
Harshaneeyam
535 episodes — Page 5 of 11

S1 Ep 114తిలక్ గారి 'దేవుణ్ణి చూసిన మనిషి'
తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం.తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు.ఇప్పుడు వినబోయే కథ 'దేవుణ్ణి చూసిన మనిషి' - 'తిలక్ కథలు' అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి, హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.ఈ పుస్తకం మీరు కోనేటందుకు కావలసిన వివరాలు , ఇదే వెబ్ పేజీ లో ఇవ్వటం జరిగింది.కథ:గవరయ్య పెళ్ళాం లేచిపోయిందన్న వార్త ఊరు ఊరంతా ఉత్సాహంగా వ్యాపించింది. అంతకుముందు రోజునే చైనా ఇండియా సరిహద్దులలో దురాక్రమణ చేసిందనీ, యుద్ధం జరుగుతూన్నదనీ వచ్చిన వార్త చటుక్కున అప్రధానమైపోయి అందరూ మరచిపోయారు కూడా. ఆడది లేచిపోవడంలోని విశిష్టతని ఈ వూరువారొక్కరే గుర్తించారా అనిపిస్తుంది. యింత తెలుగు దేశంలోనూ!రోడ్ల కూడలిలో, కాఫీ హోటలులో (ఆవూళ్ళో ఒకటే వుంది) పొలంగట్లనీ, పంచాయితీ బిల్డింగ్ దగ్గరా పురుషులూ; పెరటి గోడల దగ్గరా, బావులూ, నీలాటి రేవుల దగ్గరా ఆడవాళ్ళూ ఈ విషయాన్నే చిత్ర విచిత్రంగా చెప్పుకుంటున్నారు. వట్టి లేచిపోవడమే అయితే యింత సంచలనం కలిగించకపోను; అందులోనూ ఎందుకూ పనికిరాని ఎదురింటి అరుగుమీది మిషన్ కుట్టుపనివాడితో లేచిపోవడమే మరీ విడ్డూరంగా వుంది. ఇంతకన్న మరో ఏ పెద్దమనిషితో లేచిపోయినా యింత అప్రదిష్ట ఉండకపోనని వూళ్ళో అనుభవజ్ఞులైన పెద్దలు అనుకున్నారు. చాలామంది యువకులు గవరయ్య భార్య తమని నిష్కారణంగా అవమానించినట్టూ అన్యాయం చేసినట్టూ బాధపడ్డారు.“వాడిలో ఏం చూసి లేచిపోయిందత్తా” అని మూడోసారి అడిగింది తన అత్తని ఒక పడుచు తన కుతూహలం ఆపుకోలేక.“పోనీ నువ్వే వాడితో లేచి పోకపోయావూ నీకు తెలిసొచ్చును” అంది అత్తగారు విసుగుతో, కోపంతో.“గవరయ్యకి బాగా శాస్త్రి అయింది” అని ఏకగ్రీవంగా ఆబాల గోపాలమూ తీర్మానించారు. గవరయ్యను చూసి జాలిపడినవాడూ సానుభూతి తెలిపినవాడూ ఒక్కడు లేడు.గవరయ్య అంటే ఆ వూళ్ళో అందరికీ అసహ్యం. మనిషి కూడా నల్లగా ఎగుడుదిగుడుగా వుంటాడు. మొహంమీద స్ఫోటకం మచ్చలు, పెదాలు లావుగామోటుగా వుంటాయి. కనుబొమ్మలు గుబురుగా గొంగళీ పురుగులు అతికించినట్లు వుంటాయి. ఊరికి శివారున వున్న పెద్ద పెంకుటింటి లోగిలిలో గవరయ్య వుంటాడు.“నాకు తెలుసును ఇలాంటిదేదో జరుగుతుందని” అన్నాడు కన్నులరమూసి అవధాని. అవధాని ఆ వూళ్ళో ధర్మకర్త.మునసబు చలపతి, కరణం నరసింహమూ తల వూపారు. దాంతో మరికాస్త ఉత్సాహంతో ఉపనిషద్వాక్యంలాంటి పై వాక్యానికీ వ్యాఖ్యానం చెప్పాడు ధర్మకర్త.“వేణుగోపాలస్వామి వూరికే పోనిస్తాడా? ప్రథమ కళత్రం చావనే చచ్చింది. ఇంక ఈ రెండో ఆవిడ చావుకన్న ఘోరమైన పని చేసి వూరుకుంది. ఒక్క ధర్మకార్యం చేశాడా? ఒక్క మంచిమాట చెవిని పెట్టాడా?”మున్సబు చలపతి చేతికర్రను నేలమీద తాటించి అన్నాడు “ఒక్కరిని దగ్గరకు రానిచ్చాడా? కర్కోటకుడండీ యీ గురవయ్య. ఎంత అహం, ఎంత పొగరు....”“పాపపు సొమ్మండీ పాపిష్టి ఆర్జితం! దాని ఫలితం వూరికే పోతుందా? మొన్న కుర్రాళ్ళందరూ వెళ్ళి భజన చందాకి ఒక్క రూపాయి _ ఒబ్బు రూపాయి యిమ్మంటే తరిమి కొట్టాడుట...” అన్నాడు కరణం.గవరయ్య యిరవై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళవాడు ఈ వూరొచ్చాడు. ఈ వూళ్ళో అతనికో మేనత్త వుంది. తల్లీ తండ్రి లేని అతను యీ మేనత్త దగ్గరకు వచ్చిపడ్డాడు. వస్తూనే కొంత డబ్బుకూడా తీసుకుని వచ్చాడు. ఈ వూరికి రెండు మైళ్ళ దూరంలోనే టౌను వుంది. రోజూ ఉదయమే టౌన్ కి వెళ్ళి చీకటి పడ్డాక తిరిగొచ్చేవాడు. కొన్నాళ్ళకి తోళ్ళ వ్యాపారం చేస్తున్నాడని తెలిసి అందరూ “హరీ హరీ” అని చెవులు మూసుకున్నారు. మేనత్తతో యిది చాలా పాపమనీ బెడిసికొడుతూందని చెప్పారు. కానీ మేనత్త ఏమీ మాట్లాడలేదు. కొందరు చొరవచేసి గవరయ్యతో జంతు చర్మ విక్రయం మంచిది కాదని చెప్పారు.“జంతువులేం ఖర్మ మనుషుల తోలునే అమ్ముతాను. మరీ పల్చన కాబట్టి పనికి రాదు కాని” అని సమాధానమిచ్చాడట గవరయ్య.గవరయ్య ఒంటెత్తుమనిషి. ఎవరితోనూ మాట్లాడడు, కలవడు. అసలు గవరయ్య నవ్వడం ఎవరూ చూడలేదు. అదేకాక గవరయ్యకి “పాపం” 'పుణ్యం” అని భేదాలు వున్నట్టు కూడా తెలియదు.ఈ యిరవై ఏళ్ళలోనూ అతను లక్ష రూపాయలకి పైగా సంపాదించాడని ప్రతీతి. ఊళ్ళో పెద్దలు - ఉదారులూ ధర్మపరులూ కాబట్టి, అతని పాప వ్యాపారాన్ని క్షమించి అతని శ్రేయస్సు కోరి అతని ఆముష్మిక సుఖం కోసం దానధర్మాలు చేయమనీ, గుడి మండపం కట్టించమనీ, పాఠశాల బిల్డింగ్ కి చందా యిమ్మనమనీ, సప్తాహాలు చేయించమనీ చెవిలో యిల్లు కట్టుకుని చెప్పారు.గవరయ్య గుండ్రంగా లోతుగా వున్న కళ్ళని కుంచించి మోటైన పెదాలమధ్య చుట్టని నొక్కి పెట్టి, విసుగ్గా, విసురుగా “నేనొక్క కానీ యివ్వను, పోయి మీ అబ్బతో చెప్పుకోండి” అనేవాడు. మంచి లేదు, మర్యాదా లేదు వీడికి అనుకున్నారు వాళ్ళందరూ పరోక్షంగా. అతనికి లక్ష రూపాయలుండడంవల్ల అతని ఎదురుగా అలా అనలేదు. వాళ్ళు సహజంగా జ్ఞానులు కాబట్టి.గవరయ్య మేనత్తగారింటికి చేరిన కొద్ది రోజులలోనే మొదటి భార్యను తీసుకొచ్చాడు. ఆ భార్య నెక్కడికీ పంపేవాడు కాడు. పొరుగిళ్ళకు కూడా వెళ్ళేది కాదు. మేనత్తా, భార్యా, గవరయ్యా - ముగ్గురూ మూడు దెయ్యాలలా వుండేవారు. ఒక పుకారు కూడా వూళ్ళో వుండేది. గవరయ్య పెళ్ళాన్ని ఏదో భూతం ఆవహిస్తూంటుందనీ,ఊళ్లో ఎవరికి తెలియకుండా అందరూ నిద్రపోయే అర్ధరాత్రివేళ భూతవైద్యుడెవడో వచ్చి ప్రయోగాలు చేస్తాడనీ ధూపాలు వేస్తాడనీ చెప్పుకుంటూంటారు. ఇంత వంటరిగా సంఘ జీవితంలో కలవకుండా వీళ్ళెలా వుంటున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కొంతకాలానికి గవరయ్య పుట్టిన వూరునుండి వచ్చానని చెప్పుకుంటూ కొన్నాళ్ళు ఆ వూరిలో ఒక గాజుల వర్తకుడు తిరుగుతుండేవాడు. అతడు గవరయ్యను గురించిన భోగట్టా అందజేశారు.గవరయ్య తండ్రి చాలా దుర్మార్గుడట. జూదమూ, తాగుడూ రెండింటినీ సమపాళంగా అభ్యసించి ప్రాక్టీసు చేశాడుట. తల్లి రోగిష్టిదై మంచాన పడి ఉండేది. అందువల

S1 Ep 156'అహింస' దాదా హయత్ గారి కథ!
'అహింస' దాదా హయత్ గారి 'మురళి ఊదే పాపడు' అనే కథా సంపుటం లోనిది. వృత్తిరీత్యా లాయర్ ఐన దాదా హయత్ గారు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. దాదాపుగా డెబ్బై కథలు రాసారు. ఒక స్కూలు పిల్లవాడి గురించి రాసిన ఈ కథలో సున్నితమైన మానసిక విశ్లేషణనీ, పొందికైన పదాల కూర్పునీ మనం చూడొచ్చు. కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి అనుమతినిచ్చిన దాదా హయత్ గారికి కృతజ్ఞతలు.ఈ పుస్తకం కొనాలంటే, ఈ లింకుపై క్లిక్ చెయ్యండి -http://bit.ly/2Ok88ybఅహింస:అది మోకాలి మీదికి పాకింది. అది ఒకసారి గంభీరంగా తన స్థితి గతులు' పరీక్షించుకొని ప్రమాద మేమీ లేదన్నట్లు మళ్ళీ కదిలి ముందుకు సాగింది ఆ నల్లటి గండుచీమ.నిద్రమత్తు కళ్ళతో దాన్నే స్తబ్దుగా చూస్తున్నాడు చంటి. అంతవరకూ ఓపిగ్గా దాన్ని గమనిస్తూ వచ్చాక దానిమీద హఠాత్తుగా ఆసక్తిపోయి విసుగుపుట్టేసి బొటనవేలికి మధ్యవేలును సంధించి లాగి ఒక్కటి తగిలించాడు. గండుచీమ ఎగిరి నేలమీదపడి సర్దుకొని నిలబడి దొరికి పోయినట్టు తికమకగా ఎటు పారిపోవాలని కాస్సేపు దిక్కులు చూసి వెనక్కి తిరిగి పలాయనం చిత్తగించింది.ఒక మోకాలి మీద గెడ్డం ఆన్చి నిర్లక్ష్యంగా పారిపోతున్న దాన్ని గమనిస్తూ దిగుల్లో పడిపోయాడు చంటి. ఆరోజు బడికి వెళ్ళాలంటేనే నీరసం ముంచు కొచ్చేస్తోంది. ఏం చేయాలో తోచక జేబు తడుముకొని ఇన్ని బలపాలూ చాక్ పీసులూ బయటికి తీశారు. అవి ఎప్పుడూ తన జేబులో వుండాల్సిందే--రాత్రిపూట కూడా. ఎవ్వర్నీ తీయనియ్యడు.ఓ చాక్వసుతో అరుగుమీద ఓ 'సున్నాగీసి. మధ్యలో నిలువుగా గీతగీసి చెవులు పెట్టి. పొడుగ్గా రెండు జడలు పెట్టి కింద రాశాడు. 'అమ్మ'. చంటి బళ్ళోచేరి రెండునెల్లే అయింది. కాని, అంతకు ముందే వాళ్ళమ్మ దగ్గర అక్షరాలన్నీ నేర్చేశాడు. అమ్మపక్కనే నాన్నని గీసి పీచు జుట్టు పెట్టాడు. తర్వాత గంభీరంగా తన సొంత సామర్థ్యాన్ని పరీక్షించుకొని తృప్తిగా చూసి కాస్త వెనక్కి జరిగి కింద మరోబొమ్మ గీశాడు.. 'టీచర్'.ఈలోపల అమ్మబయటికొచ్చి కొడుకు చిత్రకళాకౌశలాన్ని తిలకించి నవ్వి, “బొమ్మలు గీస్తూ కూచున్నావా చంటీ? బడికిపోవూ? మొహం కడుక్కొని స్నానం చేద్దూగాన్రా ,” అని కొడుకుని లేవదీసింది.మొహమ్మీది కొచ్చిన చింపిరి జుట్టుని వెనక్కి తోసుకొని, “అమ్మా, మా టీచర్ చూడవే - బావుంది కదూ?" కళ్ళు మెరిపించి వేలితో చూపిస్తూ అన్నాడు చంటి.“ఆఁ ఆఁ చాలా బావుంది. బడికి వేళ కాదూ? రా"చంటికి అరుగు దిగాలనిపించలేదు. బిక్కమొహం వేసుకొని దిగి అమ్మ వెంట వెళ్ళాడు.స్నానం చేయించుకొని, తల దువ్వించుకొని అమ్మవెంట వంట గది లోనికి వెళ్ళాడు చంటి.పొయ్యి వెలిగించి, గిన్నె పెట్టి ఉప్మాకోసం పోపువేసి తిరగ. పెడుతున్న అమ్మకొంగు లాగుతూ వగలు పోసాగాడు. “అబ్బ, వుండరా! ఉప్మా కానీ”అమ్మభుజం మీద గెడ్డం ఆన్చి గారంగా “అమ్మా” అని పిలిచాడు. చీర కొంగుని గుప్పిట బలంగా బిగించి మళ్ళీ పిలిచాడు “అమ్మా”“ఏమిట్రా?" “ఈరోజు ....” “ఊఁ”. “స్కూలోద్దే".చేస్తున్న పనాపి కొడుకు మొహంలోకి నేరుగా చూసి “ఏం?” అంది.చంటి జవాబివ్వలేదు. అమ్మ మళ్ళీ పన్లో పడింది.“అమ్మా” “మీ నాన్నగార్నడుగు ”.చంటి మొహం వేలాడేసుకొని నిల బడ్డాడు. కాస్సేపాగి మళ్ళీ కొంగు లాగాడు“ఊఁ....”అమ్మ చంటి చేతుల్లోంచి కొంగులాగేసింది.చంటి ఖిన్నుడై పోయాడు. అమ్మ నిరసనకు మొహవైతే చిన్నబోయింది గాని, బడికి మాత్రం వెళ్ళాలన్లేదు.బిక్క మొహంవేసుకొని కాస్సేపలాగే నిలబడ్డాడు. తర్వాత అమ్మ భుజం మీద చెయ్యేశాడు.కాస్సేపూరుకొని ఒక చేత్తో భుజంమీది " కొడుకు చేతిని నొక్కి పట్టి తలతిప్పి లాలనగా చూసి “అలాగేలే, ఇంట్లో కూచుని చదువుకో” అంది.చంటి మొహం వికసించింది. లావులావు బుగ్గల్ని నవ్వుతో మరింతలావు చేసి వంటగదిలోంచి బయటికి పరిగెత్తి నాన్నగారి ముందు “హాయ్ హాయ్” అని గెంతులేస్తుంటే పేపరు చదువుతున్న నాన్నగారు “ఏమిట్రా?” అన్నారు కొడుకుని మురిపెంగా చూస్తూ.గెంతడం ఆ పేసి కుర్చీ కోడు పట్టుకు నిలబడి, “నాన్న అమ్మేం, స్కూలుకెళ్ళొద్దంది " అన్నాడు సిగ్గుగా. .నాన్నగారు విస్మయంగా చూసి, “ఎందుకు?" అనడిగారు.చంటికేం చెప్పాలో అర్ధం కాలేదు. ఆలోచన్లో పడ్డట్టు మొహం పెట్టాడు.నాన్నగారు వంటగదిలోకి కేకేసి, “చంటిగాణ్ణి స్కూలు కెళ్లాద్దన్నావట?” అన్నారు.“ఆఁ లోపల్నుంచి సమాధానం. “ఎందుకూ?" “రేపెళ్తాడులెండి"అయోమయంతో లేచి లోనికెళ్ళారు నాన్నగారు. చంటి నేరస్తుడిలా వున్న చోటునే నిలబడ్డాడు. ఈయన స్కూలు కెళ్ళమనడుగదా? '“ఎందుకనెళ్ళోద్దన్నావ్?” అడిగారు నాన్నగారు.“వాడు నిన్న ఆదివారమంతా గెంతీ గెంతీ ఈ రోజు బడికెళ్ళడానికి బద్దకిస్తున్నాడు. ఎప్పుడూ ఇలా అడగలేదు. స్కూలికి పోనన్నాడు-సర్లేమ్మన్నాను.”“అలా ఎందుకన్నావ్? చదువు దగ్గరేం గారాలు?”“పోన్లెండీ. రేపు వెళ్తాడు. రెండు నెల్లేగా బళ్ళోచేరి.”నాన్నగారు ముందుగదిలోని కెళ్ళిపోయి చంటివైపు చూడకుండా సీరియస్ గా పేపర్లో పడ్డారు. చంటి అక్కడే నాన్నగారి మొహంలోకి చూసి చూసి బిడియంగా అక్కణ్ణించి కదిలి వెళ్ళిపోయి మళ్ళీ అరుగుమీద కూచోని దిగుల్లో పడ్డాడు. నాన్నగారికి క్కోపమొచ్చినట్టుంది.ఇందాకా గీచిన బొమ్మలు చెరిపేశాడు.ఎండవాలు కాస్త ఎక్కువయ్యే వేళకి లేచి ఇంట్లో చాపమీద కూచొని హోం వర్క్ చేస్తున్న అక్క దగ్గరకెళ్ళి “అక్కా, కేరం బోర్డాడు కుందామా?” అడిగాడు. కుతూహలంగా.“హోంవర్క్ చేసుకొని న్కూలు కెళ్లాల్సుంటే నీతో కేరమ్సాడుకొంటూ కూచోమ్మంటావా?”పేపర్లోంచి నాన్నగారు, “ఏం నిన్నంతా ఏంజేశావ్?” అడిగారు.అక్క తల పైకెత్తి చూసి, “చేసుకోలేదు' ' అని నవ్వేసి మళ్ళీ చివరిలెక్క చెయ్య డంలో మునిగి పోయింది.చంటి బాసింపట్టేసుక్కూచొని బుద్ధిగా అక్క చేస్తున్న పనివైపు చూస్తూ చదవడానికి ప్రయత్నించాడు. అసలేం అర్థంకాలేదు. విసుగుపుట్టి లేచి పెరట్లో కి వెళ్ళాడు. బంతిపూవు మీద కూచొని సీతాకోక చిలకొకటి కనిపించింది. చప్పుడు చెయ్యకుండా వెళ్ళి పట్టుకోబోయాడు. సీతాకోకచిలక ఎగిరిపోయి మరోచోట వాలింది. చంటి మళ్ళీ పట్టబోయాడు. అది ఆకాశంలోకి లేచి పెరటి గోడ దాటి ఎగిరిపోయింది. చంటి నిరాశపడిపోయి ఇంకేమన్నా సీతాకోక చిలకలున్నాయా అని చూశాడు. లేవు-ఇంకొంచెం ముందు వచ్చుంటే వుండేవి.చంటి బంతిపూలు కోద్దామా అని ఆలోచించాడు. అమ్మ తిడుతుంది. నేలమీదికి చూశాడు. పెరటిగోడ మొదట్లో గడ్డిపూలున్నాయి. వెళ్ళి ఒక్కోటి ఒక్కోటీ కోస్తుంటే వ

S1 Ep 152వంశీ గారి 'సొట్ట ఆదిగాడు' - 'మా దిగువ గోదారి కథలు' నుంచి
'సొట్ట ఆదిగాడు' అనే ఈ కథ, వంశీ గారి "మా దిగువ గోదారి కథలు' అనే కధాసంపుటి నించి.పుస్తకం కొనడానికి - https://www.telugubooks.in/products/vamsi-ma-diguva-godari-kathalu?_pos=4&_sid=1941d5909&_ss=r (ఈ లింక్ ని ఉపయోగించండి.)'సొట్ట ఆదిగాడు':ఆ వూళ్ళో వున్న అరవై ఎకరాల తోటలూ, వూరికి ఎదురుగా వున్న గోదావరి మధ్యలో వున్న వంద ఎకరాల లంకలు రావి కంపాడు రాజులవి.ఆ రాజుల తాలూకు గుమాస్తాలే వూళ్ళో వుండి కూలోళ్ళనీ పాలేళ్ళనీ పెట్టి పంటలు పండిస్తున్నారు. అదీ ఈనాటి నించి కాదు ఏనాటి నించో.అయితే, దొంగలుగానీ, దోచుకుపోయేవాళ్ళుగానీ ఆ ప్రాంతాలకి రాకండా కూలోళ్ళు పాలేళ్ళూ ఉద్దారకుడూ పగటిపూట కాపలాగాస్తే రాత్రిపూట గంగాలమ్మ తల్లి కాపలా కాస్తుంది.గంగాలమ్మంటే మామూలు మనిషి కాదు. గ్రామదేవత. మహాశక్తి, ఆది శక్తి. ఆవిడకి విగ్రహం లేదు. తోటలో ఒక పంపర పనాస చెట్టు మొదట్లో బొట్టెట్టి గుగ్గిలం పొగేసి అగరొత్తులు వెలిగించి నైవేద్యాలు పెట్టుకుని దణ్ణాలు పెట్టుకుంటారు.ఆమధ్య మాదిగ పేటలో కాళిదాసు సూరన్నగాడు తోటలో కాసే కాబూలు దానిమ్మకాయలు కోసుకెళ్లామని రాత్రిపూట వస్తే తెల్లారేసరికి ఆవిడ పాదాల దగ్గర (పంపరపనస చెట్టు మొదట్లో) రక్తం కక్కుకు చచ్చిపడున్నాడు.ఇంకోసారి లంకలో పొగాకు మోపులు పట్టుకెళ్లామని నావఁ వేసుకెళ్తే, తెల్లవారేసరికి వాళ్ల తలకాయలు పొగాకు తోటలోనూ, మొండాలు ఎక్కడో వున్న మూలస్థానం అగ్రహారం రేవులోనూ తేలాయి.పరిశోధనంటా దిగిన పోలీసులకి చంపినోళ్ళెవరన్నదిఎన్నాళ్ళకి తేలలేదు.అయినా సరే డిటెక్షను చేస్తున్న పోలీసుల్ని చూసి, నవ్వుకున్న గోపిలంక జనం, “వెర్రిగాకపోతే ...అమ్మోరు. వీళ్ళకి దొరుకుద్దా?” అనుకున్నారు.అమ్మోరు గంగాలమ్మ తల్లంటే రావికంపాడు రాజులకి చాలా నమ్మకం, చాలా భయం భక్తీనీ,ఆ తల్లిని నమ్మేవాళ్ళు ముక్కనుమ రోజున కోడిపుంజుల్నీ బోల్డన్ని మేకపోతుల్ని గొర్రెపోతుల్ని బలేస్తారు. ఆ రోజంతా ఆవిడ ముందు రక్తం గట్టు తెగిన ఏరులా పారుతూ వుంటుంది. నెర్రలు తీసిన నల్లరేగడి నేలలో ఇంకుతా వుంటుంది. అమ్మవారికి తుని నించి కొమ్ము బూరా వాళ్లని, పెద్దాపురం నించి డప్పులవాళ్లని పిలిపించి మా గొప్పగా చేయిస్తారు సంబరం. చిత్రమేంటంటే ఎప్పుడూ గుమాస్తాలకి వదిలేసే ఆ రాజులో ఒకరు మాత్రం ఆ సంబరం రోజు వచ్చి తీరతారు. అది ఆనవాయితీ..ఎడం కాలు మడం దగ్గర తోడెయ్యడంతో వేళ్ళని మాత్రం భూమ్మీద ఆన్చి నడిచే గుత్తాల ఆదియ్యని సొట్టాదిగాడంటారంతా. చాలా కష్టపడి పనిచేసే ఆ సొట్టాదిగాడి నోరు మంచిది కాదంటారు.అలాంటి సొట్టాదిగాడు రావికంపాడు రాజుల కమతంలో జేరాడు.ప్రతి ఏడు వారి వంశంలో ఎవరో ఒకరొచ్చేవారు. అలాంటిది ఆ ఏడు ముక్కనుమ రోజు ఆ రావి కంపాడు రాజులు ముగ్గురొస్తున్నారు.గోపిలంక గంగాలమ్మ వారి సంబరం చరిత్రలోనే, ఇదో గొప్ప వింతని గుమస్తాలంతా తెగ కంగారు పడిపోతా, సంబరం చాలా పెద్ద ఎత్తున జరిపించే పనుల్లో వున్నారు.రకరకాల బెత్తాయింపులు, రకరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి.తూర్పు నుండే తోటల మధ్య పడమట వేపుండే గోదావరితల్లి కనపడేలా కొబ్బరితోటల మధ్యలో అచ్చం రాజులకోటలా కట్టిన గెస్టహౌస్లోకి దిగిన రాజులు, పాలేళ్ళందరికి తలకో జత బట్టలూ నూట పదహారు! చొప్పున డబ్బులు ఇమ్మని గుమస్తాలకి ఆర్డర్లేశారు.ఎక్కడ దొరికిందో మూడు ముంతల సందకల్లు దొరికింది సొట్టాదిగాడికి. దాన్ని లాగిస్తుండగా రాజులు తోటలోకి దిగారన్న సంగతి తెల్సింది. నిషా బాగా ఎక్కేసిన ఆదిగాడికి రాజులో మాటాడాలనిపించిందిసొట్టాది గాడు అనుకుంటున్నట్లు అక్కడెవరికైనా తెలిస్తే కాళ్ళకి పలుపుతాడు మెలేసి పక్కకి లాగేసే వారు. కానీ, ఎవరి పనుల్లో వాళ్లుండటంతో ఈడ్ని పట్టించుకోలేదు.గెస్ట్ హౌస్ బాల్కనీలో కూర్చున్న రావికంపాడు రాజులకి ఈ తోటల్లో మా గొప్పగా దర్శనమిచ్చే ఆ గోదావరి తల్లి, ఈ వాతావరణం ఇంత గొప్పగా వుంటుందని ఇప్పుడే తెలిసొచ్చింది. వాళ్లు కళ్ళు మూసుకుని గంగమ్మ తల్లికి దణ్ణమెట్టుకుని ఇక నించి ప్రతి ఏడూ వస్తామని మొక్కుకున్నాకా స్కాచ్ పోసిన గ్లాసులందుకున్నారు.ఇంతలో దిగిపోయిన సొట్టాదిగాడు, “మా రాజులకి నమస్కారవండి," అన్నాడు. మందు పుచ్చుకుంటా ఎవర్నువ్వన్నట్టు చూశారు.“నన్ను సొట్టాదిగాడంటారు బాబూ..." అంటా ఆ రాజుగారి నోట్లో వున్న దాన్ని చూసి, "తవరి నోట్లో అదేంటండి తెల్లగా అంత పొడుగ్గా వుంది," అన్నాడు.నవ్వేసిన రంగరాజు, "ఇదా? దీన్ని కింగ్ సిగరెట్ అంటార్లే... సిగరెట్ కోసమొచ్చావా?" అనందిస్తుంటే సిగ్గుపడతా తలొంచుకుని, “వద్దండి బాబూ నా దగ్గర గుర్రంబీడి వుందండి." అన్నాడాదిగాడు."అయితే సరే," అనుకుంటా సిగరెట్లు వెలిగించి స్కాచ్ తాగుతున్నారు.వాళ్ళ ముందు చతికిలబడిపోయిన సొట్టాదిగాడు, “ఎంత కింగయినా గుర్రం లేకపోతే వేస్ట్ కదండీ,” అనడంతో గతుక్కుమన్న రంగరాజు, "ఈడికి బాగా ఎక్కేసినట్టుంది.” అన్నాడు."స్కాచ్ పక్కన నీచు కాదండి... కొంకిడికాయ రసం కలిపిన సందకల్లు తాగండి. అసలు కిక్కేంటో తెలుస్తది." అన్నాడు సొట్టాదిగాడు.మూడో రౌండు పోసుకుంటున్న పర్వతాలరాజుగారు, “ఏరా.... పండగపూట ఒంటిమీద బట్టలు చేతిలో డబ్బులూ పడేసరికి మాట తేడా వచ్చేసింది,” అన్నారు.నవ్వేసిన సొట్టాది, "మావి మాటలే బాబూ... సేతలు మాత్రం మీవి.." అంటా లేచి, “ఏవండి... జత బట్టలు జీవితమంతా సరిపోతాయా... నూట పదార్లుతో నేను సచ్చిదాకా కల్లు తాగల్నా" అనడంతో చిరాకు పడతా లేచిన పర్వతాలరాజు, “మరి మీలాంటి కూలి నాకొడుకులకి మా భూములు బంగ్లాలూ రాసెయ్య మంటావా?" అన్నాడు."నిజంగా కూలోడు మీ కొడుకైతే తెలుస్తదండీ కష్టమేంటో."సొట్టాదిగాడి నడ్డి మీద తన్నడానికి లేచిన రంగరాజుని కూర్చోబెట్టారు బంగార్రాజుగారు. అయినా కోపం ఆగని రంగరాజు, “ఏంట్రా నోరు లెగుస్తుంది," అన్నాడు.“కూలోడు గోదారితల్లిలాంటోడండి... ఆడెప్పుడు గోపాదాలరేవులో గోదారమ్మలాగ మెదలకండానే వుంటాడండి... సిరాకేస్తేనే ఇదిగో ఇప్పుడు నాలాగ రెచ్చిపోతాడండి," అన్నాడు సొట్టాదిగాడు."అసలు వీడ్నిక్కడికెవడు రానిచ్చేడు," అంటా చిరాగ్గా లేచి ఆదిగాడ్ని తన్నడానికెళ్ళబోతున్న రంగరాజుని వెనక్కి లాగిన బంగార్రాజు, "ఈ ఈవినింగు మనకో ఎంటరటైనుమెంటీడు. సీరియస్సవ్వకండా కూర్చో జెబుతాను," అని కూర్చోబెట్టి సొట్టాద

S1 Ep 142'నైట్ డ్యూటీ' - డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు గారి కథ
“ తెరిచిన గుడిలాంటిది హాస్పటల్. బిహేవ్ లైక్ ఎ డివోటెడ్ ప్రీస్ట్” ఏమి జోక్ వేశారు సార్! కలకాలం గుర్తుంచుకోవాల్సిన జోక్. పగిలిన సిరంలు, మొద్దుబారిన నీడిల్సూ, ఎక్స్పయిరీ డేటు అయిపోయి 'మృత్యువు నోట్లో పాలపీకలం' అన్నట్లుగా చూస్తున్న స్క్రిప్టో పెన్సి లిన్లూ, నైవేద్యపు చీరపై మెన్సెస్ మరకలా ఫంగస్ పట్టిన సెలైన్ బాటిల్సు- ఇది సార్ హాస్పటల్ అంటే. తుప్పు పట్టిన మంచాలూ, అన్ని రకాల బాక్టీరియాలకూ, వైరస్లకూ ఆహ్వానం పిలికే ముసలి వేశ్యల్లాంటి బెడ్లు, వాటి పై భగవంతుని కర్మాగారంలో పనికిరాక పారవేసిన యంత్రాల్లాంటి పేషెంట్లు. “పేషెంట్ ఈజ్ ది రియల్ టీచర్! అతన్ని గౌరవించు. ప్రేమించు.” సార్ చెప్పిన ఆణిముత్యాలే యివి. “కొంగర్లు తిరుగుతూ ఏమిటా సిగ్గు, ఇప్పుడే సమర్త ఆడిన దాన్లా! జాకెట్టు పైకి లాక్కో. డాక్టరుగారు గుండె పరీక్ష చేస్తారు.”“మగాయన కదమ్మా! సిగ్గేస్తుంది". -“ఏమి నీలుగుతున్నావే! అంత సిగ్గయిన దానివి వెయ్యి రూపాయిలు పట్టుకుని ఏ ప్రైవేటు నర్సింగ్ హోమ్ కో వెళ్ళక పోయావా? ఊరికే మందిస్తామంటే నకరాలు పోతున్నావే!” స్టాఫ్ నర్సు అరుపులు.కాండ్రించి ముఖం పై ఊసినట్లుగా ఒక అసహ్యకరమైన అవమానంలా ఆవేల్టి నా నైట్ డ్యూటీ మొదలైంది.రాత్రి తొమ్మిదింటికి రొటీన్ రౌండ్స్ - చేస్తున్నాను. “సార్! ఈ పేషెంటుకు మందులివ్వద్దన్నారు పెద్ద డాక్టరుగారు. మన చేస్తే ఎనాల్డినో, ఐరన్ టాబ్లెట్ ఇవ్వమన్నారు. అబ్జర్వేషనట. డయాగ్నోసిస్ ఇంకా కాలేదట.” డ్యూటీ నర్సు వినయంగా చెప్పింది. అబ్జర్వేషనా వల్లకాడా. రేటు వుండదు. డబ్బు చేతిలో పడితేనే ట్రీట్మెంటు. ఈ లోపల పేషెంటు కాస్తా టపా కట్టేస్తాడు. ఈ హాస్పటల్లో, డాక్టరే ఒక నయం కాని వ్యాధి. ఇక్కడ పేషెంటు సిలువ పైన జీసస్. హౌస్ సర్జన్లు ద్రోహం చేసిన జూడాస్. ఏం చెయ్యగలను మందులివ్వకుండానే ముందుకు కదిలాను.మరో పేషెంటు. “ఏమిటి తల్లీ నీ బాధ!' “ఇదో స్పెషల్ కేసు సార్. గైనిక్ వార్డు కేసు. కార్డియాక్ ట్రబుల్ అని మనకు రిఫర్ చేశారు. ఇదో 'విడో' సార్! మొగుడు చచిది నాలుగేళ్ళవుతోంది. డబ్బిస్తారని ఆశతో స్టెరిలైజేషన్ క్యాంప్ కొచ్చి ట్యూబెక్టమీ చేయించు కొంది. పి.జి. స్టూడెంటు ఎవరో చేశాడట ఆపరేషను. కాంప్లికేషన్స్ డెవలప్ అయినాయట. అక్కడుంటే గొడవవుతుందని మన ముఖాన పడేశారు,” నర్సు చెప్పింది. కళ్లనిండా సిగు. దైన్యం నింపుకొని, “బిడ్డలకు రెండు పూటలైనా కడుపునిండా తిండి పెడదామని ఈ కక్కుర్తి పని చేశానయ్యా! నాకేమన్నా అయితే బిడ్డలు అనాథలవుతారు. దయ చూపండి బాబు,” అంటూ చేతులు జోడించింది పేషెంటు. -నీ బాధలూ, గాథలూ ఎవరికి అర్థం అవుతాయి తల్లీ! నువ్వో 'ఒళ్ళు బలిసిన లం...'గానే మా నర్సుకు కనిపిస్తావు. నువ్వో 'చిరాకు కలిగించే న్యూసెన్సు లాగే డాక్టర్లకు తోస్తావు. నీ ఆకలి, నీ అమ్మ ప్రేమ ఎవరికర్థం అవుతాయి.రౌండ్స్ ముగిసేసరికి పదకొండు దాటింది. “స్పెషల్ వార్డులో ఖైదీ ఒకడున్నాడు. అటెండుకండి సార్. నక్సలైట్ లీడరట. బాగా పోలీసు బందోబస్తు వుంది. జైల్లో సూసైడ్ ఎటెంప్ట్ చేశాడట. పొద్దునొచ్చింది కేసు. స్పెషల్ కేసు అని మరీ చెప్పాడు పెద్ద డాక్టరు.” నర్సు , నేనూ స్పెషల్ వార్డువైపు కదిలాం. ఈదేశంలో కెల్లా ప్రతిభావంతులైన రచయితలు పోలీసులే. జైల్లో ఆత్మహత్య' ఈ థీమ్ పై రోజుకో రసవత్తరమైన కథానిక. కథల పోటీల్లో బహుమతులన్నీ వీళ్లకే ఇవ్వాలి.కాలి పొడవునా బాండేజ్. ఎముకల పోగులా వున్నాడాయన. నెరిసిన తల. దీర్ఘ కాలపు ఆలోచన. అలుపుతో అర్ధనిమీలితాలైన కళ్లు. చిరునవ్వుతో 'హలో' అని పలక రించాడు. బాండేజ్ మార్చి, సి.పి. ఇంజక్షన్ ఒకటి ఇచ్చాను. “నొప్పి ఎక్కువగా వుంటే చెప్పండి. ఎనాల్జిన్ ఇస్తాను,” అని అడిగాను.“శరీరపు బాధలకు మనస్సు రెస్పాండ్ కావడం ఎప్పుడో మానేసింది నేస్తం! ఉద్యమ విజయాలే మాకు నిజమైన మెడికేషన్,” అంటూ నవ్వాడాయన. ఆయన నవ్వులో చిత్రమైన ఆకర్షణ వుంది. గుడ్ నైట్ చెప్పి బయటకు వచ్చాను. మెరుస్తున్న కళ్ళతో వీడ్కోలు చెప్పాడాయన.రాత్రి పన్నెండు దాటింది. అలసటతో డ్యూటీ రూమ్ వైపు కదిలాను. లోపలికి అలెట్ వేసి, అక్కడ దృశ్యం చూసి షాక్ తిన్నాను. బెడ్ పై నల్లటి తుమ్మమొద్దులాంటి మగ పశువు. వాడి చుట్టూ నగ్నసర్పంలా అల్లుకుపోయిన స్త్రీ, గాడ్! ఈమె ఝాన్సీ, నర్సింగ్ స్టూడెంటు. ఆ అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడలేదు. భయపడలేదు."ప్లీజ్ డాక్టర్! లైటు తీసివేయండి! ఈ రాత్రికి మీరు క్యాజువాలిటీ డ్యూటీ రూమ్ లో ఆస్ తీసుకోండి,” అంటూ పక్కన సిగ్గుపడుతున్న మగ పశువుపై తన నగ్నత్వాన్ని నిస్సిగ్గుగా పుతూ చెప్పింది. "డర్టీ బిచ్!" కోపం, బాధ, అసహ్యంతో బయటకు వచ్చాను. సెక్స్ ఒక ఎమోషనల్ ఇన్వాల్మంటు. వెగటు కలిగించే శావలాన్ వాసన, భీతావహమైన మృత్యువు చీకట్లో పాములాగ మన పక్కనుంచే వెళుతున్న భావన. భరింపలేని నొప్పితో నిశ్శబ్దాన్ని పాడుచేసే ఒక ఆర్తనాదమో, ఒక తెరిపిలేని దగో, ఒక విరామం లేని మూలుగో, అభాగ్య మృతుని బంధువుల విలాపమో, హాస్పటల్ ఏదో మూల నుండి వినిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో లైంగికేచ్ఛ పొందగలిగేవాళ్ళు మనుషులమని చెప్పుకోడానికి సిగ్గుపడాల్సిన వాళ్ళు.రెండు మూడు గంటలు క్యాజువాలిటీలో అసహనంగా కోపంగా గడిపి, ముఖ్య మైన కేసుల్ని మరోసారి చూద్దామని వార్డు వైపు నడిచాను. పిడియాట్రిక్స్ వార్డు మత్తుగా జోగుతూంది.కార్డియాలజీ వార్డు చప్పుడు చెయ్యని గుండెలా స్తబ్దుగా వుంది. మెడికల్ వార్డులో ఆస్మా రోగి ఆయాసం మినహా ఏ శబ్దమూ లేదు. -లేబరు వార్డు నుండి హఠాత్తుగా “ఓరి నాయనో! దేవుడో,” అంటూ అరుపులు వినిపించాయి. కంగారుగా అటు పరు గెత్తాను. “బిడ్డ బాబు! బిడ్డ! రోజుల బిడ్డయ్యా! కుక్క ఎత్తుకుపోతోందయ్యా పట్టుకోండి! నాయనా దండం పెడతా! కదల్లేని బాలెంత నయ్యా,” ముప్పయేళ్ళ తల్లి పెద్దగా అరుస్తోంది. వరండా మలుపు తిరుగుతూ రాజసంగా నడిచి వెళ్తున్న కుక్క కనిపించింది. పెద్దగా అరుస్తూ అటు పరిగెత్తాను. అరుపులకు బెదిరి నోట్లో వున్న బిడ్డను వదిలి 'యూ స్టుపిడ్' అన్నట్లు నా వైపు చూసి బయటకు పరిగెత్తింది కుక్క. బిడ్డ ఛాతీ పై పదునైన గోళ్ళరక్కులు, పళ్ళగాట్లు- గుక్క పెట్టి ఏడుస్తోంది. ఇంత హడావుడిలోనూ ఒక్క వార్డు బాయ్ కి మెల

S1 Ep 200Part 2 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు
కేంపు సైటుకి మైలు దూరంలో వుంది “వర్క్ స్పాట్”, కారడవిలో కొత్తగా రైల్వే లైను వేస్తున్నారు. వేలాది పనివాళ్ళు శ్రమించి పని చేస్తున్నారు. సూర్యోదయం నుంచి తిరిగి సూర్యాస్తమయందాకా బుల్ డోజర్లు, డంపర్లు, కేసులు ధడ్ ధడ్ మని శబం చేస్తుంటాయి. అక్కడే ఒక పెద్ద బ్రిడ్జి కూడా కడుతున్నారు. రోజంతా గుబిలు గుభిలుమని కొండ రాళ్ళు పేలుతుంటాయి. హిందుస్తానీలు, బ్రిడ్జి పనులు చేసే మళయాళీ మోపలాలు, సర్దార్జీలు, బంగాళీ బాబులు, ఒకరేవిటీ అన్ని రకాల జాతుల వారినీ అక్కడ చూడొచ్చు. ఉత్తరాదినుండి వచ్చిన కంట్రాక్టర్లు, కేంపుని వర్కు స్పాటుకి దగ్గర్లోనే వేసుకున్నారు. రైల్వే కేంపు మాత్రం మైలు దూరాన ఉంది. అటు, ఇటు కాంట్రాక్టర్ల జీపులు, రైల్వే జీపులు చాకుల్లా తిరుగుతుంటాయి.అసిస్టెంట్ ఇంజనీరుగారి జీపు ఆగగానే కంట్రాక్టర్లు సవినయంగా నమస్కారం చేస్తూ “ఆయీయే సాబ్ !” అంటూ ఎదురుగా వెళ్ళారు. ముందు సీట్లో నుంచి అసిస్టెంట్ ఇంజనీరు రామారావుగారు, వెనుక సీటునుంచి అకౌంటెంటు దశరథరామయ్యగారు దిగారు. దశరథరామయ్యగారి చేతిలో రెండు లావుపాటి ఫైల్సున్నాయి.“దశరథరామయ్యగారూ! నేను బ్రిడ్జి ఇన్ స్పెక్షనుకి వెళ్ళేస్తాను. వచ్చేటప్పటికి అన్ని కాగితాలు సిద్ధంగా ఉంచండి కాంట్రాక్టర్ల సంతకాలు తీసుకుని నా సంతకాలు కూడా చేసేస్తాను, చిన్నయ్యా! ఆ మర్రిచెట్టు కింద జీపు పెట్టి పోయి ఎక్కడేనా పడుకో, నేను తిరిగొచ్చేదాకా! పాపం, రాత్రంతా నిద్ర లేనట్టుంది!” అంటూ కంట్రాక్టర్లు అందించిన కాఫీ తాగేసి వర్కు స్పాటుకి బయల్దేరాడు. .చిన్నయ్యా, దశరథరామయ్యలు కూడా వాళ్ళిచ్చిన కాఫీలు తాగేశారు. దశరథరామయ్య మాత్రం ఎందుకో బితుకు బితుగ్గా కనపడుతున్నాడు. ఇంజనీరుగారు వెళ్ళిపోగానే పక్కనే వున్న కంట్రాక్టరు ఆఫీసు టెంటు లోనికి వెళ్ళి ఫైళ్ళు విప్పి లెక్కలు మొదలు పెట్టాడు.“పంతులుగారూ! నిద్ర ఊపేస్తోంది, నేను జీపులోకి పోయి పడుకుంటాను”. అంటూ జీపుని ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కిందకి లాగించేసి, వెనక సీట్లో ముడుచుకు పడుకున్నాడు చిన్నయ్య.రాత్రంతా నిద్రలేదేమో దశరథరామయ్యకి కూడా కునుకు ముంచుకొచ్చేస్తోంది. తమాయించుకుంటూ కాగితాలమీద లెక్కలు కడుతున్నాడు, దగ్గర్లోనే పనిచేస్తున్న బుల్డోజరు శబ్దం బుర్రని దొలిచేస్తోంది.ఇంజనీరుగారు ఇన్స్పెక్షన్ నుంచి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలయింది. ఎండ మండిపోతోంది. ఎప్పుడు పట్టేసిందో నిద్ర పాపం, దశరథరామయ్య టేబుల్ మీద వాలిపోయి అలాగే నిద్రపోయాడు. – “దశరథరామయ్యగారూ! ఆ కాగితాలవీ తియ్యండి. సంతకాలు పెట్టేస్తాను. మళ్ళా భోజనానికి టైమై పోతుంది. త్వరగా పోవాలి”. అంటూ నిద్రపోతున్న దశరథరామయ్య ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని మొగంమీద, మోచేతుల మీద కారుతున్న చెమటని “ఉస్సు”రంటూ తుడుచుకున్నాడు. దశరథరామయ్య నిద్రలోంచి ఉలికిపడి లేచి కళ్ళు నులుముకుంటూ కాగితాల ఫైలు ముందు పెట్టాడు. – ఫైల్లో కొన్ని కాగితాలు తిరగేసి ఆశ్చర్యంగా దశరథరామయ్య నిద్రమొహంలోకిచూస్తూ “పెద్ద బిల్లేదయ్యా?…….. అదే బ్రిడ్జి వర్కుది”.“చెయ్యలేదు సార్” – మనిషి గొంతుకలో తడారిపోతూ దీనంగా చెప్పాడు.“వాట్ ? చెయ్యలేదా? ఓ! మైగాడ్ “……… రామారావు కోపంతో ఊగిపోతూ క్షణం సేపు మాటాడలేకపోయాడు. ఎర్ర ధూళి, చెమట పట్టిన రామారావు మొహం కోపంతో మరింత ఎర్రబారింది. కళ్ళు చింతనిప్పుల్లాగా కణకణ లాడుతున్నాయి. “నిన్ననగా చెప్పానే ఎవడి చంక నాకుతున్నావ్ ?” అరిచాడు.“ఎక్స్క్యూజ్ మీ సార్ ! నిన్న రాత్రంతా అమ్మాయికి గడబిడ చేసింది కద సార్ …… రాత్రే బిల్లు చేసేదామనుకుంటే……”“షటప్! నీ ఇంట్లో గొడవ ఎవడిక్కావాలయ్యా? నీకు డబ్బిస్తున్నది ఆఫీసు పని చెయ్యడానికి గాని, నీ కూతురుకి పురుడొచ్చింది, అదయింది, ఇదయిందని పని ఎగగొట్టడానికి కాదు, వర్త్ లెస్ ఫెలోస్!” అని పిడుగు పడినట్టు గర్తించాడు.ఇంతలో తిరుగు ప్రయాణానికి చిన్నయ్య జీపు తెచ్చి పెంటుముందు ఆపి లోపలికొచ్చాడు.ఎదురుగా దశరథరామయ్య వెలవెలబోతూ గజగజ లాడిపోతున్నాడు. “రేపట్నుంచే నిన్ను పనిలోనుండి డిశ్చార్జి చేసేస్తున్నాను. గెటౌట్ ……. డోంట్ షో యువర్ ఫేస్; పెద్ద దొరగారు ఆ బిల్లు సంతకం చేసి అర్జంటుగా పంపమన్నారని మరీ మరీ చెప్పానే? ఇప్పుడతను నామీద దెయ్యంలాగ పడిపోతాడు. మీరంతా ఎందుకయ్యా ఉండి, నో! ముసలాడివని కనికరించి అపాయింట్ మెంటు ఇప్పిస్తే పని ఎడతావ్ ! కీప్ ఆఫ్ఫ్రమ్ మీ డర్టీ ఫెలో!” అంటూ ఇంకా కోపం పట్టలేక టేబుల్ మీదనున్న ఫైలు తీసి దశరథరామయ్య మొహం కేసి కొట్టాడు. అసలే భయంతో సగం చచ్చిపోయిన దశరథరామయ్య ఉద్యోగం పోతుందనేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి. దాంతో ఫైలు మొహానికి తగలగానే కళ్ళు తిరిగిపోయి పడిపోయాడు. పక్కనున్న కంట్రాక్టరు మనిషెవడో పట్టుకుని కింద పడుకోబెట్టి మొహం మీద వీళ్ళు చల్లాడు. ఇది చూస్తున్న మిలిట్రీ చిన్నయ్యకి నెత్తురు మరిగిపోయింది. “నువ్వు మనిషివా, రాక్షసుడివా?” అని పిడికిలి బిగబట్టి గట్టిగా అరుస్తూ ఇంజనీరు మీదికి పళ్ళు కొరికి వెళ్ళబోతూ, తమాయించుకుని ఆగిపోయాడు. రామారావు అమాంతంగా నిర్ఘాంతబోయాడు. “ఏవిటి, డ్రైవర్ చిన్నయ్యేనా, ఇలా అంటున్నాడు” అని తన కళ్ళని తనే నమ్మ లేక, కోపంతో వణికిపోతున్న చిన్నయ్యని చూస్తూ క్షణం పాటు అలా వుండిపోయాడు.“ముసిలోడ్ని కొడతావా? నువ్వు మనిషివేనా?” అని మరోసారి గర్జించాడు.కేకలు విని అంతా చుట్టూ చేరారు. ఇది చూసిన రామారావు అహం దెబ్బతింది. తన దగ్గర పనిచేసే ఒక జీపు డ్రయివరు అంతమంది ఎదుట అలా తనపై కేకలేస్తూంటే సహించలేకపోయాడు. “ఏవిటిది చిన్నయ్యా నువ్వేమన్నా తాగావా? నువ్వెవరివి ఇందులో జోక్యం కలుగ జేసుకోవడానికి!”“నేనెవడినా! నీలాంటి జంతువును కాను, మనిషిని. ముసలోడు రాత్రంతా పని చేస్తాడు. నిన్న రాత్రయితే అసలు కంటికి కునుకేలేదు. ఏదో పని మిగిలిపోయిందని కొడతావా? ముసిలోడు సొమ్మసిల్లిపోయాడు. చచ్చిపోతేనో?……. మీకిష్టం లేకపోతే ఉద్యోగంలోంచి తీసేయండి. కొట్టడానికి మీకేం పవర్సున్నాయి?” అని మిలిట్రీ ఊపుతో విరుచుకు పడిపోతూంటే అందరూ నివ్వెరపోయి చూస్తున్నారు. –“నాకేం పవర్సున్నాయా? అమ్మ రాస్కెల్! ఇంత పొగరు పట్టిందిరా నీకు?” అంటూ విసురుగా మీదికి వెళ్ళాడు.చిన్నయ్య తర్జని చూపించాడు. “మంచిదికాదు సార్ ! తొందరపడకండి చెప్త

S1 Ep 199Part 1 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు
‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారి ‘అరణ్య ఘోష’ కథాసంకలనం లోనిది.పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు.బాల్యం ఒరిస్సా లోని ఛత్రపురంలో గడిచింది. చుట్టుపక్కల ఎక్కువ అటవీ ప్రాంతం.ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగింది.అటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాసారు. రాసిన పదిహేడు కథల్లో సమాజంలో వుండే అసమానతలూ, అట్టడుగు వర్గాల జీవితాలపై విశ్లేషణ, ముఖ్య ఇతివృత్తాలుగా , మనకు కనిపిస్తాయి.కథల్లో ప్రకృతిని వర్ణించేటప్పుడు ఆయనకున్న పరిశీలనా జ్ఞానం , భావుకత్వం మనల్ని కట్టి పడేస్తాయి.1981 లో ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం లభించింది.*** కథను ప్రచురింపడానికి అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి, శ్రీ రఘునాథ్ అల్లం గార్లకు కృతజ్ఞతలు.కథను ‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1(Harshaneeyam on Gaana app)స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam(Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5(Harshaneeyam on Apple. Podcast)వఱడు :రాత్రి పదిగంటలు కావస్తోంది. ఆ కీకారణ్యమంతటా పేరుకున్న నల్లటి జారు ముద్దలాంటి చీకటి అలుముకునుంది. కేంపు గూడారాలు మాత్రం తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయ్. మధ్యలో అక్కడక్కడ కేంపు పనివాళ్ళు వన్య మృగాల బారినుండి రక్షించుకోడానికి వేసిన మంటలు, దూరాన్నించి కొరివి దెయ్యాల్లా కన్పిస్తున్నాయ్. గుడారాల్లో హరికెన్ లాంతర్లు మిణుకు మిణుకు మంటూంటే, ఆఫీసు టెంటుల్లో పెట్రోమాక్సు లైటు వెలిగిపోతోంది. దశరధరామయ్య గారు ఇంకా ఆఫీసు పనిచేసుకుంటున్నారు. అలా రాత్రి ఒంటి గంట వరకూ ప్రతిరోజూ పని చెయ్యడం ఆయనకి పరిపాటే. –చిమ్మెట్టలు “జూయ్ “మనిచేసే శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా వుంది. ఎక్కడో దూరంగా కొండల్లో కొండ గొర్రె అవిరామంగా “కార్ కార్ “మని అరుస్తోంది. దశరధ రామయ్యగారికి చిన్న దగ్గుతెర వచ్చింది. కాస్సేపు గొంతుకలో కఫం తగ్గేదాకా దగ్గి, గుండెని చేత్తో పట్టుకుని టెంటు తెర తొలగించి బైటకొచ్చి తుపుక్కున ఉమ్మాడు. ఆయాసం కాస్త తేలికపడిన తరవాత, ఇహ ఇవాల్టికి ఇంటికి పోదామనుకున్నాడు. – కానీ ఇంకా బోలెడు పనుండి పోయింది. ఐనా ఇప్పుడు టైము ఎంత అయుంటుందో అని చిన్నయ్య గుడారం వైపు చూశాడు.జీపు డ్రైవరు చిన్నయ్య హెడ్ క్వార్టర్సులో వుంటే, సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు ఎన్ని పనులున్నా లైటార్పేసి పడుకుంటాడు. అది అతని ఎక్సు మిలిటరీ డిసిప్లేన్ అంటాడు.ఇంకా లాంతరు గుడారంలో వెలుగుతోంది. అంటే పన్నెండు కాలేదన్నమాట. సరే మరో గంట పనిచేసి పోదామని టెంటు లోకి దశరధరామయ్యగారు దూరుతుండగా “ఠకాలు”మని బూట్లు కొట్టుకున్న చప్పుడు, వెంటనే “గుడ్ నైట్ పంతులు బాబూ” అనే అరుపుకూడా వినిపించింది. అకస్మాత్తుగా మిలిట్రీ కాషన్ లాంటి అరుపు వినపడగానే ఉలిక్కి పడినా, అది చిన్నయ్య కేకే అని పోల్పేసుకున్నాడు. “ఆఁ రావయ్యా! నిద్రపోలా!” అని పలకరించాడు. తన గుడారం ముందు అటెన్షన్ ఫోజులో సెల్యూట్ చేస్తూ నిలబడ్డాడు చిన్నయ్య,“రాత్రుళ్ళు కూడా నీ మిలిటీ సెల్యూట్లేనా మిలిట్రీ వదిలేసినా, ఇంకా ఆ డ్రెసులూ వీశడు బరువు బూట్లు, మిలిటీ సెల్యూట్లూ మానవు గదా….. రావయ్యా!…… భోంచేశావా?” అనడిగాడు దశరధరామయ్య..“ఇప్పుడే అయింది బాబూ, చుట్ట కాల్చుకుందామని బైటికొచ్చాను. మీరింకా పని చేస్తున్నారా? అసలే మీ హెల్తు మంచిదికాదు. ఉబ్బసపోళ్ళు. ఈ చలికాలం ఇంతవరకూ పని చేస్తే ఒళ్ళు పాడైపోతాది, ఇంటికెల్లి పడుకోండి బాబూ, అమ్మగారొక్కరూ బితుకు బితుకు మంటుంటారు”.“అప్పుడే ఎక్కడయ్యా? ఇంకా నన్ను తగలెట్టినంత పనుంది. ఒంట్లో బాగా లేదని పంచేయడం మానేస్తే ఊరుకుంటారా? అందులోనూ రిటైరైనవాడ్ని, కనికరించి తిరిగి వేసుకున్నారు. సరిగా పని చెయ్యకపోతే పీకి పారెయ్యరూ……..”“బాబూ! ఇప్పుడు మీకు అరవై దాటుంటాయనుకుంటాను. ఇంకా ఎన్నాళ్ళిలా కష్టపడతారు?”“చచ్చేవరకూ……! తప్పదు చిన్నయ్యా, చావకుండా బతికుండాలంటే చచ్చేదాకా పని చెయ్యక తప్పదు. లేకపోతే నాకు, నా పెళ్ళానికి ముద్ద ఎలా గడుస్తుంది. ఊళ్ళో చదువుకుంటున్న నా కొడుకును ఎవరు చూస్తారు?” అని బరువుగా భయంగా నవ్వి టెంటు లోకిపోయి కళ్ళు తడుచుకుంటూ కాయితాల ముందు కూర్చున్నాడు దశరథరామయ్య. కంట్రాక్టరు బిల్లులోని వేలు, లక్షల రూపాయలు – అతని కళ్ళకు గజిబిజిగా కనిపించాయి.. “ఏవిటో, పంతులు బ్రతుకు” అంటూ సానుభూతిగా పెదవి విరిచి చుట్ట కాల్చుకోడానికి మంటదగ్గరకి నడిచాడు చిన్నయ్య. మంచు బాగా కురుస్తుండడంవల్ల మంటలు సన్నగిల్లి పోతున్నాయి. పనస చెట్టుమీదనుండి ఉండుండి మంచు బొట్లు మంటల మీదపడి సుయ్ సుయ్ మంటున్నాయి. నీరసించిపోతున్న మంటని బూటుతో తన్ని ఎగదోశాడు చిన్నయ్య, చిటపటమంటూ నిప్పురవ్వలు ఉవ్వెత్తున లేచాయి. పక్కనున్న ఎండుపుల్లల్ని, ఆకుల్ని ఏరి తెచ్చి మంటలో పడేసి రెండు మూడుసార్లు మళ్ళా బూటుతో తన్ని ఎగదోశాడు. పనస చెట్టు మొదట్లో కూర్చుని చుట్ట తీసి, మంటలోనుంచి ఒక కొరకంచు పుల్లతీసి వెలిగించుకున్నాడు చుట్ట. భగ భగ మని చుట్టపొగ వదుల్తూ సెగ కాచుకుంటున్నాడు. ఫళఫళమంటూ, ఎత్తుగా లేస్తున్న మంటలకి అందుబాట్లోనున్న పనస ఆకులు మాడిపోతున్నాయి.ఉండుండి కొండ గొర్రె అరుస్తూనే ఉంది. కొండల్లో నుండి పొగ వాసనతో నిండిపోయింది ఆ ప్రాంతమంతా. గాలేసినప్పుడల్లా చెట్టుకి పండిన బురదపనస మత్తు వాసనల్ని గుభాళిస్తోంది. ఉండుండి…… మంటల్లోని నిప్పులు చట్ ఛట్ మని పేలుతున్నాయి.చిన్నయ్య తన ఎడంవైపు టెంటు లోకి చూశాడు, ఎవరైనా మేలుకునున్నారేమోనని, అది దశరథరామయ్య కుటుంబం ఉండే టెంటు. లైటు బాగా దించేసుంది. “పంతులమ్మగారు పడుకునుంటారు ఫరవాలేదు” అని చుట్టి పారేసి మెల్లగా జేబులోంచి సీసా తీశాడు. వాటర్ సీసాలో పోసి తెచ్చుకున్న నాటుసారాని డగ్ గ్ మని రెండు గుటకలు మింగాడు. అసహ్యంగా ” బ్రేవు”మని తేన్చుకుంటూ సీసావెపు చూశాడు. మీసాలకి అంటుకున్న సారా బొట్టుని కాసేపు అనుమానంగా నాలికత

S1 Ep 148సి.రామచంద్ర రావు గారి 'ఏనుగుల రాయి'!
సి.రామచంద్ర రావు గారు రాసిన ఈ కథ ‘వేలుపిళ్లై’ అనే కథా సంపుటం లోనిది. కథను మీకు హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన రామచంద్ర రావు గారికి కృతజ్ఞతలు. వచ్చే వారం హర్షణీయంలో రామచంద్ర రావు గారితో ఇంటర్వ్యూ మీరు వినవచ్చు.అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా , మార్చి రెండో వారంలో ‘వేలు పిళ్ళై కథలు ‘ కొత్త ఎడిషన్ రిలీజ్ అవుతోంది.కథలోకి వెళ్లబోయ్యే ముందు ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటల్లో రామచంద్ర రావు గారి గురించి –‘పొగడ పూలు’:గొప్ప కథలు రాసిన టాప్‌టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్కపేరు చెప్పమని అడగ్గానే చాసోగారు ఠక్కున చెప్పిన పేరు సి. రామచంద్రరావు.రాసికన్న వాసికే విలువనిచ్చే అమితమిత రచయితలలో చాసో తరువాత సి. రామచంద్రరావు గారినే చెప్పుకోవాలి.యాభై అరవై యేళ్లలో సి. రామచంద్రరావుగారు రాసినవి తొమ్మిది కథలే!నల్లతోలు, వేలుపిళ్లై, ఏనుగులరాయి, టెన్నిస్ టూర్నమెంటు, గాళిదేవరు, కంపెనీలీజ్… మైగాడ్! వేటికవే! ఇన్నేళ్ళయినా వాడిపోని పొగడపూలు, అపురూపాలు, ఆరనిదీపాలు.ఇవి నిజాయితీ గల కథలు అన్నారు చాసోగారు.రోజూ ఎన్నో కథలు చదువుతున్నా, కథలలో మునిగితేలుతున్నా మళ్ళీ ఈయన కథ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేటంతటి అపురూప శిల్పాలు అన్నారు నండూరి రామమోహనరావు గారు.ఆంధ్ర సచిత్ర వారపత్రికలో – ఆ గోల్డెన్ పీరియడ్‌లో నండూరివారి సరసన సహాయకుడిగా పనిచేసిన నేనూ, రావుగారి కథలకు బొమ్మలు వేసిన బాపూ ఈ కథలు చదివి త్రిల్లయిపోయేవాళ్ళం. చెప్పుకుని తల్చుకుని మురిసిపోయే వాళ్ళం…కావ్యాల్లాంటి కథలు అన్నారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు.అంతర్జాతీయ స్థాయిగల కథలు అన్నారు ఆదివిష్ణుగారు.ఎన్నోయేళ్ళు – ఉహూ, ‘హూ – టీ’ ఎస్టేట్స్‌లో ఉన్నతాధికారిగా ఉన్న ఈ లాయర్ – మానేజర్- తెల్లదొరల – నల్లదొరల మధ్య హాయిగా విహరించారు. వెలుగునీడలు చూశారు. మనకు చూపించారు. టెన్నిస్ ఛాంపియన్‌గా ఎన్నో ట్రోఫీలు గెలిచారు. రావుగారి సోదరులందరూ టెన్నిస్ ఆటగాళ్ళే. ఒక సోదరుడి కొకొడుకు – వింబుల్డన్ ప్లేయర్ మహేష్ భూపతి.రామచంద్రరావు గారు మనతో మాట్లాడేది తెలుగే అయినా టెలుగులా వినపడుతుంది. స్టయిలు హొయలు అంతా ఇంగ్లీషే. మాటా ఇంగ్లీషే. కాని మనసంతా తెలుగు. రామచక్కని తెలుగు. స్పష్టమైన ఖచ్చితమైన తెలుగు.ఈ తెలుగు కథలకు పుట్టినిల్లు రావు గారి కలం అయినా చాలా కథలకు మెట్టినిల్లు తమిళనాడు! తమిళతంబీలు చాలమంది కనిపిస్తారు. అయినా వాళ్ళంతా మనవాళ్ళయిపోయి మనలో ఒకళ్ళయిపోతారు. అదీ రావుగారి శిల్పం – ప్రజ్ఞ!ఇంగ్లీషు, తెలుగు, తమిళ పాత్రల చుట్టూ అల్లిన ఈ కథలు – ఏ దేశంలోనయినా రాణించే కథలు…. మాటల వెనక మనసులను ఎక్స్‌రే తీసి చూపించగల కథలు. అన్‌హెర్డ్ మెలోడీస్ ఆర్ స్వీటర్ స్టిల్ అన్నట్టు – ఆకుచాటుపిందెలా, మబ్బుచాటు వెన్నెలలా, నీడచాటు నీడలా – ఆయన కథలలో మాటచాటు మాటల అంతరంగ తరంగాలు – అపురూప శిల్పాలు.గంగిగోవుపాలు గంటెడైనను చాలు అని వేమన్న అన్నా – ఈ గోవు మరిన్ని పాలు చేపాలని రావుగారిని కోరుకొందాం.అంతవరకూ ఆయన రాసిన ఆ కాసినీ మేసిమేసి నెమరేసి ఆనందించుదాం…-ముళ్ళపూడి వెంకటరమణ.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 207స వెం రమేష్ గారి 'ఉత్తర పొద్దు' - 'ప్రళయకావేరి కథలు' సంకలనం నుంచి
‘ప్రళయ కావేరి కథలు’ పుస్తకం కొనాలంటే - https://bit.ly/2TXhEubఉత్తర పొద్దు :మా ఊరిని ఆనుకొనే ఉంది. ప్రళయకావేరి. సుమారు ముప్పై మైళ్ల పొడవు .. పది మైళ్ల వెడల్పు ఉన్న సరస్సు అది. ప్రళయ కావేట్లో నలభై వరకూ దీవులు న్నాయి. వాటికి రకరకాల పేర్లు. వాటిల్లో కొన్ని దీవుల్లో మాకు చుట్టాలున్నారు.ఆ దీవుల్లో ఒకటి 'జల్లల దొరవు.' విసిరేసినట్లు ఒక మూలగా ప్రళయకావేరి ఒడిలో ఒదిగి ఉండేది. ఆ దీవిలో నాకు వరసకు మామ ఒకాయన ఉండేవాడు. వాళ్లింటికీ మా ఇంటికీ రాకపోకలు ఉండేవి. నేను కూడా అప్పుడప్పుడూ అక్కడకు పోతుండేవాడిని.జల్లల దొరువు ప్రయాణమంటే చిన్న విషయం కాదు. తెల్లవారి అయిదు గంటలకు మొదలుపెడితే రాత్రి ఏడుకో, ఎనిమిదికో ఆ దీవికి చేరేవాళ్లం. అంటే ఒక పగలంతా ప్రయాణమే. కాసేపు నీళ్లల్లో నడిచి కాసేపు దీవుల్లో నడిచి ఒక దీవి నుంచి ఇంకో దీవిని దాటి చేరుకోవాలి. ఇంతా చేసి మా ఊరికి, జల్లల దొరువుకి నడుమ దూరం పాతిక కిలోమీటర్లలోపే.ప్రళయకావేట్లో ప్రయాణం ఒక వింత అనుభూతి. నడిచి నడిచి కాళ్లు పీకుతున్నా, ఇంకా నడవాలనే మనసు పీకుతుంటుంది. ఎండా, వానా, మంచు.... ఇవన్నీ కాలానికి అనుగుణంగా సరస్సులో ఎరగనన్ని వన్నెలు చూపించేవి. మా ప్రయాణం ముచ్చట్లు మొదలు పెడితే మీకూ తెలుస్తాయి ఆ వన్నెచిన్నెలు.ఒకసారి నేనూ, మా వెంకటన్న, నా నేస్తాలు శీనయ్య, చెంగయ్య నలుగురం ప్రయాణం కట్టినాము ప్రళయకావేరిలో, శీనయ్య, చెంగయ్యలు 'రాగన్న పట్టెడ'కు, నేనూ, మా అన్న జల్లల దొరువుకు. అప్పుడు నా వయస్సు పన్నెండో, పదమూడో ఉండొచ్చు. అప్పటికి ఉత్తరకార్తె పెట్టి రెండు దినాలయింది. ఆ ఏడాది మఖ, పుబ్బల్లోనే గట్టి వానలు పడినాయి. అందుకే మా అమ్మకూ, మా అవ్వకూ మా ప్రయాణమంటే దిగులు.'దార్లో వానొస్తే 'రాగన్నపట్టెడ'లోనే నిలిచిపోండి. ఉత్తరపొద్దులో కావేట్లో దిగబాకండి' మా అమ్మ హెచ్చరించింది.'ఉత్తరపొద్దంటే వాళ్లకేం తెలుస్తాదమ్మే' అని మాయమ్మని ఒక్క కసురు కసిరింది మా అవ్వ.మావైపు తిరిగి 'నాయినా ! మద్దినేళ మడకలిప్పే పొద్దులో పెళయకావేట్లో నడవబాకండ్రా' అనింది. 'పునమాల తిప్ప దాటినాక, చిన్నతోటకు పొయ్యే దాకా దిగులుతిప్పలెక్కువ. చూసి నడవండి' మా పెద్దమ్మ సలహా ఇచ్చింది. 'దిగులుతిప్ప' అంటే ఒక రకమైన బురదగుంట. ఊబి కాదు. ఇందులోకి దిగితే నడుములదాకా కూరుకుపోతాము.'ఉత్తరపొద్దు బిడ్డల్ని ఏమారస్తాదేమో' మా అమ్మ గొణగసాగింది.ఆడవాళ్ల సణుగుడంతా విన్న మా తాత లేచి, 'మేయ్! గమ్మునుంటారా? లేదా? అయినా పంట రంగస్వామి లేదా. ఏదన్నా అయితే చూసుకొనేదానికి. పోయిరానీ వాళ్లని' అన్నాడు.మా వైపు చూసి, 'అబయా. నలగామూల దాటినాక పెళయకావేరమ్మకు సక్కలగిలెక్కువ. మునేళ్లు అదిమి పెట్టి నడవండి. లేకపోతే గెబ్బిడు గెబ్బిడు ఎంట్ర కాయల్ని జవరాల్సిపడతాది' అన్నాడు. అంటే నలగామూల దగ్గర జారుడు ఎక్కువ. జాగ్రత్తగా నడవకపోతే పడతామని చెప్పడం. అప్పటికి మా పల్లెల్లో తమదల (రాగుల) వాడకం ఇంకా ఉంది. చిక్కటి మజిగ కలిపిన గట్టి అంబలిని స్టీలు టిఫిన్లో పోసిచ్చినారు. అట్లే రెండు పులుసన్నం పొట్లాలు కట్టిచ్చినారు. తెల్లవారి ఆరుగంటలకు 'అటకానితిప్ప'కు పొయ్యే బస్సు ఎక్కి కూచున్నాము. బస్సు బయల్దేరి కసారెడ్డిపాళెం, చెరువుకండ్రిగ, దావాది గుంటలు దాటి కుదిరికి వచ్చింది. కుదిరి వస్తే మా ఆనందం ఎక్కువవుతుంది. కదిరి దాటగానే ప్రళయ కావేరి మొదలవుతుంది. ఇక కనుచూపు మేరా నీలాలు ఆరబోసినట్లు నీళ్లు.ప్రయాణించి 'అటకానితిప్ప'లో మమ్మల్ని దించింది, బస్సు. కావేరిలోని దీవులకు కేంద్రం 'అటకానితిప్ప 'దీవి. దీవులలో ఉండేవాళ్ళు ఆ పేటకు (మా ఊరికి) రావాలంటే 'అటకాని తిప్ప'కు వచ్చే బస్సు ఎక్కాలి.మూడునాళ్లుగా ముసురుపట్టిన మబ్బుల చాటు నుంచి సూర్యుడు తొంగి తొంగి చూస్తున్నాడు. అటకాని తిప్పలోని వినాయకుడి గుడి దగ్గరకు పోయి తెచ్చుకొన్న అంబలిలో కొంచెం తాగినాము. ..'ఏ ఊరికి సిన్నా?' ఒక ముసలాయన అడిగి నాడు. 'మేము జల్లల దొరువుకీ, వీళ్లు రాగన్నపట్టెడకీ' ఇద్దరి తరపునా నేనే చెప్పినాను. 'జల్లల దొరువా ! నాయినా దూరాబారం బొయ్యేవోళ్లు. బిన్నా బయల్దేరండి. తూరుపుగాలి మళ్లింది. వానొస్తాదేమో! ఇప్పుడు పెళయకావేట్లో దిగితేగానీ సద్దికూటేళ్లకు 'కొరిడి'కి పోలేరు. ఉత్తరపొద్దులో యాడ్నో ఒక దెగ్గిర నిలబడిపోండి' అన్నాడా ముసలాయన.మేము ఆ మాటతో దెబగుబా ప్రళయకావేట్లో దిగినాము. తూరుపు నుంచి చల్లగాలీ లేత ఎండా కలిసి మమ్మల్ని గిలిగింతలు పెడుతున్నాయి. వానలు బాగా పడి సరస్సంతా నిండుగా ఉంది. అడుసు మీగాళ్లనూ, నీళ్లు మోకాళ్లనూ దాటుతున్నాయి. వలసపక్షులు కూడా కొంచెం ముందుగానే వచ్చినట్లుండాయి. ఉల్లంకి పిట్టలు వేలకు వేలు బార్లు కట్టి నిలబడి ఉన్నాయి. వాటి రెక్కల పసిమి ఛాయ, నీటి నీలివన్నె, ఎండ బంగరు రంగు కలిసి ప్రళయ కావేరి కొత్త హొయలు పోతోంది..రెండుగంటల సేపు నీళ్లల్లో కాళ్లీడ్చుకొంటూ సాగిన మా నడక 'కొరిడి' దీవికి చేరి కుదుటపడింది. దీవంటే గట్టినేల. కాలు చకచకా సాగుతుంది. అప్పటి దాకా గిలిగింతలు పెట్టిన సూర్యుడు చుర్రుమనిపిస్తూ పైకి లేస్తున్నాడు. పేముపొదల దొరువులో కాళ్లు కడుక్కొని, తియ్యని ఆ నీళ్లు తాగి, నడక సాగించినాము.కొరిడి దీవంతా చిట్టడవి. ఆ అడవిలోని పాల పండ్లు, కలిగిపండ్లు, బీరపండ్లు, బిక్కిపండ్లు, నిమ్మకాయలు, ఊటిపండ్లు, గొంజిపండ్లు, బలిజపండ్లు, ఎలికిచెవులూ,పిల్లొట్టలూ కోసుకొని తింటూ సాగుతున్నాం. అడివంతా చిన్న చిన్న, రంగురంగుల పిట్టలు. వింత వింతగా పలుకరించుకొంటూ, కులుక్కుంటూ, గిలుక్కుంటూ, చెట్టు చెట్టుకు చెంగున ఎగురుకొంటూ చెటాలున దోవకడ్డంగా పరుగెడుతూ మమ్మల్ని పలుకరిస్తున్నాయి.కొరిడి దాటిన తరువాత మళ్లీ ప్రళయకావేరిలో గంటన్నర ప్రయాణం. తరువాత కొల్లపట్టు దీవి. కొల్లపట్టు నుంచి గంట ప్రయాణంలో తోటకట్ల.తోటకట్లకు చేరేసరికి మిట్టమద్దినేళ అయింది. ఎండ కసిగా కొడుతోంది. గాలి ఎంత చల్లగా తగులుతున్నా చెమట కారుతూనే ఉంది. తోటకట్ల తరువాత గంట నడిస్తే 'రాగన్న పట్టెడ' వస్తుంది.మాతోపాటు తెచ్చుకున్న తిండి ఎప్పుడో అయిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటప్పుడు రాగన్న పట్టెడకు చేరుకొన్నాం. మా నేస్తాల ఊరు అదే. మేమ ఐతే సగం వచ్చినట్లు. మా నేస్తాల ఇళ్లలో మమ్మల్ని చూసి చాలా సంతోషించినారు

S3 Ep 16'రామగ్రామ నుంచి రావణలంక దాకా' రచయిత సీతారామరాజు గారితో పరిచయం.
'రామగ్రామ నుంచి రావణలంక దాకా' నవల రచయిత సీతారామ రాజు గారి సొంత వూరు, పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయి గూడెం. రియల్ ఎస్టేట్ రంగంలో వున్నారు. నివాసం హైదరాబాద్. ఆరు వారాల క్రితమే రిలీజ్ అయిన ఈ నవల 800 ప్రతుల మించి అమ్మకాలు సాధించి పాఠకుల విశేష ఆదరణకు నోచుకుంది. పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి -https://amzn.to/3EoRIMnHarshaneeyam on apple podcasthttps://apple.co/3K1vMdwThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S3 Ep 15'East Wind' పుస్తక పరిచయం - ఉణుదుర్తి సుధాకర్ గారితో
ఉణుదుర్తి సుధాకర్ గారు రాసిన 'తూరుపు గాలులు' పుస్తకం సౌత్ సైడ్ బుక్స్ పబ్లిషింగ్ ద్వారా ఇంగ్లీష్ లో 'East Wind' పేరుతో అనువదించబడింది. ఈ అనువాద ప్రక్రియలో తన అనుభవాన్ని సుధాకర్ గారు మనతో పంచుకున్నారు, ఈ ఎపిసోడ్లో. త్వరలో ఈ పుస్తకం Hyderabad book trust వెబ్సైటు ద్వారా, ఇతర పుస్తక విక్రేతల ద్వారా లభ్యం అవుతుంది. ఆటా బహుమతి పొందిన 'యారాడకొండ' నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్ అయిన శ్రీ సుధాకర్ రాసిన 'తూరుపు గాలులు' ' చలిచీమల కవాతు' కథాసంపుటాలు కూడా విశేష ఆదరణ పొందాయి. రచయిత పుస్తకాలు కొనడానికి - https://bit.ly/unudurthiThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S3 Ep 14'తెలుగు కథ స్థాయి' - పాత్రికేయులు, రచయిత మందలపర్తి కిషోర్ గారితో సంభాషణ
మందలపర్తి కిషోర్ గారు గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు లోనూ ఇంగ్లీష్ లోనూ కవిత్వం రాస్తున్నారు. పుస్తక అనువాదాలు చేస్తున్నారు. తెలుగు కథను , ఇంగ్లీష్ కథను విస్తృతంగా చదివారు. పత్రికా రంగంలో విశేష కృషి చేశారు. సిఫీ, ఇండియా టుడే-తెలుగు పత్రికల సంపాదకునిగా వ్యవహరించారు. 'కన్యాశుల్కం పలుకుబడి' (గురజాడ పదకోశం - 1), పడమటి కిటికీ (పాశ్చాత్య సాహిత్య పరిచయం) , పెరటి చెట్టు (వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర-పరిచయం) అనే పుస్తకాలు ప్రచురించారు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S3 Ep 13'డిస్టోపియా' కథలు - రచయిత్రి శ్రీసుధ గారితో పరిచయం
గుంటూరు జిల్లాకి చెందిన శ్రీసుధ మోదుగు, వైద్యరంగంలో పనిచేస్తున్నారు. జమైకాలో నివాసం. 'అమోహం', 'విహారి', వీరి కవితా సంకలనాలు. రెక్కల పిల్ల, డిస్టోపియా అనే కథాసంపుటాలను ప్రచురించారు. 'అంతర్హిత' అనే నవల ఈ మధ్యనే విడుదల అయింది. 'డిస్టోపియా' కొనడానికి కింది లింక్ ఉపయోగించండి.http://bit.ly/3wg2nUWThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S3 Ep 12'ఆట' - శ్రీసుధ గారు రాసిన 'డిస్టోపియా' నించి
'ఆట' అనే ఈ కథ శ్రీసుధ మోదుగు గారు రాసిన 'డిస్టోపియా' అనే కథా సంపుటం నించి. రచయిత్రి, కవయిత్రి అయిన శ్రీసుధ గారు వృత్తి రీత్యా వైద్యులు. జమైకాలో నివాసం. వారికి కృతజ్ఞతలు. పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి.http://bit.ly/3wg2nUWThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S3 Ep 11'దేవుడమ్మ మరో పది కథలు' - రచయిత్రి ఝాన్సీ గారితో సంభాషణ
ఝాన్సీ గారు రాసిన మొదటి కథల పుస్తకం 'దేవుడమ్మ మరో పది కథలు' ఈ మధ్యనే అందుబాటులోకి వచ్చింది. 'లా' లో డిగ్రీ తీసుకున్న ఝాన్సీ గారు, మాస్టర్స్ ఇన్ జర్నలిజం , మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేశారు. కొన్నాళ్ళు తిరుపతి లో ఆంధ్రజ్యోతి - స్టాఫ్ రిపోర్టర్ గా పని చేసి, ప్రస్తుతం ఒక ఐటీ కంపెనీని నడుపుతూ బెంగుళూరులో నివాసం వుంటున్నారు. అమెజాన్ ద్వారా పుస్తకం కొనడానికి ఈ లింకుని ఉపయోగించండి. - https://harshaneeyam.captivate.fm/devudammaహర్షణీయం స్పాటిఫై ఛానల్ - https://harshaneeyam.captivate.fm/spotThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S3 Ep 10'పార్వేట' రచయిత సురేంద్ర శీలంతో సంభాషణ
కర్నూల్ జిల్లా కోవెలకుంట్ల ప్రాంతానికి చెందిన, ఇంజనీరింగ్ చదివిన, ఇరవై తొమ్మిదేళ్ళ సురేంద్ర శీలం రాసిన కథల పుస్తకం - పార్వేట’. గత మూడేళ్ళ క్రిందటే తెలుగు కథలు చదవడం రాయడం మొదలు పెట్టిన ఈ రచయిత మొదటి పుస్తకం ఇది. కథలన్నీ ఆ ప్రాంతపు మాండలికంలో రాసినవే. మాండలికం వాడిన పద్ధతి చదువుకోడానికి ఎక్కడా అడ్డం రాలేదు, అందాన్నిచ్చింది. అక్కడి గ్రామీణ జీవితాన్ని, సమస్యలనీ చక్కటి పాత్రలను సృష్టించడం ద్వారా మన ముందుకు తెచ్చారు రచయిత.పుస్తకం కొనడానికి - https://www.amazon.in/Parveta-Kathalu-Surendra-Seelam/dp/B0BQN7H7P5/ref=sr_1_1?crid=1H2NNIDX6SHRZ&keywords=parveta&qid=1672370986&sprefix=parveta%2Caps%2C236&sr=8-1This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S3 Ep 9బతుకు సేద్యం నవలాపరిచయం
బతుకు సేద్యం - జహీరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న గ్రామీణ మహిళల గురించి, ఒక ప్రభుత్వేతర సంస్థ సహాయంతో వారి జీవితాలను వారు కష్టపడి ఎలా సరిదిద్దుకున్నారో, వివరిస్తూ రాసిన పుస్తకం. యదార్థ సంఘటనలనాధారం చేసుకుని రాసిన కాల్పనిక నవల. ఎపిసోడ్ లో ముందుగా ఛాయా మోహన్ గారు మాట్లాడతారు. తర్వాత రచయిత శాంతి ప్రభోదిని గారు నవల గురించి మరిన్ని వివరాలు అందిస్తారు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S3 Ep 8ఎండ గుర్తు - అజయ్ ప్రసాద్ గారి 'గాలి పొరలు' కథా సంపుటంనించి
'ఎండ గుర్తు' అనే ఈ కథ అజయ్ ప్రసాద్ గారి 'గాలి పొరలు' అనే కొత్త కథాసంపుటంలో నుంచి. ప్రకాశం జిల్లా అద్దంకి ఆయన సొంత వూరు. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో వుంటున్నారు. మంచి చదువరి. చక్కటి రచయిత. ఇది ఆయన రెండో కథాసంపుటం. పుస్తకం కొనడానికి కింది లింక్ ను ఉపయోగించండి. https://www.telugubooks.in/collections/telugubooks-new-releases/products/gaali-poraluThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S3 Ep 7'చెఖోవ్ కథలు - 1' పుస్తకం, అనువాదకులు అరుణ గారితో పరిచయం
'Father of Modern short story' అని చెప్పబడే రష్యన్ రచయిత చెఖోవ్ , 1880 - 1905 ప్రాంతంలో ఆరువందలకు పైగా కథలను రాసారు. ఈయన కథలు ప్రపంచ వ్యాప్తంగా. అనేక భాషల్లో అనువదించబడి ప్రాచుర్యాన్ని పొందాయి. ఇంగ్లీష్ నించి చెఖోవ్ కథలను తెలుగులోకి అనువదించి మన ముందుకు తెస్తున్నారు శ్రీమతి అరుణ గారు. ఈ పుస్తకం గురించి ఈ ఎపిసోడ్ లో ఆమె మనకు వివరిస్తారు. ఎపిసోడ్లో ముందుగా ఈ పుస్తకాన్ని మనకు అందిస్తున్న పాత్రికేయులు, రచయిత కుమార్ కూనపరాజు గారు చెఖోవ్ గురించి మాట్లాడతారు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S3 Ep 6ప్రముఖ సామాజిక కార్యకర్త, రచయిత, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ గీతా రామస్వామి గారితో సంభాషణ
గీతా రామస్వామి గారు ఒక ప్రముఖ సామాజిక కార్యకర్త, రచయిత్రి. వీరు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ని నిర్వహిస్తూ అనేక సంవత్సరాలుగా సామాజిక సేవా రంగంలో, పుస్తక ప్రచురణా రంగంలో పని చేస్తున్నారు. సామాజిక కార్యకర్తగా తన అనుభవాలపై ఈ మధ్య వీరు ఇంగ్లీష్ లో రాసిన ‘Land, Guns, Caste, Woman: The Memoir of a Lapsed Revolutionary’ అనే పుస్తకం చాలా ఆదరణకు నోచుకుంది. ఈ ఇంటర్వ్యూలో వామపక్ష ఉద్యమంలో, ఘజియాబాద్ లో పారిశుధ్య కార్మికులతో, ఇబ్రహీం పట్నంలో రైతు కూలీ సంఘంతో తన అనుభవాల గురించి, తనను ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి గీతా రామస్వామి గారు మాట్లాడారు. పుస్తకం కొనాలంటే ఈ లింక్ ని ఉపయోగించండి. https://www.amazon.in/Land-Guns-Caste-Woman-Revolutionary/dp/8194865417 ***Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S3 Ep 5తేజో-తుంగభద్ర నవల గురించి రచయిత వసుధేంద్ర తో సంభాషణ
కన్నడలో అనేక కథాసంకలనాలు, వ్యాసాలతో పాటు రెండు నవలలు రచించారు వసుధేంద్ర. కర్ణాటక సాహిత్య అకాడమీ బహుమతి, యు ఆర్ అనంతమూర్తి అవార్డులతో పాటు ఎన్నో ప్రశంసలు పురస్కారాలు అందుకున్నారు.ఆయన రాసిన తేజో తుంగభద్ర నవల, 1490 - 1520 సంవత్సరాలలో పోర్చుగల్ దేశం, విజయనగర సామ్రాజ్యంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని రచింపబడింది. ఇప్పుడు తెలుగులో రంగనాధ రామచంద్ర రావు గారి అనువాదంతో, ఛాయా పబ్లిషర్స్ ద్వారా మీ ముందుకు వచ్చింది. పోర్చుగల్ లో ప్రవహించే తేజో నదీ, విజయనగర సామ్రాజ్యంలో ప్రవహించే తుంగభద్ర నదీ తీరాలలోనే దాదాపుగా కథంతా నడుస్తుంది. కలిసి జీవించాలనుకునే రెండు జంటలు, కథలో ప్రధాన పాత్రధారులు. పోర్చుగల్ రాజు వ్యాపార విస్తరణ కోసం, విజయనగర రాజు రాజ్య విస్తరణ కోసం తీసుకునే నిర్ణయాలు, సాధారణ పౌరుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి అనేది కథలో ప్రధాన అంశం. ఒక ఆసక్తికరమైన ప్రేమ కథతో ఈ విషయాలన్నింటినీ ముడివేస్తూ, కొన్ని మౌలికమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది నవల. “మనం ఎవరమో, ఎందుకిలా ఉన్నామో చెప్పేదే చరిత్ర” అంటారు అమెరికన్ చరిత్రకారుడు డేవిడ్ మెకల్లా. ఇదే పని ఈ నవల ద్వారా పూర్తి చేశారు వసుధేంద్ర. ఈ ఇంటర్వ్యూలో ఆయన నవలకు సంబంధించిన అనేక ఆసక్తి కరమైన అంశాలను మనతో పంచుకున్నారు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S3 Ep 4'మైరావణుడు' నవల - యువ రచయిత ప్రసాద్ సూరి తో పరిచయం
రచయిత ప్రసాద్ సూరి రాసిన రెండో నవల 'మైరావణుడు'. మూడు తరాల, ఉత్తర కోస్తా ప్రాంత వాసుల జీవితాలను, వారి వలసలనూ స్పర్శిస్తూ, JNTU హైదరాబాద్ లో, ఫైన్ ఆర్ట్స్ విద్యార్ధి, ఇరవై రెండేళ్ళ యువ రచయిత ఆసక్తికరంగా రాసిన నవల. ఇంటర్వ్యూలో తనను ప్రభావితం చేసిన రచయితల గురించి, వ్యక్తుల గురించి, ఈ నవల గురించి ప్రసాద్ వివరించారు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Ep 91హర్షణీయంలో సుప్రసిద్ధ కథారచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర గారు.
హర్షణీయానికి మరో మారు మీకందరికీ స్వాగతం.గత ఐదు నెలలుగా, హర్షణీయానికి మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహానికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు.హర్షణీయం ద్వారా మా పాఠకుల్ని, శ్రోతల్ని , తెలుగు కథా సాహిత్యానికి కొంత దగ్గరగా తీసుకువెళ్లాలని మొదట్నుంచీ మా ప్రయత్నం గా వుండింది.దానికి కొనసాగింపుగానే కొన్ని రోజులక్రితం , తెలుగు కథా సాహిత్యంలో వున్న గొప్ప రచనలని ఒకటొకటిగా మీకందరికీ పరిచయం చెయ్యాలని, మేము అనుకున్నాము.ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీకందించబోతున్న ఈ ' కథా నీరాజనం' కార్యక్రమం.కథా నీరాజనంలో భాగంగా, ప్రతి ఎపిసోడ్ లో, ఒక గొప్ప తెలుగు కథని సంక్షిప్త రూపం లో పరిచయం చేస్తూ , ఆ కథ పై పాఠకులుగా , మా అభిప్రాయాలని, హర్ష , నేను , గిరి ఒక చిన్న చర్చా కార్యక్రమం ద్వారా మీకు అందించబోతున్నాము .ఈ మా ప్రయత్నాన్ని ఎప్పటిలాగే మీరందరూ ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాము.ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా మీకు పరిచయం చెయ్యబోతున్న కథ కు, రచయిత తన రచనా వ్యాసంగాన్ని నలభై ఆరేళ్ళ క్రితం ప్రారంభించారు. వారిది సాహిత్య కుటుంబం. వారి తండ్రి గారు శ్రీ మధురాంతకం రాజారామ్ గారు , సోదరుడు శ్రీ మహేంద్ర కూడా సుప్రసిద్ధ తెలుగు కథా రచయితలు.ఇది గాక , ఆయన ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన చేసి , అధ్యాపక వృత్తిలో ప్రవేశించి, నలభై ఏళ్ల పైన, వేలమంది విద్యార్థులకి విద్యా దానం చేశారు.మన సమాజంలో, మన వ్యక్తిత్వాలలో వుండే వైచిత్రిని , అనేక రకాలైన సంఘర్షణలని అతి సుతారమైన తనదైన శైలిలో , అత్యంత సహజంగా చిత్రీకరించడమే ఆయన రచనలలో వుండే ప్రత్యేకత.ఒక సకారాకాత్మకమైన మార్పు , కథ చదివే ప్రతి వ్యక్తిలో, తద్వారా మన సమాజంలో తీసుక రావాలని నిరంతరమూ కృషి చేసే హాలికుడాయన.అత్యంత ప్రతిష్టాత్మకమైన 'కథ' అవార్డు తో బాటూ ఎన్నో పురస్కారాలు అందుకున్నారాయన, ఈ ప్రయాణంలో.గత కొన్ని దశాబ్దాలుగా, తెలుగు కథ కి పథా నిర్దేశనం చేస్తూ వస్తున్న ఆ రచయిత పేరు డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారు.'కథ నీరాజనం' ఎవరి కథలతో ఆరంభించాలి, అని ఆలోచించినప్పుడు మాకు స్ఫురించిన మొదటి పేరు శ్రీ,.మధురాంతకం నరేంద్ర గారు.ఈ మొదటి ఎపిసోడ్ కి వున్న ఇంకో ప్రత్యేకత, ఈ చిన్ని ప్రయత్నాన్ని వారికి వివరించి, మొదటి ఎపిసోడ్ ఆరంభించమని ఆహ్వానించినపుడు, వెంటనే మా కోరికను మన్నించి వారు తమ అంగీకారాన్ని తెలియజెయ్యడం.శ్రీ మధురాంతకం నరేంద్ర గారికి హర్షణీయం జట్టు తరఫున, పాఠకుల తరఫున మా హృదయ పూర్వక కృతజ్ఞతలు.ఈ చర్చా కార్యక్రమంలో , భాగంగా మొదటగా వారి రచనా రీతి పైన తరువాత ఆయన రచించిన , 'నాలుగు కాళ్ళ మంటపం' అనే కథాసంకలనంలోని కొన్ని కథలపై , ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వడం జరిగింది.*ఈ ఇంటర్వ్యూకి తన సహకారాన్ని అందించిన మిత్రుడు LP కి హృదయ పూర్వక కృతజ్ఞతలు.విషయసూచిక:<div class="cp-show-notes">00:00 -హర్షణీయంలో తెలుగుకథా నీరాజనం శ్రీ మధురాంతకం నరేంద్ర గారితో.</p><p>03:33) - తన రచనలపై వారి తండ్రి గారు, సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, శ్రీ మధురాంతకం రాజారామ్ గారి ప్రభావం.</p><p>(11:35) - తన రచనలపై ఇంటి వాతావరణ ప్రభావం.</p><p>(18:04) - తన రచనల్లో శ్రమ జీవన సౌందర్య చిత్రీకరణ.</p><p>(21:30) - పాత్రల్లో సహజత్వం.</p><p>(29:47) - తన రచనల్లో స్త్రీ పక్షపాతం.</p><p>(31:18) - నవలా ప్రక్రియ.</p><p>(45:15) - కథా రచన మరియు ప్రచురణలో వస్తున్న మార్పులు.</p><p>(65:20) - తెలుగు రచయితలకు గుర్తింపు ఎందుకు తక్కువ?</p><p>(71:21) - తన రచనలపై మార్క్సిజం ప్రభావం.</p><p>(75:42) - కథలు వ్రాయటం నేర్పించవచ్చా?</p><p>(77:24) - రాబోతున్న రచనలు</p><p>(80:14) - 'నాలుగుకాళ్ల మంటపం కథాసంకలనం' రచనా విశేషాలు</p><p>(83:02) - 'నాలుగుకాళ్ల మంటపం కథాసంకలనం' లోని 'కాకులు గ్రద్దలు' కథపై చర్చ.</p><p>(95:33) - 'నాలుగుకాళ్ల మంటపం కథాసంకలనం' లోని 'ఒక మైనారిటీ కథ ' కథపై చర్చ.</p><p>(105:39) - 'నాలుగుకాళ్ల మంటపం కథాసంకలనం' లోని 'సద్గతి' కథపై చర్చ.</p><p>(114:46) - సాహిత్యానికి పరమార్థం</p></div>పుస్తక ప్రచురణ వివరాలు:ఈ సంకలనం అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.(https://www.facebook.com/AnvikshikiPublishers/)ఈ పుస్తకం , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.https://www.telugubooks.in/products/naalugu-kaalla-mandapam?_pos=4&_sid=7dd5697ad&_ss=rలేదా 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.నవోదయ బుక్ హౌస్3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్ఫోన్ నెంబర్: 090004 13413https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7*Intro-outro BGM Credits: Mounaragam Theme - Manaswini Anand (https://youtu.be/s4cARPm3LZ8)This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Ep 103హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ - రెండవ భాగం
హర్షణీయానికి స్వాగతం.ఇప్పుడు ఆడియోలో మీరు, హర్షణీయం, వర్ధమాన కథ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూ రెండవ భాగం వింటారు.ఇంటర్వ్యూలో ఆయన తన రచన శైలి గురించి, తన కథా సంకలనం 'సోల్ సర్కస్' లోని కథల గురించి, తన సినీ జీవితం గురించి మాట్లాడ్డం జరిగింది.తన అమూల్యమైన సమయాన్ని హర్షణీయంకు అందించిన శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారికి మా సభ్యులందరి తరఫున , ధన్యవాదాలు , శుభాభినందనలు.వెంకట్ శిద్ధారెడ్డి గారు నెల్లూరు జిల్లాలో జన్మించి,కోరుకొండ సైనిక్ స్కూల్ , తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించి , దేశ విదేశాల్లో పని చేసిన ఆయన 'సోల్ సర్కస్' అనే కథ తో , రచయితగా పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు.2019 వ సంవత్సరంలో తన మిత్రులతో కలిసి , 'అన్వీక్షికి పబ్లిషర్స్' అనే సంస్థని స్థాపించి, ప్రపంచ సాహిత్యంలోని, తెలుగు సాహిత్యంలోని అనేక చక్కటి పుస్తకాలని తెలుగు పుస్తక ప్రేమికులకు అందచేస్తున్నారు.ఇదిగాక , ఆయన , తెలుగు సినిమా పరిశ్రమలో డైలాగ్, స్క్రిప్ట్ రైటర్ గా , ఎడిటర్ గా, ప్రొడ్యూసర్ గా , డైరెక్టర్ గా అనేక పాత్రలు నిర్వహిస్తున్నారు.దృశ్యం, c/o కంచర పాలెం, ఈ నగరానికి ఏమైంది, ఇంకా అనేక చిత్రాలకు ఆయన పని చేయడం జరిగింది.పుస్తక ప్రచురణ వివరాలు:'సోల్ సర్కస్' సంకలనం అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.(https://www.facebook.com/AnvikshikiPublishers/)ఈ పుస్తకం డిజిటల్ ఎడిషన్ ని , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.https://kinige.com/book/Soul+Circusలేదా 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.నవోదయ బుక్ హౌస్3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్ఫోన్ నెంబర్: 090004 13413https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Ep 102హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ - మొదటి భాగం
హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు ఆడియోలో మీరు, హర్షణీయం, వర్ధమాన కథ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూ మొదటి భాగం వింటారు. ఇంటర్వ్యూలో ఆయన తన రచన శైలి గురించి, తన కథా సంకలనం 'సోల్ సర్కస్' లోని కథల గురించి, తన సినీ జీవితం గురించి మాట్లాడ్డం జరిగింది.తన అమూల్యమైన సమయాన్ని హర్షణీయంకు అందించిన శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారికి మా సభ్యులందరి తరఫున , ధన్యవాదాలు , శుభాభినందనలు.వెంకట్ శిద్ధారెడ్డి గారు నెల్లూరు జిల్లాలో జన్మించి,కోరుకొండ సైనిక్ స్కూల్ , తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించి , దేశ విదేశాల్లో పని చేసిన ఆయన 'సోల్ సర్కస్' అనే కథ తో , రచయితగా పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు.2019 వ సంవత్సరంలో తన మిత్రులతో కలిసి , 'అన్వీక్షికి పబ్లిషర్స్' అనే సంస్థని స్థాపించి, ప్రపంచ సాహిత్యంలోని, తెలుగు సాహిత్యంలోని అనేక చక్కటి పుస్తకాలని తెలుగు పుస్తక ప్రేమికులకు అందచేస్తున్నారు.ఇదిగాక , ఆయన , తెలుగు సినిమా పరిశ్రమలో డైలాగ్, స్క్రిప్ట్ రైటర్ గా , ఎడిటర్ గా, ప్రొడ్యూసర్ గా , డైరెక్టర్ గా అనేక పాత్రలు నిర్వహిస్తున్నారు.దృశ్యం, c/o కంచర పాలెం, ఈ నగరానికి ఏమైంది, ఇంకా అనేక చిత్రాలకు ఆయన పని చేయడం జరిగింది.పుస్తక ప్రచురణ వివరాలు:'సోల్ సర్కస్' సంకలనం అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.(https://www.facebook.com/AnvikshikiPublishers/)ఈ పుస్తకం డిజిటల్ ఎడిషన్ ని , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.https://kinige.com/book/Soul+Circusలేదా 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.నవోదయ బుక్ హౌస్3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్ఫోన్ నెంబర్: 090004 13413https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 119శ్రీరమణీయం - నాలుగో భాగం : వారి కథా రచన
హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు .సుప్రసిద్ధ కథకులు , పత్రికాసంపాదకులు శ్రీ శ్రీరమణ గారు హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది.శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు.తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు.ఆంధ్రజ్యోతి పత్రిక లో కాలమిస్టుగా , నవ్య పత్రికకు సంపాదకునిగా. ఒక గొప్ప కథా రచయితగా ఆయన మనకందరికీ సుపరిచితులు.ఇదిగాక ఆయన మనందరికీ అత్యంత ప్రేమ పాత్రులైన బాపురమణ గార్లతో, దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా, అత్యంత సన్నిహితుడై , వారితో పాటూ సినీప్రయాణం చేశారు.వ్యంగ్య , హాస్య రచనలే కాక , బంగారు మురుగు , మిధునం వంటి అత్యంత హృద్యమైన కథలను కూడా వారు రచించడం జరిగింది.తమ అనుభవాలను హర్షణీయంకు అందించిన , శ్రీ శ్రీరమణగారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.ఎపిసోడ్ వివరాలు:మొదటి భాగం : ఆయన బాల్యం , రచనా జీవితానికి అంకురం.రెండవభాగం: కవి సామ్రాట్ విశ్వనాధ వారి గురించి కొన్ని విశేషాలుమూడవ భాగం : బాపురమణ గార్లతో ఆయన సినీ ప్రయాణంనాలుగో భాగం: శ్రీరమణ గారి కథా రచనశ్రీరమణగారి గురించి మరిన్ని వివరాలు క్రింది వికీ పేజీ లో మీరు చూడవచ్చు.https://te.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B0%E0%B0%AE%E0%B0%A3*** ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో వారి చక్కటి కథలు రెండిటిని మీకు అందించడం జరిగింది హర్షణీయం ద్వారా.వివరాలు క్రింద మీరు చూడవచ్చు.1.బంగారు మురుగు - శ్రీరమణ గారి రచనhttps://harshaneeyam.in/2020/10/17/bangarumurugu/2.పీవీ తో నేను - వెంకట సత్య స్టాలిన్ - శ్రీరమణ గారి రచన.https://harshaneeyam.in/2020/10/10/stalin/This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 118శ్రీరమణీయం - మూడో భాగం : బాపురమణ గార్లు
హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు .సుప్రసిద్ధ కథకులు , పత్రికా సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది.శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు.తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు.ఆంధ్రజ్యోతి పత్రిక లో కాలమిస్టుగా , నవ్య పత్రికకు సంపాదకునిగా. ఒక గొప్ప కథా రచయితగా ఆయన మనకందరికీ సుపరిచితులు.ఇదిగాక ఆయన మనందరికీ అత్యంత ప్రేమ పాత్రులైన బాపురమణ గార్లతో, దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా, అత్యంత సన్నిహితుడై , వారితో పాటూ సినీప్రయాణం చేశారు.వ్యంగ్య , హాస్య రచనలే కాక , బంగారు మురుగు , మిధునం వంటి అత్యంత హృద్యమైన కథలను కూడా వారు రచించడం జరిగింది.తమ అనుభవాలను హర్షణీయంకు అందించిన , శ్రీ శ్రీరమణగారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.ఎపిసోడ్ వివరాలు:మొదటి భాగం : ఆయన బాల్యం , రచనా జీవితానికి అంకురం.రెండవభాగం: కవి సామ్రాట్ విశ్వనాధ వారి గురించి కొన్ని విశేషాలుమూడవ భాగం : బాపురమణ గార్లతో ఆయన సినీ ప్రయాణంనాలుగో భాగం: శ్రీరమణ గారి కథా రచనశ్రీరమణగారి గురించి మరిన్ని వివరాలు క్రింది వికీ పేజీ లో మీరు చూడవచ్చు.https://te.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B0%E0%B0%AE%E0%B0%A3*** ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో వారి చక్కటి కథలు రెండిటిని మీకు అందించడం జరిగింది హర్షణీయం ద్వారా.వివరాలు క్రింద మీరు చూడవచ్చు.1.బంగారు మురుగు - శ్రీరమణ గారి రచనhttps://harshaneeyam.in/2020/10/17/bangarumurugu/2.పీవీ తో నేను - వెంకట సత్య స్టాలిన్ - శ్రీరమణ గారి రచన.https://harshaneeyam.in/2020/10/10/stalin/This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 117శ్రీరమణీయం - రెండోభాగం : కవిసామ్రాట్ విశ్వనాథ
హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు .సుప్రసిద్ధ కథకులు , పత్రికా సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది.శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు.తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు.ఆంధ్రజ్యోతి పత్రిక లో కాలమిస్టుగా , నవ్య పత్రికకు సంపాదకునిగా. ఒక గొప్ప కథా రచయితగా ఆయన మనకందరికీ సుపరిచితులు.ఇదిగాక ఆయన మనందరికీ అత్యంత ప్రేమ పాత్రులైన బాపురమణ గార్లతో, దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా, అత్యంత సన్నిహితుడై , వారితో పాటూ సినీప్రయాణం చేశారు.వ్యంగ్య , హాస్య రచనలే కాక , బంగారు మురుగు , మిధునం వంటి అత్యంత హృద్యమైన కథలను కూడా వారు రచించడం జరిగింది.తమ అనుభవాలను హర్షణీయంకు అందించిన , శ్రీ శ్రీరమణగారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.ఎపిసోడ్ వివరాలు:మొదటి భాగం : ఆయన బాల్యం , రచనా జీవితానికి అంకురం.రెండవభాగం: కవి సామ్రాట్ విశ్వనాధ వారి గురించి కొన్ని విశేషాలుమూడవ భాగం : బాపురమణ గార్లతో ఆయన సినీ ప్రయాణంనాలుగో భాగం: శ్రీరమణ గారి కథా రచనశ్రీరమణగారి గురించి మరిన్ని వివరాలు క్రింది వికీ పేజీ లో మీరు చూడవచ్చు.https://te.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B0%E0%B0%AE%E0%B0%A3*** ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో వారి చక్కటి కథలు రెండిటిని మీకు అందించడం జరిగింది హర్షణీయం ద్వారా.వివరాలు క్రింద మీరు చూడవచ్చు.1.బంగారు మురుగు - శ్రీరమణ గారి రచనhttps://harshaneeyam.in/2020/10/17/bangarumurugu/2.పీవీ తో నేను - వెంకట సత్య స్టాలిన్ - శ్రీరమణ గారి రచన.https://harshaneeyam.in/2020/10/10/stalin/This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 116శ్రీరమణీయం - మొదటి భాగం: బాల్యం , రచనా జీవితానికి అంకురం
హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు .సుప్రసిద్ధ కథకులు , పత్రికా సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది.శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు.తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు.ఆంధ్రజ్యోతి పత్రిక లో కాలమిస్టుగా , నవ్య పత్రికకు సంపాదకునిగా. ఒక గొప్ప కథా రచయితగా ఆయన మనకందరికీ సుపరిచితులు.ఇదిగాక ఆయన మనందరికీ అత్యంత ప్రేమ పాత్రులైన బాపురమణ గార్లతో, దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా, అత్యంత సన్నిహితుడై , వారితో పాటూ సినీప్రయాణం చేశారు.వ్యంగ్య , హాస్య రచనలే కాక , బంగారు మురుగు , మిధునం వంటి అత్యంత హృద్యమైన కథలను కూడా వారు రచించడం జరిగింది.తమ అనుభవాలను హర్షణీయంకు అందించిన , శ్రీ శ్రీరమణగారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.ఎపిసోడ్ వివరాలు:మొదటి భాగం : ఆయన బాల్యం , రచనా జీవితానికి అంకురం.రెండవభాగం: కవి సామ్రాట్ విశ్వనాధ వారి గురించి కొన్ని విశేషాలుమూడవ భాగం : బాపురమణ గార్లతో ఆయన సినీ ప్రయాణంనాలుగో భాగం: శ్రీరమణ గారి కథా రచనశ్రీరమణగారి గురించి మరిన్ని వివరాలు క్రింది వికీ పేజీ లో మీరు చూడవచ్చు.https://te.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B0%E0%B0%AE%E0%B0%A3*** ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో వారి చక్కటి కథలు రెండిటిని మీకు అందించడం జరిగింది హర్షణీయం ద్వారా.వివరాలు క్రింద మీరు చూడవచ్చు.1.బంగారు మురుగు - శ్రీరమణ గారి రచనhttps://harshaneeyam.in/2020/10/17/bangarumurugu/2.పీవీ తో నేను - వెంకట సత్య స్టాలిన్ - శ్రీరమణ గారి రచన.https://harshaneeyam.in/2020/10/10/stalin/This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 115తిలక్ గారి కథారచన పై సుప్రసిద్ధ పాత్రికేయులు, రచయిత, కవి, మందలపర్తి కిషోర్ గారి విశ్లేషణ.
తెలుగు సాహిత్యం లో గొప్ప కథలను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా, హర్షణీయం సుప్రసిద్ధ పాత్రికేయులు , రచయిత, కవి, అనువాదకులు శ్రీ మందలపర్తి కిషోర్ గారిని, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథా రచనలపై తన అభిప్రాయాలను , 'నల్లజర్ల రోడ్డు', 'దేవుణ్ణి చూసిన వాడు', 'దొంగ' కథలపై విశ్లేషణలను, హర్షణీయం పాఠకులకు ప్రత్యేకంగా అందించామని కోరడం జరిగింది. కిషోర్ గారు వారి అమూల్యమైన కాలాన్ని వెచ్చించి, వ్యాస రూపంలోనూ , ఆడియో రూపం లోనూ మనకు ఈ విశ్లేషణను ఆయన అందించడం జరిగింది. ఈ విశ్లేషణను అత్యంత ఆసక్తికరంగా , తిలక్ గారి రచనల గురించి అనేక చక్కటి విషయాలను వివరిస్తూ , కిశోర్ గారు నిర్వహించారు. వారికి హర్షణీయం హృదయ పూర్వక కృతజ్ఞతలు.కిషోర్ గారు గత మూడున్నర దశాబ్దాలనించి తెలుగు లోనూ ఇంగ్లీష్ లోనూ కవిత్వం రాస్తున్నారు. పుస్తక అనువాదాలు చేస్తున్నారు. పత్రిక రంగంలో విశేష కృషి చేశారు. సిఫీ, ఇండియా టుడే-తెలుగు పత్రికల సంపాదకునిగా వ్యవహరించారు. 'కన్యాశుల్కం పలుకుబడి' (గురజాడ పదకోశం - 1), పడమటి కిటికీ (పాశ్చాత్య సాహిత్య పరిచయం) , పెరటి చెట్టు (వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర పరిచయం) అనే పుస్తకాలు ప్రచురించారు. 'అనువాదం - కవిత్వానువాదం' అనే పుస్తకాన్ని ప్రచురింపబోతున్నారు.హర్షణీయంలో 'దేవుణ్ణి చూసిన వాడు' , 'దొంగ' కథలను ఇప్పటికే ప్రచురించడం జరిగింది. 'నల్లజర్ల రోడ్డు' కథ డిసెంబర్ మొదటి వారంలో ప్రచురింపబడుతుంది.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 132సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం! - నాలుగవ భాగం
హర్షణీయానికి స్వాగతం. డాక్టర్ పతంజలి శాస్త్రి గారి రచనా జీవితం, రచనలను ప్రభావితం చేసిన అంశాల గురించి, గత వారం , హర్షణీయం ఆయనతో సంభాషించడం జరిగింది.హర్షణీయం టీం తో బాటూ, ఛాయా మోహన్ బాబు గారు, బొలిమేరు ప్రసాద్ గారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.శాస్త్రి గారికి , మోహన్ గారికి , ప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు.ఆర్కియాలజీ లో డాక్టరేట్ తీసుకున్న తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు అరవైకి పైగా కథలు , మూడు నవలలు మనకందించారు.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 131సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం! - మూడవ భాగం
హర్షణీయానికి స్వాగతం. డాక్టర్ పతంజలి శాస్త్రి గారి రచనా జీవితం, రచనలను ప్రభావితం చేసిన అంశాల గురించి, గత వారం , హర్షణీయం ఆయనతో సంభాషించడం జరిగింది.హర్షణీయం టీం తో బాటూ, ఛాయా మోహన్ బాబు గారు, బొలిమేరు ప్రసాద్ గారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.శాస్త్రి గారికి , మోహన్ గారికి , ప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు.ఆర్కియాలజీ లో డాక్టరేట్ తీసుకున్న తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు అరవైకి పైగా కథలు , మూడు నవలలు మనకందించారు.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 130సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం! - రెండవ భాగం
హర్షణీయానికి స్వాగతం. డాక్టర్ పతంజలి శాస్త్రి గారి రచనా జీవితం, రచనలను ప్రభావితం చేసిన అంశాల గురించి, గత వారం , హర్షణీయం ఆయనతో సంభాషించడం జరిగింది.హర్షణీయం టీం తో బాటూ, ఛాయా మోహన్ బాబు గారు, బొలిమేరు ప్రసాద్ గారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.శాస్త్రి గారికి , మోహన్ గారికి , ప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు.ఆర్కియాలజీ లో డాక్టరేట్ తీసుకున్న తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు అరవైకి పైగా కథలు , మూడు నవలలు మనకందించారు.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 129సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం! - మొదటి భాగం
హర్షణీయానికి స్వాగతం. డాక్టర్ పతంజలి శాస్త్రి గారి రచనా జీవితం, రచనలను ప్రభావితం చేసిన అంశాల గురించి, గత వారం , హర్షణీయం ఆయనతో సంభాషించడం జరిగింది.హర్షణీయం టీం తో బాటూ, ఛాయా మోహన్ బాబు గారు, బొలిమేరు ప్రసాద్ గారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.శాస్త్రి గారికి , మోహన్ గారికి , ప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు.ఆర్కియాలజీ లో డాక్టరేట్ తీసుకున్న తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు అరవైకి పైగా కథలు , మూడు నవలలు మనకందించారు.చర్చలోకి వెళ్లబోయే ముందు, ఛాయా మోహన్ గారి మాటల్లో శాస్త్రి గారి రచనల గురించి మనం విందాం. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 128ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో 'హర్షణీయం' ఇంటర్వ్యూ !
తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు. ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి’ అవార్డుతో, కేంద్రప్రభుత్వం వారు ‘పద్మశ్రీ’ పురస్కారం తో ఆయనను సత్కరించడం జరిగింది. రెండు వారాల క్రితం 'హర్షణీయం' ఇనాక్ గారితో ఆయన రచనలు, జీవితాన్ని గురించి సంభాషించే అవకాశం కలిగింది. ఈ ఎపిసోడ్ లో ఆ ఇంటర్వ్యూ మీరు వినవచ్చు.హర్షణీయం శ్రోతలకై తన సమయాన్ని వెచ్చించిన ఆచార్య ఇనాక్ గారికి కృతజ్ఞతలు.ఇదే పేజీ చివరన, ఇంతకు మునుపు, హర్షణీయం ద్వారా మీకందజేసిన, ఇనాక్ గారి కథల లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. https://harshaneeyam.in/2020/11/01/sri-enoch/https://harshaneeyam.in/2020/12/06/enooch-gari-illu/https://harshaneeyam.in/2020/11/21/enoch-garu/This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 140'మునికాంతపల్లి కథలు ' - సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం.
ఒకే కథాసంకలనం లో 23 చిట్టి పొట్టి కథలు -విఫలమైన ప్రేమసఫలమైన ప్రేమచిన్న చిన్న ఆనందాలూచిన్నతనాన్ని గుర్తు చేసే అందమైన స్నేహాలూ , అనుబంధాలూషాక్ ఇచ్చే ట్విస్టెడ్ ముగింపులు కొన్నీ, ఓపెన్ ఎండెడ్ బుర్ర తొలిచేసే ముగింపులు,కొన్ని వ్యర్థాభరిత జీవితాలు , కొన్ని ఉత్సాహాన్నిచ్చే ముగింపులూఒక్కోసారి నడిపిస్తూ , ఒక్కోసారి అడ్డుతగిలే మతమూఅర్ధమయ్యే గొప్ప తాత్వికతఇవన్నీ -ఇంతకు ముందెన్నడూ మనం చవిచూడని ఒక కొత్త నేపథ్యంలో , రచయిత తాను ఎక్కడా పాఠకుడికి , పాత్రల మధ్య అడ్డం రాకుండా , ఒక గుడి గోపురంలా ఊరంతా జరిగేది చూసి, మనకు బుర్రకు పట్టేటట్టు అందించడం..... మునికాంతపల్లి కథలు -రచయిత సోలోమోన్ విజయకుమార్ గారితో హర్షణీయం ఇంటర్వ్యూ ఈ ఎపిసోడ్ లో వినండి.పుస్తకం కొనడం కోసం : https://www.telugubooks.in/products/munikanthapalli-kathaluThank you Vijayakumar Garu for producing such lovely piece of work.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 144డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై , శ్రీ వాసిరెడ్డి నవీన్ గారి ప్రసంగం!
ఈ ఎపిసోడ్ లో , సుప్రసిద్ధ కథా రచయిత డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు ప్రసంగిస్తారు.చంద్రశేఖర్ రావు గారి రచనాశైలిపై , రచనలపై చక్కని విశ్లేషణను అందించిన నవీన్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.వాసిరెడ్డి నవీన్ గారి గురించి:'కథా నవీన్' గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. ఎన్నో సమీక్ష వ్యాసాలు , కథలూ , కవితలూ రాసారు. అనేక దేశాల్లో , తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు.1990 లో 'తెలుగు కథా సాహితి' అనే సంస్థ ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరంలో ప్రచురితమైన కథల్లో కొన్ని ఉత్తమమైన కథలనెన్నుకొని, 'కథా సంకలనాలను వెలువరిస్తున్నారు నిర్విరామంగా.ఆయన గురించి మరికొన్ని వివరాలు (http://bit.ly/36b8Kfw) .హర్షణీయం లో ఇంతకు ముందు ప్రచురించిన 'నైట్ డ్యూటీ' అనే కథ కూడా ఒక వాస్తవ సంఘటన ప్రేరణ గా తీసుకొని శ్రీ.చంద్రశేఖర్ రావు గారు రాయడం జరిగింది.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 146'నల్లగొండ కథలు' రచయిత వి.మల్లికార్జున్ గారితో హర్షణీయం! Part - II
నల్లగొండకు చెందిన వి.మల్లికార్జున్ గారు పత్రికా రంగంలో పనిచేసి, ఇప్పుడు సినీ పరిశ్రమ లో ప్రవేశిస్తున్నారు. 'నల్లగొండ కథలు' ఆయన రచించిన మూడో కథల సంపుటి. ఈ ఇంటర్వ్యూ లో తన రచనల గురించి, రచనా జీవితాన్ని గురించి మల్లికార్జున్ గారు అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. https://harshaneeyam.in/2021/01/16/nallagonda/https://harshaneeyam.in/2021/01/21/nalgonda-comments/This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 145'నల్లగొండ కథలు' రచయిత వి.మల్లికార్జున్ గారితో హర్షణీయం! Part - I
నల్లగొండకు చెందిన వి.మల్లికార్జున్ గారు పత్రికా రంగంలో పనిచేసి, ఇప్పుడు సినీ పరిశ్రమ లో ప్రవేశిస్తున్నారు. 'నల్లగొండ కథలు' ఆయన రచించిన మూడో కథల సంపుటి. ఈ ఇంటర్వ్యూ లో తన రచనల గురించి, రచనా జీవితాన్ని గురించి మల్లికార్జున్ గారు అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. https://harshaneeyam.in/2021/01/16/nallagonda/https://harshaneeyam.in/2021/01/21/nalgonda-comments/This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 147'కే ఎన్ వై పతంజలి' గారి కథా రచనపై సుప్రసిద్ధ పాత్రికేయులు మందలపర్తి కిషోర్ గారు!
తెలుగు సాహిత్యం లోని గొప్ప రచయితలను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా, హర్షణీయం సుప్రసిద్ధ పాత్రికేయులు , రచయిత, కవి, అనువాదకులు శ్రీ మందలపర్తి కిషోర్ గారిని, శ్రీ కే ఎన్ వై పతంజలిగారి గారి కథా రచనలపై తన అభిప్రాయాలను , 'మోటు మనిషి ', 'తోటి వేటగాళ్లు ', 'సీతమ్మ లోగిలి ' కథలపై విశ్లేషణలను, హర్షణీయం పాఠకులకు ప్రత్యేకంగా అందించమని కోరడం జరిగింది. కిషోర్ గారు వారి అమూల్యమైన కాలాన్ని వెచ్చించి, ఆడియో రూపం లోనూ మనకు ఈ విశ్లేషణను ఆయన అందించడం జరిగింది. అత్యంత ఆసక్తికరంగా , పతంజలి గారి రచనల గురించి అనేక చక్కటి విషయాలను వివరిస్తూ , కిశోర్ గారు ప్రసంగించారు. వారికి హర్షణీయం హృదయ పూర్వక కృతజ్ఞతలు.కిషోర్ గారు గత మూడున్నర దశాబ్దాలనించి తెలుగు లోనూ ఇంగ్లీష్ లోనూ కవిత్వం రాస్తున్నారు. పుస్తక అనువాదాలు చేస్తున్నారు. పత్రిక రంగంలో విశేష కృషి చేశారు. సిఫీ, ఇండియా టుడే-తెలుగు పత్రికల సంపాదకునిగా వ్యవహరించారు. 'కన్యాశుల్కం పలుకుబడి' (గురజాడ పదకోశం - 1), పడమటి కిటికీ (పాశ్చాత్య సాహిత్య పరిచయం) , పెరటి చెట్టు (వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర పరిచయం) అనే పుస్తకాలు ప్రచురించారు. 'అనువాదం - కవిత్వానువాదం' అనే పుస్తకాన్ని ప్రచురింపబోతున్నారు. https://harshaneeyam.in/2020/10/29/patanjali-garu/This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 150సుప్రసిద్ధ కథకులు , దర్శకులు, వంశీ గారి తో హర్షణీయం! పార్ట్ - I
సుప్రసిద్ధ కథకులు , దర్శకులు వంశీ గారి రచనా జీవితం గురించి తెలుసుకోడానికి, హర్షణీయం టీం ఆయనను కలవడం జరిగింది. ఇంటర్వ్యూలో పాల్గొని తమ రచనా అనుభవాలను , అభిప్రాయాలను పంచుకున్నందుకు వంశీ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 151సుప్రసిద్ధ కథకులు , దర్శకులు, వంశీ గారి తో హర్షణీయం! పార్ట్ - II
సుప్రసిద్ధ కథకులు , దర్శకులు వంశీ గారి రచనా జీవితం గురించి తెలుసుకోడానికి, హర్షణీయం టీం ఆయనను కలవడం జరిగింది. ఇంటర్వ్యూలో పాల్గొని తమ రచనా అనుభవాలను , అభిప్రాయాలను పంచుకున్నందుకు వంశీ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 153వేలుపిళ్లై రామచంద్ర రావు గారు - హర్షణీయం తో!
ఈ ఎపిసోడ్ లో సుప్రసిద్ధ కథకులు , 'వేలుపిళ్లై' రామచంద్ర రావు గారితో హర్షణీయం ఇంటర్వ్యూ వినండి. అరవై ఏళ్ల రచనా జీవితంలో , పదంటే, పదే కథలు రాసారు రావు గారు. అన్నీ కథలు తెలుగు పాఠకులకు అత్యంత సుపరిచితాలు. ఎక్కువ కథలు , నీలగిరి టీ ఎస్టేట్స్, నేపధ్యంగా రాసినవి. అక్కడ అసిస్టెంట్ మేనేజర్ గారి చేరి, చైర్మన్ గా రిటైర్ అయ్యిన రామచంద్ర రావు గారు, ఆంధ్రా, మైసూరు స్టేట్ టెన్నిస్ ఛాంపియన్ కూడా.ఈ ఇంటర్వ్యూలో ఆయన తన కథల గురించి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు పంచుకోడం జరిగింది. ఇంటర్వ్యూలో హర్షణీయం తో బాటూ, పాత్రికేయులు శ్రీ తాడి ప్రకాష్ గారు, రామచంద్ర రావు గారి సోదరులు , జగన్నాధ భూపతిగారు కూడా పాల్గొన్నారు.ఇంతకు ముందు ఎపిసోడ్స్ , రామచంద్ర రావు గారి రచనలపై 'శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ ' గారి అభిప్రాయం , 'ఏనుగుల రాయి' కథ కింద లింక్స్ లో చూడొచ్చు.మార్చి నెలలో 'అన్వీక్షికి' పబ్లిషర్స్ ద్వారా 'వేలుపిళ్లై' కథాసంపుటం కొత్త ఎడిషన్ మీ ముందుకు రాబోతోంది.https://harshaneeyam.in/2021/02/15/mulllapudi-garu/https://harshaneeyam.in/2021/02/14/velupillai-ramachandrarao-garu/This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S3 Ep 3'పల్లవి పబ్లికేషన్స్' వెంకట నారాయణ గారితో హర్షణీయం
'పల్లవి' వెంకట నారాయణ గారు, గత ఐదు దశాబ్దాలుగా, పుస్తక ప్రచురణా రంగంలో వున్నారు. పల్లవి పబ్లికేషన్స్ సంస్థ అధినేత. విజయవాడ వాస్తవ్యులు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన గత యాభై ఏళ్ళుగా తెలుగు పుస్తక ప్రచురణ, విక్రయాల్లో వచ్చిన మార్పులు, ఇబ్బందులు, తదితర విషయాల గురించి విస్తారంగా మాట్లాడారు. వారికి హర్షణీయం కృతఙ్ఞతలు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 163రెండో భాగం - 'ఎదారి బతుకులు' రచయిత్రి భారతి గారితో ఇంటర్వ్యూ !
‘ఎదారి బతుకులు’ రాసిన ఎండపల్లి భారతి గారు, చిత్తూరు జిల్లా, దిగువ బురుజు గ్రామానికి చెందిన వారు.ప్రాధమిక విద్యను అభ్యసించిన భారతి గారు, గ్రామీణ జీవిత సమస్యలను, వస్తున్న మార్పులను, దగ్గరగా గమనిస్తూ వచ్చారు.గత ఇరవై సంవత్సరాలుగా చిత్తూరుజిల్లా ‘వెలుగు’ మహిళా సంఘాల (SERP – సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) పత్రిక ‘నవోదయం’లో విలేఖరి గా పనిచేస్తున్నారు.ప్రముఖ స్టిల్ లైఫ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త , కిరణ్ కుమారి గారి ప్రోత్సాహంతో, కథలు రాయడం మొదలుపెట్టారు. వీడియోగ్రఫీ నేర్చుకుని కొన్ని వీడియో ఫిలిమ్స్ కూడా భారతి గారు తీయడం జరిగింది.ఇంటర్వ్యూలో భారతి గారు, తన కథల గురించే కాక, గ్రామీణ జీవితం గురించి, పాఠశాలల్లో విద్యావిధానం గురించి, ఇతర సమస్యల గురించి కూడా మాట్లాడటం జరిగింది.భారతి గారి రెండో కథల పుస్తకం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా త్వరలో మన ముందుకు రాబోతోంది.ఈ ఎపిసోడ్ కు తమ సహకారాన్ని అందించిన , కిరణ్ కుమారి గారికి , అపర్ణ తోట గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.ఇంటర్వ్యూ లో కి వెళ్లబోయే ముందు, ‘ ఎదారి బతుకులు ‘ కథలపై , సొలొమోన్ విజయకుమార్ గారి అభిప్రాయం విందాం.ఈ పుస్తకం కొనడానికి – https://hyderabadbooktrust.com/product/edari-batukulu-endapalli-bharathi-2‘హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 160సింగమనేని నారాయణ గారి రచనా జీవితం పై ఓల్గా గారు!
2021 ఫిబ్రవరి 25 వ తేదీన , సింగమనేని నారాయణ గారి మరణం, తెలుగు సాహితీ ప్రేమికులకు తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. సుప్రసిద్ధ కథా రచయిత , విమర్శకులు నారాయణ గారు, తెలుగు కథ కు చేసిన సేవ అనన్య సామాన్యం. ఆయన కథారచన పై ప్రసంగించాలని , హర్షణీయం ప్రముఖ రచయిత్రి ఓల్గా గారిని కోరడం జరిగింది. వారు వెంటనే సమ్మతించి, చాల చక్కనైన వివరణాత్మకమైన సమీక్షను మనకందించారు. ఓల్గా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.'సింగమనేని నారాయణ కథలు' అనే పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి.https://www.logili.com/short-stories/singamaneni-narayana-kadhalu-singamaneni-narayana/p-7488847-29345400079-cat.html#variant_id=7488847-29345400079This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 162మొదటి భాగం - 'ఎదారి బతుకులు' రచయిత్రి భారతి గారితో ఇంటర్వ్యూ !
‘ఎదారి బతుకులు’ రాసిన ఎండపల్లి భారతి గారు, చిత్తూరు జిల్లా, దిగువ బురుజు గ్రామానికి చెందిన వారు.ప్రాధమిక విద్యను అభ్యసించిన భారతి గారు, గ్రామీణ జీవిత సమస్యలను, వస్తున్న మార్పులను, దగ్గరగా గమనిస్తూ వచ్చారు.గత ఇరవై సంవత్సరాలుగా చిత్తూరుజిల్లా ‘వెలుగు’ మహిళా సంఘాల (SERP – సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) పత్రిక ‘నవోదయం’లో విలేఖరి గా పనిచేస్తున్నారు.ప్రముఖ స్టిల్ లైఫ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త , కిరణ్ కుమారి గారి ప్రోత్సాహంతో, కథలు రాయడం మొదలుపెట్టారు. వీడియోగ్రఫీ నేర్చుకుని కొన్ని వీడియో ఫిలిమ్స్ కూడా భారతి గారు తీయడం జరిగింది.ఇంటర్వ్యూలో భారతి గారు, తన కథల గురించే కాక, గ్రామీణ జీవితం గురించి, పాఠశాలల్లో విద్యావిధానం గురించి, ఇతర సమస్యల గురించి కూడా మాట్లాడటం జరిగింది.భారతి గారి రెండో కథల పుస్తకం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా త్వరలో మన ముందుకు రాబోతోంది.ఈ ఎపిసోడ్ కు తమ సహకారాన్ని అందించిన , కిరణ్ కుమారి గారికి , అపర్ణ తోట గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.ఇంటర్వ్యూ లో కి వెళ్లబోయే ముందు, ‘ ఎదారి బతుకులు ‘ కథలపై , సొలొమోన్ విజయకుమార్ గారి అభిప్రాయం విందాం.ఈ పుస్తకం కొనడానికి – https://hyderabadbooktrust.com/product/edari-batukulu-endapalli-bharathi-2‘హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S3 Ep 2'ఛాయా మోహన్' గారితో హర్షణీయం
ఛాయా మోహన్ గారు, గత కొన్నేళ్ళుగా, తెలుగు ప్రచురణా రంగంలో వున్నారు. ఛాయా పబ్లికేషన్స్ పేరుతో ఇప్పటిదాకా దాదాపు డెబ్భయి పుస్తకాల దాకా ప్రచురించారు. మంచి చదువరి. ఈ ఇంటర్వ్యూలో ఆయన, తెలుగు సాహిత్యం మీద ఆయన అభిప్రాయాల గురించి, ఛాయా ప్రచురణల గురించి, అనువాద సాహిత్యం గురించి మాట్లాడటం జరిగింది. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 172part II - మనసు ఫౌండేషన్ ఎం.వి.రాయుడు గారితో ఇంటర్వ్యూ
మనసు ఫౌండేషన్ వెబ్సైటు అడ్రస్ : http://www.manasufoundation.com/works/మనసు ఫౌండేషన్ ఇమెయిల్ - [email protected]ఆఫీసు అడ్రస్: MaNaSu FoundationKaniampadu VillageNear VarikuntapaduSPSR Nellore DistrictAndhra PradeshPIN Code : 524227https://goo.gl/maps/dTiBnbd7g842This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 171part I - మనసు ఫౌండేషన్ ఎం.వి.రాయుడు గారితో ఇంటర్వ్యూ
ఇంజనీరింగ్ డిగ్రీ , M.Sc through research , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ లో పూర్తి చేసిన ఎం. వి రాయుడు గారు, పవర్ ఎలక్ట్రానిక్స్ లో డాక్టరేట్ తీసుకున్నారు . మనసు ఫౌండేషన్ ని 2006 వ సంవత్సరం లో తన సోదరులైన డాక్టర్ గోపీచంద్ , డాక్టర్ చంద్ర మౌళి గార్లతో కలిసి స్థాపించారు.తెలుగులో ఇప్పటిదాకా ప్రచురితమైన అన్ని పుస్తకాలను డిజిటల్ ఆర్కైవింగ్ చేసి భద్రపరచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మనసు ఫౌండేషన్ , ఇప్పటి దాకా 55 లక్షల పేజీల తెలుగు సాహిత్యాన్ని తన డేటాబేస్ లో ఉంచింది. ఇంకో మూడేళ్లలో తన లక్ష్యాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఎవరైనా సరే తమ వద్ద వున్న అరుదైన తెలుగు పుస్తకాల పేర్లను , మనసు ఫౌండేషన్ కి పంపిస్తే, అవి వారి డేటాబేస్ లో లేకపోతే , మీ నుంచి సేకరించి స్కాన్ చేసి , భద్ర పరిచి, మళ్ళీ పుస్తకాలను వెనక్కి పంపించడం జరుగుతుంది. కింద ఇచ్చిన లింక్ లో మనసు ఫౌండేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు చూడొచ్చు.ఇదేకాకుండా , తెలుగులో సుప్రసిద్ధులైన రచయితల సమగ్ర లభ్య రచనలను కూడా ప్రచురిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా, గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీశ్రీ, కాళీపట్నం రామారావు, రావి శాస్త్రి, బీనా దేవి, జాషువా, ఎన్ వై పతంజలి, పఠాభి గార్ల సమగ్ర లభ్య రచనలను ప్రచురించింది. 2018 వ సంవత్సరం నించి, నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం - కనియంపాడు కేంద్రం గా, మనసు ఫౌండేషన్ డిజిటైజేషన్ సెంటర్ ను నడుపుతోంది.ఈ ఇంటర్వ్యూలో రాయుడు గారు, మనసు ఫౌండేషన్ స్థాపించడం గురించి, ఫౌండేషన్ ద్వారా జరిగే అనేక కార్య క్రమాల గురించి, సాహిత్య ప్రచురణ లో వచ్చిన మార్పుల గురించి వివరించడం జరిగింది.ఇంటర్వ్యూ లో మొదట - 'గురజాడ సమగ్ర రచనలు' ప్రాజెక్టు లో పనిచేస్తున్నప్పుడు రాయుడి గారితో తన అనుభవాలను రచయిత , చారిత్రక పరిశోధకులు నెల్లూరు సర్వోదయ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్. కాళిదాస్ పురుషోత్తం గారు మనతో పంచుకుంటారు.* ఈ ఇంటర్వ్యూ కి తమ సమయాన్ని ఇచ్చిన రాయుడు గారికి, ఎపిసోడ్లో ప్రసంగించిన కాళిదాస్ పురుషోత్తం గారికి , మనసు ఫౌండేషన్ గురించి వివరాలు అందించిన అనిల్ బత్తుల గారికి , ఛాయా మోహన్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు.మనసు ఫౌండేషన్ వెబ్సైటు అడ్రస్ : http://www.manasufoundation.com/works/మనసు ఫౌండేషన్ ఇమెయిల్ - [email protected]ఆఫీసు అడ్రస్: MaNaSu FoundationKaniampadu VillageNear VarikuntapaduSPSR Nellore DistrictAndhra PradeshPIN Code : 524227https://goo.gl/maps/dTiBnbd7g842This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

S1 Ep 178రచయిత దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ! 'నల్లగొండ మల్లి' గారితో కల్సి
తన డెబ్భైయ్యో ఏట రచనలు మొదలుపెట్టి తన జీవితంలోని అనేక ఆసక్తికరమైన అనుభవాలను అత్యంత ప్రతిభావంతంగా తన రచనల్లో చిత్రీకరించిన దేవులపల్లి కృష్ణమూర్తి గారు , ఈ ఇంటర్వ్యూలో తన రచనల గురించి , తనను ఇన్ఫ్లుయెన్స్ చేసిన అనేక విషయాల గురించీ, సాహితీలోకంలో తన పరిచయాల గురించీ వివరించడం జరిగింది.ఈ ఇంటర్వ్యూలో ఇంకో విశేషం యువ కథా రచయిత మల్లికార్జున్ , హర్షణీయం టీం తో బాటూ కృష్ణమూర్తి గారిని ఇంటర్వ్యూ చెయ్యడం. కృష్ణమూర్తి గారికి , మల్లికార్జున్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెల్పుకుంటోంది.ముందుగా ఈ ఇంటర్వ్యూ గురించి మల్లికార్జున్ గారి మాటల్లో -హర్షణీయం పాడ్‌కాస్ట్‌కు స్వాగతం. నా పేరు మల్లికార్జున్. ఇంతకుముందల మీరు ఇదే పాడ్‌కాస్ట్‌ల చానామంది రచయితల మాటలు విని ఉంటరు. ప్రతి రచయితతోటి ముచ్చట మనకు ప్రత్యేకమే. అయితే ఇయ్యాల నేను మీకు పరిచయం చేస్తున్న రచయిత మటుకు ఇంకొంచం ప్రత్యేకం అనొచ్చు. ఎట్ల అంటే - ఈ రచయిత తనకు డెబ్భై ఏండ్లు వచ్చేదాంక ఒక్క కథగూడ రాయలే. అట్లని ఆయనేం సాహిత్యమే తెల్వకుంటగూడ లేడు. చిన్నప్పటిసందే సాహిత్యకారులు, చిత్రకారుల మధ్యన తిరుక్కుంట, సాహిత్యమంటే ప్రాణంగ బతికిన మనిషి. కానీ కథలు రాసుడు మటుకు డెబ్భై ఏండ్లు వచ్చినంకనే మొదలువెట్టిండు. ఇప్పుడు ఆయన వయసు ఎనభై ఒకటి. గత పదేండ్ల కాలంల ఏడు పుస్తకాలు తీసుకొచ్చిండు ఆయన. గుర్తుపెట్టుకోండి ఏడు పుస్తకాలు తీసుకొచ్చిండు. ఆయన పేరు దేవులపల్లి కృష్ణమూర్తి.హర్షణీయం టీమ్ ఆయనతోటి ఇంటర్వ్యూ చేద్దామని నన్నడిగి, ఆయన పుస్తకాలు కొన్ని ఇచ్చిపోయినరు. అయి చదివినప్పుడు నాకు తెలంగాణ జీవితాన్ని చూసినట్టు అనిపిచ్చింది. అంటే ఇప్పటి తెలంగాణేగాదు, సాయుధపోరాటం నుంచి మొన్నటి ప్రత్యేక తెలంగాణ పోరాటం దాంక పోరాటమే ఊపిరిగ బతికిన తెలంగాణ జీవితం ఉన్నది ఈ కథలల్ల.మొన్న ఆదివారం దేవులపల్లి కృష్ణమూర్తి గారితో మాట్లాడినం. డెబ్భై ఏండ్ల వయసులో వచ్చిన రాయాల్నన్న ఆలోచన ఆయన జీవితాన్ని ఎట్ల మార్చిందో అడిగినం. దానికి ఆయన ఒక మాట చెప్పిండు - అది మీరు ఆయన మాటలల్లనే వినాలి. అట్లనే పుట్టిన ఊరిని తల్చుకొని తనకు ఆ ఊరి మీద ఎందుకో ఇప్పుడు ప్రేమ లేదన్నడు ఆయన. అంత మాట ఎందుకు అన్నడు?ప్రస్తుతం నల్లగొండ జిల్లా నకిరేకల్‌ల ఉంటున్న ఆయన, తను చూసిన జీవితం, రాయాలనుకున్న కథలు చానా ఉన్నయని, అయితే అవి రాస్తానికి ఇప్పుడైతే ఆరోగ్యం సహకరిస్తలేదని అంటున్నడు.ఆయన ఆరోగ్యం బాగయ్యి మనకోసం ఇంకెన్నో కథలు రాయాల్నని కోరుకుందాం.దేవులపల్లి కృష్ణమూర్తి గారితో హర్షణీయం ముచ్చట… వినండి! హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp