PLAY PODCASTS
Chaaya Books

Chaaya Books

Talking Books

Mohan

18 episodesEN

Show overview

Chaaya Books launched in 2024 and has put out 18 episodes in the time since. That works out to roughly 7 hours of audio in total. Releases follow a roughly quarterly cadence.

Episodes typically run ten to twenty minutes — most land between 6 min and 36 min — with run-times ranging widely across the catalogue. None of the episodes are flagged explicit by the publisher. It is catalogued as a EN-language Arts show.

There hasn’t been a new episode in the last ninety days; the most recent episode landed 9 months ago. Published by Mohan.

Episodes
18
Running
2024–2025 · 1y
Median length
16 min
Cadence
Quarterly-ish

From the publisher

Chaaya podcast discusses books published by Chaaya Publications in Telugu, covering book releases, Reviews, Interviews with Authors, Translators, and Readers.

Latest Episodes

S1 Ep 6ఐస్ హౌస్‌లో ఏడెన్! ( తెల్ల ఏనుగు నవలనుంచి)

ఐస్ హౌస్ లో ఏడెన్! - తెల్ల ఏనుగు నవలనుంచి

Sep 2, 20253 min

S1 Ep 8జోసెఫ్‌తో ఏడెన్ సంభాషణ! ( తెల్ల ఏనుగు నవల నుంచి )

జోసెఫ్‌తో ఏడెన్ సంభాషణ!

Sep 2, 20255 min

S1 Ep 7కరువు గురించి కార్తవరాయన్! ( తెల్ల ఏనుగు నవల నుంచి )

కార్తవరాయన్ కరువు గురించి! ( తెల్ల ఏనుగు నవల నుంచి )

Sep 2, 20253 min

S1 Ep 5బుక్ బ్రహ్మ ఫెస్టివల్ - 2025 గురించి, తాను రాస్తోన్న పుస్తకాల గురించి పతంజలి శాస్త్రి గారు!

ఈ ఎపిసోడ్లో ప్రసిద్ధ రచయిత, కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత పతంజలిశాస్త్రి గారు , బుక్ బ్రహ్మ - 2025 గురించి , అక్టోబర్లో ఛాయా పబ్లికేషన్స్ బుక్ బ్రహ్మతో కలిసి నిర్వహించబోతున్న తెలుగు బుక్ బ్రహ్మ ఫెస్టివల్ గురించి , తాను రాస్తున్న పుస్తకాల గురించి మాట్లాడారు .

Aug 13, 202554 min

S1 Ep 4'తెల్ల ఏనుగు' నవల మీద లిఖిత్ కుమార్ గోదా స్పందన

తెల్ల ఏనుగు నవల చదివి లిఖిత్ కుమార్ గోదా రాసిన వ్యాసం ఇది . లిఖిత్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు . మంచి చదువరి . సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ 'వెళ్ళై యానై ' తెలుగు అనువాదం తెల్ల ఏనుగు ఛాయా పబ్లిషర్స్ ద్వారా ఈ నెల పదవ తారీఖున బెంగుళూరులో జరిగే బుక్ బ్రహ్మ ఉత్సవంలో విడుదల అవుతుంది . పుస్తకం ప్రీ ఆర్డర్ చేసుకోడానికి కింద ఇచ్చిన లింక్ ను వాడండి . https://chaayabooks.com/product/tella-enugu/

Aug 2, 202510 min

S1 Ep 3ఛాయ - విదేశీ సిరీస్లో మొదటి నవల: 'బాబిగాడి వీరచరితం' మీద సంభాషణ

ఛాయ - విదేశీ సిరీస్లో మొదటి నవల: 'బాబిగాడి వీరచరితం' మీద జరిగిన ఈ సంభాషణలో ఛాయ పబ్లికేషన్స్ సీఈఓ అరుణాంక్ లత, నెమ్మి నీలం అనువాదకులు అవినేని భాస్కర్ , పాఠకురాలు బాల, అనువాదకుడు కుమార్ పాల్గొన్నారు . పుస్తకం ప్రీ ఆర్డర్ ఛాయా వెబ్సైట్ లేదా అమెజాన్ ద్వారా చెయ్యొచ్చు . పుస్తకం ఈ నెల ముప్ఫయివ తేదీన మీ చేతికొస్తుంది .

Apr 2, 202536 min

S1 Ep 2'బాబిగాడి వీరచరితం' - రెండో అధ్యాయం!

ఇన్నాళ్ళూ దేశీ అనువాదాలను తెలుగు పాఠకులకు చేరువ చేసిన @chaayabooks విదేశీ అనువాదాలూ తీసుకువాలని సంకల్పించింది. ఈ రెండేళ్ళలో 15 భాషల నుండి 25 పుస్తకాలు, అవీ సమకాలీన సాహిత్యమై ఉండాలనేది ఛాయ ప్రయత్నం. ఈ నవల ఆ ప్రయత్నంలో మొదటిది.వందకు పైగా పిల్లల నవలలు, టీన్ ఫిక్షన్ నవలలు రాసిన సుప్రసిద్ధ నార్వేజియన్ రచయిత ఆర్నీ స్వింజెన్ రాసిన ‘సాంజెన్ ఒమ్ ఎన్ బృకెట్ నెసె’ అనే ఈ నవల పదిహేను ప్రపంచ భాషల్లోకి అనువాదమయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక అవార్డులను గెల్చుకుంది. ‘ఛాయ విదేశీ’ సిరీస్‌‌లో మొదటి నవలగా ఈ ‘బాబిగాడి వీరచరితం’ను మీ ముందుంచుతున్నాం. కమింగ్ సూన్.

Mar 29, 202522 min

S1 Ep 1'అధోలోకం' అనువాదకులు భాస్కర్ అవినేని, కుమార్ లతో 'ఛాయ బుక్స్' అరుణాంక్ లత

అధోలోకం అనువాదకులు భాస్కర్ అవినేని, కుమార్ లతో ఛాయ సీఈఓ, అరుణాంక్ లత జరిపిన సంభాషణ . కింది లింక్ ను ఉపయోగించి పుస్తకం కొనండి . https://chaayabooks.com/product/adholokam/

Mar 19, 202558 min

బతుకు సేద్యం నవలాపరిచయం

బతుకు సేద్యం -  జహీరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న గ్రామీణ మహిళల   గురించి, ఒక ప్రభుత్వేతర సంస్థ సహాయంతో వారి జీవితాలను వారు  కష్టపడి ఎలా సరిదిద్దుకున్నారో, వివరిస్తూ రాసిన పుస్తకం. యదార్థ సంఘటనలనాధారం చేసుకుని రాసిన కాల్పనిక నవల. ఎపిసోడ్ లో ముందుగా ఛాయా మోహన్ గారు మాట్లాడతారు. తర్వాత రచయిత శాంతి ప్రభోదిని గారు నవల గురించి మరిన్ని వివరాలు అందిస్తారు.

Dec 22, 202417 min

పతంజలి శాస్త్రి గారి - 'యువరానర్'

పతంజలి శాస్త్రి గారు రాసిన 'యువరానర్' అనే ఈ కథ, జనవరిలో ఛాయా పబ్లికేషన్స్ ద్వారా వస్తోన్న '1+2=0 కథాసంపుటం లోనిది.

Dec 22, 202444 min

'ఒక వైపు సముద్రం' - నవలాపరిచయం

కన్నడ రచయిత వివేక్ శానభాగ రాసిన " ఒందు బది కడలు" నవల, తెలుగు అనువాదంలోని కొన్ని భాగాలు మీరిప్పుడు వింటారు . ఈ నవలను 'ఒక వైపు సముద్రం' పేరుతో తెలుగులోకి రంగనాథ రామచంద్ర రావు గారు అనువదించారు. ఈ పుస్తకం అమెజాన్ లో ఛాయా రిసోర్సెస్ సెంటర్ ద్వారా లభ్యమౌతోంది.(https://bit.ly/okaviaipusamudram). నవల కొన్న మొదటి యాభై మంది పాఠకులకు, 'సంచారి బుర్రకథ ఈరమ్మ' పుస్తకం ఉచితంగా లభిస్తుంది. ఉత్తర కన్నడ జిల్లా తీర ప్రాంతంలో చాలా నదులొచ్చి సముద్రంలో కలుస్తాయి. ఎంతో అందం గా వుండే ఈ ప్రదేశంలో నివసించే మనుషుల జీవితాలూ, వస్తున్న మార్పులూ, మార్పుల వల్ల వచ్చే సంఘర్షణ, వీటిని అద్భుతంగా ఒడిసిపట్టుకున్న, నవల 'ఒక వైపు సముద్రం'

Dec 22, 20247 min

'అమ్మవారి పాదం ' - జయమోహన్ కథ ( 'నెమ్మి నీలం' నించి )

అమ్మవారి పాదం' కథ నెమ్మినీలం పుస్తకం లోనించి . సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ అరం కథల సంపుటం లోనిది ,.తెలుగు లోకి అవినేని భాస్కర్ ఈ కథలను 'నెమ్మి నీలం' పేరిట అనువదించారు . 'నెమ్మి నీలం ' కొనడానికి - https://chaayabooks.com/product/nemmi-neelam/

Dec 22, 202431 min

'ఏర్పాట్లు ' - ఇందిరా పార్థసారథి

తమిళ రచయిత ఇందిరా పార్థసారధి రాసిన ‘ఏర్పాట్లు’ అనే ఈ కథ ను తెలుగులోకి అనువదించింది జిల్లెళ్ళ బాలాజీ గారు. ఛాయా పబ్లికేషన్స్ ప్రచురించిన ‘నీళ్ళ కోడి’ కథాసంకలనం లోనిది. ఇందిరా పార్థసారధి సుప్రసిద్ధ తమిళ రచయిత. తన రచనలకు, సరస్వతీ సమ్మాన్, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, పద్మశ్రీ లాంటి ఎన్నో పురస్కారాలను పొందారు.‘నీళ్ళ కోడి’ కొనడానికి -https://amzn.to/44Jov9x

Dec 22, 202413 min

రామేశ్వరం కాకులు: కథ - ప్రతిస్పందన.

ఈ కథ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘ రామేశ్వరం కాకులు’ పుస్తకం లోనిది.పుస్తకం కొనాలంటే – https://amzn.to/3rDN1YM

Dec 22, 202437 min

'సత్యలింగం' - పతంజలి శాస్త్రి గారి రచన (గుప్తా'91 సంపుటం నించి)

సత్యలింగం’ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘గుప్తా’91’ సంపుటం లోనిది. పుస్తకం కొనడానికి కింద ఇచ్చిన లింక్ వాడొచ్చు. గత సంవత్సరం చదివిన నేను చదివిన కథల్లో నిస్సందేహంగా  సత్యలింగం అత్యుత్తమైన కథ.    కథలోకెడితే 'టీటీ' అని పిలవబడే రైల్వే టికెట్ కలెక్టర్ కాంతారావు స్నేహితుడు స్వామి. తన ఇంట్లో అద్దెకుండే  కూర్మయ్య నాయుడి గురించి స్వామికి చెప్పుకుంటూ ఉంటాడు కాంతారావు. నాయుడు విపరీతమైన కోపిష్టి. ఒళ్ళూపైతెలీని కోపంతో ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. తన జీవితంలో ప్రశాంతత నెలకొనేటందుకు, కాంతారావును సలహా అడుగుతాడు నాయుడు. రైల్లో ఎక్కడో చూచాయగా విన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని, నాయుడి  మనసులో సత్యలింగాన్ని ప్రతిష్టిస్తాడు కాంతారావు.  సత్యలింగం వల్ల కూర్మయ్య నాయుడు జీవితంలో ఏవి జరిగింది, అనేదే కథ. కూర్మయ్య నాయుడు ఎంత ఆసక్తికరమైన పాత్రో అంతకంటే కాంతారావు అంతర్మధనం , కూర్మయ్య నాయుడి పై అతనికి తెలీకుండా ఏర్పడే సానుభూతి, కాంతారావుని పాఠకుడి మనసుకి చాలా దగ్గరగా చేరుస్తాయి. కథ చివరికి వచ్చేటప్పటికి నమ్మకం, విశ్వాసం, ఆధ్యాత్మికత మనిషి కి ఇచ్చే ఆసరా,  వీటన్నిటీ గురించి పాఠకుణ్ణి లోతుగా ఆలోచింపచేస్తుంది ‘సత్యలింగం’.  గుప్తా'91 పుస్తకం కొనడానికి - http://bit.ly/3lGsrqd

Dec 22, 202434 min

విఫల - నేపాలీ మాతృక లేఖ్ నాథ్ ఛెత్రి

విఫల - నేపాలీ మాతృక లేఖ్ నాథ్ ఛెత్రి తెలుగు అనువాదం -హర్షపుస్తకం కొనడానికి - https://chaayabooks.com/product/viphala/ఒక మరణంబాస్నేత్నీ-ఆమై మంచం అంచున కూర్చుని తన భర్త చెంపని నిమిరింది. మూడు రోజులుగా అతనలా అచేతనంగా పడున్నాడు. ఎండిపోయి బీటలు వారిన ఎడారిలా ఉన్న అతని బట్ట తలపై నుంచి టోపీని తీసేసింది. కనుబొమ్మల మీది చెమట చుక్కలు ఆమె తలపై కప్పుకున్న మజెత్రో కొనతో తుడుస్తూ గట్టిగా మూసివున్న అతని కళ్ళని చూసింది. చూస్తూ సన్నని గొంతుతో, 'ఓ బావ్, ఏదోకటి చెప్పు' అన్నది.ఆ ముసలాయన నోరు తెరిచి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. శ్వాస వదులుతూ దగ్గటం మొదలుపెట్టాడు. ఒక బండకి ఆకారం ఇవ్వటానికి చెక్కుతుండగా దాని విరిగిన ముక్క ఒకటి అతని ఊపిరితిత్తుల్లో ఇరుక్కునివుంటే దాన్ని కక్కేయటానికేమో అన్నంత గట్టిగా దగ్గుతున్నాడు.ఆ దగ్గు కొంచం తగ్గాక ఆమై తన చెవి భర్త పెదవుల దగ్గర పెట్టింది. చివరి మాటలు మాత్రం మిగిలున్నాయి. అమోనియా లాంటి ఒక ఘాటైన వాసన అతని నోటినుంచి వస్తుంది. 'ఈ వాసన చావుది,' ఆమె అనుకుంది.ఆరిపోతున్న వత్తిలా నెమ్మదిగా కొట్టుకుంటున్న ముసలాయన కళ్ళ వెంబడి కన్నీటి చుక్కలు రాలాయి. రాలి ఎండిపోయాయి. ఏ ఉలుకూ పలుకూ లేదు. ముసలాయన చెప్పాలనుకున్నదంతా కన్నీళ్ళతో చెప్పాడు, అది బాస్నేత్నీ-ఆమైకి అర్థమై ఉండొచ్చు.అర్థమైన వెంటనే ఆమె ఏడ్చింది. అలా ఏడ్చి ఆమెతో పాటు కూర్చున్న వాళ్ళందరినీ ఏడిపించింది.*'విఫల' నవలలోని కొన్ని వాక్యాలు. గూర్ఖలాండ్ ఉద్యమం మీద ఆ ప్రాంతం నుండి వచ్చిన తొలి నవల.

Dec 21, 20242 min

'సనాతనం ' - మరాఠీ మాతృక శరత్ కుమార్ లింబాలే (ఛాయా ప్రచురణలు)

'సనాతనం ' : మరాఠీ మాతృక శరత్ కుమార్ లింబాలే (ఛాయా ప్రచురణలు)తెలుగు అనువాదం : రంగనాథ రామచంద్రరావుపుస్తకం కొనడానికి - https://chaayabooks.com/product/sanatanam/

Dec 21, 20242 min

'గుడి గంట' ఇతర తమిళ కథలు - తమిళ మాతృక టి. జానకి రామన్

'గుడి గంట' ఇతర తమిళ కథలు - తమిళ మాతృక టి. జానకి రామన్ తెలుగు అనువాదం - నల్ల తంబి పుస్తకం కొనడానికి - https://chaayabooks.com/product/gudiganta/

Dec 21, 20246 min
Copyright 2025 Mohan