేవుడు:సమాచార విస్పోటం అనీ, పోటీ అనీ అనేక నామధేయాలతో ఆధునిక యుగం, విషయ పరిజ్ఞానం ప్రధాన లక్షణంగా శోభిల్లుతున్నది. ఎవడికి ఎక్కువ వివరాలు తెలుసునో జ్ఞాని కింద లెక్క. రకరకాల టెస్టులు, క్విజ్జులూ,, కెబిసిలు ఇవన్నీ యువతరం సమాచార సేకరణ సామర్ధ్యాన్ని గురించే. నాలుగు పేపర్లు తిరగేసినవాడు సాయంకాలం నలుగురి ముందు నాలుగు విషయాలు ఉగ్గడిస్తే వాణ్ణి జ్ఞాని అనేస్తారు. మనసును అత్యవసర పరిజ్ఞానంతో కాక, అత్యవసర విషయ పరిజ్ఞానంతో కూడా నింపడం, అట్లా కొందరి కంటే కొన్ని ఎక్కువ విషయాలు తెలిసి జ్ఞాపకముంచుకున్న వాణ్ణి బిరుదులతో గౌరవించడం జరుగుతున్నది. వాడెవడో అంత బతుకూ బతికి ఇంగువంటే ఏమిటో తెలుసుకోకుండా, తెలుసుకునే అవకాశం లేకుండగానే దాటిపోయాడు.ఇక ఈ మనిషి మరో విచిత్రం . రైల్లో తారసపడ్డాడు. “నిన్నేనయ్యా అడుగుతున్నది?” అన్నాడాయన రెండోసారి పెద్దగా.అంతకుముందు వేరొక రైలు దడదడ మని శబ్దం చేస్తూ వెళ్తుంటే ఈయన అన్నదేమీ నాకు వినిపించలేదు.ఇప్పుడు “ఏమిటి?” అని అడిగాను.ఆయనకు అరవై ఏళ్లు దాటే వుంటాయి. జుట్టు బాగా తెల్లబడి చెంపలు పెరిగి వున్నాయి.“చూడు! నువ్వు చాలా చదివి వుంటావు కదా. ద్రణేవుడు అనే పేరు, పాత్ర ఎక్కడైనా తగిలిందా? పురాణాల్లో కాని కథల్లో కాని... ఎక్కడైనా....”నేను లేదంటూ తల అడ్డంగా వూపాను. “అలాగా?” అన్నాడాయన నిరాశగా.తర్వాత తన ఎదురుగా కిటికీ పక్కన కూర్చుని ఏదో చదువుకుంటున్న నడివయస్సు వ్యక్తిని కూడా ఇదే ప్రశ్న అడిగి అతడు లేదనగానే హతాశుడై నిట్టూర్చి నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు.రైలెక్కినప్పుటినుంచి చూస్తున్నాను.... ఈ మనిషి వాలకం చిత్రంగా వుంది. ఒక పొడుగాటి లావాటి పుస్తకం వొళ్లో పెట్టుకుని వుండి వుండి అందులో ఏదో రాస్తున్నాడు. రైలు ఆగిన ప్రతి స్టేషను పేరు ఇంగ్లీషు తెలుగు రెండు భాషల్లోనూ వరసగా రాసి పెట్టుకుంటున్నాడు. కాసేపాగి మళ్లీ -"అంతా బాగానే వుంది. ఈ ద్రణేవుడెవరో ఎక్కడివాడో వివరాలేమాత్రం తెలిసి చావడం లేదు. ఎందరినో అడిగాను. ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. వివరం ఎప్పటికైనా తెలుస్తుందో లేదో...." అన్నాడు.“ఎప్పుడో ఒకప్పుడు తెలియకపోదులెండి. ఎవరో ఒకరు చెప్పకపోరు” అన్నాను ఏమీ తోచనివాడిలా.“పదేళ్ల నుంచి తెలియని విషయం ఎప్పుడు తెలుస్తుందో... అసలు తెలియనే తెలియదో"అంటూ నిట్టూర్చాడు.నేను చాలా సేపటి నుంచి మధనపడుతున్నాను. 'ఈ మనిషి ఎవరా?” అని. మనసు లోపలి పొరలలో ఎక్కడో ఒక మూల ఈ వ్యక్తి వివరాలు భద్రంగానే వున్నాయి. అయితే స్పష్టంగా ఉపరితలానికి రావడంలేదు. -“ఇలా రైల్వేస్టేషన్ల పేర్లూ ఇంకా ఏవేవో విషయాలు రాస్తున్నారు కదా ఈ పుస్తకంలో.... ఎందుకీ వివరాలన్నీ?” అని అడిగాను. -ఆయన కళ్లలో మెరుపు. “ఎందుకేమిటి? ఇదంతా నాలెడ్జి... ఇన్ఫర్మేషన్... ముందు తరాలవారికి అందించాల్సిన బాధ్యత మనదే కదా. మన తాత ముత్తాతలు 'తమకెందుకులెమ్మ'ని ఊరుకుని వుంటే మనకివ్వాళ ఇంత ఇన్ఫర్మేషన్ దొరికేదా? ఇన్ని విషయాలు తెలిసేవా? సమాచారం, విషయపరిజ్ఞానం వుంటేనే మనిషి మనిషవుతాడు. లేకపోతే మా ఫ్రెండులాగా అతి చిన్న విషయం కూడా తెలియకుండా చచ్చిపోతాడు. పదేళ్ల కిందట మావాడొకడు ఇంగువ అంటే ఏమిటో తెలియకుండానే చచ్చిపోయాడు. అప్పటినుంచి నేను ఇట్లా విసుగనేది లేకుండా విషయ సేకరణ చేస్తున్నాను. అదీ యిదీ అని ఏమీ లేదు. చూసినదీ విన్నదీ అంతా. రికార్డు చేసి పెట్టడమే”ఇప్పుడు నా మనసులో మెరుపు మెరిసినట్టయింది. చాలా ఏళ్ల క్రిందట సంగతి... మాఇంటి పక్కన నడివయసు దాటిన ఒక వ్యక్తి గుండెజబ్బుతో బాధపడి రెండు మూడు రోజులు అపస్మారక స్థితిలో వుండి చివరకు పోయాడు. అప్పుడీయన అక్కడికి వచ్చాడు.మనిషి పోగానే హతాశుడై వెనువెంటనే తిరిగి వెళ్లిపోయాడు. ఇప్పుడు సరిగ్గా చూస్తుంటే పోలికలు బయటపడటం మొదలై ఆ వ్యక్తి ఇతడే అని నిర్ధారించుకున్నాను. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత రైల్లో తారసపడ్డాడు. చేతిలో పొడవాటి పుస్తకంతో..ఆయన మళ్లీ నా వైపు తిరిగి 'ఈ ద్రణేవుడనేవాడు ఎవడో నాకు తెలియదు. ఎప్పుటివాడో ఎక్కడివాడో తెలియదు. ఎందరినో అడిగాను. ఎవరూ చెప్పలేకపోయారు” అన్నాడు దిగులుగా.“అసలా పేరు గలవాడు ఎవరూ లేరేమో” అన్నాను నేను. "కాదు... వుండే ఉంటాడు. మనకి తెలియనంతమాత్రంలో లేడని నిర్ణయిస్తే ఎలా?తెలుసుకోవాలి. దానికి వేరే మంత్రం ఏమీలేదు. కనపడిన వారినల్లా అడుగుతూపోవడమే”.ఈ ధోరణి ఇంకా కొనసాగేదేమో గాని దిగవలసిన స్టేషను సమీపించడం వల్ల నేను హడావిడిగా లేచి పైనున్న సంచి అందుకుని, దిగేందుకు ఉద్యుక్తుణ్ణయినాను. అంతలో ఆయన కూడా లేచి పెన్ను ముడిచి జేబులో వుంచుకుని, పుస్తకం మూసి, చంకలో పెటుకుని రైలు దిగేందుకు సన్నద్ధుడయ్యాడు.. ఆశ్చర్యమేమంటే ఆయన స్టేషను బయట కూడా నా వెంటనే నడిచాడు. దగ్గర యిల్లు కావడం వల్ల నేను నడక సాగిస్తే తనూ నా వెంటనే కాకపోతే పక్కనే నడిచాడు. నడుస్తున్నంత సేపూ మాట్లాడుతూనే ఉన్నాడు.తర్వాత మా వీధిలోనే ముందుగా ఒక యింటిముందు ఆగి “ఇదే మా యిల్లు. మా అబ్బాయి యిల్లు. నేను ఇప్పుడే వొస్తున్నానిక్కడికి. మా వూరు వదిలి వొచ్చేస్తున్నాను. ఇక్కడే వుంటానిక. నా సామాన్లు - అంటే ఎక్కువ భాగం నా పుస్తకాలు - నిన్ననే వచ్చాయి ఇక్కడికి" అన్నాడు.‘వివేకానంద మీ అబ్బాయా? మేమిద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాము. మా యిల్లు వీధి చివర" అన్నాను. నేనూ.“మంచి

S1 Ep 159పాఠశాల విద్యార్థులకు , తెలుగు సాహితీవేత్తలను పరిచయం చెయ్యడం ఎలా ?
ఎనిమిదేళ్ల కిందట , , అనంతపూర్ జిల్లాకి చెందిన తెలుగు అధ్యాపక దంపతులు, శ్రీ శ్రీనివాసులు గారు , శ్రీమతి యశోద గారు, అందరం మరిచి పోతున్న ప్రసిద్ధ తెలుగు కవులనీ , రచయితలనీ,ముఖ చిత్రాలతో , వివరాలతో పాఠశాలలో చదివే విద్యార్థులకు, పరిచయం చెయ్యాలని పూనుకున్నారు.దానికి ఒక మార్గం ఆలోచించారు. కొన్ని రోజుల తర్వాత వారి అబ్బాయి షణ్ముఖ కూడా, ఆ ప్రయత్నానికి చేయూతనిస్తూ , హర్షిత పబ్లికేషన్స్ ని ప్రారంభించాడు.వాళ్ళ జర్నీ ని ఈ హర్షణీయం ఎపిసోడ్లో మనం విందాం.ఈ ప్రయత్నంలో మీరు గూడ పాలు పంచుకోవాలంటే, క్రింది అడ్రస్, ఫోన్ నంబర్ ద్వారా హర్షిత పబ్లికేషన్స్ షణ్ముఖ గారిని సంప్రదించండి.Harshitha Publications, , 1-1189-94, NGO's colony, Kadiri, Ananthapuram District, Andhra Pradewsh, India - 515591Mobile Number: 8885818687, (www.harshithapublications.com)This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 158హర్ష రాసిన ‘ఎండమావి’ – 'సారంగ' పత్రిక నుంచి!
ఈ కథ ‘ ఎండమావి’ హర్ష రాసింది , సారంగ’ వెబ్ మ్యాగజైన్ లో ప్రచురితమైంది.కథ చదవడానికి – https://magazine.saarangabooks.com/%e0%b0%8e%e0%b0%82%e0%b0%a1%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf/‘హర్షణీయం’ పాడ్‌కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)హర్షణీయం కు సబ్ స్క్రైబ్ చెయ్యడానికి [email protected] కు మెయిల్ లేదా ‘77807 43545 ‘ అనే నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించండిThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 157ఎండపల్లి భారతి గారి 'ఎదారి బతుకులు' పై ప్రముఖ రచయిత ఆర్ ఎం ఉమామహేశ్వర రావు గారి సమీక్ష!
ఎండపల్లి భారతి గారి 'ఏదారి బతుకులు' పై ఆర్ ఎం ఉమామహేశ్వర రావు గారి సమీక్ష ను ఈ ఎపిసోడ్ లో వినవచ్చు.ఉమామహేశ్వర రావు గారికి హర్షణీయం కృతజ్ఞతలు.'ఎదారి బతుకులు పుస్తకం కొనడానికి ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి. http://bit.ly/3elxpDjThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 155'నారింజ రంగు సిరా మరకలు' పార్ట్ II -కథా -సమీక్ష
ఈ ఎపిసోడ్లో , 'నారింజ రంగు సిరా మరకలు ' కథ గురించి , లాయర్, సామాజిక కార్యకర్త అరుణాంక్ లత గారు, రచయిత్రి, మానస ఎండ్లూరి గారు, రచయితలు అరిపిరాల సత్యప్రసాద్ గారు, వెంకట్ శిద్ధా రెడ్డి గారు మాట్లాడతారు.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 154'నారింజ రంగు సిరా మరకలు' - మహి బెజవాడ ! పార్ట్ - I
రచయిత పరిచయం:వాక్యాలనూ రంగులనూ జమిలీగా సాధన చేస్తున్న రచయిత. స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. పుట్టింది 1981లో. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసి మెడికల్ ఫార్మసీ నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆర్షియో క్రియేటివ్ ఏజెన్సీ ద్వారా పబ్లిసిటీ వర్క్ చేస్తున్నారు. డాక్యుమెంటరీలు తీస్తుంటారు. ఇప్పటికి ఏడెనిమిది కథలు రాశారు. 'డెడ్ మాన్ గోయింగ్ టు సింగ్' కథలో భిన్నమైన శిల్పంతో ఆకట్టుకున్నారు. 'ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇన్నర్ వరల్డ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దానిని విజువలైజ్ చేయడానికి రాస్తే బాగుంటుందని రాస్తున్నాను' అంటారు.'నారింజ రంగు సిరా మరకలు', ఒక విలక్షణమైన కథ. 'అస్తిత్వ వేదన' ముఖ్యాంశం గా వచ్చిన కథలు వున్నప్పటికీ, రాసిన పద్థతి వల్ల ఈ కథ ప్రత్యేకతను సంతరించుకుంది. కథ చాలా మటుకు విజువల్స్ ప్రెజెంట్ చేస్తూ, సింబాలిక్ గా రాస్తూ వస్తారు రచయిత. కథంతా భావగర్భితంగానే ఉంటుంది.కొన్ని కథలు ఒక ప్రత్యేకమైన అనుభూతిని మిగిలిస్తే, కొన్ని కథలు ఆలోచింప జేస్తాయి. ఈ రెంటిని సాధించగలిగారు మహి ఒకే కథలో.ఆడియో పార్ట్ 1 లో , కథను మీరు వినవచ్చు.ఆడియో పార్ట్ 2 లో , కథ గురించి , లాయర్, సామాజిక కార్యకర్త అరుణాంక్ లత గారు, రచయిత్రి, మానస ఎండ్లూరి గారు, రచయితలు అరిపిరాల సత్యప్రసాద్ గారు, వెంకట్ శిద్ధా రెడ్డి గారు మాట్లాడతారు.‘నారింజ రంగు సిరా మరకలు’in a highly disturbed state of mind. అతను మానసికంగా చాలా అలజడికి గురవుతున్నాడు. అసలేం జరిగింది ఇతనికి?తెల్లని గోడల మధ్య పుస్తకాల గుట్టలు. రాత్రంతా నిద్దురపోడు. అతను దేనికోసమో తపిస్తాడు. ఏదో దొరకని దానికోసం వెతుకుతుంటాడు. ఆ వెతుకు లాటలో భాగంగా చదువుతుంటాడు. చాలా దూరం చదువుతుంటాడు. పగలూ రాత్రి కనబడని దూరం చదువుతుంటాడు. అంత దూరం చదివి, రాయడమేమజిలీగా పెట్టుకుంటాడు. మళ్లీ పగలూ రాత్రి కనబడనంత దూరం రాస్తాడు. మళ్లా వెతకడం మొదలుపెడతాడు. చరిత్ర, పాలిటిక్స్, ఫిక్షన్- ఒకటని కాదు. రోజూ ఇదే పనిగా పెట్టుకుంటాడు. ఇవన్నీ చూస్తూ ఒక మూలగా ఓల్డ్ స్మగ్లర్ బాటిల్ పై గుబురు గడ్డం ముసలివాడు సాక్షిగా వుంటాడు. ఈ రాసిన కాగితాలన్నీ అచ్చుకు పోతాయి. పత్రికలవుతాయి, కరపత్రాలవుతాయి. కానీ చదివిన పుస్తకాలన్నీ తన బుర్రలో శిథిలమవుతాయి. చరిత్ర చదివి బాధపడతాడు. కోపం తెచ్చుకుంటాడు. తనలో తాను మథనపడతాడు. చివరికి కథ చెప్పాలంటాడు. అతడు కథ భలే చందంగా చెబుతాడు. తనకిష్టమైన వెన్నెల రాత్రులలో దగా చేసి రాయబడ్డ మన గతాలను ఆ నక్షత్రాల సాక్షిగా చెబుతాడు. మనం మనం కాదు. ఎవరి కోసమో రాయబడ్డ చరిత్ర. చరిత్రను తిరగరాయాలి. మన గురించి మనమే రాసుకోవాలి అంటాడు.Not a rare case. But sounds strange.మొదట్లో నాకూ వింతగా అనిపించింది. డిప్రెషన్ అనుకున్నాను. కానీ అనుకోకుండా మారిపోయాడు. ఇప్పుడు అన్నింటికీ భయం భయంగా వున్నాడు.తనలో తనే వున్నాడు. ఈ లోకంతో పని లేనట్టు తన రూమ్ నుండి బయటకు రావట్లేదు. తన బులుగు రంగు జేబురుమాలును చేతిలోనే వుంచుకుంటున్నాడు. రాత్రుళ్లు గట్టిగా అరుస్తున్నాడు. ఎవరో తన మీద నిఘా పెట్టారంటూ మంచం కింద దాక్కుంటున్నాడు. కానీ చదవడం ఆపలేదు. రోజూ పేపర్ చదువుతున్నాడు. తన పుస్తకాలు చదువుతాడు.కానీ రాయట్లేదు.రాయడానికి భయం అడ్డుపడుతుంది. కానీ రాస్తున్నాడు. ఎవరికీ కనబడకూడదని రాసిన కాయితాలన్నీ అటక పైన వున్న పాత ట్రంకె పెట్టెలో పెట్టి తాళం వేస్తున్నాడు. అప్పుడప్పుడు తన బులుగు రంగు చేతిగుడ్డను ముఖంపై కప్పుకుంటాడు. ఏడుస్తాడు. ఇదంతా ఆ గుబురు గడ్డం ముసలి మనిషి చుస్తూవుంటాడు.ఇలాగే వుంటే అతని పరిస్థితి ఏంటి డాక్టర్?It all depends. ఈ అలజడి ఎక్కువైపోయి ఆవేశాన్ని కూడా తట్టుకోలేని స్థితిలో ఆత్మహత్యకి దారి తీయడానికి అవకాశం వుంది. ఏమీ జరగకుండానే ఇలానే పిచ్చిలోకి జారిపోయే ప్రమాదమూ వుంది.అతను తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశం లేదా? దీనికి ఏ రకమైన ట్రీట్ మెంట్ లేదా డాక్టర్?ట్రీట్ మెంట్ అంటే, ఇది మందులతో మాత్రమే నయం కాని స్థితి. ఇది మనసుతో చెయ్యా ల్సిన వైద్యం . But it's not a hopeless condition. అయితే అతన్ని మాములు మనిషిని చేసే ప్రయత్నం కేవలం ఒక్కరికే సాధ్యం.ఎవరు డాక్టర్?తనే! Yes he only can cure himself. ఈ పరిసరాలు ఇవీ మారి తన కిష్టమైన చోటుకు తీసుకెళ్లి తనకు అడ్డు చెప్పకుండా తను ఇష్టపడే పనులు తనను చెయ్యనివ్వండి. తను ఏం మాట్లాడతాడో మాట్లాడనివ్వండి. తనలో వుండే ఇమేజెస్ ని మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తన మాట మీరు వింటున్నారు అంటే తనలో కూడా ఏదైనా మార్పు రావొచ్చు. But it's a long shot!Ok, Thank You, Doctor!గ్త్ ఎఫెకు పెట్టాను.మనం నీకిష్టమైన కన్యాకుమారి వెళ్తున్నాం. ఢిల్లీ టూ ఆగ్రా, ఆగ్రా టూ నాగపూర్, నాగ్ పూర్ టూ హైదరాబాద్, హైదరాబాద్ టూ బెంగుళూర్, బెంగుళూర్ టూ కన్యాకుమారి. On the road! అదీ ప్లాన్. వింటున్నావా?ఇప్పుడెందుకు ఇదంతా? నేను బాగానే వున్నా కదా?Yes! You are absolutely fine. జస్ట్ నాకు నీతో కన్యాకుమారి చూడా లని వుంది. వెళదాం. నీకు కాస్త ఛేంజ్ గా వుంటుంది కదా. ఎప్పుడూ ఆ నాలుగు గోడల మధ్య ఫ్లాట్ లో లోన్లీగా....లోన్లీగానా? Never! I like to be alone. అంతే!సరే. సరే. నువ్వు నాతోపాటు కన్యాకుమారి వస్తున్నావ్ అంతే. ఇది ఫిక్స్. రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదాం. ఎక్కువ ఆలోచించకుండా త్వరగా పడుకో. Bye.ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు అతనికి. ఏదో వెతికాడు. పుస్తకాల షెల్ఫ్ నుండి Hard Bound పుస్తకం ఒకటి తీశాడు. అందులో కొన్ని పేజీలు వెతికి చదివాడు. ఆ పేజీలను చించి బులుగు రంగు రుమాలులో పెట్టి ముడి కట్టాడు. ఇంకా ఏదో పుస్తకం కోసం వెతికాడు. దొరికింది. ఆ అట్టపై ముక్కు విరిగిన శిల్పంబొమ్మ వెక్కిరిస్తునట్టుగా వుంది. దాన్ని చించి ఆ రుమాలులో మూటకట్టాడు. భయంగా ఒక కాగితంపై రాస్తున్నాడు.మనుషులు: రంగు-నలుపు-తెలుపుచరిత్ర: వక్రీకరణ-రాసినవాడు ముక్కు కొట్టేసిన శిల్పం: ఎద్దు-గిట్టలు-నురగప్రాంతం: ఉత్తరం దక్షిణం రాజ్యం: హత్య-ఆత్మహత్య-దాడి-నిఘా థి తాన్ని కూడా తన wు జురుమలులో మూటకట్టాడు. ఆ రాత్రి నిద్రపోలేదు. అలాగే కూర్చొని వున్నాడు. ఎదురుగా గుబురు గడ్డం ముసలి వాడు సాక్షిగా.ఏరా? ఇంకా రెడీ క

S1 Ep 149వేలు పిళ్లై రామచంద్ర రావు గారి గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు !
ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటల్లో రామచంద్ర రావు గారి గురించి - (వేలుపిళ్లై కథలకు ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిన ముందు మాట)'పొగడ పూలు':గొప్ప కథలు రాసిన టాప్‌టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్కపేరు చెప్పమని అడగ్గానే చాసోగారు ఠక్కున చెప్పిన పేరు సి. రామచంద్రరావు.రాసికన్న వాసికే విలువనిచ్చే అమితమిత రచయితలలో చాసో తరువాత సి. రామచంద్రరావు గారినే చెప్పుకోవాలి.యాభై అరవై యేళ్లలో సి. రామచంద్రరావుగారు రాసినవి తొమ్మిది కథలే!నల్లతోలు, వేలుపిళ్లై, ఏనుగులరాయి, టెన్నిస్ టూర్నమెంటు, గాళిదేవరు, కంపెనీలీజ్... మైగాడ్! వేటికవే! ఇన్నేళ్ళయినా వాడిపోని పొగడపూలు, అపురూపాలు, ఆరనిదీపాలు.ఇవి నిజాయితీ గల కథలు అన్నారు చాసోగారు.రోజూ ఎన్నో కథలు చదువుతున్నా, కథలలో మునిగితేలుతున్నా మళ్ళీ ఈయన కథ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేటంతటి అపురూప శిల్పాలు అన్నారు నండూరి రామమోహనరావు గారు.ఆంధ్ర సచిత్ర వారపత్రికలో – ఆ గోల్డెన్ పీరియడ్‌లో నండూరివారి సరసన సహాయకుడిగా పనిచేసిన నేనూ, రావుగారి కథలకు బొమ్మలు వేసిన బాపూ ఈ కథలు చదివి త్రిల్లయిపోయేవాళ్ళం. చెప్పుకుని తల్చుకుని మురిసిపోయే వాళ్ళం...కావ్యాల్లాంటి కథలు అన్నారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు.అంతర్జాతీయ స్థాయిగల కథలు అన్నారు ఆదివిష్ణుగారు.ఎన్నోయేళ్ళు – ఉహూ, ‘హూ - టీ’ ఎస్టేట్స్‌లో ఉన్నతాధికారిగా ఉన్న ఈ లాయర్ – మానేజర్- తెల్లదొరల – నల్లదొరల మధ్య హాయిగా విహరించారు. వెలుగునీడలు చూశారు. మనకు చూపించారు. టెన్నిస్ ఛాంపియన్‌గా ఎన్నో ట్రోఫీలు గెలిచారు. రావుగారి సోదరులందరూ టెన్నిస్ ఆటగాళ్ళే. ఒక సోదరుడి కొకొడుకు – వింబుల్డన్ ప్లేయర్ మహేష్ భూపతి.రామచంద్రరావు గారు మనతో మాట్లాడేది తెలుగే అయినా టెలుగులా వినపడుతుంది. స్టయిలు హొయలు అంతా ఇంగ్లీషే. మాటా ఇంగ్లీషే. కాని మనసంతా తెలుగు. రామచక్కని తెలుగు. స్పష్టమైన ఖచ్చితమైన తెలుగు.ఈ తెలుగు కథలకు పుట్టినిల్లు రావు గారి కలం అయినా చాలా కథలకు మెట్టినిల్లు తమిళనాడు! తమిళతంబీలు చాలమంది కనిపిస్తారు. అయినా వాళ్ళంతా మనవాళ్ళయిపోయి మనలో ఒకళ్ళయిపోతారు. అదీ రావుగారి శిల్పం – ప్రజ్ఞ!ఇంగ్లీషు, తెలుగు, తమిళ పాత్రల చుట్టూ అల్లిన ఈ కథలు – ఏ దేశంలోనయినా రాణించే కథలు.... మాటల వెనక మనసులను ఎక్స్‌రే తీసి చూపించగల కథలు. అన్‌హెర్డ్ మెలోడీస్ ఆర్ స్వీటర్ స్టిల్ అన్నట్టు – ఆకుచాటుపిందెలా, మబ్బుచాటు వెన్నెలలా, నీడచాటు నీడలా – ఆయన కథలలో మాట చాటు మాటల అంతరంగ తరంగాలు – అపురూప శిల్పాలు.గంగిగోవుపాలు గంటెడైనను చాలు అని వేమన్న అన్నా – ఈ గోవు మరిన్ని పాలు చేపాలని రావుగారిని కోరుకొందాం.అంతవరకూ ఆయన రాసిన ఆ కాసినీ మేసిమేసి నెమరేసి ఆనందించుదాం...-ముళ్ళపూడి వెంకటరమణ.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 141'నల్లగొండ కథలు' కథాసంకలనం పై కొన్ని అభిప్రాయాలు
'నల్లగొండ కథలు' కథాసంకలనం పై ఛాయా పబ్లికేషన్స్ మోహన్ గారు, రచయిత 'మునికాంతపల్లి' విజయ్ గారు, రచయిత, విమర్శకులు వెల్దండి శ్రీధర్ గారు, వారి అభిప్రాయాలను తెలియజేస్తారు.వారికి హర్షణీయం కృతజ్ఞతలు.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 138'కొత్త షూసు' - వీ మల్లికార్జున్ గారి 'నల్లగొండ కథలు' నుంచి.
ఇప్పుడు మీరు వినబోయ్యే ' కొత్త షూసు' కథ , వీ మల్లికార్జున్ గారు రాసిన 'నల్లగొండ కథలు' పుస్తకం లోనిది. ఇది ఆయన మూడవ కథాసంకలనం.2020 సంవత్సరంలో రిలీస్ అయిన పుస్తకాల్లో, ఇది ఒక ఆణిముత్యం లాంటి పుస్తకం అని మనం చెప్పుకోవచ్చు. ఇరవై ఎనిమిది ఏళ్ల యువ రచయిత మల్లికార్జున్ గారు రాసిన ఈ పుస్తకంలో, 21 కథలున్నాయి. అన్నీ కథలు , నల్లగొండలో గడిపిన తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ , అతి హృద్యంగా మనకందించినవి.ఈ పుస్తకాన్ని కొనడానికి కావలసిన వివరాలు ఈ లింకులో మీరు చూడొచ్చు. (http://bit.ly/nallagonda-kathalu) కథను మీకందించడానికి అనుమతినిచ్చిన మల్లికార్జున్ గారికి కృతజ్ఞతలు.చిన్నప్పుడు - అంటే చానా చిన్నప్పుడు నాకు రింగుల జుట్టు ఉండేటిదని మా అమ్మ చెప్తది. రింగుల జుట్టంటే అట్లాంటి ఇట్లాంటిది కాదు. పల్లగ ఇంతింత కుచ్చు లెక్క ముఖం నిండ ఉండేటిదంట. ఆబ్కారాయన ఇంటి ముందల ఒరండాల కూసొని ఎర్రటి అంగి మీద, ఇంతింత రింగుల జుట్టేసుకొని దిగిన ఫొటోల మటుకే నేను ఆ రింగుల జుట్టు చూసుకున్న గుర్తు. ఆ ఫొటో జూసి మురుస్తుంటి. చిన్నప్పుడు నాకు మా అమ్మోళ్లు తీశిన ఫొటోలు మూడుంటే అందుల ఇదొకటి. ఈ ఫొటో అటెన్క ఏడ్నో పోయింది. సూసుకుందామన్నా ఆ రింగుల జుట్టు సూస్కుంటానికి లేదిప్పుడు.అయితే ఆ ఫొటోల నాకు నా రింగుల జుట్టుకంటేగూడ, నేను తొడుక్కున్న ఎర్రటి బూట్లు ఎక్కువిష్టం.అవి ఎట్లాంటి షూసంటే కింద పీక ఒకటి ఉంటది. నడుస్తుంటే సౌండ్ చేస్తది. ఉరికినమంటే ఇంగంతే. నేనేసుకున్న ఫస్టు షూసు అదేనని నాకు గుర్తు. దాని తర్వాత స్కూల్లగూడ యూనిఫామ్ ఉండేటిదిగానీ, షూసు ఏస్కోవాలని ఏం లేదు. రబ్బరు చెప్పులే ఏస్కునేది.స్కూల్ కి అట్ల పోతుంటమా, వేరే స్కూలోళ్లని చూశి, ఆళ్లకు షూసుంటే మనగూడ ఉంటే బాగుండె కదా అనుకునేటోడి. ఎందుకో షూసంటే అంత పిచ్చి. . ఇంటికెవలన్న షూసేస్కొని వస్తే అటు దిక్కే చూస్తుండె. షూసేస్కొని ఫొటో దిగినట్లు, స్టయిలు పడ్డట్టు, ఎన్నో కలలు కంటుండేటోడ్ని.నేను పెద్దగయితున్న కొద్దీ కొద్దీ షూస్ పిచ్చి అట్ల పెరుగుతనే వచ్చింది. కొనియ్యమని అడుగుదామంటే భయం. మా సదువులు, తిండికే అప్పులు చేసేటంత పేదరికమాయె. ఏమని అడుగుతం?సినిమాలల్ల హీరోలను చూశి, “ఈళ్లు ఎన్నెన్ని షూసు మారుస్తున్నరో గదా!” అనుకునేటోడ్ని. ఒక్కో సినిమాల హీరో ఎన్ని షూసు ఏసుకున్నడో కూడా లెక్కబెట్టేది."అరెయ్, ఇన్ని షూస్ ఎట్ల కొంటున్నరో” అనుకునేది.అట్ల విచిత్రంగ నా షూసు పిచ్చి పెరుగుతనే ఉన్నదా, ఒకరోజు నేను స్కూల్ నించి ఇంటికొచ్చేసరికి మా నాన్న నాకోసం కొత్త షూసు తెచ్చిచ్చిండు. అయి మల్ల మామూలు షూసా? రన్నింగ్ షూసు.“ఎక్కడియే !” అనడిగిన. “ఎక్కడియయితేందిరా!” అన్నడు. ఏస్కొని చూసిన. కరెక్టుగ సరిపోయినయి. ఆహా! ఆ షూసు నేను ఎన్ని తీర్ల, ఎన్ని పండుగలకి ఏసుకున్ననో చెప్తే గూడ ఒకకథ అయితది. కానీ నేను ఆ షూసు మా నాన్నకి, మా నాన్ననించి నాకు ఎట్ల వచ్చినయో చెప్పాలి. దానికి మళ్లా మా నాన్న కథకాడికే పోవాలి.మా నాన్న ఊర్నించి పారిపోయొచ్చి నల్లగొండల ఆబ్కారాయన దగ్గర చేరిండుగదా! అటెన్క పెండ్లయింది. అమ్మ అదే ఇంట్ల ఆ పని ఈ పని సూస్కుంటుంటే, నాన్న కొండచెల్మ బాయిల నీళ్లు తోడే ఇంకో పని పెట్టుకున్నడు.కొండచెల్మ బాయంటే నల్లగొండల ఎవ్వల్ని అడిగినా చెప్తరు. తేటగ తియ్యగ ఉంటయి నీళ్లు. ఎక్కడెక్కడ్నించో జీపుల క్యాన్లు తెచ్చుకొని తీస్కపోయేటిది.ఆ బాయి నించి నీళ్లు తోడి క్యాన్లల్ల నింపి ఇండ్లల్ల పోసుడు మా నాన్న పని. పెద్ద క్యూ ఉండేటిదంట ఆ నీళ్లకోసం. తెల్లారుజామునే లేశిపోయి బాయికాడ నీళ్లు నింపుకొని సైకిల్ కి కట్టుకొని ఇంటింటికి తిరిగి పోసేటోడు మా నాన్న. అట్లజేస్తే నెలకు ఇంటికి ఇరవై రూపాయలు. రోజుకి రెండు క్యాన్ల నీళ్లు పొయ్యాలి. నల్లగొండల పెద్దపెద్దాళ్ల ఇండ్లల్ల మా నాన్నదే నీళ్లు పోసే పని.ఒకసారి ఎర్రటి ఎండాకాలంల బాయిల నీళ్లు ఎండుకపోయినయి. అడుగు మడుగున ఏవో ఉన్నయంట. లోపలికి దిగితేగానీ నీళ్లు అందవు. కొండచెల్మ బాయికి కొన్ని మెట్లుంటయి. మా నాన్న చిన్నగ ఆ మెట్లమీంచి లోపలికి దిగి నీళ్లు తోడుతున్నడంట. పాకురుబట్టిన మెట్లాయె. దమ్మనిజారి అందుల పడ్డడంట. ఏముంది? తుంటి బొక్క ఇరిగిందన్నరంట.అప్పటికి పెద్దక్క చిన్నది. పెద్దక్కని ఎవలో పాలోలింట్ల ఇడ్నిపెట్టి అమ్మ, నాన్న కల్ని ఓ ముప్పై కిలోమీటర్ల అవతల ఒక కాడ పసరు కట్టు కడ్తరంటే ఆడికి పోయిన్రంట. ఆ ఊరు కనుక్కొని, ఆడ ఉండి కట్టు కట్టిచ్చుకొని మళ్లా నల్లగొండల పడ్తానికి ముప్పు తిప్పలు పడ్డరంట.పసరు కట్టుతోటి ఊళ్ల దిగిండు. కొన్నిరోజులు ఇంట్లనే ఉన్నడుగానీ, పనిజెయ్యకుంట ఉండలేని మనిషాయె, ఇట్లనే నీళ్లు పోస్తప్పుడు పరిచయమైన ఒకాయనకాడికి పోయిండంట. ఆయనకి ఒక సినిమా టాకీస్ ఉంది. అందులనే అనౌన్సుమెంట్ ఇచ్చే రిక్షా తొక్కే పనిల పడ్డడు.పసరుకట్టు కట్టినంక కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలి. ఈయన అదేం పట్టించుకోకపోయేసరికి కాళ్ళు కొంచెం వంకర పోయినయ్. ఒకసారి ఇట్లనే , ఒక పెద్దాయన , “ మారయ్యా, నీకు హ్యాండీక్యాప్డ్ పాసిస్తారు తీస్కో” అంటే డాక్టర్ సర్టిఫికెట్ దగ్గర ఒక రిపోర్ట్ వచ్చిందంట.“ఓ మారయ్యా! నువ్వు బతుకుడు కష్టమే” అని ఆడుకున్నడంట ఆ టాకీస్ ఓనరాయన. “ఏది, నీకు కాళ్లు ఎట్ల ఇరిగినయో చూపియ్యరా.”“కుంటోనివి ఎట్లయినవో చెప్పురా” అని ఆటపట్టించేటిదంట...అప్పుడే ఎవలో తెలిసినాయన ఒకాయన హైదరాబాద్ ఉస్మానియా ల పనిచేస్తడంట . “మారయ్యా, నువ్వేం ఫికరు చెయ్యకు. నేను దీస్కపోత” అని అన్ని ఆయననే చూసుకున్నడంట. ఆపరేషన్ అయ్యింది. కాళ్లకు ఇనుప పట్టీలు కట్టిన్రంట . నల్లగొండకి తిరిగొచ్చి కొన్ని నెలలు ఇంట్లోనే ఉన్నడు. మా నాన్న సంగతి తెల్సిందే గదా, ఒక్కకాడ ఉంటడా?“అయ్యో, ఏం చెయ్యకుంటే ఎట్ల ఎత్తది?” అని అందరినీ కాదని మళ్ళా పనిలవడ్డడు. అక్కడ, ఇక్కడ పనిచేసి మళ్లా ఆ సినిమా టాకీస్ట్ గేట్ కీపర్‌లో, స్వీపర్ గ పనికి కుదిరిండు.ఆ కాలుని పట్టిచ్చుకోలేదుగా, అది అట్లనే ఉంది. ఒక కాలు కొంచెం ఒంకరుంటది. పాదం నేల మీద ఆనది. సగం పాదం మీదనే నడ్వాలి.హ్యాండీ కేఫ్ట్ సర్టిఫికెట్ తెప్పిచ్చుకున్నడు. బస్ పాసు ,

S1 Ep 137'మునికాంత పల్లి కథలు' - ఆచార్య ఇనాక్ , డాక్టర్ పతంజలి శాస్త్రి గార్ల అభిప్రాయం
సొలోమోన్ విజయ కుమార్ గారి 'ముని కాంత పల్లి కథలు' వీటిపై , ఆచార్య ఇనాక్ , డాక్టర్ పతంజలి శాస్త్రి గారి అభిప్రాయాన్ని , హర్షణీయం అభ్యర్థించడం జరిగింది. తమ అభిప్రాయాన్ని అందజేసినందుకు , వారికి కృతజ్ఞతలు.ఇజియా గారూ ..Hearty Congrats...This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 136అల్లం శేషగిరి రావు గారి 'మృగతృష్ణ'
*** కథను ప్రచురింపడానికి అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి, శ్రీ రఘునాథ్ అల్లం గార్లకు కృతజ్ఞతలు.'మృగ తృష్ణ ' - అల్లం శేషగిరిరావు గారి 'అరణ్య ఘోష' కథాసంకలనం లోనిది.ఈ కథ ఆంధ్రజ్యోతి పత్రిక లో 1975 లో ప్రచురింపబడింది.పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు.బాల్యం ఒరిస్సా లోని ఛత్రపురంలో గడిచింది. చుట్టుపక్కల ఎక్కువ అటవీ ప్రాంతం.ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగింది.అటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాసారు. రాసిన పదిహేడు కథల్లో సమాజంలో వుండే అసమానతలూ, అట్టడుగు వర్గాల జీవితాలపై విశ్లేషణ, ముఖ్య ఇతివృత్తాలుగా , మనకు కనిపిస్తాయి.కథల్లో ప్రకృతిని వర్ణించేటప్పుడు ఆయనకున్న పరిశీలనా జ్ఞానం , భావుకత్వం మనల్ని కట్టి పడేస్తాయి.1981 లో ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం లభించింది.పల్లవి పబ్లికేషన్స్ వెంకట నారాయణ గారు , ఫిబ్రవరి మొదటి వారంలో 'అల్లం శేషగిరిరావు సమగ్ర కథా సంకలనం' తీసుకవస్తున్నారు.మొబైల్ : '98661 15655' ద్వారా ఆయన్ను సంప్రదించి , మీ కాపీ రిజర్వు చేసుకోవచ్చు.కథ:ఎండలు | నిప్పులు చెరిగే ఎండలు!!అడవిలోని నీటిమాటులు, కొండ వాగులు, సెలలు ఎండిపోయాయి. కొండల్లో అగ్గి జంజలు. వడదెబ్బకి పిట్టలు సొమ్మసిల్లి నేలకు రాలిపోతున్నాయి. దాహం !వులులు, తోడేళ్ళు, జింకలు, దుప్పులు, పిట్టలు, పురుగులు- నీటి కోసం ఆర్చుకుపోతూ మందలు మందలుగా వలసపోతున్నాయి. పరుగులు, ఉరకలు- దాహం. రాత్రింబవళ్ళు ఒకటే పరుగులు, దాహం. అడవి పంది పడితే రెండు మూడు వందలు దాకా చెయ్యొచ్చు. అదృష్టం పండి కణుసుపడిందా, నాలుగువందలదాకా చెయ్యొచ్చు. దుప్పి పడినా కనీసం నూటఏభైకి తక్కువరాదు,సూరయ్య బాకీ తీరిపోతుంది. మూడు సంవత్సరాల నుంచి వర్షాలు లేక బీడు పడిన తన మెరక చెక్క మీద చేసిన అప్పు! అసలు, వడ్డీతో కలిసి మూడు వందలు దాటింది. ఈ సంవత్సరమైనా తీర్చకపోతే సూరయ్య, బాకీ క్రింద భూమి జమకట్టేసుకుంటాడు. అలా చాలామంది భూముల్ని పడేసుకుని పల్లం ప్రాంతంనుంచి వచ్చిన షావుకారు సూరయ్య లక్షాధికారయిపోయాడు. ఆ సంగతి బాగా తెలిసిన బైరిగాడు తన భూమిని ఎలాగైనా దక్కించు కోవాలనుకున్నాడు.బైరిగాడు నాటు తుపాకీని బైటికి తీసి బూజు దులిపాడు. చూరులో దాచిన పాత మందుగుండు సంచి తీసి అందులోని మందుగుండు కొంచెం నేలమీద పోసి అగ్గిపుల్ల గీశాడు. పేదవాడి ఆశలా భగ్గున మండింది. పాతదైనా మందు ఇంకా పవరు పోలేదనుకున్నాడు. తుపాకీ నల్లీలో మందు ఎక్కువ పోసి దట్టించాడు. సంచీలో పాతబడిన మేకుల్నీ, ఇనుప ముక్కల్ని ఏరి గుళ్ళకు బదులుగా తుపాకీలో నింపి వాటి మీద కాగితపు ముక్కల్ని, గుడ్డ పీలికల్ని దట్టించాడు.గోచి గట్టిగా బిగించి, గుడిసె తడక దగ్గరగా లాగి, తుపాకీని పట్టుకుని సంచి భుజానికి తగిలించి అడవి లోకి బయలు దేరాడు వేటకి.అరవై సంవత్సరాలు నిండిన బైరిగాడి ముడతలు దేరిన ముఖం బీటలు పడ్డ నేలలా వుంది. వయస్సుతోనూ, కష్టాలతోనూ జీర్ణించుకుపోయిన శరీరం తోలుతో కప్పిన బొమికల గూడులా వుంది. జీరలు దేరిన కళ్ళు మాత్రం నిప్పు కణికల్లా తీక్షణంగా ఉన్నాయి. ఆ చూపుల్లో పట్టుదల, ఓపిక ఇంకా చప్పబడిపోలేదు. మధ్యాహ్నం దాటిపోయినా ఎండ ఇంకా తీక్షణంగా వుంది.దూరాన గూడెంలో వర్షాల కోసం వన దేవతలను కొలుస్తూ డప్పులు వాయిస్తూ జాతర చేస్తున్నారు.చెట్లన్నీ ఆకులు రాల్చేసి మోడువా రిపోయాయి. అడవంతా ఎండుటాకులు పరుచు కొనున్నాయి.బైరిగాడు నడుస్తుంటే దిష్టిబొమ్మ తుపాకి పట్టుకొని అడవిలో నడుస్తున్నట్టుంది. బైరిగాడి కాళ్ళ క్రింద ఎండుటాకులు చిట్లుతూంటే ఆ సడికి వెదురు డొంకల్లో చిలకలు గోలచేస్తూ ఎగిరిపోతున్నాయి. కాకుల గుంపు బైరిగాడి వింత ఆకారానికి చెట్ల మీద నుంచి గోలచేస్తూ బైరి నెత్తిమీద వలయాకారంగా తిరుగుతూ మెడలు నిక్కించి చాలా దూరం వరకు వెంబడించాయి.బైరిగాడు పొద్దుగూకక ముందే నీటిమాటు దగ్గరకు చేరాలని వడివడిగా అంగలేసుకుంటూ నడుస్తున్నాడు. అడ్డతోవల మీదగా నడుస్తూ తుప్పల్ని, డొంకల్ని, రాళ్ళని దాటుకుంటూ, రొప్పుకుంటూ, రోజాకుంటూ రెండు కొండలు ఎక్కి దిగి సాయంకాలానికల్లా నీటి మాటు దగ్గరకు వచ్చాడు.ఆ కీకారణ్యం మద్య ఎండిపోయిన సెలయేటికి పక్కగా గుబురుగా బలిసిన తుప్పల నీడలో నేల చెమ్మగా వుంది. దాని మధ్యలో చిన్న నీటి గుంట. సన్నగా నీరు ఊరుతూ గుంటగా ఏర్పడింది. బైరిగాడు దగ్గరకు రాగానే నీటిమీద ముసిరిన దోమలు జామ్మున లేచాయి. అంత అడవిలోనూ మరెక్కడా నీటి చుక్క లేదు. చుట్టుపట్ల జంతువులు దాహం తీర్చుకోవడానికి అక్కడికే వచ్చి తీరాలి. గుంట చుట్టూ బైరిగాడు పరిశీలనగా చూశాడు.జంతువుల అడుగులు చెమ్మ నేలమీద, సెలయేటి ఇసుక లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి, అడవి పందులు తేమనేలని నీటికోసం త్రవ్వేసి గొప్పులు పెట్టేసున్నాయి.కొండల వెనుక అస్తమిస్తున్న సూర్యుడు చెట్ల సందుల్లోంచి అందంగా కనిపిస్తున్నాడు. వడగాలి చల్లబడుతున్నా పగలంతా ఎండకి సలసల కాగిపోయిన కొండ రాళ్ళలో నుంచి వేడి చిమ్ముకొస్తోంది.నీటి గుంటకి ఇరవై గజాల దూరంలో వెదురు పొద మధ్యన కూర్చొనడానికి వీలుగా సంచీలో నుంచి కత్తి తీసి చదును చేశాడు. తను బయటికి ఏ మాత్రం కన్పించకుండా చుట్టుపక్కల కొమ్మల్ని, తుప్పల్ని నరికి తెచ్చి చుట్టూ పేర్చుకున్నాడు. తుపాకీతో కాల్చడానికి వీలుగా వాటి మధ్య చిన్న సందులు చేశాడు. దూరానికి చూడ్డానికి మాటు తుప్పల మధ్యలో తుప్పలాగా కనిపిస్తోంది. అంత గొప్ప నైపుణ్యంగా పేర్చినందుకు తననుతానే అభినందించుకొని మెల్లగా మాటులోకి దూరి కూర్చున్నాడు. తుపాకీ గుర్రం ఎక్కు పెట్టి సిద్ధంగా పక్కనుంచాడు. మాటు సందుల్లోంచి నీటి గుంటకి దాహం తీర్చుకోడానికి రాబోయే జంతువులకోసం నలువైపులా చూస్తున్నాడు. ప్రతి చప్పుడునీ చెవులు నిక్కించి సూక్ష్మంగా ఆలకిస్తున్నాడు- వేటలో రాటు దేరిన బైరిగాడు. • క్యాంప్, క్యాంప్ అడవిలో నెమళ్ళు అరుస్తున్నాయి.కత్తిరి పిట్టలు ఒక్కొక్కటిగా చెట్ల మీది నుంచి దిగుతూ నీళ్ళు తాగి ఎగిరిపోతున్నాయి. నెమళ్ళు జంట ఎండుటాకుల మీద జరజరమని పరుగెత్తుకుంటూ వచ్చి నీటి గుంట దగ్గర ఆగ

S1 Ep 135రోహిణి - పతంజలి శాస్త్రి గారి కథ , కథా పరిచయం
రోహిణి’ పతంజలి శాస్త్రి గారి ‘రామేశ్వరం కాకులు’ అనే కథాసంకలనం లోనిది.• ఈ కథపై చక్కని సూచనలిచ్చి, ఆడియోని మీకందించడానికి సహకరించిన మిత్రులు ఛాయా మోహన్ గారికి కృతజ్ఞతలు.**’రామేశ్వరం కాకులు పుస్తకం’ అమెజాన్ లో దొరుకుతోంది. – http://amzn.to/3bFv5W2.కథనం:చరిత్ర లోని ఒక కథను Allegorical గా తీసుకొని, సమకాలీన సమస్యను ఎత్తిచూపుతూ, ఒక పరిష్కార మార్గాన్ని సూచనగా చెప్పడం, ఈ కథలో ముఖ్య ప్రక్రియ. ఈ ప్రక్రియ తో తెలుగు లో వచ్చిన మరో రెండు కథలు – చలం గారి ‘ ఓ పువ్వు పూసింది’ రావూరి భరద్వాజ గారి ‘ పాటకు తగిన రోలు’.కథలో ముఖ్యాంశం నదీజలాల వివాదం. రోహిణి నదీజలాల పై శాక్య , కోలీయుల వివాదం గురించి రెండు కథనాలు ప్రచారంలో వున్నాయి.తాను చూసిన కొన్ని సంఘటనల వల్ల సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడుగా మారిన తర్వాత,జలాల గురించి ఇరువర్గాలూ యుద్దానికి సిద్ధమైతే, గౌతముడు యుద్ధభూమికి వెళ్లినట్టుగా, ఆయన సమక్షంలో ఇరు వర్గాలూ తమ ఆయుధాలు విసర్జించి యుద్ధాన్ని మానివేశాయి అని ఒక కథనం చెప్తే… ( http://bit.ly/warsankyans)శాక్య వంశానికి చెందిన సిద్ధార్థుడు, జలాల వివాదం మీద జరిగిన శాక్యుల సమావేశంలో , తాను యుద్ధం యొక్క ఫలితాలను, అనర్థాలను ఎత్తిచూపినప్పుడు, వర్ణాశ్రమ ధర్మం గురించి చర్చ జరగడం, యుద్ధానికే, ఎక్కువమంది మొగ్గు చూపడంతో , వ్యతిరేకిస్తూ , సిద్ధార్థుడు సన్యసించడం , ఆ తరువాత కొంత కాలానికి ఇరువర్గాలూ యుద్ధాన్ని విరమించడం రెండో కథనం. (http://bit.ly/ambedkars (24-29, 56-57))పతంజలి శాస్త్రి గారు రాసిన ఈ కథలోని విశేషం, ఈ రెండు కథనాలనూ సమన్వయం చేయడం.ఇలా ఒకే చారిత్రిక ఇతివృత్తం పై వున్న రెండు వేరు వేరు కథనాలలోని ముఖ్య అంశాలను స్పృశిస్తూ, ఒక సమకాలీన సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచించారు ఈ కథ ద్వారా రచయిత.కథలోని సమస్య గురించే గాక , నేటి సమాజంలో ఉండే ఎన్నో ప్రధాన సమస్యలపై , పరిష్కారం దిశగా, గౌతముని వాక్యాలను ఎన్నుకుని కథలో భాగంగా మనకందించడం శాస్త్రి గారి రచనా ప్రతిభకు ఒక నిదర్శనం.ఏ సమస్య పరిష్కారానికైనా , సరైన దృక్పధం, సమస్య పరిమితులు అర్థం చేసుకోవడం ముఖ్యమన్న విషయం కథ మనకు తెలియజెప్తుంది.కథలో భాగంగానే, ఈనాటి సామాజిక వర్గీకరణను సూచిస్త, వ్యాపార, శ్రామిక వర్గాలకు ఉండవలసిన సరైన దృక్పధం గురించి , వారికి సమాజం పట్ల ఉండవలసిన బాధ్యత గురించి కూడా చర్చించడం జరుగుతుంది.కథ చివరి అంకం అంతా గౌతమ బుద్ధుడి ఆశ్రమంలో జరగడం, చర్చలకు కావలసిన వాతావరణం ప్రాధాన్యత ను గురించి రచయిత చెప్పినట్టుగా ఉంటుంది. అదే విధంగా రోహిణి నదిని వర్ణించేటప్పుడు , కథలో రాబోయే సందర్భం గురించి సూచిస్తున్నట్టుగా ఉంటుంది.కథలో ముఖ్యంగా గమనించవలసింది గౌతమబుద్ధుడు (శాస్త) పలికిన వాక్యాలు, ఇంకా ఆయన సమక్షం లో శ్రోతలు పొందే అనుభూతిని గురించి రచయిత వర్ణన.కథలోని ముఖ్య సన్నివేశాలలో తటస్థపడే నెమలి, బౌద్ధమతస్థుల నమ్మక ప్రకారం, విశాలహృదయానికీ, అంగీకారానికీ, చిహ్నం. ( http://bit.ly/buddhismpeacock )అలాగే, రోహిణి నది వివాదం, మన దేశంలో కావేరీ జలాల సమస్య, పాలస్తీనా ప్రాంత వ్యవహారాలూ, అక్కడి జోర్డాన్ నది వినాశనం మనకు గుర్తుకుతెస్తుంది. (http://bit.ly/jordanpollution)ఈ కథ ఆడియో రూపం లో , సుప్రసిద్ధ రేడియో ఆర్టిస్ట్ శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి గళాన మీరు వినవచ్చు.కథ:రోహిణీ నది, సంధ్యాసమయంలో శాన్త భుజం మీది నుంచి జారిన కాషాయాంబరంలా వుంది. ఇప్పటి పరిస్థితి విషమిస్తే ఇరుపక్షాల రక్తంతో రోహిణికి రక్తపుజీర పడుతుందనుకున్నాడు ఉపాలి. ఉపాలి భిక్షు అంతకుముందే నదిలో స్నానించి, బట్టలు పిండుకుని, ఒడ్డుకు చేరి మంద్రంగా ప్రవహిస్తున్న నదిని చూస్తూ అట్లా అనుకున్నాడు.ఎగువ నుంచి ఒడ్డుకు సమీపంగా పొడవాటి గెడ సాయంతో వంపు తిరుగుతోంది పడవ. అట్లాగే చూస్తూండిపోయాడు ఉపాలి. మనోహరమైన సంధ్యగాలి అలలు ఉపాలి శరీరాన్ని మనసునీ మృదువుగా తాకి వెళ్లిపోతున్నాయి. ఈవలివైపు ఆమ్ర వన విహారం చేరిన కొద్ది దినాల నుంచి నదిని చూసినప్పుడల్లా, కంఠం వరకూ మునిగినప్పుడల్లా తన నుంచి తాను వేరుపడి ఆవల బాల్యం గడిపిన అస్పష్టమైన శాక్యసీమను చూశాడతను. అక్కడే ఒక రాకుమారుడు ఉదయకాంతిలోకి గుర్రం మీద వెళ్లిపోవడం కూడా జ్ఞాపకం వస్తుంది. ఈ నది వేరు, ఆ నది వేరు. అతని పెదాల్ని దాటి చిరునవ్వు వెలువ డింది. జేవురించిన సూర్యుడు, ఎర్రబారిన నది- అనేక దినాలుగా నది కావల, ఈవల రాజుకున్న ఆగ్రహావేశాల్ని తలపిస్తున్నాయి. ఉపాలితో పాటు స్నానం చేసిన భిక్షువులు అప్పటికే విహారం వేపు నడిచి వెళ్లిపోయారు. సంధ్యా సమయంలో నీడల్లా దూరంగా కనిపిస్తున్నారు. ఉపాలి భిక్షు మనసులో చిన్న కలవరం కూడా లేకపోలేదు.ఆ దినం ఉదయమే ఆనందుణ్ని అడిగాడు. “భన్తే, ఆవలితీరం భగవానుడి పుట్టుక వల్ల పునీతమైంది. ఈవల వారి నివాసం వల్ల పవిత్రమైంది. మరి ఈ కోలీయులు, శాక్యులు రక్తం చిందించడానికి ఎందుకు ఆయత్తమవుతున్నారు?”దీర్ఘంగా ఉపాలివేపు చూస్తూ అన్నాడు ఆనందుడు. “అవిద్య అత్యంత కఠినమైన స్థితి. అగ్నికి గాలివలె కాపీర్ణం, ఆగ్రహం, మనుషుల బుద్ధిని బూడిద చేస్తాయి. వర్షాన్ని కలుపుకుంటేనే నది అవుతుంది. శాస్త్ర ధర్మోపదేశం వినడం వేరు. శ్రోతాపత్తి ఫలాన్ని పొందడం వేరని నీకు తెలిసినదే.”“తలలు పగలగొట్టుకోవాలనే వారి ఉత్సాహం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది.” “పొగరుబోతు ఏనుగు తథాగతుని ముందు మోకరిల్లింది.” “సుద్ధోదన మహారాజు మౌనసందేశాలు మాత్రమే పంపుతున్నాడను కుంటాను.”నవ్వి ఆనందుడు అన్నాడు. “కానీ శాక్య ఉపాసకులు ఇక్కడకు వస్తూనే వున్నారు. శాస్తకు ఎవరి సందేశాలు, ఆహ్వానాలు అవసరం లేదుగదా?”ఆలోచనలో పడి ఉపాలి నదిమీద పల్చటి చీకటి పొర పరచుకోవడం గమ నించలేదు. పడవవాడు పడవని ఒడ్డుకు లాగి తాడు కడుతున్నాడు. పడవవాణ్ని చూడగానే అనుకున్నాడు. ఈ వ్యక్తికీ, ఈ నదికీ, ఈ పడవకీ, పడవెక్కి తీరం చేరే యాత్రికులకీ ఏమిటి సంబంధం? నవ్వుకుంటూ ఉపాలి వెనక్కి తిరిగి విహారం వేపు నడిచాడు. తీసి ఉన్న వెదురుతలుపు పక్కకి నెడుతూ శ్రేష్టి కుటుంబం, విహారంలోకి అడుగు పెట్టకముందే ఎదురు వచ్చింది. ఉపాలి ఎదురవగానే వారంతా ఆగి అభివాదం చేసి అతను లోపలికి వెళ్లేవరకూ ఆగి మర

S1 Ep 134గ్యాపకాలు
"భలే గట్టోడు రా మీ రాం మావ, అటెండన్స్ తక్కువయిందని ఎఫ్.ఏ ఆఖరి పరీక్షలకు కూర్చోనివ్వలా ఆయన్ని ! అప్పుడు సంవత్సరం పాటు తాత తో పాటే ఉండి, గొడ్ల పేడ ఎత్తడం నుంచి కోతల దాకా పనులన్నీ బ్రెమ్మాండంగా నేర్చుకొని, మళ్ళీ ఎఫ్.ఏ పరీక్షలు రాస్తా, ఏ.జీ.బీ.ఎస్.సి చదువుకుంటా అని తాతని ఒప్పిచ్చి, మళ్ళీ పరీక్షకు కూర్చొని పాస్ అయ్యాడు. లెక్కల గ్రూప్‌లో వాడు, ఏ.జీ.బి.ఎస్.సీ ఎట్టా చదవతావురా అని జనాలందరూ నవ్వితే, కాలేజీ వాళ్ళని ఒప్పించుకొని మరీ బాపట్ల కాలేజీ లో చేరాడు.మీ పెద్దమ్మ లిద్దరి కంటే గూడా నేనంటేనే ఇది.నాక్కొక్కదానికే రాసే వాడు జాబులు. "నాయన దగ్గర పొలం పని నేర్చుకోడం మంచిదయ్యిందే, నేనేవో వీళ్ళు చెప్పే పనులు ఎడం చేత్తో చేసేస్తూంటే, మిగతా వాళ్ళందరూ తెగ ఇబ్బంది పడ్తున్నారని" జాబుల్లో రాసేవాడు .చదువైనా, ఉజ్జోగం అయినా అన్నిట్లో ఫస్టు.మనిషి మొండోడులే, మీ పెద్దమ్మకి శేష పెదనాయన సంబంధం ఖాయం చేస్తూంటే ఎంత గొడవ చేసాడని, శేష బావ నలుపు, మా అక్క అంత అందగత్తెకి ఆయన్నిచ్చి ఎట్టా చేస్తారు అని ఒకటే గొడవ. గొరస కత్తి ఒగటి ఎత్తుకొని, కనపడిన తాటి చెట్టు కల్లా గాట్లు పెట్టుకుంటా పొయ్యాడు. ఈయన్నిశాంత పరిచే కాడికి తాతలు దిగొచ్చారు. ఒక్కడే కొడుకు అని చెప్పి, మా అమ్మ గూడ అట్టే చూసేదిలే మీ రాం మావని. డబ్బులు చాలక ఇబ్బంది పడుతూంటే, ఎన్ని సార్లో , నాయనకి తెలీకుండా, వడ్లమ్మి ఎం.ఓ చెయ్యించేదో మా అమ్మ."టోల్ గేట్ కనపడుతోంది దూరంగా. కారెక్కినప్పట్నుంచీ అమ్మ ఇట్టా మాట్లాడ్తూనే వుంది. అడిగా వెనక అద్దంలోంచి అమ్మను చూస్తూ ."కాఫీకి ఆపేదా పిడుగురాళ్లలో " నాన్న ఏదో చెప్పబొయ్యే లోపల అమ్మే అనింది, "మావ దగ్గరకి పొయ్యే దాకా ఎక్కడ ఆపే పనే లేదు రా" రాత్రి నెల్లూరు నుంచి మావ గురించి ఫోన్ వచినప్పట్నుంచీ, అమ్మ అదొక ట్రాన్స్ లోకి వెళ్లి పొయ్యింది. వాళ్ళ అన్న గురించి అవే అవే మాటలు. అన్నీ వాళ్ళ చిన్నప్పటి మాటలు. వింటున్న నాకూ, నాన్నకూ, ఆమె చెప్పే విషయాల్లో తెలీనివి ఏవీ లేవు. కానీ, అమ్మమ్మ దగ్గరే, వూళ్ళో చాలా ఏళ్ళు పెరిగిన నాకు, , మా రాం మావ తో వుండే గ్యాపకాలు వేరు. అప్పుడు ఆయన ఉద్యోగం నెల్లూరు అన్నట్టే గుర్తు. మా అత్త ను గూడ తీసుకు రాకుండా, స్కూటర్ వేసుకొని ఊరి కొచ్చి, ముందర ఇంటికి రాకుండా, నేరుగా పక్కీధి లో వుండే మా శంకర అవ్వ వాళ్ళింటికి పొయ్యేవాడు. నేను అమ్మమ్మ ను ఏడిపిద్దామని అనేవాణ్ణి."అమ్మమ్మా, శంకర అవ్వ వాళ్ళింట్లో ఫ్యాను కింద కూర్చొని, చక్కెర కాఫీ తాగుతుంటే, వుండే మజా, నీ దగ్గరొకొచ్చి విసనకర్రతో ఉఫ్ ఉఫ్ అనుకుంటూ తాగే, బెల్లం కాఫీలో ఏవుంటుంది అని." "రేయ్ వేలెడంత లేవు, నువ్వేన్దిరా వాడి గురించి మాట్లాడేది, ఎంత పెద్ద ఉజ్జోగంలో వున్నాడు తెలుసా."ఇదిగాక మావ వొచ్చిన ప్రతీ సారీ, మా అమ్మమ్మ, ఆయన కొత్తగా కట్టుకున్న ఇంటికి తీసుకెళ్లామని అడగడం, నెల్లూళ్ళో ఆ గోలలో నువ్వు ఒక్క రోజు కూడా వుండలేవే అని మా మావ దాటెయ్యడం నా కళ్ళ ముందే జరిగేది. "అవును అమ్మమ్మా, అంత పెద్ద ఉజ్జోగం చేసే మావ, అంతకంటే పెద్ద ఇల్లు కట్టాడు కదా, నెల్లూరులో, పిలిచి చూపిచ్చాడా ఎప్ప్పుడైనా""రేయ్ వందమంది పని చేస్తార్రా, మీ మావ చేతి కింద. ఊపిరాడని ఉజ్జోగం. అయినా గూడా నెల నెలా నాకోసం వూరొచ్చి, మందులు పళ్ళు తెచ్చిచ్చి పోతాడు తెలుసా." అనేది మా అమ్మమ్మ, కళ్ళల్లో నీళ్లు తిరుగుతూంటే, పొడిగించేవాణ్ణి కాదు నేను అక్కణ్ణించీ.మా అమ్మమ్మ పొయ్యినప్పుడు గూడా, పిల్లలలకి పరీక్షలు అనిచెప్పి, వాళ్ళను తీస్కరాకుండా, మా మావ, అత్తా నే వచ్చి చిన్న కర్మ పెద్ద కర్మ మరునాడే చేసేసి వెళ్లిపోయారు. ఊపిరాడని ఉద్యోగం కదా మావది !ఆ తర్వాత నేను వాళ్ళను పెద్ద కల్సింది లేదు. మా కుటుంబాలు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని సార్లు చేతులు అందిచ్చుకున్నా, మా అమ్మా పెద్దమ్మలిద్దరి మధ్యలోనే, ఆయన ప్రమేయం లేకుండానే , అంతా నడిచిపోయింది. నెల్లూరులో వుండే బంధువుల ద్వారా మావ వాళ్ళ విషయాలు అయితే తెలుస్తూ ఉండేవి. ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో చాలా పెద్ద పొసిషన్ లో రిటైర్ అయ్యాడనీ, ఇద్దరూ కొడుకులూ స్టేట్స్ లో చదువులూ, ఉద్యోగాలతో పాటూ అక్కడ అమ్మాయిల్నే చేసుకొని, సెటిల్ అయిపొయ్యారనీ. మా మావ కొడుకులు పెళ్లిళ్లు అయ్యాక ఇండియా కి రాలేక పోతే, మా అత్తా మావ ప్రతీ రెండేళ్లకే అక్కడికి పొయ్యేసి వస్తూంటారనీ.మిర్రర్లో చూస్తే, మాట్లాడి మాట్లాడి అలసిపొయ్యినట్టుంది, అమ్మ అట్టానే నిద్ర పొయ్యింది.నెల్లూరు చేరేటప్పటికి మధ్యాహ్నం. మావ వాళ్ళ ఇంటి ముందర ఓ షామియానా వేసున్నారు. బయట కాఫీలు తాగుతూ అక్కడే కూర్చోనున్నారు కొంతమంది.హాల్లో పడుకోపెట్టున్నారు చాప మీద మావని. ప్రశాంతంగా వుంది మొహం. ఇంత అందగాడా మా మావ? అమ్మ నేరుగా వెళ్లి అత్త చెయ్యిపట్టుకోని ఆమె పక్కన కూర్చుంది. కొడుకులిద్దరూ టైం కి అందుకోలేం అంటే, మా అత్తా వాళ్ళ బంధువుల్లో ఎవరో ఒకబ్బాయి, జరగాల్సిన వన్నీ పూర్తి చేసాడు.చిన్న కర్మ రోజున, మా అత్త అమ్మని, వాళ్ళ బంధువులకి పరిచయం చేస్తూ చెప్పింది. "ఈమె, ఆయన చిన్న చెల్లెలు. వీళ్ళ ముగ్గురు అక్క చెళ్ళెళ్ళూ ఈ రోజు దాకా నన్ను ఒక్క మాట అనింది లేదు. నాకెప్పుడూ వీళ్ళని ఏదో ఒకటి అనాలని అనిపించింది లేదు. ఎందుకో ఆయనే దూరంగా వుండి పోదామనుకున్నారు వీళ్ళకి" అని. నేనేదో అనపొయ్యి అమ్మ మొహం చూసి ఆగిపొయ్యా.నెల్లూరు నించి, హైద్రాబాదుకి వెనక్కొస్తూ ఉంటే, పక్కనే కూర్చున్న అమ్మని ఆపుకోలేక అడిగా. "అవునే, అమ్మా! మావ గురించి మొన్న కార్లో, చాలా మాట్లాడావ్ కదా. నువ్వు బాధ పడ్డ సందర్భాలు ఏవీ లేవా?" అని "ఏది గుర్తు పెట్టుకోవాలో.... ఏది కూడదో, మన చేతుల్లో వుండే పని గదరా" అంది, అమ్మ కిటికీలోంచి బయటికి చూస్తూ.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 133'ఆర్వీ చారి కరెంటు బిల్లు ' ! - పతంజలి శాస్త్రి గారి కథ
ఆర్వీ చారి కరెంటు బిల్లు అనే ఈ కథ, శాస్త్రి గారి 'నలుపెఱుపు' అనే కథా సంకలనం లోనిది.కథ చివరన మిత్రులు, నండూరి రాజగోపాల్ గారు , కథపై వారి అభిప్రాయాన్ని తెలియజెయ్యడం జరుగుతుంది.శాస్త్రి గారి రచనా ప్రక్రియ, రచనా జీవితం గురించి , హర్షణీయంలో ప్రసారమైన ఎపిసోడ్స్ లింకులు ఇదే పేజీ లో కింద ఇవ్వడం జరిగింది.ఆర్వీచారి కరెంటు బిల్లు:లిఫ్ట్ మూసుకోబోతూండగా రజనీదేశ్ పాండే ఒక్క గెంతులో లోపలికి దూకింది. చారి నవ్వేడు.“కనీసం మూడు నిముషాలు ఆదా అయ్యేయి" అందామె.“లేదా నీ ముక్కు బద్దలయ్యేది. ఏది నయమో నీకే తెలియాలి" అన్నాడతను.అప్పటికే లిఫ్టు గాజు బుడగలో ఆమె డియో కమ్మగా కమ్ముకుంది.“వెరీ నైస్. కొన్నావా, బాయ్ ఫ్రెండ్ చేత కొనిపించావా?" అన్నాడు మళ్లీ.లిఫ్ట్ పదో అంతస్తు దగ్గర మెత్తగా ఆగి తెరుచుకుంది.బయటికి వెళ్తూ “నెక్స్ట్ టైమ్ యువర్ టర్న్” అంది రజని.లిఫ్ట్ లోంచి అతనికి వరండాలో అలలా వెళ్తున్న రజనీ వంపు తిరిగి మాయమైంది.మిగిలిపోయిన డియో పీల్చుకుని ఆర్వీ పధ్నాలుగో అంతస్తులో దిగేడు. పదకొండు దాటిం తరవాత ఎప్పుడో సిస్టం ముందు నుంచి లేచి ఒళ్లు విరుచుకుని కిటికీ దగ్గిరికి కుర్చీ లాక్కుని కిందికి చూశాడతను..వంద ఎకరాలు మెత్తని పచ్చికలో లేత కనకాంబరం రంగులో ఇరవై అంతస్తుల పాలరాయి చెట్టు.దాన్లో పదిహేను గూళ్లు తొలిచేరుఎరుపు, పసుపు పచ్చ పూలచెట్లు ఎండలో మెరుస్తున్నాయి.రాత్రి రాల్చిన రంగుపూలన్నీ కొంగుపరుచుకున్నట్టు అలాగే ఉండిపోయాయి.లోపల చల్లగా, చల్లదనంతో కలిసిన చిన్న పరిమళంతో సహా హాయిగా ఉంది.బయట ఎంత వెలుతురుందో లోపలా అంతే.గోడలకి, సీలింగుకీ అతుక్కున్న దీపాలు తెల్లగా మెరుస్తున్నాయి.బుగ్గల్లాంటి నున్నటి నీలపు ఒట్టి నేల మీద భోజనం చేసినా ఫరవాలేదు.చారి వారానికి రెండు మూడుసార్లు కిటికీ పక్కన కూచుని ఇదే దృశ్యాన్ని చూస్తూంటాడు.పధ్నాలుగో అంతస్తులో అతని ఉన్నతీ, చుట్టూరా పరుచుకున్న ఖరీదైన చక్కదనం, లోపల చల్లటి భద్రత చారికి సంతృప్తికరంగా వుంటుంది.ఆర్వీ చారి ఈ ఏడాది రెండోసారి కాలిఫోర్నియా వెళ్లాచ్చి పది రోజులు కూడా కాలేదు.విమానం దిగి ఇంటికి కూడా వెళ్లలేదతను.లోపలికి రాగానే జీఎం గారు పిలిపించి అతని భుజం పిండి, కంపెనీ ఆనందాన్ని అతనితో పంచుకున్నాడు.చారి వెంట ఆయన గదిలోకి ఒక డాలర్ ప్రవాహం రావడం చూశాడాయన.ఇద్దరి మొఖాలూ ఇంకా ఎవరూ ముట్టుకోని కొత్త వందడాలర్ల నోటులా మెరిసిపోయాయి.గంట తరవాత కంపెనీ కార్లో ఇంటికి చేరేడతను.లోపలికెళ్లి కూచోగానే జ్యోతి ఫోన్ చేసింది.ఫ్రిజ్‌లో అన్నీ ఉన్నాయి.సాయంకాలం వరకూ రాలేనంది."ఓకే. లవ్". అన్నాడు చారి.సాయంకాలం ఆరు దాటింతరవాత జ్యోతి కాలింగ్ బెల్ నొక్కే వరకూ నిద్రపోయాడు చారి.నీలపు డబ్బాలోంచి చల్లటి బీరు గుటక వేస్తూ ప్రాజెక్టు గురించి చెప్పేడతను.సంతోషం వెచ్చటి వెలుతురు వలయంలా వాళ్లిద్దరి చుట్టూ పరుచుకుంది.*************ఫోన్ మోగింది. సున్నితంగా స్పష్టమైన గలగల.ఫోను మాట్లాడి కూచోగానే ఆలీ లోపలి కొచ్చేడు.“ఏరా?"జేబులో చెయి పట్టి కరెంటు బిల్లు రసీదూ, మిగిలిన రెండు వందల ఎనభై రూపాయలూ టేబిలు మీద పెట్టేడు ఆలీ.రసీదు చూశాడు చారి.“ఓ. కరెంటు బిల్లా? థేంక్స్. ఇదో.” ఏభై రూపాయల నోటు తీసి ఇచ్చేడతను.“ఈ సేవలో కట్నా సార్.”“ఓకే. థేంక్స్."ఆలీ సందేహిస్తూ నిలబడి పోయాడు.ఫైల్లోంచి అతని వేపు చూసి అన్నాడు చారి“ఏమనుకోకండి సార్. బిల్లు చూసిన్రాసార్ మీరు?”"ఆ. చూడకుండా పైసలెలా ఇస్తాను?”“అవుసార్. గిట్లనే బిల్లు నాలుగు దఫాలు ఇచ్చినారు సార్. మీరు చూస్తలేరు సార్. ఆడిస్తనే ఉన్నాడు. మీరు జమజేస్తనే ఉన్నారు సార్. చానా ఎక్కువ సార్." |కొన్ని క్షణాల వరకూ ఆలీ ఏవంటున్నాడో అర్థం కాలేదు చారికి.చివరికి లోపలికి దిగిం తరవాత అన్నాడు. “అదా? ఇంట్లో ఉండం గదా. అంతకు ముందు నెలదే వేస్తున్నాడేమో.""అట్లయిత లేదుసార్. చానా ఎక్కువ బిల్లు సార్. మీరు అడగండ్రి సారూ, ఎన్ని పైసలిస్తరు సార్."అప్పుడతని వేపు చూశాడు చారి.ఆలీ పెదాలు వంపు తిరిగున్నాయి.అతని కళ్లలో నల్లటి నింద అతనికి తెలీకుండానే కళ్ల నిండా పరుచుకుని ఉంది. అతని కళ్లలోకి చూడ్డం ఇబ్బందిగా ఉంది.ఆలీ చూపులు వీపు మీద సూదుల్లా గుచ్చుకున్నాయి.చారి మనసులో ఉక్కపోసినట్టుయింది.ఫైలు చూస్తూ "ఓకే" అన్నాడతను.ఆలీ వెళ్లబోతూ చిన్న నవ్వుతో అన్నాడు. “అయన్ని నాకు మూడు నెల్ల జీతం లెక్క సౌర్."తల అడ్డంగా ఊపుతూ ఆలీ వెళ్లిపోయాడు.సూది బాగా లోపలికి దిగిపోయింది. చిల్లర నోట్లు పర్సులో పెట్టుకుంటూ బిల్లుల వేపు చూసాడతను.దానికీ, మీటరుకీ, డబ్బుకీ సంబంధం అతనెప్పుడూ ఆలోచించలేదు.ఎంతయిందో చూసి ఆలీకి డబ్బులిచ్చి మర్చిపోవడం చారికి అలవాటుగా వస్తోంది. ఇప్పుడు బిల్లు చూస్తుంటే అతనికి ఆశ్చర్యంగానే ఉంది. కాసేపు దానివేపే చూస్తూండిపోయాడు.మనసులో ఉక్క ఎక్కువగానే ఉంది. మళ్లీ ఫోను మోగింది. ఈసారి ఫోను చెవిలో గలగల మన్నట్టుంది.సాయంకాలం వరకూ చారికి జారిపడ్డానిక్కూడా తీరిక దొరకలేదు.సాయంత్రం తన లేత అరిటాకు పచ్చ కారెక్కుతూండగా పక్కనుంచి వెళ్తూ అలీ సలాం కొట్టేడు.ఇంటి కెళ్తూ, కారాపినప్పుడల్లా జేబులో చెయ్యి పెట్టి బిల్లు తడుముకున్నాడు చారి.కడుపులో ఏవీ బాగా లేనట్టనిపించింది."టీ ఇవ్వనా?" అంది జ్యోతి.తల ఊపేడతను.పేంటులోంచి చొక్కా బయటికి లాగి, విప్పి పక్కన పడేశాడు.టీ తెచ్చి ఇచ్చిందామె.ఓ గుక్క మింగి కప్పు టీపాయ్ గ్లాసు మీద పెట్టి చొక్కా జేబులోంచి బిల్లు తీసి ఆమెకిచ్చేడతను."ఏంటిది? ఓ. కరెంటు బిల్లు. కట్టేడా ఆలీ?”“కట్టేడు. జ్యోతి బిల్లు చూశావా?"“బిల్లే వుంది సార్ చూడ్డానికి?"బిల్లు తన చేతిలోకి తీసుకుని చూస్తూ అన్నాడు చారి.“మనిద్దరం చూడ్డం లేదు. మూడు నాలుగు నెలల్నించి చాలా ఎక్కవ బిల్లు పడుతోంది. మనకి అందులో సగం కూడా అవదు."అతని కనుబొమ్మల మధ్య చిరాకు మడతపడ్డం చూసిందామె. అతని వేపే చూస్తూ ఏవీ అనలేదామె."వాడు గమనించి చెప్పేడు. ఇటీజ్ ఎ లాటాఫ్ మనీ, నేనూ చూడలేదు.”"అవును.అంటే, మామూలుగా చూడంకదండీ.ఏ బిల్లు వచ్చినా మనీ ఎంతో చూసి మీరో నేనే ఇస్తాంగదా. బహుశా ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. పోనీ ఓసారి కంప్లయింటు చేసి చూడండి.”తల ఊపేడతను. కానీ లోపలి ఉక్క , ఫేను గాలికి శాంతించడం లేదు.“ఒకే. పాత బిల్సున్నాయేమో చూడోసారి." అతనివేపోసారి చూసి లేచి వెళ్లిందామె. టేబి

S1 Ep 127'ఇల్లు'!
ఎండాకాలం ఒంటి నిట్టాడి ఇంటిపట్టున రెండు నిట్టాళ్ళ ఇల్లు వేయాలని మా అమ్మా నాయన నిర్ణయించుకొన్నారు. మా చిన్న ఇల్లు పీకి పెద్ద ఇల్లు వేస్తామని పల్లె అంతా టాంటాం వేశాను. ఒంటి నిట్టాడి ఇంటికి మధ్యలో నిట్టాడి ఉంటుంది. రెండు నిట్ఠాళ్ళ ఇంటికి రెండు నిట్టాళ్ళు గోడల మీద ఉంటాయి. ఆ రెండు దూలాల మీద ఇల్లు నిలబడుతుంది.చిన్న ఇల్లు, దాని తడిక గోడలు, పీకి చిన్నపాక ఆగ్నేయం మూలకు వేసి, ఇంట్లోని సామాను అందులోకి చేర్చారు. ఆ ఎండల రోజుల్లో మేం అందులోనే ఉండేవాళ్ళం. లేదంటే వేపచెట్టు నీడన చేరేవాళ్ళం. కట్టబోయే ఇల్లు పన్నెండు అడుగులు వెడల్పు పద్దెనిమిది అడుగుల పొడుగు ఒకేగది.దానిముందు పంచ ఆరు అడుగుల వెడల్పు, పద్దెనిమిది అడుగుల పొడుగు, గోడలు పది అడుగుల ఎత్తు, పంచ తూర్పుకు వాలి ఉంటుంది. ఉత్తరం దక్షిణం నడవ. దక్షిణం తూర్పు మూల పొయ్యి. ఎడ్లబండ్లు ఎర్రమట్టి తోలితే దక్షిణపు బావి నీటితో తడిపి ముద్దలు ముద్దలు చేస్తే, ముద్దలు కూలీలు అందిస్తే మేస్త్రి కీటు పెట్టేవాడు. అయిదు కీటులు, కీటుకు కీటుకు మధ్య విరామం, కారణం కీటు ఎండాలి, బిగవాలి. ఐదు కీటులు పెట్టడానికి ఐదు వారాలు పట్టింది.కంసాలి బత్తుడు రెండు నిట్టాళ్ళు కావాలని ఒకటి పాతది సరిపోతుందని, రెండోది కొత్తది కావాలని తెప్పించాడు. రెండు నిట్టాళ్ళు పడమటి నుంచి తూర్పుకు గోడలమీద పండుకోబెట్టాడు. రెండు నిట్టాళ్ళ మీద మధ్యలో ఎనిమిది అడుగుల ఎత్తు కట్టెలు పాతి, వాటిని కలిపి వాటి మీదగా బొంగులు దిగేట్టు చేసి, నిలువు బొంగులకు అడ్డం వాసాలు వేసి, తాటి నారతో బిగదీసి కట్టేస్తే ఇంటి రూపం కనిపించింది.అంగలకుదురు నుంచి మా తాతలు ఎడ్ల బండ్లు రెండింటి నిండా తాటాకు పంపించారు. దాన్ని కప్పితే ఇల్లు ఎంతో అందంగా ఉంది. ఇంక పాక వదిలి, ఇంట్లోకి పోవచ్చును, అనుకుంటే మా అమ్మ 'వీల్లేదు' అంది. ఇంకా పాకలోనే ఉన్నాం .ఎండలు ఘోరంగా కాస్తున్నాయి. రోహిణి కార్తె అని, రోళ్ళు పగులుతున్నాయని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. పాక వదిలి బైటికి వస్తే కాలు గాల! నెత్తి గాల ! పాకలో ఉంటే వంట్లో ఉన్న నీళ్ళన్ని చెమటగా కారిపోతున్నై.పాకలో చెమట బాధ, బైట ఎండ గోల. బతకలేం అనుకునేవాణి కింద తలా కాలదు, కాలు కాలదు కానీ వడగాలి విదిలించి కొట్టేది. పడమటి శాంబరం నిప్పులు మోసుకొని వచ్చేది.పడమటి శాంబరం సుడిగుండం తిరిగితే చిన్న పిల్లల్ని ఆకాశంలోకి ఎతుకు పోయి సముద్రంలో పారేస్తుందని అందరూ భయపెట్టేవాళ్ళు.అమ్మ పాటి మట్టిని తెప్పించి, పేడ కలిపి గోడలు లోపలా వెలుపలా అలకడంతో పాటు నట్టిల్లు కూడా నాజూకుగా అలికింది. ఆరితే ఇంట్లోకి పోవచ్చునని చల్లగా ఉంటుందని చాలా ఆశపడ్డాను. ఇల్లు ఆరింది కానీ మా అమ్మ మమ్మల్ని ఇంట్లోకి పోనివ్వలేదు.గోడలకు సున్నాలూ కొట్టింది. ఇంక ఇంట్లోకి పోవచ్చునా- అంటే వీల్లేదంది, ఇల్లంతా వల్లమాలినన్ని ముగ్గులు వేసింది. 'ఈ రాత్రికి ఇంట్లో పడుకోవచ్చునాఅంటే 'వీల్లేద'ని అమ్మ కరాఖండిగా, తీక్షణంగా చెప్పింది. దొంగచాటుగా ఇంట్లోకి పోతే, ఇల్లు చల్లగా ఉంది. ఎండలేదు, మంట లేదు, చెమట లేదు. ఇంతలో అమ్మ అలికిడి వినిపించింది. గబగబా లగెత్తుకొచ్చి పాకలో నక్కాను.పూజారి వచ్చాడు. ఇంటి చుట్టూ తిరిగాడు. ఏమేమో గొనిగాడు. బియ్యంలో పసుపు కలిపాడు. ఇంటి చుట్టూ చల్లాడు, ఇంట్లో చల్లాడు. పంచలో రంగుదారాలు కట్టాడు. పొయ్యి మీద పాలు పొంగించారు. పాలు పొంగి పొయ్యి ఆరిపోయింది. కుండలోని పాలల్లో బెల్లం వేసి కలిపి, అమ్మ అందరికీ గిలాసుల్లో పోసి ఇచ్చింది.పాడి బర్రెను ఇంట్లోకి తోలుకొని పోయింది. ఇల్లంతా తిప్పింది. పంచలో తిప్పింది. తోలుకొని వచ్చి పాకలో కట్టేసింది. సూర్యుడు తూర్పున పొడిచాడో లదు | నన్నూ, చెల్లెల్ని ఇంట్లోకి తరిమింది. ఇల్లంతా తిరగమంది. ఇష్టమొచ్చిన చాటు కూర్చోమంది. లేకపోతే పడుకోమంది. చెల్లికి నడక రాదు. అడుగులు వేస్తుంది.పాకలోని సామానంత ఇంట్లోకి తెచ్చి పెట్టుంది. మా నాయన మంచం మీద కూర్చుని చోద్యం చూస్తున్నాడు.అమ్మకు సాయం చేయబోతే 'నువ్వాడ కూకో. ఏది ఏడ సర్దుకోవాలో నాకు బాగా తెలుసు,' అంది. ఉట్టి తెచ్చి నాయన కడితే 'అట్టాగేనా కట్టేది' అని గదురుకొంది.మెట్టు బల్ల పాకలోంచి తెచ్చి ఇంట్లో పెడుతుంటే “ఆడగాదు ఈడబెట్టు' అంది. నేను దెచ్చుకుంటాగా, నీకెందుకు పో కూకో' అంది. 'మోయలేవే!' అని 'నాయన అంటే 'అదెంత దాని బరువెంత? మోస్తాలే! నువ్వు కూకో' అంది. తేప తేపకూ చెప్పించుకోలేక మంచం మీద కాళ్ళు ఆడిస్తూ కూర్చున్నాడు నాయన.ఇల్లంతా సర్దుకొంది. మెట్టుబల్ల మీద వడ్ల బస్తాలు నాలుగు పెట్టాలి. 'ఏందా విచిత్రమైన సూపు? బస్తాలు నేను మోస్తానా?' అంది. 'మోయలేవు!' అన్నాడు నాయన 'మరి తే!! 'తెస్తానుండు'! 'ఏంది ? ఆలస్యం?' గదమాయించింది. నాలుగు బస్తాలు మెట్టు బల్లమీద పెట్టాడు. మా అమ్మ పాక దగ్గరకు వచ్చి, నిటారుగా నిలబడి ఇల్లు చూస్తూ, వెనక్కు వంగి నడ్డి విరుచుకొంది.'నడ్డిరిగేను” అన్నాడు నాయన. 'సాల్లే సంబడం' అంది అమ్మ. ఆ చెట్టు కింద, ఈ చెట్టు కింద బతుకీడుస్తున్న బర్రెల్ని దూడల్ని చూపించి 'ఆట్ని సావిట్లో కట్టేయ రాదూ!' అంది అమ్మ. వాటిని తోలుకొచ్చి కట్టేశాడు. అప్పటి దాకా అది మేమున్న ఇల్లు. ఇక పశువుల పాక.నాకు ఐదేళ్లు. చెల్లికి ఏడాది దాటలేదు. కొత్త ఇల్లు ఎంత చల్లగానో ఉంది. రాత్రి చాలా సుఖంగా ఉంది. మేం తిని పడుకున్నాం, రాత్రంతా వాళ్ళు మాట్లాడు కుంటూనే ఉన్నారు. 'కొత్త ఇంట్లో నీ కాపురం ఎట్టా ఉందే' అంది మా అమ్మమ్మ. 'మాకేం? బాగానే ఉన్నాం' అంది మా అమ్మ. కొంత నిష్ఠూరం ఉన్నమాట నిజమే!మా అమ్మ అన్నలు తమ్ముడు బంధువులు అందరూ వచ్చి ఇల్లంతా కల తిరుగుతున్నారు. 'బురద కాళ్లతో రావొద్దురా' అంటుంది. 'చెప్పుల కాళ్లతో ఇల్లంతా తొక్కొద్దురా' అంటుంది. 'మురికి ముకాల్లారా! ఇటు రావద్దురా' అంటుంది. మా ప్రకాశం పంతులు గారికి ఇల్లంతా చూపించింది. ఇవి కిటికీలు అంది. ఇది మచ్చు అంది. ఏందేందో అంది. పంతులుగారు 'ఆ!' 'ఉ!” అంటూ తల ఊపుతున్నాడు.'నీ కొడుకు బడికి వచ్చే వయస్సే!' అన్నారు పంతులుగారు. 'ఏడా? ఆడికి అయిదన్నా నిండలా!” అంది అమ్మ. 'ఇంట్లో సల్లగా, కడుపులోకి సల్ల కదలకుండా, ఈ ఏడన్నా ఉండనీయండి ఇంట్లో పంతులుగారు' అంది అమ్మ.'ఇల్లు బాగుందమ్మా బాగా కట్టించుకున్నావు' అన్నారు. ఆ పైట చెంగుకు చేతులు ఊరికే తెగ రుద్దుకుంది

S1 Ep 126'నా పేరు సొంబరా' - కథానేపధ్యం - మల్లిపురం జగదీష్ గారు.
'నా పేరు సొంబరా' కథపై ముందుగా మిత్రుడు రవికాంత్ వ్యాఖ్య, తరువాత , రచయిత జగదీష్ గారి కథానేపధ్యంపై వివరణ వినండి.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 124శ్రీరమణ గారి 'మిథునం' - ఫణి డొక్కా గారి స్వరాన!
కథ పేరు 'మిథునం'. శ్రీరమణ గారి రచన, తెలుగు కథను మరో మారు , అత్యున్నత శిఖరాలపై నిలబెట్టిన కథ.సుప్రసిద్ధ కథకులు, పత్రికా ప్రముఖులు శ్రీరమణ గారు సృష్టించిన ఒక అందమైన దాంపత్య జీవిత పొదరిల్లు.ఇదే పేరుతో తనికెళ్ళ భరణి గారి దర్శకత్వంలో తెలుగులో, వాసుదేవన్ నాయర్ గారి దర్శకత్వంలో మలయాళంలో చలన చిత్రంగా రూపు దిద్దుకోబడి, అనేక ప్రశంసలను అందుకుంది.ఈ కథను ఎంతో శ్రావ్యంగా తన గొంతుకన వినిపించారు, మిత్రులు ఫణి డొక్కా గారు. వారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. ఫణి డొక్కా గారి పరిచయం:వారు, చక్కటి కథా రచయిత, కవి, గాయకుడు, బంగారు నంది అవార్డు & రెమీ ఇంటర్నేషనల్ అవార్డులు పొందిన లఘు చిత్ర దర్శకుడు. గత ఇరవై ఆరు సంవత్సరాలుగా అమెరికాలోని అట్లాంటాలో నివసిస్తూ, తన వంతు సాహితీ సేద్యం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 250 కు పైగా కథలు, 1000 కు పైగా ఛందోబద్ధమైన పద్యాలు, 500 కు పైగా వచన కవితలు వ్రాసారు."పసిడి పూర్ణమ్మ" కూచి పూడి నృత్య రూపకాన్ని రచించారు. మేనకా విశ్వామిత్ర నృత్యరూపకానికి గాత్ర ధారణ చేసారు. శ్రీ వెంపటి చినసత్యంగారి శిష్యులచే ప్రదర్శింపబడిన "రుక్మిణీ కల్యాణం" కూచిపూడి నృత్య రూపకంలో పలుమార్లు అగ్నిద్యోతనుని పాత్ర, సూత్ర ధారుని పాత్ర ధరించారు. ఫణి గారికి వంశీ ఇంటర్నేషనల్ సంస్థ, అక్కినేని ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా "సాహితీరత్న" అనే బిరుదు ప్రదానం చేసాయి. భారతీ తీర్థ సంస్థ వారు "సాహితీ కళా భారతి" అనే బిరుదుతో సత్కరించారు. నాటా సంస్థ వారు విశిష్ట సాహితీ పురస్కారం తో సన్మానించారు. ప్రముఖ వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన కథల, కవితల పోటీలలో ఫణి గారు పలుమార్లు ప్రథమ బహుమతులు గెలుచుకున్నారు. 'పల్లకీ" (కథా సంపుటి), "టేకిట్ ఈజీ" (హాస్య వ్యంగ్య గల్పికలు) అనే రెండు పుస్తకాలు రచించారు. పల్లకీ పుస్తకాన్ని ఆ దశాబ్దంలో వచ్చిన 10 ఉత్తమమైన పుస్తకాలలో ఒకటిగా ఎంపిక చేసి, రాజా రామమోహన రాయ్ ఫౌండేషన్ వారు ఆ పుస్తకాలను కొనుగోలు చేసి, ప్రభుత్వ గ్రంథాలయాలకు పంపిణీ చేసారు. కీర్తిశేషులు శ్రీ.పెమ్మరాజు వేణు గోపాలరావు గారి పేరిట మైత్రి సంస్థ అందించే సాహిత్య విభాగపు బంగారు పతకాన్ని ఫణి గారు అందుకున్నారు. తెలుగువన్ రేడియో లో 300 కు పైగా తెలుగు సాహిత్య కార్యక్రమాలు ఫణి నిర్వహించారు. సుమారు ఐదువందలకు పైగా పాటల కార్యక్రమాలలో పాల్గొని సినీ, లలిత గీతాలు ఆలపించారు. వారాంతాలలో, వీలైనప్పుడల్లా అట్లాంటాలోని పిల్లలకు తెలుగు చదవటం, వ్రాయటం, మాట్లాడటం (అంతర్జాతీయ తెలుగుబడి) నేర్పుతూ ఉంటారు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 125'వడ దెబ్బ'!
కథ పేరు 'వడ దెబ్బ'.వడ దెబ్బ“వెధవన్నర వెధవలు! నడుం వాల్చనియ్యరు. మీ మొహాలు మండా! వస్తున్నా నుండండి. మీ బుర్రలు బద్దలు కొడతాను." కోపంతో ఊగిపోతూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ముసిలాయన గేట్లోకి పరిగెట్టేడు.గేటు సందుల్లోంచి చూస్తున్న పిల్లలంతా ఆయస గేటు దగ్గర కొచ్చేలోగా తుర్రుమన్నారు.ముసిలాయన తలుపు బార్లా తెరచి, జాపోస్తూ నిల్చున్నాడు. పారిపోయిన పిల్లలు సందు మొగని తొంగి తొంగి చూస్తున్నారు."బండ వెధవల్లారా ! బడుద్ధాయి గాడిదల్లారా ! రండి, మీ పని పడతా!" ముసిలాయన గట్టిగా అరిచేడు.ఎండాకాలం మధ్యాహ్నం. ఒళ్లు చిట చిట లాడుతోంది. నుదుటి మీంచి చెమట, ధారకట్టి ఆయన మొహం మీద ముడతల్లోంచి కిందికి కారుతోంది. వీపంతా పేత పొక్కులతో, గోనెగుడ్డలా దళసరి ఎక్కి పోయింది. వీధిలో మనిషన్న వాడు లేడు. అందరి ఇంటి తలుపులు బిడాయించుకుని ఉన్నాయి.గుంట వెధవలకి ఎండా లేదు కొండా లేదు. సందు మొగని నిల్చుని తొంగి, తొంగి, చూస్తున్నారు. ముసిలాయన ఎండలో నిల్చుని సందు వేపు తీక్షణంగా చూస్తున్నాడు. పిల్లలు ఏమను కొన్నారో ఏమో చల్లగా జారుకున్నారు."పోయారు వెధవలు, వారం రోజులై ఈ భాగోతం మొదలయింది. మధ్యాహ్నం, కాస్త నడుం వాల్చనియ్యరు" ముసిలాయన గొణుక్కుంటూ గేటు వేసి ఇంట్లోకి వచ్చేడు.జాపోస్తూ పడక్కుర్చీలో పడుకున్నాడు.నరసారావు పేట పడక్కుర్చీ!దాంట్లో పడుకుంటే ప్రాణం సేద తీరుతుంది.ఆయన ఆ కుర్చీని తన మొదటి జీతంతో కొనుక్కున్నాడు. చిన్నప్పటినుండి ఆలాంటి కుర్చీ ఓటి ఉంటే బాగుంటుందని ఆయనకి మా కోరిగ్గా ఉండేది. మొదటి జీతం చేతికి రావడం ఏమిటి, కుర్చీ కొండం ఏమిటి!రిటైరై కొడుకూ కోడలి దగ్గరకి పూర్తిగా వచ్చేస్తున్నప్పుడు మిగతా సామాన్లు వాళ్లకి, వీళ్లకీ పంచేడు కాని, ఆ కుర్చీని మాత్రం జాగ్రత్తగా తనతో కూడా తెచ్చుకున్నాడు. “నాన్న గారూ! మీరూ మీ చాదస్తం గాని, ఆ కుర్చీని అక్కడెవరికన్నా ఇచ్చిలేకపోయారూ ? అంత దూరం నుంచి ఇక్కడికి మోసుకొచ్చేరు!" అన్నాడు కొడుకు.కొడుక్కేం తెల్సు, ఈ కుర్చీలో ఉన్న సౌఖ్యం.ముసిలాయన కుర్చీ చేతుల మీదకి, రెండు కాళ్లూ జాపుకుని విసనకర్రతో విసురుకుంటూ కళ్లు మూసుకున్నాడు.“తెల్ల మీసం! తాటేకు విసనకర్ర, వెండి మీసం తాటేకు విసన కర్ర!"పిల్లలు మళ్ళీ వొచ్చిపడ్డారు. నవ్వుతున్నారు. గేటుసందుల్లోంచి చూస్తున్నారు.ముసిలాయన కి తాటేకు విసనకర్రే గతి అయింది.సీలింగు ఫేను లోపలిగదిలో ఉంది. కొడుకూ కోడలూ అందులో ఉంటారు. ముందు గదిలో ఫేను లేదు.తండ్రి రిటైరై వచ్చేడని మరో ఫేను కొడుకు వెంటనే ఎక్కడ కొంటాడూ! ఆదివారం సంతలో ముసిలాయన అరడజను విసనక్రరలు కొనుక్కు తెచ్చుకున్నాడు.తాటికమ్మా ! తాటిముంజ! తెల్ల మీసం వెండి మీసం!" ముసిలాయన ఈసారి కుర్చీలోంచి లేవలేదు. కుర్చీలో పడుకునే గేటు వేపు చూస్తూ ఊరుకున్నాడు.గేటు సందుల్లోంచి కొన్ని జతల కాళ్లు కని పిస్తున్నాయి. ఎర్రరంగు గౌను, నీలంరంగు రిబ్బనూ కనపడుతున్నాయి.అన్ని కాళ్ళకి హవాయి చెప్పులు ఉన్నాయి. ఆ కాళ్లలో బుల్లిగాడి కాళ్లు ఏవైఁ ఉఁటాయో అని ముసిలాయన తేరిపారి చూసేడు. ఆ బుల్లి గాడు మా కాని వెధవ! ఆ వెధవే ఈ సజ్జు నంతటినీ తీసుకొచ్చి గొడవ చేస్తున్నాడు.ఇదే తంతు. వెధవ సన్నేసులకి భయం అన్నది ఏ కోశాన్నీ లేదు.మధ్యాహ్నం అయీ అవడంతో వొచ్చిపడ్డం. గేటు సందుల్లోంచి చూడ్డం.ఒకటా రెండా-కాళ్లు, ఆరుగురో, ఎనమండుగురో! బొత్తిగా చిన్న వెధవలూ ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలూ ఉన్నారు.మొదటి రోజు తిట్టేడు. కొడ్తానని కేకలేసేడు. ఎవరి పిల్లలని అదిలించేడు. అన్నిటికీ పకపక నవ్వులే.ఆయన తిడుతున్న కొద్దీ వాళ్లకి మరింతనవ్వు. "బుల్లిగా బుల్లిగా!" అంటూ పరుగులు.నిన్నటికి నిన్న ముసిలాయనకి చిన్న మాగన్ను పట్టింది. “తాటిముంజలండి ! తాటిముంజలండి !" చెవిలో కేక పడ్డాది. ముసిలాయన లేచి కూచున్నాడు. “ఏయ్ తాటి ముంజలూ!" అని చీడీ మీంచీ కేకేసేడు. “ఏయ్ తాటి ముంజలూ! ఏయ్ తాటి ముంజలూ" అని పిలుస్తూనే ఉన్నాడు.తాటిముంజల వాడి అరుపు దూరం అయిపోతూ సందు మొగనుంచి వినపడుతోంది. ఊడిపోతున్న పంచెని దోపుకుంటూ ముసిలాయన గేటువరకూ పరిగెట్టుకు వెళ్ళేడు.“తాటిముంజలండోయ్! తాటి ముంజలు", అరుపు వినపడుతోంది. ముసిలాయన వీథిని ఆటూ ఇటూ చూశాడు.“ఏయ్ తాటిముంజలూ!" అంటూ కేకేశాడు.సందు మొగనుంచి మళ్ళీ “తాటిముంజలండి తాటి ముంజలు!" అని వినిపించింది ముసిలాయన అటు చూసేసరికి పిల్లలంతా గొల్లని నవ్వేరు.ఓకుర్రాడు ఏతాడి తాతలా "తాటిముంజలండి తాటిముంజలు" అని అరుస్తున్నాడు.ముసిలాయనకి వెర్రి కోపం వచ్చింది.“దొంగ వెధవల్లారా! సన్నాసి వెధవల్లారా !" అని తిడుతూ వెర్రి పీరులా ఊగిపోతూ వీదంట పరిగెట్టేడు. -“బుల్లిగా! చచ్చేంరోయి!"అంటూ పిల్లలు పరుగు లంకించుకున్నారు.. అప్పుడు తెలిసింది 'బుల్లిగాడు' ఆ కుర్ర కుంకల లీడరు గాడని!“అమ్మడూ, ఆ బుల్లిగాడెవరో నీకు తెల్సా?" అని కోడల్ని అడిగేడు.కోడలు మా తల్లి తిన్నగా జవాబిస్తుందా? తను వచ్చిందగ్గర్నుంచి చూస్తున్నాడు. తన పొడ ఆవిడకి కిట్టటం లేదని తెలుస్తూనే ఉంది.“ఏమో ఎవడికి తెల్సు? బుల్లిగాడో, మల్లిగాడో, రోజూ న్యూసెన్సు. వాళ్లూ సరి మీరూ సరి! లక్షా తొంభై సార్లు చెప్పేను. తలుపులు వేసుకు పడుకోండి అని! ఉహూఁ మీరెక్కడ వింటారూ? పోనీ తలుపు తీసుకుంటే తీసుకున్నారు.ఆ కర్టెను ఉండనిస్తారా? చచ్చీ చెడీ ఆ ఎంబ్రాయిడరీ చేసేను. నలిపి నలిపి తలుపు మీదికి ఎత్తి పెట్టారు."కోడలు విసుక్కుంది.ముసలాయనకి తలువులు బిడాయించుకోవడం, తెర గుడ్డలతో ఇల్లంతా చీకటిమయం చేసుకోవడం ససేమిరా కిట్టదు. గాలీ వెలుతురూ రాకుండా, బైట ప్రపంచం కనపడకుండా ఉండటం ఆయనకిరాదు.ఆయన కొడుకు దగ్గరికి రావడం ఏమిటి, సావిడి గదిని తనదిగా చేసు కోడం. వీధి గుమ్మాని కెదురుగా నర్సారావుపేట పడక్కుర్చీ వేసు కోడం, దాంట్లో పడుకుని, వీధి వేపు చూస్తూ, ఆకాశాన్ని చూస్తూ చుట్ట కాల్చుకోడం మొదలయింది.ఆయన బతుకు బతుకంతా బాహాటంగా బతికేడు. బతుకులో రహస్యమన్నది లేదు.ఆయన రాక పూర్వం అయితే వీధి తలుపులు వేసి ఉందేవి. అధవా తీసి ఉన్నా నిండా కర్టెను ఉండేది. ముసిలాయన వీధి తలువులు బార్లా తెరవడమే కాదు. ఆ కర్టెను ఎత్తి తలుపు మీదకి పడేస్తాడు. అప్పటికిగాని ఆయనకి ఊపిరి తీసు కున్నట్టు ఉండదు.ముసిలాయన చేసే పన్లలో తన యింటి డీసెన్సీ పోయిందని కోడలి బాధ. గుమ్మానికి ఎదుర

S1 Ep 123'నా పేరు సొంబరా ' - మల్లిపురం జగదీష్ గారు
హర్షణీయంలో వినబోతున్న కథ శ్రీ మల్లిపురం జగదీష్ గారు రచించిన 'నా పేరు సొంబరా'ఇది వారు రచించిన 'గురి' కథాసంకలనం లోనిది. (ఈ పుస్తకం లభ్యత గురించిన వివరాలు ఇదే వెబ్ పేజీ క్రిందిభాగం లో ఇవ్వబడ్డాయి.)ఏజెన్సీ ప్రాంతాల్లోని జన జీవన సమస్యలపై సాధికారంగా రచనలు చేస్తున్న జగదీశ్వరరావు గారు, విజయనగరం జిల్లాలోని ఒక గిరిజన గ్రామంలో జన్మించి, 'టిక్కబాయి' ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ, రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.ఇంతకు మునుపు వారు రాసిన 'సిల కోల' కథాసంకలనంలో కానీ, 'గురి' అనే ఈ కథా సంకలనంలో కానీ, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన కథల రూపంలో విస్తృతంగా చర్చించడం జరిగింది.ఈ కథ ద్వారా రచయిత , గిరిజనుల జీవితాల్లో వస్తున్న కొన్ని సామాజిక మార్పుల గురించి , వాటి కారణంగా ఉనికిని పూర్తిగా కోల్పోతూ , వారు పడుతున్న వేదన గురించి మన మనసుకు హత్తుకునేలా నివేదిస్తారు.కథ ఆడియో చివరన , జగదీష్ గారు , కథానేపధ్యాన్ని గురించి తెలియజేయడం జరుగుతుంది. హర్షణీయం ద్వారా మీకు తన రచనను అందించడానికి అనుమతినిచ్చి, శ్రోతలకు కథ గురించి వివరించిన జగదీష్ గారికి కృతజ్ఞతలు.* కథలో బోల్డ్ ఫాంట్ లో వున్న పదాలకు , పేజీ చివరన అర్థాలు ఇవ్వడం జరిగింది. నా పేరు సొంబరాకలెక్టరు కార్యాలయం... గ్రీవెన్స్ రోజు. గుంపులు గుంపులుగా జనం. సమస్యలన్నీ సాయం కోరుతూ. వరండా నిండా వరుసల్లో. ఎదురు చెట్ల కింద చెల్లా చెదురుగా ఎవరి ఆతృత లో వాళ్ళు.ఊపిరాడని ఉక్క, ఒళ్లంతా చెమట, చికాకు. క్షణ క్షణం నాలో అసహనం. ఎవరి మీదో చెప్పుకోలేని కోపం. వరండా చివర టాయిలెట్స్ లో దూరి ముఖమ్మీద నీళ్లు చల్లుకున్నాను. రిలాక్స్ అయ్యాను. ఎదర అద్దం. నన్ను నేను చూసుకున్నాను.వెడల్పాటి ముక్కు, విశాలమైన నుదురు, వంపులు తిరిగిన జుట్టు. నా వయసప్పుడు నాన్న ఇలాగే వుండి వుంటాడు.నాన్న ఇప్పుడు ఉండివుంటే, అన్నదమ్ముల్లా వుండే వాళ్ళం.నేను పుట్టగానే తాత, నాన్నని కౌగిలించుకొని ముద్దులాడేడట.“నిలబెట్టేవురా! జాతి కాపు కాసినోడివనిపించేవురా!!” అని , రెండు ఎడ్లని కొని కానుక గా యిచ్చేడట. పుట్టిన వెంటనే నన్ను చేతుల్లోకి తీసుకొని అడవి వైపు చూపిస్తూ 'ఇదిగో నా రాజు... అడివికే రారాజు" అని గర్వంగా తాతల్నందర్నీ స్మరించుకున్నాడట.నేను పుట్టడం ఇంటికే కాదు, ఊరికే పండుగట. ఎందుకంటే వూరికి పెద్ద అయిన తాత కి పుట్టిన ముగ్గురన్నదమ్ముల్లో అందరికీ ఆడపిల్లలే. చిన్నవాడైన నాన్నకి పుట్టిన ఏకైక మగ సంతానం నేను.నాకు గుర్తొస్తోంది....తాత భుజమ్మీద గుర్రంపండేసుకుంటే తాత వుంగరాల జుట్టు పట్టుకుని నేను రాజునై వీధులన్నీ ఊరేగేను. రెండు చేతుల్లోనూ కిన్నెర పట్టుకుని నన్ను పాటలు పాటలుగా తిప్పేవాడు తాత. అదే భుజాల మీద డప్పు దరువుల్లో కొత్త వూర్లు, కొత్త కొండలూ, వింత వింతల అడవీ చూసేను. ఆ భుజాల మీదే... తాత పెదాల మీద పలికిన పిన్ల కర్ర పాటల్లో ముత్తాతల గొంతులు విన్నాను. మా ఇద్దరి వైభవం చూసి వూరంతా ముచ్చట పడేది.నాకు పేరు పెట్టడానికి ఇంటికి ఆకుల తోరణం కట్టించేరట. ఎజ్జోడిని పిలిపించి ఇంటి దేవత మూల "కానికు” వేయించేరు. దీపం వెలుగులో అమ్మ ఒడిలో వున్న నన్ను తాత ఎత్తుకుని చేటలో బియ్యం నెరుపుతు గుగ్గిలం వేసి ధూపం పట్టేరట. ఎజ్జోడు ముంతలో నీళ్లను చిలకరిస్తూ రాగాలు తీసి దేవతలందరినీ స్మరించేరట. మా వంశం లోని అందరి పేర్లూ గొంతెత్తి పలుకుతున్నాడట. ఒక్కొక్క పేరుకీ ఒక్కొక్క బియ్యం గింజను నీటిలో వేస్తున్నాడట. చుట్టూ మూగిన చుట్టాలు. వూరి వాళ్లూ, బంధువులూ ఆతృతగా ఆ ముంతలోని బియ్యం గింజలు వైపే చూస్తున్నారట. ఏ పేరు పలికినపుడు గింజ నీటిలో మునుగుతుందో అదే నా పేరు.మంగడూ... బారికీ... ఆ లక్కాయీ... సన్నాయీ... సుక్కూ ... సొంబరా...చివరి పేరుకి బియ్యం గింజ నీట మునిగింది. ఒక్కసారిగా ఉల్లల ఉత్సవం... వూరంతా వెలుగు. తాత ఒక్కసారిగా ఎగిరి గెంతేసేడు. వీధుల వెంట నన్నెత్తుకుని ఊరేగించేడు. తుడుం కుండ నడుముకి కట్టి నడిరేయి దాకా వాయిస్తూ... ఏజామునో నిదుర పోయేడట. తాత కంత సంబరం. ఎందుకంటే... నాకు దేవతలిచ్చిన పేరు ఎవరిదో కాదు, మా తాతదే. “నా జాతిని నిలబెడతాడు... నా మనవడు” అనే కన్ను మూసేడు తాత.----------------------------------------------“రాబర్టూ! రాబర్టూ!!” ఎవరో పిలుస్తున్నారు. నన్నే... నన్నే.... నన్నే.నా పిడికిలి బిగుసుకుంది. బలంగా గాల్లోకి చేయి విసిరేను. ఎదురుగా వున్న అద్దం ముక్కలయ్యింది. నా గుండెలాగే.ఇప్పుడు నా పేరు రాబర్ట్ విల్సన్... ఔను రాబర్ట్ విల్సన్.నన్ను నా నుంచి దూరం చేసిన పేరు, నేను నేను కాకుండా పోయిన పేరు. గుండెలోని గాజు పెంకుల్ని కెలుకుతున్న పేరు. -నేను 'సొంబరా' నుంచి 'రాబర్ట్ విల్సన్' గా ఎలా రూపాంతరం చెందేనో లీలగా గుర్తొస్తోంది నాకు. -ఆ రోజు నాన్న నన్ను హాస్టల్లో చేర్పించడానికి వచ్చిన రోజు. అప్పటికే వేరే స్కూల్లో నాలుగు చదివి మానేసిన నాకు సీటివ్వడం కుదరదన్నారు. మాష్టారు. ఆ స్కూలు నుండి టీ.సీ. తెస్తే గానీ చేర్పించడం వీలవదని అంటూనే ఒక మార్గం చెప్పేరు. అక్కడ వున్న పేరు కాకుండా వేరే పేరున ఇక్కడ చేరడం. అప్లికేషన్ నింపుతూ మాష్టారికి నచ్చిన సినిమా హీరోల పేర్లు చెప్తూ వచ్చారు... నాన్న దేనికి తల వూపుతాడోనని.“అవేవీ ఒద్దండీ... రాబర్ట్ విల్సన్ అని రాయండి? కొత్త గొంతు వినపడింది. అతని వైపు చూసేను. తెల్లబట్టలేసుకొని, చేతిలో నల్లటి పుస్తకంతో వున్నాడతను. మెడలో సిలువ వేలాడుతో.. అతను తరచూ వూరు రావడం, ఇంటికి దగ్గరవడం నాకు గుర్తుకొచ్చింది అప్పుడు. "ఇదేటి వోయ్! ఇలగుందీ పేరు?” అని నాన్నని అడిగారు మాష్టారు ఆశ్చర్యంతో. నాన్న నేల చూపులు చూస్తున్నాడు.“మీము మతము తీసుకున్నాము” అని నాన్న అమాయకంగా అనడం నాకింకా గుర్తే .మతమూ... తీసుకోవడమూ!? తీసుకోవడానికి ఎవరిస్తారు? ఎందుకిస్తారు? అసలు ఇవ్వడమేమిటి? మతమంటే ఏమిటి? మా వూరికి మతమెలా వొచ్చింది? మరి అప్పుడు మా వూరెలా వుండేది?బద్దలైన అద్దం పెంకుల్లో నా ప్రతిబింబంలా... పగిలిన నా గుండె లోతుల్లోంచి వెల్లువెత్తుతున్న హృదయ ఘోషలా...ప్రశ్నలు... సందేహాలు....తాతల నాటి ముచ్చట్లలో మా వూరిని చూసేను. ఇప్పుడు ప్రధాన రహదారికి నాలుగు కొండల అవతల, అడివికి ఆమడ దూరంలో, చుట్టూ పొలాలతో మూడే మూడు వ

S1 Ep 122పి.రామకృష్ణ గారి కథ - 'దయ్యం'
'భయాన్ని దాటడమే జ్ఞానం' అన్న గొప్ప విషయాన్ని , తేలికైన తేట తెలుగులో మనకు వివరిస్తారు ప్రసిద్ధ కథకులు , విమర్శకులు , పాత్రికేయులు శ్రీ. పీ. రామకృష్ణ గారు, తాను రచించిన 'దయ్యం అనే ఈ కథ ద్వారా.ఇంత చక్కటి కథను హర్షణీయం ద్వారా అందించడానికి, అనుమతిని ఇవ్వడమే కాక, కథ పై హర్షణీయం చేసిన వ్యాఖ్యకు స్పందిస్తూ , కథా నేపధ్యం గురించి, ఆడియో ద్వారా వివరించిన శ్రీ.రామకృష్ణ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.రామకృష్ణ గారి సమగ్ర సాహిత్యం కొనేటందుకు కావలసిన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.ఉపోద్ఘాతం:‘భయం’ అనుభవించని మనిషిని , ఊహించడం కష్టం.మన భయానికి కారణం - ఒక మనిషి కావచ్చు, ప్రత్యేకమైన వాతావరణం కావచ్చు, ప్రదేశం కావచ్చు, లేదా అప్పటి మన మానసిక స్థితి కావచ్చు. భయపడుతున్న పరిస్థితుల్లో , తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి మన జీవితాలని విపరీతంగా ప్రభావితం చెయ్యవచ్చు. నెగటివ్ గా కానీ , పాజిటివ్ గా కానీ. 'భయాన్ని దాటడమే జ్ఞానం' అన్న గొప్ప విషయాన్ని , తేలికైన తేట తెలుగులో మనకు వివరిస్తారు ప్రసిద్ధ కథకులు , విమర్శకులు , పాత్రికేయులు శ్రీ. పి. రామకృష్ణ గారు, తాను రచించిన 'దయ్యం అనే ఈ కథ ద్వారా.కథలో ముఖ్య పాత్రలు ఒక పల్లెటూరిలో ప్రభుత్వ పాఠశాల లో పని చేసే ఒక ఉపాధ్యాయుడు (ఆయనే కథకుడు) , ఆయన క్లాస్ లోనే చదువుకునే ఒక బీద విద్యార్ధి, ఆ విద్యార్ధి తల్లి .కథలోకొస్తే -ఒక రాత్రి, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో , కథకుడైన టీచరు గారు, పక్కనున్న పట్టణం నుంచి , పల్లె కి నడిచి రావాల్సి వస్తుంది, మధ్యలో వున్న పొలాల గుండా. వాతావరణాన్ని , కథ మొదట్లో అందంగా ఆహ్లాదంగా ఉందని వర్ణిస్తారు రచయిత.ఆ నడిచే దారి ఆయనకు కొత్తదేమీ కాదు. అలాగే రాత్రి పూట పొలాల వెంబడి నడక గూడా టీచరు గారికి అలవాటు లేని విషయం కాదు.నడుస్తూ వున్నప్పుడే, అంతర్మధనం మొదలౌతుంది ఆయనకు. తన జీవితంలో అప్పుడున్న పరిస్థితులూ, ఎదుర్కొంటున్న చికాకులూ , నిరాశ చెందే విషయాలూ అన్నీ గుర్తుకొస్తాయి. కథకుడి మానసిక పరిస్థితి , పూర్తిగా మనకు అవగతమౌతుంది. ఇట్లా అతను నడుస్తూండగానే , తన పాత్ర మానసిక పరిస్థితిని, సూచిస్తున్నట్టుగా, వాతావరణం మారిపోతుంది. చీకటి కమ్ముకుంటుంది . ఉరుములూ మెరుపులూ మొదలౌతాయి. వూరికి వెళ్లాలంటే 'దయ్యం మాను' అనబడే ఒక చింత చెట్టుని దాటుకు వెళ్ళాలి. ఆ దయ్యం మాను గురించి వూళ్ళో వాళ్ళు చెప్పుకునే కథలూ....... ఆ చెట్టుని అంటి పెట్టుకుని వుంది, అని అందరూ అనుకునే, , చనిపోయిన అంకమ్మ, తన దగ్గర క్లాసులో చదువుకునే అంకమ్మ కొడుకు పది పన్నెండేళ్ల గొల్ల పాపయ్య, వాళ్ళ వికృతమైన రూపాలు ఇవన్నీ గుర్తుకొస్తాయి.ఎన్నోసార్లు ఆ మానుని నిర్భయంగా దాటుకుంటూ వెళ్లిన, ఆయనకు మనసులో ఒక చిన్న సందేహం మొదలౌతుంది. చెట్టువైపు నించి ఏడుపు వినబడడం మొదలౌతుంది.వింటున్నది చూస్తున్నది నిజమా , కాదా అనిపించి ఆ సందేహం , పెనుభూతంగా మారి మనసూ , వొళ్ళూ, అంతా ఆవరిస్తుంది. సరళమైన పదాలను వాడుకొని అద్భుతమైన వాక్యాలను సృష్టించి, కథా నిర్మాణం చేశారు రామకృష్ణ గారు. ఈ రీతిలో , కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకువెళ్లి ఒక అద్భుతమైన ముగింపు ఇస్తారు రచయిత.కథ చివరలో టీచరుని, స్టూడెంటుగా , స్టూడెంట్ ని టీచరుగా మార్చివేస్తారు రామకృష్ణగారు చాకచక్యంగా. నిస్సదేహంగా 'దెయ్యం' తెలుగు కథాసాహిత్యంలో మనకు లభించిన, అత్యుత్తమ కథల్లో ఒకటి.దయ్యం:నేను రోడ్డు దిగేటప్పుడు సూర్యుడు పడమటదిగిపోయినాడు. పొలాలదారి వెంటనడుస్తున్నాను. విశాలమైన, పైరులేని సేద్యం చేసిన పొలాలు ప్రశాంతంగా వున్నాయి. నీలం రంగు ఆకాశం కింద దూరానికి కనిపించే నిశ్చల సముద్రం మాదిరి కనిపిస్తున్నాయి. కాళ్ళ కింద బండ్ల జాడలు ఏర్పరచిన గోతులు ఎండి పెళ్ళలుగా మారి చెప్పుల్లేని పాదాలను నొప్పిస్తున్నాయి. వారం రోజుల కిందట పెద్ద వర్షం కురిసింది. తేమ ఆరీ ఆరక ముందే రైతులు పొలాలకు ఎరువుతోలుకున్నారు. ఇప్పుడు ఎరువుతోలి సేద్యం చేసుకుంటే, ఈసారి వర్షానికి విత్తనం వేసుకోవచ్చని వాళ్ళ తొందర. ఒక్కవర్షం వృధా అయితే, ఎంత నష్టమో అది మెట్ట రైతుకే తెలుసు.ఈ వేళ పట్టణంలో చెప్పులు కొనుక్కోవాలనే ఆలోచనతో చార్జీలకు గాక పదిరూపాయలు ఎక్కువే జేబులో వేసుకున్నాడు. కానీ, పదిరూపాయలకు చెప్పులు కొనగలిగిన పరిస్థితి నుంచి దేశం చాలా 'అభివృద్ధి'ని సాధించిందని అర్థమయింది. ఎక్కడో ఉరిమిన శబ్దం ఆలోచనను కదిలించింది. ఈ వేళ పగలు ఎండ చాలా తీవ్రంగా వుంది. ఇప్పుడు ఉరిమింది (అది ఉరుమేనా? ఏదన్నా శబ్దమా?) ఇంకా రెండు మైళ్ళ పైనే నడవాలి. దారిలో వర్షమొస్తుందేమో, గొడుగన్నాలేదు. గొడుగు కొనాలన్న 'ఆశయం' కూడా వుంది. ఆ ఆశయం పుట్టినప్పుడు ఏడెనిమిది రూపాయలో సాధ్యమయ్యేది. ఇప్పుడు రెండు మూడు రెట్లకు కానీ సాధ్యమయ్యేట్టు లేదు. అవసరాలు తీరడమే గగనంగా వుంటే, ఆశయాలు తీరేదెన్నడు? చెప్పులూ, గొడుగూ ఇట్లాంటివి అవసరాలే. అవీ అందనంత ఎత్తుకు వెళ్తే ఆశయాలవుతాయి. నవ్వొచ్చింది.ఈ సారి స్పష్టంగా ఉత్తరం దిక్కున పుట్టిన ఉరుము తూర్పున సరిగ్గా పొద్దుపొడిచే ప్రాంతం దాకా పయనించింది. ఇంతవరకూ కనిపించనిమేఘాలు ఆకాశం అంచులనుంచి పైకి లేస్తున్నాయి. ఉరుము అనే పిడికిలి దెబ్బకు మేఘం తల బద్దలైనట్టు మెరుపు చీల్చుకుని పోయింది. చల్లని గాలి తాకుతోంది. ఖాయంగా వర్షమొస్తుంది. వర్షమొచ్చేలోపల ఇల్లు చేరుకోడమొక్కటే ఇప్పుడు 'ఆశయం'. వడివడిగా అడుగులేస్తున్నాను. దారి కనిపించని కనుచీకట్లు వ్యాపిస్తున్నాయి. ఇంతకు ముందటి కంటే ఎక్కువగా పాదాలు దెబ్బలు తింటున్నాయి. తోడి టీచర్‌ను జిల్లా చిట్టచివర్న, గుట్టలనడుమ కట్టిన స్కూలుకు బదిలీ చేశారు విద్యాశాఖాధికారి. టీచర్ భార్య నిండుగర్భవతి, తల్లి గుడ్డిమనిషి, తండ్రి జబ్బు మనిషి, పుడు పనిచేస్తున్న ఊరు ఆయన స్వగ్రామం. కట్టుకొంటున్న కొంప సగంలో వుంది.విద్యాశాఖాధికారి యువకుడు, నా తమ్ము

Ep 121'నేతి గారెలు' కథ , కథానేపధ్యం - ఆచార్య కొలకలూరి ఇనాక్
హర్షణీయంలో ఈ ఎపిసోడ్లో మీరు వినబోతున్న కథ, సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘నేతి గారెలు ’. ఇది వారి ‘మనూళ్ళల్లో మా కథలు ’ అనే కథాసంకలనం నుంచి స్వీకరించబడింది.ఈ ఎపిసోడ్లో ప్రత్యేకత, ఆడియో చివరన కథా నేపధ్యాన్ని ఆచార్య ఇనాక్ గారు స్వయంగా మనకు వివరించటం.సంకలనంలోని కథలన్నీ ఆయన బాల్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా, వారు రాసినవి.కథలన్నీ కూడా డెబ్బయి ఏళ్ల క్రిందటి గ్రామీణ జీవితాన్ని వివరిస్తూ, అప్పుడున్న సామాజిక పరిస్థితిని మనకు కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తాయి.తమ రచనను హర్షణీయం ద్వారా అందించడానికి అనుమతినిచ్చినందుకు, కథా నేపధ్యం , హర్షణీయం శ్రోతలకు అందించినందుకు ఆచార్య ఇనాక్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.డిసెంబర్ నెలలో వారి ఇంటర్వ్యూ ‘హర్షణీయం’ ద్వారామీరు వినవచ్చు. అప్పుడు మరిన్ని వివరాలు వారి రచనా జీవితాన్ని గురించి తెలుసుకోవచ్చు.‘మన ఊళ్ళల్లో మా కథలు’ కథాసంపుటి ప్రతులకు సంప్రదించండి -జ్యోతి గ్రంథమాల4-282, యన్ యస్ నగర్మీర్ పేట్, హైదరాబాద్ - 500 097.ఫోన్: 94402 43433నేతి గారెలు:మా వూరు వేజండ్ల. అప్పట్లో గుంటూరు తాలూకాలో, ఇప్పుడు చేబ్రోలు మండలంలో ఉంది. మా వూరు రెండు భాగాలు. రైలు కట్టకవతల ఊరు, ఇవతల పల్లె. పల్లె వాళ్ళల్లో కొందరు, ఊరివాళ్ళ ఇళ్ళల్లో జీతగాళ్ళు.గమిని శ్రీరామయ్య గారింట్లో మా నాయన పెద్ద జీతగాడు. పొద్దు పొడవక ముందు ఇల్లొదిలి వెళ్ళేవాడు. పొద్దుమునిగాకే వచ్చేవాడు.నాకప్పుడు ఎనిమిదేళ్ళు, చెల్లెలికి నాలుగు, తమ్ముడికి కొన్ని నెలలు. మా నాయన్ని చూసిన రోజు మాకు పండగ..నేనప్పుడు మాపల్లె బడిలో మూళ్ళోకొచ్చా. తెలుగు వాచకం కొత్త వాసనింకా పోలా. అప్పుడు శ్రీరామయ్యగారి చిన్నజీతగాడు పెదోడై, పెళ్ళె వెళ్ళిపోయేడు. గొడ్డుగాసే బుడ్డో డొకడు, మా దొరగారికి కావలసి వచ్చేడు. 'మీ బుడ్డాణ్ణి మా గొడ్డకాడ బెట్టరా' అని దొరగారు మా నాయనతో అన్నాడు. మా నాయన 'సరే' నన్నాడుమన పెద్దోణ్ణి దొరగారి గొడ్డ గాయటానికి పంపుదా'మన్నాడు మా నాయన మా అమ్మతో.మా అమ్మ వద్దంది. 'సదూకోనీయ్' అని అంది. అట్టా కాదన్నాడు మా నాయన. మా అమ్మ 'అదిగాదు' అంది. మా నాయన మొండికి తిరిగాడు. మా అమ్మ తండుకేసి కూసుంది. 'నా మాటపోద్ది” అన్నాడు మా నాయన. “ఆడి సదూ సెడుద్ది” అంది మా అమ్మ. ఆళ్ళూ ఈళ్ళూ పోగయ్యారు, సర్దుబాటు చేశారు.ఎప్పటికయినా కూలో నాలో చేసుకు బతకాల్సినోళ్ళమేగా. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే సేరనీ' అన్నారు.ఆడగూతురు, అమ్మ ఏం జేసుద్ది? పెనిమిటిని కాదంటదా? అన్నలమాట పెడచెవిని పెడతదా? ఏడుస్తూ కళ్ళు తుడుసుకొంది.నన్ను పొద్దున్నే నిద్రలేసి, రెక్క పట్టుకొని లాక్కెళ్ళేడు మా నాయన ఊళ్ళోకి, దొరగారి సావిట్లోకి, గొడ్లకాడికి. నాకేడుపు ఆగలేదు.సదూకుంటా' నన్నాను. 'ఏడిసేవులే!” అన్నాడు మా నాయన. ఏడుస్తానే ఉన్నాను. పలకా బలపం, తెలుగువాచకం, ఎక్కాల పుస్తకం, సంచీ ఏడుస్తున్నట్టు అనిపించింది.పొదున్నే లేవాలి. ఊళ్ళోకి పోవాలి. గొడ్డకాడి కసువు పేడ వేరువేరుగా తీయాలి. అవన్నీ ఊడవాలి అప్పుడు బూసిమ్మ బువ్వ బెట్టుద్ది. ఆనక గొడ్డు దోలుకు పోవాలి. బూసిమ్మకూ, నాకూ, మంచిమాలిమిఆమె మాట్లాడకుండా బువ్వ పెట్టదు. నేను మాట్లాడకుండా తినకూడదు. బూసిమ్మ అంటే శ్రీరామయ్యగారి భార్య. దొడ్డ ఇల్లాలు. పెట్టు పోతల్లో పెద్దసేయి. ఎముకల్లేని సేయి. ఆమెకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు రాధాకృష్ణయ్య. కమ్యూనిష్టని పెద్ద పేరు. పెళ్ళయింది.రెండో దొర రాఘవయ్య. పెళ్ళీడు కొచ్చేడు. పెద్ద పెడసరపు యవ్వారం. మంచోడే! మూడో ఆయన రాజయ్య. గుంటూరు బళ్ళో సదూలు సదువుతున్నాడని గొప్ప పేరు. ఆ ముగ్గురిలో ఎవురూ గొడ్డు గాయరు. రాజయ్య నాకంటే నాలుగేళ్ళు పెద్దాడు. సదూకొంటున్నాడు. ఉన్నోడుగా, గొడ్డుగాయడు. నేను బడికి పోతున్నా, లేనోణ్ణిగా గొడ్డుగాయాలి. అందుకే జీతానికి కుదిరా.బువ్వకాడ బూసిమ్మకూ, నాకూ ఒకటే తంతు. 'ఎందుకురా మొడ్డుకుమల్లె అట్టా నిలబడ్డా, గిన్నె దెచ్చుకోకా?” అనేది. గిన్నె దెచ్చుకొని కూసుంటే 'నోరు లేదా మూగ సన్నాసీ అడగవేం?” అనేది. 'బూసిమ్మా! బువ్వ బెట్టవమ్మా!” అనేవాణ్ణి. 'ఏందిరా సచ్చినోడా బూతులు దిడతన్నా?' అనేది.శ్రీరామయ్యగారు కలగజేసుకొని 'ఆడేడ బూతులు దిట్టేడు దొరసానీ!' అనేవాడు. 'మరి ఆడా కూత కూయడే?” అనేది.అప్పుడు, 'దొరసానీ! బువ్వబెట్టు' అనేవాణ్ణి. 'ఏందిరా ముదనష్టపోడా ఆ అరుపులు, ఆగలేవా?' అంటూ గిన్నెలో కూడు కుమ్మరించేది. 'తినూ! దిక్కులు జూతావేం?” అని కసిరేది. 'కూరెయ్యవా' అంటే ఎక్కళ్ళేని కూడా, కూరా, కుమ్మూ,నీ ఎదానే కొడతంటిని. ఎందుకెయ్యనూ?” అని ఏసేది. 'ఆవగాయో, ఊరగాయో, పప్పో, రసమో ఏసి ఏం కడుపురా నీది, ఎంత దిన్నా నిండదు. ఏమేసినా వొద్దనవూ' అని నవ్వేది.నాకు వళ్ళు మండేది. ఏంజేయను? పెట్టేది ఆమె. తినేది నేను. ఆమె ఏం పెట్టినా తినాలి. ఏమన్నా పడాలి.'నువ్వు దిన్నట్టుగాదు, గొడ్డను కడుపునిండా మేపుకురా' అనేది. నేను తలూ వాణ్ణి. 'మొద్దు ముండా కొడకా, నోరు లేదా, ఊ అనవూ, ఆ అనవూ' అనేది. నేను 'అట్టాగేలే' అంటా గొడ్డు దోలుకు పోయేవాణ్ణి.శ్రీరామయ్యగారికి ఒక ఆవు. రెండెడ్లు, రెండు దున్నలు, నాలుగు పాడి బర్రెలు, రెండు సూడివి ఉండేవి. ఎడు, దున్నలు చేసే పని నాకు లేదు. పాడి బర్రెల దూడలు నాలుగూ పెయ్యలే! బర్రెల్ని దూడల్ని వేరు చేయటం నాకిష్టంకాదు. దూడలు నడవలేవు. సావిట్లోనే కట్టేసేవాళ్ళు. వేళా పాళా లేకుండా దూళ్ళు పాలు తాగేతే ఇంకా ఏమన్నా ఉందా? బూసిమ్మకు పాలు, పెరుగు, పేడ అమ్ముద్దని పెద్ద కీర్తి.బరిగొడ్డ పాలు దూడలు తాగేతే నాపనయి పోయిందే! అదేం చిత్రమోగానీ, ఏ బర్రె దగ్గరికి దాని దూడే చేరేది. పొద్దెక్కక ముందే గొడ్డు దోలుకుపోవాలి. గొడ్డుమేత మేసేచోటు, రైలుకట్ట రెండు పక్కలా ఏటవాలుగా ఉన్న తావు. బళ్ళకట్ట నుంచి ఒకటో తూముదాకా ఉన్న గడ్డికి శ్రీరామయ్య గారు హక్కుదారు.గొడ్డు రైలుకట్ట కటూఇటూ మేస్తూ, కట్ట దాటేటప్పుడు రైలోస్తే సావు. అదొక్కటే జాగరతగా ఉండాల్సిన పని.గడ్డి ఒత్తుగా పెరిగేది. నవనవలాడతూ ఉండేది. మంచుబొట్లు మెరుస్తుంటే చూడ ముచ్చటగా ఉండేది. గొడ్డు మలసబడ మేసేవి. ఎండాకాలం ఆ మేత గొడ్డపాలిట వరమే! ఎంతమేసినా తరిగేది కాదు.బరిగొడ్డు ఆశబోతువి. ఎంత తిన్నా ఆటికి ఆకలి తీరదు. కసాబిసా కలేసి, మెలేసి, నమి

S1 Ep 120మా బస్సు భాగోతాలు
"ఒరే ఎంకా ! యెందాకరా ఒకటే లగెత్తుతుండావు?""ఉండరా! సుబ్బా! పడవెళ్లి పోతుందిరా! నేను నీతో యవ్వారం పెట్టుకుంటే కుదరదు. గెండారం దాకా పోవాలా" అంటూ ఎంకడు హడావిడి పడిపోతాడు. "మా ఉప్పలపాటి గురుంచి ఏమన్నా మీకు ఉప్పు వుండి వుంటే మీరే తెగ ఆశ్చర్య పోవాల! ఉప్పలపాటి కి గెండారానికి మధ్య పిల్లకాల్వ కూడా లేదు, ఈ ఎంకడు ఎలా పడవెక్కుతాడు అని"అయితే మీకు బొత్తిగా మా ఉప్పలపాటి వాళ్ళ ఎకసెక్కాలు బొత్తిగా తెలీవన్న మాట.ముందు వెనక కర్వ్డ్ రూఫ్ తో ఒక ఇన్వర్టెడ్ పడవలాగా వుండే బస్సుకు మా వాళ్ళెట్టుకున్న ముద్దు పేరు. అలాగే పొట్టిగా, ముందు ఎనకా ఓ గొడ్డలెట్టేసి నరికేసి, ఎత్తు ఎక్కువ పొడవు తక్కువగా వుండే బస్సు పేరు అగ్గిపెట్టి. "మావ! అగ్గిపెట్టెలో వచ్చానా! ఆ సూలం సచ్చినోడు ఎత్తెత్తి నూకేలా! తోలి నా నడుము ఇరగ నూకేసినాడనుకో" అని చాలా ముద్దు గా చెప్పుకుంటారు మావోళ్లు . అలాగే వెంగమాంబా, బాల భాస్కర్, పాలబండి, తపాలా బండి, గోపాలయ్య బండి లాటి ఎన్నెనో పేర్లు ఆ బస్సులకు. ఒక్కో బస్సు ఒక్కో రంగు, ఒక్కో డిజైన్, ఒక్కో హారన్, ఒక్కో వైభోగం. డ్రైవర్, కండక్టర్ తోపాటు బస్సు ఆగగానే రేడియేటర్ లో నీళ్లు పోయడానికి, ఎక్కే మెట్ల మీద నిలబడి పక్క రేకు మీద బాదుతూ రైట్ రైట్ అంటూ అరుస్తూ ఒక క్లీనర్. బస్సు కిట కిట లాడుతుండగా ఎనక తలుపు మీద రైట్ రైట్ అని బాది, నేల మీదకి దూకి బసుతో పాటు పరిగెత్తి ముందు తలుపు దగ్గర బస్సులోపలకి గెంతి మరలా రైట్ రైట్ అంటూ ఆడు చేసే హడావిడి మాకయితే భలే ఉండేది. వీళ్ళ ముగ్గురు మీద వూళ్ళ మధ్యలో ఎక్కి చెకింగ్ అంటూ నానా హడావుడి చేసి, మూటలకు టిక్కెట్లు కొట్టలేదని కండక్టర్ మీద యుద్ధం చేసి ఊళ్ళ మధ్యలోనే చక్క దిగి పోయే చెకింగ్ ఒకడు. మాలో ఒక గుస గుస ఉండేది, ఆ చెకింగ్ కి వీళ్ళ ముగ్గురూ ఎందుకంత బయపడతారో అని. ఎందుకంటే ఈ చెకింగ్ లు ఎక్కువగా బస్సు ఓనర్ల కీప్ ల తమ్ముళ్ళో, అన్నలో లేక కొడుకులోమాలాటి పిల్లకాయలకి, ఇంతకు ముందు చూడని బస్సు ఎంత డొక్కు దైనా కొత్త బస్సే. అది వచ్చి మా మూలగడ దగ్గర ఆగితే దాన్ని శల్య పరీక్ష చేసి అందరం కలిసి నామకరణం చేయాల్సిందే . కొత్త బస్సుని చూసిన సందడే వేరు. ఎలిమెంటరీ స్కూల్ పిల్లకాయలయితే ఎప్పుడెప్పుడు పెద్దయి పోయి అర్జెంటు గా పడవనో, అగ్గిపెట్టెనో లేక కొత్త బస్సునో ఎక్కి పెదపుత్తేడు ఉన్నత పాఠశాల లో చదివెయ్యాలనే ఉబలాటం. మా లాటి అల్రెడీకే పెద్దోళ్ళయిపోయిన పిల్లకాయలకి రోజుకో కొత్త బస్సు రావాలనే ఆత్రం. అలాగే ఒక్కో బసుకి ఒక్కో ఫ్యాన్ ఫేర్, ఎన్నైనా చెప్పెండె హె అగ్గిపెట్టిపోయినట్టు పడవ వెళ్లగలదా అనే పందేలు. పడవలో వుండే ఆ వయ్యారం అగ్గిపెట్టెలో ఎక్కడుందిరా అనే సౌందర్యోపాసకులు తక్కువ లేరు మా వూర్లో. ఈ బస్సులు వాటి పంచువాలిటీ తెగ పాటించేవి. వాటి టైం దాటి లేట్ గా వచ్చేయంటే, అవి మా వూరు కొచ్చి రిటర్న్ అయ్యే టైం లో తరవాత వచ్చే బస్సోడు అడ్డం పెట్టేసే వాడు, నా కలెక్షన్ అంతా నువ్వెత్తుకు పోతున్నావని. ఆ అడ్డం పెట్టుకోవటం కొన్ని గంటలు లేక కొన్ని పూటలుండేవి. మా పిల్లకాయలకి పండగే బస్సులు అలా అడ్డం పెట్టుకోవటం. ఒక జాతరలాగా వెళ్లి చూసొచ్చే వాళ్ళం. ఆ అడ్డం పెట్టుకొనే ప్రదేశం లో సోడా బండ్లుకూడా వెలిసేవి. ఇలా మా అందాలు, ఆనందాలు, హడావుడీలు సాగిపోతుండగా, రూట్స్ అన్నీ జాతీయమై, ఎర్ర బస్సులు రావటం మొదలెట్టాయి. పాల బండి ఎర్ర బండే , తపాలా బండి ఎర్ర బండే, ఏదొచ్చినా ఎర్రబండే. క్రమంగా మా వాళ్ళు ఆరు గంటల బండి, ఎనిమిది గంటల బండి, పది గంటల బండి అని చెప్పుకోవటం మొదలెట్టారు. రంగుల్లేవు, డిజైన్ లేవు, సోకుల్లేవు, "మీ సామానులకు బస్సువారు జవాబు దారి కాదు", "లైట్ ఆపి సెల్ఫ్ కొట్టుము" లాటి ముసి ముసి నవ్వులు కురిపించే వాక్యాలు లేవు. మాకెందుకో అర్థం అయ్యేది కాదు ఆ ఎర్ర బస్సులు వస్తే ఒకదాని ముడ్డి వెనక ఒకటి వచ్చేవి, రాకపోతే అస్సలు వచ్చేవి కాదు. అడ్డం పెట్టుకొనే కంపిటీషన్ మేమెప్పుడూ చూడలా మా కళ్ళతో. క్రమంగా మేము ఎప్పుడొస్తాయో తెలియని ఎర్ర బస్సుల్ని నమ్ముకోవటం మానేశాము. వాటి స్థానే మా వూరిక్కూడా, షేర్ ఆటోలు రావటం మొదలెట్టాయి, పసుపు బాడీ మీద నల్లని టాప్ ల తో, డబ డబ శబ్దాలతో, ఒకే మాదిరిగా.పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్టు రంగు రంగులుగా వుండే ప్రైవేట్ బస్సులు రావటం మానేసాక మా ఉప్పలపాటి దారి కళే పోయిందబ్బా.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Ep 113ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’
హర్షణీయంలో ఇప్పుడు మీరు వినబోతున్న కథ, సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’. ఇది వారి ‘గుడి’ అనే కథాసంకలనం నుంచి స్వీకరించబడింది.తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు. ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి’ అవార్డుతో, కేంద్రప్రభుత్వం వారు ‘పద్మశ్రీ’ పురస్కారం తో ఆయనను సత్కరించడం జరిగింది. తమ రచనను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.డిసెంబర్ నెలలో వారి ఇంటర్వ్యూ ‘హర్షణీయం’ ద్వారా మీకందించబడుతుంది. ‘గుడి’ కథాసంపుటి ని కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీలో ఇవ్వబడ్డాయి.‘సిలారు సాయబు’:నాగడు సిలారు సాయిబును కొట్టాడు. సిలారు నవ్వాడు. నాగడికి ఏడుపు వచ్చింది. మళ్ళీ కొట్టాడు. సిలారు ఇంకా నవ్వాడు.వాడు కొట్టా . వీడు నవ్వా. ఇదే తంతు. వాడు బలవంతుడు. వీడు బల హీనుడు. వాడున్నవాడు. వీడు లేనివాడు. వాడు సంసారి. వీడు బికారి.నాగడికి తిక్క ముదిరింది. కర్రతో బాదాడు.'నన్ను తిట్టరా' అన్నాడు. సిలారు తిట్టలేదు. 'నన్నుకొట్టరా' అన్నాడు. సిలారు కొట్టలేదు. 'నన్ను వాటేసుకోరా' అన్నాడు. సిలారు వాటేసుకోలేదు.సిలారుసాయిబు తనను తిట్టాలని, కొట్టాలని, వాటేసుకోవాలని నాగడికి ఆశ, ఇష్టం, ఉబలాటం, ఆరాటం. అందుకే ఈ చావు.నాగడు తనకు వచ్చిన బూతులన్నీ తిట్టాడు. సిలారు నవ్వుతాడు కానీ తిట్టడు.సిలారుకు ఒక ప్రఖ్యాతి ఉంది. వీడు తిట్టినా కొట్టినా తాకినా మేలు జరుగు తుందని.అతడి ఊరూ పేరూ ఎవరికీ తెలియదు. ఎప్పుడో ఎవరితోనో సిలారుసాయిబు అని తన పేరు చెప్పాడని అందరూ అనుకొంటారు. అలా అతడికి ఆ పేరు స్థిర పడింది. ఆ పేరుతో పిలిస్తే తిరిగి చూస్తాడు కానీ 'ఏమీ?' అని అడగడు.మర్రిచెట్టు కింద పడుకొంటాడు. దేవుళ్ళ చెరువులో బుద్ది పుట్టినంత సేపుమునుగుతూ తేలుతూ ఉంటాడు. బర్రెలు, దున్నలు, పెయ్యలు, దూడలు నీళ్ళలో మునిగినట్లే సిలారు సాయిబూ మునుగుతూ తేలుతూ ఉంటాడు. బరి గొడ్డు గట్టెక్కగానే తానూ ఒడ్డు కెక్కి వేప చెట్టు కింద కూర్చుంటాడు. బట్టలు ఒంటి మీదే ఆరి పోతాయి. ఎవర్నీ ఏమీ పెట్టమని అడగడు. ఏం పెట్టినా తీసుకోడు. ఇష్టమైంది ఎక్కడున్నా తీసుకుంటాడు. చలిలేదు, వానలేదు, ఎండలేదు. మర్రి చెట్టు కిందే మకాం. పగల్లేదు, రాత్రిలేదు, ఎప్పుడయినా నిద్రపోతాడు, నిద్రపో యినప్పుడు తప్ప చెట్టు కింద ఉండడు. ఎవరైనా చిరుగులబొంత ఇచ్చినా కప్పు కోడు. పక్కనేసుకోడు. బుద్ధి పుడితే దాని మీద పడుకొంటాడు. లేకపోతే అది అక్కడ ఉండగానే గడ్డి మీద పడి నిద్రపోతాడు. వాడికి దినచర్య లేదు. ఇప్పుడు నిద్రపోవాలని గానీ ఇప్పుడు నిద్ర లేవాలనిగాని నియమమేమీ లేదు.సిలారు సాయిబుకు ఏం తొందరో అంగలు పంగలు వేసుకుంటూ వస్తాడు. గబగబా పోతాడు. పరుగూ కాదు. నడకా కాదు. అడ్డదిడ్డంగా పడుతూ లేస్తూ వస్తూ పోతూ ఉంటాడు. మాదిగ పల్లెను వదిలి ఎక్కడికీ పోడు. పల్లె పెద్ద ఎక్క డిదో పాత నిక్కరుంటే సిలారు సాయిబును పట్టుకొని తొడిగాడు. అది జారి పోకుండా మోకులాంటి మొలతాడు కట్టాడు. మొలతాడు అదుపాజ్ఞల్లో నిక్కరు ఖైదు అయింది. నెలకో ఆర్నెల్లకో పల్లె పెద్దకు బుద్ధిపుడితే పై బట్టలు పీకేసి ఉతికి నవేవో తొడుగుతాడు. పల్లెమొత్తం మీద పెద్ద మాదిగకు మాత్రమే సిలారు సాయిబు దొరికేవాడు. ఏ బట్ట పీకి పారేసినా ఓర్చుకునేవాడు. ఏ ఉతికిన బట్టలు వేసినా ఒప్పుకొనేవాడు. ఇక పల్లెలో ఎవరి చేతికి దొరకడు. ఏం పనీ ఉండదు. పల్లె వీధు లన్నీ మళ్ళీ మళ్ళీ తిరుగుతుంటాడు. ఎవురైనా ఎదురైతే అల్లంత దూరంగా తప్పు కొని తప్పించుకొని పోతాడు. ఎవరైనా వీధిలో కూర్చుని అన్నం తింటుంటే తినే గిన్నెలో నుంచి గుప్పెడు మెతుకులు లాక్కొని తింటాడు. అంతా నోట్లోకి పోని వ్వడు. రెండు మెతుకులటు రెండిటు పడేసుకుంటూ బొక్కుతాడు.చెరువులో నీళ్ళయినా తాగుతాడు. కుడితి తొట్లెలో నీళ్ళయినా తాగుతాడు. చెంబట్టుకు పోయేవాళ్ళ చెంబు తీసుకోనైనా తాగుతాడు. బావి దగ్గరకు పోడు. నీళ్ళు దోసిట్లో పోయించుకోడు.ముంత లేదు. మూకుడు లేదు. కుండలేదు. సట్టిలేదు. వాడికి కూడు వండుకునే పనిలేదు. పొలాలో అడ్డం పడిపోతుంటాడు. చేతికందినవి తింటాడు. అవి కాకరకాయ లైనా చింతలేదు. చింతకాయలైనా తొందరలేదు. దోసకాయలైనా ఇబ్బందిలేదు. రాంములక్కాయలైనా ఫరవాలేదు. పొలంలో పండే ఏ కూరగాయనూ ఆకు కూర నూ వద్దనకుండా తింటాడు. పచ్చిగడ్డి కూడా పరమాన్నంలా భుజిస్తాడు...సిలారు సాయిబు మాదిగపల్లెలో వింతజీవి. అతడు తుమ్మినట్లు కానీ, దగ్గి నట్లు కానీ, జ్వరం వచ్చిందని కానీ, లేవలేకుండా ఉన్నాడని కానీ ఎవరూ ఎప్పుడూ చెప్పుకోలేదు.'నా చిన్నతనం నుంచి సిలారు సాయిబు ఇట్లానే ఉన్నాడ'ని ముసలివాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు.అతను ఏం తిన్నా ఎవరూ ఏమీ అనరు. ఏం తాగినా తాగిస్తారు. వాడు తాము భరించవలసిన ఒక ప్రాణి అని మానవమాత్రుడని పల్లెవాళ్ళు గుర్తించారు.ఏ నియమం, ఏ హద్దు, ఏ అడ్డు, ఏ ప్రతిబంధకం లేకుండా సిలారు సాయిబు మాదిగపల్లెలో స్వేచ్ఛాజీవిగా ఉన్నాడు.ఏ పంట బాగా పండినా సిలారు సాయిబే కారణమనుకోసాగారు. ఒకరింట్లో చొరబడి గుప్పెడు కందులు తీసుకొని తింటూ వెళ్ళిపోయాడని, ఆ సంవత్సరం ఆ ఇంటికి కందిపంట ఇబ్బడి ముబ్బడిగా వచ్చిందని వాళ్ళ ఆనందం. ఆ సంతో షంతో వాళ్ళు కందిపప్పు వండి, ముద్దపప్పు మధ్య గుంట చేసి గుంట నిండా నేయి పోసి, తీసుకొనిపోయి ఇస్తే ముఖంలోకి చూచి ఇకిలించి, చేత్తో విస్తరిని విసిరి కొట్టాడని చెప్పుకుంటుంటారు. ముద్దపప్పు నేల పాలయినందుకు తెచ్చిన మనిషే చింతపడలేదు. సిలారు సాయిబు ఇకిలించటం మానలేదు.రామికి పెళ్లి కాలేదు. పిల్ల ముదిరిపోయిందని తల్లి, తండ్రీ, పల్లె గగ్గోలు పెడుతుంటే కుమిలిపోతూ ఏడుస్తూ ఇంటి మట్టి గోడకానుకొని, చూరుకింద కూర్చుని, బియ్యంలో మట్టిబెడ్డలు ఏరి తింటూ కనిపించేది. పిల్ల తల్లిదండ్రులు పెద్ద ఆస్తిపరులేం కాదుగాని తినడానికి ఉన్నవాళ్ళే. పిల్ల కురూపా అంటే అదేం కాదు. చూడముచ్చటగానే ఉంటుంది. పన్నెండు ఏళ్ళ వయస్సు రాగానే పెద్ద పిల్లయి కూర్చుంది.తండ్రి పెండ్లి సంబంధాల కోసం తిర

Ep 112సత్యం - చంద్ర కన్నెగంటి గారి రచన
హర్షణీయానికి స్వాగతం.ఈ ఎపిసోడ్ లోని కథ 'సత్యం' శ్రీ చంద్ర కన్నెగంటి గారి రచన.ఇది వారి 'మూడో ముద్రణ' అనే కథా సంకలనం లోనిది.ఈ పుస్తకం కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీ లో ఇవ్వడం జరిగింది.గుంటూరు జిల్లాలో జన్మించిన శ్రీ చంద్ర కన్నెగంటి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగ నిపుణులుగా యూఎస్ ఏ లో పని చేస్తున్నారు.తానా పత్రికకు సంపాదకులుగా కూడా వారు ఇంతకు మునుపు , బాధ్యతలు నిర్వహించారు.గత మూడు దశాబ్దాలుగా వారి రాసిన కథలు, ఎన్నో పత్రికలలో ప్రచురింపబడ్డాయి."రచయితగా నేనేమీ పాఠకుడికంటే నైతికంగానూ , బౌద్ధికంగానూ ఉన్నతస్థాయిలో లేను " అని నమ్రత తో చెప్పే చంద్ర గారు, ఉత్తమమైన కథా వస్తువులను ఎంచుకుంటూ , పాఠకులను ఆలోంచింపజేసే చాలా మంచి రచనలను చేస్తూ వస్తున్నారు.కథను హర్షణీయం ద్వారా అందించడానికి తమ అనుమతినిచ్చిన శ్రీ చంద్ర గారికి కృతజ్ఞతలు.సత్యం:ఆ శుక్రవారం సాయంత్రం అతడు ఇల్లు చేరేసరికి ఆలస్య మయింది. నెరిసిన జుట్టు అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఒకటే ఇబ్బంది పెడుతుండడం చేత దారిలో ఆగి షాప్ లో జుట్టుకు వేసుకునే నల్లరంగు కొనుక్కున్నాడు. దానికితోడు ఒకటే వాన కావడంతో ట్రాఫిక్ గొడవ.ఇంట్లో అడుగు పెట్టేసరికి అక్కడ వాతావరణం బిగుసు కుని ఉన్నట్లు తెలిసిపోయింది. రణగొణ ధ్వనులు చేసే టీవీ కట్టేసి ఉంది. పుస్తకం ముందేసుకుని కళ్ళు తుడుచుకుంటూ కూచుని ఉన్నాడు బాబు. పాప బిక్కచిక్కిన మొహంతో వాడివే పే చూస్తూ ఉంది ఆడటం మానేసి.“ఏమిటీ ఏమయింది?” ఆమెని అడిగాడు దగ్గరకొచ్చి కాళ్ళకు చుట్టుకున్న పాపను ఎత్తుకుని ముద్దాడుతూనే.“పోయినవారం వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ రావలసింది, ఇంకా రాలేదు. ఏదిరా అంటే వాడి టీచర్ ఇవ్వలేదంటాడు.”“ఇవ్వలేదేమోలే! అప్పుడప్పుడూ ఆలస్యమవుతుంది కదా!”“ఇన్ని రోజులు ఎప్పుడూ ఆలస్యం కాలేదు. వాడు చెప్పే తీరు చూస్తుంటే ఏదో దాస్తున్నట్టనిపిస్తుంది!”“మర్చిపోయాడేమో వాడి బ్యాగ్ లో వెతక్కపోయావా?” “వెతికాను. లేదు!”“నేనేమీ అబద్ధం చెప్పటం లేదు.” వెక్కి వెక్కి ఏడుస్తూనే అంటున్నాడు బాబు.“నువ్వు ఏడవటం ఆపు ముందు. పోనీ సోమవారం వాడి టీచర్ని కనుక్కుంటే పోతుంది కదా!”“వాడు నిజం చెప్పడం లేదని నాకు తెలుసు. మళ్ళీ వీడి సంగతి స్కూల్లో అందరికీ తెలియాలా? అయినా సోమవారం దాకా ఎందుకు. ఇప్పుడే వాడి నోటితోటే నిజం చెప్పించాలి.”“వాడు అట్లా అబద్దమెందుకాడుతాడు? బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చని పిస్తూంది నాకయితే!” ఆమెకి దగ్గరగా వచ్చి నెమ్మదిగా చెప్పాడు వాడికి వినపడకుండా.“ఏమో ఏం తెలుసు? మనం నమ్మేం కనక అన్నీ నిజాలే. అయినా వాడి సంగతి నాకు తెలుసు. మీరు వాడి చేత నిజం చెప్పించగలిగితే చెప్పించండి, లేకపోతే నాకు వదిలేయండి.”ఎర్రటి కళ్ళూ, పసిబుగ్గల మీద కన్నీటి చారికలూ, మధ్య మధ్య చొక్కా చేతు లతో తుడుచుకుంటూ వాడి ఏడుపు చూస్తుంటే అబద్దమాడుతున్నట్టు అనిపించడం లేదు. అట్లాగని అమెకి నచ్చచెప్పనూ లేడు.పిల్లలకెదురుగా వాదులాడుకోకూడదని వాళ్ళ మధ్య ఓ వొప్పందం. వాడు రక్షించమన్నట్టు తనవేపే చూస్తున్నట్టు ఒక ఫీలింగ్. అయినా తల్లినుంచి కొడుకుని కాపాడేదేమిటి అని సర్దిచెప్పుకుంటూ పాపను తీసుకుని బెడ్ రూమ్ లోకి నడిచాడు.మామూలుగా ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిన రోజు గొడవ వేరేగా ఉండేది. వాడి ఖర్మ కాలి అన్నిట్లోకీ వాడికి సైన్స్ లో తక్కువ మార్కులు వస్తాయి ఎప్పుడూ. ఇక వాడిని కూచోబెట్టి ముందు కోపంగానూ, చివరికి అనునయంగానూ వాడికి నూరిపోసేది సైన్సులో తొంభయి అయిదు శాతం కంటే మార్కులు తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో. తర్వాత వాడికి వారం రోజులు టీవీ కట్.రాత్రిళ్ళు వాడి దగ్గరే కూచుని కదలకుండా, కదలనీయకుండా చదివించేది.చాలాసార్లు చెప్పాడామెకి. వాడినట్లా భయ పెట్టటం వల్లా, దండించటం వల్లా ఉపయోగమేమీ ఉండదనీ. వాడికి తక్కువ మార్కులు వచ్చినప్పుడు వాడికే పాఠం అర్థంకాలేదో, ఏ జవాబులు రాయటంలో తప్పులు చేశాడో కనుక్కుని వాడికి సాయం చేయాలనీ.పాపను కాస్త ముద్దు చేసి టీవీ ముందు కూచోబెట్టి స్నానం చేసి వచ్చేసరికి ఇంకా పరిస్థితిలో మార్పేమీ లేదు. వాడు అట్లాగే ముక్కు ఎగబీలుస్తూ, కళ్ళు తుడుచు కుంటూ ఉన్నాడు. ఆమె భోజనం వడ్డించి ఎదురు చూస్తూ ఉంది.“ముందా ఏడుపు ఆపి హోమ్ వర్క్ చేయి!" వాడిని కసిరాడు. వాడు బదులేమీ చెప్పలేదు.“ఇంతకీ వాడు తిన్నాడా?” ఆమెతో పాటు తింటూ అడిగాడు. “తిన్నాడు,” పొడిగా చెప్పింది, అంతకంటే మాట్లాడటం ఇష్టం లేనట్టు. అతనూ మాట్లాడకుండానే భోజనం కానిచ్చాడు. ఆమె గిన్నెలు సర్దుతుంటే వాడి దగ్గరకొచ్చి కూచున్నాడు.“ఏరా నీకు నాన్నా పులి కథ చెప్పాను గుర్తుందా?" వాడు తల నిలువుగా వూగించాడు ఎత్తి చూడకుండానే.“నువ్వు ఒకసారి అబద్ధం చెప్పావనుకో ఇక నీ మాట ఎవరూ నమ్మరు ఆ కథలోలాగా!”“నేను నిజమే చెబుతున్నా. అయినా మీరు నమ్మటం లేదు నన్ను!” ఏడుపు కాస్త ఎక్కువ చేసి అంటున్నాడు.“ముందు ఆ ఏడుపు ఆపు! నిన్నేమీ తిట్టలేదూ తన్నలేదూ ఇప్పుడు. మమ్మీ ఎటూ మండే మీ టీచర్ తో మాట్లాడుతుంది. నిజం ఎటూ తెలిసిపోతుంది. నువ్విప్పుడు చెప్పేది అబద్ధమని తెలిసిందనుకో, ఇక ఎప్పుడయినా నువ్వు చెప్పేది మేమెట్లా నమ్ముతాము? నువ్వు చెప్పేదేదీ మేం నమ్మకపోతే ఎట్లా ఉంటుంది నీకు?” వాడు చెబుతున్నది నిజమే అయితే బాగుంటుందనిపిస్తుందతనికి. ఇద్దరి మధ్య సంబంధంలో నమ్మకం పోవటంకంటే దారుణమయినదేముంటుంది?“నేను అబద్ధమేమీ ఆడటం లేదు!”అతనికి ఒక పక్క జాలేస్తూంది. తమ పదేళ్ళ కొడుకు ఇంత పట్టుతో అబద్ధం చెప్పగలడా? ఒక మూల సందేహం. అనవసరంగా వేధిస్తున్నారా తామిద్దరూ వాణ్ణి ? వాడు నిజమే చెపుతున్న పక్షంలో వాడు క్షమిస్తాడా ఇక తమని?ఆమె వచ్చి అందుకుంది. “అది ఇంకో అబద్దం. ఒక అబద్దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం ఆడుతూనే ఉండాలి. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇంటికి తేకపోవటం ఒక తప్పు. ఇవ్వలేదని అబద్దం రెండో తప్పు. అబద్దమాడలేదని చెప్పటం మూడో తప్పు. నీకు ఒక తప్పుకయితే ఒక పనిష్మెంటే కదా? ఇన్ని తప్పులు చేసి మరికాసిని తన్నులు తినడం హాయిగా ఉంటుందా నీకు?”మరీ పోలీస్ స్టేషన్లో నేరస్థుడిని ఇంటరాగేట్ చేస్తున్నట్టనిపించి పక్కకి వెళ్ళాడు అతను.“సరే, నిన్నేమీ అనను. తిట్లూలేవు, దెబ్బలూలేవు. ఏ పనిష్మెంటూలేదు ఇప్పటి కిప్పుడు నిజం చెప్తా. మళ్ళీ మండే మీ టీచర్ని కనుక్కున్నాక నేనేం

Ep 111కే ఎన్ వై పతంజలి గారి 'మోటుమనిషి '
"సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కానివారెవ్వరూ ఉండరు. నా చుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉండి తీరుతుంది. అది మార్చడానికి ఎంతో కొంత నా భాగస్వామ్యముంటుంది. ఆ బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు" - సుప్రసిద్ధ రచయిత కీర్తిశేషులు కె ఎన్ వై పతంజలి .హర్షణీయానికి స్వాగతం.ఇప్పుడు పరిచయం చేయబోతున్న కథ పేరు 'మోటుమనిషి'.ఈ కథను హర్షణీయం ద్వారా పరిచయం చేయడానికి అనుమతినిచ్చిన శ్రీమతి ప్రమీల పతంజలి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.పతంజలి గారి సాహిత్యం , మీరు కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే పేజీ లో ఇవ్వబడ్డాయి.పతంజలి గారు , అనేక కథలూ నవలలూ రాయడమే గాక, మూడు దశాబ్దాలకు పైగా పత్రికారంగానికి కూడా తన సేవలను అందించారు.తెలుగు కథ ను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్లిన కే ఎన్ వై పతంజలి గారి గురించి, ఆయన చిరకాల మిత్రులు , సుప్రసిద్ధ రచయిత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు ఏమంటారంటే'' రచయిత అయినవాడు తన ఆవరణంలోంచి ఎదిగి మరో ఆవరణం నుంచి జీవితాన్ని దర్శించగలగాలి. అట్లా దర్శించగలిగిన వాళ్లు గొప్ప రచయితలుగా మిగిలిపోతారు. ఒక సంకుచితమైన పరిమితిని విధించుకుని చేసే రచనలకీ వార్తా కథనాలకీ పెద్ద తేడా ఉండదు. ప్రపంచ సాహిత్యంలో గొప్ప వనుకుంటున్న రచనలన్నీ సమకాలీనతని జీర్ణించుకుంటూనే దాన్ని అధిగమించినవే. పతంజలి రచనలు ఆ కోవలోకి వస్తాయి.మంచి రచనకీ గొప్ప రచనకీ ఉండే మౌలికమైన భేదం అదే. పూర్తిస్థానీయత, సమకాలీనత రచయితకి సంకెళ్లు కాకూడదు. గొప్ప రచన అనేక పొరలుగా, అనేక స్థాయిలలో పాఠకుడికి చేరువవుతుంది. అట్లా ఎప్పుడు ఏ కాలంలో చదివినా పాఠకుడు ఆ రచనలో రిలేట్ అవుతాడు. అటువంటి రచనలు ఉత్తమ సృజనాత్మకతకి ఉ దాహరణలు..."మోటుమనిషి అతని వయసు నా వయసుచేత రెండుసార్లు భాగారింపబడుతుంది. అతని ఒళ్లు కూడా నా సైజు ఇద్దరు మనుషులకు సరిపడా ఉంది. అతను వ్యవసాయదారుడే అయిన పక్షంలో, పొలానికి సరిపడే ఎరువు అతని ఒంటినే ఉంది.కాని, వెధవకి బుద్దే ఉన్నట్టు లేదు. ఖచ్చితంగా చెప్పగలను. లేదు. ఉంటే నేనతన్ని మర్యాదగానే - "మీరు నా సీట్లోకి వచ్చేస్తారా - నా కా కిటికీ పక్క చోటిచ్చేసి?” అనడిగినప్పుడు - “రాను... నాను సుట్ట కాల్చుకోవాలి” అని నిర్మొహమాటంగా చెప్పడు.'వీణ్ణి చుట్ట కాల్చుకోనివ్వకూడదు.” గట్టిగా నిశ్చయించుకున్నాను. బస్సు వేగంగా పోతూంది. గాలికి కామోసు అతని తలమాత్రం కొంచెం కదులుతూంది. జిడ్డు తల.అరచేతులంతేసి చెవులు. వాటికి స్కూటర్ చక్రాలంతేసి తమ్మెట్లు. వాటికి మురికి పూసుకున్న ఎరుపూ, తెలుపూ పొళ్లు.బుద్ది లేకపోయిన తరువాత ఇంకా ఏమేం ఉంటే మాత్రం ఏమిటి లాభం ? అసలు ఉదయం లేచిన దగ్గరి నుంచి తల నొప్పిగా ఉంది. దరిద్రపు తలనొప్పి, తెలుగు సినిమాలాగన్నా వచ్చిన వెంటనే తిరిగిపోదు. నిద్రలేచి మంచంమీద నుంచి కాళ్లు కింద మోపేసరికి, పనిలేని పెళ్లాం లాగ, పనున్న స్నేహితుడిలాగ వచ్చేసి నెత్తికెక్కి కూర్చుంది దిక్కుమాలిన తలనొప్పి.మళ్లీ పక్కన కూర్చున్న నాయుడికేసి చూశాను. అతను కిటికీలోంచి కనబడుతూన్న చెట్లకేసీ, చేమలకేసీ కాబోలు దీక్షగా చూస్తున్నాడు. వీడి దృష్టి తగిలితే అవి చటుక్కున చచ్చి ఊరుకుంటాయి.వీడు ఎంతకీ చుట్ట కాల్చటానికి ప్రయత్నించటం లేదు. ఇలా వాడు చుట్ట తీసి ముట్టించ ప్రయత్నించడం, నేనిలా మొదట ఇంగ్లీషులోనూ తరువాత తెలుగులోనూ అభ్యంతరం చెప్పి పగ తీర్చుకోవడం - ఈ పూటకి సరదా తీరేలా లేదు.కిటికీ పక్క సీటయితే ఓ చేయి కిటికీ చువ్వల మీద ఆన్చి, రెండో చేయి ఎదుటి సీటు తాలూకు చట్రం మీద ఆన్చి, చేతుల మీద తలాన్చుకుని పడుకోవచ్చు - ముఖ్యంగా ఇలా తలనొప్పిగా ఉన్న సమయాల్లో,కానీ, ఈ భారతదేశపు హృదయాలయిన పల్లెటూరి తాలూకు పౌరుడు, రాతి గుండెవాడు. ఎక్కడ దిగిపోయి నన్ను సంతోష శిఖరాల మీదికి ఎక్కిస్తాడో? “ఎక్కడ దిగుతారు?” అడిగాను. అతను నాకేసి పరీక్షగా చూశాడు. “సోడారం.” చచ్చాం .వీడు నన్ను చివరివరకూ వదలడు. “మందే ఊరు?” నాయుడడిగాడు నన్ను.నా ఎడమచేతి పక్కకి చూశాను. ఓ ముఫ్ఫై ఏళ్ళ వయసున్న టెరిలిన్ బట్టల ఆసామీ వీక్లీ ఒకటి మధ్యకి మడత పెట్టి చదువుతున్నాడు.“ఎక్కడి కెళ్తన్నావు?” నాయుడే మళ్లీ అడిగాడు.గొంతు తగ్గించి, “వెస్ట్ జర్మనీ” అన్నాను నెమ్మదిగా. నాయుడికి అర్థమయినట్టు లేదు. “అదెక్కడ?” ఆశ్చర్యంగా అడిగాడు.“చోడవరానికి ఇంకా అవతలుందిలే” అన్నాను.“చోడారంలో ఈ బస్సాగిపోద్ది. ఆ మీదికెళ్ళదు.” నాయుడు ముతకగా నవ్వాడు.“చోడవరంలో దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చులే.” విసుగ్గా అన్నాను.దెబ్బతో నోరు మూసుకున్నాడు.బస్సు ఆగింది. చిన్నాపురం జంక్షన్. ఇద్దరో ముగ్గురో దిగి, ఆరుగురనుకున్నాను కానీ - ఏడుగురెక్కారు.లాభం లేదు. నాకు తెలియకుండానే ఏయే ఊర్లలో ఎందరెందరు దిగి ఎంతమందెక్కారో లెక్క పెడుతూ చెక్కర్ ఉద్యోగం చేస్తున్నాను.తలనొప్పి రానురానూ ఎక్కువవుతూంది. చిరాకుగా ఉంది.జీనియస్సులు పరాకుగాను, కాదలుచుకునే నాలాంటి జీనియస్సులు చిరాకుగానూ ఉంటారు కామోసు. .పక్కాయన్ని వీక్లీ అడిగినా బాగుండును. చూసి ఇచ్చేయవచ్చు. సరే “వీక్లీ ఓసారిస్తారా?” అడిగాను.అతను నాకేసి సీరియస్ గా చూశాడు.“ఇవ్వను.” ఖచ్చితంగా చెప్పాడు. ఆహా! దుర్మార్గుడు. పైగా హృదయం లేనివాడు. ఏ కో-ఎడ్యుకేషన్ లేని కాలేజీకో ప్రిన్సిపాలుగా ఉండదగ్గవాడు.కుడిచేతి పక్క నాయుడే బెటర్. అడిగితే చుట్టన్నా ఇచ్చేలా ఉన్నాడు.చుట్టేం ఖర్మ? గారంటీగా భుజంమీదున్న తువ్వాలు కూడా ఇచ్చేసే అంత ధాటీగా ఉన్నాడు.కానీ, నాకు కావలసిన ఆ కిటికీ పక్క సీటే ఇవ్వడు.పక్కనున్న వీక్లీ వెధవని టైమడిగితే, అదన్నా చెబుతాడా? చెప్పకపోయినా చెప్పకపోవచ్చు. ఏ దుర్మార్గుడి నోటి వెంట ఎలాంటి సమాధానం వస్తుందో ఎవరికి తెలుసు?వీడిని టైముగాని, వీక్లీగాని, అప్పుగాని ఏమీ అడగకూడదు. నాయుడిని చుట్టకాని, సీటు కాని, ఓ భోగట్టాకాని అడగకూడదు.పక్కవాడిని అడగనవసరం లేకుండానే టైమెంతో తెలుసుకోవచ్చు. ఈజీ. వాడు చేయి కిందకి దించినప్పుడుచూశాను.“ఒంటిగంట.” పెళ్లికెళ్ళి జోడు పోగొట్టుకున్న వాడిలాగ ఎండ మండిపోతూంది.చోడవరం చేరడాని కింకా గంటన్నర టైముంది. గంటన్నర... దుర్మార్గులిద్దరి మధ్యా... ముఖ్యంగా తలనొప్పితో.పరీక్ష హాలులో మూడు గంటలు తెల్ల కాగితం వాడకుండా ప్రయత్నం మీద కూర్చోవచ్చు. తెలుగు నాటక

Ep 110రావిశాస్త్రి గారి 'వర్షం'
హర్షణీయానికి స్వాగతం.“ రచయిత ప్రతివాడు, తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో , ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను.” ఈ మాటలన్నది తెలుగు కథారచయితల్లో అగ్రగణ్యుడుగా కొనియాడబడే శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు.కవిత్వంలో శ్రీశ్రీ గారు చేసిన పని, కథల్లో రావిశాస్త్రి గారు చేశారని, 1993 లో ఆయన మరణించినప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక తన సంపాదకీయంలో రాసింది.తన రచనలకు ప్రదానం చేసిన ‘సాహిత్య అకాడమీ’ పురస్కారాన్ని, ఆంధ్రా యూనివర్సిటీ వారి ‘ కళాప్రపూర్ణ’ బిరుదుని ఆయన తిరస్కరించడం గూడ జరిగింది.ఇప్పుడు మీరు వినబోయే ‘ వర్షం ‘ ఆయన రచించిన అనేక అత్యుత్తమ కథలలో ఒకటి. ఈ కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి, తన అనుమతిని ఇవ్వడమే కాక, ఆడియో రూపంలో రావడానికి ఎంతో సహకరించిన శ్రీ రాచకొండ ఉమాకుమార శాస్త్రి గారికి , మా కృతజ్ఞతలు.ఈ కథ అరసం వారు ప్రచురించిన, రావిశాస్త్రి గారి కథాసంకలనంలోనిది.ఈ పుస్తకం కొనేటందుకు కావలసిన వివరాలు వెబ్ పేజీ చివరలో అందించడం జరిగింది.వర్షం: వర్షం దబాయించి జబర్దస్తీ చేస్తోంది. సాయంకాలం అవుతోంది. మబ్బులవల్ల, మామూలుకంటె, చీకటి ఎక్కువగా వుంది. రోడ్డుపక్క కమ్మలపాక - టీ దుకాణంలోచీకటి చికాగ్గా వుంది. అడివిపాలెంనుంచి వచ్చి తన దుకాణంలో చిక్కుకుపోయిన సిటీ బాబుని ఉద్దేశించి,“మూడ్రోజులక్కాని ఒగ్గ దీ ఒరసం” అన్నాడు దుకాణం తాత. ఒగ్గితే సెవి కదపాయిస్తానన్నాడు. బల్లమీద దిగులుబడి కూర్చుండిపోయేడు, సిటీబాబు అనబడే పురుషోత్తం. “టేసన్ కి కదు బాబూ ఎళ్ళాలన్నావు?” ఆకాశం మెరుపుతో చీల్చుకొంది. “అవును” “అబ్బో! ఎక్కడ, రొండుకోసులుందే!" అన్నాడు దుకాణం తాత. పిడుగు పడ్డట్టుగా ఉరిమింది. “ఏఁవిఁటీ?" “రొండుకోసు లుందయ్యా బాబూ! బొగ్గులకోసం కుట్టోణ్ని అక్కడికే తగిల్నాను. సదువుకోనేదుగాని నాకేరికే. రెండుకోసులుంది” అది రెండువేల మైళ్ళ దూరం అన్నట్టుగా చెప్పేడు దుకాణం తాత.“బస్సు దొరకదా?” అని హీనస్వరంతో అడిగేడు పురుషోత్తం.“ఈ ఒరసంలో బస్సు రాగల్గా? ఎర్రటి నీకు - ఉత్తప్పుడేరాదు. మా కుర్రాడు నడిసే ఎళ్ళేడు. " పురుషోత్తానికి కొంచెం గాభరా వేసింది. అత్యవసరమైన పనిమీద అతను కలకత్తా వెళ్ళవలసి వుంది. మూడు రోజుల లోపల అక్కడికి వెళ్ళాలీ అంటే మరో రెండుగంటల్లో అతను స్టేషన్ చేరుకోవాలి. బస్సు రాదట. బళ్ళు కనిపించవు. వర్షం చూస్తే పెను ప్రళయంలా ఉంది.“నేను కలకత్తా వెళ్ళాలే" అన్నాడు పురుషోత్తం “ఏ వూరూ?” “అబ్బో! శానా దూరఁవేఁ! అక్కడి కెళ్ళాలా నువ్వు?” “అవును” అన్నాడు పురుషోత్తం. “ఎళ్ళలేవు” చాలా ఖచ్చితంగా చెప్పేడు దుకాణంతాత. దిగులుపడి కూర్చుండిపోయేడు పురుషోత్తం. కత్తుల్లా మెరుపులు మెరుస్తున్నాయి. కొండలు బద్దలయినట్టు ఉరుములు ఉరుముతున్నాయి. శివాలెత్తి గాలి పరిగెడుతోంది. పగపట్టినట్టుగా వర్షం తెగపడుతోంది. చీకటి పట్టినపాకలో.... కొత్త పంట్లాం, కొత్త చొక్కా కొత్త జోళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఆ మూడు పురుషోత్తం వేసుకున్నాడు. అతన్ని బాగా చూడాలీ అంటే దీపం వెలిగించి చూడాలి. అతను చక్కనివాడా? ఒప్పుకొనేవాళ్ళు తక్కువ. అతని నడుం మాత్రం చక్కగా సన్నగా ఉంటుంది అతను సింహమధ్యముడే కాని సింహంలా ఉండడు. అతని పదిహేనోయేట “ఇరవయ్యేళ్ళుండవా?" అని చాలామంది అనుకొనేవారు. దుకాణం తాతని ఆ సమయంలో అడిగితే “నలభై దగ్గిరుండవా" అని అడగ్గలడు. పురుషోత్తం పాతిక సంవత్సరాల క్రితం పుట్టాడన్న సంగతి, ఆ పుట్టుక తెలిసిన వాళ్ళకి తప్ప మరొకరికి తెలియదు. అతను ఎదగని పడ్డలా వుండిపోయేడు.*******************ఆ సమయంలో ఆ దుకాణంలో దూరేందుకు అతగాడు ఆ ముందు రోజు బయల్దేరేడు. పయనమవడం కలకత్తాకనే పయనమయేడు. అంతలో అతని మేనమామ గాలీ ధూళిలా వచ్చిపడ్డాడు. ఆ మేనమామ అందరికీ ఉచితంగా సలహా లివ్వగలడు; అవలీలగా పనులు పురమాయించగలడు. అతగాడు వచ్చిపడి “నీకు పెళ్ళి కావాలనే సంగతి నీకేమైనా తెలుసా?” అని పురుషోత్తాన్ని ప్రశ్నించి టకాయించేడు. టకాయించి "వెళ్ళు వెళ్ళు మంచిది, వయసుది, డబ్బుది. అడివిపాలెంలో మున్సబుకూతురుంది,పిల్లని చూసేసి అలా కలకత్తా వెళ్ళిపోవచ్చు. వెళ్ళు వెళ్ళు వెళ్ళి చూడు” అని మేనల్లుణ్ణి వెంట తరిమేడు. దాన్తో చేతిలో పెదసంచీ వట్టుకొని అడివిపాలెంలో బంధువులింట్లో ప్రత్యక్షమై సాయంకాలం మున్సబుగారింట్లో కొత్త బట్టల్తో పెళ్ళికూతురి ముందు ప్రత్యక్షమయేడు పురుషోత్తం, ఆ పిల్ల తన చూపుతో అతనికొక చిక్కు ప్రశ్న వేసింది.“మునసబు"గారిది పాతకాలపు పెంకుటిల్లు, లోపల వరండాల్లో చాపమీద కూర్చోబెట్టేరు పెళ్ళికుమార్తెని. ఆ పిల్ల మఠం వేసుకొని కూర్చొంది. పక్కనే వాకిట్లో తులసి కోట పక్క దండెం మీద తెల్లచీర ఒకటి ఆరవేసి వుంది. వాకిట్లో తోమిన ఇత్తడిగిన్నెలు తడితో మెరుస్తున్నాయి. ఇంటివెనక మామిడి చెట్టొకటి చీకటిగా ఆకుపచ్చగా కనిపిస్తోంది. దానిపక్కనే కొబ్బరిచెట్టొకటి నిటారుగా ఎత్తుగా గంభీరంగా మామిడి చెట్టు కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధంగా నిల్చొంది. అస్తమించడానికి తటపటాయిస్తూ దూరాన్న సూర్యుడు ఆకాశంలో అవతల గుమ్మం దగ్గర నిల్చున్నాడు. అంతలో గది తలుపులన్నీ గప్పున తెరచి ఆకాశమంతటా కుంకాన్నెవరో కుమ్మరించేరు. అంతట చెట్టున మామిడి చిగుళ్ళు, చెట్టున కొబ్బరి కొమ్మలు సంతోషంతో మూగనవ్వు నవ్వేయి, ఆరవేసిన తెల్లచీర వెలుగుని వరండా అంతటా ఎర్రగా గుప్పున వెదజల్లింది. మెరిసే ఇత్తడిగిన్నెలు రాగిరంగు కలుపుకొని బంగారంలా మెరిశాయి. తులసికోటలో తులసి మొక్క నర్తకిలా నిల్చొంది.దీపపు వెలుగున దేవి విగ్రహంలా కనిపిస్తోంది పెళ్ళికూతురు. ఆమె తల కొంచెం దించి, రెప్పలు కొంచెం పైకెత్తి పురుషోత్తాన్ని నిదానంగా పరిశీలనగా చూసింది. ఆమె కళ్ళు విశాలంగా స్వచ్ఛమైననీటితో నిండిన తటాకాల్లా ఉన్నాయి. మారుమూల కుగ్రామంలోనే ఉన్నప్పటికీ ఆ తటాకాలు మెరిసే చుక్కల్నీ, వెలిగే చంద్రుణ్నీ, మండే సూర్యుణ్నీ కూడా సుస్పష్టంగా చూడగలవు. అవి చాలా దూరం చూడగలవు.ఏవేవో ప్రశ్నలువేసి కూతురిచేత జవాబులు చెప్పిస్తోంది తల్లి. ఆ పిల్ల సన్నంగానే మాట్లాడుతోందిగాని, గుహలో మాట్లాడినట్టుగా గంభీరంగా మాట్లాడుతోంది. ఇంటర్వ్యూ ముగిశాక పురుషోత్త

Ep 109'గోమెజ్ ఎప్పుడొస్తాడో'
'గోమెజ్ ఎప్పుడొస్తాడో' అనే ఈ కథకు రచయిత శ్రీ. వేలూరి వెంకటేశ్వర రావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లో జన్మించిన శ్రీ వెంకటేశ్వర రావు , తన విద్యాభ్యాసం అనంతరం, అమెరికా వెళ్లి సైంటిస్ట్ గా పనిచేసి , ప్రస్తుతం అట్లాంటా లో నివాసం వుంటున్నారు. వీరు ఇప్పటిదాకా రెండు కథ సంపుటాలను వెలువరించారు. 1980 దశకంలో 'తెలుగు వెలుగు' పత్రికను అమెరికా నించి నిర్వహించారు. కొంతకాలం 'ఈమాట' అంతర్జాల పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ఈ కథ వెంకటేశ్వర రావు గారి "ఆ నెల ఆ నీరు ఆ గాలి' అనే కథాసంకలనం నించి సేకరించబడింది. పుస్తకం కొనేటందుకు మరిన్ని వివరాలు 'వెబ్ పేజీ ' చివరలో ఇవ్వడం జరిగింది. ఈ కథలో ఆయన అమెరికాకు వచ్చే మెక్సికన్ ఇమిగ్రెంట్ లేబర్ అవస్థల గురించి చాల హృద్యంగా చిత్రీకరించారు. తానా వారు 2013 వ సంవత్సరం లో ముద్రించిన ' కథ - నేపధ్యం' అనే అనే ప్రత్యేక సంకలనం లో ఈ కథ ఎంపిక కాబడింది. కథను హర్షణీయం ద్వారా మీ కందించడానికి అనుమతినిచ్చిన శ్రీ వెకంకటేశ్వర రావు గారికి మా కృతజ్ఞతలు.గోమెజ్ ఇవాళా రాలేదు. పోయిన శనివారమే రావా ల్సినవాడు. పదు హేను రోజులకోసారి, శనివారం పొద్దున్నే వచ్చి లాస్ చెయ్యమని ఎన్నిసార్లు చెప్పినా వాడికి అర్థం కాదు. ప్రతీసారీ 'యస్ యస్, సీ సీ,' అంటూ నవ్వుతూ తలకాయ ఊపుతాడు. అంతే. వాడికి తీరికైనప్పుడే వస్తాడు. వచ్చినప్పుడు ప్రతిసారీ శ్రద్ధగా గడ్డికోసి, ఇంటి ముందు, వెనకా పెరిగిన పొదలన్నింటినీ అందంగా కత్తిరిస్తాడు. అదేం ఖర్మమో మరి! ఎప్పుడూ మధ్యాన్నం ఒంటిగంటకి వస్తాడు. కనీసం రెండు గంటలు మండు టెండలో పనిచేస్తాడు. రోడ్డు మీద ఎవరిని చూసినా చెయ్యి ఊపుతూ నవ్వుతూనే ఉంటాడు. అందుకనే కాబోలు, వాడు రావలసిన రోజున టైముకి రాలేదని సుజాత ఎంత చిరాకుపడినా గోమెజ్ చేతే లాన్ పను లన్నీ దగ్గిర ఉండి చేయిస్తుంది. తను మంచినీళ్లు తాగుతూ వాడికి కోక్ బాటిల్ ఇస్తుంది.గోమెజ్ కి ఇంగ్లీషు రాదు, యస్ యస్, అనడంతప్ప! ఇంగ్లీషు నేర్చు కుందామన్న కుతూహలం కూడా ఉన్నట్టు కనిపించదు. సుజాతకి స్పానిష్ రాదు. నేర్చుకుందామని అనుకోవడమే కాని, పనికట్టుకొని ఈ వయస్సులో కొత్త భాష నేర్చు కోవడానికి కావలసిన ఓపికా లేదు. అయితేనేం, వాళ్ళిద్దరూ చేతులతో సైగలు చేస్తూ సంభాషణ చెయ్యడం మూకీ సినిమాలని మరిపిస్తుంది. నిజం చెప్పొద్దూ! వీళ్ళ ముందు మార్సెల్ మార్సో ఎందుకూ పనికి రాడనిపిస్తుంది. గుబురుగా పెరిగిన పొదలు ఎంత ఎత్తు ఉంచాలో, ఎంత కిందకి కత్తిరించాలో, ఏ పూలమొక్కలు ఎప్పుడు ఎక్కడ తిరిగి పాతాలో, ఈ వివరాలన్నీ సుజాత చేతులు తిప్పుకుంటూ సైగలు చేస్తూ చెప్పడం, వాడు యస్ యస్! అని తలకాయ ఊపడం చూడముచ్చటగా ఉంటుంది. ఈ రెండేళ్ళన్నరలో వాడు సుజాతతో మాట్లాడుతూ నేర్చుకున్న తెలుగు మాటలు ముత్యంగా మూడు- ఆగు, ఇలారా, కాదు. సుజాత నానాయాతనా పడి వాడితో మాట్లాడుతూ నేర్చుకున్న స్పానిష్ మాటలు- అమీగో, సబాదో, దొమింగో.రెండున్నర సంవత్సరాల పైనే అయ్యింది సుజాత, మోహన్‌లు ఆ వీధిలో ఒక పెద్ద పాత ఇల్లు కొనుక్కొని. ఇంటి ముందు, వెనక ఖాళీస్థలం అర ఎకరం పైనే ఉంటుంది. ముందు పెద్ద లాను, రకరకాల పూల పొదలు. వెనక అటూ ఇటూ రెండు వీపింగ్ విల్లో చెట్లు ఉన్నాయి. వెనకాల సరిహద్దులో పెద్ద బర్మ్.దాని కింద ఆరడుగు లెత్తున హెడ్డింగ్ పొదలూ ఉన్నాయి. వాళ్ళు కొత్త ఇంట్లోకి చేరిన రోజునే ఎదురింట్లోకి కేథరీన్, ఫ్రాంక్ కూడా వచ్చారు. ఇద్దరికీ సంసార బాధ్యతలు, ఇతర బాదరబందీలు ఏవీలేవు. దానికి తోడు ఒకే వయసు వాళ్ళవడంతో సుజాతకి, కేథరీన్ కీ ఇట్టే స్నేహం కుదిరింది. రోజూ పొద్దున్నే లేచి సబ్ డివిజన్ లో వీధులన్నీ కొలుచు కుంటూ మెల్లిగా నడవడం, అమ్మకానికున్న ప్రతి ఇంటి మీదా కామెంట్లు చెయ్యడం, సాయంత్రం పూట ఎవరి డ్రైవ్ వేలో వాళ్ళు నిలబడి గంటల తరబడి పిచ్చాపాటీ చెయ్యడం అలవాటయ్యింది. సుజాత అమెరికా వచ్చి ము ప్ఫై ఏళ్ళయ్యింది. ఇన్ని ఏళ్ళున్నా ఫలానా తెల్లవాళ్ళు స్నేహితులు అని చెప్పుకోవటానికి ఎవరూ ఉన్నట్టులేదు. అలాగని నల్లవాళ్ళూ కూడా లేరు. ఇంతకుముందు వాళ్ళున్న ఇంటి సంగతి సరేసరి! తను పెరట్లోకి వెళ్ళితే చాలు, తను చెయ్యి ఊపుతూ పలకరిద్దామనుకున్నా ఆవెనకింటి ఆవిడ హాయ్ అని కూడా అనేది కాదు! ఈ సబ్ డివిజన్ లోకి రావడం, వచ్చిన రోజే కేథరీతో స్నేహం కుదరడం కలిసివచ్చింది.ఒక శనివారం సాయంత్రం సుజాత, కేథరీన్ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ట్రక్ నిండా పైన్ స్ట్రా బేళ్ళు పెట్టుకొని ఒక పాతికేళ్ళ కుర్రాడు వచ్చాడు. ఒక కట్ట పైన్ స్ట్రా చేత్తో పట్టుకొని, ఇంటిముందు చెట్లకుదుళ్ళకి స్ట్రా వేస్తానని సైగ చేస్తూస్పానిష్ లో వటవట వాగడం మొదలెట్టాడు. కాథెరీన్ మాట్లాడద్దని తర్జని తన పెదాల పై పెట్టుకొని సైగ చేస్తూ, 'హౌ మచ్?' అని అడిగింది. వాడు మూడు వేళ్ళు చూపించాడు. అంతే! కేథరీన్ ఇంటి ముందు, సుజాత ఇంటి ముందూ చెట్లకి, పొదలకీ ఓపిగ్గా కుదుళ్ళు చేసి పై' వేశాడు. బహుశా ఒక్కొక్క ఇంటికి పాతికబేళ్ళు పట్టి ఉంటాయి. అంటే డెబ్బై ఐదు డాలర్లు! ఏ హోమ్ డిపోలోనో పైన్ స్ట్రా కొంటే నూటపాతిక పైనే అవుతుంది. దానికి తోడు, అది తెచ్చి వేసినందుకు కూలి కనీసం మరో పాతిక డాలర్లు. చులాగ్గా ఒక్కొక్కళ్ళకీ నూట యాభై డాలర్లు ఖర్చు. సుజాత, కేథరీన్ లిద్దరికీ కలిపి నూటయభై డాలర్లతో ఇంటి ముందు అన్ని చెట్లకీ, పొదలకీ పైన్ స్ట్రా చవగ్గా దొరికింది.సుజాత, కేథరీన్ ఇద్దరూ ఒకేసారి వాడిని, 'గడ్డి కూడా కోస్తావా?' అని సైగ చేశారు, లాన్ చూపిస్తూ! వాడు యస్, యస్ అన్నాడు. కేథరీన్ కి సుజాతకన్నా ఓ నాలుగు స్పానిష్ మాటలు ఎక్కువ వచ్చు. ఇంగ్లీషు, స్పానిష్ కలిపి మాట్లాడేస్తుంది. వాడిని, 'లాన్ మోవర్ ఉన్నదా?' అని అడిగింది, వచ్చీరాని స్పాంగ్లిషే! వాడు, 'సీ, సీ' అన్నాడు చిరునవ్వు నవ్వుతూ! లాన్ చెయ్యడానికి ఎంత కావాలి, అని కూడా అడగలేదు. అడగడం ఎల్లాగో తెలిస్తేగా! ఆ రోజునుంచీ సుజాతకీ, కేథరీన్కీ గోమెజ్ తోటమాలి. ఇద్దరూ కూడబలుక్కొని చెరో ము ప్ఫై డాలర్లు ఇద్దామనుకున్నారు, అంతే.ఆ నెల వర్షాలు బాగా పడ్డాయో ఏమో, రెండు వారాలు తిరక్కుండా ఇంటి ముందు గడ్డి కనీసం అరడుగు పైగా పెరిగింది. వెనక బల్మ్ మీద డాన్ డెల్యన్ కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. గడ్డి కొసన సన్నగా మట్టిరంగు పూలు కూడా పూస్తున్నాయి. వారం నుంచీ సుజాత గోమెజ

Ep 108జన జీవన స్రవంతి
జన జీవన స్రవంతి :చీకటి ఊరిని, నెమ్మదిగా కమ్ముకోడం కనిపిస్తోంది, కిటికీలోంచి చూస్తే. దూరాన కనపడే మావిడి తోటల వెనకాల్నించీ సూర్యుడు ఎవరో తరుముతున్నట్టు హడావిడిగా కిందికి దిగిపోతున్నాడు . చదూతున్న పాత ఆంధ్రభూమి మూసి పక్కన పడేసా నేను . మిద్దె మీద గదిలో కూర్చోనున్నా. అమ్మమ్మ వాళ్ళ వూరు, పమిడిపాడు కొచ్చి రెండు రోజులైంది. ఎంసెట్ రాసి రిసల్ట్ కోసం వెయిటింగ్. పన్నెండు మైళ్ళు పమిడిపాడు గుంటూరుకి. మా అమ్మ ఏకైక తమ్ముడు, గంగాధరం మావ, ఆయన భార్య రాజత్త , అమ్మమ్మ వుంటారు ఇక్కడ. నేను వొచ్చిన రోజు సాయంకాలం నించీ మావ క్షణం తీరిక లేకుండా వున్నాడుమామూలుగా ఇంటి పట్టున ఎపుడూ ఉండని గంగాధరం మావ, ఇల్లు వదట్లేదు. ఎదురింటి రాజా రావు గారు , ఇంకా మా వీధిలో వుండే కొన్ని పెద్ద తలకాయలూ , వచ్చి పొద్దున్నించీ రాత్రి దాకా మంతనాలు, ముందు హాల్లో కూర్చోని, మావతో. నన్నేమో ఈ రూములో పడేసారు, ఓ బండెడు పుస్తకాలూ , ఒక ట్రాన్సిస్టరూ ఇచ్చి. అప్పుడప్పుడు రాజత్త వచ్చి నాలుగు మాటలు చెప్పి వెళ్తుంది. టిఫిన్ , భోజనానికి పడుకోడానికి మాత్రమే కిందికి. కిటికీ లోంచి, కిందికి వీధిలోకి చూసా. వీధి అంతా నిర్మానుష్యం. మామూలుగా అయితే ఈ పాటికి వీధి అంతా సందడి సందడి గా ఉండాల. పొలాలకు పొయ్యినోళ్లూ వెనక్కొస్తూ. పైనున్న శాతవాహనుల కాలం నాటి ఫ్యాను గూడ నెమ్మదిగా తిరుగుతోంది. బైట గాలి గూడ బిగుసుకొపొయ్యింది. జైల్లో ఉన్నట్టుంది .ఊరికొచ్చినప్పట్నుంచీ ఇదే పరిస్థితి. ఇల్లు దాటనివ్వట్లేదు ఎవ్వరూ. నాకేమో ఏదోరకంగా బయటికెళ్లి వెంకటి గాణ్ణి కలవాలనుంది. వెంకటి గాడు మూడో క్లాసు దాకా నాతో చదివి , స్కూలు మానేసాడు. పొలం పనులకు పోతాడు. చెర్వు అవతల వుండే గుడిసెల్లో ఉంటాడు వెంకటి గాడు, గంగాధరం మావ పాలేరు ఓబులేసు, ఉండేది కూడా అదే గుడిసెల్లో. ఐదు దాకా ఇదే వూళ్ళో, అమ్మమ్మ దగ్గరుండి చదూకున్నా నేను. వూళ్ళో వున్న ఒకే స్కూల్లో . పమిడిపాడు లో నేనూ, వెంకటిగాడూ కలసి చెయ్యని కోతి పన్లు అంటూ లేవు. గంగాధరం మావకి పెళ్ళై పదిహేనేళ్ళు అయ్యినా ఇంకా పిల్లలు లేరు. ఆయనకి చదువు పెద్ద అబ్బలేదు. సావాసాలు ఎక్కువ. ఎవరినో ఒకరిని వేసుకోని వారంలో రెండురోజులు గుంటూరు పొయ్యిరాందే మనిషి నిలవలేడు. పొలాలన్నీ కౌలు కి ఇచ్చేసాడు. రెండెకరాల మావిడి తోట తప్ప. మామిడి తోట చూసుకునే ఓబులేసు, గంగాధరం మావకి కుడిభుజం. వారానికోసారి చీట్ల పేక ఆడుకోడానికి తప్ప తోటగ్గూడా పోడు, గంగాధరం మావ. ఎవడికి గుంటూర్లో పనున్నా , వాడ్ని తన బైకు ఎక్కించుకొని గుంటూరు తీసుకోబోతూంటాడు. ఆయన బైకు, టికెట్ లేని ఓ మినీ టౌన్ బస్సు, వూళ్ళో జనాలకి. రాజత్త, అమ్మమ్మ కు అన్ని పనులలో చేదోడు వాదోడు. అమ్మమ్మ అంటూ ఉంటుంది, మీ అమ్మ పక్కన లేని లోటు లేదురా నాకు అని రాజత్త గురించి. ఇది గాక రాజత్త పుస్తకాల పురుగు. గంగాధరం మావ గుంటూరెళ్లిన ప్రతీ సారి పుస్తకాలూ కొనుక్కొస్తాడు. ఇంట్లో పన్లయ్యాక వాటిల్లో మునిగిపోతుంది. ఇంట్లో ఉంటే, నేను గూడ అత్త వెనకాలే. అత్త చదివే పుస్తకాల గురించీ మాటలే మాటలు.ఉన్నట్టుండి కర కర మని మూల్గుతూ, ఫ్యాన్ ఆగిపోయింది. గది బయటకొచ్చి అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లు దిగడం మొదలుపెట్టా, వరండాలోంచీ మాటల శబ్దం. రాజత్త , గంగాధరం మావ గొంతులు.తడుముకుంటూ వంటింట్లోకి వచ్చి చూసా. అమ్మమ్మ గూడ కనపళ్ళేదు. అంతా చీకటి. వంటింటిలోంచి పెరట్లోకి తలుపు తెరిచి ఉండడం, కుంపటి వెలుగులో కనపడింది. చిన్నగా పెరట్లోకి వచ్చి పిట్ట గోడ ఎక్కి దూకేసా. *********************************************వీధిలో రెండడుగులు వెయ్యంగానే, కరంటు వచ్చినట్టుంది, రోడ్డు మీద అక్కడక్కడా విసిరేసినట్టుండే వీధి దీపాలు వెలగడం మొదలుపెట్టాయి. వడి వడి గా అడుగులేసుకుంటూ చెరువు అవతల గుడిసెల దగ్గరికి చేరుకున్నా. ఇంటి ముందర మట్టి అరుగుమీద కూర్చొని, లాంతరు సరిచేస్తూ కనపడ్డాడు వెంకటి గాడు. వాడు చూడకుండా , దగ్గరిగా పొయ్యి “ వెంకటీ !” అని అరిచా నేను. దడఁచుకొని వెనక్కి తిరిగాడు వెంకటి. నన్ను చూడంగానే వాడి మొహం లో ఒక వెలుగు వెలిగింది. మరు క్షణంలో వెలుగు ఆవిరై పొయ్యి భయం బయటికి రావడం మొదలైంది. మాట్లాడే లోపలే వెంకటి గాడే అన్నాడు. “ఇక్కడుండొద్దు రా రాంబాబు. ఇంటికెళ్ళిపో” “ఇంట్లో గూడ గోల గోలరా, బయటికి రానివ్వట్లేదు. ఏమైంది ఊరికంతా” ? “నీకేం తెలవదా ”?అటూ ఇటూ తలూపా నేను. “మూడ్రోజులకిందట మీ మామిడి తోటలో పంచేస్తూంటే , లచ్చక్కని పక్క పొదల్లో కి తీస్కపొయ్యి గలాభా చేసారంట”.. వాడింకా ఏదో చెప్పబో తూంటే , అడిగేశా ఆదుర్దాగా, “ఎవరు” ?“మీ పక్కతోట నాగోజీ సారు కొడుకు రవిబాబు” . లచ్చక్క అంటే, మావ ఇంట్లో పాలేరు, ఓబులేసుభార్య . నాగోజీగారిల్లు గూడ మా గంగాధరం మావ వాళ్ళ వీధి చివర్లో. రవిగాడు డిగ్రీ మధ్యలోనే మానేసాడు . ఊరి మీద తిరుగుతుంటాడు. ఇంకా ఏదోఆలోచిస్తూంటే వెంకటిగాడు అన్నాడు. “మా పెద్దోళ్లంతా ఓబులేసు ఇంటిదగ్గరే గూడుకొని వుంటున్నారు రోజంతా, ఎవ్వరూ గూడెం దాటి బయటకు పోవట్లా పనులకు.”ఇంకేం మాట్లాడాలనే వాడు పడనిచ్చేటట్టు లేదు. గమ్మని ఎనక్కి తిరిగా.. *******************************************ఇంటి వెనక వైపు కొచ్చి జాగర్తగా చూసుకుంటూ పెరట్లోకి దూకాను. నెమ్మదిగా అడుగులేస్తూ వంటిట్లో దూరా. ఇంకా ముందు హాల్లో నించి మాటలు వినబడుతున్నాయి. ఎవ్వరూ నేను ఇంట్లోంచి బైటికెళ్లినట్టు గమనించనట్టున్నారు. ఊపిరి పీల్చుకున్నా. రాజత్త స్వరం హెచ్చితే ఆగి పొయ్యా. అంటోంది ఆవిడ , “చేసినవాడు మనోడు

Ep 106శ్రీరమణ గారు - బంగారు మురుగు
తెలుగు వారికి శ్రీ శ్రీ రమణ గారు కథా రచయిత గా , కాలమిస్ట్ గా , సంపాదకీయులుగా అత్యంత సుపరిచితులు.బంగారు మురుగు - శ్రీ రమణ గారి రచించిన 'మిధునం ' కథా సంకలనం లోనిది.ఒక బామ్మ గారు, మనవణ్ణి తన ప్రాణానికి ప్రాణంలా ఎలా చూసుకుంది? తన తదనంతరం అదే ప్రేమను అందించడానికి, తన బంగారాన్ని, ఇంకో యోగ్యురాలైన వ్యక్తి చేతికి ఎలా అందించిందీ ? అనేదే ఈ కథలో ముఖ్యాంశం.ఇప్పటిదాకా ఆయన కేవలం ఒక పాతిక కథలు మాత్రమే రాసారు. ఈ కథ చదివిన తర్వాత, సుప్రసిద్ధ రచయిత , సాహితీ వేత్త శ్రీ ఆరుద్ర గారు ఏవన్నారంటే , " కడిమి చెట్టు పన్నెండేళ్లకోసారి పూస్తుంది. ఇదిగో ఇప్పుడు శ్రీరమణ పూశాడు. ఆ కురింజి పేరు 'బంగారు మురుగు' "హర్షణీయంలో ఈ విజయదశమి రోజున ప్రసారం అయ్యే శ్రీ శ్రీరమణ గారి ఇంటర్వ్యూలో , ఈ కథ గురించి మరిన్ని వివరాలు మనం తెల్సుకోవచ్చు.ఇంటర్వ్యూ కు , వారి కథలు/వ్యాసాలూ ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ రమణ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.ఈ పుస్తకం మీరు కొనడానికి, కావాల్సిన వివరాలు ఇదే వెబ్ పేజీ లో చివర ఇవ్వబడ్డాయి.బంగారు మురుగు:నాకు ఆరేళ్ళప్పుడు మా బామ్మకి అరవై ఏళ్లు.మా అమ్మానాన్న ఎప్పుడూ పూజలూ పునస్కారాలూ, మళ్ళూ దేవుళ్ళూ గొడవల్లో వుండేవారు. స్వాములార్లు, పీఠాధిపతులూ ఎత్తే పల్లకీ, దింపే పల్లకీలతో మా ఇల్లు మరంలా వుండేది. అమ్మ తడిచీర కట్టుకుని పీఠాన్ని సేవిస్తూ - నే దగ్గరకు వెళితే దూరం దూరం తాక్కూడదు అనేది.బామ్మకి యీ గొడవలేం పట్టేవి కావు. అమ్మ నాన్న చుట్టం పక్కం అన్నీ నాకు బామ్మే. మా బామ్మకి కాశీ రామేశ్వరం అన్నీ నేనే. ఓకంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళం.పెద్దతనపు నస, అత్తగారి సాధింపులూ వేధింపులూ బామ్మ దగ్గర లేవు. ఎవరేనా "ఈ ముసలమ్మకి భయమూ భక్తీ రెండూ లేవు..." అంటే - "దయకంటే పుణ్యంలేదు. నిర్దయకంటే పాపం లేదు. చెట్టుకి చెంబెడు నీళ్లు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వేయడం, ఆకొన్న వాడికి పట్టెడు మెతుకులు పెట్టడం - నాకు తెలిసిందివే "అనేది.బామ్మకి పుట్టింటి వాళ్ళిచ్చిన భూమి నాలుగైదెకరాలు ఇంకో ఊళ్ళో ఉండేది. మా ఊరికి పది కోసుల దూరం. ఏటా పంటల కాలంలో కౌలు చెల్లించటానికి రైతులు వచ్చేవాళ్ళు . వచ్చీ రాగానే వాళ్ళని ఆప్యాయంగా పలకరించేది. పుట్టిన ఊరు విశేషాలన్నీ గుక్క తిప్పుకోకుండా అడిగేది. వాళ్ళు బదులుచెప్పకుండానే మళ్ళీ ప్రశ్న - ప్రశ్న మీద ప్రశ్న వర్షం కురిపించేది. రైతులేమొ పంట తెగుళ్ళగురించి, అకాల వర్షాల గురించి సాకులు చెప్పి పావలో బేడో చేతిలో పెట్టి వెళ్ళాలనే ఆలోచనతో దిగులు మొహాలు తగిలించుకు వచ్చే వాళ్ళు. ఆ మాట ఎత్తడానికి బామ్మ అవకాశం యిస్తేనా ?"ఎండన పడి వచ్చారు, కాళ్ళు కడుక్కోండరా" అనేసి వడ్డన ఏర్పాట్లలో పడిపోయేది. విస్తరి వేసిందగ్గర్నించి పెరుగు అన్నంలోకి వచ్చేదాకా వాళ్ళతో ఊరివాళ్ళ కబుర్లన్నీ వాగించేది.తీరా పెరుగన్నం చివర్లో "ఏరా అబ్బీ, యీ ఏడాది పంటలెలా వున్నాయిరా " అని అడిగేది.వాళ్ళకి పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టయేది. కమ్మటి భోజనం కొసరి కొసరి వడ్డిస్తే తిని, పైగా తిన్న విస్తరి ముందు కూచుని "పంటలు పోయాయి" అని చెప్పడానికి నోరాడక "ఫర్వాదేదమ్మా దేవుడి దయవల్ల" అనేవాళ్ళు. ఇంకేం చేస్తారు పాపం అణా పైసలతో శిస్తు అప్పగించి వెళ్ళేవాళ్లు. వెళ్లేప్పుడు "ఇదిగో బుల్లి పంతులూ! మీ అవ్వ గట్టి పిండమే !" అని ఎగతాళి చేసి వెళ్ళే వాళ్ళు.బడికి వెళ్ళనని మారాం చేసినపుడల్లా బామ్మ నాకు అండగా వుండేది. "పసి వెధవ, గ్రాహ్యం వస్తే వాడే వెళ్తాడు- అయినా ఒక్కగానొక్కడు బతకలేక పోతాడా..." అంటూ నన్ను చంకన వేసుకు బయటకు నడిచేది.మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు వుండేది. అది మా స్థావరం. రోజులో మూడొంతులు అక్కడే మా కాలక్షేపం. బాదంచెట్టు పచ్చటి గొడుగు పాతేసినట్టు వుండేది. రాలిన పండు ఆకులు విస్తరి కుట్టుకుని బామ్మ భోజనం చేసేది. దాని చుట్టూ చిన్న మట్టిఅరుగు వుండేది. "దీన్ని కాపరానికొచ్చేప్పుడు మా పుట్టించినించి తెచ్చా... అప్పుడు జానాబెత్తెడుండేది... నువ్ నమ్మవ్... పిచ్చి ముండకి మూడే ఆకులు బుల్లి బుల్లివి వుండేవి..." రోజు ఒకసారైనా ఈ మాట నాకు చెప్పేది. నే కాపరానికొచ్చి ఎన్నేళ్ళో ఈ పిచ్చి మొద్దుకి అన్నేళ్లు అంటూ మానుని చేత్తో తట్టేది ఆపేక్షగా.ఇప్పటికీ బామ్మ చెంబెడు నీళ్ళు దానికి పోస్తూనే వుంటుంది. మానుకి రెండు తొర్రలుండేవి. పై తొర్రలో రెండు రామచిలకలు కిలకిలలాడుతూ కాపరం చేస్తుండేవి. ఇంకో తొర్రలో బామ్మ నాకోసం చిరుతిళ్ళు దాచేది. కొమ్మకి తాళ్ల ఉయ్యాల వుండేది. నీడన ఆవుదూడ కట్టేసి వుండేది. దానికి బామ్మ పచ్చి పరకలు వేస్తూ వుండేది. కాకులు పడేసిన బాదంకాయలు వైనంగా కొట్టి నాచేత బాదం పప్పులు తినిపించేది. - ఆ బాదం చెట్టు మా ఇద్దరికీ తోడూ నీడా - ఊరు లేచేసరికి వాకిలంతా తీర్చిదిద్ది ముగ్గులు పెట్టేది బామ్మ. రాత్రి నాకు జోలపాడుతూ రేపటి ముగ్గు మనసులో వేసుకునేది. ముగ్గులు అయ్యేదాకా నేను బామ్మ వీపు మీద బల్లిలా కరుచుకు పడుకుని కునుకు తీస్తుండేవాణ్ణి. "అసలే నడుం వంగిపోయె... పైగా ఆ మూట కూడా దేనికి" - అని మా అమ్మ అంటే "వాడు బరువేంటే. వాడు వీపున లేపోతే ముగ్గు పడదే తల్లీ - చూపు ఆనదే అమ్మా" అనేది బామ్మ.సమస్త దేవుళ్ళకీ మేలుకొలుపులు పాడుతూ వాకిలి నాలుగు దిక్కుల్నీ ముగ్గుతో కలిపేది. అప్పుడు మా మండువా లోగిలి నిండుగా పమిటకప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తయిదువులా వుండేది. "పాటలు పాడి దేవుళ్ళని లేపకపోతే వాళ్లు లేవరా" అని అడిగితే "పిచ్చి సన్నాసీ దేవుళ్ళు నిద్దరోతారా! దేవుడు నిద్దరోతే యింకేమైనా వుందీ-! మేలుకొలుపులూ మనకోసమే చక్రపొంగలీ మనకోసమే" అనేది బామ్మ.తెల్లారగానే నూనె రాసి, నలుగు పెట్టి కాకరపందిరికింద ముక్కాలిపీట మీద కూచోపెట్టి వేడినీళ్ళు పోసేది. "చిక్కిపోయాడమ్మా పిల్లాడు... పొడుగు సాగుతున్నాడో ఏమో" అని బామ్మ రోజు నలుగు పెడుతూ దిగులుపడేది. ఒంటి మీద చిన్న గాటో, దెబ్బో, పొక్కో కనిపిస్తే "అఘాయిత్యం వెధవ్వి ఎక్కడ తగిలించుకున్నావ్" అని గారాబంగా కేకలేసి తెగ దిగులుపడిపోయేది. నాకప్పుడు ఎంతో హాయిగా అనిపించేది.నెలకోసారి భజంత్రీవాడు వచ్చేవాడు బాదం చెట్టుకింద నేను మా బామ్మ తలపని చేయించుకునేవాళ్ళం. ము

Ep 105దొంగ - తిలక్ గారి రచన
తెలుగువచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం.తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు.ఇప్పుడు వినబోయే కథ 'దొంగ' - 'తిలక్ కథలు' అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.ఈ పుస్తకం మీరు డిజిటల్ ఎడిషన్ లేదా ప్రింటెడ్ ఎడిషన్ కొనడానికి, ఇదే వెబ్ పేజీ లో వివరాలు ఇవ్వబడ్డాయి.కథ - 'దొంగ' :మసక మసకగా వుంది వెన్నెల. చెట్లకిందవున్న చీకటిలోంచి నడుస్తున్నాడు గోపాలం. మోకాళ్ళపైకి ఎగకట్టిన పంచెకట్టూ, ఛాతీకి బిగుతుగా అంటుకొనిపోయిన బనీనూ, మొలలో చిన్న కత్తి - ఆత్మ విశ్వాసంతో, ధైర్యంతో ఉన్నాడు గోపాలం...మధ్య మధ్య త్రేన్పులు వస్తున్నాయి పుల్లపుల్లగా - ఒకే ఒక గ్లాసుడు నాటుసారా పుచ్చుకున్నాడు బలానికీ, హుషారుకీ. చదువురానివాడైనా, ప్రతీదీ ఒక ప్లానుప్రకారం నడవాలి గోపాలానికి. ఏ పని చేసినా ముందూ వెనకా చూసి ఆలోచించి బేరీజువేసే అలవాటు వుంది అతనికి. ఒక స్వాభావికమైన వివేకం వుంది. అందుకే రత్తయ్యా, సోములూ ఎంతో నమ్మకంవుంచి అతనిమీద యీ బాధ్యత వేశారు. వాళ్ళిద్దరూ లేకుండా వుంటే, పనులు సవ్యంగా జరుగుతాయి. వాళ్ళిద్దరికీ నిదానం లేదు. ఉత్త కంగారు. ఉత్తి ఆశ తప్ప.రాత్రి ఒంటిగంట దాటితేకాని ఆవిడ మొగుడింటికి రాడు, రెండు వారాలు పరిశీలనగా చూసి యీ విషయం గ్రహించాడు. ఆ క్లబ్ లో కూర్చుని ఖరీదైన మందు తాగుతూ పేకాడుతూ డబ్బయిపోయేవరకూ అక్కడే వుంటాడు. ఈలోగా అతని భార్యవొంటరిగా యింట్లో వంటగదికి పక్కగా వున్న గదిలో పడుకుని నిద్రపోతుంది. వంటగదికి దొడ్లో నుంచి వెళ్ళాలి. దొడ్డి చాలా పెద్దది. ఎన్నో మొక్కలూ చెట్లూ వున్నాయి. వాటి నీడలో తాను కనుపించడు. మరీ మంచిది. వంటగది కిటికీ వానకి తడిసి ఎండకి ఎండి కమ్ములు పట్టుతప్పివున్నాయి. బలంగా తెలివిగా పనిచేస్తే మూడు నాలుగు ఊచల్ని తీసెయ్యవచ్చును. ఇంక ఒకసారి వంటగదిలో ప్రవేశించాక పనిచాలా సులభం. తాను అవతల గదితలుపు కొడతాడు మెల్లగా, ఆవిడ ఏ ఎలకో. పిల్లో అనుకుని తలుపు తీస్తుంది. అంతే, తాను కత్తి చూపించి భయపెడతాడు. మెళ్ళో వున్న నాలుగు పేటలగొలుసు ఒడుపుగా తాపీగా తీసుకుంటాడు. ఆమె తెప్పరిల్లే లోపల. కేకవేసేలోపల తోటలోకి చీకట్లోకి అదృశ్యుడైపోతాడు.గోపాలం యిలాగ తన ప్లానంతా ఆలోచించుకుంటూ నిబ్బరంగా నడుస్తున్నాడు. రోడ్లు నిర్మానుష్యంగా వున్నాయి - అక్కడక్కడ ఒకరిద్దరు రాత్రించరుల్ని తప్పించి, ఊరికి దూరంగా ఉన్న కొత్తపేట యిది. ఊళ్ళోవున్న జనసంచారమూ, అలజడి ఇక్కడ ఉండవుమొదట ఆట అయిపోగానే మొగలోవున్న కిళ్ళీకొట్లూ, చిన్న కాఫీ హోటలూ మూసేస్తారు. చాలా ఇళ్ళు నిద్రలో మునిగిపోయాయి. కొన్ని ఇళ్ళలోంచి మాత్రం విద్యుద్దీప కాంతి కిటికీలోంచి వస్తోంది. మొత్తమ్మీద వీధులూ, ఇళ్ళూ ఆ మసక వెన్నెలలో ఒంటరిగా గోపాలంకోసం యెదురు చూస్తోన్నట్లు వున్నాయి.గోపాలానికి తనుచేసే పనిమీద నైతిక సందేహాలు ఏమీలేవు. దొంగతనం తప్పనీ, పాపమనీ అతను అనుకోలేదు. ఎందరో తమ తమ అవసరాలకి ఎన్నో వృత్తులూ , ఉద్యోగాలు చేసినట్టుగా అతనూ యిది చేస్తున్నాడే తప్ప మంచి చెడ్డల సూక్ష్మ విచారణచేసే పిరికితనం కాని, అసలటువంటి ఆలోచనకి అవసరంకాని అతనికి కనిపించలేదు. అందువలన అతనికి అంతరాత్మని నొక్కివేయడమూ ఒప్పించడమూ లాంటి బాధలు కలుగలేదు. తనపనిలో దొరికిపోతే జైలుకి వెళ్ళాలన్న భయమూ జ్ఞానమూ వున్నాయి అతనికి. అందుకే జాగ్రత్తగా ప్లానువేసుకుంటాడు. ఎంతో అవసరమైతేకాని రత్తయ్యనీ, సోముల్నీ వెంటతీసుకుని వెళ్ళడు. వాళ్ళిప్పుడు తనకోసం ఆశగా ఎదురు చూస్తూంటారన్న ఆలోచన అతనికి మరింత ఉత్సాహం ఇచ్చింది.ఆ యిల్లు మసక వెన్నెల్లో ముడుచుకున్న తాబేలులా వుంది. ప్లాను ప్రకారం ఇంటివెనక్కి వెళ్ళి దొడ్లోకి ప్రవేశించాడు. అరటిచెట్లూ, కొబ్బరిచెట్లూ ఏవేవో మొక్కలూ , తుప్పలూ, అంతా గలీజుగా చీకటిగా ఉంది.నెమ్మదిగా నడిచి వంటగది దగ్గరకు వచ్చాడు గోపాలం. కిటికీ వూచల్ని ఒకసారి లాగిచూశాడు. ఇంతలో అతనికి లోపల్నుంచి మాటలు వినిపించాయి. అతనికి ఆశ్చర్యం కలిగింది. అతని పథకం అప్పుడే దెబ్బతిన్నట్టనిపించింది. ఈసారి మాటలు కొంచెం గట్టిగా కోపంగా వినవచ్చాయి. గోపాలానికి కుతూహలం కలిగింది.బహుశా ఆ వచ్చిన వాళ్ళెవరైనా మళ్ళీ వెళ్ళిపోవచ్చును. తన మార్గం నిరాటంక మనవవచ్చును అనికూడా అనిపించింది. ఒకవేళ ఎవరైనా ప్రియుడేమో- మొగుడు లేకుండా చూసి ప్రేమకలాపం జరుపుతోందేమో అని ఊహ తట్టింది. మాటలు తొందరగా గట్టిగా వినబడుతున్నాయి. ఆవిడ గొంతు ఏదో భయం. బాధావున్నాయి. అతని కుతూహలం హెచ్చింది. బలంగా వూచల్ని లాగి కదిపి ఊడదీశాడు. నేర్పుగా ఏర్పడిన జాగాలోనుంచి వంటింట్లోకి ప్రవేశించాడు. పక్క గదిలోనుంచి మాటలు వినబడుతున్నాయి." వద్దండీ నామాట వినండి " ఆవిడ గొంతు." ఇస్తావా - తగలనియ్యనా" మగ గొంతు."ఎందుకు జూదమాడి తగలేస్తారు చెప్పండి. కాపరానికొచ్చిన నాటినుండి సరదాలేదు. సుఖంలేదు. ఉన్న ఆస్తంతా తగలేశారు చాలదా? ""వెధవ లెక్చరివ్వక మర్యాదగా తీసి ఇలా ఇయ్యి. లేకపోతే...""ఈ ఉన్న ఒక్క గొలుసూ ఇస్తే నా గతేంకాను. బాబు గతి ఏంకాను! చూడండి వాణ్ని-కన్న కొడుకుని. మీకు దయలేదా? జాలిలేదా! ఏమండీ- ఈ వాళికి ఊరుకోండి. పన్నెండు గంటలవుతోంది. ఒక్కరినీ బిక్కుబిక్కుమంటూ ఇంట్లో - రండి. పడుకోండి."కర్కశంగా వినబడింది. యీసారి మగ గొంతు - "ఇస్తావా - పీక పిసికి చంపెయ్యమన్నావా, వెధవ పీడ వదుల్తుంది."" ఇవ్వను."" ఇవ్వనా?"" ఇవ్వనుగాక ఇవ్వను. ఇది మా పుట్టింటివారు పెట్టింది. ఇది నా ఆస్తి."వింటూన్న గోపాలానికి ఆవిడ మాటలలో ఏదో న్యాయం గోచరించింది. ఆవిడ గొంతు తియ్యగా సన్నగా జాలిగా వుంది. గోపాలానికి ఆవిడ మొగుడి మీద కోపం వచ్చింది."నీ ఆస్తా-? ఏవిటీ పేలావు, ఇన్నాళ్ళూ తిన్నది నా డబ్బు కాదూ! తే- ఆ గొలుసు తే.""ఏవండీ. ఇలా అన్యాయంగా మాట్లాడతారేమండి..

Ep 104'పీవీ తో నేను' - శ్రీరమణ గారి రచన 'వెంకట సత్య స్టాలిన్' నించి.
తెలుగు వారు గర్వపడే కథలు రచించిన రచయితల మొదటి వరుసలో శ్రీ శ్రీరమణ గారు వుంటారు. ఇది గాక వారు తెలుగు ప్రసార మాధ్యమాలన్నిటిలోనూ గత యాభై ఏళ్లపైబడి విమర్శ, సమీక్ష , సంపాదకీయం లాంటి అనేక రంగాల్లో పని చేస్తూ ఎంతోమందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు.అతి సున్నితమైన హాస్యం తో రచనలు చేయడంలో ఆయన సిద్దహస్తులు. తెలుగులో పేరడీ ప్రక్రియకు , ఒక గౌరవ ప్రదమైన సాహితీ స్థాయి కల్పించిన రచయిత గా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.ఆయన కథా రచన 'మిధునం' మలయాళం లో వాసుదేవన్ నాయర్ గారి దర్శకత్వంలో , తెలుగు లో భరణి గారి దర్శకత్వంలో సినిమా గా తీయడం జరిగింది.హర్షణీయంలో ఈ విజయదశమి రోజున ఆయనతో ఇంటర్వ్యూ ప్రసారం అవుతుంది.ఇంటర్వ్యూ కు , వారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ రమణ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.ఇప్పుడు మీరు వినబోతున్న ఆడియో శ్రీ రమణ గారి సరికొత్త హాస్య రచనా సంకలనం 'వెంకట సత్య స్టాలిన్' లోని ఒక భాగం.ఈ పుస్తకం మీరు డిజిటల్ ఎడిషన్ లేదా ప్రింటెడ్ ఎడిషన్ కొనడానికి , ఇదే వెబ్ పేజీ లో వివరాలు ఇవ్వబడ్డాయి.ముందుగా వెంకట్ సత్య స్టాలిన్ గురించి , శ్రీరమణ గారి మాటల్లోనే ఓ రెండు ముక్కలు -" ఇంతవరకు తెలుగు లిటరేచర్‌లో వచ్చిన అత్యుత్తమ హాస్యపాత్ర వెంకట సత్యస్టాలిన్! ఈ ముక్క ఎవరన్నారు?- అప్పుడప్పుడు నాకే అనిపిస్తూ వుంటుంది.ఇంత గొప్ప క్యారెక్టర్ని సినిమాలో పెట్టి తీరాల్సిందే!- నిబిడాశ్చర్యంతో కొందరూ,- ఆఁ, పెట్టి తీసిందేనని చప్పరిస్తూ యింకొందరూ,అడయార్ మర్రిచెట్టుకి నాలుగంటే నాలుగే ఆకులు ఉండటం స్టాలిన్బాబుకి తెలుసు. కొంచెం ముదురు.- ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. మీరు తప్పక ఓ కాపీ కొని చదవండి. ఈ బ్రహ్మపదార్థాన్ని మీకు తోచిన విధంగా అంచనా వేసుకోండి. అర్థం చేసుకోండి. అర్థంకాపోతే వెనకనించి ముందుకు చదవండి. తప్పక అవుతాడు. కాపోతే మళ్లీ మొదట్నించి..."ఇలాంటి వెంకట సత్య స్టాలిన్ గారు మన పూర్వ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారి జీవితంలో , ఎలాంటి ముఖ్య పాత్ర వహించారు అనేది, ఆయన స్వగతం లోనే విందాం. స్టాలిన్ గారు తన పేరులోనే సత్యాన్ని ఇముడ్చుకోవడం ద్వారా , తన మాటల్లోనిజం ఎంత ఉందొ మనకు అన్యాపదేశంగా చెబుతున్నారని శ్రోతలందరూ గ్రహించ ప్రార్థన.పుస్తక ప్రచురణ వివరాలు:ఈ సంకలనం అనల్ప పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.https://www.amazon.in/Telugu-Books-ANALPA/s?rh=n%3A8882241031%2Cp_6%3AA32BM6ZYE70A9Lఈ పుస్తకం digital edition ని , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.https://kinige.com/book/Venkata+Satya+Stalinలేదా 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.నవోదయ బుక్ హౌస్3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్ఫోన్ నెంబర్: 090004 13413https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7*Intro- outro BGM credits: This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Ep 101హర్షణీయంలో డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారి ఇంటర్వ్యూ పై అభిప్రాయాలు
డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారితో మూడు వారాలక్రితం, హర్షణీయం నిర్వహించిన ఇంటర్వ్యూ గురించి, సబ్ స్క్రైబర్స్ అభిప్రాయాలను ఆడియో ద్వారా మీరు వినవచ్చు.ఇంటర్వ్యూ లింక్ ని కూడా ఈ పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ ఎపిసోడ్ ద్వారా తమ అమూల్యమైన అభిప్రాయాలను వెలిబుచ్చిన శ్రీమతి శ్వేత, శ్రీమతి బాల , శ్రీయుతులు శ్రీనివాస రావు , బాలాజీ , మురళీధర్ మరియు శాంతారాం గార్లకు , హర్షణీయం ధన్యవాదాలు తెలుపుకుంటోంది. ఇదే పేజీలో క్రింది భాగంలో మీ ఇమెయిల్ ని అందజేసి హర్షణీయం లో మీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోండి. సభ్యులకు అన్ని అప్ డేట్స్ ఇమెయిల్ ద్వారా జరుగుతుంది.Bgm credit : 'Envanile' by Jingleman https://www.youtube.com/watch?v=fyM41M0n3lIThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Ep 100హర్షణీయంలో పెద్దిభొట్ల వారి 'ఇంగువ'!
https://harshaneeyam.in/2020/09/27/peddibhotla/హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు కథా నీరాజనం శీర్షికలో మీరు వినబోతున్న కథ పేరు 'ఇంగువ' . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ' పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ' అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన ఆయన , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు కూడా.(ఈ పుస్తకం మొదటి రెండో భాగాలు డిజిటల్ ఎడిషన్, ప్రింటెడ్ వెర్షన్, కొనడానికి కింద లింక్స్ ఇవ్వడం జరిగింది.)1938 సంవత్సరంలో గుంటూరు లో జన్మించిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు తన జీవిత కాలంలో 350కి పైగా కథలు , 8 నవలలు రాసారు. ఆయన రచనలు ఎన్నో ఇంగ్లీష్ , రష్యన్ తదితర భాషల్లోకి అనువదించబడ్డాయి. ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అవార్డు తో బాటు ఆయన రచనలు ఎన్నో పురస్కారాలు అందుకున్నాయి.ముందు గా ఈ కథపై , హర్ష అభిప్రాయాన్ని తెలుసుకుందాం.కథలు రెండు రకాలు.చాలా కథలు చదవడం అవ్వగానే ఎదో ఒక ఫీలింగ్ ని వెంటనే మనలో కలగ చేస్తాయి, అది వినోదం కావచ్చు, విషాదం కావచ్చు, విసుగు కావచ్చు , వికారం కావచ్చు, ఇన్స్టెంట్ కాఫీ లాగా....రెండో రకం కథలు, ఫిల్టర్ కాఫీ లాంటివి, తాగడం అయిపోయింతర్వాత కూడా వదిలిపెట్టవు . మనల్ని వదలకుండా వెంటాడి కలిచేసి , కరిచేసి మన చుట్టూ వుండే ఏదో ఒక సంఘర్షణనో సమస్యనో అద్దం ముందు పెట్టి , చూపిస్తాయి.ఇలాంటి కథలే మనతో ఉండిపోతాయి , అవార్డులు రివార్డులూ గెల్చుకుంటాయి.ఇంగువ ఈ రెండో కోవకు చెందిన కథ.ఏదో ఒక రంధి లో పడి పొయ్యి, మనం చేయాలనుకునే ఒక పని గాని , తెలుసుకోవాలనుకునే విషయం గాని , ఏళ్ళు ఏళ్ళు దాని గురించి ఏమీ చెయ్యకుండా పోవడం , అలాగే దాన్ని గురించి ఒక అసంతృప్తి, అలా ఉండిపోవడం మనలో చాలా మందికి జరిగే విషయం.ఒక చిన్న వంట సరుకుని తీస్కొని , అదే విషయాన్ని మెటాఫరికల్ గా ఇంత గొప్ప గా చెప్పాలంటే, అది పెద్దిభొట్ల వారి లాంటి గొప్ప రచనా సామర్ధ్యం వున్న రచయితకు మాత్రమే చెల్లు.ఇదంతా ఒక ఎత్తయితే , వెదుకుతున్న సమాధానం చుట్టుపక్కలే దొరకడం , కథకి అతి గొప్ప కొస మెరుపు.పుస్తక ప్రచురణ వివరాలు:ఈ సంకలనం విశాలాంధ్ర పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది.https://www.visalaandhrapublishinghouse.com/ఈ పుస్తకం digital edition ని , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.https://kinige.com/book/Peddibhotla+Subbaramaiah+Kathalu++Part+onehttps://kinige.com/book/Peddibhotla+Subbaramaiah+Kathalu++Part+twoలేదా 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.నవోదయ బుక్ హౌస్3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్ఫోన్ నెంబర్: 090004 13413https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7*Intro-outroCredits:Mounaragam Theme - Manaswini Anand (https://youtu.be/s4cARPm3LZ8)This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Ep 99'ఓ హెన్రీ స్టోరీ' - వెంకట్ శిద్ధారెడ్డి గారి 'సోల్ సర్కస్' కథాసంకలనం లోంచి!
హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు వినబోతున్న కథ శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారు రాసిన , కథాసంకలనం 'సోల్ సర్కస్' లోనిది.వెంకట్ శిద్ధారెడ్డి గారు నెల్లూరు జిల్లాలో జన్మించి,కోరుకొండ సైనిక్ స్కూల్ , తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించి , దేశ విదేశాల్లో పని చేసిన ఆయన 'సోల్ సర్కస్' అనే కథ తో , రచయితగా పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు.2019 వ సంవత్సరంలో తన మిత్రులతో కలిసి , 'అన్వీక్షికి పబ్లిషర్స్' అనే సంస్థని స్థాపించి, ప్రపంచ సాహిత్యంలోని, తెలుగు సాహిత్యంలోని అనేక చక్కటి పుస్తకాలని తెలుగు పుస్తక ప్రేమికులకు అందచేస్తున్నారు.ఇదిగాక , ఆయన , తెలుగు సినిమా పరిశ్రమలో డైలాగ్, స్క్రిప్ట్ రైటర్ గా , ఎడిటర్ గా, ప్రొడ్యూసర్ గా , డైరెక్టర్ గా అనేక పాత్రలు నిర్వహిస్తున్నారు.దృశ్యం, c/o కంచర పాలెం, ఈ నగరానికి ఏమైంది, ఇంకా అనేక చిత్రాలకు ఆయన పని చేయడం జరిగింది.హర్షణీయం, వచ్చే వారం ఎపిసోడ్ లో , ఆయనతో ముఖా ముఖీలో , ఆయన గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకోవచ్చు.వెంకట్ శిద్ధారెడ్డి గారి రచించిన ' ఓ హెన్రీ స్టోరీ' అనే కథ ఇప్పుడు మీరు పై ఆడియో లో వినబోతున్నారు.పుస్తక ప్రచురణ వివరాలు:ఈ సంకలనం అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.(https://www.facebook.com/AnvikshikiPublishers/)ఈ పుస్తకం డిజిటల్ ఎడిషన్ ని , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.https://kinige.com/book/Soul+Circusలేదా 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.నవోదయ బుక్ హౌస్3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్ఫోన్ నెంబర్: 090004 13413https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7*Intro-outro BGM Credits:Mounaragam Theme - Manaswini Anand (https://youtu.be/s4cARPm3LZ8)Edhedho Ennam Valarthen | Durai Srinivasan | Soul Strings https://www.youtube.com/watch?v=LWpJxRYZb2wThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Ep 98సుప్రసిద్ధ సినీ దర్శకులు 'వంశీ' గారి కథ 'ఏకాదశి చంద్రుడు'
హర్షణీయానికి స్వాగతం. ఈరోజు 'కథా నీరాజనం' శీర్షికన, 'ఏకాదశి చంద్రుడు' అనే కథ మీరు వినబోతున్నారు. ఈ కథ వంశీ గారు ' ఖచ్చితంగా నాకు తెలుసు అనే కథా సంపుటి నించి స్వీకరించ బడింది.(ఈ కథ ఆడియో పై మీ వ్యాఖ్యలకు ఈ వెబ్ పేజీ ని సందర్శించండి https://harshaneeyam.in/2020/09/20/ekadasi/)కథలోకెళ్లే ముందర వంశీ గారి గురించి ఓ రెండు మాటలు. వంశీ గారు ఎంత గొప్ప సినీ దర్శకుల్లో, అంత గొప్ప కథారచయిత కూడా.నేను చూసిన వంశీ గారి మొదటి సినిమా 'సితార'. ఆ సినిమాలో వంశీ గారి ఫ్రేములకి , ఇళయరాజా గారి సంగీతం తోడై, తెలుగు సినీ ప్రేమికులు ఎప్పటికీ గుర్తుపెట్టుకోదగ్గ చిత్రంగా మిగిలిపోయింది.వంశీ గారి చాలా చిత్రాలకు, ఇళయరాజా గారు సంగీత దర్శకత్వం వహించారు. అలానే వంశీ గారి చాలా కథలకు బాపు గారు బొమ్మలు వేశారు. 'నాకు ఖచ్చితంగా తెలుసు' అనే ఈ కథాసంకలనం లో కూడా అన్నీ బొమ్మలు బాపు గారివే . ఈ పుస్తకాన్ని , అన్వీక్షికి పబ్లిషర్స్ వారు చాలా అందంగా ముద్రించారు.వీరి ముగ్గురి మధ్య ఉన్న ఇంకో అద్భుతమైన లింకు ఏమిటంటే, ఇళయరాజా గారి సంగీతానికి పోటాపోటీ గా , తమ చిత్రాల్లో visuals present చేసిన దర్శకుల్లో బాపు గారు వంశీ గారు మొదటి స్థానంలో వుంటారు.ఆయన కథా రచన విషయానికొస్తే, దాదాపుగా రెండు వందల యాభైకి పైగా ఆయన కథలు రాయడం జరిగింది. తెలుగు కథా సాహిత్యంలో మనకు చాలా మంచి కథా రచయితలు వున్నారు అలానే కొంత మంది గొప్ప కథా రచయితలు కూడా.ఒక మంచి కథకీ, గొప్ప కథకీ మధ్యలో వుండే చిన్న వ్యత్యాసం, ఆ కథని రచయిత ముగించే పద్ధతి అని నేను అనుకుంటాను.ఉదాహరణకి , మన కథానీరాజనంలో, ఇంతకు ముందు విన్న వంశీ గారి కథ , 'శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్సు' నే తీసుకుందాము.https://harshaneeyam.in/2020/09/19/vamsi-1/ఆ కథలో శంకర్ రావు కి , సహాయం చేసిన రాజు గారు , మతి స్థిమితం లేని వ్యక్తి అని మనకి చివర్లో తెలుస్తుంది. అక్కడితో ఆ కథ ఆపేసినా కూడా , ఆ కథ ఒక మంచి కథ కిందికే వస్తుంది. కానీ వంశీ గారు ఆ పని చెయ్యలేదు. వెళ్తూ వెళ్తూ ఒక చిన్న వాక్యం రాసారు. అదేంటో ఇప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం."నిజాయితీ పరుడైన ఆయన లోకంలో సమస్యల గురించి ఆలోచించడం వల్ల పిచ్చోడై పొయ్యేడంట. "ఇక్కడ ఉన్న ఒక కాంట్రడిక్షన్ ఏంటంటే, అబద్దపు ప్రపంచాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఆయన, మతిస్థిమితం తప్పింతర్వాత , తాను నిజవనుకుంటున్న ఒక అబద్ధమైన చెక్కునిచ్చి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడ్డం.ముగింపులో ఈ ఒక్క ముక్క రాయడం ద్వారా , వంశీ గారు , ఒక మంచి కథని ఇంకో రెండు మెట్లు ఎక్కించి, ఉన్న పాటున ఒక గొప్ప కథని చేసేసారు.ఇప్పుడు మీరు వినబోతున్న కథలో కూడా ఒక ఉదాత్తమైన ముగింపు వుంది.ఈయన ఇలానే కథా రచనా జీవితాన్ని సాగిస్తూ, ఇంకా మనకోసం ఎన్నో గొప్ప కథల్ని సృష్టించగలరని ఆశిద్దాం.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Ep 97మా ఐ.టి వాళ్ళు కొండను తవ్వారు, ఎలుకను పట్టారు!
"ఎవరక్కడా!" అని కోపంగా అరిచాడు మహారాజు."తమరి ఆజ్ఞ మహారాజా" అంటూ గజ గజలాడుతూ వచ్చాడు, అంతరంగ రక్షకుడు అయిన భద్రుడు."నా రాజ్యం లో, నా రాకుమారుడి కి భోజనం లో ఎండు చేప అందలేదు. మేము దీన్ని ఎంత మాత్రమూ సహింప జాలము. నా దృష్టిలో ఇది ఒక అత్యయిక ఘటన. వెంటనే మన సర్వ సైన్యాధ్యక్షుల వారైన రామానుజాన్నీ మూలకారణాన్ని శోధించి, నివారణోపాయాన్ని పంపమనండి""చిత్తం మహారాజా" అంటూ అక్కడనుండి నిష్క్రమించి, సర్వ సైన్యాధ్యక్షుల వారి భవనానికి వచ్చి రామానుజాన్ని నిద్ర లేపాడు భద్రుడు."ఏమయ్యింది రా! భద్రా" అన్నాడు రామానుజం కళ్ళు నలుపుకుంటూ, ఆవులిస్తూ."మన రాజ్యం లో ఓ అత్యయిక ఘటన జరిగింది, అందుకే సర్వసైన్యాధ్యక్షునిగా మిమ్మల్ని బాధ్యత వహించి, మూలకారణాన్ని శోధించి, నివారణోపాయాన్ని పంపమన్నారు, మహారాజులం గారు" అన్నాడు భద్రుడు."రాజు గారి ఒక్క కొడుక్కి దొరకలేదా ఎండు చేప లేక ఆయన గారికి మరియు తక్కిన ఆరుగురు కొడుకులక్కూడానా " అడిగాడు రామానుజం."లేదండి, ఒక్కరికే అందలేదు అని అన్నారండి రాజు గారు""నిన్న అందిన ఎండు చేప, మొన్న అందిన ఎండు చేప ఈ రోజు ఎందుకు అందలేదబ్బా" ఆశ్చర్యపోయారు రామానుజం."అయినా ఏడుగురిలో ఒకరికి అందక పోతే అది మన సేవా ధర్మ ప్రకరణ ప్రకారం ఒకటో అంకె లోపం కాకూడదదే" అనుకుంటూ, భద్రా! వెంటనే మన దండనాయకుల వారిని ప్రవేశ పెట్టుము అని ఆజ్ఞ జారీ చేసాడు.ఐదు నిముషాల్లో, దండనాయకులయిన సీతారాం వేం చేసేసారు, "అలా ఒకటో అంకె సేవా లోపం అని మహారాజా వారు ఎలా నిర్ణయిస్తారు? ఇలా అయితే రేపు బంగాళా దుంపల వేపుడు అందలేదనో, మధువు దొరకలేదనో, ధూమపాన గొట్టం బాగా లేదనో, పాదరక్షలు ఇంపుగా లేవనో, వంటికి రాసుకునే అత్తరు బాగాలేదనో ప్రతీ దానికీ ఒకటో అంకె సేవా లోపం అంటారు భవిష్యత్తులో. ప్రాణాలకు ప్రమాదం సంభవిచినప్పుడు తొమ్మిది ఒకటీ ఒకటీ సేవల్లో లోపం వస్తే గోల చేయాలి గానీ ఇలా ప్రతీ అడ్డమైన దానికీ ఒకటో అంకె సేవా లోపం అంటే ఎలా" అని రుస రుస లాడిపోయాడు."ముందు ఒకటో అంకె లోపం గా తీర్మానం చేయి సీతారాం, తర్వాత రెండో లేక మూడో అంకె లోపం గా చేద్దాము" అన్నాడు విసుగ్గా రామానుజం.ఇద్దరు కలిసి ఒకటో అంకె సేవా లోప పరిస్థిని తెలియజెప్పే గంట మోగించారు. వెంటనే దళ నాయకులూ రంగం లోకి దిగారు. లెక్క ప్రకారం ప్రభావితం అయ్యింది ఏకాకి, అయినా రాజు యొక్క కుటుంబ సభ్యుడు కాబట్టి ఇది ఒకటో అంకె లోపం అని నిర్ధారించుకున్నారు.ముందు ఆ రాజుగారి కొడుక్కి రామానుజం గారి కుక్క పిల్ల కోసం నిల్వ చేయబడ్డ ఎండు చేప ముక్కని పంపారు వండుకు తినమని, ఆ తర్వాత మూలకారణాన్ని శోధన మొదలెట్టారుఅసలేమీ జరిగింది:రాజు గారికి ఏడుగురు కుమారులు. ఆ కుమారులు ఒక రోజు వేటకి వెళ్లి ఏడూ చేపలు తెచ్చారు. వాటిల్ని ఎండ బెట్టారు. అన్నీ చేపలు ఎండాయి కానీ ఒక చేప ఎండలేదు.సమస్యేమిటి:ఆరు చేపలు ఎండాయి. ఒక చేప మాత్రం ఎండ లేదు.ఒకటవ ఎందుకు: చేప ఎందుకు ఎండ లేదు?సమాధానం: గడ్డి మోపు అడ్డం వచ్చింది.రెండవ ఎందుకు: గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చింది?సమాధానం: ఆవు గడ్డి మోపును మేయలేదు.మూడవ ఎందుకు: ఆవు గడ్డి మోపును ఎందుకు మేయలేదు?సమాధానం: అవ్వ ఆవును మేతకు విడవలేదు.నాలుగవ ఎందుకు: అవ్వ ఆవును ఎందుకు మేతకు విడవలేదు?సమాధానం: పిల్లవాడు ఉదయం నుండి ఒకటే ఏడుస్తున్నాడు కాబట్టి.ఐదవ ఎందుకు: పిల్లవాడు ఉదయం నుండి ఎందుకు ఏడుస్తున్నాడు?సమాధానం: పిల్లవాడిని ఉదయం చీమ కుట్టింది.ఈ సమాధానం తో అందరూ ఆహా తెలిసెన్ జుమీ అని అరిచేసేసారు. అందరూ కూడబలుక్కుని మహారాజు కి ఈ క్రిందని సమాచారం పంపించేశారు."దైవ సమానులైన మహారాజ శ్రీవారి పాద పద్మములకు నమస్కరించి, మీ దళ, దండ, సర్వ సైన్యాధ్యక్షులు నమస్కరించి విన్నవించుకొను విన్నపము. తమరి ఆఖరి సుపుత్రుల భోజనంలో ఎండు చేప కరవైనదని విని మిక్కిలి దుఃఖపడినాము. ఇది చాల విచారింప దగ్గ విషయము. ఇది దురదృష్టవశాత్తు జరిగిన మానవ తప్పిదనమే కానీ మా సేవ భావం లో లోపము గా మీరు భావించరాదు. మేము ఈ విషయాన్ని కూలంకషం గా శోధించి, ఇక మన రాజ్యం లో చీమలని సమూలంగా గా నిర్మూలించాలని నిర్ణయించాము. కావున తమరు దయయుంచి తమ ఖజానా నుండి మాకు ఓ పదివేల బంగారు మోహరులను కేటాయించ వలసినిది"This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Ep 96'వంశీ' గారి 'శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్'
ఈ వారం 'కథా నీరాజనం' లో సుప్రసిద్ధ సినీ దర్శకులు , కథా రచయిత , వంశీ గారి ' శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ' అనే కథను పరిచయం చేస్తున్నాం. ఆడియోలో ముందుగా హర్షా, గిరి, ఇంకో మిత్రుడు బాలాజీ, వంశీ గారి రచనల గురించి. ప్రత్యేకంగా ఈ కథ పై తమ అభిప్రాయాలను తెలియచేయడం జరుగుతుంది.(ఈ కథపై మీ వ్యాఖ్యలకు ఈ వెబ్ పేజీ ని సందర్శించండి. https://harshaneeyam.in/2020/09/19/vamsi-1/)ఈరోజున మనకున్న గొప్ప తెలుగు కథారచయితల్లో నిస్సందేహంగా వంశీ గారొకరు.ఆయనదైన ట్రేడ్ మార్క్ హాస్యంతో, అతిసుందరమైన గోదావరి తీరం నేపధ్యం గా ఈ కథ సాగుతుంది.ఈ కథ , అన్వీక్షికి పబ్లిషర్స్ ప్రచురించిన 'ఖచ్చితంగా నాకు తెలుసు' అనే వంశీ గారి కథా సంకలనం లోనిది. వంశీ గారు 250కి పైగా కథలు రాసారు. ఈ కథల్లో ఇరవై ఐదు చక్కని కథలను ఆయన ఎంపిక చేసి , ఈ కథా సంకలనం లో చేర్చడం జరిగింది.ఈ కథలకు బాపు గారు వేసిన బొమ్మలతో అన్వీక్షికి పబ్లిషర్స్ వారు చాలాఅందంగా ముద్రించారు. ప్రతి తెలుగువాడి ఇంటి గ్రంధాలయంలో ఉండాల్సిన పుస్తకం ఇది.ఈ పుస్తకం కొనదలచుకున్న వారు, క్రింద ఇచ్చిన వెబ్ లింక్ లేదా నవోదయ బుక్ హౌస్ (హైదరాబాద్) అడ్రస్ లను గమనించగలరు.ఈ కథ పై మీ అభిప్రాయాలను తెలియజెయ్యడానికి 'హర్షణీయం' వెబ్ సైట్ ని క్రింది లింక్ ద్వారా విసిట్ చెయ్యండి.పుస్తక ప్రచురణ వివరాలు:ఈ సంకలనం అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.(https://www.facebook.com/AnvikshikiPublishers/)ఈ పుస్తకం , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.https://www.telugubooks.in/collections/vamsi/products/kacchithanga-naaku-thelusuలేదా 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.నవోదయ బుక్ హౌస్3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్ఫోన్ నెంబర్: 090004 13413https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7*Intro-outro BGM Credits:Mounaragam Theme - Manaswini Anand (https://youtu.be/s4cARPm3LZ8)This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Ep 94సాబువ్వ
సాబువ్వమబ్బులు కమ్మిన ఆకాశాన్ని తీక్షణంగా చూస్తున్న వరదయ్యను చూసి "ఏందయ్యా.. పైన మోడం గట్టిందెప్పుడూ సూళ్ళేదా" అని భార్య భూదేవమ్మ నవ్వుతోంది."కాదే దేవమ్మా .. ఎప్పుడూ ఓ సుక్క గూడా రాల్చని మబ్బులు గూళ్ళు గూళ్ళుగా ఔపిస్తూ ఎందుకే ఆశల్లేపుతాయి.. మనం గూడా మనుసులమే కదా!! ఓ రెండు సినుకులు రాలిస్తే పైన నీళ్ళు ఆవిరైపోతాయా" అని దేవమ్మను చూసి అంటూంటే..నువ్వు రమ్మని పిలిసి సూడు వత్తాయ్.. నే పోతాండా, ఆడ ఎండుగెడ్డి పీకాల, నువ్వు ఆ మూలంతా సదను సేసి రా.. క్యారీరు చింతచెట్టుకు ఏలాడ గట్టినా, నువ్వొచ్చినంక బువ్వ పెడతా అంటూ వెళ్లిపోయింది దేవమ్మ. వానెప్పుడు పడాలని ఈడ నేను ఊరకే పీకులాడాల అని గొణుక్కుంటూ వరదయ్య పన్లో పడ్డాడు. మధ్యాహ్నం రాగి ముద్దను ఎర్రకారం పచ్చడితో మింగుతూ పక్కనే ఉల్లిగడ్డ కొరుకుతూ చివర్లో చిలికిన మజ్జిగ తాగి "దేవమ్మా ఈ పొద్దు ముద్దలో ఏం కలిపినావే.. మా రుచిగుండాది అంటే “స్పూను మంచినూనె ఏసినానయ్యా మెత్తగా ఉండాది" అంది దేవమ్మ. నాకు "సాబువ్వ ఎప్పుడు పెడతావే" అంటే "ఇప్పుడేం పండగలు లేవు. సామికి పూజ చేసి బెల్లం బువ్వ పెట్టిన రోజే నీకు" అంటూ దేవమ్మ తింటోంది. రాయలసీమలో అనంతపురం తీవ్ర వర్షాభావానికి లోనైన జిల్లా. టెక్నికల్ గా "రెయిన్ షాడో రీజియన్". దశాబ్దాలుగా వర్షాలు లేక భూగర్భ జలాలు కూడా ఇంకిపోయి, జిల్లాలో పారే నది లేకపోవడంతో పంట కాలువలు కూడా కనిపించవు. కొన్ని చోట్ల ఎడారిలా ఇసుక మేటలు దర్శనమిస్తాయి. వర్షాధారిత పంటలే దిక్కు. అందులో ముఖ్యమైంది వేరుశనగ. ఇతరత్రా పంటలు కూడా ఉన్నా ఏదో అంతంత మాత్రమే.. వర్షం ఎంతుంటే అంతలా.ఇదే జిల్లాలో వరదయ్య దంపతులుండే ఊరు సీతారామపురం. గుడి, బడి, చిన్నాసుపత్రి, సర్పంచ్ ఆఫీసు.. ఇలా పల్లెలో ఉండే సౌకర్యాలన్నీ ఉన్నాయి. వరదయ్య ఇల్లు ఓ మోస్తరుగా ఉంటుంది. ఒక్కడే కొడుకు శ్రీనివాస్. భార్యతో టౌనులో ఉంటూ ఇద్దరూ ప్రైవేటు స్కూళ్ళలో పనిచేస్తూ తమ ఇద్దరాడపిల్లలతో కలిసి వీరిద్దరికీ తోడుగా ఉంటూ అపుడపుడూ పల్లెకు వచ్చిపోతుంటారు. వరదయ్యకు ఉండే ఆరెకరాల పొలంలో సెనక్కాయతో పాటు టమాటో ఇంకొన్ని కూరగాయలు పండించి అవి టౌనుకెళ్ళే మస్తాన్ కు అమ్మి జీవితం సాగిస్తున్నాడు. ఉన్న బోరులో నీళ్ళు కూడా ఎక్కువ రావు. ఇంకాస్త లోతుగా మళ్ళీ బోరేస్తే నీళ్ళొస్తాయని ఆశ."దేవమ్మా.. ఈతూరి గూడా పంట మీద ఆశలు ఇడిసేయాలా.. పంట కోసం తీసిన బ్యాంకు లోను ఎట్టనే కట్టేది" అంటూ బీడీ పొగ మద్య ఎటో చూస్తూన్న వరదయ్య ప్రశ్న ఆమె కళ్ళను కిందికి దించేశాయి. ఇద్దరి మౌనం మద్య "వానాకాలం ఇంకా వొచ్చేదుంది కదయ్యా.. సూద్దాం. బ్యాంకోళ్ళతో మాట్లాడు. వడ్డీ కట్టనీకి టైమడుగు. లేదంటే పిల్లోడిని అడుగుదామా""వొద్దొద్దు.. నువ్వట్టాంటి ఆలోశన చైరాదు. మనం పిల్లోల్లకి పెట్టాల్నే గానీ ఆల్లనెట్టా అడుగుతావే" అన్నాడు. సాయంత్రం శ్రీనివాస్ ఫోన్ చేసి ఇద్దరితో మాట్లాడి పెట్టేశాడు. బ్యాంకు ప్రస్తావన రాలేదు.ఆ వారం చివర్లో ఊళ్ళో ఒక చాటింపేశారు. భూదేవమ్మ ఇంటికొచ్చి "అయ్యా! సర్పంచాఫీసోళ్ళు చెప్పినారు. మూడు రోజుల తర్వాత ఎవల్నీ బైట తిరగొద్దంటన్నారు. బీడీల కోసం ఊరంతా తిరగొద్దు. శెట్టి గారి అంగట్లో సామాన్లు తీసకరా.. మళ్ళీ బైటికి పంపిస్తారో లేదో!!వరదయ్య వెళ్ళి తెచ్చిన సరుకులు చూసి "ఏందయ్యా ఇన్ని సబ్బులు, నురగ నీళ్ళు తెచ్చినావు, ఇయన్నీ మనవేనా.. రాగులు తక్కవ రంగులెక్కువైనాయి" అంటే "ఏమో అందరూ కొంటున్నారు.. నన్నూ కొనమన్నారు. దేశంలోకి రోగమేందో వచ్చిందట. చేతులు కాళ్లు సబ్బుతో బాగా కడిగి మూతికి బట్ట కట్టుకోమన్నారు. అందరితో పాటు మనం అని తెచ్చినా" అన్నాడు.ఇదేం బాధ అని దేవమ్మ వంటింట్లోకి దూరింది. వరదయ్య కొడుక్కి ఫోన్ చేసి "ఏం సీనయ్యా.. ఆడ ఎట్టుండాది. అన్నీ మూసేస్తారంట గదా.. నువ్వు టీచరమ్మను, పిల్లోల్లను తీసుకొని ఊరికొచ్చేయ్. టౌన్లో వొద్దులే" అంటే సరే అన్నాడు శ్రీనివాస్. ఆ సాయంత్రం ఊరుచేరిన అందరినీ చూసుకుంటూ ఈ ఇద్దరూ తెగ మురిసిపోయారు."తాతయ్యా మా స్కూల్ కూడా మూసేశారు.. మళ్ళీ ఎప్పుడు తెరుస్తారో తెలీదు. అంతవరకూ మనమంతా ఇక్కడే ఉంటామని నాన్న చెప్పాడు" అంటే "మీకెన్ని దినాలు కావాలంటే అన్ని దినాలు ఈడనే ఉండండమ్మా" అని తాత వాళ్ళతో ఆటలు మొదలెట్టాడు. వరదయ్యకు కోడలంటే చాలా గౌరవం. ఆమెను టీచరమ్మా అని పిలుస్తాడు. కోడలు ఎప్పుడు వంటింట్లో సాయానికి వచ్చినా దేవమ్మ ఆనందమే వేరు. "దేవమ్మా పిల్లోల్లకి కారం ఎక్కువ పెట్టాకు, తినలేరు" అంటే రాత్రికి కొర్రన్నం లోకి వంకాయ కూర, టమాటా చారు చివర్లో చిలికిన మజ్జిగతో ముగించారు.రాత్రి ఇంటి ఆరు బయట వేపచెట్టు కింద మంచాలేసి తండ్రీకొడుకులు మాటామంతీ మొదలెట్టారు. చేతిలో బీడీతో "సీనయ్యా.. ఇట్టా స్కూళ్ళు మూసేస్తే పిల్లోల్లకి సదువెట్టా అబ్బేది. మీ అయ్యవార్లకి జీతాలు ఎట్టయ్యా! అసలు ఇత్తారా లేదా" అంటే తలొంచుకున్నాడు శ్రీనివాస్. "నీది మీ అమ్మ పోలికరా.. ఇద్దరూ ఏమడిగినా తలకాయ దించేత్తారు" అంటుంటే తలెత్తిన కొడుకు కళ్ళలోంచి కారిపోతున్న నీళ్ళు చూసి గబుక్కున పక్కన కూర్చొని కళ్ళు తుడిచి ఏమైందయ్యా అంటూ ఓదార్చాడు. "మస్తాన్ కు మనం బాకీ ఉన్నామయ్యా.. స్కూల్ లో అందరినీ నెల కిందే తీసేశారు. జీతాలు లేకపోతే ఈ నెలంతా నువ్వు పంపిన టమాటాలు మస్తాన్ మాకిస్తే అమ్ముకుని ఏదో ఇంత తిన్నామయ్యా. నీకు తన కష్టంలోంచి డబ్బులిఛ్ఛాడు. మమ్మల్ని చెప్పొద్దన్నాడు"వరదయ్యకు నోట మాట రాలేదు. ఒగరికి ఇంగొగరు సాయం అనుకుని ఏవో ఆలోచిస్తూ ఆ రాత్రి వరదయ్య నిద్ర పోలేదు. గుండెలోని భారాన్ని దించుకున్న శ్రీనివాస్ ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు.టపా టపా శబ్దాలకు నిద్ర లేచిన వరదయ్యకు దేవమ్మ చుట్టూ చేరిన కొడుకు, కోడలు, పిల్లలను చూస్తూ ఉండిపోయాడు. “సూసింది సాల్లేగానీ పల్లు తోమి రా! టీ నీళ్ళు ఇస్తా” అని దేవమ్మ అంటే దగ్గరగా పోయి చూస్తే ప్లేటులో జొన్నరొట్టె, పుంటికూర పప్పు, ఎర్ర కారం, ఉల్లిగడ్డతో వేరే లోకంలో ఉన్న కొడుకు, పిల్లలు.. పక్కనే రొట్టెలు టపా టపా తడుతూ దేవమ్మ అవి కాలుస్తున్న టీచరమ్మను చూసి నిద్రలేని ఆ రాత్రి మొత్తం మర్చిపోయాడు. "అయ్యా.. నువ్వు తిన్న

Ep 93అమ్మూరు
1976 వ సంవత్సరం - చిన్నా :" అమ్మా ! నేనొచ్చేసా " అంటూ పుస్తకాల సంచీని ఒక మూలకి, చేతి లోని క్యారేజీ ని ఇంకో మూలకి విసిరేస్తూ వచ్చి అమ్మకి అతుక్కు పోయాడు చిన్నా. స్కూల్ నుండి వొచ్చేటప్పటికి అమ్మ ఎదురుచూస్తూ కనపడితే వాడి ఆనందం పట్టనలివి కాదెవ్వరికీ. " అబ్బో! మా చిన్న ఐదు ఊర్లు ఏలేసి వచ్చాడమ్మా" అంటూ ఒక ముద్దు పెట్టుకుంది చిన్నాని, అమ్మ. "అమ్మా ! ఈ రోజు స్కూల్ నుంచి వస్తుంటే ఏం జరిగిందో తెలుసా. ఊర్లోకి రెండు కార్లు వస్తూ కనపడ్డాయమ్మా. ఎవరింటికో తెలుసా నీకు" " రాఘవన్న వొచ్చాడ్రా అమెరికా నించి, శంకరవ్వ కోసం ." అంటూ చిన్నా కోసం రెండు మనుగుబూవులు ఒక చిన్న గిన్నె లో పెట్టి ఇస్తూ, "నువ్వు తింటూ ఉండరా తండ్రీ, నీ ప్రశ్నలతో చంపకుండా, నాకు చాలా పనుంది, నీకు రేపు టిఫిన్ కోసం బియ్యం నానెయ్యాలి " అంటూ చిన్న వాళ్ళ అమ్మ వసారాలోకెళ్లింది. "అమ్మా! రాఘవన్న ఇంక మన ఊర్లోనే ఉంటాడా?, నేను వాళ్ళింటికెళ్తే మాట్లాడతాడా?" అంటూ అమ్మ వెనకాలే వెళ్ళాడు చిన్నా. " ఇక్కడ ఓ నెల ఉండి పెళ్లి చేసుకొని పోతాడటరా . నీతో ఎందుకు మాట్లాడ్డు ? చిన్నప్పుడు నిన్ను తెగ ఆడిచ్చే వాడు కదా! " " ఇప్పుడు నువ్వు గూడ తోడు రామ్మా! శంకరవ్వ వాళ్ళింటికి. నాకు వాళ్ళ వాకిట్లోనే వుండే ఆ నల్ల కుక్క అంటే భయం.""నీకు, ఆ మురళీ గాడికి సవాలక్ష సార్లు చెప్పానురా, దాని మీద రాళ్లు విసరొద్దని. వింటారా మీరు" అంటూ విసుక్కుంది అమ్మ. అమ్మ వచ్చేటట్టు లేదు గాని, మనమే శంకరవ్వ ఇంటి ముందు నాలుగు రౌండులు కొడదాము, ఎవరన్నా లోపలి కెళ్తుంటే వాళ్ళ వెంట పడి పోవొచ్చు అనుకుంటూ బయటకెళ్ళాడు చిన్నా. కుక్క భయమో, లేక రాఘవన్నని ఎలా పలకరించాలి అనే బెరుకో లేక సిగ్గో కానీ, శంకరవ్వ వాళ్ళ ఇంటి ముందు తచ్చాడడం మొదలు పెట్టాడు చిన్నా. ఇంతలో రాఘవ అన్నే శంకరవ్వని చిన్నగా నడిపించుకుని ఇంట్లోంచి బయటకి వచ్చాడు. చిన్నాకి ఏనుగెక్కినంత సంబరం వేసింది. ఇంక వీధిలో అందరూ రాఘవన్నని కుశల ప్రశ్నలు వేయటం మొదలు పెట్టారు. "రాఘవయ్య, ఎప్పుడొచ్చావు?, వుంటావా నాలుగు రోజులు?, పెళ్లి ఎప్పుడయ్యా?, అమ్మనేమన్న అమెరికాకి తీసుకెళ్తావా?" అంటూ. వాళ్లందరికీ ఓపిగ్గా సమాధానాలిస్తూ వెళ్తున్నాడు రాఘవన్న,చక్కని పలువరుసతో, తెల్లని మేనిచ్ఛాయతో అచ్చు సినిమాలో జగ్గయ్యలాగ కనపడతా వుండాడు, చిన్నాకి రాఘవన్న. అప్పటికే అమ్మలక్కలు, "మన రాఘవయ్యకు చూడు వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమో!, అమెరికా నించొచ్చి వవాళ్ళ అమ్మని ఎంత జాగర్తగా దేవళం తీసుకెళ్తున్నాడు" అంటూ గుసగుసలు మొదలెట్టేశారు. చిన్నా వాళ్ళ వెనకే నడుస్తూ, రాఘవన్న కళ్ళల్లో పడ్డానికి , రయ్ రయ్ అని శబ్దం చేస్తూ, రాఘవన్న పక్కనుంచే పరిగెత్తాడు. "ఎవర్రా! అలా పరిగెత్తేది" అంటూ శంకరవ్వ కేక పెట్టింది. చిన్నా ఆగిపోయాడు. రాఘవన్న వేపే చూస్తున్నాడు, శంకరవ్వను పట్టించుకోకుండా. చిన్నా ఇంట్రడక్షన్ ఇవ్వడం మొదలు పెట్టింది శంకరవ్వ తన కొడుక్కి, " ఒరే రాఘవా ! వీడు మీ సుజాతక్క కొడుకు, భలే తెలివి గలోడు . వీడి బుర్ర నిండా ఎప్పుడూ ప్రశ్నలే! మనింటికొస్తే అదేంది, ఇదేందీ అంటూ చంపుతాడు, ఒక్క నిమిషం కుదురుగా ఉండడు " అనుకుంటూ. ఈలోపల దేవళం రావటం, శంకరవ్వ లోపలి వెళ్ళటం, రాఘవన్న దేవళానికి ముందున్న అరుగు మీద కూర్చోడం జరిగిపోయాయి. చిన్నా కూడా వెనక్కి ఓ పదడుగులు వేసి, ఒక్క లగు లగెత్తి, ఎగిరి రాఘవన్న పక్కన కూర్చున్నాడు అరుగు మీద. "ఏమి చదువుతున్నావు" అడిగాడు రాఘవన్న చిన్నా భుజం మీద చెయ్యేసి. "ఆరో క్లాస్, జెడ్.పీ ఉన్నత పాఠశాల, రామలింగాపురం అఫ్ పెదపుత్తేడు""అబ్బో! నేను కూడా అక్కడే చదివేను తెలుసా!. మా హెడ్ మాస్టర్ మీరా రెడ్డి గారు, బహుశా ఇప్పుడు వేరే ఆయనేమో? ” "రాఘవన్నా! ఎక్కడైనా హెడ్ మాస్టర్లు మార్తారేంటి, మాక్కూడా ఆయనే""సైన్స్ కి ఎవరు మీకు, ప్రఫుల్ల దేవి గారేనా""మాకా పుల్లా దేవి కాదన్నా! కే .ఎస్ అయ్యోరు సైన్స్ కి, లెక్కల కి" అంటూ పళ్ళు ఇకిలిచ్చాడు చిన్న. ఓ చిన్న నవ్వు నవ్వేసి , రాఘవన్న వాళ్ళు చదువుకొనే టప్పుడు పని చేసిన టీచర్స్ ఎవరన్నా ఉన్నారా అంటూ ఒక్కోరి పేర్లు అడుగుతూ మొదలుపెట్టి , ఒక్కొక్క అయ్యవారు ఎట్టా పాఠాలు చెప్పే వారో, అప్పుడు బడి ఎట్టా ఉండేదో, వాళ్ళు ఎట్టా చదివే వారో, ఎట్టా ఆడేవారో, చెబుతూంటే చిన్నా కళ్ళార్పకుండా వినడం మొదలుపెట్టాడు. రాఘవన్న ఆపకుండా చెప్పుకుంటూనే పోతావున్నాడు ఊరిగురించి , తన చిన్నతనం రోజుల్లోకి పూర్తిగా వెళ్ళిపొయ్యి -అప్పటి ఊరి గురించి , యానాదిరెడ్డి బాయిలో వాళ్ళ ఈతలగురించి , దేవళంలో సందడిగురించి, వూరెన్కాలుండే వాగు గురించి , వాగొడ్డున పరిగెడుతూంటే కాళ్ళ కింద తగిలే ఇసక మెత్తదనం గురించి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో - ఇలా చెప్తున్నవాడు ఒక్కసారిగా ఆగిపొయ్యి ఎటోచూస్తూ నిట్టూర్చాడు. "వూరు ఒకప్పటిలా లేదురా చిన్నా! నేను అమెరికాకి వెళ్లి పోయాక ఈ ఊరి కళే పోయిందిరా " అన్నాడు. ఆయన చెప్పిన కబుర్లన్నీ బాగున్నాయి, చిన్నోడికి, కానీ రాఘవన్న అమెరికాకి వెళ్ళిపోయాక వూరు కళ తప్పటం అన్న మాట తప్ప. వాడికి ఇప్పటి స్కూల్ బాగుంది, అయ్యోర్లు బాగున్నారు, చదువులు బాగున్నాయి, వూరినిండా సావాస గాళ్ళున్నారు, చెరువు అలాగే వుంది, నీళ్లు తగ్గినప్పుడు పెరిగే తుంగ అలాగే పెరుగుతుంది, రాములోరి గుడి అలాగే వుంది, తిరునాళ్ళు అలాగే జరుగుతున్నాయి సందడి గా, దేవళం ముందర వాడి సావాసం గాళ్ళు అలాగే ఆడుకుంటున్నారు, తాటి చెట్లు ఈత చెట్లు సీమ చింత చెట్లు కాయలు కాస్తూనే వున్నాయి, నేరేడు చెట్లకి ఎంట్లు వేసి పిల్లకాయలు అలాగే ఊయళ్ళు వూగుతున్నారు, ఊరి వాగులో దొరికే చంద మామ బేడీసి చేపలు ఊరి జనాలు ఎప్పటిలాగే చప్పరిస్తున్నారు, పిల్లకాయల

Ep 92డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారి 'కాకులు గ్రద్దలు' కథ సంక్షిప్త రూపంలో
'కథా నీరాజనం' శీర్షికన, హర్షణీయం లో మొట్టమొదటి గా సంక్షిప్తీకరించిన కథ, 'కాకులు గ్రద్దలు'కథా రచన: సుప్రసిద్ధ కథా రచయిత డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారు.ఈ కథ వారి పాత్రల సహజ చిత్రీకరణ కు , రచనా చాతుర్యానికి ప్రతీక.కథలో నాలుగు అంకాలు , ప్రతి అంకంలో రెండు పాత్రలు. ఏ అంకంలోని ప్రధాన పాత్రలు కూడా, మిగతా అంకాల్లోని , ప్రధాన పాత్రలను కలపకుండా , కథ గొప్పగా ముగించడం, శ్రీ నరేంద్ర గారి కథ శిల్పవిశిష్టతను మనకు తెలియజేస్తుంది.ఈ కథ పై మా ప్రశ్నలకు, నరేంద్రగారిచ్చిన సమాధానాలను , అంతేకాకుండా నరేంద్ర గారి, రచనలగురించి, రచనా ప్రక్రియ గురించి తెలుసుకోవాలంటే, వారితో మేము జరిపిన పూర్తి ఇంటర్వ్యూ , హర్షణీయం లో క్రింది లింక్ ద్వారా వినవచ్చు.https://harshaneeyam.in/2020/09/11/srinarendra/ఇతర వివరాలు:'కాకులు గ్రద్దలు' అనే కథ శ్రీ నరేంద్ర గారి 'నాలుగు కాళ్ళ మంటపం' అనే కథా సంకలనం నించి సంగ్రహించ బడింది.ఈ పుస్తకం అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. (https://www.facebook.com/AnvikshikiPublishers/)ఈ పుస్తకం , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.https://www.telugubooks.in/products/naalugu-kaalla-mandapam?_pos=4&_sid=7dd5697ad&_ss=rలేదా 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.నవోదయ బుక్ హౌస్3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్ఫోన్ నెంబర్: 090004 13413https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7*Intro-outroBGM Credits: Mounaragam Theme - Manaswini Anand (https://youtu.be/s4cARPm3LZ8)This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Ep 90బెల్లం టీ
A Story by Sri.Murali from his Blog 'Nemali Kannu"http://nemalikannu.blogspot.com/2009/12/blog-post_17.htmlyikKeWfiPocxqEy9L858This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Ep 89ఓ అన్నార్థి గోల!
రేయ్! కిరణు రాత్రికి, నేను మన గొట్ల పాలెం గౌతమి టాకీస్ లో పాండవ వనవాసం సినిమా కి వెళ్తున్నా""ఎవరితో వెళ్తున్నావు రా! గిరి బావ""ఇంకెవరి తో రా మా అన్న శుంఠ తో""నిన్ననే కదరా! ఇద్దరు కొట్టుకున్నారు""అలా అనిపించిందా మీ అందరికీ, ఎక్కడ కొట్టుకున్నాం రా , వాడు కొట్టటమే కానీ నన్ను""సర్లే రా! మళ్ళీ వాడితోనే సిగ్గులేకుండా వెళ్తున్నావా మళ్ళీ""రేయ్! కిరణ్ గా, నువ్వెవడివిరా మా అన్నని వాడితో గీడీతో అనడానికి. అయినా మా అన్న దార్లో పది దొంగలొచ్చినా కొట్టేస్తాడురా""సరే రా గిరిబావ, మా అన్న, మీ అన్న కొట్టిన వాళ్ళ కంటే +1 రా"ఇలా మా గిరి గాడు ఎన్నైనా చెప్పనీ, దానికంటే మనం దానికి ఓ +1 కలపటం. ఇక వాడికి చిరాకు పుట్టి, నువ్వు మీ అన్న, మనూరి వాగులో దూకి ఛావండిరా అనే దాకా వెళ్ళేది మా అన్నల గురుంచి మా బాకాలు. గిరిగాడు నాకు వరసకి బావ, ఒకటో క్లాసు నించి మేమిద్దరం ఒకటే బెంచీ. అలా ఇంకో రోజు, మా గిరి బావ గాడు ఏడ్చుకుంటూ వస్తున్నాడు, నా మా చెడ్డ సరదా వేసేసింది వాడి ఏడుపు చూసి, "ఏరా గిరి బావా! మళ్ళీ నాలుగు పీకినాడా మీ అన్నా""దొంగ ఎదవ రా మా అన్న, మా అన్న, వాళ్ళ స్నేహితులతో ఆడుతుంటే, నన్ను కూడా ఆడించుకోమంటే, వాళ్ళ ఫ్రెండ్స్ తో నేను ఆడకూడదని చెప్పి తరిమేసాడురా""అదేందిరా గిరిబావ! నే వెళ్లి మా అన్న వాళ్ళ జట్టుతో చేరతా నుండు, మా అన్న నన్ను చేర్చుకుంటాడు చూడరా""వద్దురా కిరణు, మీ అన్నే రా మా అన్నకి ఎక్క జెప్పింది, నా గురుంచి, వాళ్లిద్దరూ తోడు దొంగలురా, వెళ్ళొద్దురా" అని మా గిరి బావ చెప్పి నా వినకుండా మా అన్న చేత నాలుగు తన్నిచ్చుకొని వచ్చా. "మీ అన్నే నయం రా గిరిబావ, మా వాడు , నేను వాళ్ళు ఆడే వీధిలోక్కూడా రాకూడదు అంటూ నాలుగు తగిలించాడురా!""మా యన్న ఎదవ రా గిరిబావా""మా యన్న ఎదవన్నర ఎధవరా, కిరణు""మా యన్న మీ అన్నకంటే ఎదవ ల్లో ఎదవ + 1 రా గిరి బావా! అవడానికి ఓ సంవత్సరమో లేక రెండేళ్లో పెద్ద అయిన దానికి ఈ అన్నలకి తమ్ముళ్ల మీద ఇంత జులుము చేసే అధికారం ఎవరిచ్చారో, మాకెప్పుడూ అర్థం అయ్యేది కాదు. అసలు నేను మా గిరిబావ, ఇంకా ఎధవన్న ఎదవ అన్న - లున్న తమ్ముళ్ళంతా ఒక అన్న బాధిత సంఘం పెడదామని ఆలోచన కూడా చేసేసాము. దానికి తోడు! ఎక్కడకి బోయినా, వీడు ఆ ప్రవీణ్ గాడి తమ్ముడు రా అన్న బిరుదు నాకు. దానికి అబ్బా ప్రవీణ్ తెల్ల గా బుర్రగా ఉంటాడు, వీడేందిరా కర్రి మోహమేసుకోని. ఇది గాక ప్రవీణ్ గాడి తెలివి వీడికేడుందిరా అనే పోలిక మళ్ళీ. ఏడో క్లాస్ లో అనుకుంటా మా అన్న, ఆయన పుస్తకాల మీద, "ప్రవీణ్ కుమార్, బి.టెక్, ఎం.టెక్" అని రాసేసుకోవటం మొదలు పెట్టాడు. "మరి నువ్వే మవుతావురా , కిరణ్ గా అంటే, నేను పెద్దయ్యి, ఉషా ని పెళ్లి చేసుకుంటా" అనే వాడిని. అది సరేరా పెద్దయ్యాక ఉద్యోగమంటూ చేయాలి గా, దానికేమి చేస్తావురా అంటే, "నేను మన సూలం లాగా బస్సు తోలతాను" అనే వాడిని. అలా మా అన్న ఫస్ట్ గ్రేడ్ సిటిజెన్ అయితే నా దంతా సెకండ్ గ్రేడ్ సిటిజెన్ యవ్వారం. వీళ్లందరి మధ్య, మా శేష మామే నయం, మీరందరు ఎన్నైనా చెప్పండి, చిన్నోడు రంగు తక్కువయినా వాడి మొహం లో కళ, ఆ పెద్దోడికి ఎక్కడొస్తుంది అనే వాడు.ఏడో క్లాస్ లోనే మా అన్న సైకిల్ అర పెడల్ తొక్కటం మొదలెట్టాడు. సీట్ ఎక్కి తొక్కలేదు, పొట్టోడు కదా. ఓ రోజు, "రారా! రామ లింగాపురం దాకా వెళ్లొద్దాము" అన్నాడు పెద్ద పోటుగాడిలా! "ఛా, వీడితో ఏందీ నేను వెళ్ళేది” అనుకుంటానే, మళ్ళీ రామ లింగా పురం అంటే పెద్ద వుర వుర నాకు, అందుకే సరే అన్నా. వెనక సీట్ మీద ఎగిరి ఎక్కాలి, నేను ఎక్కలేను, నేను అంత కన్నా పొట్టి కదా. మా ఇద్దరి అవస్థలు చూసి మా ఊరోళ్లు, నన్ను వెనక కారేజీ మీద ఎక్కిచ్చి, మా అన్న సైకిల్ కంట్రోల్ అయ్యేదాకా నెట్టి పంపారు మమ్మల్ని. వాళ్ళకీ డౌట్ రాలా, మాకు రాలా మా సామర్ధ్యం మీద, మధ్యలో ఆగితే ఎలా అని. కొంత దూరం పోగానే దారి కాస్త ఎగుడు. మా అన్నకి తొక్క లేక ఆయాసం, దిగరా అని ఒక్క కసురు కసిరాడు. నేను దూకేశా. ఎగుడు అంతా నడిచాము, రామలింగా పురం వరకు అలాగే ఎగుడు ఉండినా బాగుండు, నడుచుకుంటా వెళ్లే వాళ్ళము. దారి మామూలు కాగానే మావాడు తొక్కటం మొదలెట్టాడు, నేను కారేజీ మీద కు ఎగరటం మొదలెట్టా. నేను ఎగరడం , మా వాడు బాలన్స్ తప్పడం. నేను ఎగరడం , మా వాడు బాలన్స్ తప్పడం. ఇట్టగాదు అనిచెప్పి నేను వెనక్కి పది అడుగులు వేసి, పరిగెత్తు కుంటూ ఎగిరి కారేజీ మీద కూర్చున్నా. ఆ దెబ్బకి మావాడేమో, దారి పక్కన పెద్ద కాలవలో తేలాడు. ఇక అంతే అక్కడ నుండి ఇంటి దాకా నన్ను, వీర కొట్టుడు కొట్టుకుంటూ వచ్చాడు.కొన్నాళ్ల తరవాత ఒక రోజు నేను మా సావాస గాళ్ళం, ఎప్పటిలాగే మా ఊరి చెరువు గట్టున షికారు కెళ్ళాము. చెరువులో నీళ్లు మరీ ఎక్కువ లేవు, గట్టు దిగాక మాకు కొంత దూరంగా మా ఊరి బెస్త వాళ్ళు చేపలు ఉపయోగించే తెప్ప ఒకటి పక్కనే ఒక గుంజకి ఒక మోకుతో కట్టి కనపడింది. మాకు దాన్ని ఎక్కి నీళ్ళలోకి వెళ్ళాలి అనే వుర వుర కలిగింది, వెంటనే మోకు ని విప్పేసాము, తెప్పని నీళ్లలోకి నెట్టాము. ఆ తర్వాత ఎక్కడానికి అందరికీ భయమే. నువ్వంటే నువ్వు అనుకున్నాము. ఎవరూ ఎక్కటానికి సాహసించక పోతే, మా గుంపులోనే ఎవడో అన్నాడు, "కిరణ్ గాడికే ఈత వచ్చురా, వాడే ఎక్కాలి అని". "ఆహా! ఈ విషయం మన ఉషా కి తెలిస్తే అబ్బో మన కిరణ్ ఎంత ఇదో అంటుందని", ఎక్కేసా తెప్ప. మావాళ్లు తెప్పని లోపలకి నెట్టేశారు, వాళ్ళ మోకాళ్ళ దాకా నీళ్లు వచ్చే దాకా, ఆ తర్వాత గట్టెక్కారు. కొంచెం లోపలకు వెళ్ళ గానే నాకు భయం వేసింది. ఈత కాదు కదా, కాళ్ళు తెప్పలోంచి బయటకు పెట్టడానికి కూడా వణుకు, అదేమో తెడ్డు వేసినా ముందుకు పోదు, వెనక్కి రాదు, అక్కడక్కడే గింగిరాలు కొడుతుంది. నా భయం కేకలు గా మారాయి. ఇంతలో మా వాళ్ళల్లో ఎవడో పోయి మా అన్నని పట్ట కొచ్చారు. పాపం మా వాడు, ఒడ్డున్నే వున్న మోకుని

Ep 88పిల్లల్ని కనాలంటే?
పిల్లల్ని కనాలంటే పెళ్ళి చేసుకోవాలా? పెళ్ళి చేసుకోవాలంటే తాళిబొట్టు కట్టాలా ? :-)80 వ దశకంలో తొలి సంవత్సరాలవి. ఇప్పటిలాగా కాకుండా మాకప్పుడు ఐదు తరగతుల లోపునే తెలుగు చాలా బాగా నేర్పేవారు. అంటే బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భారతం, బాలల బొమ్మల భాగవతం ఇలాంటివి ధారాళంగా చదవ గలగడానికి, చదివి అర్థం చేసుకోవడాని ఎటువంటి ఇబ్బంది కానీ ఎవరి సహాయం కానీ అవసరం లేనంతగా నేర్పించేవారు. అలాంటి ప్రాధమిక పాఠశాలల్లో అంబవరం పాఠశాల ఒకటి. ఈ ఊరికి నాలుగు మైళ్ళ దూరంలో భైరవకోన. ప్రకృతి మధ్యన వెలసిన శైవ క్షేత్రం. ఒక కొండను పూర్తిగా చెక్కి చిన్న చిన్న గుడులుగా మలచి శివాలయలుగా తీర్చి దిద్దారు. ఆ ఆలయాల్లో విగ్రహాలు కూడా విడిగా చెక్కి పెట్టినవి కావు. అన్నీ ఆ కొండలో అంతర్భాగాలే. అంటే ఏకశిలా మందిరాలు. ఇక ఊరికి కొద్ది దూరంలో కొత్తపల్లి, దర్శిగుంట పేట అనే ఊర్లు. ఏఊరికి ఆ ఊరిలో ప్రాధమిక పాఠశాల వున్నా గానీ ఉన్నత పాఠశాల మాత్రం మా ఊర్లోనే. అంటే అంబవరం లో. ఇక ఈ ఊరి నైసర్గిక స్వరూపాన్ని చూస్తే చుట్టూ దట్టమైన అడవులు [ అప్పట్లో, ఇప్పుడు చాలా వరకు హరించుకు పోయాయి ]. ఆ అడవుల్లో బీర కాయలు, ఇవి కూర వండుకునేవి కాదు, రంగులోఎర్రగా రుచికి తియ్యగా, చిన్న విత్తనం కలిగి తిన్నప్పుడు చాలా బాగా వుంటాయి. వీటితో పాటి ఉసిరిక, నెమ్మి, ఏలక, బిక్కి కాయల లాంటివి విస్తారంగా దొరికేవి. అలాంటి ప్రకృతి మధ్యన నివసించే ప్రజలు ఆ ఊరివాళ్ళు. ఊరి పొలాల్లో ఎక్కువగా నిమ్మ, బత్తాయి, పసుపు, ఆముదాలు, నువ్వులు ఇలాంటి పంటలు ఎక్కువగా పండేవి. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే అక్కడ అప్పటికి పట్నపు పోకడలు చాలా చాలా తక్కువ. అలాగే పైవన్నీ ఎక్కువగా దొరకడం మూలానే ఈ టపాలో మాకు పసుపు కానీ, పూజకు ఆముదం కానీ చాలా సులభంగా దొరికాయి. ఊరి రామాలయంలో హరికథా గానాలు, శివరాత్రికి రకరకాల పౌరాణిక పద్య నాటకాలు, అప్పుడప్పుడు తోలుబొమ్మలాటలు. ఇవి ఎనభైల్లో ఆ ఊరికి వినోదమందించే దృశ్య, శ్రవణ మాధ్యమాలు. ఇవన్నీ వంటబట్టించుకున్న మాలాంటి చిన్న పిల్లలకు సహజంగానే పాండవులంటే [ భారతంలో హీరోలు ] అమిత ఆరాధానాభావం. నాకు మరీ ముఖ్యంగా అర్జునుడంటే మహాయిష్టం. ఎంతగా ఇష్టం అంటే అరణ్య/అజ్ఞాత పర్వంలో అర్జునుడు బాణాలు విల్లు తీసుకొని అడవులవెంట తిరుగుతాడుకదా. ఆ సన్నివేశం ప్రతిరోజూ కొన్ని నెలలపాటుగా నాకు కలలో,నేనే అర్జునుడుగా వెదురుతో చేసిన విల్లు తీసుకొని మా తోటలో పహారా కాసినట్టు కలలొచ్చేవి. అవునండోయ్ మా ఊర్లో వెదురు కూడా బాగానే దొరికేది. పచ్చి వెదురు బొంగును కొడవలి తో రెండుగా చీల్చి నిజంగా నా అంతటి నేనే నాలుగోతరగతిలోనే విల్లు తయారుజేయడం నేర్చుకొని గురిచూసి పిట్టల గొట్టడం నేర్చుకొన్నాను. అప్పట్లో ఇంటో నాకు పిట్టలదొర అని కూడా నామకరణం చేసేసారు :-). వాళ్ళకు నా మనసు అర్థమయి అర్జునా అని పిలిస్తే వినాలని హెంత కోరికగా వుండేదో. అబ్బే ఈ పెద్దోళ్ళున్నారే వాళ్ళకి మన పిల్లకాయల మనసు ఎప్పుడు అర్థమవ్వాలి ;-)అలా అలా స్కూల్లో నాలుగోతరగతి వెలగబెట్టే రోజుల్లో నాకు బాబుగాడని ఒక సావసగాడు తగిలాడు. వాళ్ళయ్య హైస్కూల్ లో హెడ్మాస్టర్. వీడు మహా మాయగాడు. ప్రతిదాంతో నాకు పోటీ వచ్చేవాడు. స్కూల్లో మాకు చదువులో కాదు పోటీ... ఎవరు తెలుగు పుస్తంకంలో ఎన్ని పేజూలు చించి వేస్తారో అని :-). కాకపోతే బాపనయ్య అవడంతో వాడికి తెలివి మస్తుగా వుండేది. పోటీ మొదలౌద్దా, ముందుగా వాడు వాడిపుస్తకంలో ఒక పేజీ సగం చింపేపాడు. మరి పోటీలో మనం ఓడిపోకూడదు కదా, అందుకని నేను నా పుస్తకంలో మొత్తం పేజీ చింపేసేవాడిని. అలా ఓరోజు ఓ అశుభ ముహూర్తంలో మొదలైన చింపటం అనే కార్యక్రమ ఫలితం ఓ పదినిమిషాల్లో నాచేతిలో తెలుగు పుస్తకం అట్ట దప్ప ఏమీ మిగల్లేదు. అంతే కాదు వాడు పేజీలను ఏంచక్కగా ఒక క్రమ పద్దతిలో చించాడు. అంటే మళ్ళీ బంక పెట్టి అతికించినా లేదా సూదితో కుట్టుకున్నా పనికొచ్చేటట్టు. మరి నేనో :-) ఏదో సినిమాలో బ్రహ్మానందం పేపరు చింపడం గుర్తు తెచ్చుకోండి :-)చింపేటప్పుడు మహా ఆనందంగా వున్నది కానీ తరగతి గదిలోకి అయ్యవారు వచ్చి వీపు చీరగానే నేనాలపించిన గీతం మాత్రం నాకు కర్ణకఠోరంగా ప్రక్కనున్న సావాసగళ్ళకు మహా పసందుగా వినిపించింది :-). అంతటితో ఆగిందా నేను మా ఇంటికెళ్ళడానికంటే ముందే ఈ వార్త ఇంట్లో తెలిసింది. నాకంటే ముందు నా సావాసగాళ్ళందరూ ఇంటిముందు గుమిగూడి ఎప్పుడెప్పుడు సంగీతం విందామా అని ఏనుగు చెవులేసుకొని గుంటనక్కల్లా కాచుకోనున్నారు. మరి ఎన్నైనా అయ్యవారు పరాయి వాడుకాబట్టి కొద్దిగా నాలుగు దెబ్బలతో సరిపెట్టాడు కానీ , ఇంట్లో వాళ్ళు సొంత మనుషులు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ముట్టచెప్పారు. దానికి ప్రతిఫలంగా నా శాయశక్తులా నేనూ తిరిగి రాగాలాపన చేసాను :-)ఇలాంటిది ఒకటేమిటి చెప్పుకుంటా పోతే ఒక రసవత్తరమైన బాల చిత్రం అవుతుంది. అలాంటి సెట్టింగే మరొకటి. అప్పట్లో మాకు కావాల్సిన ఆటవస్తువులను మేమే చేసుకొనేవాళ్ళం. అంటే కారు, బస్సు, రైలు ఇలాంటివి కావాలంటే ఖాళీ అగ్గిపెట్టెలను ఆ ఆకారంలో మార్చుకొని వాటికి మందుసీసాల రబ్బరు మూతలను చక్రాలుగా అమర్చి మాకు కావాల్సిన వాహనాన్ని చేసుకొనేవాళ్ళం. నిజంగా ఎంత తృప్తిగా వుండేదో. ఈ బాబుగాడున్నాడే వాడు నా బాల్య జీవితంలో ఒక విలన్ లాంటోడు. వాళ్ళ నాయన హైస్కూల్ హెడ్మాస్టరే కాదు . R.M.P. వైద్యుడు కూడా. కాబట్టి వాళ్ళింట్లో ఎప్పుడూ ఖాళీ మందు సీసాలకు కొదవుండేది కాదు. ఓరోజు ఇద్దరమూ కలిసి రైలు తయారు చేసుకుందామని గుసగుసలాడుకొని ప్రణాళికా రచనలో పడ్డాము. నేనెలాగు రబ్బరు మూతలు తేలేను కనుక వాడు చెప్పిన ప్రపోజల్ కు సరే అన్నాను. అంటే వాడు రబ్బరు గాన్లు తెచ్చేటట్టు, నేనేమో అవసరమైన అగ్గిపెట్టెలు తెచ్చేటట్టు. ఆ విధంగా పనులు విభజించుకొన్నాక వాడలా ఇంటికెళ్ళి ఓ ఇరవై మంది సీసాలు బుడక్కిన తీసుకొచ్చాడు. మరి నాకు అగ్గిపెట్టెలు ఇప్పుడు కనీసం ఒక ఇరవై కావాలి. అక్కడా ఇక్కడా అడుక్కోని ఒక ఐదో ఆరో సంపాయించాను. ఇక మిగిలినవాటికోసం ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు. అదుగో అప్పుడు నాలోని మరో మనిషి నిద్రలేచి ఓ సలహా ఇచ్చింది. వెంటనే ఇంట్లో ఉన్న డజను నిండు అగ్గిపెట్టెలు మాయం. పుల్లలు తీసి ఇంటివెనకాల సందులో పారబోసి రైలు పెట్టెలు తయారు చేసి వాడొకరోజు, నేనొక రోజు హాయి