Harshaneeyam
530 episodes — Page 6 of 11

S1 Ep 182కథానవీన్ గారితో హర్షణీయం: part -3
‘కథానవీన్’ గారితో హర్షణీయం ఇంటర్వ్యూలో హర్షణీయం టీం తో బాటూ, ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్ర గారు పాల్గొనడం జరిగింది. నవీన్ గారికి, నరేంద్ర గారికి కృతజ్ఞతలు.కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. ఎన్నో వ్యాసాలు , కథలూ , కవితలూ రాసారు. అనేక దేశాల్లో , తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు.1990 లో ‘తెలుగు కథా సాహితి’ అనే సంస్థ ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరంలో ప్రచురితమైన కథల్లో కొన్ని ఉత్తమమైన కథలనెన్నుకొని, ప్రతి సంవత్సరం ‘కథ’ అనే సంకలనాలను వెలువరిస్తున్నారు గత మూడు దశాబ్దాలుగా.ఈ ఇంటర్వ్యూ లో నవీన్ గారు, తెలుగు కథా సాహిత్యం గురించి , వారు ప్రచురించే ‘కథ’ సంకలనం గురించి మాట్లాడారు. మొత్తం ఆరు భాగాలుగా రాబోయే ఈ ఇంటర్వ్యూ నుంచి, మూడు భాగాలు ఈ వారం మీకు అందిస్తున్నాం.మొదటి భాగం : ఆధునిక కథ అంటే , తెలుగులో మొట్టమొదటగా వచ్చిన కథల గురించి, మంచి కథ అంటేరెండవ భాగం : హాస్యం థ్రిల్లర్ కథలు ‘కథ’ వాల్యూమ్స్ లో ఉండని కారణం, ‘కథ’ వాల్యూమ్ లో సెలక్షన్ అఫ్ స్టోరీస్ పై నవీన్ గారి వామపక్ష నేపధ్య ప్రభావం, తెలుగు కథకులు స్పృశించని అంశాలుమూడవ భాగం: తెలుగు కథలో గత వందేళ్లుగా వచ్చిన మార్పులు, డయాస్పోరా కథల గురించి, నవీన్ గారి తో మధురాంతకం నరేంద్ర గారు.హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 181కథానవీన్ గారితో హర్షణీయం : Part - 2

S1 Ep 180కథానవీన్ గారితో హర్షణీయం : Part - 1

S1 Ep 210రెండో భాగం - స వెం రమేష్ గారితో హర్షణీయం
స.వెం.రమేశ్ గారు జీవితమంతా తెలుగు భాషా ప్రాచుర్యానికే అంకితం చేసిన అపురూపమైన మనిషి. హర్షణీయంతో ఆయన మనం కోల్పోతున్న భాషా వైభవాన్ని సంస్కృతిని గురించి, మాట్లాడుతూ , ఈ ప్రయాణంలో తాను దాచుకున్న అనేక అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు. పొరుగు రాష్ట్రాలలో , బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలలో లక్షల సంఖ్యలో వున్న తెలుగు వాళ్ళు అనుభస్తున్న అస్తిత్వవేదన మనకు కళ్ళకు కట్టినట్టుగా తెలియచేసారు రమేష్ గారు. రమేష్ గారికి హర్షణీయం హృదయపూర్వక కృతజ్ఞతలు. రమేష్ గారు ఇంటర్వ్యూలో ప్రస్తావించిన 'మొరసునాడు కథలు' పుస్తకం కొనాలంటే - https://kinige.com/book/Morasunadu+Katalu://bit.ly/2TXhEub' తెలుగు వాణి' ప్రచురిస్తున్న 'అమ్మనుడి' పత్రిక చందా కట్టడానికి - సంవత్సర చందా - 300 రూపాయలు జీవిత చందా - 5000 రూపాయలు డాక్టర్. సామల లక్ష్మణ బాబు - 94929 80244హర్షణీయం పాడ్కాస్ట్ ని –‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://bit.ly/harshagaanaa స్పాటిఫై (Spotify )యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam ఆపిల్ (apple podcast) ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 వెబ్ సైట్ : https://harshaneeyam.in/allహర్షణీయం ఫేస్ బుక్ లో - https://www.facebook.com/Harsha051271హర్షణీయం ట్విట్టర్ - @harshaneeyamహర్షణీయం యూట్యూబ్ లో - https://bit.ly/harshayoutubeThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 209మొదటి భాగం - స వెం రమేష్ గారితో హర్షణీయం

S1 Ep 212రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో సంభాషణ
ఆటా బహుమతి పొందిన 'యారాడకొండ' నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్ అయిన శ్రీ సుధాకర్ రాసిన 'తూరుపు గాలులు' కథాసంపుటం కూడా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు కొత్తగా రాసిన ఇంకో కథల పుస్తకం ' చలిచీమల కవాతు. హర్షణీయం టీం ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ ఇప్పుడు మీ కోసం. 'చలిచీమల కవాతు' కొనడానికి - https://amzn.to/3kXhuhK'చలిచీమల కవాతు' పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి - మీరు ఎంత కాలం నించీ కథలు రాస్తున్నారు? రచనకు మిమ్మల్ని ప్రేరేపించిన విషయం ఏమిటి?80లలో ఒకటి రెండు రాశాను. నాకవి అంతగా నచ్చలేదు. మళ్లీ అరవై ఏళ్ళ వయసులో మొదలు పెట్టాను. అంటే గత అయిదారేళ్లుగా రాస్తున్నాను. చిన్నప్పటినుండి సాహిత్యంలో ఆసక్తి ఉంది గానీ రాయాలనే ఆలోచన కొత్తగా వచ్చింది. కొన్ని కథలు ప్రచురింపబడ్డాక, పాఠకుల స్పందనలు తెలిశాక కొన్ని రకాల కథలు నేను రాయగలను అనే ధైర్యం, నమ్మకం కలిగాయి.మీరు హిస్టరీమీద పట్టు ఎలా సాధించడానికి మీ చిన్నతనంలో దోహదం చేసిన కారణాలేవైనా ఉన్నాయా? పట్టు సాధించాను అని చెప్పుకోలేను గానీ, చిన్నతనం నుండీ చరిత్ర అంటే ఆసక్తి ఉండేది. అది కూడా ప్రధానంగా పుస్తక పఠనం ద్వారా ఏర్పడ్డదే. పుస్తకాలు కొత్త ప్రపంచాల్ని మన ముందుంచుతాయి. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అనే చిన్న ఊళ్లోని ప్రభుత్వ లైబ్రెరీలో – ‘మొగలాయి దర్బారు కుట్రలు’, నార్వీజియన్ చరిత్రకారుడు రాసిన ‘కడలి మీద కోన్-టికి, రాహుల్ సాంకృతాయన్ రచనలు – ఇటువంటివన్నీ చదివాను. అవన్నీ అనువాదాలే. మా నాన్నగారు విల్ డ్యురాంట్ రాసిన ‘హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్స్’లాంటి ఇంగ్లీషు పుస్తకాలను చదువుతూ ఆ వివరాలు మాకు చెప్పేవారు. ఆవిధంగా సాహిత్యంతో బాటుగా చరిత్ర పట్లకూడా ఆసక్తి పెరుగుతూ వచ్చింది.స్కూలు రోజుల తరువాత ఇంగ్లీషు పుస్తకాలు కూడా చదవడం మొదలుపెట్టాను. నెహ్రూ 'డిస్కవరీ ఆఫ్ ఇండియా, డీ డీ కోసంబి, ఈ. ఎచ్. కార్, రొమిల్లా థాపర్ ల ప్రభావం నాపైన పడింది. ‘చరిత్ర అంటే గతానికీ, వర్తమానానికి నిత్యం జరిగే సంభాషణ’ అంటాడు ఈ. ఎచ్. కార్. అందుకే చరిత్రని విడిగా కాకుండా, వర్తమానంతోనూ, తద్వారా భవిష్యత్తుతోనూ సంధించగలిగే సందర్భాలు నాకు ఎక్కువ ఆసక్తిని కలిగిస్తాయి.మీ రచనల్లో హిస్టారికల్ ఫిక్షన్ ముఖ్య ప్రక్రియగా ఎంచుకోడానికి కారణాలు ఏమిటి? మీరు మెరైన్ ఇంజనీర్ కావడం అందుకు తోడ్పడిందా?ఒక సమాజంలో అంతవరకూ లేనటువంటి టెక్నాలజీని ప్రవేశపెట్టినపుడు ఏమవుతుంది? ఎవరు లాభపడతారు? ఎవరు నష్టపోతారు? ఒక ఇంజినీరుగా నాకు ఆసక్తి కలిగించే ప్రశ్నలు ఇవి. ‘వార్తాహరులు’, ‘మూడు కోణాలు’ కథల్లో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించాను. మెరైన్ ఇంజనీర్ ని కావడం మూలాన నాకు వాణిజ్య నౌకారంగ చరిత్ర, అంటే మేరిటైం హిస్టరీలో ప్రత్యేకమైన ఆసక్తి కలిగింది. ముఖ్యంగా యూరోపియన్ నావికులు, వ్యాపారులు మనదేశంలో అడుగుపెట్టిన తొలిదశలో వచ్చిన మార్పుల్ని శోధించడం నాకు ఇష్టమైన పని. ఒక స్తభ్దతకు లోనై, ఎన్నో శతాబ్దాలపాటు నిద్రాణంగా ఉన్న మన ఫ్యూడల్ వ్యవస్థలో యూరోపియన్ల రాకతో కదలికలు మొదలయ్యాయి. 'ఆసియా ఖండం తన చరిత్రలో తానే మునిగి, సుదీర్ఘమైన నిద్రావస్థలో ఉంది’ అన్నాడు మార్క్సు. ఆనాడు మొదలైన మార్పులు మన దేశపు ఆధునిక చరిత్రలో చాలా కీలకమైనవి.యారాడ కొండ నవల రాసినప్పుడు ఇంతకు మునుపు విశాఖ పట్టణం ఎలా ఉండేదో తెలుసుకోడానికి మీరు చేసిన పరిశ్రమ గురించి వివరాలు చెప్తారా?ఇంట్లో వాళ్లు తాత ముత్తాతల కథలు చెప్తూనే ఉండేవారు. మిగతావి ఎక్కువగా నేను చూసినవి, నాకు తెలిసిన సంగతులే. కొన్ని వాస్తవాలను, వివరాలను, తేదీలను చెక్ చేసుకోవాల్సి వచ్చింది. అవి ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించినవి. కొంత మంది మిత్రులు, పెద్దలు సహకరించారు.విశాఖ వాసుల నించీ ‘యారాడకొండ’ పై వచ్చిన స్పందన ఏమిటి?మా తరం వాళ్లు, ఇంకా ముందరి తరం వాళ్లు - తమ చిన్ననాటి రోజుల్ని గుర్తుచేసిందన్నారు. యువతరం, 'మాకు తెలియని వివరాలు చాలా ఉన్నాయీ నవలలో’ అన్నారు. మొత్తనికి అన్ని వయసుల వాళ్లూ కనెక్ట్ అయ్యారు.త్రిపుర గారితో మీకున్న సాహితీ పరిచయాన్ని గురించి కొన్ని వివరాలు చెప్తారా? ఆయన సాన్నిహిత్యం మీకు రచనా పరంగా ఎంత మటుకు మేలు చేసింది?ఆయన నా రచనలేవీ చదవలేదు. నేను రాయడం మొదలుపెట్టేనాటికే ఆయన వెళ్లిపోయారు. అయితే ఆయనతో సాగత్యం మూలాన నాకు తెలియని ఎంతోమంది అంతర్జాతీయ రచయితల రచనలు పరిచయం అయ్యాయి. ఒక్కోసారి ఏదో పుస్తకం నా చేతిలోపెట్టి, 'ఇది చదువు, నీకు నచ్చుతుంది’ అనేవారు. అది చదివాక నేనేదైనా చెబితే వినడమేగానీ మళ్లీ దాని గురించి అడిగేవారు కాదు. ఎప్పుడైనా కొందరి రచనల గురించి తన అభిప్రాయం చెప్పేవారుగానీ సుదీర్థమైన సాహితీ చర్చలు జరపడానికి ఇష్టపడేవారు కాదు.కొన్ని కథలు మీరు మీ అబ్బాయితో కల్సి రాయడం జరిగింది? ఈ కొలాబరేషన్ గురించి వివరాలు చెప్తారా?మా అబ్బాయి జైదీప్ ఉణుదుర్తి, నేనూ కలిసి ఇంతవరకూ ఒకే కథ రాశాం. 'రెక్కలు చాచిన రాత్రి’ అనే ఆ కథలో ప్రత్యామ్నాయ చరిత్ర అనే ప్రక్రియను తీసుకున్నాం. జైదీప్ బాగా చదువుతాడు; స్వయంగా రచయిత. సైన్స్-ఫిక్షన్ రచనలు చాలా చదివాడు, కొన్నిటిని నాకు పరిచయం చేశాడు. ప్రత్యామ్నాయ చరిత్ర అనేది సైన్స్-ఫిక్షన్ కోవకి చెందే ప్రక్రియ. అయితే ప్రత్యామ్నాయ చారిత్రక రచనలను ఆస్వాదించాలంటే చరిత్ర తెలిసి ఉండాలి. ఇది రాయడానికి మాకు సుమారు ఆరునెలలు పట్టింది. మరే కథకీ అంత కాలం పట్టలేదు.ఇప్పుడు ఎక్కువమంది ప్రొఫెషనల్ కోర్సులు చదవడానికి, అదే రంగాల్లో ఉద్యోగం చెయ్యడానికి ఇష్టపడ్తున్నారు. వీరికి తెలుగు సాహిత్యం చదవడం ఏ రకంగా ఉపయోగపడుతుంది?ప్రొఫెషనల్ కోర్సులకీ, సాహిత్యానికీ మధ్య వైరుధ్యం ఏమీలేదు. సాహిత్యం, కళలూ మనుషుల్ని సాటి మనుషుల పట్ల, సమాజం పట్ల మనల్ని సెన్సిటైజ్ చేస్తాయి. మన మూలాల పట్ల ఎరుకను కలుగజేస్తాయి. వాటిని వొదులుకుంటే మర మనుషులంగా మిగిలిపోతాం. ప్రజలకీ, సమాజానికీ మనల్ని దూరం చేసే చదువు నా దృష్టిలో చదువే కాదు. పై దేశాలలో, పై రాష్ట్రాలలో ప్రొఫెషనల్ కోర్సులు చేసేవాళ్లంతా సాహిత్యానికి దూరం అయిపోతున్నారా? లోపం మన విద్యావిధానంలో, సిలబస్ లలో ఉంది. దాన్ని సవరించడం పెద్ద కష్ట

S1 Ep 213ఎన్ ఎస్ ప్రకాశరావు గారి రచనా జీవితంపై వారి సహచరి డాక్టర్ నళిని గారు!
ఎన్ ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. 'ఎన్నెస్ కథలు' వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు. వారి రచనా జీవితంపై వారి సహచరి డాక్టర్ నళిని గారు ఈ ఎపిసోడ్ లో మాట్లాడతారు. శ్రీమతి నళిని గారికి కృతజ్ఞతలు. మరిన్ని కథల కోసం - హర్షణీయం పాడ్కాస్ట్ ని –‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://bit.ly/harshagaanaa స్పాటిఫై (Spotify )యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam ఆపిల్ (apple podcast) ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 వెబ్ సైట్ : https://harshaneeyam.in/allహర్షణీయం ఫేస్ బుక్ లో - https://www.facebook.com/Harsha051271హర్షణీయం ట్విట్టర్ - @harshaneeyamహర్షణీయం యూట్యూబ్ లో - https://bit.ly/harshayoutubeThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 220కే. సభా గారి కథారచన పై మధురాంతకం నరేంద్ర గారి సమీక్ష.
కె.సభా (జూలై 1, 1923 - నవంబరు 4, 1980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి.జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు.సుప్రసిద్ధ రచయిత మధురాంతకం నరేంద్ర గారు సభా గారి కథా రచనపై చేసిన సమీక్ష ఈ ఎపిసోడ్లో. నరేంద్ర గారికి కృతజ్ఞతలు. సభా గారి కథలు చదవడానికి - https://kathanilayam.com/writer/549?Story_page=2This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 223త్రిపుర గారి గురించి డాక్టర్ మూలా సుబ్రహ్మణ్యం.
ఈ ఎపిసోడ్లో శ్రీ మూలా సుబ్రహ్మణ్యం గారు, ప్రసిద్ధ రచయిత త్రిపుర గారి గురించి మాట్లాడతారు. శ్రీ సుబ్రహ్మణ్యం VLSI ఆర్కిటెక్చర్ లో డాక్టరేట్ తీసుకుని, ప్రస్తుతం పాలక్కాడ్ ఐఐటీ లో పని చేస్తున్నారు. స్వతహాగా, చక్కటి కవి రచయిత . ,'ఆత్మనొక దివ్వెగా' నవల , 'సెలయేటి సవ్వడి' కవితా సంపుటి వీరి ప్రసిద్ధ రచనలు.సుబ్రహ్మణ్యం గారికి హర్షణీయం కృతజ్ఞతలు.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S3 Ep 1'నాన్నతో ఒక్క రోజు' - తమిళ మూలం - సుప్రసిద్ధ కథారచయిత సుందర రామస్వామి గారు
‘నాన్న తో ఒక్క రోజు’ తమిళ మూలం: సుప్రసిద్ధ కథా రచయిత సుందర రామస్వామి గారు నాన్నతో ఒక్కరోజు అనే కథకు తమిళ మూలం సుప్రసిద్ధ కథారచయిత సుందర రామస్వామి గారు. కథను మీ కందించడానికి అనుమతినిచ్చిన కణ్ణన్ గారికి, సహకరించిన గీతారామస్వామి గారికి కృతజ్ఞతలు. నాన్నకున్న ఒకే ఒక దాయాది రాజు పెదనాన్న. పేరుకు దాయాదులన్న మాటే గానీ , ఇద్దరూ, ఒకే కడుపున, పుట్టిన వాళ్ళ కంటే కూడా, ప్రేమగా సఖ్యంగా వుంటారు. నాన్న అమ్మలకు పెళ్ళైన కొన్నాళ్ళకే , ఆస్తులన్నీ కరిగిపోయాయి. బతకడానికి ఏ ఆధారమూ లేక, నిస్సహాయంగా మా కుటుంబం నిలబడుంటే, రాజు పెద్ద నాన్నే చెయ్యందించాడు. తనకు బాగా డబ్బులు తెచ్చిపెడుతున్న ఒక వ్యాపారాన్ని, నాన్నకిచ్చేసాడు, రాజు పెదనాన్న. ‘అప్పట్నుంచే, డబ్బు సంపాదన అంటూ, ఒకటి మొదలై, నలుగురిలో తలెత్తుకు తిరిగే స్థితికి చేరుకోగలిగాను. ఏమిచ్చినా ఆ ఋణం తీర్చుకునేది కాదు’ అంటారు నాన్న . అమ్మగూడా అదే అంటుంది. ఎప్పుడు రాజు పెదనాన్న గురించి మాట్లాడుకున్నా, ఇద్దరికీ కళ్ళు తడవుతాయి. నాతో, రమణి అక్కతో అమ్మ రాజు పెదనాన్న గురించి ఎంతలా చెప్పిందంటే, మేమిద్దరం ఆయన ‘దేవుడి’ అంశ అనుకోడం మొదలెట్టాం. సంవత్సరానికి ఒక సారి, పెదనాన్న, మా ఇంటికి వచ్చేవాడు. ఆయన వస్తున్నట్టు ఉత్తరం అందగానే, ఇల్లంతా సందడి మొదలయ్యేది. పెదనాన్నకి, నులక మంచం మీద పడుకోడం అంటే ఇష్టం. మొదట, ఆ మంచాన్ని పెరట్లోకి తీసుకెళ్ళి, మరిగే నీళ్ళు పోసి, నల్లులు లేకుండా, శుభ్రంగా, కడిగే కార్యక్రమం ప్రారంభం అయ్యేది. అమ్మ, ఆయన కిష్టమైన పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు తయారు చెయ్యడం మొదలెట్టేది. నాన్న బంగారు అంచుతో వుండే కొత్త విసనకర్రలు కొనుక్కొచ్చేవాడు. మధ్యాహ్నం పూట, భోజనం ఐన తర్వాత, పెదనాన్న పడుకునుంటే, చెరో వైపు నిలబడి, విసరడం రమణీ కి, నాకూ అలవాటు. రమణి ఎప్పుడూ నన్ను ఆయన కాళ్ళ వైపు నిలబడి విసరమనేది. ‘పెదనాన్న తల వైపు నిలబడి, ఆయన మొహానికి తగలకుండా, విసరడం నీకు చేతకాదు’ అని చెప్పేది. ఎప్పుడైనా అమ్మ పిలిస్తే, రమణి అక్కడినించి వెళ్ళిపోయినప్పుడు, నేను పెదనాన్న మీదకి, బాగా ముందుకు వంగి, విపరీతంగా విసిరేవాణ్ణి. అప్పుడు, రాజు పెదనాన్న, నీ సంగతి నాకు తెలిసిపోయిందన్నట్టుగా, మూసిన కళ్ళు తెరవకుండానే, నవ్వేవాడు. ఆ నవ్వులో, తమలపాకులతో పండిన అందమైన ఎరుపు, లీలగా మెరిసేది. వడసేరి తనుమాలయన్ నేసిన పంచెలు మాత్రమే, తన ఒడ్డూ పొడుగుకి సరిపోతాయనే వాడు, రాజు పెదనాన్న. ఆయన కోసమని, ప్రత్యేకంగా, నాణ్యమైన నూరో నంబరు నూలు పంచెలు కావాలని, దుకాణానికి కబురు పంపించేవాడు నాన్న. అమ్మ, ఆనందత్త కల్సి పెరట్లోకి వెళ్ళి, ఏ అరటిచెట్టు నించి, ఏ ఏ ఆకులు కోసి, భోజనాలకు వాడాలో, నిర్ణయించే వాళ్ళు. ఎందుకోగానీ, ఎప్పుడూ రాజు పెదనాన్న రావడం, మా ఆవు ఈనడం ఒకే సారి జరిగేవి. ‘ఇలాటి జున్ను తినాలంటే, రాజు లాగా పెట్టి పుట్టాలి,’ అనేవాడు గర్వంగా నాన్న. రాజు పెదనాన్న కుటుంబం చాలా పెద్దది. ‘మా ఇంట్లో పన్నెండున్నర మందిమి మేము!’ అనేవారు పెదనాన, తమాషాగా. అది కొంచెం అతిశయోక్తి. నిజానికి ఆయనకు పద్నాలుగు మంది పిల్లలు. దాదాపు, ముప్పయి మంది మనవళ్ళు, మనవరాళ్ళూ. ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి వంటిల్లు . కొన్నిరోజులైనా సరే, ఆ సందడంతా వదిలేసి వచ్చి, మా ఇంట్లో ఉండడం పెదనాన్నకి ఎంత కష్టమో, మా అమ్మానాన్నలకి తెలుసు. ఆయనకు ఇంటికి వెళ్లిపోదామనే ఆలోచన వచ్చినట్టు గమనించగానే, ’ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దానికి తొందరేముంది?’ అని అంటూ, ఇంకొన్ని రోజులు, ఉండమని బలవంతం చేసేవారు నాన్న. ఇద్దరూ కూచుని, వాళ్ళ చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకుంటూ, ‘ఇంతకు ముందు రోజులా ఇవి ? అన్నీ నాశనం అయిపోతున్నాయి’ అని ముక్తాయించే వాళ్ళు. రాత్రంతా మేలుకుని అలా మాట్లాడుకుంటూనే వుండే వాళ్ళు. అయినా, మరుసటి రోజు పొద్దున్న లేచింతర్వాత గూడా, మాట్లాడుకోడానికి, వాళ్ళకు మాటలు ఇంకా మిగిలుండేవి. ప్రతిరోజూ పొద్దున్న, షాపు తెరవడానికి వెడుతూ , ‘నాలుగు గింజలకోసం, పెదనాన్న తో సమయం గడపకుండా, వెళ్ళాల్సివస్తోందే’, అన్న బాధ కనపరుస్తూ, నెమ్మదిగా బయలుదేరేవాడు నాన్న. ఆ రోజుల్లో ఇంట్లో ఫోన్ ఉండడం అనేది చాలా అరుదు. ఓ రోజు తెల్లవారు ఝామున, ఫోన్ ఆఫీసునించి ఒకతను హడావుడిగా వచ్చాడు. నాన్నకు, కొచ్చిన్ నించీ ఏదో ఫోన్ వచ్చిందనుకుంటా. విషయం విని అమ్మా నాన్నలకు నోట్లో మాట రాలేదు. కొచ్చిన్ లో ఉండేది రాజు పెదనాన్న. నాన్న మొహాన్ని గమనిస్తూ , విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆతృత పడ్డాను. మామూలుగానే, నేనెళ్ళి ఆయనకెదురుగా నిలబడే ప్రశ్నే లేదు. ఇపుడేమో, నాలుకలు తెరుచుకుని ఇంటి కప్పు నంటే, మంటలా కనిపిస్తున్నారు నాన్న. ఇలాటప్పుడు , నేనెప్పుడూ వేసే ఎత్తు ఒకటే. మా ఇంటికో పక్కన, గోడనానుకుని వున్న, వేపచెట్టుకొమ్మ మీద కెక్కి కూచున్నాను. గాలి వీచి, కిటికీని మూసిన తెరలు, పైకి తెరుచుకున్నప్పుడల్లా, ముందువసారాలో, పడక్కుర్చీలో కూచుని వున్న, నాన్న ఎర్రబడిన మొహం నాకు కనపడుతోంది. ఇలా నాన్న వైపు అపుడపుడూ చూస్తూ, ఏవనుకుంటున్నారో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే రమణికి ఈ ఇబ్బంది లేదు. నేరుగా తాను వరండాలోకి వెళ్ళగలదు. కావాలంటే, భయమనేదే లేకుండా నడుచుకెళ్ళి, నాన్న పక్కనే, నిలబడగలదు కూడా. ఒక్కోసారి, ఆయన చుట్టూచూసి, ఎవరూ లేరు, అని నిర్ధారించుకుని, రమణిని దగ్గరకు తీసుకుని ప్రేమగా తల నిమిరే వారు. వేపచెట్టుమీద కూచునప్పుడు, ఎన్నోసార్లు ఈ దృశ్యాన్ని నేను చూసాను. నేనెక్కడ ఉన్నానో, రమణికి తెల్సు కాబట్టి, నా వైపు తల తిప్పి , ‘ఇదంతా చూస్తున్నావా?’ అన్నట్టుగా మొహం పెట్టేది. నాన్నకు, తనంటే ఎంత ఇష్టమో, నాకు చూపించడం కోసం తహతహలాడేది. నన్ను ఏడిపించడం తన ఉద్దేశ్యం. నేను మటుకు, అందుకు బదులుగా, నా మొహాన్ని చిత్రవిచిత్రంగా మారుస్తూ తనన

S2 Ep 313సద్గతి - శ్రీ మధురాంతకం నరేంద్ర
రచయిత తన రచనా వ్యాసంగాన్ని నలభై ఆరేళ్ళ క్రితం ప్రారంభించారు. వారిది సాహిత్య కుటుంబం. వారి తండ్రి గారు మధురాంతకం రాజారామ్ గారు , సోదరుడు మహేంద్ర గారు కూడా సుప్రసిద్ధ తెలుగు కథా రచయితలు.ఇది గాక , ఆయన ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన చేసి , అధ్యాపక వృత్తిలో ప్రవేశించి, నలభై ఏళ్ల పైన, వేలమంది విద్యార్థులకి విద్యా దానం చేశారు.మన సమాజంలో, మన వ్యక్తిత్వాలలో వుండే వైచిత్రిని , అనేక రకాలైన సంఘర్షణలని అతి సుతారమైన తనదైన శైలిలో , అత్యంత సహజంగా చిత్రీకరించడమే ఆయన రచనలలో వుండే ప్రత్యేకత.ఒక సకారాకాత్మకమైన మార్పు , కథ చదివే ప్రతి వ్యక్తిలో, తద్వారా మన సమాజంలో తీసుక రావాలని నిరంతరమూ కృషి చేసే హాలికుడాయన.అత్యంత ప్రతిష్టాత్మకమైన 'కథ' అవార్డు తో బాటూ ఎన్నో పురస్కారాలు అందుకున్నారాయన, ఈ ప్రయాణంలో.ఈ కథ కు ఆడియో అందించింది శ్రీమతి స్వాతి గారు . వారికి నరేంద్ర గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. స్వాతి గారి యూట్యూబ్ ఛానల్ లో మీరు మరిన్ని తెలుగు కథలు వినవచ్చు. https://www.youtube.com/c/SwathiPantulaThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 312ట్రిగ్గర్
ట్రిగ్గర్అశోకరాజు సోఫాలో కూచుని కాఫీ తాగుతూ టీవీ ఆన్ చేసాడు. ‘ ముగ్గురు కాలేజీ పిల్లలు ఓ నగల దుకాణం మీద దాడిచేసి పట్టుబడ్డారని బ్రేకింగ్ న్యూస్ కింద చూపిస్తున్నారు. సంఘటనలో గాయపడ్డ వాచ్ మెన్ చావు బతుకుల్లో వున్నాడు. జరిగిందంతా ఊహించి 3 -డీ యానిమేషన్ సాయంతో, నేపధ్య సంగీతంతో కలిపి ఛానల్ వాళ్ళు ప్రేక్షకులకు అందచేస్తున్నారు. దీనికి అదనంగా స్టూడియోకి వచ్చి కూచున్న మేధావులు ‘నేటి యువత - సినిమాలు’ అనే చర్చా కార్యక్రమంలో ఒళ్ళు మరచి పాల్గొంటున్నారు. టీవీ ఆఫ్ చేసాడు. కాఫీ గ్లాసు పక్కన బెట్టేసి, బయలుదేరబోతూ భార్యని అడిగాడు, “వీడింకా లేవలేదా?”“లేదు. అదేదో తాడో, పేడో కొని చేతిలో పెట్టారుగా, రాత్రంతా దాన్ని ముందరేసుకుని కూర్చోనుంటాడు. స్కూల్ బస్ టైం కి అరగంట ముందు లేచి పరిగెడతాడు” అందావిడ. *****అన్న, చేతులు అటూ ఇటూ చాపుతూ రకరకాల పోజులు ఇస్తూంటే, తమ్ముడు మొబైల్ తోటి ఫోటోలు తీస్తున్నాడు. గదిలో ఓ మూల బంకర్ మంచం వేసుంది. ఇంకో పక్క పుస్తకాల అలమరలు, వాటి పక్కనే రెండు స్టడీ టేబిల్స్. చేస్తున్న పని ఆపి “అన్నా నేనూ పట్టుకుంటా. నాకు గూడా ఫోటో తీయవా” అన్నాడు తమ్ముడు. “నీ చేతి కొద్దు చిన్నా. నాన్న గూడా కింది నించీ వచ్చేస్తూంటారు ఈపాటికి” చిన్నా మొహం ముడుచుకుని ఫోటో షూటింగ్ మళ్ళీ కంటిన్యూ చేసాడు. అలా ఓ ఐదు నిమిషాలు గడిచింతర్వాత, చెయ్యి కుర్చీకి తగిలి, అన్న చేతిలో ఉన్న తుపాకీ, జారి, బెలూన్ చిట్లినట్టుగా శబ్దం వచ్చింది. మొబైల్ పట్టుకునున్న, చిన్నా కుప్పకూలాడు. మెడ మీంచి రక్తం, సన్నటి ధారగా స్రవించడం మొదలైంది. పదేళ్ళ తమ్ముణ్ణి ఒళ్ళోకి తీసుకుని చిన్నా! చిన్నా! అని అరవడం మొదలెట్టాడు అన్న. ఏ మాత్రం కదలిక లేదు. కుదిపి కుదిపి అలిసిపోయి, గోడకు చేరగిలబడ్డాడు. కళ్ళు మూతబడ్డాయి. తలమీద కన్నీళ్ళ కుండ ఒలికిందా అన్నట్టు, ఒళ్ళంతా తడిసిపోయి వుంది. మరుక్షణంలో గదిలో నిండిన నిశ్శబ్దాన్ని తొలుస్తూ, నేల మీద పడున్న మొబైల్ మోగడం మొదలైంది. బుగ్గ మీది చారికలు తుడుచుకొని, కనపడే ఎర్రచుక్కను బలంగా పక్కకు తోసి ఫోను చెవికి తగిలించాడు. “రే! నాన్నని ఫోన్ చెయ్యమని చెప్పు? ఫోన్ తీట్లేదు.” “హలో…. హలో… . మాట్లాడవేం రా? టైం అవుతోందక్కడ. వెళ్ళాలి నేను. చిన్నాగాడు ఏం చేస్తున్నాడు? టిఫిన్లు తిన్నారా?” ఆమె కంఠం ఆగకుండా మోగుతోంది. ఫోన్ పక్కన పెట్టేస్తూంటే చెయ్యి వణుకుతోంది. పక్కన పడున్న రివాల్వర్ తీసుకుని తన కణతకు గురిపెట్టాడు. ఇంతలో తలుపు తోసిన శబ్దం. నాన్న… లైటర్ మంటను సిగరెట్ దగ్గరకు తీసుకొస్తూ లోపలికొస్తున్నాడు. కనపడిన దృశ్యం చూసి, కాళ్ళు ఘనీభవించిన కాంక్రీట్ లో ఇరుక్కు పోయినట్టుగా ఆగిపోయాడు. మరుక్షణం ఈ లోకంలోకి వచ్చి కేకలు పెడుతూ పిల్లల వైపు పరిగెత్తాడు. *****రాజు స్టేషన్కి వచ్చి, కూచుని ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసాడు. కరకరమని శబ్దం చేస్తూ, చెంగీజ్ ఖాన్ కాలం నాటి ఆ యంత్రం వేగంగా తిరగడం మొదలైంది. కుడివైపున్న కిటికీలోంచి బైటికి చూస్తే, సూర్యుడు ఇప్పుడల్లా బయటికొచ్చేటట్లు కనపడ్డం లేదు. ఆకాశం నలుపెక్కి పోయివుంది. స్వింగ్ డోర్ ధడాల్న తెరుచుకుని కానిస్టేబిలు ఆనందరావు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. తల పైకెత్తాడు రాజు. “సార్, గాంధీనగర్ లో , షూటింగ్ జరిగిందట సార్.”“గాంధీనగర్ లోనా?“ కనుబొమలు పైకెత్తాడు. “అవును సర్. ఫోన్ వచ్చింది. పది పన్నెండేళ్ల పిల్లలంట.”“పిల్లలా?” కంఠం మారుమోగింది. సమాధానం వచ్చే లోపలే, కుర్చీని ఒక్క ఉదుటున వెనక్కి తోసి వున్న పళంగా బయటికి కదిలాడు రాజు. ఆనందరావు, లెధర్ బాగ్ భుజానేసుకుని మఫ్టీలో వున్న ఇంకో కానిస్టేబులు జీపు వెనుకభాగంలో కూర్చున్నారు. కొత్తగా రంగులేసున్న అపార్ట్మెంట్ కాంప్లెక్. కిందున్న లాన్ లో, మగా ఆడా కల్సి పోయి, రెండు చిన్న గుంపులుగా విడిపోయి మాట్లాడుకుంటున్నారు. జీపు దిగగానే ఒక నడివయసు వ్యక్తి వచ్చి జాయిన్ అయ్యాడు. అడిగాడు రాజు “మీరేనా ఫోన్ చేసింది?” “అవునండీ. ఈ మధ్యనే దిగారు ఈ ఫ్యామిలీ.”“ఎవరెవరు వుంటారు”“భార్యా, భర్తా ఇద్దరు పిల్లలు. మా ఫ్లోర్ లోనే వుంటారు” చెప్పాడు ఆ నడి వయస్కుడు. “ఏంచేస్తూ వుంటారు”“ఆవిడ హౌస్ వైఫ్ అండీ. ఈయన ఏదో రియల్ ఎస్టేట్ లాటిదనుకుంటా..”అటూ ఇటూ కలిపి మొత్తం నాలుగు ఫ్లాట్లు ఆ ఫ్లోర్లో. కారిడార్లో నడిచి వెళ్తూంటే ఆ నడివయసు మనిషి చెప్పాడు. “ఇది మాదండీ. అటుపక్క ఆ చివరన వాళ్ళ ఫ్లాట్.” “ఎంత సేపైంది జరిగి?” “ఓ పదిహేను నిమిషాలు కూడా అయ్యుండదండీ . పిల్లల్ని హాస్పిటల్కి వెళ్ళగానే, మీకు ఫోన్ చేశాను. ““ఎవరైనా వాళ్ళ ఫ్లాట్ వైపు వెళ్ళడం మీరు చూసారా?”“లేదండీ. నేను మా హాల్లోనే కూచుని టీవీ చూస్తున్నాను. ఇది జరగడానికి ఓ పదిహేను నిమిషాల ముందర వాళ్ళ ఫాదర్ లిఫ్ట్ వైపు వెళ్ళడం, మళ్ళీ తిరిగిరావడం నేను చూసాను.”“పిల్లల మదర్… ఆవిడా ?”“ఆవిడ ఏదో ఫంక్షన్ ఉందని, మొన్న వూరెళ్ళిందండీ. మధ్యాన్నం బయల్దేరి మేము కూడా వెడతాం అని చెప్పాడు అతను.”ఫ్లాట్లో ఎంటర్ కాగానే, ఓ పెద్ద హాలు , ఫ్రంట్ డోర్ ను ఫేస్ చేస్తూ ఓ రూమూ. అటూ ఇటూ ఇంకో రెండు రూమ్లున్నాయి. ఇంకో పక్క వంటగది. హల్లో టీకుతో చేసిన సోఫాలు.మధ్యలో ఒక టీపాయ్. రిమోట్, టీపాయ్ కింద నేల మీద పడుంది. గోడ మీద తగిలించివున్న, భారీ LED టీవీ, పాస్ చేసుంది. ‘స్టోన్ బాయ్’ అని కన

S2 Ep 311స్వింగ్ - ఛాయా మోహన్ గారి 'ఒంటరి పేజీ' కథ
స్వింగ్-----------------------------వేసవి సాయంత్రపు ఎండ, కాలం చీకటిలోకి జారిపోకుండా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. పార్కులో పిల్లల సందడి అలల అల్లరిలా ఉంది.చాలా సేపటి నుంచి నా చూపు కొంచెం దూరంగా ఉయ్యాల ఎక్కి ఊగుతున్న పిల్లలు , అక్కడే తచ్చాడుతున్న ఓ ముసలాయన దగ్గర ఆగిపోయింది. ఓ పది మంది దాకా పిల్లలు వంతులు వంతులుగా ఉయ్యాల ఊగుతున్నారు. ఓ పిల్లాడు దిగంగానే ముసలాయన ఏదో అడుగుతున్నాడు. వాళ్ళు అడ్డంగా బుర్ర ఊపుతున్నారు. అంతలో ఉడతలా మరో కుర్రాడు ఉయ్యాల మీదికి ఉరుకుతున్నాడు. నేను రోజూ సాయంత్రం పార్క్ కి వస్తా. తను పనినుంచి రావడానికి ముందే నేను ఇంటికొస్తా, తనొచ్చేదాకా పార్క్ లో గడుపుతా. నేనెప్పడూ ఈ ముసలాయన్ని చూసిన గుర్తులేదు.నెమ్మదిగా చీకటి బలానికి వెలుగు లొంగక తప్పలేదు. కొందరు పిల్లలు వెళ్లి పోయారు.ఇంతలో మా అపార్టమెంట్ అబ్బాయి ఒకడు ఉయ్యాల దగ్గర నుంచి పరిగెత్తుకొస్తూ కనబడ్డాడు." ఏయ్ విశేష్ ఆ ముసలాయన ఇందాకటి నుంచి మిమ్మల్ని ఏంట్రా అడుగుతున్నాడు. "" ఏం లేదంకుల్ ఆయన ఉయ్యాల ఎక్కుతాట్ట మేం హెల్ప్ చేయ్యాల్ట , ఏమైనా చిన్న పిల్లాడా అంకుల్ !? " సమాధానం ఇస్తూనే ట్యూషన్ కి టైం అవుతోందని పరుగెత్తాడు.నే నెమ్మదిగా ఉయ్యాల దగ్గరికి వెళ్ళా. పిల్లలు ముగ్గురో, నలుగురో ఉన్నారు. చీకటి పడుతుండటంతో వాళ్ళు వెళ్ళి పోయే మూడ్ లో ఉన్నారు.నెమ్మదిగా నే ముసలాయన దగ్గరికి వెళ్ళా. కొంచెం మావయ్యలా ఉన్నాడు. ఒకసారి ఆయన మొహంలోకి చూసి నవ్వా, ఆయనా నవ్వాడు. " ఉయ్యాల ఊగడం చాలా ఇష్టమా ? "మొహమాటంగా నవ్వాడు." ఎక్కుతారా ? "" నే నేమైనా చిన్న పిల్లాడినా " కొంచెం చికాగ్గా మొహం పెట్టి అన్నాడు." పర్లేదు రండి "దగ్గరుండి ఉయ్యాల మీద కూర్చోబెట్టా. బాలన్స్ చేసుకోలేక జారిపోబోయాడు. పట్టుకుని సర్ది కూర్చో బెట్టి నెమ్మదిగా ఊపసాగాను." చిన్నప్పుడు మావయ్య ఇలాగే ఉపేవాడు " నాలో నేనే గొణుక్కున్నా.ఆ ముసలాయన మొహం నిండా బాల్యం ఆవహించింది. కొద్ది నిమిషాలు ఊగాక నెమ్మదిగా దిగిపోయాడు." థాంక్యూ " అని కొంచెం సిగ్గుగా, నెమ్మదిగా అంటూ చీకట్లోకి నడిచాడు" అమ్మ గుర్తొచ్చిందా " అన్నా నవ్వుతూ.--- * ------This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 309'పది రోజులు' - శ్రీ అప్పాదురై ముత్తులింగం
'పది రోజులు' అనే ఈ కథకు మూలం ‘పట్టు నాట్కళ్’ అని శ్రీ అప్పాదురై ముత్తులింగం రచించినది. తమిళంలో ఈయన రాసిన కథలను, అతి చక్కగా తెలుగులోకి అనువదించారు శ్రీ అవినేని భాస్కర్ గారు. ఛాయా ప్రచురించిన ఈ పుస్తకం పేరు 'ఐదు కాళ్ళ మనిషి'.శ్రీలంకలో జన్మించిన శ్రీ ముత్తులింగం శ్రీ లంక లో ఛార్టర్డ్ అకౌంటెన్సీ లో , ఇంగ్లాండ్ లో మానేజ్మెంట్ అకౌంటెన్సీ లో పట్టా పుచ్చుకున్నారు. శ్రీలంక పాకిస్తాన్ లతో పాటూ అనేక యూరోపియన్ దేశాల్లో , నార్త్ అమెరికా లో కూడా ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేశారు. చాలా మంచి కథారచయిత. ఆయాదేశాల్లో తనకు ఎదురైన జీవితాలపై, అనుభవాలపై కథలు రాసారు. ఇప్పుడు మీరు వినబోయే కథ పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ లో ఆయనకెదురైన ఒక వ్యక్తి గురించి.పుస్తకం కొనడానికి కింది లింక్ ని ఉపయోగించండి. https://harshaneeyam.captivate.fm/aidu‘పది రోజులు’ఇస్లామాబాద్ ఎనిమిది భాగాలుగా నిర్మించబడ్డ నగరం. అక్కడ ఎఫ్ ప్రాంతంలో అద్దె ఇళ్ళు దొరకడం అన్నది బ్రహ్మ ప్రళయం అనే చెప్పాలి. ప్రభుత్వోద్యోగులు, మిలిటరీ అధికారులు, రాజకీయంగా పలుకుబడి ఉన్నవారూ మాత్రమే అక్కడ ఇళ్ళు కట్టుకుని నివసిస్తుంటారు. కాబట్టి అద్దె వాటాలన్నవి తక్కువ. ఉన్న కొన్నిటికీ అవి ఖాళీ కాక ముందునుండే టెనంట్లు ఎదురు చూస్తుంటారు. ఏ గొప్ప ప్రభుత్వాధికారికో ముందరే చెప్పివుంచి ఓ ఐదారు నెలలు కాచుకునుంటే ఇల్లు దొరకచ్చు. అలాంటి ఒక ప్రయత్నంతోనే నేను అక్కడొక ఇల్లు వెతుక్కుని అద్దెకు దిగాను.ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఎండగా వున్నప్పుడు డాబా మీదకెక్కిచూస్తే మర్గెల్లా కొండలు కనబడుతాయి. వీధులు, రోడ్లు ఒకదానికొకటి సమకోణంలో ఉంటాయి. ఎత్తయిన మేడ మీదనుండి చూస్తే ఊరంతా చతురస్రాల్లా కనబడుతుంటుంది. మావీధి మొత్తం నేరేడు చెట్లు వుండటం వల్ల ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. మార్కెట్టూ, షాపులూ లేకపోవడంతో వాహనాల రద్దీ, కాలుష్యం, దుమ్ము ఉండవు. వీధులు శుభ్రంగా ఉంటాయి. అలా ఉండటం ఒకరకంగా మంచిదే అయినప్పటికీ ఏ వస్తువు కావాలన్నా దూరానున్న బజారుకు వెళ్లాల్సివుంటుంది. ఒక మంచి ఇల్లు దొరికేప్పుడు ఒకటి ఉంటే మరొకటుండదన్నది తెలిసిందే కదా!సాయంకాలం సరిగ్గా ఆరవ్వగానే ఒక్కొక్క ఇంటికీ ఒక్కో చౌకీదార్ వచ్చేవాడు. వారి చేతుల్లో ఒక రూళ్ళ కర్ర, రగ్గు, రాత్రి భోజన సంచీ, టార్చిలైటు ఉండేవి. ఒకరికొకరు అభివాదం తెలుపుకుని, కుశల ప్రశ్నలు పూర్తయ్యాక గుంపుగా నమాజ్ చేసేవాళ్ళు. తర్వాత, గుంపులు గుంపులుగా కూర్చుని తెచ్చుకున్న భోజనం సంచులు ముందు పెట్టుకుని తినేవాళ్ళు. నిలబెట్టివుంచిన నులక మంచాలు వాల్చుకుని దమ్ము కొట్టేవాళ్ళు. ఇంటి యజమానులు నిద్రపోయిన ఐదో నిముషం నిద్రపోయేవాళ్ళు. మరుసటి రోజు తెల్లవారుఝామున ఇంటి యజమాని లేవడానికి ఐదు నిముషాలు ముందే నిద్రలేచి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయేవారు.మా వీధిలో ఒక బడ్డీ కొట్టు ఉండేది. నాకు ఆ వీధిలో దొరికిన మొదటి స్నేహితుడు ఆ కొట్టతనే. పేరు నవాజ్. ఉదయం ఆరు గంటలకి కొట్టు తెరిస్తే రాత్రి ఎనిమిదికి కట్టేసేవాడు. వారంలో ఏడు రోజులూ వ్యాపారం జోరుగా సాగేది. ఉదయం నుంచీ వాడి దగ్గరకు పేపరు, పాలు, పాన్, సిగరెట్, బ్లేడ్- ఇలా ఏదో ఒకటి కొనేందుకు ఆ వీధివాసులు వస్తూనే ఉంటారు. నవ్వు ముఖంతో హుషారుగా వస్తువులందిస్తూ డబ్బు తీసుకుంటూ ఉంటాడు నవాజ్.1960లో అయూబ్ ఖాన్ ఇస్లామాబాద్ నగరాన్ని నిర్మించి పాకిస్తాన్ రాజధానిగా చేశాడు. అన్ని రకాలుగానూ ప్లాన్ చేసి అన్ని సౌకర్యాలతోనూ నిర్మించబడిన నగరం కాబట్టి పచ్చని చెట్లతోను, చుట్టూ కొండలతోనూ కళకళలాడుతుంటుంది. నగరం నిర్మించిన తొలి రోజుల్లో నవాజ్ తండ్రి ఆ బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు. అతనికి జబ్బు చేయడంతో నవాజ్ ఈ కొట్టు బాధ్యతని తన భుజాలకెత్తుకుని నడుపుతున్నానని నాతో చెప్పాడొక రోజు.ఎన్నేళ్ళయిందని అడిగాను. “నా పద్దెనిమిదో ఏటనుండి ఉన్నానిక్కడ. ఇప్పుడు నాకు ముప్పై ఎనిమిది. ఇరవైయేళ్ళు! సంవత్సరంలో 365 రోజులూ పనిచేస్తున్నాను. ఇక్కడ నివసించే అందరూ, వాళ్ళ పిల్లలూ, మనవళ్ళూ అందరూ తెలుసు నాకు!” అన్నాడు.నవాజ్ స్వగ్రామం లైలాపూర్. అది ఇస్లామాబాదు నుండి 160 మెళ్ళ దూరానుంది. ముసలివాళ్లయిన తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళేవాడు కాడు నవాజ్. వాళ్ళేవచ్చి చూసి వెళ్ళేవారు. 'సంవత్సరమంతా విరామం లేకుండా పని చేసేవాడు, ఎలా వెళ్ళగలడు?” అని నన్నే అడిగేవాడు.“నవాజ్, నువ్వెందుకు పెళ్ళి చేసుకోలేదు?" ఒక రోజు అడిగాను. .“పేదవాళ్ళు ఉన్నపళంగా పెళ్ళి చేసుకోలేరు. అమ్మాయికి కన్యాశుల్కం ఇవ్వడానికి డబ్బులు కూడబెట్టాలి,” అన్నాడు.అలా చెప్తున్నప్పుడు వాడి కళ్ళు కొట్టు పలకలకు అంటించివున్న ఎందరో హిందీ సినిమా నటీమణుల పోస్టర్ల మీద ఒక క్షణం వాలి తిరిగొచ్చాయి. డింపుల్ కపాడియా, నీతూ సింగ్, పర్వీన్ బాబి, పూజా భట్, శ్రీదేవి, నీలమ్ అని అప్పట్లో పాకిస్తాన్ లో కూడా ప్రసిద్ధులైన నటీమణులందరూ అక్కడ వరుసగా వాడికోసం వేచివున్నారు.“నిన్ను మీ అమ్మానాన్నలు బడికి పంపించలేదా?” అడిగాను.“ఏదో పంపించారు. ఉర్దూ కొంచం రాయడానికీ చదవడానికి వచ్చు. లెక్కల్లో కూడిక, తీసివేత మాత్రమొచ్చు. గుణించడం రాదు. మా తలిదండ్రులకి ఆర్థిక స్తోమత లేదు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు, మా ఇంట్లో కోడి మాంసం తినాలంటే నాకైనా జబ్బు చెయ్యాలి, లేదా కోడికైనా జబ్బు రావాలి...” నేరేడు పళ్ళ అదనులో ఆ వీధంతా నేరేడు పళ్ళు నేల రాలేవి. అయితే వాటిని ఏరుకోడానికి పిల్లలు ఉండరక్కడ. అక్కడ నివసించే పిల్లలందరూ నాగరికులు. వీధిలో పడిన వాటిని ఏరుకునే స్వతంత్రం లేదు వాళ్ళకు. కొట్టు బయట నిల్చుని సరుకులమ్మే నవాజ్ నెత్తిన రోజుకు వంద పళ్ళయినా రాలేవి. దాంతో వాడి తెల్లటి సల్వార్ కమీజ్ ఊదా రంగులోకి మారిపోయేవి. అలాంటప్పుడు ఎండకి ఎర్రగా మెరిసే దేహంతో, వెనక్కి దువ్విన పొడవాటి జుట్టుతో పంజాబి నటుడిలా అందంగానే కనిపించేవాడు.అలాంటొక నేరేడు పళ్ళ సీజన్ లో నేను ఆఫీసునుండి వెనక్కి వచ్చేసరికి నా ఇల్లు కనిపించలేదు. వీధి పేరు చూస్తే, నేనుంటున్న వీథే! అయితే వీధినంతా ఆక్రమించి పందిరి వేసేశారు. నేను కారునలా నిలబెట్టి ఏం చెయ్యాలా అనిఆలోచిస్తుంటే, నా ఇంటి ఓనర్ పదవీ విరమణ చేసిన మిలిటరీ మేజర్, నగిషీ పనిచేసి

S2 Ep 307రామేశ్వరం కాకులు: కథ - ప్రతిస్పందన.
ఈ కథ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘ రామేశ్వరం కాకులు’ పుస్తకం లోనిది.పుస్తకం కొనాలంటే – https://amzn.to/3rDN1YMరామేశ్వరం కాకులు :వెనకవైపు రెండు వేపచెట్లు పెరడంతా నీడ పెడతాయి. ఆ రెండు చెట్లనీడలో వానల్లో, ఎండల్లో, చలిలో క్షేమంగా ఉంటుంది పోలీసు స్టేషను. పెరటిగోడ పక్కభాగంలో లోపలికి రావడానికి చిన్న గేటుంది. సామాన్యంగా తెరవరు. వేపనీడలో ఒకవైపు రెండు స్నానాల గదులూ, ఒక పాయఖానా, వీటికి దూరంగా నాలుగు నీలం ప్లాస్టిక్ కుర్చీలు పడుంటాయి. స్టేషనుకి వెనక వరండా ఉంది. వరండాలో అనేకమంది నేరస్థులు, అమాయకులు, అనుమానితులు కూర్చుని కూర్చుని నున్న బరిచిన రెండు పొడవాటి బెంచీలుంటాయి. రెండుకాళ్లూ ఎదుట కుర్చీలో పడేసి, టీ తాగిన కప్పు పక్కకుర్చీలో పెట్టి, తీరిగ్గా సిగరెట్టు వెలిగించి, పొగ వదులుతూ, కానిస్టేబులు వేపు చూశాడు రెడ్డి. దరిదాపు ఒంటిగంటవుతోంది – వేప కింద మంచం వేసుకుని హాయిగా పడుకోవాలనుంది అతనికి.“ఊ. ముండలకి అన్నం పెట్టారా?” కానిస్టేబులు నవ్వాడు. “తిన్నారు సార్. బేబీ వచ్చి డబ్బులిచ్చింది.”“ఎలాగైనా వాళ్లని బానే చూసుకుంటారా మీరు.” ఎస్సైగారి మాటలకి మళ్లీ నవ్వాడు పీసీ.“ఎంతమందీళ్లు.” “నలుగురు సార్. ముగ్గురు పాతోళ్లే. నాలుగోది ఈడది కాదు సార్.” “అవునే, ఈళ్లకి మన్లాగే ట్రాన్స్ ఫర్లుంటాయి గదా!” మళ్లీ నవ్వేడు పీసీ.“దాని గుంటూరు యాసండి. అదేదో పల్లెటూరు సార్. మాణ్నెల్లయిందంట దీనికాడికొచ్చి. ఇంటర్ చదివిందంట సార్.”“ఆ. ఉష్ణోగాలు జేసే వోళ్లీ సెల్ ఫోన్లు అడ్డుపెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు. నే వైజాగులో మెడిసిన్ చదివే అమ్మాయిల్ని పట్టుకున్నాను. అంటే డబ్బు కోసం కాదనుకో. ఈ డ్రగ్స్ ఉంటయి గదా, వాటికి అలవాటుపడి.”కాసేపాగి పీసీ వెళ్లిపోయాడు. రెడ్డి భోజనం చేసి వచ్చాడేమో చల్లటి వేపగాలికి కునుకు తీయాలనుంది. తల వెనక్కి వాల్చి కళ్లు మూసుకున్నాడుగానీ ఎందుకో నిద్ర రాలేదు. మరో పది నిమిషాల్లో పీసీ వచ్చి దగ్గ నుంచున్నాడు. కళ్లు తెరిచి చూశాడు రెడ్డి.“తినేత్తందండి. కాళ్లట్టేసుకుంది. మీతో మాటాడాలట సార్. కాళ్లిదలట్లేదు సార్.” ఒక క్షణంపాటు రెడ్డి కేవీ అర్థం కాలేదు.“గుంటూరుదండి సార్. మీతో మాట్లాడాలంట సార్.” ప్లాస్టిక కుర్చీ ఎత్తి విసిరేస్తాడనుకున్నాడు పీసీ. “ఎవత్తిరా అది? రాజకీయాలుగానీ మాటాడుతుందా?”“పద్మ సార్ దాని పేరు.” “సరే, రమ్మను.” తల ఊపి వెళిపోయాడు పీసీ.రెండు నిమిషాల్లో ఆమె వచ్చింది. వరండాలోంచి మెట్లుదిగి రావడం అతను చూస్తూనే ఉన్నాడు. ఆమె అతన్ని అక్కణ్ణించే చూస్తూ నడిచి వచ్చింది.“నీ పేరేంటి?” “పద్మ సార్.”“అసలు పేరు.” “పద్మావతి సార్.” “ఏ ఊరు నీది?” “సత్తెనపల్లి దగ్గర సార్.”“ఇక్కడి కొచ్చి ఎన్నాళ్లయింది!”“మూడు నెలలైంది సార్.”“ఊం పర్సనల్ గా మాటాడాలన్నావంట?” తల ఊపిందామె. రెడ్డి సిగరెట్టు వెలిగించాడు. పద్మ అతనివైపే చూస్తోంది. జుట్టు బిగువుగా వెనక్కిలాగి జడ వేసుకుందామె. రెండు కనుబొమల మధ్య కొంచెం పైన దోసగింజ తిలకం. సన్నటి కాటుక గీత. నీలంరంగు చీర, అదే రంగు జాకెట్టు భుజాల మీంచి కొంగు కప్పుకుని చేతులు కట్టుకు నిల్చుంది. “నన్ను చూడ్డానిగ్గాని వచ్చేవా, మాటాడతావా?” ఆమెవేపుచూస్తూ అన్నాడు రెడ్డి. పద్మ పెదాలు ఒంపు తిరిగాయి. అంతవరకూ ఎస్సైని కన్నార్పకుండా చూస్తున్న ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. దణ్ణం పెడుతూ అందామె.“సార్. నన్ను కోర్టుకి తీసికెళ్లవాకండి సార్. ప్లీజ్.” ,“కోర్టుకి రావా? బావుంది. ఏం కొత్తా? ఆళ్ల మొహాన ఫైను పారేస్తే మళ్లీ మామూలే. ఏం, కోర్టుకి పోలా ఎప్పుడూ?” అడ్డంగా తల ఊపిందామె. “కోర్టుకి పోలేదా, నిజవే?”“నిజవే సార్,” ఆమె కళ్లు తుడుచుకుని చటుక్కున అతని కాళ్లు పట్టుకుంది.“సార్. నాకు బయెం సార్. మీ ఇష్టం ఏదేనా చెయ్యండి. కోర్టుకి పంపమాకండి సార్,” కాళ్ల మీద పడ్డ నీలంకుప్పలా ఉందామె. ఏడుపుతో ఆమె భుజాలు ఎగిరిపడు తున్నాయి.రెడ్డికి కాసేపు నోటమాట రాలేదు. “హ్. లెగెహె. ముందు లెగు. లే!” ఓ చేత్తో బలంగా ఆమె భుజం పట్టుకుని లేపేడతను. “ముందు ఆ ఏడుపాపు.” మరో దమ్ములాగి అన్నాడు రెడ్డి. “అంతేనా ఇంకా ఉందా?” ఆమె కళ్లు తుడుచుకుని చేతులు జోడించి నుంచుంది. ఎస్సై రెడ్డి అనేకమంది పద్మల్ని, సావిత్రుల్ని, సుజాతల్నీ చూసాడు. వాళ్ల ముఖాల్లో, పోలికల్లో అతనికి తేడా కనిపించదు. రుమాలో ముఖం తుడుచుకుని పద్మవైపు నిశితంగా చూశాడతను.తెల్లగానే ఉంది. సన్నగా, ఒత్తు జుట్టు, పొడుగూ పొట్టీ లేకుండా మరోసారి చూడాలనిపించే ఆకర్షణ ఉందామెలో. కనుబొమలు ముడిచి ఆమెవైపే చూస్తున్నాడతను. ఏడవడం వల్ల ఆమె కళ్లు శుభ్రం అయినాయి. మళ్లీ అతనివైపే చూస్తోందామె. రెడ్డి కళ్లు తిప్పుకోలేకపోయాడు. ఆమె కళ్లు అతన్ని ఆక్రమించాయి. అతని ఎస్సె జీవితం కరుకైనది. అతని ప్రపంచం నిండా సరిగా వెలుతురు పడని చీకటి. తన ఎదురుగా నుంచున్న పాతికేళ్లు కూడా లేని ఈ అమ్మాయి జీవితం అయిదో నంబరు జాతీయ రహదారిలాంటిదని అతనికి తెలుసు. అది కొత్తాకాదు, ఆశ్చర్యం, విషాదం అసలు లేవు అతనికి. కానీ చూస్తున్న కొద్దీ ఆమె కళ్లకీ ఆమె శరీరానికీ ఏవీ సంబంధం లేదనిపించిం దతనికి. ఒక రకమైన ఏకాంతంలో, నిశ్శబ్దంలో ఆమె కళ్లు చిత్రమైన నమ్మకంతో విషాదంతో నిశ్చలమై అతన్ని అశక్తుణ్ని చేశాయి. కాసేపాగి అసంకల్పితంగా అడిగాడతను.“కోర్టుకి రాకుండా ఏం చేస్తావు?”అతన్ని చూస్తూనే అన్నదామె, “నే కోర్టుకి బోను సార్. ఈణ్ణుంచి పోయి డబ్బు తీసుకుని వెంబడే వెళ్లిపోతాను. రెయిడ్ లేకుంటే ఈ పాటికి చానా దూరం పోయేదాన్ని సార్.”ఒకసారి కళ్లు మూసుకుని ఆఖరి దమ్ములాగి సిగరెట్టు అవతల పారేసి రెడ్డిఆమెవైపు చూశాడు. ఆమె కళ్లు తిప్పుకోవడం లేదు. మనుషులు లేని చోట ఒంటరిగా చెరువులోకి దూకినట్టనిపించింది. బయటపడేసరికి సునాయాసంగా ఆమె చూపులు అతని ఖాకీ బట్టల్ని ఉల్లిపొరలా విడదీశాయి. ఆమె మాటల్ని ఎందుకు వింటున్నాడో అతనికి తెలియలేదు. అతని నోరు పెగిలేసరికి అతని కంఠంలోని తీవ్రత వేపగాలిలో కలిసిపోయింది.“బేబీ కంపెనీ ఒదిలి పారిపోదావనుకున్నావా!” “అవును సార్.” “ఏం?” “నే వెళ్లిపోవాల సార్… ఈ పని చెయ్యను.” “సత్తెనపల్

S2 Ep 306‘తెరిచున్న కిటికీ’: మూలం - హెక్టర్ హ్యూగో మన్రో (Saki) రాసిన ‘The Open window’
‘తెరిచున్న కిటికీ’: మూలం - హెక్టర్ హ్యూగో మన్రో (Saki) రాసిన ‘The Open window’(https://americanliterature.com/author/hh-munro-saki/short-story/the-open-window)“అత్తయ్య ఇప్పుడే వచ్చేస్తుందండీ, ఈలోపల నా కంపనీ భరించాలి మీరు” అంది ఆ పదిహేనేళ్ల యువతి నవ్వుతూ, కొత్త మనిషిని కలుస్తున్నాను అన్న బెరుకేవీ లేకుండా. వాళ్ళ అత్త రాక ప్రాముఖ్యతని తక్కువ చేయకుండా, ఈ అమ్మాయిని పొగుడుదామని కొంత ఉత్సాహపడ్డాడు, ఫ్రాంటన్ నట్టెల్. నిజానికి, ఇలా ఒకరి తర్వాత ఒకర్ని, కొత్తవాళ్ళని కలవడం అతనికంత గొప్ప ఐడియాలా అనిపించడంలేదు. తన నరాల వ్యాధి తగ్గడానికి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందో అర్థం కావడం లేదు. పల్లె ప్రాంతంనికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని ఏర్పాట్లు చేసుకుంటూంటే, వాళ్ళ అక్కయ్య అంది, “నాకు బాగా తెల్సు. నువ్వు అక్కడికెళితే, ముసుగేసుకుని ఎవ్వరినీ కలవకుండా మూలుగుతూ కూర్చుంటావు. ఆ ఒంటరి బతుక్కి, నరాలు ఇంకా బలహీనపడతాయి. నాకు తెల్సిన వాళ్లందరికీ ఉత్తరాలు రాసిస్తాను. నా మాట విని, వాళ్ళని కలుస్తూ వుండు. నాకు తెల్సినంతమటుకు వాళ్ళందరూ మంచి మనుషులు. నిన్ను ఇబ్బంది పెట్టరు .”ఫ్రాంటన్ కి అనుమానం వచ్చింది, ‘తను కలవబోయే మిసెస్ సాపిల్టన్, ఈ ‘మంచి’ అనబడే కాటగిరీలో ఉందా?’ అని. అతను కొంత కుదురుకున్నాడు అని నిర్ధారించుకుని , “మీకీ చుట్టుపక్కల చాలా మంది తెల్సా?” అని అడిగింది ఆ అమ్మాయి. “ఒక్కరు తెలిస్తే ఒట్టు. ఓ నాలుగేళ్ళ క్రితం అనుకుంటా, మా అక్కయ్య ఇదే ఊళ్ళో, పాస్టర్ గారింట్లో కొన్నాళ్ళుండింది. తనకు పరిచయం ఉన్నవాళ్ళని కలవమని కొన్ని ఉత్తరాలు రాసిచ్చింది.” అని బదులిచ్చాడు, చివరి వాక్యం మటుకు పట్టి పట్టి ఉచ్ఛరిస్తూ. “అయితే మా అత్తయ్య గురించి కూడా మీకేవీ పెద్ద తెలిసుండదే?” నింపాదిగా అడిగింది ఆ అమ్మాయి. “ఆమె పేరు, అడ్రస్ మాత్రం తెల్సు” అంటూ అనుకున్నాడు, ‘అసలు ఈ మిసెస్ సాపిల్టన్ గారికి పెళ్లయిందా? భర్త వున్నాడా? లేడా?, ఈ రూమ్ చూస్తూంటే మటుకు కొన్ని మగవాసనలు కనపడుతున్నాయి, అని. “ఆమె జీవితంలో మూడేళ్ళ క్రితం ఒక పెను ప్రమాదం జరిగింది, మీ అక్కయ్య గారు అప్పుడు ఇక్కడుండరు.” అంది ఆ పిల్ల. “ఏవిటీ” ఉలిక్కిపడి అడిగాడు ఫ్రాంటన్, ఇలాటి ప్రశాంతమైన పల్లెటూళ్లలో ప్రమాదాలా ? అని లోపల ఆశ్చర్యపోతూ . “ మీకు విచిత్రంగా లేదూ! ఈ చలికాలంలో, అలా ఆ కిటికీ తెరిచిపెట్టటం” అందా అమ్మాయి, అక్కడ తెరిచున్న ఒక పెద్ద ఫ్రెంచి కిటికీ ని చూపిస్తూ. దాదాపు తలుపంత సైజులో ఉండే ఆ కిటికీలోంచి, ఇంటి ముందరున్న లాన్ కనపడుతోంది. “గదిలో వెచ్చగానే వుంది. అది సరే! ఆ కిటికీకి, ప్రమాదానికీ సంబంధం ఏదన్నా ఉందా ఏవిటి కొంపదీసి?”“మూడేళ్ళక్రితం ఇదే రోజు, ఆవిడ భర్త, ఇద్దరు తమ్ముళ్లూ, అదే కిటికీలోంచే బయటకు దిగి, ఉల్లంకి పిట్టని వేటాడ్డానికెళ్లారు. వెళ్ళినవాళ్ళు అంతే! ఇంక తిరిగిరాలేదు. ఓ చిత్తడి నేల దాటుతూ పొరపాట్న ఒక భయంకరమైన ఊబిలో కూరుకుపోయారు. ఆ వేసవంతా, ఆగకుండా వర్షాలు పడ్డం వల్ల మామూలుగా గట్టిగా వుండే నేల కూడా, ఒక్కోచోట మెత్తబడి పోయింది. అన్నిటికంటే భయంకరవైన విషయం, పాపం! ఆఖరికి వాళ్ళ శవాలు కూడా దొరకలేదు” ఆ అమ్మాయి గొంతులో అప్పటిదాకా ధ్వనించిన స్థైర్యం బదులు తడబాటు తెలుస్తోంది. “పిచ్చి అత్తయ్య, ఇప్పటికీ అలవాటు ప్రకారం వాళ్ళు ఆ కిటికీలోంచే వెనక్కొస్తారనీ, వాళ్ళతో పాటూ కనిపించకుండా పోయిన బూడిద రంగు కుక్కపిల్ల కూడా తిరిగొస్తుందనీ, ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకనే ప్రతి రోజూ, రాత్రి బాగా చీకటి పడే దాక , ఆ కిటికీ అలానే తెరిచి ఉంచుతుంది. పాపం! నాకు ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పింది, ఎలా వేటకి బయలుదేరారో? మావయ్య తెల్లటి వాటర్ ప్రూఫ్ కోటు వేసుకుని, వాళ్ళ తమ్ముడు రోనీ ఏమో , ఈమెని ఎపుడూ ఏడిపించడానికి పాడే పాట ఒకటి ‘బెర్టీ బెర్టీ’ అని పాడుకుంటూ. నిజం చెప్పొద్దూ! ఒక్కోసారి, ఇలాంటి సాయంకాలం పూట, వాళ్ళు ఆ కిటికీలోంచి ఇంటి లోపలికి వచ్చేసినట్టు అనిపించి, నాకు ముచ్చెమటలు పోస్తాయి.” ఆ అమ్మాయి కంఠంలో చిన్న వణుకు కనిపిస్తోంది. మాట్లాడ్డం ఉన్నట్టుండి ఆపేసింది ఆ అమ్మాయి. గబగబా రూంలోకి వచ్చిన వాళ్ళ అత్తయ్యని చూసి ఊపిరి పీల్చుకున్నాడు ఫ్రాంటన్. తను లేటుగా వచ్చినందుకు ఓ వందసార్లు క్షమాపణ కోరింది మిసెస్ సాపిల్టన్. “మా వేరా కబుర్లు బానే చెప్పిందా? ” అడిగింది ఆవిడ. “వూ. టైమే తెలియలేదు” అన్నాడు ఫ్రాంటన్. “ ఆ తెరిచున్న కిటికీ వల్ల మీకేవీ ఇబ్బంది కలగలేదుగా? వేటకెళ్లిన ప్రతిసారీ, మా ఆయన, తమ్ముళ్లు, నేరుగా ఆ కిటికీలోంచే ఇంట్లోకి వస్తారు. చిత్తడి నేలల్లోకిఉల్లంకి పిట్టని వేటాడ్డానికి వెళ్లారు,. ఆ బురద కాళ్లతో లోపలికొచ్చి, నా కార్పెట్ అంతా పాడు చేస్తారు. మీ మగాళ్లంతా ఇంతే. అవునా?” అంటూ ఉత్సాహంగా, వేటాడ్డం గురించి, పక్షులు ఎక్కువ కనపడకపోవడం గురించి, చలికాలంలో బాతుల వేట గురించి చెబుతూ పోయింది. ఫ్రాంటన్కు మటుకు ఇదంతా వింటూంటే వొంట్లో వణుకు మొదలైంది. ఇలాటి భయంకరమైన విషయాలు కాకుండా వేరే మామూలు విషయాలవైపు సంభాషణ మళ్లిద్దాం, అని కొంత ప్రయత్నం మొదలెట్టాడు. తనతో అన్యమనస్కంగా ఏదో మాట్లాడుతోంది కానీ, ఆవిడ ధ్యాసంతా ఆ కిటికీ మీద , కిటికీ అవతలున్న లాన్ మీదే ఉందని, అతనికి అర్థమౌతోంది. “నిజంగా ఎంత దురదృష్టం కాకపోతే, సరిగ్గా వాళ్ళు పోయిన ఈ దౌర్భాగ్యపు రోజునే, ఈ ఇంటికి రావాల్సొచ్చింది” అనుకున్నాడు మనసులో . “పూర్తిగా విశ్రాంతి తీసుకోమని, అలిసిపోయేట్టు శరీరాన్ని శ్రమ పెట్టొద్దనీ, ఉద్రేకానికి లోనయ్యే విషయాలకి దూరంగా ఉండమనీ డాక్టర్లు అందరూ ఒకే సలహా ఇచ్చారు. ఆహారం విషయంలో మటుకు ఒక్కో డాక్టరు ఒక్కో విధంగా చెప

S2 Ep 305కూపే (ఆంగ్ల మూలం : రేమండ్ కార్వర్ రాసిన 'Compartment')
ae30HCvSxkXmzvGvXUuL‘కూపే’ ( మూలం: రేమండ్ కార్వర్ కథ ‘కంపార్ట్మెంట్’)అమెరికన్ రచయిత రేమండ్ కార్వర్ కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన రచనల్లో ‘Compartment’ ఒకటి. కథాంశం ఎనిమిదేళ్లుగా దూరమైన కొడుకుని కలవడం కోసం మేయర్స్ అనే వ్యక్తి చేసే ప్రయాణం. సంభాషణల ద్వారా లేదా రచయిత జోక్యం ద్వారా కాకుండా, మేయర్స్ మనసులో ఆలోచనలూ, అతని చుట్టూ కనపడుతున్న వాతావరణం లో అతను గమనించే విషయాలూ వీటి గురించి క్లుప్తంగా ప్రస్తావిస్తూ కథను ముందుకు తీసుకెళ్తారు రచయిత. మేయర్స్ వ్యక్తిత్వాన్ని తేటతెల్లంగా మన ముందుంచడానికి రచయిత చేసిన ప్రయత్నం ప్రతి వాక్యంలో కనపడుతుంది. కథలో అప్రస్తుతం అని మనకనిపించే రచయిత ఇచ్చిన కొన్ని వివరాలు , ప్రయాణంలో క్రమంగా అతని ఆలోచనలో వచ్చిన మార్పుని, ముగింపునీ మనం అర్థం చేసుకోడానికి వుపయోగపడతాయి. ఉదాహరణకి కథలో మేయర్స్ చూసిన కలిసిన ప్రతి వ్యక్తి మేయర్స్ కు తెలీని భాషలో మాట్లాడతారు. ఇది మేయర్స్ వ్యక్తిత్వంలో ఉన్న ఇబ్బందిని మనకు సూచిస్తుంది.ముగింపు తెల్సుకుని మరిచిపోయే కథ కాదు ‘కంపార్ట్మెంట్’. కథపై మీ ప్రతిస్పందన తెలియజేయడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి. ‘కూపే’:మేయర్స్ మొదటి తరగతి కూపేలో ప్రయాణిస్తున్నాడు. ఫ్రాన్సులోని స్ట్రాస్బెర్గ్ యూనివర్సిటీ లో చదువుతున్న కొడుకుని కలవడానికి ఈ ప్రయాణం. కొడుకుని చూసి ఎనిమిదేళ్లయింది. ఆ అబ్బాయి తల్లితో మేయర్స్ విడిపోయిన తర్వాత ఈ ఎనిమిదేళ్లలో ఫోన్లో వాళ్ళిద్దరూ ఎన్నడూ మాట్లాడుకోలేదు. కనీసం ఓ ఉత్తరం ముక్క కూడా లేదు… . కొడుకు తల్లితోనే ఉంటున్నాడు. వాడి పాడు జోక్యం వల్లే, చివరన తామిద్దరం అంత తొందరగా విడిపోయావని మేయర్స్ గట్టి నమ్మకం. తమ పెనుగులాటలో వాడు తన మీదకి దూకినప్పుడే ఆఖరు సారి వాణ్ణి చూడ్డం. పక్కనే నించుని తన భార్య ఒక్కొక్కటిగా పింగాణీ గిన్నెలు ముందు గదిలోకి విసరడం మొదలెట్టి, కప్పుల మీదికొచ్చింది. తాను “ఇంక ఆపేయ్” అని గట్టిగా కేక పెట్టడంతో, వాడు ఒక్క ఉదుటున మీదికి వచ్చేసాడు. మేయర్స్ గబుక్కున పక్కకు జరిగి, వాడి తలను తన చంకకీ చేతులకీ మధ్య గట్టిగా ఒడిసిపట్టుకున్నాడు. వాడు ఏడుస్తూ, మేయర్స్ వీపు మీద, పొత్తికడుపు మీద ఆపకుండా గుద్దేసాడు. మేయర్స్ పట్టిన పట్టు విడవకుండా, అందిన కొద్దీ చితక బాదేశాడు. వాణ్ణి దడాల్న వెనక్కి తోసి, గోడకి అదిమిపెట్టి, చంపుతానని బెదిరించాడు. చంపేసేవాడేమో ఆ కోపంలో.. . తను అప్పుడు ఏవన్నాడో ఇంకా గుర్తుంది, “ నీకీ బతుకిచ్చిందే నేను, వెనక్కి తీసుకోగల్ను కూడా , జాగర్త”ఆ భయానక దృశ్యం తల్చుకుని ఒక్కసారి మేయర్స్ గట్టిగా తల విదిలించాడు, అదేదో ఇంకెవరికో జరిగిన సంఘటనలా. అవును…. తాను కూడా ఇంతకు మునుపులా లేడు. ఒంటరిగా బతుకుతున్నాడు. తన పనేదో తను చూసుకుంటూ, వేరే ఎవ్వరితో సంబంధం లేకుండా. రాత్రి పూట శాస్త్రీయ సంగీతం వింటూ, ‘నీటి పక్షులకు ఉచ్చులు ఎలా తయారు చేయాలి’ అనే విషయం మీద పుస్తకాలు చదువుకుంటూ పొద్దు పుచ్చుతున్నాడు. తలుపుకు అవతల సీట్లో కూర్చోనున్న వ్యక్తి తన టోపీని కళ్ళ మీదకు లాక్కుని నిద్ర పోతున్నాడు. మేయర్స్ అదేవీ పట్టించుకోకుండా, సిగరెట్ వెలిగించి, తదేక దృష్టితో కిటికీలోంచి బయటికి చూడ్డం మొదలుపెట్టాడు. అపుడపుడే తెల్లవారుతోంది. పక్కనించీ వెళ్లిపోతున్న పచ్చని పొలాల మీద పొగమంచు పల్చని తెర కప్పింది. అక్కడక్కడా పొలాల మధ్యలో కట్టుకున్న బంగళాలూ, వాటి చుట్టూ కట్టిన ప్రహరీ గోడలూ. ‘ఇలాంటి ఇళ్ళల్లో బావుంటుంది, పాత కాలం ఇల్లూ, చుట్టూ వుండే పెద్ద గోడ.’ అనుకున్నాడు మేయర్స్. టైము ఆరుగంటలు దాటింది. ముందు రోజు రాత్రి పదకొండు గంటలకి మిలాన్ లో రైలు ఎక్కినప్పట్నించీ నిద్రే పోలేదు. రైలు మిలాన్ స్టేషన్ దాటిన తర్వాత అనుకున్నాడు ‘ అదృష్టం.. కూపే లో నేనొక్కణ్ణే!’. లైటుంచి, టూరిస్టు గైడు పుస్తకాలు తిరగేయడం మొదలెట్టాడు. ఇటలీలో ఏమేం చూసుండొచ్చో, చేసుండొచ్చో అర్థం అవుతోంది. ఇటలీకి రావడం ఇదే మొదటి, ఆఖరిసారి కచ్చితంగా. వదిలివెళ్లే సమయంలో ఆ దేశం గురించి తెలుసుకోడం .. కొంత బాధగానే వుంది. పుస్తకాలు సూటుకేసులో ఉంచి, సూటుకేసు పై అరలో పెట్టాడు. కోటు బయటికి తీసి దుప్పటిలా కప్పుకున్నాడు. లైటు ఆర్పేసి, నిద్ర పడుతుందన్న ఆశతో, కూపే చీకట్లో అలా కళ్ళు మూసుకు కూర్చున్నాడు. చాలా సమయం గడిచిపోయింది అనిపించింది. సరిగ్గా నిద్ర పట్టే సమయంలో, రైలు నడక మందగించడం మొదలైంది. రైలు బాసెల్ అవతల వుండే ఒక చిన్న స్టేషన్లో ఆగింది. ఒక నడివయసు మనిషి , తల మీద టోపీ తో, ముదురు రంగు కోటు వేసుకుని, కూపేలోకి ప్రవేశించాడు. మేయర్స్ తో, తెలీని భాషలో ఏదో మాట్లాడి , తనతో పాటూ తీసుకొచ్చిన లెథర్ బాగ్ పక్కన పెట్టాడు. కూపేలో అవతలి వైపు కూర్చొని భుజాలు తిన్నగా చేసుకున్నాడు. టోపీ కళ్ళమీదకి లాక్కుని, రైలు కదిలే లోపలే, సన్నని గురకతో నిద్ర పోవడం మొదలుపెట్టాడు. మేయర్స్ కి అతన్ని చూస్తే అసూయ కలిగింది. కొంతసేపటి తర్వాత ఒక స్విస్ ఆఫీసర్ కూపే తలుపు తెరిచి, లోపలికొచ్చి లైటు వేసి పాస్ పోర్టులు చూపించమని అడిగాడు,ఇంగ్లీషు తో పాటూ ఇంకేదో భాషలో కూడా (జర్మన్ అయుండొచ్చు). మేయర్స్ తో పాటూ కూపే లో కూర్చొని వున్న వ్యక్తి, టోపీ వెనక్కి తోసి,కళ్ళు చిట్లించి, కోటు జేబులో చేయ్యిపెట్టాడు. ఆఫీసర్ అతని పాస్ పోర్ట్ పరిశీలించి, అతడి వైపు నిశితంగా చూసి, వెనక్కి తిరిగి ఇచ్చేసాడు. మేయర్స్ తన పాస్పోర్ట్ ఇస్తే, అందులో వున్న సమాచారం చదివి, ఫోటోని పరికించి, మేయర్స్ వైపు చూసి, తల ఆడించి, వెనక్కి ఇచ్చేసాడు. వెళ్ళబోతూ లైట్ ఆపేసాడు. మేయర్స్ ఎదురుగా కూర్చుని వున్న వ్యక్తి టోపీ కళ్ళమీదకి లాక్కుని, కాళ్ళు జాపుకున్నాడు. ‘ఇతను వెంటనే నిద్ర పోతాడు’ అనుకున్నాడు మేయర్స్ తిరిగి అసూయ

S2 Ep 304వర్షంలో పిల్లి : (ఆంగ్లమూలం 'Cat in the Rain' by Ernest Hemingway)
‘ వర్షంలో పిల్లి’ , ఈ కథకు అనువాదకులు శ్రీ పతంజలి శాస్త్రి గారు. కథకు ఆంగ్ల మూలం ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన ‘Cat in the Rain’. కథకు అనువాదంతో పాటూ , కథ గురించి వారు ఇచ్చిన వివరణ కూడా ఇదే పేజీలో చదవవొచ్చు.‘వర్షంలో పిల్లి’: తెలుగు అనువాదం – పతంజలి శాస్త్రి (‘Cat in the Rain’: ఆంగ్ల మూలం – ఎర్నెస్ట్ హెమింగ్వే)ఆ హోటల్లో ఇద్దరే అమెరికన్లు దిగేరు. వాళ్ళ గదిలోకి వెళ్తూ, మెట్లెక్కి దిగుతున్నప్పుడు తారసపడే వాళ్ళెవ్వరూ తెలీదు వాళ్ళకి. ఎదురుగా సముద్రం కనిపించే రెండో అంతస్థులో గది వాళ్ళది. పార్కు, వార్ మెమోరియల్ కూడా కనిపిస్తుంది అక్కణ్ణించి. పార్కులో పెద్ద కొబ్బరిచెట్లు, ఆకుపచ్చని బెంచీలు. వాతావరణం బాగున్నప్పుడు ఎప్పుడూ ఎవరో ఒక చిత్రకారుడు సరంజామాతో వుంటాడక్కడ. పెరిగిన కొబ్బరిచెట్లూ, పార్కులు, సముద్రం, ఎదురుగా మెరుస్తున్న హోటళ్ల రంగులూ, చిత్రకారులు ఇష్టపడతారు. వార్ మెమోరియల్ చూడ్డానికి దూరంనించి ఇటాలియన్లు వస్తారు. కంచు పోతపోసిన మెమోరియల్ వర్షంలో మెరుస్తోంది. వర్షం పడుతోంది. కొబ్బరి చెట్ల మీదనించి జారుతోంది. కంకరరోడ్ల మీద నీళ్లు మడుగులు కట్టేయి. పొడవుగా వర్షంలో విరిగిపడుతూ, తిరిగి వెనక్కి జారుతూ,మళ్ళీ తీరం మీదికి పొడుగు గీతలా విరిగి పడుతోంది సముద్రం. వార్ మెమోరియల్ చౌరస్తా దగ్గిర కార్లు వెళ్లిపోయాయి. అవతల హోటలు గుమ్మంలో ఖాళీ చౌరస్తా చూస్తూ నుంచున్నాడు హోటలు వెయిటరు. బయటకు చూస్తూ కిటికీ పక్కన నుంచుంది అమెరికన్ గృహిణి. బయట సరిగ్గా కిటికీ కింద ఒక పిల్లి. అది వర్షపు నీళ్లు కారుతున్న ఆకుపచ్చ టేబిలు ఒకదాని కింద నించుంది. వర్షం మీద పడకుండా, సాధ్యమైనంత ముడుచుకుపోవడానికి ప్రయత్నిస్తూ వుంది. “కిందికి వెళ్లి ఆ పిల్లిని తెస్తున్నాను” అందామె. మంచం మీంచి ఆమె భర్త “ ఒద్దు. నేను వెళ్లి తెస్తాలే” అన్నాడు. “కాదు. నే తెస్తాను. ఆ టేబిలు కింద తడిసిపోకుండా కూచోడానికి ప్రయత్నిస్తోంది పాపం.”మంచం కాళ్ళ వేపు రెండు దిండ్ల మీద ఆనుకుని, మళ్ళీ చదువులో పడ్డాడు భర్త. “తడవకేం” అన్నాడతను. ఆమె కిందికి వెళ్ళింది. ఆఫీసు గది దాటుతుండగా, హోటల్ మేనేజర్ లేచి ఆమెకి గౌరవంగా తల వంచాడు. అతని టేబిలు ఓ చివర వుంది. పొడవాటి వృద్ధుడతను. “వర్షం పడుతోంది” అందామె. యజమాని అంటే అభిమానం ఆమెకి. “అవును మేడమ్. ఏమీ బాగా లేదు. పాడు వాతావరణం.”గదిలో టేబిలు వెనక నుంచున్నాడతను. ఆమెకి నచ్చుతాడతను. ఫిర్యాదులు తీసుకునేటప్పుడు తీవ్రంగా పెట్టే అతని గంభీరమైన ముఖం ఆమె కిష్టం. అతని హుందాతనం ఆమెకిష్టం. ఆమెకి సేవలందించటానికి అతను చూపించే ఉత్సాహం ఆమెకిష్టం. అసలు అతను హోటలు మానేజర్ గా ఎట్లా వుండాలనుకుంటాడో అదామెకిష్టం. పెద్దతనంతో భారీగా వుండే ముఖం, అతని పెద్ద చేతులు, ఆమెకిష్టం. అతని గురించి ఆలోచిస్తూనే , తలుపు తీసి బయటికి చూసిందామె. గట్టిగా పడుతోంది వాన. రబ్బరు కోటు వేసుకుని ఒక వ్యక్తి చౌరస్తా దాటుతూ హోటలు వేపు వస్తున్నాడు. కుడివైపు ఎక్కడో ఉంటుంది పిల్లి. సన్ షేడ్ల కిందినించి బహుశా తను వెళ్లగలదేమో. గుమ్మంలో నుంచుని ఉండగానే తన వెనక గొడుగు తెరుచుకుంది. వాళ్ళ గది శుభ్రం చేసే అమ్మాయి. “మీరు తడవకూడదు” ఇటాలియన్ మాట్లాడుతూ చిరునవ్వింది. హోటలు మేనేజర్ పంపించాడన్నమాట. ఆ అమ్మాయి పట్టుకున్న గొడుగు కింద ఆమె కంకర బాట కింద నడుస్తూ వాళ్ళగది కిటికీ కిందికి వచ్చిందామె. వర్షంలో శుభ్రమై పచ్చగా మెరుస్తూ టేబిలు వుంది గానీ, పిల్లి వెళ్ళిపోయింది. హఠాత్తుగా ఆమెకి ఏదో నిరాశ కలిగింది. అమ్మాయి ఆమెని చూసి అంది, “ మీరేవన్నా పోగొట్టుకున్నారా?”“ఒక పిల్లి వుంది”“పిల్లి”“అవును”“పిల్లి? వర్షంలోనా” నవ్విందాఅమ్మాయి. “ ఊ.టేబిలు కింద” అని మళ్ళీ అందామె, “దాన్ని ఎంతో కావాలనుకున్నాను. ఆ పిల్లి కావాలి నాకు.”ఆమె ఇంగ్లీషులో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి ముఖం బిగుసుకుంది. “ రండి మేడమ్. లోపలికి వెళ్దాం. తడుస్తారు మీరు.” అంది. “అవును గదా” అందామె. మళ్ళీ కంకర కాలిబాటలో నడుచుకుంటూ లోపలి వచ్చేరు. పనమ్మాయి గొడుగు ముడవడానికి గుమ్మం దగ్గర ఉండిపోయింది. అమెరికన్ అమ్మాయి ఆఫిసు దాటుతూండగా మేనేజర్ తలవంచాడు. ఆమెకు తనలో ఏదో కుచించుకుపోయినట్టై, కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తను ఒక అల్పప్రాణిలా, అదే సమయంలో ఒక ముఖ్యమైన వ్యక్తిలా, అనిపించేలా చేస్తాడు అతను. ‘తాను చాలా ప్రాధాన్యత గల మనిషిని’ అనే ఒక క్షణికమైన భావన కల్గుతుంది. మెట్లెక్కి వెళ్లిపోయిందామె. గది తలుపు తీసుకుంది. మంచం మీద జార్జి పడుకుని చదువుకుంటున్నాడు. పుస్తకం కిందపెడుతూ అడిగేడతను. “పిల్లి దొరికిందా”?“అది వెళ్ళిపోయింది”“ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా!” చదివిన అలిసిన కళ్ళకి విశ్రాంతినిస్తూ అన్నాడతను. ఆమె మంచం మీద కూచుంది. “దాన్ని ఎంతో కావాలనుకున్నాను. ఎందుకంతకావాలనుకున్నానో తెలీదు. పాపం ఆ పిల్లి కావాలనిపించింది. వర్షంలో తడుస్తూండడం ఏం సరదా దానికి . ?”జార్జి మళ్ళీ చదువుకుంటున్నాడు. ఆమె వెళ్లి డ్రెస్సింగ్ టేబిలు అద్దం ముందు కూచుని చేతి అద్దంలో ముఖం చూసుకుంటోంది. ముందు ఆ పక్కనించి తరువాత రెండో వేపు నించి, తల వెనక భాగం, కంఠభాగం పరిశీలించింది. ఒక వేపు ముఖాన్ని చూసుకుంటూ అడిగిందామె. “జుట్టు బాగా పెరగనివ్వడం బాగానే ఉంటుందంటావా?”కళ్ళెత్తి ఆమె మగవాళ్ళ లాగ దగ్గిరిగా కత్తిరించుకున్న జుట్టు చూసి అన్నాడు. “అలా ఉంటేనే ఇష్టం నాకు.”“విసుగెత్తి పోయింది నాకు. మగపిల్లాడిలా కనిపించడం విసుగ్గా వుంది.”“చక్కగా ఉంటావు నువ్వు” అన్నాడతను. డ్రెస్సింగ్ టేబిలు మీద అద్దం పెట్టి కిటికీ దగ్గరికి వెళ్లి బయటకి చూస్తూ నుంచుందామె. చీకటి పడుతోంది. మంచం మీద జరిగి కూచున్నాడు జార్జి. ఆమె మాట్లాడ్డం మొదలుపెట్టినప్పట్నుంచి తదేకంగా ఆమెనే చూస్తున్నాడతను. “జుట్టు వెనక్కి దువ్వుకుని, చిక్కగా మెత్తగా, పెద్ద కొప్పు నాకు తగులుతూ ఉండాలి. ఒళ్ళో ఓ పిల్లి ఉండాలి, తాకినప్పుడల్లా మ్యావు మంటూ.” అందామె. “అలాగా?” అన్నాడు పక్క మీ

S2 Ep 303నల్లజర్ల రోడ్డు (3/3) - తిలక్ గారి కథ
నల్లజర్ల రోడ్డు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ కథ మూడు భాగాలుగా ప్రసారం చెయ్యడం జరుగుతుంది.ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodaya‘This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 302నల్లజర్ల రోడ్డు (2/3) - తిలక్ గారి కథ

S2 Ep 300నల్లజర్ల రోడ్డు (1/3) - తిలక్ గారి కథ
నల్లజర్ల రోడ్డు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ కథ మూడు భాగాలుగా ప్రసారం చెయ్యడం జరుగుతుంది.ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodaya‘“నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు”. అవధానిగారు యిలాగ అనేటప్పటికి మేమందరం పక్కున నవ్వాం. .కొవ్వొత్తి దీపపు వెలుతురులో ఆయన గడ్డంలోని తెల్ల వెంట్రుకలు వెండిదారాల్లా మెరిసాయి.“చంద్రుడూ వెన్నెలా ఎప్పుడూ మనోల్లాసంగా హాయిగా ఉంటాయని మీ అభిప్రాయం. కాని ఒక్కొక్క పరిస్థితిలో ఎంత భయ పెడతాయో మీకు తెలియదు” అన్నారు మళ్ళీ.“చెప్పండి. మీరేదో కథ చెబుతారని తెలుస్తూనే వుంది. వినటానికి సిద్ధంగా ఉన్నాం” అన్నాను నేను.“ఈ రాత్రికింక లైట్లురావు. ఎక్కడో తీగ తెగిపోయి వుంటుంది.” అన్నాడు నారాయణ.. –“తోట అంతా చీక టైపోయింది” అన్నాడు నెర్వస్ గా ఆచారి. అస్థిమితంగా చేతివేళ్లతో బల్లమీద ఆదితాళం వేస్తున్నాడు. “ఇంకా – కొవ్వొత్తులున్నాయాండీ!” అని అడిగాడు. అవధానిగారు తల వూపారు – ఉన్నాయన్నట్టు“ఈ తోటా, తోటలో మీ బంగళా, మీరు చేసిన విందూ – ఓహ్! మరిచిపోలేం” అన్నాడు నారాయణ.“వూరికి యింతదూరంగా యీ తోట వుండడమే అంత ‘ బాగా లేదు” అన్నాడాచారి.“చెప్పండి కథ” అన్నాను నేను. “కథా!” నిరసనగా చూశారు – అవధానిగారు.“అదే! అదే! మీ చిన్నప్పుడు జరిగిన సంఘటన….” అని సర్దుకున్నాను. అవధానిగారు కవీకాదు; కథకుడూ కాదు.. జీవితాన్ని నిండుగా సూటిగా జీవించిన మనిషి. హృదయమూ, చమత్కారమూ, ఆలోచనా ఉన్నవాడు. వీటికి తోడు విచిత్రంగా విరుద్దంగా బాగా డబ్బున్నవాడు. . ఆయన చెప్పడం మొదలు పెట్టారు.“ఏలూరులో చూసుకోవాల్సిన పని అంతా అయిపోయింది. ప్లీడరు గారు పక్కలు ఏర్పాటు చేయిస్తానన్నా వినక, కారు స్టార్టు చేశాడు రామచంద్రం, పది గంటలు దాటింది రాత్రి. నాగ భూషణం మామయ్యా, నేనూ వెనకాల సీటులో కూర్చున్నాం. ప్లీడరుగారు – కారు దగ్గరకి వచ్చి”నా మాట విన్నారు కాదు” అన్నారు. “అబ్బే ఎంత సేపండీ, సరీగ్గా తొక్కితే ఒక్క గంటన్నరలో తణుకులో పడతాం. మీరేం యిదవకండి” అన్నాడు రామచంద్రం.– “అమ్మమ్మ! ఎంత మాట! కలక్టరుగారింట్లో శుభ • కార్యమంటే వేరే చెప్పాలా! ” అన్నారు ప్లీడరుగారు … యావద్విషయాన్నీ గ్రహించిన వారై.కారు సాగింది.“అప్పటికి నాకు పద్దెనిమిదేళ్ళు. అప్పటికి – మీ రెవరూ పుట్టివుండరు” అన్నారు – అవధానిగారు మా అందరికేసి చూసి.“అటువంటి ప్రమాదం సంభవించే సూచనలు కూడా వాతావరణంలో ఉండి ఉండవండి” అన్నాడు నారాయణ. తోటలో గలగల చప్పుడయింది. ఆచారి ఉలిక్కిపడి “దొంగలేమో” అన్నాడు.“పక్షులు చెట్లలో కదులుతున్నాయి. అంతే” అన్నారు అవధానిగారు.కథలోకి రండి” అన్నాను నేను. . “అంటే….. ” కోపంగా చూశారు అవధానిగారు. “అదేనండీ, మీ చిన్నప్పటి….”అవధానిగారు చిన్నగా నవ్వి గడ్డం చేత్తో ఒక్కసారి సవరించుకున్నారు. కొంచెం ముందుకు వంగి యిలా చెప్పసాగారు.-ఆరుమైళ్ళు వచ్చేటప్పటికి కారు ఆగిపోయింది. రామ చంద్రం దిగి బానెట్ చూశాడు. ” ఇది వెధవ కారులా వుంది. నడచి వెనక్కి పోదాం పద. ఎందుకేనా మంచిది” అన్నాడు నాగభూషణం మామయ్య.“అర్జునుడు గాండీవాన్ని తిట్టినా సహిస్తాడేమోగాని యీ కారుని తిడితే మాత్రం నే నూరుకోను. అసలీ యింజనులాంటిది ఇండియాలో వుండదు” అన్నాడు రామచంద్రం.“అందుకే ఆరుమైళ్ళకే ఆగిపోయింది” మామయ్య విసుగ్గా అన్నాడు. “డొక్కు కార్లు కొనకురా , అంటే విన్నావ్? సెకండ్ హాండ్ వి కొనవల్సిన ఖర్మ నీకే మొచ్చింది? మనమాట ఎలాగున్నా వీణ్నికూడా మనతో తీసుకువచ్చాం. కర్మ! వీడు ఎనిమిది గంటలకి పడుకోకపోతే మా అక్కయ్య ఎనిమిదిమంది డాక్టర్లని ఒకేసారి పిలిచి చూపెడుతుంది” అన్నాడు నన్ను ద్దేశించి.“ఏం భయంలేదు మామయ్యా. రాత్రిళ్ళూ ,కార్లలో , ప్రయాణం చెయ్యడం నాకు సరదా” అన్నాను నేను.రామచంద్రం మావూళ్ళో పెద్ద టెన్నీస్ ఛాంపియన్. – పొడుగ్గా, బలంగా, హుషారుగా వుంటాడు. మా, వూరి క్లబ్బుకి , సహాయ కార్యదర్శి, సేవాసదనానికి గౌరవాధ్యక్షుడు. ఆ సదనం ఏమిటో, యేం చేసేదో యిప్పటికీ నాకు తెలియదు. ఇటువంటి సంస్థల ప్రత్యేకత ఇదే కాబోలు. రామచంద్రానికి కాలవ వొడ్డున పెద్ద మేడ వుంది. మేడలో అతనికొక భార్యా కుమారరత్నమూ , కూడా వున్నారు. అతను భార్య నెక్కువ ప్రేమిస్తాడో భార్య పేర ఆమె తండ్రి వ్రాసి యిచ్చిన ముప్పేనాలుగెకరాల్నీ ఎక్కువ ప్రేమిస్తాడో తెలియక, తేలక జిజ్ఞాసువులు చాలామంది బాధపడే వారు పాపం. మా నాగభూషణం మామయ్యకి వరుసకి బావ అవుతాడో బావమరది అవుతాడో – యిటువంటి భోగట్టా నాకు సరీగా తెలియదు. మా ఆవిడకి తప్ప – అసలు నాగభూషణం నాకు వేలు విడిచిన మేనమామ; అందరమూ ఒకే ఊళ్ళో వుండ డమూ, రాకపోకలూ, శుభకార్యాలూ, మంచి చెడ్డల్లో ఒకరినొకరు ఆదుకోవడమూ – ఇలాంటి వాటివలన ఈ కుటుంబాలన్నింటికీ చనువూ, గాఢ స్నేహమూ ఏర్పడ్డాయి. నాగభూషణం కూడా ఉళ్ళో చెప్పుకోదగినవాడు. ఎం.ఏ చదివాడు. పెద్ద కలప వ్యాపారం నడుపుతున్నాడు. ప్రతీ ఏడాదీ భగవద్గీత మీదా, ఉపనిషత్తులమీదా పెద్ద వాళ్ళని పిలిపించి ఉపన్యాసాలు యిప్పిస్తుంటాడు. కట్టడం ఎప్పుడూ ఖద్దరేగాని జిల్లా బోర్డు ప్రెసిడెంటు ఏ పార్టీ అయితే ఆ పార్టీనే బలపరుస్తాడు. దివ్యజ్ఞాన సమాజానికి ఉపాధ్యక్షుడు. ఊళ్ళోకి కలక్టరు వచ్చినా, మంత్రి వచ్చినా ఇతని యింట్లోనే మకాం. – కారు బాగుపడిందాండీ?” అన్నాడు నారాయణ మధ్యలో అడ్డువచ్చి.ఆ రామచంద్రం కారు చుట్టూ రెండుసార్లు ప్రదక్షిణం చేశాడు. కొంత సేపు గొణుక్కున్నాడు. కారు కిందా మీద ఏవో పరీక్ష చేశాడు. చివరికి “ఆల్ రైట్” అంటూ కారులో కూర్చు న్నాడు. కారు సాగింది. ఎర్రని పొడుగాటి రోడ్డుమీద కారు వెళుతూంటే చల్లనిగాలి మొహానికి కొడుతోంది. ఇటూ అటూ’ పంటచేలు. కారు లైట్ల కాంతిలో నెంబర్లు వేసిన మైలురాళ్ళు ఒకటొక్కటే జరిగిపోతున్నాయి. నల్లని ఆకాశం మీద జ్వాలా పుష్పాలలాగ నక్షత్రాలు మెరుస్తున్నాయి. మండుతున్నాయి. చీకటిలో ప్రకృతి గాంభీర్యం వహిస్తుంది. దేవుడులాంటి అనిర్వచ నీయమైన శక్తి సన్నిహితంగా వున్నట్టు వుంటుంది. మామయ

S2 Ep 301అనుకొన్నాదొకటీ - హర్ష
“అరే అబయా హర్షయ్య నువ్వెక్కడుండావో అని ఎతకతానే వుండా పొద్దుకాడినుండి, ఇక్కడుండావా” అంటూ వచ్చాడు నాకు చిన్నాయన వరుస అయిన శేఖరయ్య“ఏంది చిన్నాయన మందల” అంటూ పలకరించా.“నీ దశ తిరిగిందబ్బయ్యా! నీకు పిల్లనిచ్చిన మావ వుళ్లా! సుబ్బ మావ! ఆయనకి ఇరవై లక్షల ఆస్తి కలిసొచ్చిందంట. ఊరంతా ఒకటే ఆగమయిపోతావుంటే, ఆ ముక్క నీ చెవిన బడ్డదో లేదో అని నాకు విన్నకాడినుండి ఒకటే కడుపుబ్బరం గా వుండిందనుకో. ఆ సంగతేందో తేల్చుకోపో మీ అత్తగారింటి కెళ్ళి” అని చెప్పి సక్కా పోయాడు.“వార్నీ మా మావ పాసుగాల! బీడీలకి, సిగరెట్లు తెచ్చిపెట్టడానికి నేను, ఆయన ఉద్యోగం చేసే రోజుల్లో ఏమేమి చేసాడో చెప్పే సోది కబుర్లు వినటానికి నేను, ఇటుమంటి సంగతులు పంచుకోడానికేమో మా షడ్డకుడా మా మావకి, ఇంతకీ మా ఇంటిదానికన్నా తెలుసా! లేదా!నాలుగు రోజుల నుండి అక్కడే పడి వుందిగా, చెప్పనే లేదు, లేక తెలిసి నేను చేయబోయే రచ్చకు భయపడి రహస్యం దాచేసిందా! డబ్బుల సంగతేందో ఈ రోజు తేల్చి పారెయ్యాలి” అని సక్కా మా అత్తారింటికి బయల్దేరా!మా పెళ్లి అయ్యి నాలుగేళ్లు అయ్యింది. నాకేమో హైదరాబాద్ లో ఉద్యోగం. వారం రోజులయ్యింది సెలవుల మీద వూరుకొచ్చి.నేను వెళ్లే సరికి, మా వాళ్ళ మావా, మా మావకి పిల్లనిచ్చిన ఆయన మావా, చాలా కుశాలగా కబుర్లు చెప్పుకుంటుండారు వరండాలో కూర్చొని. “ఇదేదో ఎనిమిదో వింతలాగా వుందే, ఎప్పుడూ పిల్లీ ఎలుకల్లాగా పోట్లాడుకునే మావా అల్లుళ్ళు ఇంత ఒద్దిగ్గా వుండటమేంది. అయితే మా శేఖర చిన్నాయన చెప్పింది నిజమేనేమో. అందుకే మా మావ మీద వాళ్ళ మావ కి ఇంత ప్రేమ కలిగింది” అనిపించింది నాకు.మా మావ చాలా కళ మీద వుండాడు. “మే ఇందిరా! హర్షయ్యొచ్చాడు వచ్చాడు, రెండు టీ లు పట్టుకురా అని కేకేశాడు”. ఆ కేక లో నాకు అంతక మునుపు లేని ధీమా కనపడింది. అంతకు ముందు ఒక టీ కోసం పది సార్లు మా అత్తని బతిమాలుకొనే ఆయన, యీ సారి ఇలా కేకెయ్యటం తొమ్మిదో వింతే.“రోజుకి వంద బీడీలు తాగటం, అస్తమానం టీ కావాలని మమ్మల్ని సంపక తినటం” అని విసుక్కునే మా అత్త, వెంటనే జీ హుజూర్ అన్నట్టు రెండు టీలు, ప్లేట్ నిండా బిస్కట్ లతో రావటం, అది చూసి నా తల తిరగటం వెంట వెంటనే జరిగిపోయాయి.నాకై నేను యీ కొత్త ఆస్తి వచ్చి పడటం గురుంచి ఎవర్నీ అడగలేడు. అందుకే నా భార్య కోసం చూపుల్తోనే ఎతకటం మొదలు పెట్టా! అది గమనించి “అమ్మి, దొడ్లో పూలు కట్టుకుంటుంది పో” అని వాళ్ళ మావతో కబుర్లలో పడ్డాడు మా మావ, నా పేరు జెప్పి తెప్పించుకున్న టీ జుర్రుకుంటూ“ఏందిమే, సంగతి, వూరు వూరంతా గుప్పు మంటూండాదే, మీ నాయనకేదో లిబ్బి దొరికిందని, నిజమేనా” అని అడిగా గుప్పెడు మల్లె పూలు దొరగ్గానే పండగ జేసుకొనే నా పెళ్ళాం దొడ్లో కనపడగానే“అబ్బో! దిగబడింది, ఇందుకా! నేనింకా ఎదో నా మీద ప్రేమ కారిపోయోచ్చాడు అనుకున్నాలే” అని ఎత్తి ఒక్క పొడుపు పొడిచింది నా పెళ్ళాం.అట్టా, యిట్టా చూసి, “వాటాలేమన్నా! తేల్చేరా, యింతకీ” అని మన్సులోది కక్కేశా ఆత్రం గా. “మనం దేన్నీ ఎక్కువ సేపు నాన్చము కదా” అని అనుకుంటూ.“ఏందీ! వాటా కావాలా నీకు. పెళ్లప్పుడు డబ్బు అంతా వసూలు చేసుకొని, ఇచ్చిన పొలాలు అయినకాడికి అమ్ముకొని పోతిరి, మీ అబ్బా కొడుకులు. ఇప్పుడేమి వాటా కావాలి నీకు” అని దండయాత్ర చేసింది.“ఏంది మే! నీకు ఇచ్చింది? రెండెకరాలు నీకు, మీ అక్కకి ఎనిమిది. కునిష్ఠ వని రెండుతో సరిపెట్టారు నీకు, నీకేమో ఏమీ పట్టదు, చేతిలో కుడుము పెట్టగానే పండగనుకుంటావు”“సడే! మా అక్కోళ్ళ కి పొలాల విలువ తెలుసు కాబట్టి, డబ్బులు వద్దు అని పొలాలు తీసుకున్నారు. మీ నాయనా కొడుకులు డబ్బో డబ్బో అని, డబ్బులెక్కువ, పొలాలు తక్కువ తీసుకొని, ఇప్పుడీ ఏడుపులేడుస్తున్నారు, ఇక్కడెవరో మీకు అన్యాయం చేసినట్టు. ఇదిగో విను, మా వాళ్ళు పెళ్లప్పుడు పెట్టాల్సిన పెట్టు పోతలన్నీ పెట్టేసారు. ఇప్పుడు గాని వాటా గీటా అన్నావంటే మర్యాద దక్కదు, రేపే మన ప్రయాణం మనూరికి” అని డిసైడ్ చేసేసింది.“ఇంత తెలివి లేని దాన్ని కట్టబెట్టావేందిరా దేవుడా” అనుకుంటూ స్నానానికి బయల్దేరా!స్నానం చేసేటప్పుడంతా ఒకటే ఆలోచన, ఈ విషయం ఎలా కదపాలి, ఎవర్ని కదపాలి అని. ఉడుకుడుగ్గా నాలుగు చెంబులు పోసుకొనే సరికి మనస్సు, శరీరం కాస్త స్వాధీనం లోకి వచ్చాయి.ఆపాటికే అందరు వరండాలోకి చేరారు. బహుశా, నా కెలా చెప్పాలో అని తర్జన భర్జన ముందే పడ్డట్టు వున్నారేమో, మా అత్తగారు, సూటిగా సుత్తి లేకుండా అసలు విషయం లోకి వచ్చేసారు.“మీ మావకి ఇరవై లక్షలు వస్తాయి. మీ మావ గారు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని, ఆయన లోకంలో ఆయన బతుకుతూ, ఇంటిని గురించి పట్టించుకోకుండా, వుంటే, మా పెద్ద అల్లుడు అంటే మీ షడ్డకుడు ఒక బిడ్డలా, ఈ ఇంటిని ఆదుకున్నాడు. కాబట్టి మీ మావకొచ్చే ఆస్తిలో ఎక్కువ భాగం ఆయనకి చెందాలి. యీ విధం గా అయినా ఆయన అప్పు తీర్చినట్టు” అని.నాకు తెలుసు, తాను ఆమె కంటి లో నలుసు అని. కానీ పెద్దల్లుడు ముందర తన విలువ యింత తక్కువ అని నా భార్య వైపు చూశా. వాళ్ళమ్మ చెప్పింది నూరు పాళ్ళు నిజం అనే తన్మయత్వం కనిపించింది తనలోఈ లోపల మా అత్త గారి నాయన మొదలుపెట్టాడు, “అబ్బ! సుబ్బయ్య, చాలా తెలివికల్లోడు. నాకు తెలుసు ఎప్పటికైనా, పైకొస్తాడు” అని. “ఈ మావ అల్లుళ్ళ మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గు మనేది. కానీ ఈ ఆస్తి కలిసి వస్తుందని తెలిసినప్పటి నుండి ఆయనకీ అల్లుడు మరీ ముద్దు అయిపోయాడు. అరవై ఏళ్ల అల్లుడు ఇంకా పైకొస్తాడట, ఏమి మిగిలుందో రావడానికి” అని కసిగా అనుకున్నా!ఇంకమావ ఏమంటాడో అని ఆయన వయిపు చూశా! ఆయన దొరక్క దొరక్క దొరికిన సెలబ్రిటీ స్టేటస్ ని ఇంకా ఆస్వాదిస్తున్నాడు. ఆస్వాదిస్తూనే ఉండిపోవాలనే కోరిక ఆయన మోహంలో చాలా బాగా కనపడుతుంది. పాపం ఆయన అప్పట్లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ బెనారస్ యూనివర్సిటీ చదివాడు. మంచి కుటుంబంలో పుట్టాడు. మంచి ఉద్యోగం చేస్తూ, వాళ్ళ బాస్ తో పడక, ఆవేశంతో రాజీనామా లెటర్ మొహం మీద కొట్టి, గత ఇరవై ఏళ్ళు ఆ పని ఎందుకు చేసానా అని రిగ్రెట్ అవుతూ బతికేస్తున్నాడు.ఇప్పుడాయన వంతు వచ్చింది. ఆయన వంతు వచ్చినప్పుడు, యూనివర్సిటీ లో నేర్చిన క్లాసికల్ ఇంగ్లీష్ బయటకి వస్తుంది. అవతలోడికి అర్థమవుంతుందా లేదా అని ఆయనకి పట్టదు. గొంతు సవరించుకొని, “సీ మై డియర్ మెంబెర్స్! ఐ హావ్ డన్ మై పీజీ ఇన

S2 Ep 299ఖదీర్ బాబు గారి ‘గేట్’!
‘గేట్’ ఖదీర్ బాబు గారి రచన. ‘ గత పాతికేళ్ళుగా తెలుగు కథ రచయితగా మనల్ని అలరిస్తున్న శ్రీ ఖదీర్ బాబు నెల్లూరు జిల్లా కావలి లో జన్మించారు. బి.ఎస్. సీ కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రులు. పత్రికా రంగంలో, సినీ రంగంలో తన సేవలందిస్తూ, రచనా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. . వారు రాసిన పుస్తకాలలో కొన్ని ‘ దర్గామిట్ట కథలు ‘ , ‘ న్యూ బాంబే టైలర్స్ ‘ , ‘ పోలేరమ్మ బండ కథలు’ , ‘ కథలు ఇలా కూడా రాస్తారు’.వీరు రాసిన ‘ న్యూ బాంబే టైలర్స్’ ప్రతిష్టాత్మకమైన ‘కథ’ అవార్డు ను గెలుచుకోవడమే కాక, నాటకంగా రూపాంతరం చెంది అనేక ప్రశంసలందుకుంది.కృతజ్ఞతలు ఖదీర్ గారూ హర్షణీయం ద్వారా ఈ కథను పరిచయం చెయ్యడానికి అనుమతినిచ్చినందుకు.గేట్ :గొణుక్కుంటున్నారు ఇద్దరూ.‘లాగండి’ అంటోంది.లాగితే రావడం లేదు. మూడు మెట్లు ఎక్కితే ఉంది గేటు. పైన చిలుకు తీసి ముందుకు లాగుతుంటే కదలడం లేదు. ఇద్దరు పిల్లలూ ఊరికే చూస్తున్నారు. టక్ చేసి ఉన్న అతడు బెల్ట్ సర్దుకుంటూ మళ్లీ లాగాడు.‘రావడం లేదు’ అన్నాడు.అలికిడి లోపలి వరకూ వినిపించినట్టుంది…‘ఎవరూ’ అంటూ వచ్చి అవతలి నుంచే మునిగాళ్ళు ఎత్తి గేటు బయటకు చూస్తూ ‘ఏంటి.. ఏంటి… నిజమే.. సుదా.. నువ్వేనా’ అందామె అతణ్ణి చూస్తూ.‘గేటు ఇంటి వైపుకు నెట్టాలి. వీధి వైపుకు కాదు. ఏం మారలేదు నువ్వు’ అంటూ ఇంటి వైపుకు లాగింది.గేటు తెరుచుకుంది. కిరకిరమని కఠినమైన శబ్దం చేసింది.‘గ్రీజు పూయాలి దీనికి. ఎప్పట్నించో. అలాగే పోతా ఉంది. ఓహో… అమ్మాయి వచ్చిందా… అరెరె… ఈ చిన్న మినిస్టర్లు ఎవరమ్మా’ అంటూ పిల్లల్ని జవురుకుంది. మొదటిసారి చూస్తున్న పిల్లలు. బెదరలేదు. అలాగని సంబర పడలేదు. కొత్త చేసి చూస్తున్నారు.‘ఇదిగో.. ఎవరొచ్చారో చూశారా’ పెద్దగానే అరిచింది.‘అచ్చు సినిమాల్లోలాగే చేస్తున్నావు అమ్మీ’ అన్నాడు నవ్వుతూ.‘ఓహో.. అమ్మీ అనే అన్నావు. టీచార్ అంటావేమో అనుకున్నా చాకు దీర్ఘం పెట్టి’ అని పిల్లల వీపు మీద ఇంకా గట్టిగా చేతులు అదిమింది.గేటు నుంచి ఇంటి వరకూ నాప పలకలు పరిచి ఉన్నాయి. ఎండ వాటి మీద పడి మెరుస్తూ ఉంది. నీడల్ని బట్టి పన్నెండు లోపే అయి ఉండవచ్చు టైము. పదిహేను ఇరవై నాప పలకలు పరిచేంత ముంగిలి ఉంది. తర్వాత గడప.హాలులోనే ఉన్నాడు సారు. వైరు మంచం మీద కూచుని. ఒక కాలు కిందకు జార్చి. ఒడి మొత్తం కప్పేలా టర్కీ టవల్ పరుచుకుని. ‘ఏమిటీ పిడుగు… సుదా’ అన్నాడు. తెల్లటి గడ్డంలోని లేత బూడిదరంగు పెదాలు విడివడి ఎప్పటిలాగే తెల్లటి పలువరుస మెరిసింది. చుబుకం నుంచి కంఠానికి రెండు తాళ్లు కట్టినట్టు ఉంటుంది చర్మం. ఆ తాళ్లు ఊగాయి నవ్వుకు.అతడు వొంగి ఆయన కాలుకు నమస్కారం పెట్టాడు. కళ్లు ఉబికాయి. ఆమె కూడా ఒంగి నమస్కారం పెట్టింది.‘ఏమిట్రా సుదా.. ఊ’ అన్నాడు సారు.‘పిల్లలు… మినీ.. బూ… ఇట్రండి. తాతకు నమస్కారం పెట్టండి’పెద్దది– తొమ్మిదేళ్లు ఉంటాయి… దళసరి కళ్లద్దాలు… రెండు చేతులు జోడించి పెట్టింది. చిన్నాడు– ఆరుంటాయి– వంకర్లు తిరిగాడు. సారు టవల్ అంచు తీసుకుని కళ్లు వొత్తుకుని, ఏమి ఇద్దునా అని చొక్కా జేబు తడుముకున్నాడు. ఇంకు పెన్ను ఉంది. దానిని తీసి, ఆగి, భార్య వైపు చూస్తూ ‘ఇంకో పెన్ను ఏదైనా ఉంటే చూడు. చెరొకటి ఇవ్వకపోతే అదొక గలభా’ అన్నాడు.‘ఇప్పుడు మీ పాతకాలపు పెన్నులే వీళ్లక్కావాల్సింది. రూములో టీవీ ముందు కూచోబెట్టి బూస్టేదైనా ఇస్తాగాని… మీరు మాట్లాడుకోండి’ అందామె నవ్వుతూ.‘అహ్మద్‌కు ఫోన్ చేసి నాటు తెమ్మను. ఫారమ్ తెస్తే పడతాయ్ అని చెప్పు. కుర్మా చేసి వేపుడు కూడా చెయ్. గుడ్లు ఉడకెయ్’… పిల్లల్ని వెంటబెట్టుకు వెళుతుంటే గట్టిగా చెప్పాడు.‘ఇప్పుడవన్నీ ఎందుకు మావయ్యా’ అందామె.‘నువ్వూర్కోమ్మా. ఇప్పటికి తీరి వచ్చారు. ఏరా… తినే దాకా ఉండవా? పరిగెత్తి పోతావా? ఇన్నాళ్లూ పరిగెత్తి పోయావుగా’ అన్నాడు సారు.అతడు మాట్లాడలేదు. గతంలో మల్లే స్టూడెంట్ మొహం పెట్టాడు.‘కూచో’ అన్నాడు సారు. ఆమె కూడా ప్లాస్టిక్ కుర్చీలో కూచుని హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి మడిచి ఉన్న పాలిథిన్ కవర్ తీసింది. అందులో సాధారణంగా అమెరికా నుంచి వచ్చేవాళ్లు తెచ్చే చాక్లెట్లు, ఏవో చిన్న చిన్న కానుకలు ఉన్నట్టున్నాయి. ఇద్దునా అన్నట్టు భర్త వైపు చూసింది. ఇప్పుడు కాదు అన్నట్టు వారించాడు.సారు అదంతా పట్టక శిష్యుణ్ణే చూస్తున్నాడు.‘ఏమ్మా… వీడు బాగానే ఉంటున్నాడా నీతో. చెప్పు. గల్తీ గిల్తీ ఉంటే బయట ఎండలో రెండు రౌండ్లు ఫ్రంట్ రోల్ చేయిస్తా’ అన్నాడు.భర్త వైపు చూసి సారు వైపు చూస్తూ ‘మీ స్టూడెంట్ కదా మావయ్య’ అంది.‘ఏరా… డేగిశా సుమారుగా పెంచావు. అమ్మాయి చేత రోజూ రెండేసి ప్లేట్ల టిఫిన్ పెట్టించుకుని తింటున్నావా’… నవ్వాడు.ఆ మాటకు అతడు నవ్వాడు. దాని అర్థం ఆమెకు తెలుసులా ఉంది… ఆమె కూడా నవ్వింది.హైస్కూల్లో చేరినప్పుడు తల్లి సద్దన్నం కట్టి, ఎరగడ్డను ఒలవడానికి కూడా టైము లేక సంచిలో పడేసేది. రెండు మైళ్లు నడుచుకుంటూ వచ్చి పొద్దునంతా పాఠాలు వింటే మధ్యాహ్నానికి అదే. మూడు ముద్దల్లో అంత సద్దెన్నమూ మింగేసి తింటున్న మిగతా పిల్లలవైపు కళ్లు పెట్టుకుని చూసేవాడు. సాయంత్రం ఇంటికెళితే పరమాణ్ణం ఉంటుందనా. కలో గంజో. ఉన్న బరెగొడ్డు మీద కూతుర్నీ కొడుకునూ సాకాలి తల్లి. తండ్రి ఏనాడో పొలంలోనే పాము కరిచి పోయాడు. ఎదిగే వయసు. ఎప్పుడూ ఏదో ఒకటి బుక్కమనే ఆకలి. ఒరే అర కడుపోడా… పోయి అమీర్ అలీ సార్‌ని కలువు… ఎన్.సి.సిలో చేర్చుకుంటాడు… తినొచ్చు అని సలహా ఇచ్చారెవరో. ఏం తినొచ్చు అనడిగాడు. వారంలో రెండుమాట్లు డ్రిల్లుంటుంది… అయ్యాక చెంగయ్య హోటలు ఇడ్లీ, వడ ఇస్తారు అని చెప్పారు. యూనిఫామ్ ఇస్తారని కూడా చెప్పారు.అప్పుడు కలిశాడు అమీర్ అలీ సార్‌ను. పూర్తిగా ట్రిమ్ చేసిన నల్లగడ్డం. లేత బూడిద రంగు పెదాలు. తెల్లని పలువరుస. పెద్ద కాలరు… బ్రౌన్ కలర్ ఉంగటం చెప్పులు… ఆరు, ఏడు తరగతులకు ఇంగ్లిష్ చెప్పేవాడు. కాని ఎన్.సి.సి వరకు ఆయనది భుజాన రెండు స్టార్లు పెట్టుకునే ట్రూప్ కమాండర్ హోదా.‘ఎందుకు చేరతానంటున్నావ్ ఎన్.సి.సిలో’ అన్నాడు సారు.‘క్రమశిక్షణ కొరకు’ బట్టీ వేసింది చెప్పాడు.‘అంటే?’‘యూనిఫారమ్ కొరకు’‘సరిగా చెప్పు’‘చెంగయ్య హోటలు టిపిను కొరకు సార్’పై నుంచి కింద దాకా చూశాడు.‘తెల్లారే టైములో ఉంటుంది పరేడ్. మీ ఊర్నుం

S2 Ep 298వనవాసి నవల శబ్దరూపకం ఆఖరి భాగం - 50
ఇది వనవాసి శబ్ద రూపకంలో చివరి యాభైవ భాగం. ఈ ఎపిసోడ్ లో చివరిగా రచయిత సొలొమోన్ విజయకుమార్ గారు ఈ ప్రయత్నంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. వారికి హర్షణీయం కృతజ్ఞతలు. 1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ' అరణ్యక్' పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి 'వనవాసి' అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 297వనవాసి నవల - 49
1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ' అరణ్యక్' పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి 'వనవాసి' అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాముThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 296వనవాసి నవల - 48

S2 Ep 295వనవాసి నవల - 47

S2 Ep 294వనవాసి నవల - 46

S2 Ep 293వనవాసి నవల - 45

S2 Ep 292వనవాసి నవల - 44

S2 Ep 291వనవాసి నవల - 43

S2 Ep 290వనవాసి నవల - 42

S2 Ep 289వనవాసి నవల - 41

S2 Ep 288వనవాసి నవల - 40

S2 Ep 287వనవాసి నవల - 39

S2 Ep 287వనవాసి నవల - 38

S2 Ep 286వనవాసి నవల - 37
1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ' అరణ్యక్' పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి 'వనవాసి' అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S2 Ep 285వనవాసి నవల - 36

S2 Ep 284వనవాసి నవల - 35

S2 Ep 283వనవాసి నవల - 34

S2 Ep 282వనవాసి నవల - 33

S2 Ep 281వనవాసి నవల - 32

S2 Ep 280వనవాసి నవల - 31

S2 Ep 279వనవాసి నవల - 30

S2 Ep 278వనవాసి నవల - 29

S2 Ep 277వనవాసి నవల - 28

S2 Ep 276వనవాసి నవల - 27

S2 Ep 275వనవాసి నవల - 26

S2 Ep 274వనవాసి నవల - 25

S2 Ep 273వనవాసి నవల - 24