PLAY PODCASTS
విఫల - నేపాలీ మాతృక లేఖ్ నాథ్ ఛెత్రి

విఫల - నేపాలీ మాతృక లేఖ్ నాథ్ ఛెత్రి

Chaaya Books · Mohan

December 21, 20242m 9s

Audio is streamed directly from the publisher (podcasts.captivate.fm) as published in their RSS feed. Play Podcasts does not host this file. Rights-holders can request removal through the copyright & takedown page.

Show Notes

విఫల - నేపాలీ మాతృక లేఖ్ నాథ్ ఛెత్రి

తెలుగు అనువాదం -హర్ష

పుస్తకం కొనడానికి - https://chaayabooks.com/product/viphala/

ఒక మరణం

బాస్నేత్నీ-ఆమై మంచం అంచున కూర్చుని తన భర్త చెంపని నిమిరింది. మూడు రోజులుగా అతనలా అచేతనంగా పడున్నాడు. ఎండిపోయి బీటలు వారిన ఎడారిలా ఉన్న అతని బట్ట తలపై నుంచి టోపీని తీసేసింది. కనుబొమ్మల మీది చెమట చుక్కలు ఆమె తలపై కప్పుకున్న మజెత్రో కొనతో తుడుస్తూ గట్టిగా మూసివున్న అతని కళ్ళని చూసింది. చూస్తూ సన్నని గొంతుతో, 'ఓ బావ్, ఏదోకటి చెప్పు' అన్నది.


ఆ ముసలాయన నోరు తెరిచి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. శ్వాస వదులుతూ దగ్గటం మొదలుపెట్టాడు. ఒక బండకి ఆకారం ఇవ్వటానికి చెక్కుతుండగా దాని విరిగిన ముక్క ఒకటి అతని ఊపిరితిత్తుల్లో ఇరుక్కునివుంటే దాన్ని కక్కేయటానికేమో అన్నంత గట్టిగా దగ్గుతున్నాడు.


ఆ దగ్గు కొంచం తగ్గాక ఆమై తన చెవి భర్త పెదవుల దగ్గర పెట్టింది. చివరి మాటలు మాత్రం మిగిలున్నాయి. అమోనియా లాంటి ఒక ఘాటైన వాసన అతని నోటినుంచి వస్తుంది. 'ఈ వాసన చావుది,' ఆమె అనుకుంది.


ఆరిపోతున్న వత్తిలా నెమ్మదిగా కొట్టుకుంటున్న ముసలాయన కళ్ళ వెంబడి కన్నీటి చుక్కలు రాలాయి. రాలి ఎండిపోయాయి. ఏ ఉలుకూ పలుకూ లేదు. ముసలాయన చెప్పాలనుకున్నదంతా కన్నీళ్ళతో చెప్పాడు, అది బాస్నేత్నీ-ఆమైకి అర్థమై ఉండొచ్చు.


అర్థమైన వెంటనే ఆమె ఏడ్చింది. అలా ఏడ్చి ఆమెతో పాటు కూర్చున్న వాళ్ళందరినీ ఏడిపించింది.


*

'విఫల' నవలలోని కొన్ని వాక్యాలు.

గూర్ఖలాండ్ ఉద్యమం మీద ఆ ప్రాంతం నుండి వచ్చిన తొలి నవల.